ప్రచండ గాలులు.. కొట్టుకుపోయిన మనుషులు, వాహనాలు | China Hits Super Typhoon Yagi Videos Viral In Social Media | Sakshi
Sakshi News home page

వీడియో: తుపాన్‌ బీభత్సం.. గాలికి కొట్టుకుపోయిన మనుషులు, వాహనాలు

Published Sat, Sep 7 2024 5:31 PM | Last Updated on Sat, Sep 7 2024 11:01 PM

 China Hits Super Typhoon Yagi Videos Viral In Social Media

బీజింగ్‌: డ్రాగన్‌ దేశం చైనాలో యాగి తుపాన్‌ బీభత్సం సృష్టించింది. తుపాన్‌ ప్రభావంతో గంటకు 234 కి.మీ వేగాన్ని మించి బలమైన గాలులు వీచాయి. దీంతో, వాహనాలతో సహా మనుషులు కొట్టుకుపోయాయి. పలుచోట్ల రేకుల షెడ్స్‌ గాల్లోకి ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు.. యాగి తీవ్ర తుపాను కారణంగా రెండు రాష్ట్రాల్లోని నదులకు వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. తుపాను నేపథ్యంలో హైనాన్‌ రాష్ట్రంలో వెంగ్టియాన్‌ టౌన్‌షిప్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించవచని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. హైనాన్‌లోని నాండు, చాంగువా నదులకు వరద ముప్పుందని ప్రజలను అలర్ట్‌ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గౌంగ్‌డాంగ్‌లో 5.70 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజా తుపానుపై చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

 


ఇదిలా ఉండగా.. యాగీ తుపాన్‌ కారణంగా దాదాపు 8 లక్షల ఇళ్లకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. ఇక, తుపాన్‌ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. 92 మంది గాయపడ్డినట్టు చైనా ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, యాగీ తుపాన్‌ ప్రభావం ప్రస్తుతం వియత్నం మీద కూడా ఉంది. అక్కడ కూడా ఎడతెరపిలేని వర్షం కురుస్తూ భీకర గాలులు విస్తున్నాయి. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement