ఓ డాక్టర్ తన భార్యకు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓ భయానక సాహసానికి ఒడిగట్టాడు. పైగా తన భార్య కోరికను తీర్చేందుకే ఇలా చేశానని చెబుతున్నాడు. ఆ ఘనకార్యం వింటే..అమ్మబాబోయే ఏం డాక్టర్‌వయ్యా బాబు అని మండిపడతారు.
ఈ వింత ఘటన చైనా(China)లో చోటుచేసుకుంది. తైవాన్‌లోని తైపీకి చెందిన డాక్టర్ చెన్ వీ నోంగ్(Dr Chen Wei-nong) అనే సర్జన్ తనకు తానుగా వేసక్టమీ ఆపరేషన్(Dr Chen Wei-nong) చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని డాక్యుమెంట్ రూపంలో నెట్టింట షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సర్జన్(surgeon) నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు.
భవిష్యత్తులో ఇంక పిల్లలు పుట్టకూడదనే తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఇలా చేశానని తెలిపాడు. అదే తాను తన భార్యకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెబుతుండటం విశేషం. ఆయన ఆ వీడియోలో తనకు తానుగా ఎలా వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటున్నాడో కనిపిస్తుంది. నిజానికి ఈ సర్జరీ జస్ట్ 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కానీ ఆయన స్వయంగా చేసుకోవడంతో ఒక గంట వ్యవధి తీసుకుని విజయవంతంగా తన సర్జరీని పూర్తి చేసుకున్నాడు. అంతేగాదు ఆ సర్జరీ చేసిన ప్రదేశంలో ఎంత పెయిన్ ఉంటుందో కూడా వివరించాడు.
డాక్టర్ చెన్ వేసెక్టమీ ఆపరేషన్ పదకొండు దశలు గురించి ఆ వీడియోలో వివరంగా వెల్లడించారు. అంతేగాదు ఆ వీడియోలో మరసటి రోజు తాను పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపాడు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ డాక్టర్ డేరింగ్‌కి విస్తుపోయారు. ఎంత డాక్టర్ అయినా తనకు తాను స్వయంగా సర్జరీ చేసుకోవడం అంటే మాటలు కాదు.
కచ్చితంగా ఈయన మంచి నైపుణ్యం గల సర్జన్ అయ్యి ఉండాలి అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఆ డాక్టర్ చెన్ దంపతులకు ఎంతమంది పిల్లలు అనేది తెలియాల్సి ఉంది. కానీ పిలల్లు పుట్టకుండా మహిళలే కాదు భర్తలు కూడా ఇలాంటి విషయంలో కాస్త ముందుకువచ్చి వారి బాధను తగ్గించే యత్నం చేయాలనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది ఇతడి సాహసం. వాస్తవానికి చాలామటుకు మహిళలే పిల్లలు పుట్టకుండా(ట్యూబెక్టమీ) ఆపరేషన్ చేయిచుకుంటున్నారు.
(చదవండి: అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!)
Comments
Please login to add a commentAdd a comment