
బీజింగ్: చైనాను భీకర గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్, డాక్సింగ్‌లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు, రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము తుపానులు చెలరేగడంతో.. అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసేశారు.
చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అలర్ట్ చేసింది. దేశంలోని ఉత్తర, తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ సబ్‌వే, హై-స్పీడ్ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన తుపానులు, వరదల్లో అనేక మంది మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి 48 మంది మరణించిన సంగతి తెలిసిందే.
April 12, China was hit by a nationwide gale and dust storm that was rare in history, with the maximum gust reaching 46.8m/s! The sandstorm blew from Mongolia all the way to the Yangtze River and may even affect Hong Kong! pic.twitter.com/8mO795JEep
— Jim (@yangyubin1998) April 12, 2025