![China invite to poet Gopi - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/13/PROF._N._GOPI.jpg.webp?itok=XoaPca7J)
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఆచార్య డాక్టర్ ఎన్.గోపికి చైనా నుంచి అరుదైన ఆహ్వానం అందింది. బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ రచనా కేంద్రంలో అంతర్జాతీయ సాహిత్యంపై ఈ నెల 21 నుంచి 29 వరకు జరగనున్న కార్యక్రమానికి హాజరవ్వాలని కోరింది. ఈ మేరకు రచనా కేంద్రం కార్యనిర్వాహక డైరెక్టర్ ఝంగ్ కింఘ్వా ఆహ్వాన లేఖలో ఆయనను కోరారు.
వివిధ దేశాల సాహిత్య వినిమయం, పరస్పర అవగాహనే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా అనువాద శిబిరాలు, కావ్యపఠనాలు, సాహిత్య గోష్టులు తదితర కా ర్యక్రమాల్లో అమెరికా, క్యూబా, జర్మనీ, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ నుంచి ఒక్కరు చొప్పున పాల్గొననున్నారు. చైనా నుంచి ఆరుగురు కవులు పాల్గొంటుండగా.. భారత్ నుంచి తెలుగు కవి గోపి ఎంపిక కావడం విశేషం. ఈ నెల 20న హైదరాబాద్ నుంచి ఆయన బీజింగ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గోపి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆహ్వానం అందడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో చాలా దేశాలకు వెళ్లి వచ్చానని, ఒక్క చైనా మాత్రమే వెళ్లలేకపోయానని.. అది కూడా ప్రసుత్తం తీరిపోనుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment