surgeon
-
మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా మద్యపానం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మద్యపానం కారణంగా అనారోగ్యం బారినపడి మరణించినవారు కూడా ఉన్నారు. దీనికితోడు మద్యపానం కొన్నిరకాల క్యాన్సర్లకు కారణమవుతుందని కూడా వెల్లడయ్యింది. తాజాగా మద్యపానానికి సంబంధించిన ఒక ప్రకటన అమెరికాలో కలకలం రేపుతోంది.మద్యపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణమని, అమెరికన్ వినియోగదారులు కొనుగోలు చేసే మద్యం బాటిళ్లలపై ‘మద్యపానం క్యాన్సర్‌కు కారకం’ అని ముద్రించాలని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రతిపాదించారు. ఈ దరిమిలా అమెరికన్, యూరోపియన్ మద్యం తయారీదారుల షేర్లు అమాంతం పడిపోయాయి. మద్యం సేవించడం మనిషి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి(Dr. Vivek Murthy) కనుగొన్నారు.మద్యపానం కారణంగా ఏటా సుమారు 20 వేల మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారని, ఆల్కహాల్‌కు క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధం గురించి అమెరికన్లు తెలుసుకోవాలని డాక్టర్ వివేక్ మూర్తి పేర్కొన్నారు. గత దశాబ్దంలో అమెరికాలో నమోదైన సుమారు పది లక్షల క్యాన్సర్ కేసులకు మద్యం సేవించడం ప్రధాన కారణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని కంపెనీల వైన్, బీర్ బాటిళ్లపై ఇప్పటికే ఈ తరహా హెచ్చరిక లేబుల్స్ ఉన్నాయన్నారు. గర్భిణులు మద్యం సేవించడం వల్ల వారికి పుట్టే పిల్లలకు పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ మూర్తి హెచ్చరించారు.కాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆల్కహాల్ బాటిళ్లపై ఆరోగ్యానికి హానికరమంటూ ముద్రిస్తున్నాయి. దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్(Cancer) సంబంధిత హెచ్చరికను ముద్రిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లోనే ఆల్కహాల్ అనేది కాన్సర్‌కు కారకమని నిర్ధారించింది. క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేలా ఏ ఆల్కహాల్ కూడా ఉండదని పేర్కొంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పరిశోధకుల బృందం ప్రపంచంలోని నాలుగింట ఒక వంతు దేశాలు మాత్రమే ఆల్కహాల్‌పై ఆరోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్నయని పేర్కొంది. క్యాన్సర్ హెచ్చరికలు చాలా అరుదుగా ఉంటున్నాయని ఆ బృందం తెలిపింది.దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్‌కు సంబంధించిన హెచ్చరిక కనిపిస్తుంది. 2016లో దక్షిణ కొరియా(South Korea) ఈ హెచ్చరికల లేబుల్ ముద్రించడాన్ని తప్పనిసరి చేసింది. ఐర్లాండ్‌లోనూ మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలు కనిపిస్తాయి. ఈ హెచ్చరికలను తప్పనిసరి చేసిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది. నార్వే ఇప్పటికే ఆల్కహాల్ వినియోగాన్ని చాలావరకూ నియంత్రించింది. ఇప్పుడు మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలను ముద్రింపజేయాలనే ప్రతిపాదన చేసింది. ఇదేవిధంగా ‘ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి’ లాంటి హెచ్చరికలను మద్యం బాటిళ్లపై ముద్రించాలని థాయిలాండ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని మద్యం పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.కెనడా ఆల్కహాల్‌పై క్యాన్సర్ హెచ్చరికలను తప్పనిసరి చేయనప్పటికీ, 2022లో కెనడియన్ పార్లమెంట్లో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. కెనడాలోని పరిశోధకుల బృందం 2017లో క్యాన్సర్‌ను హెచ్చరిక లేబుల్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆల్కహాల్ ట్రేడ్ గ్రూపుల ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం ఈ అధ్యయనాన్ని విరమింపజేయాలని కోరింది. ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు? -
"అమ్మ" అనే పిలుపు కోసం పరితపించే వాళ్లకి అది గొప్ప వరం!
గుండె, ఊపిరితిత్తులు, కిడ్ని మాదిరిగి గర్భాశయం మార్పిడి. ఇక భవిష్యత్తులో వేలాదిమంది మహిళలు గర్భాశయం మార్పిడి చేయించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అమ్మను కాలేనని బాధపడుతున్న వారకి ఇదొక వరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగతా అవయవాల మాదిరిగా ఇది సర్వసాధారంణం కావొచ్చు అంటున్నారు. అంతేగాదు ఆ స్థాయికి చేరుకోవడానికి కేవలం ఐదేళ్లు మాత్రమే పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాలో విజయవంతంగా గర్భశయ మార్పిడి నిర్వహించిన వైద్యం బృందంలోని ఓ వైద్యుడు టొమ్మసో ఫాల్కోన్ మాట్లాడుతూ..తాము గర్భాశయాన్ని ఇచ్చే దాతల్లో ప్రమాదాన్ని తగ్గించడమే గాక గ్రహీతల్లో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ఈ అరుదైన శస్త్రచికిత్సలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఇలాంటి ఆపరేషన్‌లో మరింత స్థాయిలో సక్సెస్‌ని సాధించగలమని అన్నారు. ఈ గర్భాశయ మార్పిడి అనేది గుండె, ఊపరితిత్తుల మార్పిడిలాంటిదే గానీ వాటిన్నీటికంటే ఈ శస్త్ర చికిత్స మరింత క్లిషమైన ప్రక్రియ అని అన్నారు. ఇందులోని రెండు దశలు గంటలతరబడి చేయాల్సిన ఆపరేషన్లని అన్నారు. మరణించి ఉన్నా లేదా జీవించి ఉన్నవారి నుంచి ఈ మార్పిడి ప్రక్రియ అనేది సాధ్యమేనని అన్నారు. కాగా, యూఎస్‌లో మరణించిన దాత నుంచి మార్పిడి జరిగిన మహిళ తదనంతరం ప్రసవించడంతో మరింత పురోగతి సాధించినట్లయింది. 2013లో జరిగిన తొలి గర్భాశయం మార్పిడి నంచి వైద్య నిపుణలు మరింతగా పురోగతి సాధించారు. అలాగే అవయవాన్ని తొలగించే విధానాన్ని మరింతగ మెరుగుపరిచి, ప్రమాదాలను నివారించేలా రోబోటిక్‌గా చేసేలా పరిశోధనలు చేస్తున్నట్లు వైద్య బృందం పేర్కొంది. పైగా 10 గంటల ఆపరేషన్ సమయాన్ని సగానికి తగ్గించే యత్నం కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గర్భాశయ మార్పిడి జరిగిన అమండా గ్రుండెల్ తన గురించి వివరిస్తూ.. ఆమె కుమార్తె గ్రేస్‌కు 2021లో క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో జన్మనిచ్చింది. 17 ఏళ్ల వయసులో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే.. ఒకవిధమైన పుట్టకతో వచ్చే రుగ్మతతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. తానెప్పుడూ "మామ్" అని పిలుపించుకోలేనని చాలా బాధపడ్డాను. గర్భాశయ మార్పిడి ట్రయల్స్ గురించి వైద్యుల ద్వారా తెలుసకుని.. అందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. నిజానికి ఈ మార్పిడి పనిచేయకపోవచ్చ అని కూడా తెలుసు. కానీ ఇలాంటి అధునాతన వైద్యంలో భాగమై తనలాంటి వాళ్లకు ఏదో రకంగా తల్లి అయ్యే మార్గం దొరికితే చాలు అని కోరుకున్నాని గ్రుండెల్ చెబుతోంది. ఈ శస్త్ర చికిత్స సక్సస్ అయ్యి గర్భవతిని అవుతానని అనుకోలేదు..ఇలా బిడ్డ చేత మామ్ అని పిలుపించుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది. తాను ఇప్పుడు రెండో బిడ్డ కోసం యత్నిస్తున్నట్లు కూడా చెప్పింది. క్యాన్సర్ వంటి ఇతర పరిస్థితుల వల్ల గర్భాశయం కోల్పోయిన మహిళలకు ఈ మార్పిడి ఆపరేషన్ ఒక గొప్ప వరం అని అంటోంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ మార్పిడి చేయించుకున్న చాలా మంది మహిళలు గర్భవతులయ్యారని, దాదాపు 90 మంది పిల్లలకు జన్మంచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి వృషణాలు లేకుండా పుట్టాడు. 40 ఏళ్లుగా అలాగే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా.. ఎంతకు పిల్లలు పుట్టకపోవడం, పొత్తి కడుపు కింద నొప్పితో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు రెండూ ఉన్నట్టు గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు తేల్చారు.