gopi
-
కూటమికి కళ్లు నెత్తికెక్కాయి.. ఏపీ బీజేపీలో తిరుగుబాటు స్వరం
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలపై బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్‌గా తనను ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నా కులం మీకు తెలీదా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ నియామకం నా బాధ్యత కాదు.. కూటమికి కళ్లు నెత్తికెక్కి నా పేరు నమోదు చేశారంటూ మండిపడ్డారు.కూటమికి సంబంధించిన నాయకులతో నామినేషన్ పోస్టుల భర్తీ తీరుపై సాక్షాత్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గోపీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గోపీ శ్రీనివాస్‌ను ఒక కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించి అవమానించడమే కాకుండా అందులో కూడా తన కులానికి సంబంధం లేని తూర్పు కాపు కార్పొరేషన్లో నియమించడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవానికి గోపీ శ్రీనివాస్ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటువంటి వ్యక్తిని తూర్పుకాపు కార్పొరేషన్లో నియమించేశారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు.ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న నా కులం మీకు తెలీదా?? @ncbn @PurandeswariBJP @PawanKalyan @MadhukarN09 @drlaxmanbjp pic.twitter.com/XTpZkpbaJj— Gopisrinivas Rongala (@Gopisriniv1979) November 14, 2024 -
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప. అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్‌బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.⇒ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్‌లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది. ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే. -
Artist Gopi: గూడు వీడిన గిజిగాడు
మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ ఉండేవారు. ఒక మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్ళాను. ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయిం టింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ఫ్రేము లుగా రామాయణం బొమ్మల సిరీస్‌లు. అన్నీ అద్భు తాలే. నేను దొంగ కంట మరో బొమ్మ చూస్తున్నా, టీవీ వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ ఒకటి. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. గోపీ అనే పేరంత సింపుల్ లైన్ బొమ్మలు. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు. సురేష్ గారి వేలాది బొమ్మలని వదిలి ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డువచ్చింది. అడిగినా కావలిస్తే నా బొమ్మలు అన్నీ పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి’ అనేవారు సురేష్ గారు. గోపీ చిత్రకారులకే చిత్రకారుడు. ఆయన గురించి మహాను‘బాపు’ తమదైన పొదుపైన మాట లతో ఇలా అన్నారు. ‘నాకున్న ఇంకో గురువు గారు గోపి–ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిస లాడుతూ వుంటాయి’. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్‌గా ఉంటుంది–గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతావాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పకడ్బందీగా–కొమ్మకు వేలాడుతూ–అంతస్తులు–కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే, గోపి దానికి ముఖ చిత్రంగా గిజిగాడు బొమ్మవేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టి ఇంజనీర్లు ప్రతిసృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమాజినేషన్ అంటే, అదీ గోపీ అంటే! అనగనగా రోజుల్లో సాహిత్యం–చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగా రించుకునేది. ఒక కన్ను చేతనున్న కుంచె వైపు, మరో కన్ను కెమెరా వంక ఆయన చూస్తున్న కాలంలో ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు ‘మీరు కాక పోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి’ అంటే బాపు పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే! గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపుబొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండిపోయిన పత్రికల రోజులని గోపి అనే కొత్త సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త వరుసలు చూపించింది. రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగి మలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్ని టిని ఆయన డైనమిక్ టచ్‌తో మార్చేశారు. మెల కువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్‌బుక్ ఉండేది. కనపడిన ప్రతీది బొమ్మగా మలి చేవారు. చూసిన సినిమాల్లో సన్నివేశాలు గుర్తు పెట్టు కుని వచ్చి ఆ యుద్ధ పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డ్యాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ఫ్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెర పటం, మళ్ళీ గీయటం... బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు–బొమ్మలని జీవనోపాధిగా చేసు కోడం వేరు. గోపిగారే కాదు, చాలామంది చిత్ర కారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు. ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చిపెట్టిన డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. యవ్వనం–ఆరోగ్యం సహక రించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నా అని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదం తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి. ఆయన బొమ్మల జ్ఞాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు గానీ, ఆయన భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర ‘మళ్ళీ జన్మంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?’ అని అడిగితే ప్రాణం లేని ఆ తల ‘ఊహు’ అని అడ్డంగా ఊపడానికైనా కాస్త ప్రాణం కచ్చితంగా తెచ్చుకునేదే. – అన్వర్ -
