future
-
ట్రేడింగ్‌లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్: ఏది బెస్ట్ అంటే..
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఈమధ్య ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గం ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ). వీటినే డెరివేటివ్స్ అంటారు. ఈక్విటీలకు మరో ప్రత్యామ్నాయ రూపమే ఈ డెరివేటివ్స్ అన్నమాట. ఈ రెండిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఫ్యూచర్స్ ట్రేడింగ్▸ఈక్విటీల్లో షేర్లు ఎలా కొంటామో ఫ్యూచర్స్‌లోనూ అదే మాదిరి కొనుక్కోవచ్చు. ▸ఈక్విటీల్లో ఒక్క షేర్ సైతం కొనుక్కునే వెసులుబాటు ఉంటే ఫ్యూచర్స్‌లో మాత్రం తప్పనిసరిగా ఒక లాట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ▸ఆయా కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ధరలను బట్టి లాట్ పరిమాణం నిర్ణయమవుతుంది.▸గతంలో ఫ్యూచర్స్‌లో షేర్లు కొనేటప్పుడు అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యేది. కానీ నిబంధనలు మారిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుబడి అవసరమవుతోంది.ఉదా: రిలయన్స్ షేర్లు ఫ్యూచర్స్‌లో కొనాలని అనుకున్నాం. లాట్ సైజు 500. ఇంతే మొత్తం షేర్లను ఈక్విటీల్లో కొనాలంటే రూ. 6,25,000 కావాలి. అదే ఫ్యూచర్స్‌లో అయితే రూ.1,10,836 సరిపోతుంది.▸ఈక్విటీలు, ఫ్యూచర్స్కి తేడా ఏమిటంటే.. ఈక్విటీల రూపంలో కొన్న షేర్లు మనం ఎన్నాళ్లయినా మన దగ్గర ఉంచుకోవచ్చు. ▸అవి ఒక రకంగా పెట్టుబడి. షేర్ ధర పడిపోయినా ఆందోళన చెందనక్కర్లేదు.▸డబ్బులు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు ధర పడినా/పెరిగినా మరిన్ని షేర్లు కొనుక్కుంటూ మన పోర్ట్‌ఫోలియోను పెంచుకోవచ్చు. మంచి లాభాలు వచ్చేవరకూ ఎన్నాళ్లయినా ఎదురుచూడొచ్చు.▸ఫ్యూచర్స్‌లో ఈ వెసులుబాటు ఉండదు. ఫ్యూచర్స్‌లో కొనే షేర్లను కాంట్రాక్టులుగా పరిగణిస్తారు. ఆ కాంట్రాక్టు నెల రోజుల వ్యవధికే పరిమితమవుతుంది. ▸దీన్ని పెట్టుబడిగా కాక స్వల్పకాలిక ట్రేడింగ్ వనరుగా మాత్రమే పరిగణించాలి.▸నెల రోజుల వ్యవధిలో కాంట్రాక్టు ధర ఎప్పుడు పెరిగినా తగిన ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలి.▸కాంట్రాక్టు ధర పడిపోతే మళ్ళీ పెరిగే వరకు అంటే ఆ నెల చివరిదాకా కూడా ఆగొచ్చు. అప్పటికీ పెరక్కపోతే అమ్ముకుని నష్టాన్ని బుక్ చేయాల్సిందే.▸ప్రస్తుతానికి పడినా.. మళ్ళీ పెరుగుతుందనే నమ్మకం ఉంటే నెలాఖరులో ప్రస్తుత కాంట్రాక్టు వదిలించుకుని తరువాతి నెల కాంట్రాక్టు తీసుకోవచ్చు. ఆ నెలలో కూడా కొన్న రేటు రాక ఇంకా పడిపోతే.. మరింత నష్టాన్ని భరించక తప్పదు. లేదంటే ఆ తరవాతి నెలకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.▸ఇది కాంట్రాక్టు కాబట్టి మొత్తం డబ్బులు పెట్టక్కర్లేకుండా నాలుగో వంతు ధరకే కొనుక్కునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న రిలయన్స్ ఉదాహరణ చూడండి. ఎక్కువమంది స్వల్పకాలిక అవసరాలు, తక్కువ పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.ఆప్షన్స్ ట్రేడింగ్ఈక్విటీలకు మరో డెరివేటివ్ రూపమే ఆప్షన్స్. ఫ్యూచర్స్‌తో పోలిస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడికి ట్రేడింగ్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. అందుకే ట్రేడర్లలో నూటికి 90 మంది ఈ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ 90లో 85 మంది నష్టపోయేవాళ్లే. డబ్బుల సంపాదనకు చాలా సులువైన మార్గంగా కనిపించే ఈ ఆప్షన్స్ అనేవి రిటైల్ ట్రేడర్ల కోట్ల సొమ్ము మింగేస్తున్నాయి. అదెలాగో తర్వాత తెలుసుకుందాం.➜ఆప్షన్స్‌లోనూ ఫ్యూచర్స్ మాదిరిగానే, అదే పరిమాణంలో లాట్లలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా నెలవారీ కాంట్రాక్టుల్లోనే చేయాలి. ఆప్షన్స్‌లో కొనేవాటికి ప్రీమియం ఉంటుంది. ఆ రేటు పెట్టి కొనుక్కోవచ్చు.దీనికి కూడా పై ఉదాహరణనే పరిశీలిద్దాం.రిలయన్స్ షేర్లు (500) ఈక్విటీల్లో కొంటే.. రూ. 6,25,000 అవసరమవుతాయి. ఫ్యూచర్స్‌లో కొంటే రూ. 1,10,000 కావాలి. ఆప్షన్స్‌లో రూ.1250 కాల్ రూ. 27 ఉంది. పెట్టుబడి 27X500 = 13,500 ఉంటే చాలు.అందరూ ఎగబడేది ఇందుకోసమే. ఇంత తక్కువ పెట్టుబడితో కూడా ట్రేడ్ చేసుకునే సదుపాయం ఆప్షన్స్‌లో ఉంటుంది. షేర్ ధర మారే దాన్ని బట్టి ఈ ప్రీమియం లోనూ మార్పులు జరుగుతాయి.రిలయన్స్ షేర్ ధర ప్రస్తుతం రూ.1,250 వద్ద ఉంది. కాబట్టి రూ.1,250 కాంట్రాక్టు కొన్నాం అనుకుందాం. షేర్ ధర కేవలం 2,3 రోజుల వ్యవధిలోనే రూ. 1,300 కి వెళ్తే ప్రీమియం కూడా దాదాపు రూ. 40 దాకా పెరుగుతుంది. అంటే అదంతా మీకొచ్చే లాభమేనన్న మాట. రూ.40X500 = రూ.20,000. కేవలం రూ. 13,500 పెట్టుబడితో రెండే రెండు రోజుల్లో రూ.20,000 సంపాదించినట్లు అవుతుంది. ఈ షేర్ ధర ఎంత పెరుగుతూ ఉంటే ప్రీమియం కూడా అంత పెరుగుతూ ఆమేరకు లాభాలను అందిస్తూ ఉంటుంది. అదే షేర్ ధర 50 రూపాయలు పెరిగినప్పటికీ... అలా పెరగడానికి పట్టే కాలం ఎక్కువగా ఉంటే... వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాం.➜ట్రేడర్లలో అత్యధికులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్ని.. అది కూడా కేవలం స్వల్ప వ్యవధిలోనే సంపాదించేయాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.➜మార్కెట్ పడుతున్నా.. షేర్ ధర క్షీణిస్తున్నా కూడా ఆప్షన్స్‌లో లాభాలు సంపాదించవచ్చు. ➜ఆప్షన్స్‌లో మనకొచ్చే లాభాలు అపరిమితం. ఒక్కోసారి కేవలం రూ. 5,000 పెట్టుబడి కూడా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అయిపోవచ్చు. నష్టం వస్తే మాత్రం పోయేది ఆ రూ. 5,000 మాత్రమే. ఇదేదో బానే ఉంది.. బాగా సంపాదించేయవచ్చు అనుకుంటున్నారు కదూ. లక్షలు లక్షలు ఊరికే వచ్చేయవు. ఇందులో వచ్చే దానికంటే పోయేదే ఎక్కువ ఉంటుంది.ఎందుకలా జరుగుతుంది.. షేర్ ధర పెరిగినా ఆప్షన్స్ ఎందుకు పడిపోతాయి. మన పెట్టుబడి ఎందుకు సున్నా అయిపోతుంది... ఆప్షన్స్‌లో కాల్స్, పుట్స్ పాత్ర ఏమిటి.. ఆప్షన్స్‌లో ఉండే 'ఆప్షన్స్' ఏమిటి.. వంటి విషయాలను కూలంకషంగా తదుపరి కథనంలో తెలుసుకుందాం. -బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
హైదరాబాద్‌లోనే ఎక్కువ..! సూపర్ పవర్!
సాక్షి, సిటీబ్యూరో: ‘మీర్ఖాన్పేట కేంద్రంగా ఏర్పాటు చేయదలిచిన ఫ్యూచర్/ఫోర్త్‌సిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఫార్మా, ఐటీ అనుబంధ సంస్థలు అనేకం ఇక్కడికి రాబోతున్నాయి. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని నిర్ణయించాం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయబోతున్నాం. లైన్లను విస్తరించడంతో పాటు డిమాండ్ తట్టుకునే విధంగా కొత్త సబ్స్టేషన్లు, అదనపు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయబోతున్నాం. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.. ఏటా 30 నుంచి 40 శాతం గ్రోత్.. సాధారణంగా ప్రతి ఏటా విద్యుత్ గ్రోత్ రేటు ఏడు శాతం నమోదవుతుంది. కానీ ఈసారి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. రూరల్ ఏరియాలో గ్రోత్‌రేట్ ఏడు శాతం ఉంటే, నగరంలో 30 శాతం, నగర శివారు మున్సిపాలిటీల్లో 40 శాతం ఉన్నట్లు గుర్తించాం. భవిష్యత్‌ను డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు 2027లో రావాల్సిన కొత్త సబ్ స్టేషన్లను 2025లోనే తీసుకురాబోతున్నాం. డిస్కం పరిధిలో మొత్తం 164 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లకు టెండర్లు పిలిచాం. వీటిలో ఒక్క గ్రేటర్ జిల్లాల్లోనే 88 సబ్స్టేషన్లు రాబోతున్నాయి. బంజారాహిల్స్ సర్కిల్లో 5, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో 9, హైదరాబాద్ సౌత్ సర్కిల్లో 9, సికింద్రాబాద్ సర్కిల్లో 13, రాజేంద్రనగర్ సర్కిల్లో 13 చొప్పున, సైబర్‌సిటీ సర్కిల్లో 6, సరూర్‌నగర్ సర్కిల్ 5, వికారాబాద్‌లో 10, మేడ్చల్‌లో 18 చొప్పున కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఫీడర్లకు సెన్సార్లు... నగరంలోని అన్ని సబ్స్టేషన్లకు మల్టిపుల్ ఇన్ కమింగ్, అవుట్గోయింగ్ లైన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఔటర్ చుట్టూ విద్యుత్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. 400 కేవీ సబ్స్టేషన్లు అనుసంధానిస్తున్నాం. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జీహెచ్ఎంసీ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల ఫీడర్లకు సెన్సార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి కరెంట్ సరఫరా నిలిచిపోతే.. వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులకు చేరే విధంగా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ అంబులెన్స్‌లను కూడా వీటికి అనుసంధానిస్తున్నాం. ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. మరో మూడు మాసాల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. కనురెప్ప పాటు కూడా కరెంట్ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు పీటీఆర్ల సామర్థ్యం కూడా పెంచాం. దెబ్బతిన్న డీటీఆర్లను మార్చుతున్నాం. సెక్షన్లవారీగా ఎల్సీలు తీసుకుని, లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. మణికొండలోనే అత్యధికం.. మణికొండ, అయ్యప్ప సొసైటీల్లో అంచనాలకు మించి విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఇక్కడ ఉన్న భవనాలపై స్పష్టత లేకపోవడంతో డిమాండ్‌పై స్పష్టత కొరవడింది. దీంతో విద్యుత్ వినియోగం ఊహకందడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న సర్కిళ్ల పరిధిలో అదనపు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయబోతున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు సహా దెబ్బతిన్న డీటీఆర్‌ల స్థానంలో కొత్తవి అమర్చడం వంటి వాటిని గుర్తించి, పునరుద్ధరించడం తదితర పనులు చేపట్టాం. అలాగే.. రాజేంద్రనగర్‌లో 160, సైబర్ సిటీలో 151, మేడ్చల్‌లో 160, హబ్సిగూడలో 857, బంజారాహిల్స్‌లో 89, సికింద్రాబాద్‌లో 148, హైదరాబాద్ సెంట్రల్లో 250, హైదరాబాద్ సౌత్‌లో 90, సరూర్‌నగర్‌లో 12, సంగారెడ్డిలో 563 అదనపు డీటీఆర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రమాదాల నివారణ సహా ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్స్ తొలగింపునకు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాం. -
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్‌లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్‌తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబైలోని మాతోశ్రీ (ఉద్ధవ్ ఠాక్రే నివాసం)లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి కొత్త పేరు వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆమె చిత్రంతో కూడి పెద్దపెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే ఏమైందోఏమో వాటిని కొద్దిసేపటికే తొలగించారు.బ్యానర్ల కలకలంమాతోశ్రీలో రష్మీ ఠాక్రేను సీఎం చేయాలనే బ్యానర్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది. గంట వ్యవధిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన యువ కార్యకర్తలు మాతోశ్రీలోని ఆ బ్యానర్లను తొలగించారు.నేడు రష్మీ ఠాక్రే పుట్టినరోజుఇటీవలే మహారాష్ట్రలో మహిళా ముఖ్యమంత్రి అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) రష్మీ ఠాక్రే పుట్టినరోజు. దీనిని దృష్టిలో ఉంచుకుని శివసేన యువసేన మాతోశ్రీ వెలుపల రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు ప్రదర్శించింది. ఈ పోస్టర్లు పెట్టిన కొద్దిసేపటికే పార్టీ అగ్రనేతలు హడావుడిగా వాటిని తొలగించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను సీఎం చేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుమరికొద్ది నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీ, మహాయుతి దళ్ నాయకులు తమ సత్తా చాటేలా ఇప్పటికే ఎన్నికల సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం మొదలుపెట్టారు.ఇది కూడా చదవండి: ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్ -
పిల్లలకూ పెన్షన్!
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1 శాతం, జీ–సెక్లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు. ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..? ఆన్లైన్లో లేదంటే ఆఫ్‌లైన్‌లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్..
సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన వారసత్వ సంపద, అధునాతన ఫ్యాషన్ హంగులకు పెట్టింది పేరు హైదరాబాద్ మహానగరం. విభిన్న రంగాల్లో తనదైన ముద్రవేసుకుంటూనే యావత్ ప్రపంచం అనుసరిస్తున్న ఫ్యాషన్ పోకడలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా ఈ ఫ్యాషన్ ప్రపంచంలో దుస్తుల డిజైనింగ్ అనేది ముఖ్యమైంది. వివిధ దేశాలకు భారత్ వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్కృతిని హైదరాబాద్ డిజైనింగ్ రంగం ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ రంగానికి భారత్‌లో దాదాపు 350 బిలియన్ డాలర్ల బిజినెస్ మార్కెట్ ఉంది.ఫ్యాషన్‌లోని విభిన్న అంశాల్లో హైదరాబాద్ వేదికగా ఉన్నందున ఈ అవకాశాలను వినియోగించుకుంటూ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో నగర విద్యార్థులు మంచి కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు. ఆర్థికంగా, ఉద్యోగావకాశాల పరంగా, అంకుర సంస్థల ఏర్పాట్లలోనూ రాణిస్తున్నారు.ఈ ఫ్యాషన్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు, ఇన్స్టిట్యూషన్లను నెలకొల్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలో సైతం ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్లు ఈ కోర్సుల్లో తమ ప్రతిభ నిరూపించుకుంటూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.ఫ్యాషన్ రంగానికి కేంద్రంగా.. నగరంలోని మాసబ్‌ట్యాంక్ వేదికగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో పాటు పలు ప్రైవేట్ రంగ సంస్థలు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను అందిస్తున్నాయి. 9 నెలల పాటు ఉండే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో భాగంగా ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఫ్యాషన్, ఫ్యాషన్ ఆర్ట్ అండ్ ఇల్ల్రస్టెషన్, టెక్స్టైల్ అండ్ పాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు.అనంతరం డిజైనింగ్ వృత్తిలో నైపుణ్యులైన మార్కెటింగ్ మర్చెండైజింగ్, క్యాడ్ బేసిక్స్, పోర్ట్‌ఫోలియో వంటి విభిన్న అంశాల్లోనూ శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులు చేస్తున్న నగర విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ షోలలో, ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో అవకాశాలను పొందుతూ భవిష్యత్‌లో కూడా ఫ్యాషన్ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తుందని నిరూపిస్తున్నారు.వినూత్న ఆలోచనకు వారధి..అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించే నా విధానానికి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ తోడ్పాటు అందించింది. ఈ డిజైనింగ్ కోర్స్‌లో భాగంగా డిజైన్స్ ఎలా రూపొందించాలి.. వాటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలి.. మారుతున్న అధునాతన ఫ్యాషన్ జీవనానికి అనుగుణంగా మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి తదితర అంశాల్లో అవగాహన పెంచుకున్నాను. జీవితానికి భరోసా ఇచ్చే వృత్తి విద్య కోర్సుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ అత్యుత్తమమైంది. మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ కోర్సు చేయడమే కాకుండా 2023లో జాతీయస్థాయిలో ఉత్తమ డిజైనింగ్ బృందంలో ఒకడిగా అవార్డు అందుకున్నాను. – దీక్షిత్, ఫ్యాషన్ డిజైనర్.అవకాశాలు పుష్కలం.. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌కు గతంలో ఇంటర్ అర్హతగా ఉండేది. కానీ ప్రస్తుతం పదవ తరగతి చదివిన వాళ్లకు కూడా అవకాశం కలి్పస్తున్నారు. ఈ కోర్స్ చేసిన తర్వాత ఫ్యాషన్ రంగంలో అవకాశాలతో పాటు వ్యక్తిగతంగా బోటిక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం ఒక్కో డిజైనింగ్‌కు రూ.10 వేల నుంచి లక్షల్లో సంపాదించుకునే వేదికలు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంతోకాలంగా నగరంలోని ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమను వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచి్చన డిజైనర్లు వినియోగించుకోగా ఈ మధ్యకాలంలో స్థానికంగానే ఫ్యాషన్ డిజై నర్లు పుట్టుకొస్తున్నారు. దుబాయ్ వంటి దేశాల్లో అవకాశాలను పొందుతున్నారు.గ్లోబల్ రన్‌వేలో మనమే టాప్.. హితమ్స్ అకాడమీ(హెచ్ఐఐటీఎంఎస్) అప్పారల్∙ఫ్యాషన్ రంగంలో ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణ అందించడానికి విభిన్న ప్రాజెక్టులను రూపొందించాం. నగరంలోని జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీతో పాటు ఫ్యాషన్ క్యాపిటల్‌గా ప్రసిద్దిగాంచిన ఇటలీలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ ఐఎంబి మిలాన్ ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తూ.. మా విద్యార్థులకు ఏకకాలంలో రెండు యూనివర్సిటీల సర్టిఫికేట్లను అందిస్తున్నాం.ఔత్సాహిక విద్యార్థులను సైట్ విసిట్, వర్క్‌షాప్‌లో భాగంగా ఇటలీకి తీసుకెళ్లి అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్‌లపై అవగాహన కల్పిస్తున్నాం. భారత్‌లోని 350 బిలియన్ డాలర్ల బిజినెస్ మార్క్‌ను రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అందుకునేలా.. కోర్సులో బాడీ పోస్టర్, కలర్ కాంబినేషన్ సైకాలజీ, ఔట్ ఫిట్, ఫ్యాబ్రిక్ అనాలసిస్ వంటి అంశాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో శిక్షణ అందిస్తున్నాం. జాతీయ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలలో భాగం చేస్తూ.. ప్రాక్టికల్ అనుభవాన్ని చేరువ చేస్తున్నాం.ఈ మధ్యనే మా విద్యార్థులు ఢిల్లీ వేదికగా నిర్వహించిన ‘ద గ్లోబల్ రన్‌వే’ ఫ్యాషన్ ఈవెంట్లో మొదటి బహుమతి పొంది అందరి దృష్టిని నగరం వైపునకు మరల్చారు. ఈ అవార్డును ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ రీనా ధాకా చేతులమీదుగా అందుకున్నారు. శిక్షణ అనంతరం బోటిక్‌లను ప్రారంభిస్తూ, ప్రముఖ సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్లుగా కొందరు సెటిల్ అయ్యారు. 10 వేల మందికి శిక్షణ అందించడమే కాకుండా ఈ రంగానికి ప్రోత్సాహం అందించడం కోసం 40 శాతం స్కాలర్íÙప్ అందిస్తున్నాం. – రఫీ, హితమ్స్ అకాడమీ (హెచ్ఐఐటీఎంఎస్) ఫౌండర్, హైదరాబాద్. -
Ugadi 2024: నూతన సంవత్సరంలో.. 2024-25 కాల నిర్ణయమిదే..
ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతాం. ఇది తెలుగువాళ్ల పండుగ. ఈ తెలుగు సంవత్సరాదిలో మన రాశి ఎలా ఉంది. ఈ ఏడాది కర్తరీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి? వంటివి చూసుకుని గానీ కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. మరీ ఈ ఏడాది డొల్లు కర్తరీ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే..? డొల్లు కర్తరీ ప్రారంభం.. ది.04.05.2024 ప.12:35లకు చైత్ర బహుళ ఏకాదశీ శనివారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం.. ది.05.11.2024, ఉ.10:27లకు వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజు నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. కర్తరీ త్యాగం.. ది.28.05.2024 రా.7:21 వైశాఖ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం రోజు కర్తరీ త్యాగం. ‘‘మృద్దారు శిలాగహకర్మాణివర్జయేత్’’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించుటకు కర్తరీకాలము సరియగునది కాదు. పై సూత్రం ఆధారంగా వాస్తుకర్మలు నూతనంగా ఈ రోజు నుండి చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, కప్పు విషయమై పని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. రాబోవు విశ్వావసు నామ సంవత్సరం (2025–26) కర్తరీ నిర్ణయము 4 మే 2025 వైశాఖ శుద్ధ సప్తమి సుమారు సా.గం.7:00లకు డొల్లు కర్తరీ ప్రారంభం. 11 మే 2025 వైశాఖ శుద్ధ చతుర్దశీ సుమారు సా.గం.5:00లకు పెద్ద కర్తరీ ప్రారంభం. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విదియ రోజు సుమారు రా.గం.2:00లకు కర్తరీ త్యాగం. నవనాయక ఫలితాలు (2024– 2025) రాజు కుజుడు: కుజుడు రాజయిన సంవత్సరం అగ్నిభయం, వాయువు చేత అగ్ని రెచ్చ గొట్టబడడం, గ్రామ పట్టణాలలో తరచు అగ్ని భయములు ఉండును. వర్షములు ఉండవు. ధరలు అధికం అవుతాయి. రాజులకు యుద్ధములుండును. మంత్రి శని: వర్షపాతము తక్కువ. పంటలు తక్కువగా ఉంటాయి. సమాజంలో ఎక్కువ పాపకర్మలు ఇబ్బందులు సృష్టిస్తాయి. అన్ని వ్యవహారములు మందఫలములు ఇస్తాయి. తరచుగా సమాజంలో నిరంతరం ఆపదలు ఉంటాయి. గోవులకు ఇబ్బంది. తక్కువ స్థాయిలో ఉన్నవారు అందరూ అభివృద్ధిలోకి వస్తారు. సేనాధిపతి శని: సేనలకు రాజుకు సయోధ్య ఉండదు. ప్రజలు అధర్మ వర్తనులు అగుదురు. నల్లధాన్యములు ఫలించును. రాజులు అధర్మవర్తనులు అగుదురు. ప్రజలు పాప కర్మలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యములలో యిబ్బంది ఉంటుంది. సస్యాధిపతి కుజుడు: కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యజాతులు, ఎర్ర భూములు మంచి ఫలితాలనిస్తాయి. మెట్ట ధాన్యములు బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు, మధ్యమ ఫలితాలు యిస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు: గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చును. వ్యాధులు ఉండవు. దేశము సువృష్టితో సుభిక్షంగా ఉండును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసముగా ఉండును అని గ్రంథాంతర వచనము. అర్ఘాధిపతి శని: అర్ఘాధిపతి శని అయినచో మహాభయములు కలుగును. వర్షములు తగ్గును. రోగ, చోర, అగ్ని భయములు కలుగును. ఆహార సౌకర్యములు తగ్గును. ప్రజలలో భయము పెరుగును. పాఠాంతరంలో నల్లభూములు, నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మవస్తువులు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసముగా ఉండును. మేఘాధిపతి శని: వర్ష ప్రతిబంధకములు ఎక్కువ. రాజులకు ధనము లోటు ఉండును. చలిబాధలు ప్రజలకు జ్వరములు, ఆహార ధాన్యం కొరత. వ్యాధులు ప్రబలును. నల్ల ధాన్యములు బాగా పండును. రసాధిపతి గురువు: గురువు రసాధిపతి అయినచో చందన, కర్పూర, కంద మూలములు సులభముగా దొరకును. కుంకుమ పువ్వు మొదలగు ఇతర రస వస్తువులు దొరకవు. అన్ని పంటలకు అనుకూల వర్షములు ఉంటుంది. వృక్షజాతులు ఫలించును. ఆరోగ్యములు బాగుంటాయి. పాఠాంతరంలో బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. నీరసాధిపతి కుజుడు: పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడును. దానిమ్మ వంటివి బాగా ఫలించును. ఇవి చదవండి: Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..! -
‘భావి భారతం గురించి నీకేం తెలుసు?’.. విద్యార్థులకు రైల్వేశాఖ పోటీ..
భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వేలు ఎంతలా మారనున్నాయి?.. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను వారి అధ్యాపకులు అడుగుతుంటారు. తాజాగా భారతీయ రైల్వే దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించబోతోంది. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు భావి భారతంపై తమకున్న కలల గురించి చెప్పాలని రైల్వేశాఖ కోరింది. ఇందుకోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4000 పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు. భావి భారతం ఎలా ఉండబోతోంది? రైల్వేల భవిష్యత్ ఎలా ఉండనుందనే దానిపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కవితా రచన తదితర పోటీలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోటీలో ప్రతిభ కనబరిచిన 50 వేల మంది విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని డివిజన్లలోని 2000 రైల్వే స్టేషన్లలో పోటీ నిర్వహించనున్నామని, పోటీలు జరిగే సమయంలో ప్రధాని స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని రైల్వే అధికారులు తెలిపారు. -
నాథుడు లేని పార్టీకి అందలమెలా..
