
హన్మకొండ: భర్తను కడతేర్చడానికి భార్య సుపారీ(Supari) అందజేసింది. ఎలాగైనా, ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో గురువారం భార్యతోపాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సంపేట రూరల్ ఎస్సై అరుణ్ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధారావత్ సుమన్‌కు, మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతుండడంతో హైదరాబాద్‌లో వేర్వేరుగా ఉంటున్నారు. సుమన్ హైదరాబాద్‌లోనే(Hyderabad) ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం నరేశ్ అనే యువకుడు సుమన్‌కు వాట్సాప్ కాల్(WhatsApp call) చేసి నిన్ను చంపేందుకు ప్రయత్నం జరుగుతుందని, తనకు డబ్బులు ఇస్తే ఆ ప్రయత్నాన్ని ఆపుతానంటూ చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన సుమన్.. ఈనెల 9వ తేదీన నరేశ్‌పై నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో సుమన్ భార్య మంజుల..(Manjula) మరికొందరితో కలిసి భర్తను చంపించేందుకు నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపికి రూ.30వేల సుపారీ ఇచ్చినట్లు నరేశ్ తెలిపాడు. దీంతో మంజుల, ఆమెకు సహకరించిన ఆమె బావ ములుగుకు చెందిన మోతీలాల్, వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన నరేశ్, నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మల్లేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ప్రియురాలితో పెళ్లి కోసం..
Comments
Please login to add a commentAdd a comment