చైనాలో భారీ ఇసుక తుపాను...దాదాపు 4 గంటలు... | Virl Video: Sandstorm Ripping Through Chinas Northwestern Region | Sakshi
Sakshi News home page

Viral Video: చైనాలో భారీ ఇసుక తుపాను...దాదాపు 4 గంటలు...

Published Mon, Jul 25 2022 10:23 AM | Last Updated on Mon, Jul 25 2022 10:26 AM

Virl Video: Sandstorm Ripping Through Chinas Northwestern Region - Sakshi

బీజింగ్‌: ఇసుక తుపాను గురించి మనం టీవీల్లో విని ఉంటాం. ఆ తుపాను వస్తే మనుషులను, సమీప ప్రాంతంలోని వస్తువులన్నీ ఇసుకతో కప్పబడి పోతాయి. కానీ ప్రస్తుతం చైనాలో వచ్చిన ఇసుక తుపాను ఆకాశాన్నే కమ్మేసినట్లుగా వచ్చింది. చూసేందుకు ఒళ్లు గగ్గుర్పొడిచేలా భయానకంగా వచ్చింది. ఈ మేరకు వాయువ్య చైనాలోని , క్వింగ్హై ప్రావిన్స్‌ ప్రాంతంలో వచ్చిన భారీ ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది.

దీంతో  ఆయా ప్రాంతంలో వెళ్తున్న వాహానాలు ఆ తుపానులో ఒక్కసారిగా చిక్కకుపోయాయి. దాదాపు 4 గంటల పాటు ఈ ఇసుక తుపాను కొనసాగినట్లు సమాచారం. ఈ ఇసుకు తుపాను సుమారు 200 మీటర్లు ఎత్తులో అత్యంత బలంగా వచ్చింది. సూర్యుడిని సైతం కమ్మేసినట్లుగా ఆకాశమంత విస్తరించింది. ఈ తుపాను కారణంగా ఆ ప్రాంతంలో రాక పోకలను కూడా నిలిపేశారు. అంతేకాదు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అదీగాక ప్రపంచ దేశాల మాదిరిగా చైనా కూడా అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటొంది. ఈ మేరకు ఈ ఇసుక తుపానుకి సంబంధించిన వీడియో సోషల్‌ మాద్యమంలో తెగ వైరల్‌ అవుతోంది. 
 

(చదవండి:  కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ విధింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement