సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలపై బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్‌గా తనను ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నా కులం మీకు తెలీదా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ నియామకం నా బాధ్యత కాదు.. కూటమికి కళ్లు నెత్తికెక్కి నా పేరు నమోదు చేశారంటూ మండిపడ్డారు.
కూటమికి సంబంధించిన నాయకులతో నామినేషన్ పోస్టుల భర్తీ తీరుపై సాక్షాత్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గోపీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గోపీ శ్రీనివాస్‌ను ఒక కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించి అవమానించడమే కాకుండా అందులో కూడా తన కులానికి సంబంధం లేని తూర్పు కాపు కార్పొరేషన్‌లో నియమించడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవానికి గోపీ శ్రీనివాస్ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటువంటి వ్యక్తిని తూర్పుకాపు కార్పొరేషన్‌లో నియమించేశారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న నా కులం మీకు తెలీదా?? @ncbn @PurandeswariBJP @PawanKalyan @MadhukarN09 @drlaxmanbjp pic.twitter.com/XTpZkpbaJj
— Gopisrinivas Rongala (@Gopisriniv1979) November 14, 2024
Comments
Please login to add a commentAdd a comment