అది ఎంత మహా వృక్షమైనా కావొచ్చు. ఎన్నిఆటుపోట్లనైనా తట్టుకుని ఉండొచ్చు. చివరికి ఓ చిన్నపాటి గాలివాన చాలు.. కూకటి వేళ్ళతో కూలిపోవడానికి.. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దృష్టాంతం అతికినట్లు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చకచకా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాల్సింది పోయి అంతర్గత సమస్యలహో అల్లాడుతూ పఠనం దిశగా సాగుతోంది. మరోపక్క ప్రస్తుత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం అందనంత ఎత్తులో మూడోమారు అందాలన్నీ దక్కించుకునే రేసులో దూసుకుపోతోంది. ఒక జాతీయ పార్టీగా రాజకీయాలను శాసించి.. దిగ్గజాలకు ఆలవాలమై దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిక్కులేని స్థాయికి ఎందుకు దిగజారింది?? ఎందుకీ దుర్గతి పట్టింది..?? ఎన్నికల వేళ పార్టీ ని సరైన పంథాలో నడిపించే నాథుడు లేక ఎందుకు విలాలలాడుతోంది..?? రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రాంతీయ పార్టీగానైనా నిలబడుతుందా..?? నాలుగు దశాబ్దాల కిందట 400 పై చిలుకు స్థానాలతో ప్రత్యర్థులను గడగడ లాడించిన పార్టీ నేడు కనీస సీట్లు అయినా సాధించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది?? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే.. పతనం దిశగా.. వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. కాంగ్రెస్ పఠనం వెనుక కఠోర సత్యాలు కూడా దాచిపెట్టేవి ఏమీ కాదు. పార్టీ ప్రస్తుత దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం స్వయంకృతమేనని చెప్పుకోవాలి. నెహ్రు, ఇందిర, రాజీవ్‌ల హయాం తర్వాత పార్టీ మసకబారడం మొదలైంది. రాజీవ్ మరణానంతరం సోనియా అధికార విముఖతతో ప్రధాని పదవిని చేపట్టిన పీవీ.. మన్మోహన్ సాయంతో దేశాన్ని సంస్కరణల బాట అయితే పట్టించగలిగారు కానీ పార్టీకి అవసరమైన శక్తియుక్తులు నింపడంలో మాత్రం తన చాణక్య నీతిని ప్రదర్శించలేక పొయారనే చెప్పొచ్చు. కారణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. అదీగాక పీవీ హయాంలోనే వెలుగు చూసిన హర్షద్ మెహతా కుంభకోణం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఫలితంగా తొలిసారి వాజపేయి దేశ ప్రధాని అయ్యారు. ఇక 2004 ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‘ నినాదంతో ఎన్డీయే కూటమి బలమైన ప్రభావాన్నే చూపినప్పటికీ గుజరాత్ మత కల్లోలాలు ఆ కూటమిని కాదని యూపీఏ (ఇప్పటి ఇండియా కూటమి) కూటమికి అధికార పగ్గాలు అప్పగించాయి. మన్మోహన్ ప్రధాని అయ్యారు. దశాబ్ద కాలం పాటు రెండు విడతల్లోనూ ప్రధాని అయితే కాగలిగారు కానీ.. మౌన మునిగా ముద్రపడటం.. కర్త, కర్మ, క్రియ అంతా సోనియారాహుల్ లే అయ్యి ముందుకు నడిపించడం ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తికి ఆస్కారం కలిగించింది. దీంతో రానురానూ పార్టీ ప్రాభవం అడుగంటుతూ వచ్చింది. మన్మోహన్ రెండో విడతలో రకరకాల స్కాములు వెలుగు చూడటం, ధరల నియంత్రణ లేకపోవడం, నిరుద్యోగిత రేటు పెచ్చుమీరడం, పార్టీ నాయకుల్లో పొరపొచ్చాలు ప్రతిస్థను అథఃపాతాళానికి దిగజార్చేశాయి. ఎన్డీయే కూటమి ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. మోదీని తెరపైకి తెచ్చింది.. పగ్గాలు దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 51 సీట్లు గెలుచుకోగా.. యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో, అది కూడా కేవలం 20 శాతం ఓటు బ్యాంకు తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అక్కరకు రాని అన్నా చెల్లెల్లు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతోనే యూపీఏకు నూకలు చెల్లడం మొదలైనట్లేనని భావించొచ్చు. ఇంటి పెద్దగా సోనియా పైపైన పెద్దరికం వహిస్తున్నా.. మోదీ, అమిత్ షాల ద్వయాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడ్ని తీర్చిదిద్ద లేకపోవడం కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇందుకు రాహుల్, ప్రియాంకల ఉదంతాలే ఓ పెద్ద ఉదాహరణ. పదేళ్ల కిందట ప్రజల్లోని అసంతృప్తి సెగలతో అధికార పీఠాన్ని వదులుకున్న కాంగ్రెస్ కూటమి తర్వాతి తరుణంలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేక పోయింది. పార్టీకి రాహుల్, ప్రియాంకల రూపంలో యువ నాయకత్వం అందుబాటులో ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది. యువ నాయకునిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీకి మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించలేకపోయాడు రాహుల్.. అంచెలంచెలుగా నాయకునిగా ఎదగాల్సిన చోట తనవల్ల కాదంటూ పార్టీ అధికార బాధ్యతలకు ఆమడ దూరం వెళ్లిపోయాడు ఆయన.. ఒక నెహ్రు, ఇందిరా, రాజీవ్‌ల వంశీకుడైనా ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోలేక పోవడం రాహుల్ ప్రధాన వైఫల్యంగా భావించొచ్చు. ఇక అప్పట్లో ఇందిరమ్మ డైనమిజంతో పోలుస్తూ ప్రియాంకను రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించింది కాంగ్రెస్ కోటరీ. వ్యక్తిగత సమస్యలో, అనుకోని అవాంతారాలో కానీ ఆ యత్నాలేవీ ఫలించలేదు. ఆమె తన ప్రాబల్యాన్ని చూపించి ఉంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మరింత రసవత్తరంగా మారేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడపాదడపా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు అక్కడకు వెళ్లి ప్రచార సభల్లో మొహం చూపించి పోవడం తప్ప ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోయింది ప్రియాంక. కాంగ్రెస్ అంటేనే నెహ్రు వారసులుగా భావించే ప్రజానీకంలో అన్నా చెల్లెళ్ళ వెనకడుగు ఆ పార్టీని మరింత బలహీనంగా మార్చేస్తోంది. పార్టీ బాధ్యతలు ఖర్గే చేతుల్లో పెట్టినా.. ఈయన పాత్ర మరో మన్మోహన్ మాదిరిగానే ఉండొచ్చన్న అభిప్రాయం ప్రజల్లో గూడు కట్టుకుపోవడం పెద్ద మైనస్‌గా భావించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు యే ధీమాతో ఇండియా కూటమికి ఓటు వేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మిత్రులే కానీ.... తలో దారి.. ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్న ప్రస్తుత తరుణంలో విబేధాలను పరిష్కరించుకుని కలిసికట్టుగా సాగాల్సింది పోయి కాంగ్రెస్ మిత్ర గణం చెరో దారీ వెతుక్కుంటూంటే ఇదే అదనుగా ఎన్డీయే పక్షం బలం పెంచుకుంటూ పోతోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇటీవలి బీహార్ పరిణామాల గురించే. కాంగ్రెస్ సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జనతాదళ్ (యూ) అధినేత నితీష్ కుమార్ తాజాగా ఇచ్చిన ఝలక్ బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమే అయింది. ఈ విషయాన్ని ముందస్తు పసిగట్టడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మొన్నీ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిష్ఠ వేసుకుని కూర్చుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, హర్యానా, గుజరాత్‌లలో పెత్తనం ఎటూ బీజేపీదే, కర్ణాటకలో తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, హామీల విషయంలో అక్కడి ప్రభుత్వ వైఖరి అయోమయంలో పడేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే ముందు నోరు మెదిపి పరిస్థితి ఎటూ లేదు. కళ్లు తెరవకపోతే.. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఖర్గే పేరుతో తెచ్చిన దళిత కార్డు ప్రభావం నామమాత్రమేనని చెప్పొచ్చు. ఇక పార్టీకి ఏకైక ఆశాకిరణం రాహుల్ గాంధీయే. ఆయన నేతృత్వం తక్షణ అవసరం.. పరిస్థితి తీవ్రత గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఓటర్లలో ఓ కొత్త నమ్మకాన్ని, ప్రశ్నిచే గళం ఒకటి ఉండనే ధీమాను కలిగించాలి. సరైన రీతిలో పావులు కదిపి మోదీ సర్కారుకు సవాలు విసిరేలా పార్టీ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగలగాలి. సహజంగా అధికార పార్టీలపై ఉండే అసంతృప్తి సెగల్ని సొమ్ము చేసుకుని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోఎలాగైతే అధికారాన్ని అందిపుచ్చుకోగలిగారో.. అదే మాదిరి ప్రయత్నాలు అన్నిచోట్లా చేయాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధ నాయకులను గౌరవ పదవులకు పరిమితం చేస్తూ.. వాళ్ళ సలహాలు, సూచనలతో యువ రక్తాన్ని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాలి. మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను వెతికి పట్టుకుని ఎన్నికల పోరుకు సిద్ధమవ్వాలి. అప్పుడే సార్వత్రిక రణం హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుంది. బహుశా ప్రస్తుతానికి సమయం మించిపోయిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లోనైనా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునే చర్యల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలం పుంజుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తే 2029లోనైనా మళ్లీ కేంద్రంలో కొలువుదీరే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించనంత వరకు ఎన్ని జోడో యాత్రలు చేపట్టినా అవన్నీ కంటితుడుపు చర్యలుగా మిగిలిపోతాయే తప్ప అధికారాన్ని మాత్రం అందించవు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే సరే... లేదంటే ముందే చెప్పినట్లు ఒక చిన్న గాలివాన చాలు.. కాంగ్రెస్ అనే మహావృక్షం కూకటివేళ్లతో సహా కూలిపోవడానికి. తెలంగాణను చూసి మురిసిపోతే.. రెండు నెలల కిందటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ అది సంబరపడేటంత మురిపెమేమీ కాదు. అదే సమయంలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయింది అన్న విషయాన్ని విస్మరించలేం. జోడో యాత్రలో, కాంగ్రెస్‌పై పెరిగిన మమకారమే తెలంగాణాలో ఆధికారాన్ని తెచ్చిపెట్టలేదు. స్థానిక పరిస్థితులు, కేసీఆర్ సర్కారుపై పెల్లుబికిన అసంతృప్తి అధికార మార్పు జరిగేలా చేశాయి. సాధారణంగా రెండు దఫాలు అధికారంలో కూర్చున్న ఏ పార్టీకైనా ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉండటం సహజం. దీనికి నిదర్శనం ఉభయ పక్షాల మధ్య ఉన్న గెలుపు ఓటముల అంతరాలే. భారాసా స్వయంకృత చేష్టలు ఆ పార్టీని 39 సీట్లకే పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్ల బొటాబొటీ మెజార్టీతో అధికార పీఠాన్ని అప్పగించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి లాంటి వాళ్ళ ప్రయత్నాలు, 6 గ్యారంటీల పథకాలు తమవంతు సాయం అందించాయి. మరోపక్క కాంగ్రెస్ గ్యారంటీలు అమలులో ఎంత ఇబ్బందికరమో అనుభవైక వేద్యమవుతోంది. ఇలాంటి హామీలు, యాత్రలను నమ్ముకుని కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం కల్లే అవుతుంది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నపై చెల్లెలి అస్త్రాన్ని ప్రయోగించినా ప్రయోజనం శూన్యమే. ఇటీవల ఇండియాటుడే సమ్మిట్‌లో ఆంధ్ర ముఖ్యమంతి జగన్మోహన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ వైస్సార్సీపీ, టీడీపీ, జనసేనల మధ్యే ఉంటుందని, తన చెల్లెలి చేరిక తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోదని తేల్చిపడేశారు కూడా.. వాస్తవానికి ఆయన చెప్పింది అసెంబ్లీ ఎన్నికల గురించే అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకూ ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు. -బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు ఇదీ చదవండి: కొంప ముంచే డైరీలు..! -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
పర్యావరణంపై యంగ్ టాలెంటెడ్ వుమెన్ వారియర్‌గా.. 'ఈష్న అగర్వాల్'
"పర్యావరణ ప్రేమికురాలైన ఈష్న అగర్వాల్ డాక్యుమెంటరీ 'శాలరీ' దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్(కాప్ 28)లో ప్రదర్శించబడింది. పర్యావరణంపై ఉప్పు పరిశ్రమ చూపుతున్న ప్రభావం, ఉప్పును పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకొని ఈష్న అగర్వాల్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రపంచ ప్రతి నిధుల నుంచి ప్రశంసలు లభించాయి." 'కాప్ 28లో నా డాక్యుమెంటరీని ప్రదర్శించడం నాకు మాత్రమే కాదు పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న ఎంతో మంది యువతీ, యువకులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. చర్చను రేకెత్తించే, మార్పును ప్రేరే పించే, అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి యువతకు ఉంది. వాతావరణ మార్పును కేవలం ఒక సమస్యగా కాకుండా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలకు అవకాశంగా భావిస్తాను. విభేదాలకు అతీతంగా అందరికీ ఒకే భూమి పేరిట ఐక్యత రాగం ఆలపించడానికి ఇది మంచి తరుణం' అంటుంది అగర్వాల్. పర్యావరణ కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆగర్వాల్‌కు హిందు స్థానీ సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్ ప్రవేశం ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రతిభ చూపుతుంది. తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించింది. మోటివేషనల్ స్సీకర్‌గా కూడా రానిస్తోంది. వ్యక్తిత్వ వికాసం నుంచి పర్యావరణ సంక్షోభం వరకు ఎన్నో అంశాలపై ప్రసంగాలు చేసింది. ఇవి చదవండి: ఇదిగో 'కొత్త సంవత్సరం..' ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా! -
ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఓవైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిసూ్తనే.. మరోవైపు వారిని ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తూ నెలకు రూ.12 వేల స్టైఫండ్ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదించారు. ఆయా కోర్సులు అభ్యసిస్తున్నవారితో హైస్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులను పరిశీలిస్తారు. ఇంటర్న్‌షిప్‌కు వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. వర్చువల్ విధానంలో మరో ఇంటర్న్‌షిప్.. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ హైస్కూల్‌ను సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలతో జత చేయనున్నారు. ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హైస్కూల్లో ఇంటర్న్‌గా చేసూ్తనే వర్చువల్ విధానంలో కూడా మరో ఇంటర్న్‌షిప్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, జాబ్ మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి రెండు విధాల ఇంటర్న్‌షిప్ ఉపయోగపడనుంది. వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విద్యార్థి తమ కోర్సు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏటీఎల్ మెంటార్షిప్.. ‘ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్’ ప్రాజెక్టు కింద ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే హైస్కూల్ బాటపడుతున్నారు. రెండు నెలల ఈ ప్రాజెక్టులో భాగంగా హైస్కూళ్లలో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్‌్స (ఏటీఎల్)’కు మెంటార్షిప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే 577 హైస్కూళ్లలో ఏటీఎల్స్ను ఏర్పాటు చేసింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఏటీఎల్’ అవసరాన్ని గుర్తించి వినియోగంలోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఆయా హైస్కూళ్లను ఇంజనీరింగ్ కాలేజీలతో మ్యాపింగ్ చేస్తోంది. వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల సహాయంతో ‘ఏటీఎల్’కు జీవం పోస్తోంది. ఐక్యరాజ్యసవిుతికి చెందిన యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న పూణే సంస్థ.. విజ్ఞాన్ ఆశ్రమ్‌కు చెందిన సోర్స్ పర్సన్స్‌తో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎల్ ద్వారా పాఠశాల విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపిస్తోంది. ఈ కోర్సుల్లోనే శిక్షణ.. ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా/డేటా ఎనలిస్ట్, రోబోటిక్స్‌లో బేసిక్స్ బోధించనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్)ను సైతం రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయంతో బేసిక్స్ నేర్పిసూ్తనే.. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ పరికరాలపై విద్యా బోధన, హైçస్యూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే కొత్త కంటెంట్ ఇన్స్టాల్ చేసి అందించనున్నారు. చదువుతో పాటే సంపాదన దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించనున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ ఓ గొప్ప మార్పునకు నాంది. అందుబాటులోని మానవ వనరుల సమర్థవంత వినియోగానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లిటరసీ పెరుగుతోంది. పేదింటి విద్యార్థులు స్మార్ట్ ప్యానల్స్‌పై పాఠాలు వింటున్నారు. ట్యాబ్‌ల్లో పాఠాలు చదువుతున్నారు. వీటి ద్వారా మరింత నాణ్యమైన సాంకేతిక పాఠాలను నేర్పించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను హైస్కూళ్లలో ఇంటర్న్‌షిప్‌నకు ఆహ్వానిస్తున్నాం. తద్వారా పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్స్, ఏటీఎల్స్ పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. – ఆచార్య హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి -
ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు?
భారతీయ జనతాపార్టీ(బీజేపీ) కొత్తగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో నాయకత్వాన్ని మార్చి, నూతన నేతలకు బీజేపీ అధికారాన్ని అప్పగించింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం నేపధ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల భవిష్యత్ ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ మీడియా కార్యక్రమంలో సమాధానమిచ్చారు. ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు బీజేపీ సీనియర్ నేతలని, వారి స్థాయికి అనుగుణంగా భవిష్యత్తులో పార్టీ వారికి తగిన హోదా కల్పిస్తుందని అన్నారు. తమ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, ప్రతిచిన్న కార్యకర్తకు కూడా పార్టీ తగిన స్థానం ఇస్తుందని అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఆ సీనియర్లకు మరో పనిని అప్పగిస్తామన్నారు. వారి సేవలను పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని పదాలలో వివరించడం కష్టమని, ఇటువంటి పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అని మాత్రమే కాకుండా ప్రతి కార్యకర్త గురించి కూడా పార్టీ ఆలోచిస్తుందని నడ్డా తెలిపారు. వారు చేపట్టిన కార్యక్రమాలు, వారి చరిత్రకు సంబంధించిన డేటా బ్యాంక్ తమ వద్ద ఉందని, వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటామన్నారు. ఎన్నికలు ప్రకటించగానే మన నాయకుడెవరు? ప్రతిపక్షంలో కూర్చోగల తగిన నాయకుడు ఎవరు? అనే అంశంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని, ఈ ఎంపిక చాలా జాగ్రత్తగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ! -
భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాను: హీరోయిన్
‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల హీరో హీరోయిన్లుగా ‘గెటప్’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ సినిమాను నందిపాటి వంశీకృష్ణ నవంబరు 3న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు కెమెరామేన్. రంభ, కల్పనా రాయ్‌లు మాకు దూరపు బంధువులు. నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. మెడిసిన్ చేసినా నటిగానూ చేయాలనుకుంటున్నాను. ‘మిస్ ఇండియా’ సినిమాతో నా జర్నీ మొదలైంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, మా ఊరి పొలిమేర 1, విరూపాక్ష’ వంటి సినిమాలు, ‘ఆహా’ ఓటీటీలో మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ఇక ‘మా ఊరి పొలిమేర 1’లో సహనం ఉన్న లక్ష్మీ పాత్ర చేశాను. రెండో భాగంలో నా పాత్ర ఎగ్రెసివ్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాను’’ అన్నారు. -
అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? అభిజ్ఞానంద ఏం చెప్పాడు?
జ్యోతిష్యం... ఇది నమ్మకాలకు సంబంధించిన శాస్త్రం. దీనిని నమ్మేవారు జాతకాల ప్రకారమే జీవితాలు ముందుకు సాగుతుంటాయని చెబుతుంటారు. దీనిని నమ్మనివారు జాతకాలనేవి మూఢ నమ్మకాలని చెబుతుంటారు. అయితే ఒక్కోసారి జ్యోతిష్కులు కాలగణనను అనుసరించి తెలిపే భవిష్యవాణి నిజమవుతుంటుంది. ఒక్కోసారి నిజాలు కాకుండా మిగిలిపోతాయి. దీంతో ఒక్కోసారి జ్యోతిష్కులు గొప్పవారని, మరోమారు వారు తప్పుదారి పట్టిస్తుంటారని పలువురు చెబుతుంటారు. ఏదిఏమైనా కర్నాటకలోని మైసూరువాసి అభిజ్ఞానంద చెప్పే భవిష్యవాణిపై కొందరు ఆసక్తి కనబరుస్తుంటారు. చిన్నవయసులోనే అపరిమితమైన విషయపరిజ్ఞానాన్ని సంపాదించి, అందరి మెప్పుపొందిన అభిజ్ఞానంద మరోమారు భవిష్యవాణి వినిపించారు. అభిజ్ఞానంద చెప్పిన కొంత భవిష్యవాణి నిజం కాగా, మరికొంత ఫెయిలయ్యింది. అయితే ఆ కుర్రాడి నాలెడ్జ్, పరిణతి అందరినీ ఆకట్టుకుంటోంది. 2006లో జన్మించిన అభిజ్ఞానంద బాల్యం నుంచే తన మేథోతనాన్ని ప్రదర్శించసాగాడు. కరోనా విపత్తు గురించి ముందే చెప్పి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరోవైపు 8 ఏళ్ల వయసుకే భగవద్గీతను కంఠతా పట్టేసి, వాటికి వివరణలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. పిన్నవయసులోనే ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన అభిజ్ఞానంద తాజాగా మరో భవిష్యవాణిని వినిపించాడు. ముంబై దాడులు జరిగిన సమయంలో ఎటువంటి గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెచ్చుమీరే పరిస్థితులున్నాయని అభిజ్ఞానంద జోస్యం చెప్పాడు. దీనికితోడు పలు విపత్తులు ప్రపంచాన్ని చుట్టిముడతాయని, దీంతో వరుస విషాదాలు వెంటాడుతాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబరు 14 తరువాత ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని ప్రాంతాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని అభిజ్ఞానంద తెలిపాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, ఇజ్రాయిల్‌పై దాడుల నేపధ్యంలో అభిజ్ఞానంద వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏ గ్రహగతుల కారణంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో ఆ వీడియోలో తెలియజేశాడు. తన వీడియోలో ఒక మ్యాప్ పొందుపరిచి.. ఏఏ ప్రాంతాల్లో కల్లోలం ఏర్పడుతుందో చూపించాడు. ఇజ్రాయెల్, పాలస్తీనాల యుద్ధ ప్రభావం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలపై కూడా ప్రభావం చూపనుందని పేర్కొన్నాడు. ఈ గ్రహతుల ప్రభావం భారతదేశంపైన కూడా ఉన్నదని అభిజ్ఞానంద తెలిపాడు. ఇది కూడా చదవండి: కిమ్ సోదరి యో జోంగ్ ఎందుకంత డేంజర్? -
భవిష్యత్తులో పేటీఎంకు నిధుల అవసరం ఉండదు - మాధుర్ దియోర
న్యూఢిల్లీ: సమీప కాలంలో పేటీఎంకు నిధుల అవసరం లేదని, స్థిరమైన సానుకూల నగదు ప్రవాహాలను సాధిస్తామనే నమ్మకం ఉందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధుర్ దియోర తెలిపారు. రుణ భారం సున్నా అని, బ్యాలన్స్‌షీటు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. రూ.8,300 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయంటూ, ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) విషయంలో నమ్మకంతో ఉన్నట్టు ప్రకటించారు. పేటీఎం 23వ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా దియోర ఈ వివరాలు వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రసంగిస్తూ.. కంపెనీ వృద్ధి భారత్ శక్తితో ముడిపడి ఉన్నట్టు ప్రకటించారు. ‘‘పేటీఎం వృద్ధి చెందుతుందంటే భారత్ కూడా వృద్ధి సాధిస్తున్నట్టే. దేశంలో చిన్న వ్యాపారుల ఛాంపియన్స్ మేము. సరైన టెక్నాలజీ, ఆర్థిక సేవలను ఒక్కసారి చిన్న వర్తకుడికి పరిచయం చేస్తే భారత్‌కు అసలైన వృద్ధి ఇంజన్ ఏర్పడినట్టే. ఉపాధి అవకాశాలతోపాటు, దేశంలో సమ్మిళిత ఆర్థిక సేవలకు మేము మార్గం చూపిస్తున్నాం’’అని శర్మ పేర్కొన్నారు. ఇటీవలి జీ20 సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా ఎక్స్‌పీరియెన్స్ జోన్లో పేటీఎం తన టెక్నాలజీని ఇతర దేశాల నేతలకు పరిచయడం చేయడం గమనార్హం. పేటీఎం రూపొందించిన ఏఐ సాఫ్ట్వేర్ స్టాక్ వ్యయాలను తగ్గిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సురక్షితంగా మారుస్తుందన్నారు. ‘‘మనం త్వరలోనే ప్రపంచ సూపర్ పవర్‌గా మారతాం. పేటీఎం దీనికి నాయకత్వం వహిస్తుంది’’అని శర్మ పేర్కొన్నారు. -
"అమ్మ" అనే పిలుపు కోసం పరితపించే వాళ్లకి అది గొప్ప వరం!
