సాక్షి, తాడేపల్లి: 'ఆంధ్రజ్యోతి'కి ఉత్తమ జర్నలిస్ట్ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన కూడా ప్రసారం చెయ్యాలని చెప్పా.. నువ్వు అసలు చిత్తశుద్ధి కలిగిన వృత్తిపరమైన పాత్రికేయుడివేనా? అంటూ ఎక్స్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణను వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘‘నన్ను 2012లో సీబిఐ అరెస్ట్ చేసినప్పుడు మా ఇల్లు, ఆఫీస్ రైడ్ చేసి ఫైల్స్, అన్నిపత్రాలు స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపారు. 12 నెలలు, కాంగ్రెస్-టీడీపీ కుట్రలో భాగంగా, జైల్లో గడిపాను. "ఆదాయానికి మించి ఆస్తులు" అభియోగాలు లేవు. నా పైన పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరేపణ, ఖాతా లెక్కల ఫడ్జింగ్ మాత్రమే. నీలాగ మోసగాడినో, దోపిడీదారునో, బ్లాక్ మైలర్ నో, వీలర్ డీలర్ నో కాదు. గుర్తుంచుకో!’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
..నీలాగా మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర, ఖనిజాల సిండికేట్ బ్రోకర్ల దగ్గర ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వారికీ ఇవ్వాలని నెల నెలా కోట్లకు కోట్లు నేను తీసుకోలేదు. ఇప్పుడు 2024లో విజయసాయి రెడ్డి అనే నేను నువ్వు చెప్పే భూదందాలు, భూముల ఆక్రమణలు పై సిబిఐ, ఈడీ విచారణకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా వేమూరి రాధాకృష్ణా? ఇద్దరం కలసి జాయింట్‌గా కేంద్రవిచారణా సంస్థలకు విచారణకు పిటిషన్ పెట్టుకుందాం! సిద్ధమా!. సాధారణ విలేకరిగా ఇంత సంపద పోగేసుకున్నావ్, సీఏ చదివిన ఆడిటర్‌గా ప్రాక్టీసుతో ఈ స్థాయికి నేను వచ్చాను. ఎవరెలా సంపాదించారో తెలుగు ప్రాంతాల బయట నాతో చర్చకు సిద్ధమా? రాధాకృష్ణా’’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.
1/2 ఈరోజు ఆంధ్రజ్యోతి బ్రేక్ ఫాస్ట్ న్యూస్ లో వేమూరి రాధాకృష్ణ ఉవాచ:
"గుడిని మింగేది సుబ్బారెడ్డి, లింగాన్ని మింగేది సాయిరెడ్డి. భూమిని మింగిన రాక్షసులు"
పలుసార్లు మీ 'ఆంధ్రజ్యోతి' కి ఉత్తమ జర్నలిస్ట్ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన/జవాబు కూడా ప్రసారం చెయ్యాలని చెప్పాను.…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2024
‘‘22 ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికను సాధారణ విలేకరివి అయినా రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతి స్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎల్ ఎన్ ప్రసాద్ వారసుల నుంచి సొంతం చేసుకుని 2002 అక్టోబర్‌లో మొదలెట్టి కొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 20 ఎడిషన్లు పెట్టేస్థాయికి ఎదిగింది. నూజివీడు సీడ్స్ యజమాని మండవ ప్రభాకర రావు, విజై ఎలెక్ట్రికల్స్ నాటి యజమాని దాసరి జై రమేష్ వంటి పారిశ్రామికవేత్తలకు వాటాలు ఉన్నట్టు చెప్పి మరెందరో రహస్య పెట్టుబడిదారులను మోసం చేసి నువ్వు ఈ పత్రికను వేలాది కోట్ల రూపాయల సంపదగా దాన్ని మార్చుకున్న తీరు తెలుగునేలనే అపూర్వం. అనితర సాధ్యం’’ అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.
ఇదీ చదవండి: కూటమికి కళ్లు నెత్తికెక్కాయి.. ఏపీ బీజేపీలో తిరుగుబాటు స్వరం
Comments
Please login to add a commentAdd a comment