గుండె, ఊపిరితిత్తులు, కిడ్ని మాదిరిగి గర్భాశయం మార్పిడి. ఇక భవిష్యత్తులో వేలాదిమంది మహిళలు గర్భాశయం మార్పిడి చేయించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అమ్మను కాలేనని బాధపడుతున్న వారకి ఇదొక వరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగతా అవయవాల మాదిరిగా ఇది సర్వసాధారంణం కావొచ్చు అంటున్నారు. అంతేగాదు ఆ స్థాయికి చేరుకోవడానికి కేవలం ఐదేళ్లు మాత్రమే పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాలో విజయవంతంగా గర్భశయ మార్పిడి నిర్వహించిన వైద్యం బృందంలోని ఓ వైద్యుడు టొమ్మసో ఫాల్కోన్ మాట్లాడుతూ..తాము గర్భాశయాన్ని ఇచ్చే దాతల్లో ప్రమాదాన్ని తగ్గించడమే గాక గ్రహీతల్లో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ఈ అరుదైన శస్త్రచికిత్సలో మంచి పురోగతి సాధించామని చెప్పారు.
ఇలాంటి ఆపరేషన్‌లో మరింత స్థాయిలో సక్సెస్‌ని సాధించగలమని అన్నారు. ఈ గర్భాశయ మార్పిడి అనేది గుండె, ఊపరితిత్తుల మార్పిడిలాంటిదే గానీ వాటిన్నీటికంటే ఈ శస్త్ర చికిత్స మరింత క్లిషమైన ప్రక్రియ అని అన్నారు. ఇందులోని రెండు దశలు గంటలతరబడి చేయాల్సిన ఆపరేషన్లని అన్నారు. మరణించి ఉన్నా లేదా జీవించి ఉన్నవారి నుంచి ఈ మార్పిడి ప్రక్రియ అనేది సాధ్యమేనని అన్నారు. కాగా, యూఎస్‌లో మరణించిన దాత నుంచి మార్పిడి జరిగిన మహిళ తదనంతరం ప్రసవించడంతో మరింత పురోగతి సాధించినట్లయింది. 2013లో జరిగిన తొలి గర్భాశయం మార్పిడి నంచి వైద్య నిపుణలు మరింతగా పురోగతి సాధించారు. అలాగే అవయవాన్ని తొలగించే విధానాన్ని మరింతగ మెరుగుపరిచి, ప్రమాదాలను నివారించేలా రోబోటిక్‌గా చేసేలా పరిశోధనలు చేస్తున్నట్లు వైద్య బృందం పేర్కొంది. పైగా 10 గంటల ఆపరేషన్ సమయాన్ని సగానికి తగ్గించే యత్నం కూడా చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో గర్భాశయ మార్పిడి జరిగిన అమండా గ్రుండెల్ తన గురించి వివరిస్తూ.. ఆమె కుమార్తె గ్రేస్‌కు 2021లో క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో జన్మనిచ్చింది. 17 ఏళ్ల వయసులో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే.. ఒకవిధమైన పుట్టకతో వచ్చే రుగ్మతతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. తానెప్పుడూ "మామ్" అని పిలుపించుకోలేనని చాలా బాధపడ్డాను. గర్భాశయ మార్పిడి ట్రయల్స్ గురించి వైద్యుల ద్వారా తెలుసకుని.. అందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. నిజానికి ఈ మార్పిడి పనిచేయకపోవచ్చ అని కూడా తెలుసు. కానీ ఇలాంటి అధునాతన వైద్యంలో భాగమై తనలాంటి వాళ్లకు ఏదో రకంగా తల్లి అయ్యే మార్గం దొరికితే చాలు అని కోరుకున్నాని గ్రుండెల్ చెబుతోంది.
ఈ శస్త్ర చికిత్స సక్సస్ అయ్యి గర్భవతిని అవుతానని అనుకోలేదు..ఇలా బిడ్డ చేత మామ్ అని పిలుపించుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది. తాను ఇప్పుడు రెండో బిడ్డ కోసం యత్నిస్తున్నట్లు కూడా చెప్పింది. క్యాన్సర్ వంటి ఇతర పరిస్థితుల వల్ల గర్భాశయం కోల్పోయిన మహిళలకు ఈ మార్పిడి ఆపరేషన్ ఒక గొప్ప వరం అని అంటోంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ మార్పిడి చేయించుకున్న చాలా మంది మహిళలు గర్భవతులయ్యారని, దాదాపు 90 మంది పిల్లలకు జన్మంచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.
(చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..)
Comments
Please login to add a commentAdd a comment