సీనియర్ జర్నలిస్ట్, గరం గరం ఆర్టిస్ట్ గోపి హఠాన్మరణం
-
సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం
సాక్షి, చిత్తూరు: సీనియర్ జర్నలిస్టు, ‘గరం గరం వార్తలు’ ఫేమ్ గోపి కన్నుమూశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం తెల్లవారుజామున గోపి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. గత వారం రోజులుగా గోపి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గోపి కుటుంబానికి సాక్షి మీడియా ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ప్రముఖుల సంతాపం: ► సీనియర్ జర్నలిస్టు, ‘గరం గరం వార్తలు’ ఫేమ్ గోపి అకాల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారం వ్యక్తం చేశారు. గోపి కుటుంబ సభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. ► సీనియర్ జర్నలిస్ట్ గోపి హఠాన్మరణం పట్ల ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. గోపి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
నేను పక్కా పల్లెటూరి వాడిని: ఐఏఎస్
జవహర్‌నగర్/మేడ్చల్: నేను పక్కా పల్లెటూరి వాడిని.. పల్లె జనాల్లో గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారే.. యువత కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమపడాలి. అప్పుడే విజయం పరుగెత్తుతూ వస్తుంది. ఉన్నత ఉద్యోగాలు సంపాదించేందుకు కోచింగ్‌లు అక్కర్లేదు. పట్టుదల ఉంటే చాలు. అయితే కొన్నిసార్లు విజయం అందకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిరాశలోంచి కసి పుట్టాలి. అప్పుడే విజయం చేతికి చిక్కుతుందటారు జవహర్‌నగర్ కమిషనర్ (ఐఏఎస్) డాక్టర్ బి.గోపి. వెటర్నరీ డాక్టర్‌గా ప్రస్థానం నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని తిరువాలూర్ జిల్లా పొద్దాటూర్ పేటాయి గ్రామం. మాది ఓ చిన్న పల్లెటూరు. మా ఊర్లో పెద్దగా చదువుకున్న వారు ఎవరూలేరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. పశువులు, పాలతో వచ్చిన ఆదాయంతోనే కుటుంబం గడిచింది. అమ్మానాన్నలకు చదువు రాదు. మేము ఐదుగురము. ఒక అన్న, ముగ్గురు అక్కలు. 12వ తరగతి వరకు మా ఊర్లోని పంచాయతీ యూనియన్ పాఠశాలలో చదివా. తర్వాత ఉన్నత చదువుల కోసం మద్రాస్‌కు వెళ్లి పీజీ పూర్తి చేశాను. తమిళనాడులో 6 సంవత్సరాల పాటు వెటర్నరీ సర్జన్‌గా పనిచేశా. ఆ సమయంలోనే పెళ్లయ్యింది. మా శ్రీమతి డాక్టర్. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆదిలాబాద్‌లో తొలిపాఠాలు.. ఆదిలాబాద్‌లో జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ జరిగింది. అక్కడే తొలిపాఠాలు నేర్చుకున్నాను. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు నిర్వర్తించే విధులపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత సబ్‌కలెక్టర్‌గా ఏడాది పాటు పనిచేశాను. 2020లో నిజాంపేట్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. తాజాగా జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు సైతం అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. గ్రామీణుల్లో క్రియేటివిటీ ఎక్కువ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రియేటివిటీ ఎక్కువ. పట్టణవాసులతో పోలిస్తే గెలవాలన్న తపన పల్లె జనాల్లోనే అధికం. ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని పరిశీలిస్తే సగానికిపైగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారే.. మొదట పల్లెటూరి వాళ్లమనే భావన దూరం చేసుకుంటే గమ్యం చేరుకోవడం సులభం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళిక ఈ మూడే విజయానికి సోపానాలు. జవహర్‌నగర్ సమస్య ప్రత్యేకం. నిజాంపేట్‌కు, జవహర్‌నగర్‌కు చాలా తేడా ఉంది. ఇక్కడ చాలా మంది నిరుపేదలున్నారు. వారందరికీ ప్రభుత్వం తరఫున సహకారం అందించాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్‌కు తగ్గట్టుగా ఇక్కడ పరిస్థితులు లేవు. జీవో 58, 59 అమలు పరిచి ఇక్కడి పరిస్థితులను మార్చాల్సి ఉంది. చాలామంది అయాయక ప్రజలను మోసం చేసి ప్రభుత్వ స్థలాలను విక్రయిస్తున్నారు. ఇకపై అలా జరగకుండా చూడాల్సి ఉంది. ఇప్పుడే ఇక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకుంటున్నాను. అసిస్మెంట్ ద్వారా క్రెడిట్ రేట్‌ను పెంచి జవహర్‌నగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి. దీనికి ప్రజలు, పాలకమండలి సహకరించాలి. స్నేహితులే స్ఫూర్తి.. వెటర్నరీ సర్జన్‌గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న తీరు చూసిన స్నేహితులు ఐఏఎస్ అయితే మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని స్నేహితులు ప్రోత్సహించారు. వారు యూపీఎస్సీ రాసి విజయం సాధించడంతో నన్ను తరచూ గైడ్ చేస్తుండేవారు. ఏనాడూ కోచింగ్ సెంటర్‌కు వెళ్లలేదు. అవసరమైన మెటీరియల్‌ను సేకరించి చదువుకునేవాడిని. రెండుసార్లు సివిల్స్ రాశా. ఇంటర్వూ్య వరకు వెళ్లినా ఉద్యోగం రాలేదు. 2016లో మూడోసారి ర్యాంకు ఆధారంగా అవకాశం వచ్చింది. చదవండి: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ‘మిలాప్’ -
గుండెపోటుతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి
కర్లపాలెం (బాపట్ల): జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన రాయపూడి గోపి (27) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు రాంచీ నుంచి ఉన్నతాధికారులు తెలపడంతో మృతుడి కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. చింతాయపాలెం గ్రామానికి చెందిన రాయపూడి వెంకటరావు, రమాదేవి దంపతుల పెద్ద కుమారుడు రాయపూడి గోపీ 2017 మార్చి నెలలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై రాజస్థాన్‌లో శిక్షణ పూర్తి చేసుకుని, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఎన్టీపీసీ సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. గోపీ బుధవారం రాత్రి 10 గంటలకు తమకు ఫోన్ చేసి మామూలుగానే మాట్లాడాడని, 9 గంటలకు డ్యూటీకి వచ్చినట్లు చెప్పాడని తల్లిదండ్రులు తెలిపారు. 10.45 గంటలకు రాంచీ నుంచి అధికారులు ఫోన్‌చేసి గోపీకి సుస్తీ చేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని, ఫోన్ చేశారని, 11.45 గంటలకు మళ్లీ ఫోన్‌చేసి గోపి గుండెపోటుతో చనిపోయాడని చెప్పారని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. తమ బిడ్డ ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదని, ఏం జరిగి ఉంటుందో తమకు తెలియడం లేదని తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. గోపికి 2019 మే నెలలో ప్రకాశం జిల్లా పేరాల గ్రామానికి చెందిన లక్ష్మీశ్రావణితో వివాహమైంది. గోపీ జనవరి నెలలో సంక్రాంతి పండుగకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి జనవరి 27వ తేదీన భార్యతో సహా రాంచీకి వెళ్లాడు. గోపీ భార్య లక్ష్మీశ్రావణి ప్రస్తుతం రాంచీలోనే ఉంది. గోపీ మృతదేహాన్ని అధికారులు శుక్రవారం రాత్రికి చింతాయపాలెం తీసుకొస్తారని బంధువులు తెలిపారు. -
వీరాటం.. బతుకు పోరాటం
వయసు 13 ఏళ్లు...మనిషి 3 అడుగులు....ఆకలి అయితే తినాలనే ఆలోచన రాదు...మాట్లాడటానికి మాటలు రావు...తన మనస్సులోని భావాలను వ్యక్తపరచలేడు. తన అవసరాలను ఎదుటివారికి చెప్పేందుకు నోరు రాదు. ఆలోచించేందుకు మెదడు పరిణితిలేదు. ఏది కావాలన్నా కుటుంబ సభ్యులు తీర్చాల్సిందే. ఇటువంటి పరిస్థితిల్లో కుటుంబం అతనికి అండగా నిలబడింది. తల్లి, తండ్రి, అక్క వ్యవసాయ పనులు చేస్తూ, తమ కుటుంబాన్ని గడుపుతూ, ఆస్పత్రుల చుట్టూ తిరిగారు.. సమయం, డబ్బు వృథా అని వైద్యులు చెబుతున్నా.. ఏదో చిన్న ఆశ .. తమ బిడ్డ మామూలు మనిషి అవుతాడని ఆ తల్లిదండ్రులు ఎదురు చూసేలా చేస్తోంది. పిడుగురాళ్ల రూరల్: మల్లేశ్వరి, లక్ష్మయ్యలకు మూడవ సంతానంగా వీరాటం గోపి జన్మించాడు. వారిది వ్యవసాయ కూలి కుటుంబం. నిరంతరం పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. కరవు ప్రాంతమైన బొల్లాపల్లి మండలం గుంమ్మనంపాడులో ఉండలేక అత్తగారి ఊరైన పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం గ్రామానికి వచ్చి 10 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నా తల్లి కాని, తండ్రి కాని గోపి దగ్గర ఉండి నిత్యావసరాలు తీర్చాల్సిందే. అక్క అనిత చిన్నతనం నుంచి పొలంపనులకు వెళ్తూ ఇంటి పోషణలో భాగస్వామ్యమవుతుంది. ఇంట్లో ముగ్గురు కూలి పని చేస్తూ, గోపి మందుల ఖర్చులు చూస్తూ, గోపి చిన్న అక్క రమ్యను చదివిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండలేక, గోపికి, ఇంటి పోషణకు వచ్చే డబ్బులు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. పందిటివారిపాలెం గ్రామంలో గోపిని చూసిన ప్రతి ఒక్కరు ఆ కుటుంబంపై జాలిచూపించాల్సిందే. వైద్య సేవలకు వేలల్లో ఖర్చు... మగ పిల్లాడు పుట్టాడని ఆనందించే లోపు ఎదుగుదల లేదని తెలిసి బాధపడిన తల్లిదండ్రులు వైద్యం చేయించేందుకు13 ఏళ్లుగా తిరగని ప్రదేశం అంటూ లేదు. గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖ హాస్పటల్స్‌లో మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ డాక్టర్లు మాత్రం గోపికిఅవయవాల ఎదుగుదల లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఏదో రకంగా గోపి మామూలు మనిషి అవుతాడని, ఏడాక్టర్ చేతిలో ఏముంటుందోనని ప్రతిడాక్టర్ సలహాలు, సూచనలు, మదులు వాడుతూనే వేల రూపాయలుఖర్చు చేస్తున్నారు. కానీ గోపిలో ఏలాంటి మార్పు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంఆదుకోవాలని వినతి ప్రభుత్వ పింఛన్ పొందేందుకు ఆధార్ తప్పనిసరి కానీ, గోపికి ఆధార్ తీసేందుకు వేలిముద్రలు కానీ, ఐరీష్ తీసేందుకు సహకరించటం లేదు. ఎన్నోసార్లు మీసేవాలో ఆధార్ నమోదు కోసం వెళ్లినా ఫలితంలేదు. దీంతో గోపి 10 ఏళ్లకు పైగా పింఛన్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈవిషయమై కుటుంబ సభ్యులు కలవని అధికారులు లేరు. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. పింఛన్ అయినా వస్తే కొంత ఉపశమనం కలుగుతుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
ప్రేమ..వినోదం...
‘ఇది నా లవ్ స్టోరీ’ ఫేమ్ రమేష్– గోపి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. రమణ్ హీరోగా వర్షా విశ్వనాథ్, పావని, దీపికా హీరోయిన్లుగా నటించనున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పణలో సిరి మూవీస్ పతాకంపై కె.శిరీషా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకులు రమేష్– గోపి మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మంచి సందేశాత్మకంగా రూపొందనున్న చిత్రమిది. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండి ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. నవంబర్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కెమెరా: క్రిస్టోఫర్ జోసెఫ్. -
ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న అరెస్ట్
సాక్షి, ఖమ్మం (కొత్తగూడెం) : వ్యాపారులు, స్థానికంగా పని చేస్తున్న కాంట్రాక్టర్లను చందాల నిమిత్తం తుపాకులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపి పారి పోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా కొత్తగూడ మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన గోపన్న గుండాలలోని రాయగూడెం అటవీ ప్రాంతంలో, కేసు పరిశోధన అధికారి, మహబూబాబాద్ డీఎస్పీ, గుండాల సీఐ సిబ్బందితో కలిసి గోపన్నను అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 303 బోల్ట్ యాక్షన్ తుపాకీ, తూటాలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గోపన్నపై మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. గోపి అమాయక గిరిజనులను, ప్రజలను రెచ్చగొడుతూ పోడుభూముల పేరుతో అడవులను నరికిస్తున్నాడు. న్యూడెమోక్రసీ పార్టీకి ఓపెన్ క్యాడర్ ఉన్నప్పటికీ వారి మాట వినని ప్రజలను, నాయకులను, ప్రభుత్వ అధికారులను అజ్ఞాత సాయుధ దళాలచే బెదిరిస్తూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని వివరించారు. అజ్ఞాత సాయుధ దళాల కార్యకలపాలు పెచ్చుమీరిపోయి సాధారణ ప్రజానీకానికి అభివృద్ధి కార్యకలాపాలకు అడ్డంకిగా మారారు. వీరిని అదుపు చేసే క్రమంలో గతంలో చాలాసార్లు అజ్ఞాత సాయుధ దళాలు పోలీసుల మీద కాల్పులకు దిగగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ వారి పద్ధతి మార్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళాల నాయకుడు లింగన్న ఆధ్వర్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. చందాల కోసం ఇటీవల తునికాకు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడిన న్యూడెమోక్రసీ పార్టీ ఇల్లెందు టౌన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావును పట్టుకొని ఇల్లెందు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి రూ.6 లక్షలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గతంలో వారిపై అనేక కేసు లు నమోదు అయినప్పటికీ వారి పద్ధతి మా ర్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళం కొద్ది రోజుల క్రితం గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాం తంలో మకాం వేసి చందాల కొరకు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను, పోడు భూముల పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు జూలై 31న గాలింపు చర్యలు చేపట్టి అజ్ఞాత సాయుధ దళాన్ని అదుపులోకి తీసుకొనే క్రమంలో లింగన్న సాయుధ దళం పోలీసులపై కాల్పులు జరుపగా, ఇరువైపులా జరిగిన కాల్పుల్లో దళ నాయకుడైన లింగన్న మరణించాడని, ఇతర దళ సభ్యులు తుపాకులతో తప్పించుకున్నారని వివరించారు. పారిపోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా గోపన్న దొరకడంతో అరెస్టు చేశామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సురేష్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు గోపి..?
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : న్యూడెమోక్రసీ వరంగల్ జిల్లా నాయకుడు ధనసరి సమ్మయ్య అలియాస్ గోపిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 31న గుండాల మండలం రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్ట మీద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందగా గోపి తప్పించుకున్నాడు. ఐదు రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్న గోపిని వరంగల్ సమీపంలోని ఆరెపల్లి వద్ద ఆదివారం అరెస్ట్ చేసినట్లు న్యూడెమోక్రసీ వర్గాలు తెలిపాయి. గోపి పోలీసులకు చిక్కడం ఇదో రెండోసారి. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న ధనసరి సమ్మయ్య(గోపి) 2018 నవంబర్ 30న మహబూబాబాద్‌లో ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వలపన్నారు. తప్పించుకుని ఆటోలో వెళ్తుండగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. విడుదలయ్యాక కొంతకాలం సాధారణ జీవితం గడిపి నాలుగు నెలల క్రితమే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. గోపిని వెంటనే మీడియా ముందు హాజరుపర్చాలని ఎన్డీ జిల్లా నాయకులు చండ్ర అరుణ, జడ సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు తదితరులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్.నారాయణరావు విడుదల చేసిన ప్రకటనలో గోపిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని కోరారు. -