ఆస్పత్రిలో ఆయనకు ఆండ్రాలజిస్టు, రోబోటిక్ సర్జన్ వైఎం ప్రశాంత్ చికిత్స చేశారు. దీనికి సంబంధించి వైద్యుడు వెల్లడించిన వివరాల మేరకు.. సాధారణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అన్నది నిర్ణయమైపోతుంది. అయితే మంచిర్యాల వ్యక్తి కేసులో జన్యు మ్యుటేషన్ కారణంగా.. హార్మోన్ల అసమత్యుల్యత ఏర్పడి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్పడ్డాయి. అందులో గర్భ సంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలు ఉదర భాగంలోనే ఉండిపోయాయి. ఇలాంటి వారు అన్ని అంశాల్లో మామూలుగానే ఉంటారు. హార్మోన్లు, పురుషాంగం, మీసాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు లోపలే ఉండి, వీర్య కణాలు ఉత్పత్తిగాక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. లాప్రో స్కోపిక్ శస్త్రచికిత్సతో.. ఈ వ్యక్తికి వైద్యులు చిన్నపాటి కోతతో కూడిన ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి.. గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలను కూడా తొలగించారు. సాధారణంగా 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా వృషణాలు లోపలే ఉండిపోతే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల వాటినీ తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇన్నేళ్లుగా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని.. కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్ల వయసుకు ముందే ఈ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వృషణాలను సాధారణ స్థితికి తెచ్చే అవకాశం ఉండేదని.. కానీ పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఇన్నేళ్లుగా సమస్యను గుర్తించలేకపోయారని వివరించారు. ఇలాంటి కేసులు అరుదని, ప్రపంచంలో ఇప్పటివరకు 300 కేసులు, దేశంలో 20 కేసులు మాత్రమే బయటికి వచ్చాయని తెలిపారు. -
రూపాయికే కార్పొరేట్ వైద్యం.. డాక్టర్ హర్షవర్ధన్ గొప్ప మనసు
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ అప్‌గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్‌కు ఆ ఆస్పత్రిలో సర్జన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి.. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్‌లో పెట్టిన సొంత క్లినిక్‌లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్‌లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు. మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్‌ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా. – వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్ ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్‌లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. -
ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా?
Surgeon Attempts To Sell Terrorist Victim's X-ray: ఇంతవరకు డాక్టర్లు పేషంట్లను మోసం చేసిన ఘటనలను చూశాం. అంతెందుకు ఎక్కువ మెడికల్ చార్జీలు మోపి రోగుల నడ్డి విరిచేసిన కథనాలను గురించి విన్నాం. కానీ ఇక్కడొక డాక్టర్ అత్యంత అమానుషంగా దాడిలో గాయపడిన బాధితుడి ఎక్స్ రేని అమ్ముకోవడానికి యత్నించాడు. అసలు విషయంలోకెళ్తే...పారిస్‌లోని బాటాక్లాన్ మ్యూజిక్ హాల్‌పై 2015లో జరిగిన ఉగ్రదాడుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అయితే పారిస్‌లోని జార్జెస్ పాంపిడౌ పబ్లిక్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫ్రెంచ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇమ్మాన్యుయేల్ మాస్మేజీన్ ఆ వ్యక్తి ఎక్స్‌రేని డిజిటల్ ఆర్ట్వర్క్గా అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చిత్రం కలాష్నికోవ్ బుల్లెట్‌ను కలిగి ఉన్న ముంజేయిని చూపిస్తుంది. అంతేందుకు ఎన్ఫ్టీ డిజిటల్ ఇమేజ్‌గా పిలవబడే ఆ ఎక్స్‌రే ఓపెన్ వెబ్సైట్ సూమరు రూ 2 లక్షలు పలుకుతుంది. అయితే ఆ సర్జన్ మాస్మేజీన్ చేసిన పనికి తగిన చర్యలు తీసుకున్నామని పారిస్ ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతి మార్టిన్ హిర్ష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు ఇది సర్జన్ వృత్తికి విరుద్ధమైన పని మాత్రమే కాదు, వైద్య గోప్యతకు భంగం కలిగించే నేరానికి మాస్మేజీన్ పాల్పడ్డాని అన్నారు. అయితే మాస్మేజీన్ తన నేరాన్ని అంగీకరించడమే కాక పేషంట్ అనుమతి లేకుండా చేసిన ఇలాంటి పని చేసినందుకు బాధపడుతున్నానని చెప్పాడు. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
వైద్యుడికి డబ్బులిచ్చి భార్యను చంపేందుకు యత్నం...ఐతే చివరికి..
