Sand storms
-
చైనాలో భారీ ఇసుక తుపాను...దాదాపు 4 గంటలు...
బీజింగ్: ఇసుక తుపాను గురించి మనం టీవీల్లో విని ఉంటాం. ఆ తుపాను వస్తే మనుషులను, సమీప ప్రాంతంలోని వస్తువులన్నీ ఇసుకతో కప్పబడి పోతాయి. కానీ ప్రస్తుతం చైనాలో వచ్చిన ఇసుక తుపాను ఆకాశాన్నే కమ్మేసినట్లుగా వచ్చింది. చూసేందుకు ఒళ్లు గగ్గుర్పొడిచేలా భయానకంగా వచ్చింది. ఈ మేరకు వాయువ్య చైనాలోని , క్వింగ్హై ప్రావిన్స్ ప్రాంతంలో వచ్చిన భారీ ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో ఆయా ప్రాంతంలో వెళ్తున్న వాహానాలు ఆ తుపానులో ఒక్కసారిగా చిక్కకుపోయాయి. దాదాపు 4 గంటల పాటు ఈ ఇసుక తుపాను కొనసాగినట్లు సమాచారం. ఈ ఇసుకు తుపాను సుమారు 200 మీటర్లు ఎత్తులో అత్యంత బలంగా వచ్చింది. సూర్యుడిని సైతం కమ్మేసినట్లుగా ఆకాశమంత విస్తరించింది. ఈ తుపాను కారణంగా ఆ ప్రాంతంలో రాక పోకలను కూడా నిలిపేశారు. అంతేకాదు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అదీగాక ప్రపంచ దేశాల మాదిరిగా చైనా కూడా అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటొంది. ఈ మేరకు ఈ ఇసుక తుపానుకి సంబంధించిన వీడియో సోషల్ మాద్యమంలో తెగ వైరల్ అవుతోంది. Dramatic video of a massive sandstorm ripping through China's Qinghai province has emerged on social media | WATCH #ITReel #China #Sandstorm #Qinghai #Twitter #nature pic.twitter.com/pv4NWgCW4g — Rasmus (@notorius_vip) July 24, 2022 (చదవండి: కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ విధింపు) -
ప్రకృతి ప్రకోపానికి 86 మంది మృతి
న్యూఢిల్లీ: బలమైన ఈదురు గాలులు, ఇసుక తుపాను, పిడుగుపాట్లతో సంభవించిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఆది,సోమవారాల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే 136 మంది ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది. మొత్తం మృతుల్లో 51 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనంది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది, పశ్చిమబెంగాల్లో 14 మంది, బిహార్‌లో ఆరుగురు, ఢిల్లీలో ఇద్ద రు, ఉత్తరాఖండ్‌లో మరొకరు చనిపోయారంది. మరోవైపు మంగళవారం ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్లో వర్షాలు కురవచ్చని అధికారులు చెప్పారు. -
మళ్లీ తుపాను బీభత్సం
న్యూఢిల్లీ: పెనుగాలులు, ఇసుక తుపాను, పిడుగుపాటులతో కూడిన భారీ వర్షం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఆదివారం బీభత్సం సృష్టించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం 43 మంది చనిపోగా, నష్టం కూడా భారీగానే వాటిల్లింది. పశ్చిమ బెంగాల్లో నలుగురు చిన్నారులు సహా 12 మంది మరణించారు. యూపీలో 18 మంది, ఏపీలో 11 మంది, ఢిల్లీలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గంటకు 100 కి.మీకు పైగా వేగంతో వీచిన పెనుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. నోయిడా, పరిసర ప్రాంతాలు ఇసుక తుపానులో చిక్కుకున్నాయి. దీంతో మెట్రో, రైలు, విమాన సేవలకు అంతరాయం కలిగింది. పిడుగుపాటుకు పలు రాష్ట్రాల్లో వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఆదివారం నోయిడాకు సమీపంలోని ఇటాడా గ్రామాన్ని కప్పేసిన ఇసుక తుపాను -
యూపీలో మరో తుపాను
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను మరో తుపాను కుదిపేసింది. బుధవారం రాత్రి నుంచి మొదలైన పెనుగాలులు, భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో 18 మంది మరణించారు. 27 మంది గాయాలపాలయ్యారు. పశ్చిమ యూపీలోని 9 జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఇటావాలో ఐదుగురు, మథుర, అలీగఢ్, ఆగ్రాల్లో ముగ్గురు చొప్పున, ఫిరోజాబాద్‌లో ఇద్దరు, హతరాస్, కాన్పూర్ దెహాత్‌లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. మథుర జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో శనివారం, ఆదివారం పెనుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ యూపీలో మరో ఇసుక తుపాను సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది. -
ప్రకృతి ప్రకోపానికి 116 మంది బలి
న్యూఢిల్లీ: రెండు రోజుల వ్యవధిలో ప్రకృతి ప్రకోపానికి యూపీ, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 116 మంది మృతిచెందగా, 300 మందికి పైగా గాయపడినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీలకు రాష్ట్రాలకు వర్షం, పెనుగాలుల ముప్పు ఉందని శుక్రవారం తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఇసుక తుపాన్, గాలి వాన, పిడుగుపాటులకు గురువారం ఉత్తరప్రదేశ్‌లో 73 మంది మరణించగా, 91 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ప్రభావిత రాష్ట్రాల్లో సుమారు 12 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, 2,500 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు, యూపీలో ప్రకృతి బీభత్సం ఎక్కువగా ఉండడంతో.. కర్ణాటక ఎన్నికల ప్రచారం వాయిదావేసుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన లక్నో చేరుకున్నారు. యోగి వేరే రాష్ట్రంలో ప్రచారం చేయడంపై విమర్శలు పెరిగాయి. ‘యూపీ ప్రజలు యోగిని ఎన్నుకున్నది తమ రాష్ట్రంలో పనిచేయమనే.. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం కాదు’ అని మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా యోగిపై విమర్శలు చేశారు. -
వైరల్ వీడియా...అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్‌లా
సినిమాల్లో గ్రాఫిక్స్ ద్వారా చూపించే ఇసుక తుఫానులను చూసి ఉంటాం. కానీ మనదేశంలో ఇలాంటి తక్కువే. ఎడారి ప్రాంత దేశాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. తాజాగా... సౌదీ అరేబియా దేశంలో తాజాగా దుమ్ము, ఇసుకతో కూడిన తుఫానులు అంతెత్తుకు వ్యాపించాయి. విమానాల ప్రయాణాలకు కూడా ఆటంకం కలిగించాయి. అయితే ఈ దృశ్యాన్ని విమానంలోంచి ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. దుమ్ము, ఇసుక తుఫానుల కారణంగా వాతావరణం సరిగా లేదని సౌదీ అరేబియాకు దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానాన్ని ల్యాండ్చేశారు. అక్కడ రన్‌వే కూడా సరిగా లేకపోయినా...మొత్తం దుమ్ముతో నిండిపోయినా పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్‌చేశాడు. అయితే ఇప్పుడు ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. -
అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్‌లా.. ఇసుక తుఫాను
-
పాలకొండలో.. ఇసుక తుపాను !
పాలకొండ:పాలకొండలో ఇసుక తుపాను రేగింది. నాటుబళ్లతో ఇసుక తరలించుకొనేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలపై నాటుబళ్ల యజమానులు మండిపడ్డారు. సర్కారు తీరును నిరసిస్తూ బళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగావళి నది నుంచి పలువురు సన్న, చిన్నకారు రైతులు నాటుబళ్లతో ఇసుకను తరలిస్తూ వచ్చే సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో వీరంతా ఆందోళన బాట పట్టారు. వీరఘట్టం రోడ్డులో ఉన్న మార్కెట్ కమిటీ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు 200 నాటుబళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీన్ని పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. పట్టణంలో తీవ్ర గందరగోళంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ఎస్సై ఎల్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కోటదుర్గమ్మ ఆలయ కూడలి నుంచి సగం బళ్లను పట్టణంలోని పలు వీధులకు మళ్లించారు. బళ్లు మొత్తం పట్టణంలోకి ప్రవేశిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఎస్సై వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధితుల తరఫున నగర పంచాయతీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పల్లా కొండలరావు జోక్యం చేసుకొని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, వారిని అడ్డుకోవద్దని పోలీసులకు కోరారు. అయినా పోలీసులు బళ్లు అన్నింటినీ ఒకే రహదారిలో వెళ్లనీయకుండా పలు వీధులకు 20, 30 చొప్పున మళ్లించారు. అయినా వీరంతా నాగవంశపువీధి కూడలిలో మెయిన్‌రోడ్డుపైకి చేరుకొని..అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంలో ఎస్సైకు, బళ్ల యజమానులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదంటూ ఎస్సై కోపోద్రిక్తుడు కావడంతో వీరు కూడా ససేమిరా అంటూ ఈ ఒక్కరోజుకు సహకరించాలని కోరారు. అనంతరం బళ్లను నిలిపివేసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయూలని కోరుతూ కార్యాలయ ఏవో దాలినాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బళ్ల సంఘం అధ్యక్షుడు ఇద్దుబోయిన తవుడు మాట్లాడుతూ రోజంతా కష్టపడితే రూ.200 సంపాదిస్తున్నామని, పశువుల దాణా పోనూ ఉన్న వంద రూపాయలతో కుటుంబాలతో నెట్టుకొస్తున్నామన్నారు. అలాంటిది తమ నుంచి బండికి వెరుు్య రూపాయలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. ఈ చర్యను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, శనివారం సైతం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.