ఏసీబీ వలలో బొల్లారం ఎస్ఐ, కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్ : ఓ కేసు విషయమై రూ.20 వేల లంచాన్ని ఫోన్ పే ద్వారా తీసుకున్న బొల్లారం ఎస్ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్‌లను సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్2 డీఎస్పీ ఎస్.అచ్చేశ్వర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం ఆదర్శనగర్‌కు చెందిన జనగాం నర్సింగ్‌రావు బ్యాండ్‌మేళా నిర్వహిస్తుంటాడు. నర్సింగ్‌రావు వద్ద పనిచేసే వర్గల్‌కు చెందిన గోపీ అడ్వాన్స్‌గా రూ.18వేలు తీసుకుని ఏడాదిగా పనిలోకి రావడం లేదు. అకస్మాత్తుగా ఈ నెల 2వ తేదీన రోడ్డుపై కలవడంతో పనికి ఎందుకు రావడం లేదని గోపీని నిలదీయగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే గోపీపై నర్సింగ్‌రావు చేయిచేసుకున్నాడు. దీంతో గోపీ తన యాజమాని నర్సింగ్‌రావుపై ఈ నెల 3వ తేదీన బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నర్సింగ్‌రావుపై సెక్షన్ 324, 384 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ నిమిత్తం పిలిచినా రాకుండా నర్సింగ్‌రావు కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో కానిస్టేబుల్ నగేష్ ద్వారా ఎస్ఐ బ్రహ్మచారికి రాయబారం నడిపాడు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ. 20వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. స్టేషన్ బెయిల్ నిమిత్తం కానిస్టేబుల్ నగేష్ ఈ నెల 13వ తేదీన నర్సింగ్‌రావు ఇంటికి రావడంతో ఆయన భార్య అంభికా మొదటి విడతగా కానిస్టేబుల్‌కు రూ.10వేల నగదును ఇచ్చింది. నర్సింగ్‌రావు ఇంటి ఎదురుగా ఉన్న టెంట్‌హౌజ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. అనంతరం రెండు రోజుల తరువాత మిగతా డబ్బులు ఫోన్ పే చేయాలని కానిస్టేబుల్ నగేష్ నర్సింగ్‌రావు భార్య అంబికకు ఫోన్ చేశాడు. అకౌంట్ నంబర్ పంపివ్వాలని ఆమె సూచించగా వాట్సాప్‌లో అకౌంట్ నంబర్ పంపగా, ఆ అకౌంట్ నంబర్‌కు రూ.10వేలు బదిలీ చేసింది. అనంతరం కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ విషయం ఎస్ఐకి చెప్పాలనగా కానిస్టేబుల్ నగేష్ కాన్ఫరెన్స్ కలిపాడు. డబ్బులు పంపించినట్లు ఆమె చెప్పిన విషయాన్ని విన్నాడు. ఈ నేపథ్యంలో స్టేషన్ బెయిల్ వస్తుందనుకున్న నర్సింగ్‌రావుకు మాత్రం నిరాశే మిగిలింది. బెయిల్ ఇవ్వాలంటే టీఆర్ఎస్ నేత వేణుగోపాల్‌రెడ్డిని వెంటబెట్టుకుని స్టేషన్‌కు రావాలని ఎస్ఐ బ్రహ్మచారి తనకు సూచించాడని నర్సింగ్‌రావు అన్నారు. ఇదిలా ఉండగా మరోసారి తన ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ రూ.5వేలు కావాలని డిమాండ్ చేశాడని తెలిపాడు. డబ్బులు ఇచ్చినా స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా, కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుండడంతో నగర ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీసీ కెమెరాల రికార్డుతో పాటు ఫోన్లోని వాట్సాప్, ఆడియోలను పరిశీలించి, పూర్తి ఆదారాలతో సోమవారం బొల్లారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
హెచ్–1బీ ‘తగ్గింపు’పై వ్యాజ్యం
-
హెచ్–1బీ ‘తగ్గింపు’పై వ్యాజ్యం
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా కాలపరిమితిని మూడేళ్ల కన్నా తక్కువకు కుదించడంపై అమెరికా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వేయికి పైగా ఇండో–అమెరికన్ల నేతృత్వంలోని కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ సర్వ్ అలయన్జ్ అనే సంస్థ అమెరికా వలస సేవల సంస్థ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్)కి వ్యతిరేకంగా ఈ దావా వేసింది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధికే హెచ్–1బీ వీసాలను మంజూరుచేసే ప్రక్రియను ఇమిగ్రేషన్ ఏజెన్సీ ఇటీవల చేపట్టిందని ఐటీ సర్వ్ అలయన్జ్ పేర్కొంది. ఇలా జారీ అవుతున్న వీసాల కాల పరిమితి చాలా తక్కువగా ఉంటోందని, కొన్నిసార్లు 45, 60 రోజుల పరిమితితో కూడా వీసాలు జారీ అవుతున్నాయని తెలిపింది. నిబంధనల్ని తప్పుగా అన్వయించి, వీసా గడువును తగ్గించే అధికారం ఇమిగ్రేషన్ ఏజెన్సీకి లేదని తెలిపింది. మూడేళ్ల కాలానికి వీసాల్ని మంజూరుచేసే అధికారాన్ని అమెరికా పార్లమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కు కట్టబెట్టిన సంగతిని గుర్తుచేసింది. ‘ఇమిగ్రేషన్ విభాగం ఇష్టారీతిలో నిబంధనలు రూపొందిస్తోంది. తప్పుల్ని సరిచేసి చట్టాల్ని సరిగా పాటించేలా ఇమిగ్రేషన్ విభాగంలో పారదర్శకత పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక ఫెడరల్ కోర్టులోనే తేల్చుకుంటాం’ అని ఐటీ సర్వీస్ అలయన్జ్ అధ్యక్షుడు గోపి కందుకూరి అన్నారు. తరచూ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటం పట్ల విసిగిపోయామని తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఐటీ సర్వీస్ అలయన్జ్ దావా వేయడం ఇది రెండోసారి. మొదటి వ్యాజ్యాన్ని ఈ ఏడాది జూలైలో దాఖలుచేసింది. నాన్–ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్–1బీ వీసాలను విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు గాను అమెరికా కంపెనీలకు 3–6 సంవత్సరాల కాలపరిమితికి జారీచేస్తారు. ఈ వీసా పొందిన ఉద్యోగి అమెరికాలో కనీసం మూడేళ్ల వరకు నివసించొచ్చు. -
కవి గోపికి చైనా ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఆచార్య డాక్టర్ ఎన్.గోపికి చైనా నుంచి అరుదైన ఆహ్వానం అందింది. బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ రచనా కేంద్రంలో అంతర్జాతీయ సాహిత్యంపై ఈ నెల 21 నుంచి 29 వరకు జరగనున్న కార్యక్రమానికి హాజరవ్వాలని కోరింది. ఈ మేరకు రచనా కేంద్రం కార్యనిర్వాహక డైరెక్టర్ ఝంగ్ కింఘ్వా ఆహ్వాన లేఖలో ఆయనను కోరారు. వివిధ దేశాల సాహిత్య వినిమయం, పరస్పర అవగాహనే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా అనువాద శిబిరాలు, కావ్యపఠనాలు, సాహిత్య గోష్టులు తదితర కా ర్యక్రమాల్లో అమెరికా, క్యూబా, జర్మనీ, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ నుంచి ఒక్కరు చొప్పున పాల్గొననున్నారు. చైనా నుంచి ఆరుగురు కవులు పాల్గొంటుండగా.. భారత్ నుంచి తెలుగు కవి గోపి ఎంపిక కావడం విశేషం. ఈ నెల 20న హైదరాబాద్ నుంచి ఆయన బీజింగ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గోపి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆహ్వానం అందడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో చాలా దేశాలకు వెళ్లి వచ్చానని, ఒక్క చైనా మాత్రమే వెళ్లలేకపోయానని.. అది కూడా ప్రసుత్తం తీరిపోనుందని చెప్పారు. -
గత జన్మ బంధం
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటారు. అలా తెలుగు సినిమాలో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి చూస్తే అద్భుతం అనిపించే గోల్డ్ సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇవి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... గోదావరి నదీ తీరాన ఉన్న ఒక ప్రాంతానికి భార్య రాధతో కలిసి విహారయాత్రకు వచ్చాడు గోపీ. ఆ దంపతులిద్దరికీ ఇది మొదటి విహారయాత్ర. ఇద్దరికీ ఇటు చుట్టుపక్కలంతా పడవల్లో, లాంచీల్లో తిరగడం కొత్తగా ఉంది. తిరిగి తిరిగి అలిసిపోయి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగారు ఇద్దరూ. ఆ ప్రదేశానికి రాగానే గోపీని ఎక్కడెక్కడివో ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘‘ఏమైందండీ..’’ అని రాధ ఎంత అడుగుతున్నా పట్టించుకోకుండా చుట్టూ దేనికోసమో గాలిస్తూ తిరుగుతున్నాడు. అప్పుడతనికి కనిపించింది.. గౌరి. ‘ఎలా ఉండే గౌరి ఎలా మారిపోయింది?’ అనుకున్నాడు. గతం గుర్తొచ్చింది గోపీకి. గతమంటే గడిచిన కాలంలోని జీవితం కాదు. గడిచిన జీవితం. గత జన్మ. ‘‘గౌరీ నేనొచ్చాను చూడు.. గోపీని వచ్చాను చూడు..’’ అంటూ గౌరీని పలకరించాడు గోపీ. గౌరీ చివరిశ్వాసకు దగ్గర్లో ఉంది. గోపీని చూస్తూ చూస్తూ ఆమె ఆ తుదిశ్వాస విడిచింది. ‘‘ఎవరండీ ఈవిడ?’’ అడిగింది రాధ, గోపీకి దగ్గరగా వచ్చి కూర్చొని. గోపీ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక జన్మకాలం క్రితం. గోదావరి నదీ తీరం. గోపీ అనాథ. నదిమీద చిన్న పడవ నడుపుకుంటూ బతుకుతున్నాడు. ‘‘గోదారే మా తల్లి. నన్ను చేతులమీద మోసుకొచ్చి కాపాడుతుంది.’’ అంటాడు. గోదారి చుట్టూనే అతని జీవితం. అతణ్ని మావా.. మావా.. అనుకుంటూ తిరిగే ఓ స్నేహితురాలు గౌరీ ఉండనే ఉంది.రాధ జమీందారు కూతురు. కాలేజీ చదువులకు ఆమె వెళ్లాలంటే నది దాటే వెళ్లాలి. అందుకు గోపీ ఉండాలి. గోపీకి రాధ దేవత లాగా. రోజూ ఆమెకు ఒక పువ్వు ఇస్తాడు. ఆమె నవ్వితే ఆ శబ్దాన్ని వింటూ కూర్చుంటాడు. పల్లె పదాలతో పాటలు నేర్పించమని ఆమె అడిగితే పాడి నేర్పిస్తాడు. ఏం చేసినా రాధంటే ఇష్టంతోనే చేస్తాడు గోపీ. గౌరీకేమో గోపీ అంటే ఇష్టం. తనని పెళ్లి చేసుకునేవాడు గోపీనే అవుతాడని ఎదురుచూస్తూ ఉంటుంది గౌరీ. ‘‘నేను చస్తే నీ చేతుల్లోనే చస్తా..’’ అని శపథం చేసి మరీ చెబుతుంది. ‘‘ఓసి పోయే! నువ్వు నా చేతుల్లో చచ్చేదేంటీ.. అయినా నీకు నాకు ఏంటీ..’’ అంటాడు గోపీ. ‘‘మావా! సత్య ప్రమాణంగా చెప్తున్నా.. ఆ గోదావరి సాక్షిగా చెప్తున్నా.. నేను చస్తే నీ చేతుల్లోనే చస్తా..’’ అని మళ్లీ అదే మాటను గట్టిగా నొక్కి చెబుతుంది గౌరీ. గౌరీ, గోపీల కథతో సంబంధం లేకుండా రాధ.. గోపీని ఇష్టపడటం మొదలుపెట్టింది. ‘‘గోపీ.. ఎందుకురా నేనంటే నీకు అంత ఇదీ..’’ అని అడిగింది రాధ. ఆరోజు ఇటు చుట్టుపక్కలంతా పెద్ద ఎత్తున వర్షం. కాలేజీ నుంచి ఇంటికెళ్లే దారిలో రాధ చిక్కుకుపోయింది. ‘‘ఎందుకు అంటే.. ఎందుకు అంటే..’’ ఆలోచిస్తున్నాడు గోపీ. ‘‘ఎందుకంటే పోయిన జన్మలో నువ్వు నాకు రుణపడి ఉన్నావురా! అందుకు.’’ అంది రాధ. ‘‘నిజమా అమ్మగారూ!?’’ అన్నాడు గోపీ. ‘‘నిజమే! ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’’ అంది రాధ.రాధ గోపీతో ఈ మాటన్న రెండో రోజే ఆమెకు పక్క ఊరి జమీందారు కొడుకుతో పెళ్లి కుదిరింది. వారం తిరిగేలోపే పెళ్లి. గోపీ ఆ పెళ్లిలో దగ్గరుండి అన్ని పనులూ చూసుకున్నాడు. జమీందారు కోరికమేరకు అందరికోసం గోపీ ఒక పాట కూడా పాడాడు. రాధ ఇప్పుడు ఒక ఇంటి కోడలు. ఊరొదిలి వెళ్లిపోతోంది. ‘’అమ్మాయి గారూ! మళ్లా ఎప్పుడొస్తారు?’’ అడిగాడు గోపీ. ‘‘నా చేతుల్లో ఏముందిరా!’’ భారంగా సమాధానమిచ్చింది రాధ. ‘‘అవున్లెండి! పెళ్లయ్యాక అంతా బాబు గారి ఇష్టం.’’ అంటూ రాధ భర్త దగ్గరికెళ్లి అడిగాడు గోపీ – ‘‘బాబు గారూ! మా అమ్మాయి గారిని మళ్లా మాకెప్పుడు చూపిస్తారు?’’ ‘‘అరే! ఎప్పుడో ఏమిటోయ్!! రెండు నెల్లో సంవత్సరాదికి ఇక్కడే ఉంటాంగా!’’ ‘‘బాబు గారూ! నా పడవ మీదే రావాలి.’’ అన్నాడు గోపీ. ‘‘నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనీయదు గోపీ..’’ అంది రాధ, ముందునుంచీ మాట్లాడుతూ వచ్చినంత భారంగానే. రాధ వెళ్లిపోయాక గోపీ ఒంటరైపోయాడు. గౌరీ అన్ని సమయాల్లో అతని వెన్నంటే ఉన్నా ఒంటరైపోయాడు. గౌరీకి మాత్రం ఎప్పట్లానే గోపీ తప్ప ఇంకో ప్రపంచం లేదు. రోజులు గడుస్తున్నాయి. గౌరీ, గోపీల ప్రపంచాల్లో ఊహించని మార్పులు వచ్చేస్తున్నాయి. గౌరీకి రోజురోజుకు దగ్గరవుతున్నాడు గోపీ. సంవత్సరాది వచ్చింది. రాధను పడవ ఎక్కించి ఊరికి తీసుకురావడానికి బయలుదేరాడు గోపీ. ‘‘నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనీయదు గోపీ..’’ అని రాధ చెప్పినమాటలు అతనికి ఇంకా గుర్తున్నాయి. రాధ వచ్చింది. ఒడ్డు దగ్గర గుర్రపు బండి దిగి నిలబడింది. రాధ ఒక్కతే వచ్చింది. కూడా భర్త లేడు. ఎప్పటికీ తిరిగిరాలేని ప్రపంచానికి వెళ్లిపోయాడతను. రాధను చూడటంతోనే‘‘అమ్మాయి గారూ! ఏంటీ అన్యాయం.. ఏంటీ ఘోరం..’’ అంటూ నేలకూలిపోయాడు గోపీ. రోజులు గడుస్తున్నాయి. రాధకి ఇలా జరిగినప్పట్నుంచీ మనిషి మనిషిలా లేడు గోపీ. ‘‘నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు?’’ అని అడిగిన గౌరీకి కూడా ‘‘చేస్కోను.’’ అని సమాధానం ఇచ్చేంతలా అతడు బాధ నుంచి బయటపడటం లేదు. రాధని కలవనిదే ఉండలేడు గోపీ. ఈ పరిస్థితుల్లో ఆమె ధైర్యం అతనొక్కడే. కానీ ప్రపంచం వాళ్ల బంధం మీద నిందలేసింది. గోపీ తానింక ఇలాంటి ప్రపంచంలో బతకనని వెళ్లిపోతున్నాడు. రాధ ఈ విషయం తెలుసుకొని అతణ్ని వెంటాడుతూ వెళ్లింది. ‘‘మీరెందుకొచ్చారమ్మాయి గారు! ఈ పాడులోకం అనుకుంటున్నదే నిజమవుద్ది.’’ అన్నాడు గోపీ, రాధను చూడటంతోనే. ‘‘కానీ అదే నిజం కానీరా.. ఈ అబద్ధాలతో బతకడం కన్నా, ఆ నిజంలో చావడమే మేలు..’’ అంది రాధ. గోపీ పడవ తీశాడు. నది విజృంభిస్తోంది. భారీ వర్షం. ఆ గోదారిలోనే కలిసిపోయారు ఇద్దరూ. అప్పట్నుంచీ గోపీ చేతుల్లోనే చావాలని గౌరీ ఎదురుచూస్తూ ఆ తీరం దగ్గరే గడుపుతూ వచ్చింది. అలాగే రాధపై తాను వేసిన నింద ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉండింది. -
మేలో తెరపైకి..
తమిళసినిమా: ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రం నిర్మాణ కార్యక్రయాలను శరవేగంగా జరుపుకుంటోంది. మే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మంచి కథాంశంతో కూడిన చిత్రాలను అందించండి అంటున్నారు క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత, నటుడు వీ.సత్యమూర్తి. ఈయన తాజాగా నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు. యూట్యూబ్ చిత్రం ఎరుమాసాని ఫేమ్ రమేశ్ వెంకట్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అదే విధంగా యూట్యూబ్‌లో సందడి చేస్తున్న మెడ్రాస్ సెంట్రల్ ఫేమ్ గోపి, సుధాకర్, ఎరుమసాని ఫేమ్ విజయ్, హరిజా, పుట్ చట్నీ ఫేమ్ అగస్థ్యన్, టెంపుల్ మంకీస్ ఫేమ్ షారా, అబ్దుల్, బిహెండ్వుడ్స్ ఫేమ్ వీజే.ఆశిక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రం గురించి నిర్మాత, నటుడు వీ.సత్యమూర్తి తెలుపుతూ షూటింగ్‌ను 60 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పటికీ, దర్శకుడు 45 రోజుల్లోనే పూర్తి చేశారని, ఆయన ప్లానింగ్, నటీనటులు, సాంకేతిక వర్గం సహకారమే ఇందుకు కారణమన్నారు. దర్శకుడితో సహా పలువురు నటీనటులు, సాంకేతిక వర్గం యూట్యూబ్ చిత్రాల నుంచి వెండితెరకు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న వారేనని తెలిపారు. ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రం మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న జనరంజక చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి జోశ్వా జే.పెరోజ్ ఛాయగ్రహణ, కౌశిక్ గిరీశ్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని మెలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వీ.సత్యమూర్తి తెలిపారు. -
గోపీ ‘పసిడి’ పరుగు...
డాంగ్‌గువాన్ (చైనా): భారత మారథాన్ రన్నర్ గోపీ థోనకల్ అద్భుతం చేశాడు. ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో కేరళకు చెందిన గోపీ చాంపియన్‌గా నిలిచాడు. 42.195 కి.మీ. దూరాన్ని గోపీ 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా పురుషుల విభాగంలో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఆండ్రే పెట్రోవ్ (ఉజ్బెకిస్తాన్–2గం:15ని:51 సెకన్లు) రజతం... బ్యాంబలేవ్ సెవీన్‌రవ్‌డాన్ (మంగోలియా–2గం:16ని:14 సెకన్లు) కాంస్యం గెలిచారు. ఓవరాల్‌గా ఆసియా మారథాన్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్‌గా గోపీ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్ (1985లో), సునీత గోదర (1992లో) మాత్రమే స్వర్ణాలు గెలిచారు. 1988 వరకు ఈ మారథాన్ రేసు ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉండేది. 1988 నుంచి ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వేరు చేసి ఈ మారథాన్ రేసును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. -
పిలిచిన వెంటనే రాలేదని చితక్కొట్టిన పోలీసులు
-
పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం
విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు యత్నించారు. విశాఖ జిల్లా ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా పార్వతీపురంనకు చెందిన జగదీష్, శ్రీకాకుళం జిల్లా వాసి గోపీ అనే యువకులు కొన్నాళ్లుగా విశాఖ కైలాసగిరిలో మకాం పెట్టారు. ఆప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిద్దరినీ వారం క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారు స్టేషన్లోనే ఉన్నారు. తీవ్ర ఆందోళన చెందిన యువకులిద్దరూ సోమవారం రాత్రి నిద్రమాత్రలు మింగారు. వెంటనే గమనించిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో తిరిగి గుట్టుచప్పుడు కాకుండా స్టేషన్‌కు తరలించారు. రిమాండ్ చేయకుండా విచారణ పేరుతో యువకులను స్టేషన్లో నిర్బంధించటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ.. వ్యక్తి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం అక్కమ్మకొండ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంత నుంచి రాయదుర్గం వెళ్తుండగా.. అక్కమ్మకొండ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న గోపి(40) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ వరిగడ్డి దగ్ధం
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గొల్లపల్లి సమీపంలో బుధవారం మధ్యాహ్నం వరిగడ్డితోపాటు ట్రాక్టర్ ట్రక్ దగ్ధమైంది. వరిగడ్డి లోడుతో ట్రాక్టర్ గ్రామంలో వెళుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు లేచాయి. డ్రైవర్ గోపి అప్రమత్తమై ట్రక్‌ను వదిలేసి ఇంజన్‌ను ముందుకు తీసకుపోయాడు. సుమారు రూ.లక్ష మేర నష్టం జరిగినట్టు అంచనా. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
అచ్చంపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై గంగమ్మపల్లి తిరునాళకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అత్త లింగమ్మ(45), అల్లుడు గోపి(24) మృతిచెందగా.. గోపి భార్య అనూషకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అనూషను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా బెల్లంకొండ మండలం వన్నాయిపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య చేతిలో భర్త హతం
పెద్దపంజాణి: భార్య చేతిలో భర్త హత్యకు గురైన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలా ఉన్నాయి. మండంలోని చెదళ్లవాళ్లపల్లెకు చెందిన అమావాస్య అనే వ్యక్తి కుమారుడు గోపీ (30)కి అదే గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె తులసమ్మ (30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. గోపీ కంకర సరఫరా చేసే ఫ్యాక్టరీలో డ్రయివర్. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తరువాత తరచూ గొడవలు పడేవారు. కాగా తులసమ్మపై అనుమానంతో తరచూ గొడవలు పడేవారు. ఈ నేపథ్యలో కొన్నాళ్ల క్రితం తులసమ్మ పనుల కోసం బెంగళూరుకు వెళ్లి, అక్కడే ఉండేది. ఈ సమయంలో గోపి మదనపల్లెకు చెందిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తులసమ్మ రెండు నెలల క్రితం గ్రామానికి చేరుకుని, ఇకపై ఇద్దరం కలిసి ఉందామని నచ్చచెప్పి గోపి రెండో భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత కూడా తులసమ్మ కోసం ఓ వ్యక్తి చెదళ్లవారిపల్లెకు వచ్చి వెళ్లేవాడు. దీంతో గోపి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడ్డారు. తీవ్ర ఆవేశానికి లోనైన తులసమ్మ భర్త గోపిని మచ్చు కత్తితో మెడపై నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగవరం సీఐ రవికుమార్, స్థానిక ఎస్ఐ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలు పరారీలో ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. -
గల్లంతైన వారి కోసం గాలింపు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట వద్ద కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం బల్లకట్టు సైడ్ గ్రిల్ విరిగి రామన్నపేటకు చెందిన నరసింహారావు, గోపి, రమణ నదిలో పడిపోయారు. అయితే, తమ పరిధిలోకి రాదంటూ ఇటు కృష్ణా, అటు గుంటూరు జిల్లాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికులే గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగి 16గంటలు గడుస్తున్నా... నదిలో గల్లంతైన వారి ఆచూకీ లభించపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.