ప్రపంచవ్యాప్తంగా మద్యపానం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మద్యపానం కారణంగా అనారోగ్యం బారినపడి మరణించినవారు కూడా ఉన్నారు. దీనికితోడు మద్యపానం కొన్నిరకాల క్యాన్సర్లకు కారణమవుతుందని కూడా వెల్లడయ్యింది. తాజాగా మద్యపానానికి సంబంధించిన ఒక ప్రకటన అమెరికాలో కలకలం రేపుతోంది.
మద్యపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణమని, అమెరికన్ వినియోగదారులు కొనుగోలు చేసే మద్యం బాటిళ్లలపై ‘మద్యపానం క్యాన్సర్‌కు కారకం’ అని ముద్రించాలని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రతిపాదించారు. ఈ దరిమిలా అమెరికన్, యూరోపియన్ మద్యం తయారీదారుల షేర్లు అమాంతం పడిపోయాయి. మద్యం సేవించడం మనిషి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి(Dr. Vivek Murthy) కనుగొన్నారు.
మద్యపానం కారణంగా ఏటా సుమారు 20 వేల మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారని, ఆల్కహాల్‌కు క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధం గురించి అమెరికన్లు తెలుసుకోవాలని డాక్టర్ వివేక్ మూర్తి పేర్కొన్నారు. గత దశాబ్దంలో అమెరికాలో నమోదైన సుమారు పది లక్షల క్యాన్సర్ కేసులకు మద్యం సేవించడం ప్రధాన కారణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని కంపెనీల వైన్, బీర్ బాటిళ్లపై ఇప్పటికే ఈ తరహా హెచ్చరిక లేబుల్స్ ఉన్నాయన్నారు. గర్భిణులు మద్యం సేవించడం వల్ల వారికి పుట్టే పిల్లలకు పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ మూర్తి హెచ్చరించారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆల్కహాల్ బాటిళ్లపై ఆరోగ్యానికి హానికరమంటూ ముద్రిస్తున్నాయి. దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్(Cancer) సంబంధిత హెచ్చరికను ముద్రిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లోనే ఆల్కహాల్ అనేది కాన్సర్‌కు కారకమని నిర్ధారించింది. క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేలా ఏ ఆల్కహాల్ కూడా ఉండదని పేర్కొంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పరిశోధకుల బృందం ప్రపంచంలోని నాలుగింట ఒక వంతు దేశాలు మాత్రమే ఆల్కహాల్‌పై ఆరోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్నయని పేర్కొంది. క్యాన్సర్ హెచ్చరికలు చాలా అరుదుగా ఉంటున్నాయని ఆ బృందం తెలిపింది.
దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్‌కు సంబంధించిన హెచ్చరిక కనిపిస్తుంది. 2016లో దక్షిణ కొరియా(South Korea) ఈ హెచ్చరికల లేబుల్ ముద్రించడాన్ని తప్పనిసరి చేసింది. ఐర్లాండ్‌లోనూ మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలు కనిపిస్తాయి. ఈ హెచ్చరికలను తప్పనిసరి చేసిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది. నార్వే ఇప్పటికే ఆల్కహాల్ వినియోగాన్ని చాలావరకూ నియంత్రించింది. ఇప్పుడు మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలను ముద్రింపజేయాలనే ప్రతిపాదన చేసింది. ఇదేవిధంగా ‘ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి’ లాంటి హెచ్చరికలను మద్యం బాటిళ్లపై ముద్రించాలని థాయిలాండ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని మద్యం పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.
కెనడా ఆల్కహాల్‌పై క్యాన్సర్ హెచ్చరికలను తప్పనిసరి చేయనప్పటికీ, 2022లో కెనడియన్ పార్లమెంట్‌లో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. కెనడాలోని పరిశోధకుల బృందం 2017లో క్యాన్సర్‌ను హెచ్చరిక లేబుల్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆల్కహాల్ ట్రేడ్ గ్రూపుల ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం ఈ అధ్యయనాన్ని విరమింపజేయాలని కోరింది.
ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు?
Comments
Please login to add a commentAdd a comment