రాజస్తాన్: ఇంతవరకు మనం చాలా రకాల హత్యా నేరాలు గురించి విన్నాం. అయితే వాటిలో చాలా మటుకు క్షణికావేశంలోనో లేక కక్ష్యతోనో చేసినవి. పైగా చాలా మటుకు హత్యా నేరాల్లో చంపేందుకు గూండాలకు లేక చిన్న చిన్న రౌడిలకో డబ్బులిచ్చి హత్యలు చేయడం గురించి విని ఉన్నాం. కానీ ఇక్కడోక వ్యక్తి తన భార్యను చంపమని డాక్టర్‌కి డబ్బులు ఇచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...రాజస్తాన్‌లో ఎస్‌ఆర్‌జి హాస్పిటల్‌లోని సర్జన్ అఖిలేష్ మీనా ఒక వ్యక్తి తన భార్యను చంపాలంటూ తన వద్దకు వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా డబ్బులు కూడా ఇచ్చాడని తెలిపారు. ఈ మేరకు గర్భవతి అయిన అతని భార్య చికిత్స నిమిత్తం తన వద్దకు వచ్చాడని డాక్టర్ చెప్పారు. పైగా తన భార్యను తన రెసిడెన్షియల్ ప్రాక్టీస్‌లోనే చంపాలంటూ అభ్యర్థించాడని పోలీసులకు తెలిపారు. అంతేగాక గత నాలుగైదు రోజుల నుంచి ఆ వ్యక్తి నుంచి తరుచుగా కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఝలావర్ సిటీ పోలీసులు మాట్లాడుతూ.."ఆ వ్యక్తిని పెదవా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మంగళ్ సింగ్‌గా గుర్తించాం. అతని పై కేసు నమోదు చేశాం". అని తెలిపారు. (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్య
-
బాలుకు ఏదైతే అవసరమో.. అదంతా చేశాం
వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని ఎస్.పి.బాలు వంటి నిత్య జీవన గాయకుడితో అలా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అటువంటి గాయకుడిని పోగొట్టుకునే సందర్భానికి సాక్షిగా మారడం సామాన్యమైన గుర్తు కాదు. బాలు వైద్యం తీసుకున్న చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేసిన లేప్రోస్కోపిక్–బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులను మరువలేక పోతున్నానన్నారు. ఆయన పంచుకున్న విషయాలు... ‘‘శశికుమార్ అని నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. ఒకరోజు అర్జంటుగా రమ్మని తను ఫోన్ చేస్తే వెళ్లాను. అక్కడ బాలు సార్, చరణ్ (బాలూ తనయుడు) వెయిట్ చేస్తున్నారని శశికుమార్ నాతో చెప్పలేదు. బాలూగారిని వ్యక్తిగతంగా నేను కలిసింది ఆ రోజునే. ఓ ఆరేళ్లు అయ్యుంటుంది. ఏదో చిన్న మెడికల్ ఇష్యూస్ చెబితే పరిష్కరించాం. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్’ ఇష్యూస్ ఉంటే నన్ను కలవమని చెప్పేవారు. నా ప్రతి బర్త్ డేకి ఒక వాయిస్ నోట్ పంపేవారు. ఏదైనా పాటలో రెండు లైన్లు పాడి, పంపేవారు. అది నాకు చాలా స్పెషల్. అంతకుముందే చరణ్ నాకు ఫ్రెండ్. కాకపోతే బాలూతో పరిచయం అయినది మాత్రం శశికుమార్ ద్వారానే.’’ ‘‘ఆగస్ట్ 3న రాత్రి 8 గంటల ప్రాంతంలో చరణ్ ఫోన్ చేసి, ‘నాన్నకు జ్వరం ఉంది’ అంటే ముందు మందులు ఇద్దామనుకున్నాను కానీ ఆ తర్వాత ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ చేస్తే మంచిదని చేశాం. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘హైరిస్క్‌లో ఉన్నారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండండి. ఏమీ సమస్య లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు’ అన్నాను.’’ ‘‘ఆయన ఎంత పెద్ద గాయకుడు అయినా అదేం చూపించేవారు కాదు. కాని నేను మాత్రం ఆయన గతంలో ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చినా స్పెషల్‌గా ట్రీట్ చేసేవాణ్ణి. ‘అలా ఏం వద్దు. వెయిట్ చేస్తాను. అందరిలానే నేను’ అనేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పేవారు. అంతే.. వెరీ డౌన్ టు ఎర్త్. అందరిలో ఒకడిగా ఉండాలనుకునేవారు.’’ ‘‘ముందు ఐసొలేషన్ రూమ్‌లోనే ఉంచాం. కానీ అడ్మిట్ అయిన మూడు రోజులకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మామూలు రూమ్‌లో ఉన్నప్పుడు ఆయన బుక్స్ చదివారు. టీవీ చూసేవారు. నెట్‌ఫ్లిక్స్ షోస్ చూసేవారు. కానీ శ్వాస సమస్య ఎక్కువయ్యాక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. బాలూగారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి, అందుకు అనుగుణంగా చికిత్సను ప్లాన్ చేశాం. ఎక్మో వెంటిలేటర్ మీదే చికిత్స జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులకు కాస్త కోలుకున్నారు. ఫుల్ కాన్షియస్లోకి వచ్చారు. అప్పుడు పదిరోజులకు ముందు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు చూపించారు చరణ్. కుడివైపు ఉండి చరణ్ చూపిస్తుంటే ఎడమ వైపుకి రమ్మన్నారు. కుడివైపు మెషీనులు ఉంటాయి కాబట్టి. అప్పుడే ఇళయరాజా మెసేజ్ చూశారు. ‘ఇటువైపు రా’ అన్నట్లు చరణ్‌ని చూసి, ఆయన సైగ చేశారు. చరణ్ ముందుకెళితే, ‘నువ్వు కాదు.. ఫోన్’ అన్నట్లు ఫోన్‌ని తన చేతిలోంచి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది చాలా టచింగ్ మూమెంట్. ఆయన హాస్పిటల్లో ఉన్న 52 రోజుల్లో నా కళ్లు చెమర్చిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.’’ ‘‘వీడియోలు, మెసేజ్‌లు మెంటల్లీ ఆయన్ను బూస్ట్ చేసేవి. గ్రాండ్ చిల్డ్రన్ పంపిన గ్రీటింగ్స్ చూపించేవాళ్లం. ఉదయం భక్తి పాటలు, ఆ తర్వాత ఆయన–ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన పాటలు, వేరే పాటలు వినిపించేవాళ్లం. అదంతా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిగారు, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి వచ్చినప్పుడు సార్ ముఖం బ్రైట్‌గా అయ్యేది. ఇక బాగా రికవర్ అయ్యారనుకున్నప్పుడు చివరి 48 గంటల్లో ఆయన ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.’’ ‘‘చికిత్సాకాలంలో సార్‌కి స్వల్పంగా ఇన్ఫెక్షన్ వస్తూ తగ్గుతుండేది. యాంటీ బయాటిక్స్ ఇచ్చేవాళ్లం. శుక్రవారం ఆయన చనిపోయారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇన్ఫెక్షన్ పెరగడం మొదలైంది. ఏ మందూ దాన్ని అరికట్టలేనంత వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. దాంతోపాటు బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది. ఆయనకు 74 ఏళ్లు. శరీరం తట్టుకోలేకపోయింది.’’ ‘‘చరణ్ నాకు అంతకుముందే మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడిగా, డాక్టర్‌గా రెండు రోల్స్ నావి. ఎక్మో ట్రీట్మెంట్లో ఏమైనా జరగొచ్చని ముందే చరణ్‌కి చెప్పాం. అయిన్నప్పటికీ బాగా రికవర్ అవుతున్న సమయంలో ఇలా జరగడం ఓ షాక్. లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఆయన్ను కాపాడగలిగి ఉండేవాళ్లమని కొంతమంది అన్నారు. ఎవరికేది ఇష్టం వస్తే అది రాశారు. కానీ మేం మాత్రం ఏం చేయాలో అంతా చేశాం. డాక్టర్స్ అందరం కలిసి ప్రతి రోజూ గడచిన 24 గంటల్లో ఏం జరిగింది? అనేది చర్చించేవాళ్లం. మధ్యాహ్నం చరణ్‌కి మొత్తం రిపోర్ట్ చెప్పేవాళ్లం. యూఎస్ డాక్టర్స్‌తో వీడియో కాల్ మాట్లాడేవాళ్లం. ఏదైతే అవసరమో అదే చేశారని అందరూ అన్నారు. మెడికల్ టీమ్, చరణ్ అండ్ ఫ్యామిలీ అవసరమైన దానికంటే అంతకంటే ఎక్కువే చేశామని నమ్ముతున్నారు. శుక్రవారం అంబులెన్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు నేను ‘షటాఫ్’. వేరే ఏ కేసులూ చూడకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధగా అనిపించింది. ఆయన పాట రూపంలో మన మధ్య ఉంటారు.’’ -
