womb transplant
-
"అమ్మ" అనే పిలుపు కోసం పరితపించే వాళ్లకి అది గొప్ప వరం!
గుండె, ఊపిరితిత్తులు, కిడ్ని మాదిరిగి గర్భాశయం మార్పిడి. ఇక భవిష్యత్తులో వేలాదిమంది మహిళలు గర్భాశయం మార్పిడి చేయించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అమ్మను కాలేనని బాధపడుతున్న వారకి ఇదొక వరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగతా అవయవాల మాదిరిగా ఇది సర్వసాధారంణం కావొచ్చు అంటున్నారు. అంతేగాదు ఆ స్థాయికి చేరుకోవడానికి కేవలం ఐదేళ్లు మాత్రమే పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాలో విజయవంతంగా గర్భశయ మార్పిడి నిర్వహించిన వైద్యం బృందంలోని ఓ వైద్యుడు టొమ్మసో ఫాల్కోన్ మాట్లాడుతూ..తాము గర్భాశయాన్ని ఇచ్చే దాతల్లో ప్రమాదాన్ని తగ్గించడమే గాక గ్రహీతల్లో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ఈ అరుదైన శస్త్రచికిత్సలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఇలాంటి ఆపరేషన్‌లో మరింత స్థాయిలో సక్సెస్‌ని సాధించగలమని అన్నారు. ఈ గర్భాశయ మార్పిడి అనేది గుండె, ఊపరితిత్తుల మార్పిడిలాంటిదే గానీ వాటిన్నీటికంటే ఈ శస్త్ర చికిత్స మరింత క్లిషమైన ప్రక్రియ అని అన్నారు. ఇందులోని రెండు దశలు గంటలతరబడి చేయాల్సిన ఆపరేషన్లని అన్నారు. మరణించి ఉన్నా లేదా జీవించి ఉన్నవారి నుంచి ఈ మార్పిడి ప్రక్రియ అనేది సాధ్యమేనని అన్నారు. కాగా, యూఎస్‌లో మరణించిన దాత నుంచి మార్పిడి జరిగిన మహిళ తదనంతరం ప్రసవించడంతో మరింత పురోగతి సాధించినట్లయింది. 2013లో జరిగిన తొలి గర్భాశయం మార్పిడి నంచి వైద్య నిపుణలు మరింతగా పురోగతి సాధించారు. అలాగే అవయవాన్ని తొలగించే విధానాన్ని మరింతగ మెరుగుపరిచి, ప్రమాదాలను నివారించేలా రోబోటిక్‌గా చేసేలా పరిశోధనలు చేస్తున్నట్లు వైద్య బృందం పేర్కొంది. పైగా 10 గంటల ఆపరేషన్ సమయాన్ని సగానికి తగ్గించే యత్నం కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గర్భాశయ మార్పిడి జరిగిన అమండా గ్రుండెల్ తన గురించి వివరిస్తూ.. ఆమె కుమార్తె గ్రేస్‌కు 2021లో క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో జన్మనిచ్చింది. 17 ఏళ్ల వయసులో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే.. ఒకవిధమైన పుట్టకతో వచ్చే రుగ్మతతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. తానెప్పుడూ "మామ్" అని పిలుపించుకోలేనని చాలా బాధపడ్డాను. గర్భాశయ మార్పిడి ట్రయల్స్ గురించి వైద్యుల ద్వారా తెలుసకుని.. అందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. నిజానికి ఈ మార్పిడి పనిచేయకపోవచ్చ అని కూడా తెలుసు. కానీ ఇలాంటి అధునాతన వైద్యంలో భాగమై తనలాంటి వాళ్లకు ఏదో రకంగా తల్లి అయ్యే మార్గం దొరికితే చాలు అని కోరుకున్నాని గ్రుండెల్ చెబుతోంది. ఈ శస్త్ర చికిత్స సక్సస్ అయ్యి గర్భవతిని అవుతానని అనుకోలేదు..ఇలా బిడ్డ చేత మామ్ అని పిలుపించుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది. తాను ఇప్పుడు రెండో బిడ్డ కోసం యత్నిస్తున్నట్లు కూడా చెప్పింది. క్యాన్సర్ వంటి ఇతర పరిస్థితుల వల్ల గర్భాశయం కోల్పోయిన మహిళలకు ఈ మార్పిడి ఆపరేషన్ ఒక గొప్ప వరం అని అంటోంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ మార్పిడి చేయించుకున్న చాలా మంది మహిళలు గర్భవతులయ్యారని, దాదాపు 90 మంది పిల్లలకు జన్మంచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ఏం డాక్లర్లయ్యా సామీ! గర్భసంచి ఆపరేషన్ చేయమంటే.. మూత్రనాళం కోసి
అనంతపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అనే చందంగా మారింది గుంతకల్లు రైల్వే ఆస్పత్రి వైద్యుల తీరు. గర్భసంచి తొలగించాలంటూ శస్త్ర చికిత్స చేపట్టిన వైద్యులు.. ఏకంగా రోగి మూత్రనాళాన్నే కత్తిరించి పరిస్థితిని మరింత జఠిలం చేసిన వైనం సంచలనం రేకెత్తించింది. వివరాలు.. గుంతకల్లుకు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం రైల్వే ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగించాలని సూచించి శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. అయితే గర్బసంచి తొలగించే క్రమంలో మూత్ర విసర్జన నాళాన్ని కట్ చేశారు. ఫలితంగా ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో చేతులెత్తిసిన వైద్యులు వెంటనే ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఘటనపై రైల్వే ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గజలక్ష్మీ ప్రభావతి వివరణ కోసం ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు. కాగా, గత నెల 8వ తేదీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న పరిమళ ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకనే మరో దారుణం వెలుగు చూడడంతో రైల్వే ఆస్పత్రికి వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. చిన్నపాటి కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ను దాదాపు 8 గంటల పాటు చేసి, చివరకు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురానికి తరలిస్తుండగా పరిమళ మృతి చెందింది. -
పిల్లలు లేని వారికి శుభవార్త!
పారిస్: అమ్మదనానికి నోచుకోలేని స్త్రీలు అనుభవించే బాధ వర్ణనాతీతం. కొందరు స్త్రీలు పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుడితే.. మరికొందరు పెరుగుతున్న క్రమంలో గర్భసంచిని కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి వారికి గర్భసంచి మార్పిడి చేయించుకోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భసంచి దానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, ప్రస్తుతం గర్భసంచి దానం చేసేందుకు సంబంధిత మహిళ కుటుంబసభ్యులకే అవకాశం ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే బ్రెజిల్‌కు చెందిన వైద్యులు మరణించిన ఓ మహిళ గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. పుట్టుకతోనే గర్భసంచి లేదు.. బ్రెజిల్‌కు చెందిన 32 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. దీంతో ‘మేయర్ రోకీటాన్స్కీ కస్టర్ హైసర్’అనే సిండ్రోమ్‌కు గురైంది. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో 2016 సెప్టెంబర్‌లో గర్భసంచి మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మరణించిన ఓ 45 ఏళ్ల మహిళ గర్భసంచిని ట్రాన్స్‌ప్లాంట్ కోసం సిద్ధం చేశారు. సుమారు 10 గంటలు శ్రమించి ఆమెకు గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఐదు నెలల తర్వాత ఆమె గర్భసంచిని పరీక్షించిన వైద్యులకు దుష్ప్రభావాలు కనిపించలేదు. నెలసరి కూడా రెగ్యులర్ అవుతుండటంతో సర్జరీ అయిన 7 నెలలకే ఆమె గర్భసంచిలోకి ఫలదీకరణం చెందిన అండాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం 10 రోజులకు ఆమె గర్భం ధరించినట్లు తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా 2017 డిసెంబర్లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె నుంచి గర్భసంచిని తొలగించారు. -
చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి.. ఆపరేషన్ సక్సెస్!
అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో వైద్య శాస్తంలో చోటు చేసుకున్న మార్పులు మాతృత్వం పొందలేని మహిళలకు సంతాన భాగ్యాన్ని కల్పిస్తున్నాయి. సరోగసి, గర్భసంచి మార్పిడి పద్ధతుల ద్వారా ఎంతో మందికి తల్లులుగా మారే అవకాశం లభిస్తోంది. అయితే ఇప్పటివరకు బతికి ఉన్న మహిళల నుంచి సేకరించిన గర్భసంచిని అవసరమైన మహిళలకు అమర్చడం ద్వారా వైద్యులు విజయం సాధించారు. ఇలాంటి కొన్ని కేసుల్లో బిడ్డ పుట్టగానే మరణించడమో, లేదా గర్భంలోనే చనిపోవడమో జరిగేది. ఈ క్రమంలో ఇటువంటి సమస్యలను అధిగమించడంతో పాటుగా... చనిపోయిన మహిళ నుంచి సేకరించిన గర్భసంచిని ఓ మహిళకు అమర్చి విజయం సాధించారు బ్రెజిల్ వైద్యులు. ఆమెకు జన్మించిన బిడ్డకు ప్రస్తుతం ఏడాది వయసు నిండటంతో పాటు.. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని.. వైద్య చరిత్రలోనే ఇది ఓ కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని ‘ద లాన్సెట్ మెడికల్ జర్నల్’ ప్రచురించింది. పుట్టుకతోనే గర్భసంచి లేదు.. జన్యు లోపం కారణంగా ఓ మహిళకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. 4500 మందిలో ఒకరికి వచ్చే మేయర్-రాకిటాన్స్‌కీ-కస్టర్- హాసర్ అనే సిండ్రోమ్ కారణంగా ఆమెకు తల్లి అయ్యే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె వైద్యులను సంప్రదించారు. గర్భసంచి మార్పిడి చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో చనిపోయిన 40 ఏళ్ల మహిళ నుంచి గర్భసంచిని సేకరించి 2016లో సదరు మహిళకు అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆమెకు రుతుస్రావం మొదలైంది. ఈ క్రమంలో 2017లో గర్భం దాల్చిన ఆమె అదే ఏడాది డిసెంబరు 15న ఆడ శిశువుకు(సిజేరియన్ సెక్షన్) జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ శిశువు ప్రస్తుతం ఏడున్నర కిలోల బరువు పెరిగిందని..పూర్తి ఆరోగ్యంతో ఉందని జర్నల్ పేర్కొంది. ఇది నిజంగా అద్భుతం.. చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి ద్వారా జన్మించిన బిడ్డ ఆరోగ్యంగా ఉండటం వైద్య చరిత్రలో చోటు చేసుకున్న గొప్ప పరిణామమని సావో పౌలో యూనివర్సిటీ హాస్పటల్ డాక్టర్ డానీ ఈజెన్‌బర్గ్ పేర్కొన్నారు. తాము నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో చనిపోయిన తర్వాత గర్భసంచిని దానం చేసే దాతల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా గతంలో అమెరికాలో ఇటువంటి ఆపరేషన్లు చేపట్టిన వైద్యులు విఫలమయ్యారు. చనిపోయిన మహిళల గర్భసంచి అమర్చడం ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం లభించినా పుట్టిన శిశువులంతా మరణించారు. ఇక గర్భసంచి మార్పిడుల ద్వారా మహిళలకు సంతానం పొందే అవకాశం విదేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆసియాలోనే తొలిసారిగా గర్భసంచి మార్పిడి అనంతరం ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన చికిత్స ఈ ఏడాది పుణేలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రిలో జరిగింది. అది కూడా తల్లి ఏ గర్భసంచి నుంచి జన్మించిందో.. బిడ్డ కూడా అదే గర్భసంచి నుంచి జన్మించడం విశేషం. -
తల్లి జన్మించిన గర్భసంచి నుంచే బిడ్డ కూడా..
పుణె: దేశ వైద్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఆసియాలోనే తొలిసారిగా గర్భసంచి మార్పిడి అనంతరం ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన చికిత్స పుణేలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రిలో జరిగింది. అది కూడా తల్లి ఏ గర్భసంచి నుంచి జన్మించిందో.. బిడ్డ కూడా అదే గర్భసంచి నుంచి జన్మించడం ఇక్కడ విశేషం. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మీనాక్షికి గర్భసంచి లేకపోవడం వల్ల ఆమె పిల్లల్ని కనలేకపోయారు. దీంతో తల్లి కావాలనే ఆమె కోరిక తీరాలంటే.. గర్భసంచి తప్పనిసరి అయింది. ఈ సమయంలో ఆమె తల్లి గర్భసంచి దానానికి ముందుకు వచ్చారు. దీంతో మీనాక్షి తల్లి కావడానికి మార్గం సుగమమైంది. తొమ్మిది గంటలపాటు అరుదైన శస్త్ర చికిత్స చేసిన పుణెలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రి వైద్యులు మీనాక్షి తల్లి గర్భసంచిని ఆమెకు అమర్చారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు మీనాక్షిని వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందించారు. మీనాక్షి పరిస్థితి మెరుగుపడ్డాక ఆమెను గుజరాత్‌కు పంపించారు. ఈ ఏడాది మార్చిలో గర్భం దాల్చిన తర్వాత మీనాక్షి తిరిగి గెలాక్సీ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యులు ఆమెకు తగిన చికిత్స అందజేశారు. ఆ తర్వాత 32 వారాల 5 రోజులకు ఆమె సీజేరియన్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ అరుదైన చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలోని వైద్య బృందం దీనిపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చికిత్స విజయంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని.. ఈ శస్త్ర చికిత్స దేశ వైద్య చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. చదవండి: గర్భసంచి మార్పిడి.. దేశంలోనే తొలిసారి! -
కన్నకూతురికి 'అమ్మ'దనమే బహుమతి!
తల్లి కావడం ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం. కానీ అసలు గర్భసంచి అన్నదే లేకుండా పుట్టిన ఓ యువతికి కూడా బిడ్డలను కనాలని చాలా బలమైన కోరిక ఉంది. దాన్ని తీర్చడానికి స్వయంగా ఆమె తల్లే కదిలొచ్చింది. 21 ఏళ్ల వయసున్న కూతురికి తన గర్భసంచిని దానం చేసేందుకు 43 ఏళ్ల తల్లి అంగీకరించింది. తద్వారా ఆమె కూడా తనలాగే తల్లి కావడానికి మార్గం సుగమం చేసింది. ఇలా ఇద్దరూ సరేననడంతో భారతదేశ వైద్య చరిత్రలోనే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పుణెలో దేశంలోనే మొట్టమొదటి సారిగా గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పటివరకు చాలాసార్లు గుండెలను కూడా మార్చిన వైద్యులు.. గర్భసంచిని మార్చడం మాత్రం ఇదే తొలిసారి. పుణెలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్స చేసింది. ఈ ఆపరేషన్‌కు మొత్తం తొమ్మిదిన్నర గంటలు పట్టిందని డాక్టర్ శైలేష్ చెప్పారు. గర్భసంచికి చాలా పెద్ద సంఖ్యలో పెద్ద రక్తనాళాలు కలిసి ఉంటాయని, అలాగే చిన్న చిన్న నరాలు కూడా ఉంటాయని, వాటన్నింటినీ కొత్తగా గర్భసంచికి కలపడం సాంకేతికంగా చాలా కష్టమని ఆయన వివరించారు. శస్త్రచికిత్స పూర్తయినా.. కొత్త గర్భసంచి శరీరానికి అలవాటు పడేందుకు ఒక ఏడాది పాటు వేచి చూడాలని, ఆ తర్వాతే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చేందుకు ప్రయత్నం చేయాలని తెలిపారు. ఇంతకుముందు ఎక్కడ.. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్వీడన్లో ఈ తరహా శస్త్రచికిత్స జరిగింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌లో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మాట్స్ బ్రాన్‌స్ట్రామ్ నేతృత్వంలో ఈ చికిత్సలు చేశారు. ఇలాంటి చికిత్సల ద్వారా ఇప్పటివరకు కేవలం ఆరుగురు పిల్లలే పుట్టారు. వారిలో ఇద్దరు ఒకే తల్లికి పుట్టినవారు. నిజానికి ఈ బృందం మొదట చేసిన 11 శస్త్రచికిత్సలు విఫలమయ్యాయి. ఆ తర్వాత 2014లో చేసిన మార్పిడి విజయవంతం అయ్యింది. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టింది. స్వీడిష్ బృందం చేసిన శస్త్రచికిత్సల ద్వారానే మిగిలిన ఐదుగురు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పుడతారా? దేశంలో తొలిసారి జరిగిన గర్భసంచి మార్పిడి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందన్నది మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది. తల్లి కావాలన్న ఆ మహిళ కలలను నిజం చేయడం తమ బాధ్యత అని, దాన్ని నెరవేర్చడానికి తమ శాయశక్తులా కృషి చేశామని డాక్టర్ శైలేష్ చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా చేసిన ఈ శస్త్రచికిత్స ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రొసీజర్ చాలా సంక్లిష్టమైనది కావడంతో ఇవి ఎంతవరకు విజయవంతం అవుతాయన్నది అనుమానమే. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయత్నం కాగా, ప్రపంచంలోనే 30వది. ఇప్పటివరకు అమెరికా, బ్రెజిల్, స్వీడన్, చైనా, జర్మనీ, సెర్బియా, చెక్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి గానీ ఒక్క స్వీడన్లోనే ఇంతవరకు విజయవంతం అయ్యాయి.