వైరల్ : ఆపరేషన్ థియేటర్లో కునుకు తీసిన డాక్టర్
బీజింగ్ : ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడికి చైనాలోని ఓ డాక్టర్ సాక్ష్యంగా నిలిచారు. విరామమే లేకుండా ఏకధాటిగా 10 ఆపరేషన్లు చేసి రోగుల పాలిట దేవుడయ్యాడు. ఇక పనిపట్ల అతని శ్రద్ధని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ అయింది. సౌత్ చైనాలోని లంగాంగ్ సెంట్రల్ హాస్పిటల్ (ఆర్థోపెడిక్)లో డాక్టర్ డైయూ అతని బృందం గత సోమవారం 13 గంటలపాటు పనిచేసి 10 ఆపరేషన్లు చేసింది. అయితే, డాక్టర్ డైయూ విరామమే లేకుండా పనిచేశాడు. ఉదయం 8 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టిన అతను సాయంత్రం అయిందింటి వరకు 7 ఆపరేషన్లు చేశాడు. అప్పటికీ అతను నిముషం కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఇక 8వ సర్జరీ సమయంలో పేషంట్‌కు అనస్థీషియా ఇవ్వడంలో కాస్త ఆలస్యమైంది. దాంతో డైయూకి ఓ 10 నిముషాలు సమయం దొరకడంతో థియేటర్లోని ఫ్లోర్‌పై ఓ మూలకు కూర్చుని కునుకు తీశాడు. డాక్టర్ వృత్తి ధర్మానికి ముగ్థుడైన సిబ్బందిలో ఒకరు అతను కునుకుతీస్తున్నప్పుడ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో డాక్టర్‌పై సేవలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెల్యూట్ సర్.. మీ సేవలకు కృతజ్ఞతలు అని ఒకరు, చైనా డాక్టర్లు ఎప్పుడూ బెస్టే అని మరొకరు కామెంట్లు చేశారు. ‘ఆస్పత్రి బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉన్నా. అయినా సరే.. డాక్టర్ డైయూని కలిసి థాంక్స్ చెప్పాలని ఉంది’అని ఓ పేషంట్ కామెంట్ చేశాడు. రోగులకు సత్వర చికిత్సను అందించడం తన కర్తవ్యమని డాక్టర్ డైయూ చెప్పడం విశేషం. -
పిచ్చి రాతల డాక్టర్
మనం కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు మన గుర్తుగా అక్కడున్న ఏదైనా రాళ్లపై కానీ చెట్టుపై కానీ మన పేర్లు రాసుకుంటాం. ఇది చాలా మంది చేసే పనే. అయితే ఈ అలవాటు డాక్టర్లకు ఉంటే..! ఏం చేస్తారు వాళ్లు కూడా ఏదైనా చెట్టునో రాయినో చూసుకుని పేరు రాసేస్తారని అనుకుంటున్నారా..? అయితే ఓ డాక్టర్ మాత్రం మీ అంచనాలను తలకిందులు చేసి ఓ రోగి కాలేయంపై పేరు రాసుకున్నాడు..! ఒక్కరిపై కాదు ఇద్దరు రోగుల కాలేయాలపై..! బ్రిటన్‌కు చెందిన సైమన్ బ్రమ్హాల్ ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు. 2013లో ఓ మహిళ, ఓ పురుషుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేశాడు. అంతటితో ఆగకుండా వారి కాలేయాలపై తన పేరును సంక్షిప్తంగా ‘ఎస్బీ’ అని రాసుకున్నాడు. ఆపరేషన్ చేసేటప్పుడు బ్లీడింగ్ జరగకుండా వాడే ఆర్గాన్ కాంతి కిరణాల ద్వారా ఈ పేరును రాసుకున్నాడు. తర్వాత ఆ మహిళకు మరో ఆపరేషన్ చేసిన ఇంకో డాక్టర్ ఈ విషయాన్ని గుర్తించడంతో బయటికి పొక్కింది. ఈ నేపథ్యంలో సైమన్‌పై కేసు నమోదు కావడంతో కోర్టు ముందు దోషిగా నిలుచున్నాడు.. -
90 ఏళ్ల డాక్టర్...67 ఏళ్ల ప్రాక్టీస్..
వయసు పైబడే కొద్దీ శరీర బలహీనతలు ఆవహించి చాలామంది ఇంటికి పరిమితమవుతారు. కొంతమంది అయితే కాస్త దూరం నడవాలన్నా చాలా ఆయాసపడతారు. అలాంటి వాళ్లందరికీ రష్యాలోని మాస్కోలో ఉన్న అల్లా ఇల్లించినా ఒక ఆదర్శం. ఎందుకంటే ఆమె వయసు ప్రస్తుతం దాదాపు 90 ఏళ్లకు చేరుకుంది. ఆ పెద్దావిడ ప్రస్తుతం మాస్కోలోని ఒక హాస్పిటల్లో సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పాకులాడే ఈ వయసులో ఆమె రోజుకు నాలుగు ఆపరేషన్లు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తోంది. 67 ఏళ్లుగా దాదాపు పది వేలకు పైగా శస్త్రచికిత్సలు చేసింది. డాక్టర్ అనేది వృత్తి కాదని.. అది ఒక జీవిత విధానమని చెప్పే అల్లా.. వృద్ధాప్యం మీద పడినప్పటికీ అలసిపోకుండా పనిచేస్తూ అంధుడైన తన మేనల్లుడితోపాటు 8 పిల్లులను సైతం పోషిస్తోంది. తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన ఒక ఎఫ్ఎం స్టేషన్ వారితో తాను రిటైర్ అయితే ఆపరేషన్లు ఎవరు చేస్తారు? అంటూ చమత్కరించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ సర్జన్‌గా తనను తాను ఆమె అభివర్ణించుకున్నారు. అన్ని రకాల ఆహారపదార్థాలు తినడం, ఎక్కువగా నవ్వడం, ఏడ్వడమే తన ఆరోగ్య రహస్యమని అల్లా బోసినవ్వులు చిందిస్తూ మురిసిపోయింది. -
సౌందర్యానికి మోకరిల్లినవాడు
కొన్ని పేర్లు మరింత మృదువుగా తోచడానికి కారణం, అవి నిజంగానే సుతిమెత్తగా ధ్వనించడమా? లేక, వాళ్ల జీవితం కొంతైనా తెలిశాక, కరిగిపోయిన మనలోపలి గరుకుదనం కారణమా? జాన్ కీట్స్‌ను తడుముతూవుంటే ‘పూర్ణంగా వికసించిన గులాబిపువ్వు’ను చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంది. ‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్. అందమైనది ఎప్పటికీ ఆనందమైనదే. దాని మనోహరత్వం పెరుగుతూనేవుంటుంది; అది ఎన్నటికీ శూన్యంలోకి గతించదు’. రొమాంటిక్ మూవ్‌మెంట్‌కు ప్రాతినిధ్యం వహించగలిగే వాక్యం ఇది. తర్కాలతో విసిగిపోయిన కాలంలో అనుభూతిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కీట్స్. అతడు సౌందర్యాన్ని ‘కంటితో’ ఎంతగా ‘తాగే’వాడంటే, తనకే ‘తెలియని వివశత్వంతో’ తల తూగిపోయేది. ‘సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం; ఇది తెలిస్తే ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు,’ అన్నాడు. పూబాలకుడి లాంటి కీట్స్ జీవితంలో ఎదలోకి దిగిన ముళ్లు కూడా ఉన్నాయి. అశ్వశాల నిర్వాహకుల ఇంట పుట్టాడు. సాహిత్య వాసన లేని కుటుంబం. కీట్స్‌కు పదేళ్లున్నప్పుడు తండ్రి గుర్రం మీంచి పడి చనిపోయాడు. మూడు నెలలకే తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తమ్ముడితోపాటు కీట్స్ అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. ఆమె దగ్గర ఆస్తిలేదు. ఉన్నది తగాదాల్లో ఉంది. అందువల్ల బంధువులు లేరు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన కీట్స్- మనుషులతో గొడవ పడేవాడు, కానీ పుస్తకాలతో స్నేహం చేసేవాడు. షేక్స్పియర్ ఎందుకు అంత గొప్పవాడయ్యాడో చాలా త్వరగా తెలుసుకున్నాడు. సర్జన్ కావాలని ఉండేది. కొంతకాలం శిక్షణ కూడా పొందాడు. ఒకవైపు పాఠం జరుగుతుంటే, గదిలో పరుచుకునే సూర్యకిరణాలవెంట ఊర్ధ్వలోకాల్లోకి ఎగిరిపోయేవాడు. తనలాంటివాడు శస్త్రచికిత్సలు చేయలేడని గ్రహించాడు. ఆలోచనలకన్నా సంవేదనలతో కూడిన జీవితాన్ని కోరుకున్నాడు. ‘ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు/ తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను/ అక్షరరూపంలో పుస్తకాలలోకి’ అనువదించబూనుకున్నాడు. ‘కవిత్వం ఆకులు చిగిర్చినంత సహజంగా రాకపోతే అది అసలు రాకపోవటమే మంచిది’ అన్నాడు. ‘మూఢులకు తమవైన స్వప్నాలుంటాయి; అందుకే వాళ్లు స్వర్గాన్ని (కూడా) ఒక వర్గం కోసమే నేస్తూవుంటారు’ అన్నాడు. అయితే, లండన్ పత్రికల్లో వచ్చిన సమీక్షలు అతడి మనసును గాయపరిచాయి. ఆ పరిస్థితుల్లో అతడికి పెద్ద ఊరట ఫానీ బ్రాన్. ‘కవిత్వపు రెక్కల’ మీద ఆమె దగ్గర వాలేవాడు. ‘దేహం చాలనంతగా’ ప్రేమించేవాడు. ‘ప్రేమ నా మతం. దానికోసం ప్రాణమైనా ఇస్తా’ అనేవాడు. కానీ ప్రాణాన్ని బలి కోరడానికి ప్రేమకేం పని? ఆ కర్కశ కార్యాన్ని మృత్యువు తలకెత్తుకుంది. క్షయవ్యాధి రూపంలో కీట్స్‌ను వెంటాడింది. ఏ ‘తియ్యటి పాపం’ చేయనివ్వకుండానే పూర్తిగా ఆక్రమించుకుంది. అదే క్షయతో తల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు తన వంతా? చలి, దగ్గు బాధిస్తున్నాయి. అనారోగ్యంతో పేదఖైదీలాగా బందీ అయ్యాడు. దుప్పటిమీద కక్కుకున్న రక్తపు చుక్కలు కాలుడు పంపిన హెచ్చరికల్లా తోస్తున్నాయి. ‘మరో జీవితమంటూ ఉందా? నేను మేల్కొన్నాక దీన్నంతా ఒక కలగా తెలుసుకుంటానా? (మరో జీవితం) ఉండేవుండాలి, (లేదంటే) ఇలాంటి యాతనల్ని భరించడం కోసమే మనం సృష్టించబడివుండం’. మద్యం ఆర్చేది కాదు, నల్లమందు తీర్చేదికాదు, ‘వృద్ధ దాదిలాంటి కాలం’ కూడా ఏ పరిష్కారమూ చూపించలేదు. అందుకే, నెగెటివ్ కేపబిలిటీ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నాడు కీట్స్. అనిశ్చితాలు, ద్వంద్వాలు, మర్మాలు, సందేహాలు ఎన్ని చుట్టుముట్టినా భరించగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ‘పోనివ్వని నిద్రలా మోపిన మృత్యువు బరువును’ ఓర్చుకున్నాడు. వీలైనంత త్వరగా మరణాన్ని తన్నుకుపోవడానికి ఆకాశంలోని గద్దలా కాచుకుని పడుకున్నాడు. ‘నేను త్వరగా నిశ్శబ్దపు సమాధిలోకి ఒరిగిపోవాలి... ఆ నెమ్మదైన సమాధికి దేవుడికి ధన్యవాదాలు... ఓ! నా మీద పరుచుకుంటున్న చల్లటి మట్టిని అనుభూతిస్తున్నాను... నా మీద డైసీ పువ్వులు పెరుగుతున్నాయి’. తన సమాధి ఫలకం మీద కీట్స్ ఇలా రాయాలని కోరుకున్నాడు: ‘ఇక్కడ నిద్రించేవారి పేరు నీటి మీద రాసిన రాత’. పాతికేళ్ల వయసులో(1795-1821) కీట్స్ శాశ్వతనిద్రలోకి జారుకున్న నేలలో పూసిన పూల గంధం విశ్వాన్ని చుట్టింది. ఆ సువాసనలను పీల్చినవాళ్లే భావకవులైనారు. ‘ఏడవకు, కళ్లు తుడుచుకో, ఈ పూవు మళ్లీ వచ్చే ఏడు పూస్తుంది’. - ఆర్.ఆర్.