గుండె, ఊపిరితిత్తులు, కిడ్ని మాదిరిగి గర్భాశయం మార్పిడి. ఇక భవిష్యత్తులో వేలాదిమంది మహిళలు గర్భాశయం మార్పిడి చేయించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అమ్మను కాలేనని బాధపడుతున్న వారకి ఇదొక వరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగతా అవయవాల మాదిరిగా ఇది సర్వసాధారంణం కావొచ్చు అంటున్నారు. అంతేగాదు ఆ స్థాయికి చేరుకోవడానికి కేవలం ఐదేళ్లు మాత్రమే పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాలో విజయవంతంగా గర్భశయ మార్పిడి నిర్వహించిన వైద్యం బృందంలోని ఓ వైద్యుడు టొమ్మసో ఫాల్కోన్ మాట్లాడుతూ..తాము గర్భాశయాన్ని ఇచ్చే దాతల్లో ప్రమాదాన్ని తగ్గించడమే గాక గ్రహీతల్లో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ఈ అరుదైన శస్త్రచికిత్సలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఇలాంటి ఆపరేషన్‌లో మరింత స్థాయిలో సక్సెస్‌ని సాధించగలమని అన్నారు. ఈ గర్భాశయ మార్పిడి అనేది గుండె, ఊపరితిత్తుల మార్పిడిలాంటిదే గానీ వాటిన్నీటికంటే ఈ శస్త్ర చికిత్స మరింత క్లిషమైన ప్రక్రియ అని అన్నారు. ఇందులోని రెండు దశలు గంటలతరబడి చేయాల్సిన ఆపరేషన్లని అన్నారు. మరణించి ఉన్నా లేదా జీవించి ఉన్నవారి నుంచి ఈ మార్పిడి ప్రక్రియ అనేది సాధ్యమేనని అన్నారు. కాగా, యూఎస్‌లో మరణించిన దాత నుంచి మార్పిడి జరిగిన మహిళ తదనంతరం ప్రసవించడంతో మరింత పురోగతి సాధించినట్లయింది. 2013లో జరిగిన తొలి గర్భాశయం మార్పిడి నంచి వైద్య నిపుణలు మరింతగా పురోగతి సాధించారు. అలాగే అవయవాన్ని తొలగించే విధానాన్ని మరింతగ మెరుగుపరిచి, ప్రమాదాలను నివారించేలా రోబోటిక్‌గా చేసేలా పరిశోధనలు చేస్తున్నట్లు వైద్య బృందం పేర్కొంది. పైగా 10 గంటల ఆపరేషన్ సమయాన్ని సగానికి తగ్గించే యత్నం కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గర్భాశయ మార్పిడి జరిగిన అమండా గ్రుండెల్ తన గురించి వివరిస్తూ.. ఆమె కుమార్తె గ్రేస్‌కు 2021లో క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో జన్మనిచ్చింది. 17 ఏళ్ల వయసులో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే.. ఒకవిధమైన పుట్టకతో వచ్చే రుగ్మతతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. తానెప్పుడూ "మామ్" అని పిలుపించుకోలేనని చాలా బాధపడ్డాను. గర్భాశయ మార్పిడి ట్రయల్స్ గురించి వైద్యుల ద్వారా తెలుసకుని.. అందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. నిజానికి ఈ మార్పిడి పనిచేయకపోవచ్చ అని కూడా తెలుసు. కానీ ఇలాంటి అధునాతన వైద్యంలో భాగమై తనలాంటి వాళ్లకు ఏదో రకంగా తల్లి అయ్యే మార్గం దొరికితే చాలు అని కోరుకున్నాని గ్రుండెల్ చెబుతోంది. ఈ శస్త్ర చికిత్స సక్సస్ అయ్యి గర్భవతిని అవుతానని అనుకోలేదు..ఇలా బిడ్డ చేత మామ్ అని పిలుపించుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది. తాను ఇప్పుడు రెండో బిడ్డ కోసం యత్నిస్తున్నట్లు కూడా చెప్పింది. క్యాన్సర్ వంటి ఇతర పరిస్థితుల వల్ల గర్భాశయం కోల్పోయిన మహిళలకు ఈ మార్పిడి ఆపరేషన్ ఒక గొప్ప వరం అని అంటోంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ మార్పిడి చేయించుకున్న చాలా మంది మహిళలు గర్భవతులయ్యారని, దాదాపు 90 మంది పిల్లలకు జన్మంచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజల ఆత్మగౌరవం..అవసరం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా.. మీ అండ, బలగం ఉన్నంత కాలం దేనికీ తలవంచను.. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉంది.’అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ టికెట్ల జాబితా ప్రకటించగా, తుమ్మలకు స్థానం దక్కలేదు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆయన శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల అనుచరులు వెయ్యికి పైగా కార్లు, ఇతర వాహనాల్లో వచ్చినాయకన్గూడెం వద్ద తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఖమ్మంలోని గొల్లగూడెంలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు పదవి అలంకారం, అహంకారం, ఆధిపత్యం కోసం కాదని ప్రజల కళ్లలో చిరునవ్వు చూడటం కోసమేనని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా గోదావరి జలాలతో జిల్లా ప్రజల కాళ్లు కడిగి రాజకీయాల నుంచి విరమిస్తానని సీఎం కేసీఆర్‌కు చెప్పానని, అది నెరవేరాకే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. ప్రస్తు తం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా.. ప్రజల ఆరాటం, అభిమానం చూశాక తనకు అవసరం లేకపోయినా.. జిల్లా కోసం, ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పాలేరు, వైరా, లంకాసాగర్, ఉభయ జిల్లాల్లోని రిజర్వాయర్లను నింపి రాజకీ యాల నుంచి విరమిస్తానని తుమ్మల వెల్లడించారు. తుమ్మల ఫొటోతో ప్రత్యేక జెండాలు ర్యాలీలో ప్రతీ వాహనానికి ప్రత్యేకంగా తుమ్మల ఫొటో ఉన్న తెల్లరంగు జెండాలు కట్టారు. ఎక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కానీ బీఆర్ఎస్ జెండాలు కానీ కనిపించలేదు. కొందరు తుమ్మల ఫొటో ఉన్న జెండాలతో పాటు కాంగ్రెస్ జెండాలు కూడా పట్టుకోవడం కనిపించింది. -
పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి మార్గాలు?
నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – భానుశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ పెద్దింటి అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు నిజంగా మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది. -
అయ్ బాబోయ్...ఏఐ! రేకెత్తిస్తున్న వేల భయాలు..!
అయ్ బాబోయ్...‘వేవ్ ఆఫ్ ది ప్యూచర్’గాచెబుతున్న ఏఐ సాంకేతికత యువతలోని ఒక వర్గంలో వేల భయాలను రేకెత్తిస్తోంది. భూతంలా భయపెడుతోంది. ఏఐ టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, ఉద్యోగావకాశాలు ఉండవనే ఆందోళనకు ‘ఏఐ యాంగ్జైటీ అని పేరు పెట్టారు.... ఈ భయం ఈనాటిది కాదు. ‘ఈ యంత్రాలు మన ఉపాధిని మింగేస్తాయి’ అనే భయం పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి ఉన్నదే. చాట్ జీపీటీ విజయవంతం అయిన తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఇప్పుడు యువతను భూతమై భయపెడుతోంది. ఒక సర్వే ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య వయసు వాళ్లు తమ కెరీర్‌కు సంబంధించిన భయాలతో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2025 కల్లా 85 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ సాంకేతికతతో భర్తీ అవుతాయి. ఈ నేపథ్యంలో కంపెనీలలో ఉద్యోగుల భవిష్యత్ పనితీరు ఎలా ఉండబోతున్నది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎంత పాపులర్ టాపిక్ అయిందంటే మూడు సంవత్సరాల వ్యవధిలో దీనిపై పదుల సంఖ్యలో పుస్తకాలు వచ్చాయి. ఆర్థికవేత్త రిచర్డ్బాల్డ్ విన్ తన పుస్తకం ‘ది గ్లోబటిక్స్ అప్హీవల్’లో ఏఐ ద్వారా ఏయే రంగాలు ఎలాంటి ప్రభావానికి గురవుతాయో విశ్లేషించారు. కొన్ని పుస్తకాలు మాత్రం ‘భయం అక్కర్లేదు’ అంటూ యువతను ఆశావహ మార్గం వైపు నడిపిస్తున్నాయి. యంత్రాలతో చెలిమి తప్పదు, తప్పు కాదు అంటున్నాయి. సాంకేతిక శక్తి ప్రభావితం చేయని, అంటే ఉద్యోగాలకు ప్రమాదం లేని కొన్ని రంగాలు ఉండేవి. ఉదా: ఎకౌంటింగ్, న్యాయశాస్త్రం...మొదలైనవి. అయితే తాజాగా వెల్–ఎడ్యుకేటెడ్ ప్రొఫెషన్స్‌కు సంబంధించిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. లా ప్రాక్టీస్‌లో ఏఐ చాట్‌బాట్ కూడా భాగం కానుంది కెరీర్ అభద్రతకు సంబంధించిన ఆలోచనల నేపథ్యంలో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ‘ఏఐ యాంగై్జటీ’ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి పదాలు పుట్టడం కొత్త కాదు. సాంకేతిక పురోగతికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఇలాంటి పదాలు ఎన్నో పుట్టాయి. 1980లలో ‘కంప్యూటర్ ఫోబియా’ ‘కంప్యూటర్ యాంగై్జటీ’ ‘టెక్నో స్ట్రెస్’లాంటివి పుట్టాయి. ఏఐకి సంబంధించి రెండు వర్గాలు కనిపిస్తాయి. మొదటి వర్గానికి చెందిన వారిలో ‘ఆటోమేషన్ ఆందోళన’ కనిపిస్తుంది. రెండో వర్గం వారిలో ఆశాభావం కనిపిస్తుంది. మనుషులు, యంత్రాలతో చేయికలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయనేది రెండో వర్గం నమ్మకం. టామ్ క్రూజ్ ‘మైనార్టీ రిపోర్ట్’లాంటి సినిమాలలో, పర్సనల్ ఇంట్రెస్ట్లాంటి టీవీ షోలలో మనిషి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జత కడితే జరిగే అద్భుతాలు కనిపిస్తాయి. వివిధ రంగాలపై ఏఐ ఎలాంటి మార్పును తీసుకురానుంది? ఆ మార్పు మనపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఏం నేర్చుకోవాలి?... ఈ విషయాలు చెప్పడానికి ఆన్లైన్ కోర్సులు వచ్చాయి. ఏఐ సాంకేతికత రీప్లేస్ చేయలేని ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అవి నొక్కి చెబుతున్నాయి. డిజిటల్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ను కలగలిపి పాఠాలుగా చెబుతున్నాయి. ఈ కోర్సులపై యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఉద్యోగాలపై ఏఐ టెక్నాలజీ ప్రభావం గురించి ఫ్రెండ్‌కు నాకు మధ్య చర్చ జరిగింది. ఏటీఎం మెషీన్లు వచ్చిన కొత్తలో బ్యాంకింగ్ రంగంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు ఉండవు...ఇలా ఎన్నో మాటలు వినిపించేవి. కాని అది నిజం కాలేదు. ఉద్యోగుల పనితీరు మాత్రం మారింది. ఏఐ టెక్నాలజీ విషయంలోనూ జరిగేది ఇదే’ అంటుంది ముంబైకి చెందిన అక్షర. ఏఐ...అయితే ఏంటీ! యువతలో ఏఐ ఫోబియాను తొలగించడానికి ‘ఫోర్బ్స్ కోచెస్ కౌన్సిల్’ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్ని... ఏఐ అంటే భయం కాదు, ఇష్టం పెంచుకోండి. ఏఐకు సంబంధించి ప్రతిదీ నేర్చుకోండి. నిపుణులతో మాట్లాడండి. ఉద్యోగ నైపుణ్యానికి ఏఐ ఎలా ఉపయోగపడగలదు అనే కోణంలో ఆలోచించండి. మనిషికి ఉండే సహజ నైపుణ్యాలను ఏఐ ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. మనిషికి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేరణశక్తి, ఎత్తుగడలు, సమయస్ఫూర్తి...యంత్రం అనుకరించలేనివి. ‘ఈ ఉద్యోగం మాత్రమే చేస్తాను. ఇది మాత్రమే చేయగలను’ అని ఫిక్స్ కావద్దు. బీ ఫ్లెక్సిబుల్. ఏ ఉద్యోగమైనా చేసే నైపుణ్యాన్ని సొంతం చేసుకోండి. ఒకే దారిలో నడిచే వారికి ఆ దారి మాత్రమే తెలుస్తుంది. కొత్త దారుల్లో నడవడం నేర్చుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఒత్తిడి దరి చేరని, సమస్యలను పరిష్కరించే, సానుకూలతను శక్తిగా మార్చుకునే, ఇతరులతో మంచి స్నేహసంబంధాలతో ఉండగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరుచుకోండి. ఏఐ ఎలాంటి పాత్ర అయినా పోషించగలదు...అని విశ్వసించే సందర్భంలో ఉన్నాం. ఇలాంటి సమయంలోనే ఏఐ కంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేసే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. (చదవండి: విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!) -
హైదరాబాద్ కేంద్రంగా ‘హ్యుందాయ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్ హ్యుందాయ్ మోటార్ భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది. ఈవీలు, అటానమస్ సహా భవిష్యత్ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రిసర్చ్, డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్ రికగి్నషన్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్‌యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్ తెలిపింది. 2022–23లో భారత్‌లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్ వ్యూహంపై.. ‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్–కియా నమ్యాంగ్ ఆర్అండ్డీ సెంటర్‌తో కలిసి భారత మార్కెట్ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్‌తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు. భారీ లక్ష్యంతో.. ఎస్‌యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్ (పర్పస్ బిల్ట్ వెహికల్స్) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్‌లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్ తెలిపింది. -
పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది
జపాన్‌లో అంతకంతకూ పెరుగున్న వృద్ధుల సంఖ్యకు తోడు తగ్గుతున్న జనాభా ఆ దేశానికి అనేక సవాళ్లను విసురుతోంది. భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వ డేటాలోని వివరాల ప్రకారం జపాన్‌లోని ప్రతి ప్రావిన్స్‌లో మొదటిసారిగా రికార్డు స్థాయిలో జనాభా సంఖ్యలో తగ్గుదల నమోదయ్యింది. జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య దాదాపు 3 మిలియన్లకు పెరిగింది. గత 14 ఏళ్లుగా జపాన్‌లో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ పౌరుల మొత్తం జనాభా 122.4 మిలియన్లు. ఇది 2021 నాటి జనసంఖ్య కంటే ఎనిమిది లక్షలు తక్కువ. 1968 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరుల పాత్ర జపాన్‌లోని మొత్తం 47 ప్రిఫెక్చర్(ప్రాంతం)లలో పౌరుల సంఖ్య తగ్గింది. సాధారణంగా అధిక జనన రేటు కలిగిన ఒకినావా ప్రిఫెక్చర్లో కూడా జనాభా సంఖ్య క్షీణించింది. అయితే క్షీణిస్తున్న జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెసిడెన్సీ కార్డులు కలిగిన విదేశీయుల సంఖ్య 10 శాతం పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్న అనంతరం ఈ సంఖ్య మూడేళ్లలో మొదటిసారిగా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చి జపాన్‌లో నివసిస్తున్న వారి సంఖ్య 2013 తర్వాత అత్యధికంగా ఉందని తేలింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ జననాల రేటును ఎదుర్కొంటున్నాయి. అయితే జపాన్‌లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. విదేశీ జనాభాకు నిలయంగా టోక్యో జపాన్‌లోని ప్రతీ ప్రావిన్స్‌లో విదేశీ నివాసితుల సంఖ్య పెరిగింది. రాజధాని టోక్యో విదేశీ పౌరుల జనాభాకు నిలయంగా మారింది. దాదాపు ఆరు లక్షల మంది విదేశీయులు ఇక్కడ నివసిస్తున్నారు. అదేసమయంలో టోక్యోలో జపాన్ పౌరుల జనాభా తగ్గింది. అయితే విదేశీయుల చేరిక కారణంగా ఈ ప్రావిన్స్ మొత్తం జనాభా పెరిగింది. అకిటా ప్రిఫెక్చర్ జనాభా అత్యధికంగా 1.65 శాతం మేరకు తగ్గింది. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం 2067 నాటికి జపాన్ జనాభాలో 10.2 శాతం విదేశీయులు ఉంటారని అంచనా. విదేశీ నివాసితుల సంఖ్య పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతోంది. నిబంధనలను సడలించడంతో.. జపాన్‌లో కఠినమైన ఇమ్మిగ్రేషన్ నియమాలు అమలులో ఉన్నాయి. అయితే కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వాటిని క్రమంగా సడలిస్తోంది. ఇది విదేశీయుల రాకకు మార్గం సుగమం చేసింది. ఇక్కడ జనాభాలో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లల సంఖ్య 11.82 శాతంగా ఉంది. ఇది 0.18 శాతం తగ్గింది. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.15 శాతం పెరిగి 29.15 శాతానికి చేరుకుంది. 92.4 శాతం ప్రిఫెక్చర్లలో జపాన్ జనాభా క్షీణించింది. ఈ సంవత్సరం జూన్‌లో దేశంలో పడిపోతున్న జనన రేటును అధిగమించడానికి జపాన్ ప్రభుత్వం $25 బిలియన్ల ప్రణాళికను ప్రారంభించింది. జపాన్‌లో జాతీయ విధానాలు జనాభా క్షీణతను ఆపడంలో విఫలమయ్యాయి. ఈ ధోరణి యువత,మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తున్నది. ఇది కూడా చదవండి: మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా? -
సీఎం జగన్‌తోనే విద్యాభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ టీఎఫ్ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ధోని వల్లే ఇలా మారాల్సి వచ్చింది..!
-
పార్టీకి ఊపు తెచ్చిన సోయంకు ప్రాధాన్యత ఇవ్వటంలేదా..!
-
హైదరాబాదే మన ఫ్యూచర్ ..!
-
అసలు విషయం బట్టబయలు.. వంగలపూడి అనిత ఏం చేసింది?
పాయకరావుపేట సీటు దక్కదనే అపనమ్మకం ఆమెలో పెరుగుతోందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తనకు మొండి చేయి చూపిస్తుందని భావిస్తున్నారా? సీటును కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబునే బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారా? టీడీపీ కార్యకర్తల మెడలో కండువాలు వేసి వారంతా వైసీపీ కార్యకర్తలేనని పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? తెలుగుదేశంపార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్థితి పైన పల్లకి మోతా.. ఇంట్లో ఈగల మోతలా తయారయిందా అని ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం వస్తోంది.. ఎందుకంటే పాయకరావుపేట నియోజక వర్గంలో ఆమెకు ఎదురువుతున్న పరిస్థితులే అందుకు కారణమని తెలుస్తోంది.. వంగలపూడి అనిత పేరుకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకుంటుంది కానీ.. ఆమెకు మాత్రం నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి ఇప్పటికి అదే విధంగా ఉంది అంటే ఆమె నాయకత్వంపట్ల నియోజవర్గంలో ఎలాంటి విశ్వసనీయత వుందో సులువుగా అర్థమవుతుంది. ఆమెకు ఈ సారి ఎన్నికల్లో పాయకరావుపేట సీటు ఇస్తే వచ్చే ఓడించి తీరుతామని అనిత వ్యతిరేక వర్గీయులు శపథం చేస్తున్నారు.. టీడీపీ ముద్దు.. అనిత వద్దు అంటూ గతంలో అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు నిరసనలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో అనితకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో అనితను కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు. ఎన్నికల తర్వాత అనిత మళ్లి పాయకరావుపేటకు వచ్చారు.. వంగలపూడి అనిత మీద పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆమెను మరొకసారి.. ఈ వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.. లేదా టీడీపీ జనసేన పొత్తు ఉంటే పోత్తులో భాగంగా పాయకరావుపేట సీటును జనసేనకు కేటాయిస్తారని చర్చ నడుస్తోంది. చదవండి: అయ్యన్న ఆశ అదేనట.. అడ్డు పడుతోందెవరు..? ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అనిత. అయితే ఇందుకోసం ఆమె అనుసరిస్తున్న మార్గమే విమర్శలపాలవుతోంది.. పార్టీ క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉండి, ప్రజల సమస్యల మీద పోరాటం చేసి తాను బలంగా ఉన్నానని ఆమె చెప్పుకుంటే పరవాలేదు.. కానీ ఆమె అలా చేయడంలేదు.. వంగలపూడి అనిత ఈ మధ్యకాలంలో చేసిన ఒక కార్యక్రమం పట్ల సొంత పార్టీ నేతలే చీత్కరించుకుంటున్నారు. ఇంతకీ అనిత చేసిన ఆ పని ఏమిటో ఒకసారి చూద్దాం.. తెలుగుదేశం పార్టీలో ఉన్న పదిమందిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని నమ్మబలికింది. వారి మెడలో కండువాలు వేసి వారంతా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే టీడీపీలో చేరుతున్నారంటూ సభ ఏర్పాటు చేసింది.. వాస్తవంగా వారంతా తెలుగుదేశం పార్టీలో వున్నవారే.. వారు మొన్నటిమొన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగాను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి వారిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంటూ అటు టీడీపీ అధిష్టానాన్ని ఇటు నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు వనిత. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..! అనిత చేసిన మోసం ఎంతో కాలం నిలవలేదు. సాక్ష్యాలతో సహా వైఎస్సార్సీపీ నాయకులు బట్టబయలు చేశారు. భాస్కర్ చౌదరి అనే టీడీపీ నాయకునితో పాటు కొంతమంది కార్యకర్తలు ఈ మధ్యనే టీడీపీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీడియా ముందు విడుదల చేశారు.. ఓ పదిమంది టీడీపీ నేతలను తీసుకువచ్చి వారందరికీ కండువాలు వేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ప్రజా సేవ చేసి ప్రజల మనసు గెలవాలి గాని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కండువా లేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా చిత్రీకరించడం తగదంటూ వంగలపూడి అనితకు హితవు పలికారు. వంగలపూడి అనిత ప్లాన్ చేసిన ఈ నిర్వాకాన్ని ముందుగానే గ్రహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, యనమల కృష్ణుడు ఆమె నిర్వహించిన బహిరంగ సభకు రాకుండా గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయట పడడంతో అనిత నవ్వుల పాలయ్యారు. -
ఎన్ఎస్ఈలో చమురు, గ్యాస్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: నైమెక్స్ క్రూడ్, నేచురల్ గ్యాస్‌లలో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్టులకు తెరతీసింది. దీంతో ఎన్ఎస్ఈ ఎనర్జీ బాస్కెట్లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్ హెడ్జింగ్‌కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్ చేసేందుకు ఎన్ఎస్ఈ సీఎంఈ గ్రూప్‌తో డేటా లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌పై దివాలా పరిష్కార చర్యలకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ అనుమతించింది. ఈ సంస్థను వేలం వేయడం ద్వారా రుణదాతలు తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. బియానీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ సైతం దివాలా చర్యల పరిధిలోకి వెళ్లడం తెలిసిందే. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను చూసేందుకు పరిష్కార నిపుణుడిని ముంబై బెంచ్ నియమించినట్టు ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. పరిష్కార నిపుణుడి నియామకంతో కంపెనీ బోర్డు రద్దయిపోయింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ తమకు రూ.1.58 కోట్లు చెల్లించడంలో విఫలమైందంటూ ఢిల్లీకి చెందిన సరఫరాదారు ఫోర్‌సైట్ ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
పిల్లలు... పరిమళించాలి
పిల్లలు ఎలా ఉండాలి? వికసించే పువ్వుల్లా ఉండాలి. సంతోషానికి చిరునామాలా ఉండాలి. ఆందోళన అంటే ఏమిటో తెలియకుండా పెరగాలి. స్కూల్ బ్యాగ్‌లో భవిష్యత్తును నింపుకెళ్లిన పిల్లలు... అదే స్కూల్ బ్యాగ్‌లో భయాన్ని పోగుచేసుకుని వస్తే... తల్లిదండ్రులు అప్పుడేం చేయాలి? పిల్లలను దగ్గరకు తీసుకోవాలి... చేతల్లో ధైర్యాన్నివ్వాలి. ఆనందాల రెక్కలను విరిచేసే దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలి. పువ్వుల్లా పరిమళించడానికి కావల్సినంత భరోసా కల్పించాలి. స్కూల్లో అందరు పిల్లలూ ఒకేలా చేరుతారు. స్నేహానికి చిరునామాల్లా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంటే, మరికొందరు మాత్రం వెనుకపడుతుంటారు. స్వతహాగా ఉండే ఐక్యూ లెవెల్స్ పరిమితులకు లోబడి చదువులో వెనుకబడడం కాదిది. ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా నిరుత్సాహంగా మారి అన్నింటిలోనూ వెనుకబడుతుంటారు. ఆ వెనుకబాటు వెనుక వాళ్లను వెనుకపడేటట్లు చేసిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారో, ఎందుకు తమను తాము ఒంటరిని చేసుకున్నారో బయటకు తెలియదు. ఆ పిల్లల ప్రవర్తనలో అనారోగ్యకరమైన మార్పు మొదలవుతుంది. అది క్రమంగా మొండితనానికి, ధిక్కారతకు దారి తీస్తుంటుంది. స్కూల్ డైరీలో ‘డిస్ ఒబీడియెంట్, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అనే పదాలతో పేరెంట్స్‌కి పిలుపు వస్తుంది. ఆ పరిస్థితి పేరెంట్స్‌కి ఊహించని శరాఘాతం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో, కొంత అపరాధ భావానికి లోనయ్యి, ఓవర్‌గా రియాక్ట్ అవుతూ పిల్లలను దోషులుగా నిలబెడుతుంటారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సరిదిద్దకపోతే పిల్లలు దిక్కారతను అలాగే కొనసాగిస్తారు. ఈ సిచ్యుయేషన్ని సున్నితంగా డీల్ చేయడానికి కొన్ని సూచనలు చేశారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. పిల్లలు అద్దం వంటి వాళ్లు ‘‘పిల్లల్లో చురుకుదనం తగ్గడం, ఎప్పుడూ డల్‌గా ఉండడం, నిద్రలో ఉలిక్కి పడడం వంటివి కనిపిస్తుంటాయి. పిల్లల మనసులో చెలరేగిన అనేక ఆందోళనలు, భయాలు, అవమానం, అపరాధ భావం వంటి అనేక సమస్యలను వ్యక్తం చేసే లక్షణాలివి. ఈ లక్షణాలను గమనించిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దగ్గర కూర్చుని పిల్లలను మాటల్లో పెట్టాలి. నేరుగా ‘ఎందుకిలా ఉన్నావని’ అడిగే సమాధానం రాదు. స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి కదిపితే వాళ్లే ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెడతారు. ఆ చెప్పిన కబుర్లలోనే కారణాలు ఉంటాయి. స్కూల్లో తోటి విద్యార్థులు బాడీ షేమింగ్, బుల్లీయింగ్, ఫిజికల్– ఎమోషనల్ అబ్యూజ్ చేస్తున్నట్లు, భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు అనిపిస్తే ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పిల్లలను ఒకటికి రెండుసార్లు గద్దించి అడగడం ఏ మాత్రం సరికాదు. పిల్లలు మరింతగా బిగుసుకుపోతారు, కాబట్టి వాళ్ల క్లాస్ టీచర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ మన పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్న పిల్లలను దోషులుగా, నేరస్థులుగా చూడవద్దు. వాళ్లూ పసిపిల్లలేనని మర్చిపోవద్దు. అయితే వాళ్లు ఆరోగ్యకరంగా పెరగడం లేదని అర్థం. ఎందుకంటే... పిల్లలు తాము దేనిని తీసుకుంటారో దానినే డెలివర్ చేస్తారు. అమ్మానాన్నలు మరెవరినో ఉద్దేశించి ‘వాళ్ల ఎత్తుపళ్ల గురించో, నడక తీరు మీదనో, దేహం లావు– సన్నం, పొడవు, పొట్టి వంటి విషయాల్లో కామెంట్స్ చేసి నవ్వుతూ ఉంటే’ పిల్లలకు అదే అలవాటవుతుంది. పిల్లలు వాళ్లు చూసిన దాన్ని స్కూల్లో తోటి పిల్లల మీద ప్రదర్శిస్తారు. నిజానికి ఎదుటి వాళ్లను అనుకరిస్తూ గేలి చేయడం, లోపాలను ఎత్తి చూపుతూ ఎగతాళి చేయడం అనేది అభద్రతలో ఉంటూ, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు చేసే పని. ఆ పని ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. బాల్యంలో ఇలాంటి బీజాలు పడితే ఇక అలాంటి వాళ్లు జీవితాంతం ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాలను బహిర్గతం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి రిలేషన్షిప్కీ విఘాతం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే సరిదిద్దాలి. బొమ్మల్లో వ్యక్తమవుతుంది పిల్లలు మూడీగా ఉంటున్నట్లు గమనిస్తే వాళ్లను డ్రాయింగ్, క్లేతో బొమ్మలు చేయడంలో ఎంగేజ్ చేయాలి. ఇది మంచి స్ట్రెస్ బస్టర్ మాత్రమే కాదు, చక్కటి పరిష్కారమార్గం కూడా. బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం ఒత్తిడికి అవుట్లెట్లా పని చేస్తుంది. మాటల్లో చెప్పలేని విషయాలు బొమ్మల్లో వ్యక్తమవుతాయి. ఆ బొమ్మల్లోని పాత్రలు... పిల్లల్లో దాగి ఉన్న కోపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భయాన్ని, బాధించే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంటాయి. పిల్లల మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. పిల్లల మనసు చదవడానికి ఆ బొమ్మలు ఉపయోగపడతాయి. బాధించే పిల్లలు, బాధితులయ్యే పిల్లలను అధ్యయనం చేయడానికి కూడా ఇదే సరైన మార్గం. బిహేవియరల్ ప్రాబ్లెమ్స్‌తో మా దగ్గరకు తీసుకువచ్చిన పిల్లలకు మేమిచ్చే మొదటి టాస్క్ కూడా అదే. తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే... పిల్లలు డల్‌గా ఉంటే ఉపేక్షించవద్దు, అలాగే మీ పిల్లల మీద టీచర్ నుంచి కంప్లయింట్ వస్తే ఆవేశపడవద్దు. టీచర్ ఒక సూచన చేశారంటే ఆ సూచన వెనుక బలమైన కారణం ఉండి తీరుతుందని గ్రహించాలి. టీచర్లు కూడా పిల్లల కాండక్ట్ మీద డిజ్ ఒబీడియెన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని రాసే ముందు వాళ్ల పేరెంట్స్‌కు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేది పేరెంట్స్– టీచర్స్ మధ్య సమన్వయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది’’ అని వివరించారు డాక్టర్ సుదర్శిని. పిల్లల మనసు సున్నితం. పువ్వులాంటి పిల్లలు పువ్వుల్లానే పెరగాలి. వారి భవిష్యత్తు సుమపరిమళాలతో వికసించాలి. బాధించే పిల్లల మీదా శ్రద్ధ పెట్టాలి! పిల్లల్లో స్వతహాగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం ఉంటుంది. అలాంటిది టీచర్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కొందరికి తెలియచేసి, వాళ్లకు కోపం ఉన్న పిల్లలకు సమాచారం చేరనివ్వరు, ఆ టాస్క్‌లో ఫెయిల్ అవ్వాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తారు. ఇది ఏ రకంగానూ పిల్లలను వెనకేసుకు రాదగిన విషయం కాదని పేరెంట్స్ గ్రహించాలి. బాధితులవుతున్న పిల్లల పేరెంట్స్ అయితే విషయం తెలియగానే స్పందించి తమ బిడ్డను కాపాడుకుంటారు. కానీ బాధించే పిల్లల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆ పిల్లలకు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. – డాక్టర్ సుదర్శిని రెడ్డి సబ్బెళ్ల, క్లినికల్ సైకాలజిస్ట్, జీజీహెచ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి -
బెజవాడ సైకిల్‌కు టెన్షనెందుకు?
ఆ పసుపు నేత కాలం కలిసొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈ సారి ఆయన పరిస్థితి రివర్స్ అయిందక్కడ. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పచ్చ పార్టీ ఎమ్మెల్యేకి ముచ్చెమటలు పడుతున్నాయట. తనకంటే వయసులో చిన్నోడే అయినా... అధికారపార్టీ యువనేతను చూస్తేనే సైకిల్ పార్టీ నేతకు టెన్షన్ ఎక్కువవుతోందట. అందుకే కడుపు మంటను చల్లార్చుకునేందుకు నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడు. ఏడాది ముందే వెన్నులో వణుకు ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉండగానే బెజవాడ టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి భవిష్యత్ గుర్తొచ్చి టెన్షన్ పెరుగుతోందట. ఒకప్పటి గన్నవరం ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ గత రెండు సార్లు విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. రెండు సార్లు గెలిచినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి గద్దె చేసిందేమీ లేదు. దివంగత నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏ పదవిలోనూ లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు బాగా చేరువయ్యారు. సీఎం జగన్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. ముఖ్యంగా సీఎం హామీతో కృష్ణలంక వాసుల చిరకాలవాంఛ అయిన కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ ను 130 కోట్ల రూపాయలతో పూర్తిచేయగలిగారు. నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలతో అవినాష్ ముఖ్యమంత్రి జగన్ దృష్టిని ఆకర్షించారు. ఇటీవలే తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ ను ఖరారు చేశారు. డ్రామా పాలిట్రిక్స్ ఈ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లో వణుకు మొదలైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గానికి ఇంఛార్జి హోదాలోనే ఇంత అభివృద్ధి సాధిస్తే...అతన్నే అభ్యర్థిగా ప్రకటించడంతో ..ఇక తన మనుగడ కష్టమని గద్దె డిసైడైపోయారట. రాబోయే ఎన్నికల్లో తనకు పోటీగా దేవినేని అవినాష్ నిలబడితే తనకు డిపాజిట్లు రాననే భయంతో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. వైసీపీ ప్రభుత్వానికి, దేవినేని అవినాష్ కు మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక కడుపుమంటతో గడప గడప కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. అందులో భాగంగానే 17వ డివిజన్ పరిధి రాణీగారితోట ప్రాంతంలో గడప గడప కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్న సమయంలో ఓ టీడీపీ కార్యకర్తతో డ్రామా స్టార్ట్ చేశారు. కావాలనే తమ ఇంటికి అవినాష్ ను పిలిపించి తమకు పథకాలేవీ రావడం లేదంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ఐతే వారికి ఏమేమి పథకాలు వచ్చాయో లిస్ట్ చదివి చెప్పడంతో టీడీపీ మహిళా కార్యకర్తలు కిమ్మనకుండా ఉండిపోయారట. టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం ముందు నాటకాలు.. తర్వాత గొడవలు తన పాచిక పారలేదని గ్రహించి తెల్లారేసరికి పథకం ప్రకారం మళ్లీ అదే టీడీపీ మహిళా కార్యకర్తలు స్థానిక వాలంటీర్ తో పాటు వైసీపీ మహిళలతో గొడవకు దిగారు. వారి కళ్లల్లో కారం కొట్టి... దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంది. ఈ దాడిని తమకు అనుకూలంగా చేసుకోవాలని గద్దె వేసిన స్కెచ్ వర్కవుట్ కాలేదట. తన ప్లాన్ బెడిసిగొట్టడంతో పాటు తనకే రివర్స్ అవ్వడంతో గద్దె షాక్ లో ఉన్నారట. చదవండి: అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..! పథకాలు రావట్లేదని గొడవ చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఏమేమి అందాయో ఆధారాలతో సహా దేవినేని అవినాష్ బయటపెట్టడంతో గద్దె రామ్మోహన్ ను సొంత పార్టీ వాళ్లే అసహ్యించుకుంటున్నారని టాక్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడి పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకు తెలిసింది ఇలాంటి చీప్ పాలిట్రిక్సేనా అని తల బాదుకుంటున్నారట స్థానిక పసుపు క్యాడర్. దేవినేని అవినాష్ చేస్తున్న గడప గడప కార్యక్రమంతో గద్దే రామ్మోహన్‌కు గుబులు మొదలైందనే టాక్ తెలుగుదేశం వర్గాల్లోనే మొదలైంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మంచి మాట: వర్తమానమే జీవితం
మనిషి బతకాల్సింది గతంలోనో, భవిష్యత్తులోనో కాదు వర్తమానంలో. కానీ శోచనీయంగా చాలమంది గతంలోనో, భవిష్యత్తులోనో బతుకుతూ ఉంటారు. గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ వర్తమానాన్ని గడిపేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకుంటూ వర్తమానాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు. ఈ తీరు పెనుతప్పు మాత్రమే కాదు, బతుకును గుట్టుగా కాల్చేసే కనిపించని నిప్పు కూడా. ‘మనలో చాలమంది వర్తమానంలో పూర్తిగా ఉండరు. ఎందుకంటే తమకు తెలియకుండానే వాళ్లు ఈ క్షణం కన్నా తరువాతి క్షణం ముఖ్యమైందని నమ్ముతారు. అలా ఉంటే నువ్వు నీ పూర్తి జీవితాన్ని కోల్పోతావు...’ అని జర్మన్ తాత్విక అధ్యాపకుడు ఎక్‌హార్ట్ టోల్ చెబుతారు. ఒక మనిషి వర్తమానం లో బతకక పోవడం అనే మానసిక దోషానికి విశ్వాసం అనేది లేకపోవడం ప్రధాన కారణం. ఏ వ్యక్తికైనా కాలం మీద, ప్రయత్నాల మీద విశ్వాసం ఉండాలి. అష్టావక్రగీత ఒక సందర్భంలో విశ్వాసాన్ని అమృతం అంటూ‘విశ్వాసామృతాన్ని తాగి సుఖివిగా ఉండు’ అని మనిషికి ముఖ్యమైన సూచనను ఇచ్చింది. సుఖంగా ఉండాలంటే మనిషికి విశ్వాసం అనేది ఉండాలి; ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి.‘నిన్ను నువ్వు విశ్వసించడం విజయంలోని తొలి రహస్యం‘ అని గౌతమ బుద్ధుడు తెలియజెప్పాడు. దట్టమైన చీకటిలో ఎగిరే లేదా ఎగరగలిగే పక్షికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. తనకు ఆత్మవిశ్వాసం ఉంది అనే భావన పక్షికి ఉండకపోవచ్చు. అంతేకాదు, చీకట్లో ఎగిరే పక్షికి గతం గురించి, భవిష్యత్తు గురించి తలపు లు ఉండవు. వర్తమానంలో పక్షి ఎగురుతోంది; వర్తమానంలో ఎంత చీకటి ఉన్నా అంత చీకటిలోనూ పక్షి ఎగర గలుగుతుంది. ఎందుకంటే పక్షి వర్తమానంలో బతుకుతూ ఉంటుంది. పక్షి మనిషికి ఆదర్శం కావాలి. ‘మనిషి బాధపడడం సుఖం అనుకుంటున్నాడు, సుఖపడడానికి బాధపడుతున్నాడు’ కాబట్టే వర్తమానంలో ఉండీ గతంలోకో, భవిష్యత్తులోకో దొర్లిపోతూ ఉంటాడు. మనిషి ఈ స్థితికి బలి అయిపోకూడదు. మనిషి ఈ స్థితిని జయించాలి.‘గతంలోని శోకంతో పనిలేదు; భవిష్యత్తు గురించి చింతన చెయ్యక్కర్లేదు; వర్తమానంలోని పనుల్లో నిమగ్నం అవుతారు వివేకం ఉన్నవాళ్లు’ అని విక్రమార్క చరిత్ర చక్కగా చెప్పింది. గతంలో సంతోషం ఉండి ఉన్నా, శోకం ఉండి ఉన్నా అవి ఇప్పటివి కావు కాబట్టి గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతే మన వర్తమానం వృథా అయిపోతుంది. వర్తమానం వృథా అయిపోతే భవిష్యత్తు కూడా వృథా అయిపోతుంది. గతం గడిచిపోయింది కాబట్టి, వర్తమానం వచ్చేసింది కాబట్టి వర్తమానంలో ఉన్న మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో కాకుండా వర్తమానంలోనే ఉండాలి. ‘నీ హృదయం ఒక సముద్రం అంతటిది. వెళ్లి నిన్ను నువ్వు కనుక్కో మరుగున ఉన్న దాని లోతుల్లో’ అని ఫార్సీ తాత్విక కవి రూమీ చెప్పారు. గతంలో భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు గతంలా ఉండకూడదు. మనిషి వర్తమానంలో బతకడం నేర్చుకోవాలి. వర్తమానంలో బతకడం నేర్చుకున్న మనిషి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన భవిష్యత్తు కోసం, ఉన్నతమైన జీవితం కోసం మనుషులమైన మనం వివేకంతో వర్తమానంలో నిమగ్నమవ్వాలి. వర్తమానంలో ఉన్న మనిషి తన హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోవాలి. అలా తనను తాను కనుక్కోవాలంటే మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో పడిపోతూ ఉండకూడదు. మనిషి వర్తమానంలో మసలాలి; మనిషి వర్తమానంతో మెలగాలి. హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోగలిగిన వ్యక్తి మానసిక దోషాలకు అతీతంగా వర్తమానంలో వసిస్తాడు. – శ్రీకాంత్ జయంతి -
మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....
ఎవరైనా మృతి చెందితే సహజంగా అంతిమ సంస్కారాలు జరిపి అక్కడితే వదిలేస్తాం. కొన్నేళ్లు బాధలో ఉండిపోతాం. క్రమేణా వారి జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు యత్నిస్తాం. కానీ కొంతమంది తమ వారు చనిపోయిన వారు ఏదోనాటికి తిరిగి వస్తారన్న ఆశతో వారి శరీరాలను భద్రంగా దాచుతున్నారట. అందు కోసం అమెరికాలో ఒక సంస్థ ఈ సేవను పెద్ద మొత్తంలో రుసుముతో అందిస్తోంది కూడా. అక్కడ పలువురు శరీరాలను కొన్ని రకాల ఉష్ణోగ్రత మధ్య వివిధ రసాయానాల సాయంతో అత్యంత భద్రంగా ఉంచాతారట. వివారాల్లోకెళ్తే...చనిపోయినా మళ్లీ బతికి రావడం వంటి వాటిని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో అసాధ్యం. కానీ సాధ్యం చేయాలనకుంటున్నారు యూఎస్‌లోని అల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అనే సంస్థ. ఇక్కడ చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగి బతికివస్తారనే ఆశతో జాగ్రత్తగా వారి మృతదేహాలను కాపాడతారు. దీన్ని క్రయో ప్రెజర్వ్ అంటారు. చనిపోయిన వారిని లిక్విడ్ నైట్రోజన్‌తో నిండిన స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకులో ఉంచుతారు. ఇందులో వాటిని మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద దశాబ్దాల పాటు జాగ్రత్తగా ఉంచుతారు. దీన్ని క్రయోనిక్స్ అంటారు. వాళ్లు భవిష్యత్తులో ఏనాటికైనా మేల్కొనేలా సాంకేతిక వైద్యం అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారట. ఇలా తొలిసారిగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్‌పాంగ్ 2015లో 2 సంవత్సరాల వయస్సులో క్రయో ప్రెజర్వ్ చేసిన పిన్న వయస్కురాలు. ఈ అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ వైద్యులు, ఆమెకు మెదడుకు సంబంధించిన ఎన్నో శస్త్ర చికిత్సలు చేశారు గానీ ప్రయోజనం లేకపోవడంతో యూఎస్‌లోని అల్కోర్ ఫౌండేషన్‌ని సంప్రదించి క్రయో ప్రిజర్వ్ చేశారు. అలా బిట్‌కాయిన్ మార్గదర్శకుడు హాల్ ఫిన్నీ, 2014లో మృతి చెందిన తర్వాత క్రయో ప్రిజర్వ్ చేశారు. వాస్తవానికి ఒక వ్యక్తి చట్టబద్ధంగా చనిపోయిన తర్వాత క్రయో ప్రెజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో శరీరాన్ని రక్షించేందుకు అల్కోర్ సంస్థ ఉపయోగించే ప్రక్రియను విట్రిఫికేషన్ అంటారు. అందులో రోగి శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవాలు తొలగించి హానికరమైన మంచు స్పటికాలు ఏర్పడకుండా నిరోధించే రసాయనాలతో భర్తీ చేస్తారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద విట్రిఫై చేసే ట్యాంకుల్లో ఉంచుతారు. అందుకోసం ఒక్క మృతదేహానికి సుమారు రూ. కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం రోగి మెదడుని మాత్రం క్రయో ప్రిజర్వ్ చేయాలంటే దాదాపు రూ. 65 లక్షలు ఖర్చవుతుంది. ఇప్పటివరకు 500 మంది వ్యక్తుల తమ శరీరాలను క్రయో ప్రిజర్వ్ చేయడానికి ఈ సంస్థను సంప్రదించారని చెబుతున్నారు ఫౌండేషన్ అధికారులు. ప్రస్తుతానికి ఈ సంస్థలో సుమారు 199 మంది మానవులను, దాదాపు100 పెంపుడు జంతువులను క్రయో ప్రిజర్వ్ చేశారు. అసలు ఈ ఫౌండేషన్‌ను 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్ లైన్ అనే వ్యక్తులు 1972లో స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెడికల్ ఎథిక్స్ విభాగానికి అధిపతిగా ఉన్న ఆర్దర్ మాట్లాడతూ...ఈ వైజ్క్షానిక కల్పన అనేది ఊహజనితం, సాధ్యమవుతుందని కూడా చెప్పలేం. కానీ చాలా మంది తమవాళ్లు తిరిగి పునర్జీవించేలా సైన్సు అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు ఉన్నవాళ్లు దొరికిన సువర్ణావకాశంగా పేర్కొన్నారు. ఐతే పలువురు శాస్త్రవేత్తలు మాత్రం క్రయోప్రిజర్వ్ చేయబడిన వ్యక్తులు వాళ్లు తిరిగి జీవించి వస్తే అతని చుట్టు ఉన్నా దశాబ్దాల నాటి ప్రపంచానికి ప్రస్తుత ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆ వ్యక్తి ప్రస్తుత ప్రపంచానికి ఒక గ్రహాంతరవాసిగా కనిపిస్తుంటాడని చెబుతున్నారు. (చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!) -
Gujarat Assembly elections 2022: గుజరాత్ గతిని నిర్ణయించే ఎన్నికలివీ..
పాలన్పూర్/దేహ్‌గాం: గుజరాత్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. రాబోయే 25 ఏళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తును తేల్చే ఎన్నికలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన గురువారం బనస్కాంతా జిల్లా పాలన్‌పూర్‌లో, గాంధీనగర్ జిల్లా దేహ్‌గాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గుజరాత్లో బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం పర్యావరణం, పర్యాటకం, పరిశుభ్రమైన తాగునీరు, సాగునీరు, పశువుల పెంపకం, ప్రజలకు పౌష్టికాహారం వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఉద్ఘాటించారు. తాగునీటి కొరత, విద్యుత్ కొరత వంటి సమస్యలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించిందన్నారు. గుజరాత్లో బీజేపీ సర్కారు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసిందని చెప్పారు. మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యారంగం బడ్జెట్ ఏకంగా రూ.33,000 కోట్లకు చేరిందని, పలు రాష్ట్రాల మొత్తం విద్యారంగం బడ్జెట్ కంటే ఇది అధికమని చెప్పారు. డ్రోన్ కలకలం అహ్మదాబాద్ జిల్లా బావ్లా గ్రామంలో మోదీ సభకు ముందు వేదిక వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. డ్రోన్ ద్వారా జనసందోహాన్ని చిత్రీకరించే ప్రయత్నించడంతో స్థానికులు ముగ్గురి అరెస్టు చేíశారు. విద్యుత్‌తో ఆదాయం పొందాలి విద్యుత్ ద్వారా ఆదాయాన్ని పొందే రోజులు వచ్చాయని, ఉచితంగా తీసుకునే రోజులివి కావని ప్రధాని వ్యాఖ్యానించారు. అరావళి జిల్లా మోదాసాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని ఆప్, కాంగ్రెస్ ఇచ్చాయి. ఈ హామీ విపరీతంగా ఆకర్షించడంతో దానిని కౌంటర్ చేయడానికి ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఢిల్లీ హైకోర్టులో ‘ఫ్యూచర్’కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ముందు అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రారంభించిన మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) చర్యలను రద్దు చేయాలంటూ ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్) చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్‌లో మొదట దాఖలు చేసిన క్లెయిమ్ స్టేట్మెంట్ (ఎస్ఓసీ)కి అనుబంధంగా అమెజాన్ చేసిన అభ్యర్థనను అనుమతించే మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ప్రత్యేక ఉత్తర్వును సవాలు చేస్తూ ఎఫ్‌సీపీఎల్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా హైకోర్టు న్యాయమూర్తి సీ హరి శంకర్ కొట్టివేశారు. రాజ్యాంగంలోని 227 అధికరణ ప్రకారం ఆర్ర్బిట్రల్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం కుదరదని న్యాయమూర్తి 47 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అయితే ఆయా పార్టీల మధ్య వివాదాల విషయంలో మెరిట్స్‌పై కోర్టు ఎటువంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయబోదని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ట్విట్టర్ భవిష్యత్ ఏంటి ..?
-
చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు. అక్కడితో ఆగలేదు. వచ్చేసారి అధికారం రాకపోతే రాజకీయాలలో ఉండలేనని కూడా ఆయన కడుపు చించేసుకున్నారు. దీని అర్థం ఏమిటి? చదవండి: అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. 2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించకపోతే జెండా పీకేయడమే అన్న అర్థం కూడా వస్తుంది. ఆయన ఆ మాట అనలేదు కాని, వచ్చేసారి ఎన్నికలలో గెలుస్తాం అని ధీమాగా చెప్పలేకపోయారు. ఇది సహజంగానే తెలుగుదేశం వర్గాలకు ఇబ్బంది కలిగించే అంశమే. తమ పార్టీ విజయావకాశాలపై వారికే నమ్మకం సడలుతుంది. జనంతో బాబు ఆటలు ఇంతకాలం చంద్రబాబు మేకపోతు గాంభీర్యంతో అయినా మాట్లాడేవారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన దానిని కూడా వదిలేశారు. ఆయన కావాలని అన్నారో, లేక తన మనసులో మాట అనుకోకుండా బయటకు వచ్చేసిందో కాని, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం మంచి పాయింట్ అందించారు. దాంతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందని, వచ్చే ఎన్నికలలో గెలవలేనని ఆయనే చెబుతున్నారని, ఈ నేపథ్యంలో పలు అబద్దాలతో పాటు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మధ్యలో తన భార్య ప్రస్తావన తేవడం, జరగని అవమానాన్ని జరిగినట్లుగా మళ్లీ పిక్చర్ ఇవ్వడం, వచ్చేసారి గెలవకపోతే రాజకీయాలలో ఉండలేనని అనడం.. అంతా సానుభూతి కోసమే అన్న విశ్లేషణలు వస్తున్నాయి. డామిట్.. నాడు కథ అడ్డం తిరిగింది.! గతంలో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేస్తేనే రాని సానుభూతి, ఇప్పడు ఆఖరి చాన్స్ అంటే వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాపం తెలుగుదేశం మీడియాకు చెందిన ఒకరు దానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు తనకు ఆఖరి చాన్స్ ఇవ్వాలని అనలేదని, ఆయన వ్యాఖ్యలకు అర్ధం ప్రజలకు చివరి చాన్స్ ఇవ్వడం అని చెబితే అందరూ దానిపై వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సాధారణంగా వయసు మళ్లీనవారు తమ నియోజకవర్గాలలో తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నప్పుడు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. ఈ ఒక్కసారికి గెలిపిస్తే, తాను ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని వారు చెబుతుంటారు. ఆ ఎన్నిక ముగియగానే మళ్లీ మామూలే. ఆ వ్యక్తి గెలిస్తే ఐదేళ్ల తర్వాత యథాప్రకారం ఈ సారి ఖాయంగా తప్పుకుంటానని, ప్రజల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని అంటుంటారు. చివరికి ఓటమి ఎదురయ్యేదాక వారు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు కూడా అలాగే ఆఖరి చాన్స్ అనడం ద్వారా ప్రత్యర్ధులకు మంచి పాయింట్ అందించినట్లయింది. చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమేనని, అందుకే భయంతో ఇలా మాట్లాడారని వారు పేర్కొటున్నారు. ఒక్క ఛాన్స్ ఎందుకివ్వాలి? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. దీనిపై కూడా పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. టీడీపీతో కలవడంపై వెనుకాడే పరిస్థితి ఏర్పడిందని, అందుకే తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు ఆ విషయాన్ని నిర్థారిస్తూ, టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని, జనసేనతో కలిసే బీజేపీ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుందని వారు స్పష్టం చేశారు. దాంతో పవన్ కల్యాణ్ ఊబిలో పడ్డయిట్లయింది. పవన్ ఒక్క ఛాన్స్ అనడంతో చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితిలో తనకు ఆఖరు చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. కానీ ఎక్కడా తాను ఏపీకి ఇంత మంచి చేశాను.. ఇంకా ఫలానా మంచి పనులు చేస్తానని చెప్పడం లేదు. పైగా ఇంత కాలం జగన్ అమలు చేసిన సంక్షేమ స్కీములను విమర్శిస్తూ మాట్లాడిన చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు మాటను పూర్తిగా మార్చి తాము ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తామని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. కర్నూలులో మాట మడత ఏపీలో మూడు రాజధానుల వివాదం టీడీపీని ఒక కుదుపు కుదుపుతోంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని, చంద్రబాబు అందుకు అడ్డుపడుతున్నారని న్యాయ వాదులు విమర్శిస్తున్నారు. వారు ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దీనిని ఎదుర్కోవడం టీడీపీకి ఒక పెద్ద సమస్యగా ఉంది. అందుకే చంద్రబాబు ఇంకో మాట చెబుతున్నారు. తనకు అధికారం ఇస్తే, ఐదేళ్లు పాలించి, ఆ తర్వాత పగ్గాలను వేరే వారికి అప్పగిస్తానని చెప్పారు. అంతే తప్ప తన కుమారుడు లోకేష్‌కు వారసత్వం ఇస్తానని చెప్పలేకపోయారు. లోకేష్ గురించి ప్రమోట్ చేస్తే అసలుకే మోసం వస్తుందేమోనన్న అనుమానం చంద్రబాబులో ఉండవచ్చు. లేక కొడుకు లోకేష్ సామర్థ్యం గురించి పూర్తి అవగాహన ఉండడంతో అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు. ఒక సారి వెనక్కి చూడు బాబు.! రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదు. గత 70 ఏళ్లలో చంద్రబాబు కన్నా పలువురు సమర్ధులు ఏపీని పాలించారు. వారి ఆధ్వర్యంలోనే ప్రకాశం బారేజీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు వచ్చాయి. వారెవరూ తాము లేకపోతే ఆంధ్రులు బతకలేరని చెప్పలేదు. కానీ చంద్రబాబు మాత్రం అంతా తనతోనే ఉందని భ్రమపడుతూ ప్రజలను భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. వర్తమాన సమాజంలో ఎప్పటికప్పుడు కొత్త నేతలు పుట్టుకొస్తారు. కానీ చంద్రబాబు మాత్రం తను అధికారంలోకి రాలేకపోతే ఏదో నష్టం జరుగుతుందని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనపై బురద జల్లేందుకు కష్టపడుతున్న చంద్రబాబు చివరికి ఆయన స్కీములనే అమలు చేస్తామని చెప్పే పరిస్థితిలో పడ్డారు. తద్వారా జగన్ సమర్థ పాలకుడని చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. ఎవరి మ్యానిఫెస్టో మాయమయింది? చంద్రబాబు గత శాసనసభ సమావేశాలకు వెళ్లలేదు. అంతమాత్రాన శాసనసభ ఆగిపోలేదు. ప్రభుత్వం నడుస్తూనే ఉంది. జగన్ తాను చేస్తానని చెప్పిన పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అన్ని ఎన్నికలలో చిత్తుగా ఓడించారు. దాంతో చంద్రబాబులో భయం పట్టుకుని చివరి మాటగా ఆఖరి అవకాశం అన్న పదాన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఓటమి చెందితే ఆయనకు అవి చివరి ఎన్నికలు అవ్వచ్చేమోకాని ప్రజలకు కాదు. ఎందుకంటే ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతూనే ఉంటారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ మాత్రం వచ్చే ఎన్నికలలో గెలిస్తే 30 ఏళ్లు తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే మాటను ప్రజలకు చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పని చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతీ మాటను, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని అమలు చేసి నిజంగానే ప్రజలపై చెరగని ముద్ర వేశారు. చంద్రబాబు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 2014కు ముందు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని పూర్తిగా నెరవేర్చని చంద్రబాబు.. ఏకంగా తమ మ్యానిఫెస్టోనే పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసింది. ఇప్పుడు ఆఖరు అవకాశం అనడం ద్వారా చంద్రబాబు ఆత్మ రక్షణలో పడితే 175 సీట్లకు, 175 గెలుస్తామని చెప్పడం ద్వారా జగన్ అఫెన్స్ గేమ్ ఆడి తన క్యాడర్లో ఆత్మ విశ్వాసం పెంచుతున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
దినేష్ కార్తీక్ కెరీర్ క్లోజ్..!
-
ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్ సప్లైకు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: అవసరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఆస్తుల విక్రయ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు ఫ్యూచర్ సప్లై చైన్స్ లిమిటెడ్(ఎఫ్ఎస్సీఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు వెల్లడించింది. అయితే వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణకున్న ఇతర అవకాశాల అన్వేషణ, పరిశీలన చేపట్టనున్నట్లు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ల పరిష్కారాలను వెదకనున్నట్లు వివరించింది. ఈ అంశాలలో తుది నిర్ణయాలకు వచ్చినప్పుడు వివరాలను అందించనున్నట్లు తెలియజేసింది. ఎఫ్ఎస్సీఎల్ దేశీయంగా ఆర్గనైజ్డ్ విభాగంలో అతిపెద్ద థర్డ్‌పార్టీ సప్లై చైన్, లాజిస్టిక్స్ సేవలు సమకూర్చే కంపెనీగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్ తదితర పలు రంగాల కస్టమర్లకు వేర్‌హౌసింగ్, పంపిణీ, ఇతర లాజిస్టిక్స్ సొల్యూషన్లు అందిస్తోంది. 2022 జులై 26న కంపెనీ బోర్డు అవసరమైన అనుమతులు పొందాక వేర్‌హౌస్ ఆస్తులతోపాటు కొన్ని విభాగాలను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరిగి ఈ నెల 13న నిర్వహించిన అత్యవసర వాటాదారుల సమావేశం(ఈజీఎం)లో ఆస్తుల విక్రయానికి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తాజాగా ఈ ప్రణాళికలను వొదిలిపెడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం! -
అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను
‘‘ఒకే ఒక జీవితం’ చూసి, నాగార్జునగారు ‘మా అమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తుకు వచ్చారు.. చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అని అమల అక్కినేని అన్నారు. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో శర్వానంద్ తల్లి పాత్ర చేసిన అమల మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. కానీ తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నేను చేసిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఐదేళ్లుగా ‘అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా’ని నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్ బాధ్యత నాపై ఉండటంతో నటిగా బిజీగా ఉంటే కష్టం. అందుకే నా మనసుకు హత్తుకునే కథ, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. అలాంటి కథే ‘ఒకే ఒక జీవితం’. నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుందని ఈ మూవీ మరోసారి రుజువు చేసింది. అయితే ‘ఒకే ఒక జీవితం’ లాంటి పాత్రలు చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హత్తుకుని ‘చాలా గర్వంగా ఉంది’ అనడం మర్చిపోలేను. నాగార్జునతో పాటు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ చిత్రానికి డీప్‌గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు. నాకు గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలోలా టైమ్ మిషన్‌లో వెళ్లే అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను (నవ్వుతూ). నాగార్జునగారు, నేను ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం.. మళ్లీ స్క్రీన్‌పై వద్దు (నవ్వుతూ)’’ అన్నారు. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మంచి వైద్యులు, మేనేజ్మెంట్, వాలంటీర్లు ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా అద్భుతమైన సేవలు అందిస్తుంది. ప్రతి శనివారం నేను కూడా స్వచ్ఛందంగా వెళ్లి పని చేస్తున్నాను. -
ఫ్యూచర్ లైఫ్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 136 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 348 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా నీరసించి రూ. 273 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 298 కోట్ల ఆదాయం అందుకుంది. మొత్తం వ్యయాలు 33 శాతంపైగా క్షీణించి రూ. 437 కోట్లకు చేరాయి. గత క్యూ1లో ఇవి రూ. 656 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. రుణదాతలతో కుదిరిన వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రానున్న 12 నెలల్లోగా అసలు రూ. 422 కోట్లు చెల్లించవలసి ఉన్నట్లు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ తెలియజేసింది. వీటిలో దీర్ఘకాలిక రుణాల వాటా రూ. 277 కోట్లుకాగా.. స్వల్పకాలిక రుణాలు రూ. 145 కోట్లుగా తెలియజేసింది. ఈ జూన్ 30కల్లా బ్యాంకులకు చెల్లించవలసిన రూ. 335 కోట్ల రుణ చెల్లింపుల్లో ఇప్పటికే విఫలమైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆస్తుల కంటే అప్పులు రూ. 1,181 కోట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
ఝున్‌ఝున్‌వాలా లేని ఆకాశ ఎయిర్‌లైన్ పరిస్థితి ఏంటి?
సాక్షి,ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అకాలమరణంతో ఇటీవలే సేవలను ప్రారంభించిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్ భవితవ్యం ఏంటి? ప్రణాళికలు ఏంటి? సంస్థ నిర్వహణ ఎలా ఉండబోతోంది అనే సందేహాలు బిజినెస్ వర్గాల్లో నెలకొన్నాయి. ఝున్‌ఝున్‌వాలా రెక్కల కింద ఎదగాలని, రాణించాలని ఎదురు చూసిన ఆకాశ ఎయిర్‌కి ఆయన ఆకస్మిక మరణం షాక్‌నిచ్చింది. (ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే) ముఖ్యంగా భారతదేశంలో, బిలియనీర్ యాజమాన్యంలోని విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, సుబ్రతా రాయ్ సహారాకు చెందిన సహారా ఎయిర్‌లైన్స్ కథ ఇదే. ఈ కారణంగానే విశ్లేషకులు ఆకాశ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించకముందే దాని భవిష్యత్తుపై, సందేహాలను, భయాలను వ్యక్తం చేశారు. ఇపుడు ఆయన హఠాన్మరణంతో ఈ భయాలు మరింత పెరిగాయి. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) అయితే ఆకాశ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ ఝున్‌ఝున్‌వాలా వారసత్వాన్ని, విలువను ముందుకు తీసుకెడతామని, మంచి విలువలతో గొప్ప విమానయాన సంస్థగా నడపడానికి కృషి చేస్తామని దూబే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా తనపై విశ్వాసముంచిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆకాశకు ఝున్‌ఝున్‌వాలా చాలా కీలకం. ముఖ్యమైన పెట్టుబడిదారుడిగా మాత్రమే కాకుండా ఆయనకున్న అపారమైన పలుకుబడితో బ్యాంకులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి చౌకగా ఫైనాన్సింగ్ ఏర్పాటు చేయగల సత్తా ఉన్నవారు. అలాంటి ఆయన మరణంతో కొంత ఒత్తిడి తప్పదని సీనియర్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఆయన మరణం కంపెనీ వృద్ధికి, ఆశయ సాధనకు తాత్కాలిక బ్రేక్స్ ఇస్తుందని, పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే దేశ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే గ్లోబల్ఎయిర్లైన్స్తో ఆకాశ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని మరికొంతమంది మార్కెట్ నిపుణుల అంచనా. ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్ సంస్థ ఎల్సిసిలో 40 శాతానికి పైగా వాటా 3.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 264 కోట్లు) పెట్టుబడులు పెట్టాడు. ఇది ఆయన చివరి ప్రధాన పెట్టుబడులలో ఒకటి మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఇష్టమైనది కూడా. ఆకాశ మొదటి విమానంలోని ప్రయాణీకులతో తీసుకున్న సెల్పీలు తీపి జ్ఞాపకాలుగా మిగిలి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ పేరొందిన ఝున్‌ఝున్‌వాలా చివరిసారిగా ఆగస్ట్ 7న ముంబై -అహ్మదాబాద్ మధ్య జరిగిన ఆకాశ ఎయిర్ తొలి విమాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. వీల్‌చైర్‌లో తిరుగుతూ అందరిన్నీ ఉత్సాహపరుస్తూ జోక్స్ వేస్తూ పోటీదారులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యాల్లోగానీ, ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆకాశ యాజమాన్యం , సిబ్బందికి పిలుపునిచ్చారు. ఆకాశ కోసం ఝున్‌ఝున్‌వాలా ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టి ఇండిగో లాంటి సంస్థల్ని భయపెట్టిన ఝున్‌ఝున్‌వాలా సంస్థ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలే వేశారు విస్తృతమైన పెట్టుబడితో పాటు, ఎయిర్‌లైన్ నిర్వహణ కోసం అగ్రశ్రేణి విమానయాన పరిశ్రమ లీడర్లను ఎంచుకున్నారు. ప్రపంచంలో బహుశా ఏ విమానయాన సంస్థ ఏర్పాటైన 12 నెలల్లో సేవలు ప్రారంభించ లేదు. కానీ ఝున్‌ఝున్‌వాలా ఆ ఘనతను సాధించారు. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ సీఈఓగా పనిచేసిన దుబెనే సీఈవోగా ఎంపిక చేశారు. విమానయాన సంస్థలో దుబేకు 31 శాతం వాటా ఉంది. అలాగే 2018 వరకు ఇండిగో డైరెక్టర్‌గా ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఆదిత్య ఘోష్‌ను కూడా తన టీంలో చేర్చుకున్నారు. ఘోష్ ఎయిర్‌లైన్‌లో 10 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఝున్‌ఝున్‌వాలా చరిష్మా సలహాలు, ఫండ్ పుల్లింగ్ సామర్థ్యాలు ఆకాశకు ఇకపై అందుబాటులో లేనప్పటికీ, ఆకాశ అభివృద్ధి చెందుతుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఆ మేరకు ఆయన సంస్థను కట్టుదిట్టం చేశారన్నారు. ఇండియా జనాభా, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఏవియేషన్ పరిశ్రమ వృద్ధిపై ఆయన విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక ఆకాశ ఎయిర్ అని అన్నారు. అక్టోబర్ 11న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోటర్‌గా ఉన్న 'ఆకాశ ఎయిర్' అల్ట్రా-లో కాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి. జులై 7న సేవలు ప్రారంభించేందుకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' నుంచి 'ఆపరేటర్ సర్టిఫికేట్' పొందింది. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న తొలి సర్వీసును నడిపింది. ఈ క్రమంలోనే ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు19న బెంగళూరు-ముంబై,సెప్టెంబరు 15న చెన్నై-ముంబైకు తన విమాన సేవల్ని అందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. -
ఫ్యూచర్ సప్లైకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 624 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించిన రుణ నష్టం ప్రధానంగా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్.. దివాలా చట్ట చర్యలను ఎదుర్కొంటోంది. కాగా.. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో ఫ్యూచర్ సప్లై కేవలం రూ. 19 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇక మొత్తం ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 134 కోట్లకు పరిమితమైంది. 2020–21 క్యూ4లో ఫ్యూచర్ సప్లై రూ. 150 కోట్ల ఆదాయం సాధించింది. బోర్డులో ఖాళీల కారణంగా సమావేశాన్ని నిర్వహించలేకపోవడంతో క్యూ4 ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు కంపెనీ తెలియజేసింది. ఈ బాటలో గ్రూప్‌లోని పలు కంపెనీల క్యూ4 ఫలితాలు సైతం ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 28.5 వద్ద ముగిసింది. -
క్రిప్టో దారుణ పతనం, దివాలా బాటలో ఎక్స్చేంజీలు, భవిష్యత్తేంటి?
క్రిప్టో కరెన్సీకున్న క్రేజ్ మామూలుది కాదు. అమాంతం ఈ కరెన్సీ విలువ దూసుకుపోవడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా ఈ స్థాయిలో పడిపోతాయని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీకి కారణమేంటి? క్రిప్టోల దారుణ పతనం పెట్టుడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసిందా, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై నిపుణుల అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థిచే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017-2021 మధ్య ఈక్విటీలు-క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30-40 శాతం నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. ఎక్స్చేంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్స్చేంజీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆరి్థకంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్స్చేంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆరి్థక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50-60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30-40 చిన్న ఎక్స్చేంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10-15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. -
మంచి మాట: వర్తమాన జీవితం
చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని చింతిస్తూ, దాని బాగుకోసం అనేక రకాలుగా మానసికంగా చింతిస్తూ ఉంటారు. మరి కొంతమంది గతంలో తాము చేసిన తప్పిదాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ, తమ చుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెడుతూ ఉంటారు. ఈ రెండు అవస్థల మధ్య వారు వర్తమానంలో బతకలేరు. పైగా వర్తమానంలో బతకడం అదేదో గొప్ప నేరంగా భావించి దాని జోలికి వెళ్ళనుగాక వెళ్ళరు. గతం గురించి ఆలోచించడం అవసరమే. అలాగే, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా అవసరమే. అయితే ఇలా గతం, భవిష్యత్తుల కోసం ఆలోచిస్తూ, వర్తమానాన్ని పట్టించుకోకపోతే జీవితం వృథా అయిపోతుంది. ఒక వ్యక్తి జీవన సరళి అతను చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలో వర్తమాన పరిస్థితుల మీద దృష్టి కేంద్రీకరిస్తే చాలా వరకు సమస్యల నుంచి తప్పించుకున్న వాడవుతారు. నిశ్శబ్దాన్ని వినగలగాలి. సూర్యోదయాన్ని ప్రేమించగలగాలి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించగలగాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది – ఈ క్షణాన్ని జారిపోకుండా చూసుకోగలగాలి. ఈ విషయాలపై అవగాహన రానంత సేపూ సంతోషం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. మరోవైపు సంతోషం గురించి తెలియడానికి చాలా కాలం పడుతుంది. ఫలితంగా జీవించడం తెలియకుండా పోతుంది. జీవించడం తెలియకపోతే అసలు ఈ బతుకుకే అర్థం లేకుండా పోతుంది. కనుక జీవితంలో సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో బతకాలి. వర్తమానంలో నివసించాలి. గతం భవిష్యత్తూ ముఖ్యమైనవే. అయితే వర్తమానం అంతకన్నా ముఖ్యమైనది. వర్తమానంలో జీవించడం అవసరం అంటే వర్తమానంలో మాత్రమే జీవించమని కాదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించాలి. వర్తమానంలో జీవించాలి. ఒక పశువు తనకు తిండి దొరికేవరకూ వెతుకుతుంది. దొరకగానే తినడం మొదలు పెడుతుంది. అంటే రోజు మొత్తంలో కొంతసేపైనా వర్తమానంలో బతుకుతోందన్నమాట. అలాగే ఒక పిల్లి .. స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. ఆకలేస్తే.. ఎలుకను నోటకరచుకుని తిని ఏ నీడ పట్టునో సేదదీరుతుంది. అదీ వర్తమానంలో జీవిస్తోంది. ఇలా పశువులు, పక్షులు, జంతువులు తోటిపశువులతో, తోటిపక్షులతో కలిసి ఆనందంగా రాగద్వేషాలకతీతంగా జీవిస్తున్నాయి. వర్తమానానికి విలువనిస్తున్నాయి. కానీ.. లౌకిక జ్ఞానం ఉన్న మనిషి మాత్రం వర్తమానంలో జీవించలేక పోతున్నాడు. పశు పక్ష్యాదులకు మనసు, బుద్ధి, ధర్మం వంటివి లేవు. అయినప్పటికీ అవి వర్తమానంలోనే జీవిస్తూ వర్తమానంలోనే ఆనందాన్ని వెదుక్కుంటున్నాయి. అయితే మనిషి మాత్రం తన కోసం జీవించలేకపోతున్నాడు. భవిష్యత్తు కోసం అతివిలువైన వర్తమానాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో భవిష్యత్ గురించి ఆలోచిస్తూ, తాను బతకడం లేదు సరికదా తన తోటివారిని కూడా బతకనివ్వడం లేదు. ఫలితంగా రేపటి కోసం ఆలోచిస్తూ, రేపటి భవిష్యత్ కోసమే దాచుకుంటూ, వర్తమానంలోని ఆనందాన్ని తనకు తానే నాశనం చేసుకుంటున్నాడు. వర్తమాన జీవితం కంటే భావి జీవితం పైనే నమ్మకం, ఆశ ఉండడం వల్లనే మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక ప్రస్తావన ఉంది. వనపర్వంలో యక్షుడు ధర్మరాజును ‘కిమాశ్చర్యమ్’.. అంటే ‘ఏది ఆశ్చర్యం’ అని ప్రశ్నంచగా.. ‘‘ప్రతిరోజూ యమలోకానికి ఎందరో వెళుతున్నారు. మిగిలినవారు మాత్రం పోయిన వారిపట్ల సానుభూతి చూపుతూ తాము శాశ్వతం అనుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంది?’’ అని దీని అర్థం. నేటి వర్తమాన జీవితంలో ప్రతి ఒక్కరి జీవన విధానం ఇలానే ఉంది. తాము శాశ్వతం అనుకుంటూ, ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తారు. తమ కడుపు కాల్చుకొని తమ భార్యాపిల్లల కోసం దాచి పెడుతున్నారు. తాము పోయినా తమ వాళ్ళు సుఖంగా ఉండాలని తప్పుడు ఆలోచనలతో వర్తమానంలో మనం ఆనందించాల్సిన రోజులను పక్కన పెట్టి, వారి కోసం మన శ్రమనంతటినీ ధారాదత్తం చేస్తున్నాÆ. ఈ ప్రక్రియలో మన సంతానానికి స్వతంత్రంగా బతకడమూ నేర్పడం లేదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటన్న ప్రశ్నకు సంతృప్తికరంగా జీవించడమేనన్న సమాధానం లభిస్తుంది. చాలామంది గతంలో జరిగిన సంఘటనల గురించి, రాబోయే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనల్లో పడి వర్తమానంలో నివసించడం మానేస్తారు. భవిష్యత్ మనకు భావి జీవితాన్నిస్తు్తంది కానీ వర్తమానం ఎప్పటికప్పుడు ఆనందాన్ని అందిస్తుంది. వర్తమానంలో బతకడం గొప్ప అనుభవం. ఈ అనుభవాన్ని పొందడం అంత సులువు కాదు. దీన్ని కొంత సాధన చేసి అలవర్చుకోవాలి.. భవిష్యత్ గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమో అలాగే, వర్తమానంలో జీవించడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్న నాడు జీవితంలోని ఆనంద మకరందాలన్నీ స్వయంగా ఆస్వాదించే వెసులుబాటు కలుగుతుంది. తృప్తి అనేది మనిషికి ఒక వరం. తృప్తి కలిగి జీవిస్తే ధనికుడికి, పేదవాడికి తేడా అనేదే ఉండదు. అలాంటి తృప్తిని పొందడం కోసం ప్రతి ఒక్కరూ వర్తమానంలో జీవించాలి. ఆ వర్తమానం నుంచి వచ్చిన ఆనందమే తృప్తిని కలిగించి మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేస్తుంది. ఇలా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినపుడే నూరువసంతాల ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించగలం. ధనం, కీర్తి జీవితానికి ఉప ప్రయోజనాలు కావాలి కానీ అవే పరమలక్ష్యం కాకూడదన్న నిజాన్ని గుర్తించాలి. అలాగే పిల్లలకీ భవిష్యత్తుపై శ్రద్ధను కలుగజేయాలి కానీ, భవిష్యత్ ముఖ్యమని నూరిపోయకూడదు. భవిష్యత్ అవసరమే కానీ, భవిష్యత్ లోనే అంతా ఉందని వారికి నూరిపోస్తే, వర్తమానంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకుండా పోతాం. – దాసరి దుర్గా ప్రసాద్ -
మూడో ఫ్రంట్ మనగలిగేనా?
దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలో దానిపై రాజకీయ స్పృహ పెరుగుతోంది. దశాబ్దాలుగా ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ చతికిలపడింది. దాంతో బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ రహిత రాజకీయ కూటమికి ఇదే సమయంగా కనబడుతోంది. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బలమైన కారణం లేకుండా ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను కేసీఆర్ తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకోగలిగే పార్టీలు, నామమాత్ర పార్టీలు, బలమైనవే అయినా ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసున్న పార్టీలు... ఇవన్నీ జట్టు కట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా, పూర్తికాలం మనగలవా, వీటికి ఎవరు నేతృత్వం వహిస్తారు అన్నవి ప్రస్తుతానికి ప్రశ్నలే! ‘నీ ఆలోచనా శక్తి నీలో పుట్టే భావోద్వేగాల కన్నా పటిష్ఠంగా ఉంటే గెలుపు నీదే’ అన్నది గ్రీక్ తాత్వికుల కాలం నుంచీ ప్రాచుర్యంలో ఉన్న నానుడి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావుకూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకూ కొన్ని సామ్యా లున్నా... వైరుద్ధ్యాలే ఎక్కువ. ఇద్దరూ ఆవేశపరులే. కేసీఆర్ ఆవేశం గతపు వివక్ష నుంచో, వర్తమానపు అన్యాయాల నుంచో, భవిష్యత్తు అంచనాల నుంచో పురుడు పోసుకుంటుంది. భావోద్వేగాలను కార్యా చరణగా మలిచే బలమైన కసరత్తు పూర్వరంగంలో ఉంటుంది. ఇటీ వల ఆయన తరచూ మాట్లాడుతున్న ‘ఫెడరల్ ఫ్రంట్’కు నిజంగా ఆస్కారం ఉందా? ఆయన ప్రధాని అవ్వొచ్చా? ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... సదరు ప్రతికూల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడొచ్చు. ఇదొక అంచనా! ఆ ఫలితాలతో నిమిత్తం లేకుండానే లోక్‌సభ ఎన్నికలప్పుడు యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి రమారమి సీట్లు తగ్గితే ఎన్డీయే తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేయడం కష్టమే. అప్పుడు ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. మరేదైనా సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనుకుంటే, అదేనా... కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్? దేశంలో ఏకపార్టీ స్వామ్యం పోయి సంకీర్ణ శకం మొదలయ్యాక, అంటే 1989 నుంచి, ఇటీవలి బీజేపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాల మాదిరే బీజేపీయేతర, కాంగ్రేసేతర ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రయోగాలున్నాయి. అలా ఎనభైల చివర్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ ‘నేషనల్ ఫ్రంట్’ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు లభించినట్టే, తొంభైల ద్వితీయార్ధంలో వచ్చిన ‘యునెటైడ్ ఫ్రంట్’ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. అయితే, ఆ ప్రయోగాలు విఫలమై ఆయా ప్రభుత్వాలు కూలడానికి కూడా సదరు బీజేపీ, కాంగ్రెస్‌లే కారణ మన్నది జగమెరిగిన సత్యం. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయ డానికైనా, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చడానికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కావాలనే రాజకీయ వాతావరణం దేశంలో నెలకొంది. మరి కేసీఆర్ అంటున్నట్టు ‘ఫెడరల్ ఫ్రంట్’ పెట్టి, ప్రభుత్వం ఏర్పరచి, నాలుగు కాలాలు మనగలిగేలా చేయడం సాధ్యమా? సమాఖ్య వాదనకు బలం దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలోనే దానిపై రాజ కీయ స్పృహ పెరుగుతోంది. ఎన్డీయే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్పటికీ గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజారిటీ స్థానాలు సాధిం చింది. రెండో మారు గెలుపుతో పార్టీ వైఖరి మారిపోయింది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ‘ఒకే’ల క్రమంలో ఒకే ప్రభుత్వం అన్న ధోరణి పెరిగింది. జీఎస్టీ నుంచి వ్యవసాయ చట్టాల వరకు, బడ్జెట్ కేటా యింపుల నుంచి నదుల అనుసంధానం వరకు... రాష్ట్రాల ప్రాధా న్యాన్ని తగ్గిస్తూ అన్నీ తానై కేంద్రం వ్యవహరిస్తోంది. రాజ్యాంగం నిర్దేశించిన మూడు జాబితాల్లోని రాష్ట్ర అంశాల్లోకి తరచూ చొరబడు తున్న కేంద్ర ప్రభుత్వపు ఒంటెద్దు పోకడల్ని చాలా రాష్ట్రాలు జీర్ణించు కోలేకపోతున్నాయి. తిరిగి తెలుగుతేజమే కేంద్రబిందువా? రెండో మారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, నాటి ముఖ్య మంత్రి ఎన్టీయార్ తన కారు డ్రైవర్‌తో, ‘లచ్చన్నా! నువ్ కూడా రెడీ అయిపో. ఢిల్లీ పోదాం. దేశ పాలన ఏమీ బాగోలేదు. ఈ చట్టాలు అవీ... మనం అక్కడి నుంచే బాగుచేయాలి’ అన్నారట! అన్నట్టుగానే, ఓ అయిదేళ్లకు ‘జాతీయ ఫ్రంట్’కు స్వయంగా నేతృత్వం వహించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుందనుకునే ఫెడరల్ ఫ్రంట్ సర్కారు లోనూ కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారేమో! కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు జాతీయస్థాయి ప్రధాన పార్టీలు దేశానికి న్యాయం చేయలేక పోయాయి. పాజిటివ్ ఓటు ఎంతో అరుదు! దిక్కుతోచని దేశ పౌరుల వ్యతిరేక అభిప్రాయంతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రాంతీయ ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడంలో రెండు పార్టీలు ఘోరంగా విఫలమై, పలు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. దీనికి ఏకైక విరుగుడు ‘ఫెడరల్ ఫ్రంట్ సర్కారు’ అనేది కేసీఆర్ వాదన, ప్రతిపాదన. నిజానికి ఇటువంటి యత్నం ఆయన 2019 ఎన్నికల ముందే చేసినా... కారణాంతరాల వల్ల ఫలించలేదు. ఇప్పట్నుంచి చేస్తే 2024 ఎన్నికల నాటికి ఓ రూపం వస్తుందని ఆయన లెక్క! కాంగ్రెస్‌ను కాదంటే లెక్కలు సరిపోతాయా? దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, దశాబ్దాల తరబడి ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల చతికిలపడింది. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ రహిత రాజకీయ కూటమికి ఇదే అత్యున్నత సమయం అని కేసీఆర్‌కు తెలుసు. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏకరీతి ఆలోచనలతో లేవు. బలమైన కారణం, కారకం లేకుండా అవి ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను ఆయన తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకునే స్థితిలో ఉన్న మమతా బెనర్జీ (బెంగాల్), అఖిలేష్ యాదవ్ (యూపీ) ఎలా స్పందిస్తారో తెలియదు. దేవెగౌడ (కర్ణాటక), తేజస్వీ యాదవ్ (బిహార్) సాను కూలంగానే ఉన్నా... రేపు వారు దక్కించుకోగలిగే స్థానాలు పరిమితం. ఇక స్టాలిన్ (తమిళనాడు), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర) కేసీఆర్ ఆలోచనలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా... వారిప్పుడు కాంగ్రెస్‌తో కలిసున్నారు. ఇక కేజ్రీవాల్ (ఆప్), శరద్ పవార్ (ఎన్సీపీ), మాయావతి (బీఎస్పీ), దుష్యంత్ చౌతాలా (జేజేపీ) భవిష్యత్తులో ఎలా వ్యవహరించనున్నారో తెలి యదు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ (ఒడిషా) వంటి వారు తటస్థంగానే ఉంటున్నారు. ఇటువంటి అస్పష్ట పరిస్థి తుల్లో కాంగ్రెస్‌ను కాదని ఇతర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా అన్నది పెద్ద ప్రశ్న. 2014 ఎన్నికల్లో 44 స్థానాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ 223 చోట్ల రెండో స్థానంలో, మరో 63 చోట్ల మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల బీజేపీకి ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే! కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, అస్సాం... ఇలా పలు రాష్ట్రాలున్నాయి. ఒక రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ శక్తులకు ఇంకో రాష్ట్రంలో కనీస ఉనికైనా లేదు. రాయి చెన్నైలో విసిరితే వచ్చిపడే పాండిచ్చేరీలో కూడా ద్రవిడ పార్టీల ప్రాబల్యం నామమాత్రం. కలయికలు ముందా? తర్వాతా? రాజ్యం చేయకపోయినా... ఈ దేశంలో పలు సందర్భాల్లో కమ్యూని స్టులు ఉత్ప్రేరక పాత్ర పోషించారు. యూపీఏ–1 ప్రభుత్వం 2004– 09 మధ్య పలు మంచి నిర్ణయాలు తీసుకోవడం వెనుక కమ్యూనిస్టుల ఒత్తిడి (కనీస ఉమ్మడి కార్యక్రమం) పని చేసింది. యూపీఏ–2లో ప్రజోపయోగాలు లేకపోగా సర్కారు భ్రష్టుపట్టిపోవడానికి కారణం దూరమైన కమ్యూనిస్టుల ఒత్తిడి, ఉత్ప్రేరక పాత్ర లేకపోవడమే అని విశ్లేషకులంటారు. మరి, రేపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే వారి పాత్ర ఏంటి? ఒకరు ఎన్నికలు ముగిశాక చూద్దాం అంటే, ఇంకొకరు ‘బీజేపీకి వ్యతిరేకంగా మీరు పోరాడండి, మేం మీకు మద్దతుంటాం’ అంటు న్నారు. మిగతా పార్టీల్లో ఎన్నికల ముందు కలిసేదెవరు? తర్వాత కలిసేదెవరు? అన్నదొక సందేహమే. నాయకత్వం ఎవరికి అన్నది ఎప్పటికీ సమస్యే! లోగడ బీజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డ ప్పుడు సంఖ్య ఉన్న ప్రాంతీయ పార్టీ నేతల కన్నా ఏకాభిప్రాయం ఉన్న వీపీ సింగ్, ఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ వంటి బలహీన నాయకులే ప్రధానులయ్యారు. కానీ, ఈసారి పార్లమెంటులో సంఖ్యాబలం ఉండే నాయకులు కీలక నాయకత్వ స్థానాన్ని వదులుకునే వాతావరణం కనిపించడం లేదు. అయినా... ఇప్పుడే ఆ చర్చ పెడితే, అది పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిన చందం అవుతుందేమో! వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్; డైరెక్టర్, పీపుల్స్ పల్స్ ఈ–మెయిల్ :peoplespulse.hyd@gmail.com -
అమెజాన్‌కి షాక్ ! మళ్లీ మొదటికి వచ్చిన వివాదం?
న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయ పోరాటం విషయంలో ఫ్యూచర్ గ్రూప్‌కు ఊరట కలిగించే కీలక ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వెలువరించింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మూడు ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఏఎస్ బోమన్న,హిమా కోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ, తాజా తీర్పునకు కేసును రిమాండ్ బ్యాక్ (వెనక్కు పంపడం) చేసింది. వివరాలు క్లుప్తంగా...2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ రూ.24,713 ఒప్పందం ప్రకటించింది. అయితే దీన్ని అమెజాన్ వ్యతిరేకించింది. గత ఒప్పందాల ప్రకారం, ఫ్యూచర్ వ్యాపారాలను తనకే అమ్మాలని స్పష్టం చేసింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సింగిల్, ద్విసభ్య ధర్మాసనాలు విచారించి తమ రూలింగ్స్‌ను ఇచ్చాయి. ఈ విషయంలో ప్రధానంగా ఢిల్లీ హైకోర్టు నుంచి వేర్వేరు తేదీల్లో ఫ్యూచర్‌కు వ్యతిరేకంగా మూడు రూలింగ్స్ వచ్చాయి. మూడు ఉత్తర్వులు ఇవీ... రిలయన్స్‌తో విలీన ఒప్పందం విషయంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని గత ఏడాది ఫిబ్రవరిలో ఫ్యూచర్ గ్రూప్‌నకు ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలు అందులో మొదటిది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అత్యవసర రూలింగ్ (ఈఏ)ను సమర్థిస్తూ, మార్చి 18న ఇచ్చిన ఉత్తర్వు మరొకటి. ఈఏ అవార్డును సమర్థిస్తూ, హైకోర్టు ఫ్యూచర్ గ్రూప్‌పై డైరెక్టర్లపై రూ.20 లక్షల జరిమానా విధించింది. డైరెక్టర్ల ఆస్తుల జప్తునకూ ఆదేశించింది. 2021 అక్టోబర్ 29న మరో రూలింగ్ ఇస్తూ, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎమర్జెన్సీ అవార్డులో జోక్యం చేసుకోవడానికి, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. వీటిపై ఫ్యూచర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వివాదంతో తీర్పును వెలువరించింది. ‘సమస్యను తిరిగి పరిశీలించి, ఎటువంటి ఇతర ప్రభావం లేకుండా, స్వంత మెరిట్‌లపై ఆర్డర్‌ను జారీ చేయాలని మేము గౌరవ హైకోర్టు న్యాయమూర్తిని ఆదేశిస్తున్నాము. అలాగే కేసును త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచిస్తున్నాము’’ అని అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: ఫ్యూచర్ వివాదంపై ఎన్సీఎల్ఏటీకి అమెజాన్ -
‘యంత్ర’ ముగ్ధులౌతారు
ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రోబోలను పనికిపెట్టారు. వచ్చే వాళ్లకు స్వాగతం చెప్పడం, వాళ్లతో మాటలు కలపడం, భోజనం తీసుకురావడం, వడ్డించడం.. అబ్బో ఇలా రకరకాల పనులను అవే చేయడం చూసి జనం ఆశ్చర్యపోయారు. సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే పోలీస్ రోబోలను సృష్టించారు. రోడ్ల మీద ఎవరైనా రూల్స్‌ను అతిక్రమిస్తే చాలు.. ‘ఏయ్.. సెట్ రైట్’ అని హెచ్చరిస్తున్నాయి ఇవి. ఇదే సింగపూర్‌లో ఇంటింటికీ వెళ్లి వస్తువులను డెలివరీ చేసే రోబోలూ అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలేమో సరిహద్దుల్లో గస్తీ కాస్తూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే రోబోలను ఆవిష్కరించారు. వీటన్నింటినీ చూస్తుంటే మున్ముందు ప్రపంచమంతా రోబోలదేనేమో అనిపిస్తోంది కదా. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ కూడా ఇదే చెప్తోంది. 2030 నాటి కల్లా ప్రపంచంలో 2 కోట్ల ఉద్యోగాల్లో రోబోలే ఉంటాయని అంచనా వేస్తోంది. రోబోల వాడకం పెరుగుతోందా? గత పదేళ్లలో రోబోల వాడకం పరిశ్రమల్లో బాగా పెరిగింది. 2010లో దాదాపు 10.59 లక్షల రోబోలను ఇండస్ట్రీల్లో వాడితే అది 2020 కల్లా మూడు రెట్లు పెరిగి 30.15 లక్షలకు చేరిందని వరల్డ్ రోబోటిక్స్ 2021 రిపోర్టు వెల్లడించింది. ఏయే రంగాల్లో వాడుతున్నారు? రోబోలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆటోమోటివ్ రంగం ఉంది. 2020 నాటికి ప్రపంచ లెక్కలను పరిశీలిస్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో 1.09 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత ఆటోమోటివ్ రంగంలో 80 వేలు.. లోహ పరిశ్రమల్లో 41 వేల రోబోలను వినియోగిస్తున్నారని వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు 2021 వివరించింది. వాడకం ఏ దేశాల్లో ఎక్కువ? రోబోలను అత్యధికంగా చైనాలో వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలున్నాయి. వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు లెక్కల ప్రకారం 2020 నాటికే చైనాలో 1.68 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్‌లో 38 వేలు, అమెరికాలో 30,800, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో 30,500 వాడుతున్నారు. ఈ లిస్టులో ఇండియా 15వ స్థానంలో ఉంది. మన దేశంలో 3,200 రోబోలను వాడుతున్నారు. కరోనా సమయంలో.. రోబోలకు వైరస్ సోకే అవకాశం లేదు కాబట్టి కరోనా సమయంలో వీటి వాడకం పెరిగింది. మున్ముందు మహమ్మారుల సమయంలో రోబోల వాడకం పెరగవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అభిప్రాయపడింది. ఇళ్లల్లో వాడుతున్నారా? రోబోల వాడకం ఇళ్లల్లో కూడా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2019–2020లో ఒకేసారి 5 రెట్లు మర బొమ్మల వాడకం ఎక్కువైంది. ఈ లెక్కలను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ (ఐఎఫ్ఆర్) వెల్లడించింది. ఈ కొనుగోళ్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం రూ. 82 వేల కోట్లకు చేరింది. ఇళ్లల్లో వాడే రోబోల అమ్మకాలు మున్ముందు ఊపందుకుంటాయని, ఏటా 46 శాతం వరకు పెరుగుదల ఉంటుందని ఐఎఫ్ఆర్ వివరించింది. 2022లో దాదాపు 5.5 కోట్ల రోబో యూనిట్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. స్పేస్‌లోకి కూడా.. వివిధ రకాల పరిశోధనలకోసమని రోబోలను స్పేస్‌లోకి కూడా పంపారు. ఎందుకంటే.. తక్కువ డబ్బుతోనే రకరకాల నైపుణ్యాలతో వీటిని తయారు చేయొచ్చు. పైగా రోదసీలో ఆస్ట్రొనాట్లు చేయలేని ప్రమాదకరమైన పనులను రోబోలతో చేయించవచ్చు. ‘చిట్టి’ లాంటి రోబోలు .. ఈ ఏడాది కొత్త రకం రోబోలు ముందుకొచ్చాయి. అచ్చం మనుషుల్లా ఉండే హ్యూమనాయిడ్ రోబోలు, ఓషన్ రోబోలను వార్తల్లో కనిపించాయి. స్వరాన్ని గుర్తు పట్టడం, వైద్య చికిత్సల్లో పాలు పంచుకోవడం లాంటి అదనపు నైపుణ్యాలను వీటికి జోడించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
లక్ష్యసాధనకు స్వీయ నియంత్రణ
నేటితరంలో యువతను సునిశితంగా పరికిస్తే, కొందరిలో ఒక రకమైన నిరుత్సాహ ధోరణి కనబడుతుంది. ‘‘నేను పెద్ద చదువులు చదువుదామని అనుకున్నా, కానీ అది నాకు సాధ్యం కాని పని కదా’’, ‘‘నేను సివిల్ సర్వీస్ అంటే విపరీతంగా అభిమానిస్తా.. కానీ నాకది సాధ్యం కాదు సుమా..’’ వంటి సంభాషణలు తరచు వింటూ ఉంటాం. కానీ, ఆ ధోరణిలో మాట్లాడే యువతీ యువకుల మాటలను విని వదిలేయడం కాకుండా, వీలున్నంత వరకు వారిని సంస్కరించడానికి యత్నించాలి. మానవుడు సాధించలేనిది ఏముంది? మహితమైన, జగతికి హితమైన ఎన్నో కార్యాలను మన తోటి మానవులే సాధించారు. వారికి, సామాన్యమైన రీతిలో సాగేవారికి తేడా ఏమిటి? కారణాలు ఎన్నైనా, ప్రధాన సూత్రం ఒక్కటే..!! వారు తమపై తమకు అపురూపమైన రీతిలో నమ్మకాన్ని కలిగి ఉండడమే గాకుండా, తగిన రీతిలో పరిశ్రమించడమనేదే, వారు కోరుకున్నది సాధించగలగడానికి సహకరించిన విశేషమైన అంశం. వ్యక్తి అస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించే వాటిలో మొదటిది వారికి తమపై తమకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నతస్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆ విధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధిగా నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్యలోనూ, విషయ గ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, వారికున్న మానసిక బలం, శారీరక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించవలసిన పనిలేదు. మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడగలగడమూ కష్టమేమీ కాదు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతి వ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిస కాకుండా ఉండడమూ స్వీయ నియంత్రణలో అంతర్భాగమే..!! తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు ఇవ్వకూడదు. సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణిని సూచించే ఒక చిన్న ఉదంతాన్ని ప్రస్తావించుకుందాం. ఒకచోట ఒక వక్త చక్కని ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు. ఇద్దరు మిత్రులు ఆ ఉపన్యాసాన్ని వినగోరి అక్కడకు వచ్చారు. వక్త తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, ఆయన మెడలో ఉన్న గులాబీ దండలోని రేకులు ఒక్కటొక్కటిగా రాలి పడుతున్నాయి. మిత్రుల్లో ఒకడు రెండోవాడితో ‘‘చూశావా.. ఆయన వేసుకున్న దండలోని గులాబీరేకులు ఎలా రాలి పడుతున్నాయో..!! కాసేపటికి రేకులన్నీ రాలిపోగా చివరికి లోపలున్న దారం ఒక్కటీ ఆయన మెడలో మిగులుతుంది’’ అంటూ ఎకసెక్కపు ధోరణిలో నవ్వాడు. రెండోవ్యక్తి అతని మాటలకు ప్రతిస్పందిస్తూ, ‘‘నువ్వు ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తు్తన్నావు మిత్రమా.. ఆయన అమృతమయ వాక్కులకు పరవశించి, ఆ గులాబీ రేకులు పూజిస్తున్న చందాన, పవిత్రమైన ఆయన పాదాలను తాకుతున్నాయని భావించవచ్చు కదా’’ అన్నాడట. మనిషిలోని సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణులకు ఈ మిత్రుల మాటలే అద్దం పడతాయి. సమస్త శక్తీ మనలోనే నిబిడీకృతమై ఉంది. మనసారా పరిశ్రమిస్తే, తలపెట్టిన ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేయగలడు. అద్వితీయమైన తన చేతలతోనే దైవత్వాన్నీ ప్రదర్శించగలడు. నిద్రావస్థను వదిలి జాగ్రదావస్థలోకి రాగలిగితే మానవమేధ దారిలోఎదురయ్యే అన్ని అవరోధాలను తొలగిస్తుంది... అన్ని అవసరాలనూ తీర్చగల, అన్ని ఆకాంక్షలనూ ఈడేర్చగల అపూర్వమైన శక్తి మనిషిలో దాగి ఉంది. అయితే, ఆ శక్తి తనలో ఉందని గ్రహించగలగడమే వివేకవంతుడు చేయగలిగిన పని. జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే కారణం. జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను అందుకోవడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు పాటించే స్వీయ నియంత్రణ లేదా క్రమశిక్షణ అని చెప్పవచ్చు. ప్రతి మనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతలద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తిమంతమవుతుంది. –వ్యాఖ్యాన విశారద+ .++000000000 వెంకట్ గరికపాటి -
కూతురు కులాంతర వివాహం.. భవిష్యత్‌పై బెంగతో..
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కులాంతర వివాహం చేసుకున్న కూతురిని అల్లుడు తీసుకెళ్లడం లేదని, కూతురి భవిష్యత్‌పై బెంగతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని లింగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తానాజీనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యపల్లి గ్రామానికి చెందిన గూడ సత్తయ్య, వరలక్ష్మి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు నాగలక్ష్మి ఆరు నెలల క్రితం రోటిగూడకు చెందిన వెంకటేశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కొద్దిరోజులకే ఆమెను ఇంట్లో వదిలి వెళ్లిన అల్లుడు తిరిగి తీసుకెళ్లడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి(48) ఆదివారం రాత్రి ఇంటి పక్క ఉరేసుకుంది. మృతురాలి భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. స్థల వివాదంలో నిండు ప్రాణం బలి సాక్షి, సిరికొండ(బోథ్): చిన్న స్థల వివాదం చిలికిచిలికీ గాలివానగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన మండలంలోని రాంపూర్‌గూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాథోడ్ ఉమ్మజీ(32), రాథోడ్ మహదులు ఇద్దరు వరుసకు బాబాయి, కొడుకులు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. రాథోడ్ మహదు మూడు రోజుల క్రితం మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాడు. కాగా ఈ స్థలంపై ఇరు కుటుంబాలు గొడవకు దిగాయి. ఆదివారం రాత్రి రాథోడ్ మహదు, కుటుంబ సభ్యులతో కలిసి రాథోడ్ ఉమ్మజీపై దాడి చేయగా ఉమ్మజీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాథోడ్ మహదు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ అన్నారు. ఉమ్మజీకి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, రెండు నెలల మగ కవల పిల్లలు ఉన్నారు. -
పిల్లల భవిష్యత్తుకు.. ఫ్లెక్సీక్యాప్ లేదా స్మాల్‌క్యాప్?
పిల్లల భవిష్యత్తు దృష్ట్యా 10-15 ఏళ్ల కోసం.. మల్టీక్యాప్ (ఫ్లెక్సీక్యాప్) లేదా స్మాల్ క్యాప్‌లలో అధిక రాబడుల కోసం ఏది మెరుగైన ఎంపిక అవుతుంది? చక్కని పోర్ట్‌ఫోలియో రీత్యా అంతర్జాతీయ ఫండ్స్‌కు ఎంత మేర కేటాయింపులు చేసుకోవచ్చు?- వరుణ్, పుణె మార్కెట్ల హెచ్చు, తగ్గులను చూసి కలవర పడకపోతే మల్టీక్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది. అయితే, 10-15 ఏళ్ల దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. పెట్టుబడులు పెట్టి మర్చిపోయేట్టు అయితే, ఈక్విటీల్లో అనిశ్చితులకు చలించేట్టయితే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశం కాల వ్యవధే. మీ ప్రశ్న ప్రకారం 15 ఏళ్ల వరకు మీకు డబ్బుల అవసరం లేదు. మల్టీక్యాప్ ఫండ్స్ కూడా మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, వాటిల్లో రాబడులు మరీ ఎక్కువగా ఉండవు. అస్థిరతలు కొంత తక్కువ. ఎందుకంటే పెట్టుబడుల్లో వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. మీ రెండో ప్రశ్న అంతర్జాతీయ ఫండ్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఫండ్స్‌లో మీకు పెట్టుబడులు లేనట్టయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో 15-20 శాతం నిధులను వీటికి కేటాయించుకోవచ్చు. అయితే, అంతర్జాతీయ ఫండ్స్‌ను విభిన్నంగా చూడరాదు. వీటిని సైతం మొత్తం ఈక్విటీ కేటాయింపుల్లో భాగంగానే చూడాలి. అంతర్జాతీయ ఫండ్స్‌కు 15-20 శాతం కేటాయింపులను ఒకే సారి కాకుండా కొంత కాల వ్యవధి పరిధిలో కేటాయించుకోవాలి. దీనివల్ల కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఏర్పడే నమ్మకానికి అనుగుణంగా మరింత కేటాయింపులు చేసుకోవడం లేదా అప్పటి వరకు చేసిన కేటాయింపులకు పరిమితం కావొచ్చు. నా వయసు 55 ఏళ్లు. ముందస్తుగానే స్వచ్చంద పదవీ విరమణ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం నా నెలవారీ ఖర్చులు రూ.50,000. రిటైర్మెంట్ నిధి కింద రూ.80 లక్షలు సమకూర్చుకున్నాను. జీవించి ఉన్నంత కాలం క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం వచ్చేందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? -నీరజ, హైదరాబాద్ రూ.80 లక్షల నిధిపై ప్రతి నెలా రూ.50,000 ఆదాయం కోరుకుంటున్నారు. అంటే ఈ లెక్కన వార్షికంగా ఉపసంహరించుకునే రేటు 7.5 శాతం అవుతుంది. ఇలా అయితే మీ దగ్గరనున్న నిధి తొందరగా కరిగిపోతుంది. పైగా మీరు ముందుగానే పదవీ విరమణ తీసుకుంటున్నారు. దీంతో ఈ నిధిపై ఎక్కువ కాలం పాటు ఆధారపడి ఉంటారు. కనుక మీ రిటైర్మెంట్ ప్రణాళికను మరో సారి సమీక్షించుకోవాలి. ఎవరైనా కానీయండి.. రిటైర్మెంట్ నిధి నుంచి ఉపసంహరణ రేటు అన్నది 5 శాతం మించకూడదని మేము విశ్వసిస్తాము. ఈ లెక్కన మీ రిటైర్మెంట్ నిధిపై ప్రతి నెలా రూ.30,000-35,000 మధ్యలో ఆదాయం వస్తుంది. కనుక ఇది సరిపోదు. ఈ దృష్ట్యా మీరు ముందస్తుగా పదవీ విరమణ తీసుకోవాలన్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోండి. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేందుకు గాను.. ప్రతీ ఒక్కరు 35-40 శాతం నిధిని ఈక్విటీలకు కేటాయించుకోవడాన్ని పరిశీలించాలి. మిగిలిన నిధి నుంచి ఏడాది, ఏడాదిన్నర అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుని క్రమం తప్పకుండా పెట్టుబడుల ఉపసంహరణ (సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్/ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నిధిని అధిక నాణ్యత కలిగిన స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ విధమైన పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకున్న తర్వాత.. ఏటా ఒక్కసారి ర్యీబ్యాలెన్స్ (మళ్లీ సమతుల్యం ఉండేలా చూసుకునేందుకు) చేసుకోవాలి. అంటే ఈక్విటీలకు 35 శాతం స్థాయిలో కేటాయింపులు ఉండేలా చూసుకుని.. అంతకుమించి ఉన్న నిధిని లిక్విడ్ ఫండ్స్‌కు మళ్లిస్తూ ఎస్‌డబ్ల్యూపీని కొనసాగించుకోవాలి. దాంతో క్రమబద్ధమైన ఆదాయం అందుకోవచ్చు. అయినా సరే 7.5 శాతం ఉపసంహరణ రేటు అన్నది ఈ ప్రణాళికలోనూ సాధ్యం కాకపోవచ్చు. -
ఫ్రెంచ్ ఆస్కార్ వేడుకలో నటి నగ్నంగా నిరసన తెలిపింది
-
అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి
పారిస్: 'ఫ్రెంచ్ ఆస్కార్' వేడుకలో అనూహ్య పరిణామం సభికులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో సంస్కృతికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని డిమాండ్ చేస్తూ నటి కోరిన్ మాసిరో (57) నగ్నంగా మారిపోయారు. సీజర్ అవార్డుల వేడుక సందర్బంగా శుక్రవారం ఈ సంచలన నిరసనకు కోరిన్ దిగారు. ఫ్రాన్స్‌లో ఆస్కార్‌తో సమానంగా భావించే వేదికపైకి ఉత్తమ దుస్తులకు అవార్డును అందజేయడానికిమాసిరోను ఆహ్వానించారు. ఈ సమయంలో రక్తంతో తడిసిన గాడిదను పోలిన దుస్తులతో వచ్చారు. వేదికపై మాట్లాడుతూనే పూర్తిగా నగ్నంగా మారిపోతున్నానంటూ ప్రకటించి అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పారిస్ ఒలింపియా కచేరీ హాల్లో "సంస్కృతి లేదు, భవిష్యత్తు లేదు" అనే నినాదంతో ఆమె దర్శనమిచ్చారు. ఇంతకంటే కోల్పోయేది ఏమీ లేదంటూ ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ‘మా కళను మాకు తిరిగి ఇవ్వండి... జీన్’ అంటూ బాడీ అంతా రాసుకొని ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌కు విజ్ఞప్తి చేయడం విశేషం. కాగా కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా మూడు నెలలకు పైగా ఫ్రాన్స్‌లో సినిమాలు మూతపడ్డాయి. గత డిసెంబరులో, వందలాది మంది నటులు, థియేటర్ డైరెక్టర్లు, సంగీతకారులు, ఫిల్మ్ టెక్నీషియన్లు, క్రిటిక్స్ అనేక మంది సాంస్కృతిక కేంద్రాల మూతకు వ్యతిరేకంగా పారిస్ , ఇతర నగరాల్లో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
విప్రోకు ఉజ్వల భవిష్యత్: ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందని ఆయన తెలిపారు. డిజిటల్, క్లౌడ్, ఇంజనీరింగ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలపై భారీగా ఇన్వెస్ట్ చేయనుందని మంగళవారం కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వివరించారు. ‘సామర్ధ్యాలను పెంచుకునేందుకు విప్రో భారీగా పెట్టుబడులు పెడుతుంది. మారే ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, విలువలకు కట్టుబడి ఇకపైనా ప్రస్థానం కొనసాగిస్తుంది. కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విప్రో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు, షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారని, సెబీ అనుమతుల మేరకు ఆగస్టునాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న ప్రేమ్‌జీ చివరిసారిగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొన్నారు. సుమారు 53 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విప్రోకు సారథ్యం వహించిన ప్రేమ్‌జీ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేసి, కంపెనీ పగ్గాలను కుమారుడు రిషద్ ప్రేమ్‌జీకి అందించనున్నారు. ప్రస్తుతం చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా ఉన్న రిషద్ ప్రేమ్‌జీ జూలై 31న ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. చైర్మన్‌గా ప్రేమ్‌జీకి ఆఖరు ఏజీఎం కావడం తో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్మెంట్ తర్వాత ఆయన విప్రో బోర్డులో నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగనున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై పూర్తి సమయం వెచ్చించనున్నారు. అసాధారణ ప్రయాణం..: ఏజీఎం సందర్భంగా కంపెనీ ప్రస్థానాన్ని ప్రేమ్‌జీ గుర్తు చేసుకున్నారు. ఒక చిన్నపాటి వంటనూనెల సంస్థగా మొదలెట్టిన కంపెనీ.. 8.5 బిలియన్ డాలర్ల భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన తీరును ప్రస్తావించారు. ‘నా వరకూ ఇది ఒక అసాధారణ ప్రయాణం. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, విప్రో తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. విలువలకు కట్టుబడి ఉండటం, ఉద్యోగుల నిబద్ధత, శ్రమతోనే ఇదంతా సాధ్యమైంది. ఇదే విప్రో స్ఫూర్తి‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. రిషద్ సారథ్యంలో మరింత వృద్ధిలోకి..: కొత్త ఆలోచనలు, విస్తృత అనుభవం, పోటీతత్వంతో తన వారసుడైన రిషద్ .. విప్రోను మరింతగా వృద్ధిలోకి తేగలరని ప్రేమ్‌జీ ఆకాంక్షించారు. ‘2007 నుంచి లీడర్షిప్ టీమ్‌లో రిషద్ భాగంగా ఉన్నారు. కంపెనీ గురించి, వ్యాపార వ్యూహాలు, సంస్కృతి గురించి తనకు పూర్తి అవగాహన ఉంది‘ అని ఆయన చెప్పారు. ఎండీగా ఆబిదాలి..: ప్రస్తుతం సీఈవోగా ఉన్న ఆబిదాలి నీముచ్వాలా జూలై 31 నుంచి విప్రో ఎండీ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. నారాయణన్ వాఘుల్, అశోక్ గంగూలీ విప్రో బోర్డు నుంచి పదవీ విరమణ చేయనున్నారు. నాన్–ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టరుగా ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య విప్రో బోర్డులో చేరతారు. -
త్రీడీ గేటెడ్ కమ్యూనిటీకి రంగం సిద్ధం...
మీకు తెలుసా...? ప్రపంచం మొత్తమ్మీద దాదాపు వంద కోట్ల మందికి ఉండటానికి ఇల్లు లేదు. చాలీచాలని సంపాదన ఉన్న వీళ్లు భవిష్యత్తులోనూ ఇల్లు కట్టుకునే అవకాశమే లేదు. ప్రభుత్వ స్కీముల ద్వారా మాత్రమే ఓ ఇంటివారయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతమందికి గూడు కట్టి ఇవ్వాలంటే ప్రభుత్వాలకూ బోలెడంత ఖర్చు అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుకోవాలని ఆలోచిస్తోంది లాటిన్ అమెరికన్ కంపెనీ ఒకటి. ఈ సరికొత్త కార్యక్రమానికి పెట్టిన పేరు ఫూయ్జ్ ప్రాజెక్ట్. త్రీడీ టెక్నాలజీని ఇంటి నిర్మాణంలో వాడుకోవాలన్నది పాత ఆలోచనే గానీ.. ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ టెక్నాలజీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒక్క రోజులోనే పది ఇళ్లను కట్టడం.. ఆఫీసు భవనాలను.. కోటలాంటి నిర్మాణాన్ని కట్టేందుకు విజయవంతంగా ఉపయోగించారు కూడా. ఈ నేపథ్యంలో ఐకాన్ అనే కంపెనీ ఫ్యూజ్ ప్రాజెక్టు సాయంతో లాటిన్ అమెరికా దేశాల్లోని పేదలకు చౌకగా ఇళ్లు కట్టివ్వాలన్న ప్రయత్నం మొదలుపెట్టింది. సిమెంటు కాంక్రీట్‌ను పొరలు పొరలుగా పేరుస్తూ గోడలను నిర్మించడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశం. ప్రాజెక్టు మొదలయ్యేందుకు ముందు ఐకాన్ తాను అభివృద్ధి చేసిన తాజా త్రీడీ ప్రింటర్‌తో నిర్మించిన ఇంటికి అయిన ఖర్చు సుమారు ఏడు లక్షలు మాత్రమే. దాదాపు 350 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని రూ.7 లక్షల్లో కట్టడం సాధ్యం కాదన్నది మనందరికీ తెలుసు. ఐకాన్ త్రీడీ ప్రింటర్ వల్కన్ –2 కాంక్రీట్‌తో గోడలు నిర్మిస్తే.. తలుపులు, కిటికీలు, ప్లంబింగ్ తదితర హంగులను మానవులు సమకూరుస్తారన్నమాట. -
పచ్చని కాపురం
పెళ్లిని కొందరు హంగు ఆర్భాటంగా చేసుకోవాలనుకుంటే, మరికొందరు మంచి సందేశాన్ని ఇచ్చేదిగా తమ పెళ్లి ఉండాలనుకుంటారు. అయితే ఇటువంటి పచ్చటి వివాహాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఈ వివాహం అంతా అడుగడుగునా పాడి పంటలే, ప్రకృతి ఉత్పత్తులే! అలెప్పీ జిల్లా హరిపాద్ గ్రామానికి చెందిన వాణికి వ్యవసాయమంటే ప్రీతి. వ్యవసాయంలో డిగ్రీ సాధించడం కోసం పెద్ద పోరాటమే చేసింది. విజిత్‌కి మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. కెరీర్ గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. ఇంట్లోవారి ఒత్తిడి మేరకు ఇంజినీరింగ్‌లో చేరిపోయాడు. అయితే విజిత్‌కి స్కూల్ రోజుల నుంచి ప్రకృతి మీద మక్కువ ఎక్కువ. పర్యావరణానికి సంబంధించిన క్యాంపులకు స్కూల్ తరఫున వెళ్లేవాడు. దానితో కాలేజీలో చేరాక ఈ ఇష్టం రెట్టింపయ్యింది. స్నేహితులతో కలిసి మొక్కలు నాటేవాడు, కాలేజీ క్యాంపస్‌లో కూడా మొక్కలకు అంట్లు కట్టేవాడు. ‘‘నేను నా జీవితంలో ఇద్దరిని ఎన్నటికీ మరచిపోలేను. శివప్రసాద్ సర్, మోహన్‌కుమార్ సర్. వీరిద్దరూ ఇప్పుడు లేరు. పర్యావరణ గురించి వారిద్దరూ మాకు బాగా అర్థమయ్యేలా చెప్పేవారు. వారి కారణంగా ఈ అంశంలో ఎన్నో విశేషాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చదివాను. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి వారే కారణం’’ అంటాడు విజిత్. తొలి పరిచయం క్యాంపులు జరుగుతున్న సమయంలోనే విజిత్, వాణిలు మొదటిసారిగా కలుసుకున్నారు. ఒక ప్రత్యేక కారణంగా ఇద్దరూ టచ్‌లో ఉండేవారు. మొక్కలు నాటే సమయం, విత్తనాలు నాటడం, అంట్లు కట్టడం సమయాలలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంతో పాటు అనుబంధం ఏర్పడింది. ‘‘ఈ సందర్భంగానే వాణి నాకు చేరువైంది. చాలా చోట్ల ఇద్దరం కలిసి మొక్కలకు అంట్లు కట్టేవాళ్లం’’ అని గుర్తు చేసుకుంటాడు విజిత్. ఆ తర్వాత వాణి బి.ఎస్. (అగ్రికల్చర్) పూర్తి చేసింది త్రిచూర్‌లోని వాటర్‌షెడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఉద్యోగం వచ్చింది. విజిత్ అదానీలోని ఎలక్ట్రిసిటీ బోర్డులో సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా చేరాడు. తరచుగా వారు క్యాంపులలో కలుస్తుండడం వల్ల వాళ్ల బంధం పటిష్టమయింది. వాణి విజిత్లు పాండిచేరి విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్సి. ఇకాలజీ చేయాలనుకున్నారు. ‘‘అయితే అనుకోకుండా వాణి తండ్రికి అనారోగ్యం చేయడంతో.. వాణి కాలేజీ మానేసి.. తల్లిదండ్రులను, నాయనమ్మను చూసుకోవాలసి వచ్చింది. వాణి కుటుంబంలో అందరికీ వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే కాదు ఆయుర్వేద మూలికల గురించి కూడా తెలుసు. అందువల్ల వారికి సేవలు చేస్తూనే ఆమె తమ సొంత పొలంలోనే వ్యవసాయం చేయడం ప్రారంభించింది’’ అని తెలిపాడు విజిత్. వాణితో పాటు అతడు కూడా ఆ కోర్సుకి స్వస్తి పలికాడు. ఉమ్మడి వ్యవసాయం ఈ క్రమంలో కొందరు స్నేహితులతో కలిసి, నాలుగు ఎకరాల పొలంలో ఇద్దరూ వ్యవసాయం ప్రారంభించారు. వాణి వ్యవసాయ సలహాలు ఇచ్చేది. ‘‘ఇది నా జీవితానికి నాంది. వ్యవసాయం పట్ల నేను అంకితభావంతో పనిచేయడానికి తొలి అడుగు పడింది. కాలేజీ రోజులలో చేసిన విధంగానే మొక్కలు నాటటం ప్రారంభించాం’’ అంటాడు విజిత్. ఇద్దరూ సేంద్రియ ఎరువులతో, పర్యావరణ హాని జరగకుండా వ్యవసాయం చేశారు. ఇరుగుపొరుగు వారు రసాయన ఎరువులు వాడి పంట నష్టపోయారు. కానీ వీరి పంట మాత్రం కళకళలాడింది. పురుగు పట్టకుండా సహజ ఎరువులు ఉపయోగించారు. హైబ్రీడ్ విత్తనాలు కాకుండా సహజ విత్తనాలు ఉపయోగించి బెండ, బీన్స్, కంద, వంగ, అరటి, మామిడి వంటి రకరకాల పంటలు పండించారు. మొత్తం ఐదువేల చెట్లు మొక్కలను పెంచారు. అంతేకాదు వారి భూమిలోనే చిన్నచిన్నగా పది చెరువులు తవ్వించారు. ఇరుగుపొరుగు వారంతా వీరి దగ్గరే కూరగాయలు కొనడం ప్రారంభించారు. అంతేకాదు ఎవరికి కావలసినవి వారు కోసుకునే సౌకర్యం కల్పించారు వీరు. సేంద్రియ సంప్రదాయం అజిత్.. వాణితో అన్ని విషయాలు చర్చించేవారే కాని, ఏనాడూ వివాహం గురించి సీరియస్‌గా మాట్లాడుకోలేదు. వాణి స్వయంగా ప్రపోజ్ చేసినప్పుడు కానీ అతడు తన ప్రేమను వ్యక్తం చేసే సాహసం చేయలేకపోయాడు. అప్పుడే వివాహంతో పాటు, పెళ్లివిందు ఎలా ఏర్పాటు చేయాలా అని ఆలోచించారు. వారి ఆలోచన ఈ రోజుల్లో సాధారణమే కావచ్చు కాని, పది సంవత్సరాల క్రితం అది విలక్షణమైనదే. ఏమిటి విలక్షణం అంటే.. పెళ్లి పిలుపులు, పెళ్లి దుస్తులు, పెళ్లి పందిళ్లు, పెళ్లి వంటలు, పెళ్లి విందులు.. అన్నీ సహజమైన ప్రకృతి ఉత్పత్తులతో సంబంధం ఉండేలా చేయాలన్నది! అలాగే చేశారు అదర్శ దంపతులుగా నిలిచారు. – జయంతి -
ఎవరికి ఉపకారి.. ఎవరికి ‘వికారి’..!
తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది. ఈ నెల 6న(నేడు) ఉగాది పండగ జరుపుకోనున్నారు. వికారినామ సంవత్సరంలో విజయాలు చేకూరాలని.. సకల శుభాలు కలగాలని అందరికంటే ముందుగా వివిధ రాజకీయ పార్టీల శ్రేణులు కోరుకుంటున్నారు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులే గెలవాలని వేడుకుంటున్నారు. ఏటా ఉగాది పండగను రైతులే అత్యంత వైభవంగా జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలతో ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులంతా ఉగాదిపై ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెల్లో పండగ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికల కాలంలో ఉగాది పర్వదినం కలిసిరావడం, పండగ తర్వాత ఐదు రోజులకే పోలింగ్ జరగడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సాక్షి, సిరిసిల్ల: కాలచక్రం గిర్రున తిరుగుతోంది. కాలగమనంలో మరో తెలుగు ఏడాది కరిగిపోయింది. విలంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలికాం. కొత్త ఆశలు.. కొంగొత్త ఊసులతో ఉగాది పర్వదినాన ‘వికారి’నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. యుగానికి ఆదిఉగాది. తెలుగు సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న వేళ..‘ఆశలు చిగురించాలి.. ఆశయాలు నెరవేరాలి’. తీపి,పులుపుల మకరందం జీవితంలో అందరూ ఆస్వాదించాలి. తెలుగు సంవత్సరాది ఇంటింటా ఆనందాలు.. సంపదలు నింపాలి.. వికారినామ సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి సుర్రుమంటుంది. ఎన్ని‘కల’ బరిలో దిగిన నేతలంతా కొత్త పంచాంగంలో రాశిఫలాలను చూసుకుంటూ.. ఉగాది పచ్చడిని ఇష్టంగా ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. ఈ వికారి నామ సంవత్సం ఎవరికి ఉపకరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. షడ్రుచుల వేళవింపు ఉగాది పర్వదినం రోజు షడ్రుచులను అందరూ ఆస్వాదిస్తారు. షడ్రుచులు అంటే.. చేదు, పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పులతో కూడుకున్న ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. పంచాంగ పఠనం విని రాశిఫలాలు చూసుకుంటారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఉగాది వేడుకల్లో పాల్గొంటూ.. పనిలో పనిగా ప్రచారాన్ని సాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విలంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలికి వికారినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని తిని పంచాంగాన్ని విని భవిష్యత్ ఆశలతో.. కొత్త ఊసులతో నేతలంతా పార్లమెంట్లో అడుగు పెట్టాలని లక్ష్యంతో ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. రాజయోగం ఎవరికో..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపు లక్ష్యంతో ఎవరికి వారు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ ఓటరు మారాజు ఎవరిని దీవిస్తాడో.. ఎవరికి రాజయోగం కల్పిస్తాడో పంచాంగ శ్రవణం చేసే వేదమూర్తులకు అంతుచిక్కడం లేదు. ఉగాది పర్వదినం పూట.. రాశిఫలాల వారిగా ఆదాయ.. ఖర్చులను చెప్పె ఉగాది పంచాంగంలోనూ ఎన్నికల ఫలితాల ఊసు లేదు. కరీంనగర్ పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. పెద్దపల్లిలో 17 మంది, నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌లో పసుపు రైతులు తమ నిరసన గళాన్ని నామినేషన్ల రూపంలో తెలియజేశారు. నిజామాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. అన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎవరికి రాజయోగం పడుతుందో.. ఎవరికి చేదు, వగరు, కారం ఫలితాలు వస్తాయో వేచిచూడాలి. ఎన్నికలు రోజు తరుముకొస్తున్న వేళ.. ఉగాది పర్వదినం రావడం నేతలందరికీ కలిసొచ్చే అంశమే. రాజయోగాన్ని పరీక్షించుకోవడంతో పాటు.. ఉగాది పూట ప్రచార పంచాంగాన్ని వినిపించవచ్చు. భవిష్యత్‌పై ఆశలు ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ ఏడాది మాత్రం ఈ పంచాంగ శ్రవణానికి మరింత ప్రత్యేకత చేకూరనుంది. గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులు, మండలాల్లో మండలస్థాయి నాయకులు, నియోజకవర్గంలో తాలూకా స్థాయి నాయకులు వికారినామ సంవత్సరం రోజున తాము బలపరుస్తున్న అభ్యర్థుల భవిష్యత్‌పై పంచాంగ బలాలను చూయించనున్నారు. పంచాంగ శ్రవణం పార్టీల ఆధ్వర్యంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే పంచాంగ శ్రవణం జరపడం అనంతరం ప్రచారం చేసుకోవడం రెండు జరిగిపోతాయని నాయకులంతా దృష్టి సారిస్తున్నారు. పార్టీల నాయకుల జన్మ నక్షత్రాలు, రాశుల ఆధారంగా వారి భవిష్యత్ తెలుసుకోనున్నారు. మంచి ముహూర్తంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులకు వికారినామ సంవత్సర విజయాలు అందించాలని నాయకులంతా గ్రామగ్రామాన ఎదురుచూస్తున్నారు. కొత్త... పాత నేతల పోరుబాట.. ఉగాది పూట కొత్త కుండ.. చింతపండు.. మామిడికాయలు.. వేపపూత, కొత్త బెల్లంతో కలిసిన షడ్రుచుల మేళవింపు పరిపాటి. ఈ సారి ఎన్నికల్లో కొత్త నేతలు.. పాత నేతల మధ్య పోరు సాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమయం పతాక స్థాయికి చేరింది. ఎన్నికలకు ఐదు రోజులే ఉండగా.. ప్రచారానికి మూడే రోజులు ఉంది. కరీంనగర్ బరిలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ సిట్టింగ్ ఎంపీగా, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాజీ ఎంపీగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాత్రం కరీంనగర్లో కమలాన్ని వికసించేందుకు మోదీ మంత్రాన్ని జపిస్తున్నారు. పెద్దపల్లి బరిలో అందరూ కొత్తవారే కావడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్థిగా బి.వెంకటేశ్ నేత, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థిగా ఎస్.కుమార్ ఉన్నారు. వీరంతా కొత్త వారే కావడంతో ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి. నిజామాబాద్ బరిలో సిట్టింగ్ ఎంపీ కె.కవిత ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ మాజీ ఎంపీగా పరిచయాలు ఉన్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి డి.అరవింద్ రాజకీయంగా పట్టున్న వ్యక్తి కావడం విశేషం. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఎవరికి వారు ఆశల పల్లకిలో ఊరేగుతుండగా.. ఉగాది పూట ఏ రాశికి రాజయోగం ఉందో.. ఏ రాశి గురువు బలం ఉందో.. వికారి నామసంవత్సరం.. ఎవరికి ఉపకరిస్తుందో వేచి చూడాల్సిందే...! ఇక పదండి.. ఉగాది పచ్చడి స్వీకరించి.. పంచాంగాన్ని ఆలకిద్దాం.. రాశిఫలాలను చూసుకుందాం. -
రానున్నది రాజన్న రాజ్యమే
సాక్షి, విశాఖపట్నం: రానున్నది రాజన్న రాజ్యమేనని, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ అన్నారు. వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఉదయం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మళ్ల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో భూకబ్జాలు పెచ్చుమీరిపోయాయన్నారు. విశాఖలో భూట్యాంపరింగ్ జరిగి లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని సాక్ష్యాత్తు అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమారే వెల్లడించారని గుర్తు చేశారు. సుమారు మూడున్నర కోట్ల ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం పెద్ద సైబర్ నేరమన్నారు. అంచెలంచెలుగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ, దొంగ ఓట్లు సృష్టిస్తూ టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టిందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కలిగి ఉండడం వారి హక్కు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 40 వేలకు పైగా బూత్‌ల్లో ఈ నెల 15వ తేదీ వరకు అధికారులను అందుబాటులో ఉంచి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరారు. ప్రజల ఆదరణ, అభిమానం తమ పార్టీ వైపే ఉన్నాయని చెప్పారు. ఈ సారి వై.ఎస్.జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. టీడీపీ చేస్తున్న కుట్ర, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని, దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా రానున్న ఎన్నికల్లో తీర్పు ఉంటుందని చెప్పారు. తమ మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అవి ఫలించవన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. టికెట్ ఎవరికిచ్చినా కష్టపడి పనిచేయండి పార్టీ విశాఖ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఎనిమిదేళ్లపాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, అదే స్ఫూర్తితో ఎన్నికల్లో పనిచేయాలన్నారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసి పనిచేసి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి కొత్త వ్యక్తులు చేరారని, అందరికీ పదవులు వరించవని, అలాగని ఎవరూ నిరుత్సోహపడవద్దని సూచించారు. మనమంతా ఏకతాటిగా పనిచేసి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. -
నాకూ రెక్కలున్నాయ్ నాన్నా
పిల్లలు పుట్టడమే రెక్కలతో పుడతారుకానీ తలిదండ్రులు అబ్బాయిలకి రెక్కలుంచి అమ్మాయిలకు కత్తిరిస్తుంటారు ఆడపిల్లల పట్ల ఎక్కువ రక్షణ ఉంచాలనుకోవడం మంచిదే కానీ...కంచె కూడా మొక్కను మింగేసేంత ఉంటే ఎలా? స్వేచ్ఛలోనే జ్ఞానం ఉంది. చైతన్యం ఉంది. వివేచన ఉంది. వికాసం ఉంది. నాన్నలూ... మాట వినండి. ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు. ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్ కారు. ఆటంబాంబు పడితే ఎలా ఉండేదో కాని ఆ ఇంటి మీద ఆడపిల్లైతే పడింది.సిద్దిపేటలో అతనో ఉద్యోగి. ఆమె ఆ ఉద్యోగి భార్య. పెళ్లయిన మూణ్ణెల్లకు భార్య గర్భం దాల్చింది. అతని కుటుంబంలో చాలామందికి తొలి కాన్పు మగపిల్లాడే పుట్టాడు. కనుక తనకు కూడా మగపిల్లాడేపుడతాడని అతడు అన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ మగపిల్లాడి కోసం ఎదురు చూస్తుంటే ఆడపిల్ల పుట్టింది.ఆడపిల్లా! ఆడపిల్లే!అతను హతాశుడయ్యాడు. ఆమె నిరాశ పడింది. భవిష్యత్తు చిత్రపటం వారి కళ్ల ముందు గిర్రునో రయ్యినో తిరిగింది.ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. రెక్కల కింద కాపాడుకోవాలి. కట్నం కోసం డబ్బు కూడబెట్టాలి.ఆ తర్వాత మంచి కుర్రాణ్ణి చూసి పెళ్లి చేయాలి. అప్పటికే ఎంత ఖర్చవుతుందో ఏమో. ఏమేమి అవసరమవుతాయో ఏమో.ఇంకొకరిని కందాం అనుకున్నారు మగపిల్లాడు పుడితే.ఆడపిల్ల పుట్టింది కనుక ఆగిపోయారు.ఆడపిల్లకు మాటలొచ్చాయి. తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడింది. స్కూల్లో పక్క బెంచి వాళ్లతోనే మాట్లాడింది. ఆ తర్వాత మాట్లాడటానికి వీల్లేదు. ఆ తల్లిదండ్రులు ఎక్కడికీ పంపరు.బాబోయ్... ఆడపిల్ల.ఏమైనా జరిగితే.ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు.ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్ కారు. పోనీలే వాళ్లనే ఫ్రెండ్స్‌ను చేసుకుందామనుకుంటే హైస్కూల్ చదువు మంచిగా ఉండాలని హైదరాబాద్‌కు తీసుకొచ్చి బావమరిది ఇంట్లో పెట్టారు. వాళ్లు బాగ చూసుకున్నారు నిజమే. కాని వాళ్ల పిల్లలు అదో టైప్. మేచ్ కాలేదు. ఆ పిల్లకు సిద్దిపేటకు వచ్చేయాలనుండేది. కనీసం తల్లిదండ్రులతో ఉండాలనిపించేది. తల్లిదండ్రులు అది వినలేదు. అర్థం చేసుకోలేదు. ఇంటర్ చదువు ఇంకా ముఖ్యమైనదని తీసుకెళ్లి రెసిడెన్షియల్ కాలేజీలో పడేశారు. ఆ కాలేజొక బందెలదొడ్డి. తోటి విద్యార్థులకు బ్రష్ చేసుకోవడానికే టైమ్ ఉండేది కాదు... ఇక స్నేహం ఏం చేస్తారు?డిగ్రీ వచ్చేసరికి తల్లిదండ్రులే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెకండ్ ఇయర్‌కు వచ్చింది.ఒకరోజు తండ్రికి కాలేజ్ నుంచి మెసేజ్ చేసింది.‘నాన్నా.. పెళ్లి చేసుకుంటున్నా’ అని.తండ్రి అదిరిపడ్డాడు. తల్లి ఏడుపు అందుకుంది.కుర్రాడు ఎవడు అని వాకబు చేశారు. పిజ్జా డెలివరీ బాయ్ అట.సరే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకుందాం అనుకున్నారు. కాని మనిషిని చూస్తే నిరాశ కలిగేలాఉన్నాడు.ఎక్కడ తప్పు జరిగింది?బాగా పెంచామనుకున్నామే.కన్న కూతురు ఇంత ద్రోహం చేస్తుందా?తల్లి డిప్రెషన్. తండ్రికి నిస్పృహ. అమ్మాయి మీద పెళ్లి వద్దని ఒత్తిడి. ముందైతే వాయిదా వేయించి ఆలోచిద్దామని చెప్పి ముగ్గురూ కౌన్సెలింగ్‌కు వచ్చారు.‘చూడండి డాక్టర్. నా కూతురు చక్కని పిల్ల. బాగా పెంచాం. పోయి పోయి వాణ్ణి ప్రేమించానని చెబుతోంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది.ఏంటిది?’ అన్నాడు తండ్రి.సైకియాట్రిస్ట్ మొత్తం విన్నాడు.‘తప్పు మీదేనండీ’ అన్నాడు తండ్రితో.‘ఎలా?’‘ఆడపిల్ల ఆడపిల్ల అంటూ ఆ అమ్మాయిని ఏ గాలీ వెలుతురూ లేకుండా పెంచారు.స్నేహితులను ఇవ్వలేదు. పోనీ సొంత తమ్ముణ్ణో చెల్లెలినో ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఒంటరితనంతో బాధ పడింది. ఎక్కడైనా ఎవరైనా తనను పట్టించుకుంటే బాగుండు అని అనుకుంది. కాని అలాంటివీలే లేనట్టు మీరు పెంచారు. కాలేజీకొచ్చాక మీరు ఫోన్కొనిచ్చారు. కాలేజీ బుక్పోయి ఫేస్బుక్ వచ్చింది. మీ అమ్మాయి ఫేస్‌బుక్‌కు అడిక్ట్ అయ్యింది. అక్కడ ఎవరెవరో ముక్కుముహం తెలియనివారు మీ అమ్మాయి డిస్ప్లే పిక్చర్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపడం మొదలెట్టారు. చాటింగ్ మొదలెట్టారు. బుట్టలో వేసుకోవడానికి ‘చిన్నా కన్నా... భోం చేశావా... ఎండలో తిరక్కు... ప్రభాస్ సినిమా ఫస్ట్ మార్నింగ్ షోకు రక్తం అమ్మయినా నీ కోసం రెండు టికెట్స్ తెస్తా’... ఇలాంటి మెసేజ్‌లు చూసే సరికి తనకు ప్రాముఖ్యం ఉన్నట్టు, తనను గుర్తించే మనుషులు కూడా ఉన్నట్టు మీ అమ్మాయి అనుకుంది. సంతోషపడింది. అవతలి మనిషి ఎవరనేది కూడా చూడకుండా కేవలం అతడి మాటలు, స్నేహం అని అనుకుంటున్న స్నేహం, ప్రేమ అని అనుకుంటున్న ప్రేమకు కేరీ అయిపోయింది. అది ఆమెకు ఇష్టమైన కొత్తలోకం. అందుకని మిమ్మల్ని కూడా వద్దనుకుని అతణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్. తల్లిదండ్రులు తల దించుకున్నారు.‘చూడండి. ఆడపిల్ల అంటే భౌతికంగా ఒక నిర్మాణం. కాని అది అథమ నిర్మాణం కాదు. అణిచి పెట్టాల్సిన నిర్మాణం కాదు. మగవాడితో సమానమైన నిర్మాణం. ఆమెకు కూడా అన్ని రకాల చైతన్యం, జ్ఞానం, ఎక్స్పోజర్ ఉండాలి. తీగ కదా అని ఎక్కువ కంగారుతో చుట్టూ కర్రలు పాతితే అది ఎదగదు. చచ్చిపోతుంది. మీ అమ్మాయి విషయంలో జరిగింది అదే. దారిలో మోగే ఐస్బండి గంటైనా తన కోసం మోగితే చాలనుకునే స్థితికి వచ్చింది’ అన్నాడు మళ్లీ.ఆ అమ్మాయి వైపు చూశాడు.‘చూడమ్మా... నీది ప్రేమ కాదు... పెళ్లి చేసుకునేంత బంధం, పరిణితి మీ ఇద్దరి మధ్యా లేదు. ఇది కొద్దిపాటి ఆకర్షణ. ఈ వయసులో మనసుకు ఊపు తెచ్చే ఒక మాదకద్రవ్యం. దానిని చూసుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకు. నీకిప్పుడు కావలిసింది బాయ్‌ఫ్రెండ్ కాదు. ఒక స్నేహబృందం. అందులో అబ్బాయిలూ అమ్మాయిలూ కూడా ఉండొచ్చు. నీ అభిరుచి ఏమిటో తెలుసుకొని, నీకు ఏదైనా కళా సాంస్కృతిక రంగాల్లో ఇష్టం ఉంటే అందులో మనసు పెట్టు. నీకు ఇష్టమైన స్నేహబృందం దొరుకుతుంది.బ్లూ క్రాస్, రెడ్‌క్రాస్ వంటి సంస్థల్లో పని చేయాలనుకుంటే అదీ చేయవచ్చు. లేదంటే నువ్వే ఒక ఆర్ఫన్ ఏజ్‌లో పార్ట్‌టైమ్ వాలంటీర్‌గా పని చేయి. లోకం తెలుస్తుంది. నీకు నువ్వు తెలుస్తావు. నీ లోటు తీర్చే స్నేహాలు ఏర్పడతాయి. వయసు కూడా కొంచెం పెరగనీ. ఆ తర్వాత కూడా నువ్వు ప్రేమించదగ్గ వ్యక్తులు కనిపిస్తారు. అప్పుడు నీకు నిజంగానే ప్రేమించాలనిపిస్తే ప్రేమించు. నీ తల్లిదండ్రులను నేను ఒప్పించిపెళ్లి చేస్తా. సరేనా?’ఆ అమ్మాయి ఏమనుకుందో తల ఊపింది.సైకియాట్రిస్ట్ నిట్టూర్చాడు.అప్పటికి రాత్రి ఏడైంది.‘ఆకలేస్తోంది. ఏమైనా తెప్పించుకుందామా’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘పిజ్జా మాత్రం వద్దు సార్’... ఫీజు డబ్బులు బయటకు తీస్తూ కొంచెం భయంగా నవ్వాడు అమ్మాయి తండ్రి.అందరూ కూడా హాయిగానే నవ్వుకున్నారు ఆ తర్వాత. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
అధిక ధర రావాలంటే?
సాక్షి, హైదరాబాద్: మనం కొన్న స్థలానికి లేదా ఇంటికి భవిష్యత్తులో మంచి ధర రావాలంటే? అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాన్ని.. పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు వంటి సౌకర్యాలకు చేరువలో ప్రాపర్టీ ఉండేలా చూసుకోవాలి. సొంతింటి విషయానికొస్తే మనకేం కావాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చూడటానికి ఇల్లు ఎలా ఉంది? అందులోని సదుపాయాలు, చుట్టుపక్కల ప్రాంతం మౌలిక వసతులు ఉన్నంత మాత్రానే మంచి ఇల్లు అని అనుకోలేం. వీటితో పాటూ మరికొన్ని అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడుతుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యా లన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో అమ్మితే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూల్, ఆసుపత్రి, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేవా అనేవి చూడాలి. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూల్ అవసరముండకపోవచ్చు. కాకపోతే ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు మాత్రం ఇదే అంశం కీలకమని గుర్తుంచుకోండి. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్ సదుపాయాలు వంటివి కూడా ప్రధానమైనవే. పెరిగేది ఎప్పుడు? ఇళ్లు, స్థలాల రేట్లు ఒకే విధంగా పెరగవు. మనం స్థలం కొన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే ఫ్లాట్ల రేట్లు పెరుగుతాయని గుర్తుంచుకోండి. వీటితో పాటు నివసించడానికి కావాల్సిన సౌకర్యాలు పెరిగితేనే ఆయా ప్రాంతంలో ఇళ్ల ధరలు రెట్టింపవుతాయి. ఆరంభంలోనే మంచి ప్రాంతాన్ని ఎంచుకుంటే అక్కడ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంటే గనక.. ఇంటి విలువకు రెండు, మూడేళ్లకే రెక్కలొస్తాయి. అక్కడి అభివృద్ధి చూసి చాలా మంది ఇళ్లను కొనడానికి అవకాశముండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైక్ ఉన్నప్పటికీ ప్రజా రవాణా వ్యవస్థ అవసరమం ఉండకపోవచ్చు. ఈ–మెయిల్స్, కొరియర్ల యుగంలో పోస్టాఫీసు అనవసరం కావచ్చు. కానీ, ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేరువలో షాపింగ్ మాల్ ఉందనుకోండి.. వారాంతంలో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తి చూపకపోవచ్చు. -
ఆకాశమంత ఆర్తి
అభంశుభం తెలియని, ఆదుకునే వారే లేని ఆ చిన్నారులను ‘ఆర్తి’ ఆశ్రమం తన ఒడిలోకి తీసుకుంటోంది. అన్నీ తానే అయి వారిని ఆదరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు పదిహేను వందల మంది బాలికల భవిష్యత్తును వెలిగించింది. ఆ దీపాలన్నీ నేడు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులను పంచుతున్నాయి. ఆ వెలుగుల్లో ‘ఆర్తి’ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తోంది. నగరం సద్దుమణుగుతోంది. రాత్రి 11 గంటలు. ఆ భవనం వద్ద జీరో బల్బు వెలుతురు. ఎవరో కంగారుగా వచ్చి అక్కడ ఏదో పడేసి అంతే కంగారుగా వెళ్లిపోయారు. అటుగా వచ్చిన వాచ్మెన్ అక్కడేదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరికి వచ్చి చూశాడు. పాత చీరెలో చుట్టి ఉన్న నెలల వసిగుడ్డు! చలికి వణుకుతోంది. జాగ్రత్తగా రెండు చేతుల్లోకి లోపలికి తీసుకెళ్లాడు. అతడు ‘ఆర్తి’ వాచ్మెన్.ఇంకో ఘటన. ఇంకా చీకట్లు విచ్చుకోలేదు. కొద్దిగా తెరిచి ఉన్న గేటులో నుంచి ఏడు నెలల పాప బరాబరా దోగాడుతూ వచ్చేసింది. లోపలి నుంచి వచ్చిన వారు ఆ చిన్నారిని ఎత్తుకున్నారు. గేటు బయటికి చూసి ఎవరూ లేకపోవడం గమనించారు. విషయం అర్థమైంది. ఆ పాపను అందరూ కాసేపు ఎత్తుకున్నారు. ‘ఆర్తి’ హృదయానికి హత్తుకున్నది.కడప నగరంలో మున్సిపల్ స్టేడియం వద్ద ఉం టుంది ‘ఆర్తి’. ఈ చిన్నారుల ఆశ్రమాన్ని పీవీ సంధ్య నిర్వహిస్తున్నారు. పాతికేళ్ల క్రితం ఆవిర్భవించింది మొదలు నేటి వరకు ఆర్తి ఆదర్శప్రాయమైన ప్రయాణంలోని విశేషాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. బంధువులమ్మాయి ‘ఆర్తి’ ‘‘నేను ఇంగ్లీషు లెక్చరర్. నా భర్త శ్రీనివాసులురెడ్డి నేత్ర వైద్యులు. మాకు ఇద్దరు అమ్మాయిలు. 1992లో వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు.. మా ఇంటికి సమీపంలో ఓ పసిపాపకు ఎవరూ లేకపోవడం గమనించాను. ఆ చంటిబిడ్డను తెచ్చుకున్నాను. నా పిల్లలతో పాటు పెంచుకున్నాను. దీన్ని గమనించిన మరికొందరు తమ పిల్లలను రాత్రులు మా ఇంటి వద్ద వదిలేసేవారు. ఇలాంటి చిన్నారుల సంఖ్య పెరగడంతో స్నేహితులతో చర్చించి వారి సహకారంతో ప్రత్యేకంగా చిన్న ఇల్లు తీసుకుని బాలల ఆశ్రమం ప్రారంభించాను. మా బంధువుల అమ్మాయి ఆర్తి విదేశాల్లో తన స్నేహితుల నుంచి కొద్ది సొమ్మును సేకరించి మాకు పంపేది. దురదృష్టవశాత్తు ఆమె భౌతికంగా దూరం కావడంతో మా ఆశ్రమానికి ఆర్తి హోమ్ అని ఆమె పేరు పెట్టుకున్నాం. సంస్థ నిర్వహణకు విజయ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్లకు ఎంతవరకు ఆశ్రయం, రక్షణ ఇవ్వగలనో, వారిని ఎంతవరకు చదివించగలనో, ఆ తర్వాత వారి జీవితం ఏమిటో.. ఏదీ ఆలోచించలేదు. హోమ్ నిర్వహిస్తున్నాం అంతే! ఇంటి బయట ఊయలతొట్టి ఓరోజు ఇంటి బయట ఎవరో నెలల పాపను ఉంచి వెళ్లారు. కొద్దిసేపటి ద్వారా కనుగొని చిన్నారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఎంత ప్రయత్నించినా చిన్నారిని నిలుపుకోలేక పోయాం. చాలా బాధ అనిపించింది. దాంతో ఇంటి బయట ఊయల తొట్టి ఏర్పాటు చేశాను. వాచ్‌మెన్‌ను నియమించాను. ఇక్కడ వదిలి వెళ్లే పిల్లల గురించి ఎవరూ ఏమి అడిగేది ఉండదని అక్కడ రాసి ఉంచాము. అలా హోమ్ పెరిగింది. 1993లో కలెక్టర్ సుబ్రమణ్యం హోమ్‌కు మున్సిపల్ స్టేడియం వద్ద కొద్దిగా స్థలాన్ని ఇచ్చారు. మెల్లిగా ఆ స్థలంలో ఇంటిని నిర్మించాం. 36 మంది చిన్నారులతో సొంత భవనంలో ఆశ్రమం పూర్తి స్థాయిలో మొదలైంది. ఇప్పటికి పదిహేను వందల మందికి పైగా ఆశ్రమం విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. పలు దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వీరిలో చాలామందికి మేమే వివాహాలు జరిపించాము. సీమంతాలు, పురుళ్లు చేస్తున్నాం. ఏ ఉద్యోగంలో, ఎంత దూరంలో ఉన్నా పుట్టినరోజులు, పండుగల సందర్భంగా వాళ్లు హోమ్ కు వస్తుంటారు. ప్రస్తుతం హోమ్‌లో 120 మంది ఉన్నారు. కుటుంబ జీవన గ్రామం పిల్లలందరినీ ఒకేచోట పెంచుతున్న విషయంగా నాలో ఆలోచన మొదలైంది. వారందరికీ బాధ్యతలు తెలిసేలా పెంచడంతో పాటు కుటుంబ జీవనంలోని మాధుర్యాన్ని చవి చూపాలని భావించాను. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసి అందులో వీరినే కుటుంబాలుగా ఏర్పాటు చేయాలని భావించాను. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని సహకరించాలని కోరాను. రిమ్స్ వద్ద స్థలం ఇచ్చారు. అక్కడ తొమ్మిది కుటీరాలు ఏర్పాటు చేశాం. ఒక్కొ దానిలో పదీపదిహేను మంది ఓ కుటుంబంగా ఉంటున్నారు. ఒకరి కుటుంబాలకు ఒకరు సహకరించుకుంటున్నారు. దీంతో అది ఒక గ్రామంగా, వీరంతా గ్రామస్థులుగా ఆత్మీయత అనుబంధాలతో జీవిస్తున్నారు. భ్రూణహత్యలపై ప్రాజెక్టు వర్క్ దక్షిణ ఏషియా స్థాయిలో కేవలం ఆర్తి హోమ్‌కు మాత్రమే భ్రూణహత్యల నిర్మూలనపై ప్రాజెక్టు వర్క్ లభించింది. 2015లో కేంద్ర పథకం బేటీ బచావో.. బేటీ పఢావోలో భాగంగా ‘మన బిడ్డ’ కార్యక్రమాన్ని జిల్లాలోని 51 మండలాల్లో ప్రతిభావంతంగా నిర్వహించాం. ఆర్తి విద్యార్థులే అన్ని విభాగాలకు వలంటీర్లుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి పథకాన్ని వంద శాతం అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం భ్రూణ హత్యల సంఖ్య గణనీయంగా తగ్గడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని ముగించారు సంధ్య. – పంతుల పవన్‌కుమార్, సాక్షి, కడప ఆడబిడ్డ విలువను గుర్తించాలి భ్రూణహత్యలు అమానుషం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రధాన గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అంకురం దశలోనే ఆడబిడ్డను అంతం చేస్తుండటం సృష్టికి విరుద్ధం. స్త్రీలేని లోకాన్ని ఊహించనే లేము. ఆడబిడ్డను ఇంటికి వెలుగు అని అనుకోవాలి తప్ప గుండెపై కుంపటి అనే భావం రానీయకూడదు. మెరుగైన సమాజం కావాలనుకున్నప్పుడు ఆడపిల్లకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. స్త్రీ విలువను గమనించేందుకు సమాజంలో నైతిక విలువలు పెరగాల్సి ఉంది. ఈ సమస్యకు మూలాలు వెతికి సరిదిద్దాల్సి ఉంది. – పీవీ సంధ్య, నిర్వాహకులు, ఆర్తి హోం -
గ్రహాల నాడి తెలిపే రచన
తమ భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలుసుకోడం కోసం కొందరు హస్తసాముద్రికాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు సంఖ్యాశాస్త్రాన్ని, ఇంకొందరు పుట్టుమచ్చల శాస్త్రాన్నో, జ్యోతిషాన్నో ఆశ్రయిస్తారు. వీరేగాక చిలక జోస్యాన్నీ, కోయదొరల పలుకులనీ, సోది చెప్పేవారి మాటలనూ పరిగణనలోకి తీసుకునేవారూ కోకొల్లలు. రోగి నాడి పట్టుకుని రోగ లక్షణాలను వైద్యుడు తెలుసుకున్నట్టే, జాతకుడి లక్షణాలను అతడి నాడి ద్వారా జ్యోతిష్యుడు తెలుసుకోగలడు. అయితే, నాడీజ్యోతిషంలో కొందరు పరాశరనాడిని అనుసరిస్తే ఇంకొందరు భృగు పద్ధతిని, మరికొందరు కనీనిక నాడిని అనుసరిస్తారు. చాలామంది జ్యోతిషులు లగ్నాన్ని ఆధారంగా చేసుకుంటారు. కొంద రు శనిగ్రహాన్ని, మరికొందరు బుధగ్రహాన్నీ పరిశీలించి చెబుతారు. అయితే, ‘ప్రశ్నహోరా’, ‘పాపగ్రహాలు– పరిహారాలు’ పుస్తక రచయిత పామర్తి హేమసుందరరావు భృగునాyì మరింత కీలకమంటూ, ఆ నాడి ద్వారా ఏమేం తెలుసుకోవచ్చో వివరించారు. టైటిల్‌ను బట్టి ఈ పుస్తకం చదివితే ఎవరికి వారే తమ జాతకాన్ని తెలుసుకోవచ్చేమో అనిపిస్తుంది. అయితే వివిధ రకాల నాడీ జ్యోతిషాల గురించి తెలిసిన వారికి, జ్యోతిషాన్ని నేర్చుకుంటున్నవారికే ఈ పుస్తకం ఎక్కువ ఉపకరిస్తుంది. రచయిత సీనియర్ పాత్రికేయులు కావడంతో పుస్తకాన్ని ఆసక్తికరంగా మలచడంలోనూ, వాడుకభాషలో రాయడంలోనూ సాఫల్యాన్ని సాధించారు. -
పీఎస్‌యూ కన్నా.. ప్రైవేట్ మిన్న..
ముంబై: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ బీమా సంస్థలు గణనీయ స్థాయిలో వృద్ధి సాధిస్తున్నాయి. 2017–18లో 22 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలు 13 శాతమే వృద్ధి సాధించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాధారణ బీమా రంగం 17 శాతం మేర వృద్ధి చెందింది. ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల మార్కెట్ వాటా 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ఊతంతో ప్రైవేట్ సంస్థలు రికవరీకి సారథ్యం వహిస్తున్నాయని ఇక్రా గ్రూప్ హెడ్ (ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ విభాగం) కార్తీక్ శ్రీనివాసన్ తెలిపారు. -
ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది!
ఆమె ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది.సంవత్సరంలో ఒకరోజు ఆమె వైపు భక్తజనమంతా చూస్తుంది.కాని మిగిలిన అన్ని రోజులు ఆమె ఒక సాధారణ టైలర్లా జీవితం గడుపుతుంది. మాతంగి స్వర్ణలత జీవన పరిచయం ఇది. ఆ క్షణాలు ఉద్వేగభరితం. కోట్లాది జనసందోహం ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తుంటుంది. ఏడాదికోసారి వినిపించే ఆ మాటల కోసం ఆ క్షణంలో అంతా ఊపిరి బిగపట్టి ఆలకిస్తారు. ఎందుకంటే ఆ మాటలు ఉజ్జయిని మహంకాళి మధుర వాక్కులు. అవి అందరినీ కాపాడే ఆ చల్లని తల్లి దీవెనలు. ప్రజలంతా సుఖశాంతులతో బతకాలనే ఆకాంక్షలు. అమ్మవారికి ఆగ్రహం వచ్చినా, ఆనందం కలిగినా ఆమె మాటల్లోనే వెల్లడిస్తుంది. పాలించేవారికి దిశానిర్దేశం చేస్తుంది. పాలితులకు మార్గదర్శనం చేస్తుంది. ఆ క్షణాల్లో అమ్మవారు పచ్చికుండతో చేసిన రంగంపైకి ఎక్కి భవిష్యవాణి వినిపిస్తుంది. ఆ అపురూప క్షణాల్లోనే అమ్మవారు మాతంగి స్వర్ణలత అవుతుంది. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని నిండైన విగ్రహంలా కదిలి వచ్చే మాతంగి స్వర్ణలత అప్పుడు ఉజ్జయిని మహాంకాళి ఆవాహనమవుతుంది. రెండు దశాబ్దాలకు పైగా రంగం ఎక్కి భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత ఒక విశిష్టమైన సాంసృతిక ఆవిష్కరణ అవుతుంది. రెండువందల ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు ఆమె ఒక కొనసాగింపు. నగరమంతా ఆషాఢమాసపు ఆ«ధ్యాత్మికతను సంతరించుకుంటున్న వేళ మాతంగి స్వర్ణలత ప్రస్థానం పై ’సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. తరతరాలుగా.. వారసత్వంగా.. ముఖం నిండా పసుపు. పెద్ద పెద్ద కళ్లు. నుదుటిపై నిండుగా ఉన్న కుంకుమ బొట్టు. పసుపు కుంకుమలతో అలంకరించుకొన్న నిండైన దేహం. పచ్చికుండపై నిలిచిన పాదాలు. చేతిలో కిన్నెర. భవిష్యత్తులోకి తొంగి చూసే సునిశితమైన చూపులు. ఆ సమయంలో అమ్మవారిని ఆవాహనం చేసుకున్న స్వర్ణలత రూపం, మాటలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఆమె సాధారణ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు చెప్పే దైవానికి ఆమె ప్రతిరూపమే అవుతుంది. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అవతరించిన తరువాత భవిష్యవాణి వినిపించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. అమ్మాయిలంతా అమ్మవారికే ‘ఏర్పుల’ వంశానికి చెందిన మహిళలు ఆ సాంప్రదాయానికి ప్రతీకలు. మొట్టమొదట ఏర్పుల జోగమ్మతో ఇది మొదలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ ఈ సంప్రదాయంలో భాగస్వాములయ్యారు. 1996 వరకు స్వర్ణలత అక్క ఏర్పుల స్వరూపారాణి రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించింది. 1997 నుంచి ఇప్పటి వరకు స్వర్ణలత ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ‘మా కుటుంబంలో పుట్టే అమ్మాయిలంతా అమ్మవారికే అంకితం. ప్రతి అమ్మాయి మాతంగి కావలసిందే. ఇప్పటివరకు మాతంగులైన వాళ్లంతా నాతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను తాము మహంకాళికి సమర్పించుకున్న వాళ్లే. మా కుటుంబంలో మా తమ్ముడు దినేష్‌కు ఆడపిల్ల పుడితే తప్పకుండా నా తరువాత ఆమే భవిష్యవాణి వినిపిస్తుంది...’ అని చెబుతోంది స్వర్ణ. సంక్షేమమే చెబుతుంది పదోతరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నవయస్సులోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో వైభవంగా ఆ పెళ్లి జరిగింది. ఆ తరువాత ఆమె జీవితం అమ్మవారి సేవకే అంకితమైంది. అప్పటి నుంచే భవిష్యవాణి వినిపిస్తోంది. ఆమె వినిపించే భవిష్యవాణిని ప్రజలే కాదు ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. భవిష్యవాణిలో చెప్పే సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది. ఆ భవిష్యవాణిలో ప్రజలందరి సంక్షేమం నిక్షిప్తమై ఉంటుంది. జీవిక కోసం టైలరింగ్ ఏడాదికోసారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి లక్షలాది మంది భక్తులు, అధికారగణాలు, అతిర«థమహార«థులు కొలువుదీరి ఉండే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి జంకు లేకుండా, అమ్మవారికి ప్రతిరూపమై భవిష్యవాణి వినిపించే స్వర్ణలత సాధారణ జీవితంలో ఒక టైలర్. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద. ఆమె కుటుంబం తుకారాంగేట్‌లోని ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తుంది. ‘మా నాయిన ఏర్పుల నర్సింహ మొదటి నుంచి గుడి దగ్గర పంబజోడు వాయించేవాడు. మా అమ్మ ఇస్తారమ్మ నాయినతో పాటు గుడికి వచ్చి జేగంట మోగించేది. తరతరాలుగా ఇది మా వృత్తి. అమ్మా, నాయిన ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో నేను, మా తమ్ముడు దినేష్, పిన్ని, వదిన ఉంటున్నాం. దినేష్ ఎలక్ట్రీషియన్. ఇద్దరం కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. బతకాలంటే కష్టపడాల్సిందే కదా’ అంటూ నవ్వేస్తుంది. స్వర్ణ మంచి లేడీస్ టైలర్. అన్ని రకాల డిజైన్లలో బ్లౌజులు, ఇతర దుస్తులు కుట్టేస్తుంది. ఏడాది పాటు రాత్రింబవళ్లు కష్టపడి పని చేసినా ఏడాదికోసారి వచ్చే ఆషాఢమాసం కోసం మాత్రం ఆమె వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటుంది. ‘‘ఏర్పుల బాగమ్మ మాకు నాయినమ్మ వరుస అవుతుంది. ఆమె ప్రభావం మాపై కొంతవరకు ఉంది. కానీ ఆ తరువాత రంగం ఎక్కిన మా అక్క స్వరూపారాణితో కలిసి నేను గుడికి వచ్చేదాన్ని. ఆమె వారసత్వంగానే నేను వచ్చాను’ అంటూ గలగలా నవ్వేసే స్వర్ణకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తే ఆ కుటుంబానికి ఎంతో ఊరట లభిస్తుంది. రంగం’ ఒక ఆ«ధ్యాత్మిక వేదిక ఆషాఢమాసం అమావాస్య తరువాత వచ్చే ఆదివారంతో ఉజ్జయిని మహంకాళి వేడుకలు ఆరంభమవుతాయి. గర్భాలయంలోని అమ్మవారి ఆభరణాలు, ముఖాకృతిని అందంగా అలంకరించిన ఘటంతో తీసుకొని రాణిగంజ్‌లోని కర్బలా మైదానానికి ఎదుర్కోలుకు వెళుతారు. ఈ నెల 15వ తేదీన ఆ వేడుక మొదలవుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఘటంతో ఎదుర్కోలు వేడుకలు నిర్వహిస్తారు. మహంకాళి అమ్మవారు తన ఉత్సవాలకు రావలసిందిగా తన తోటి 18 మంది అక్కచెల్లెళ్లను ఆహ్వానించడమే ఈ ఘటోత్సవం. ఆ తరువాత న్యూబోయిగూడలోని దండు మారమ్మ ఆలయానికి వెళ్తారు. అది మహంకాళి పుట్టినిల్లు. అక్కడి నుంచి గర్భాలయానికి చేరుకోవడంతో ఎదుర్కోలు ఘట్టం ముగుస్తుంది. ఆ తరువాత ఈ నెల 29వ తేదీన బోనాల ఉత్సవాలు. 30న ’రంగం’నిర్వహిస్తారు. ఈ ఆ«ధ్యాత్మిక వేదికను స్వర్ణలత తమ్ముడు దినేష్ అలంకరిస్తాడు. పచ్చికుండను కొద్దిగా భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేస్తారు. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. జేగంటలు మోగుతాయి. పంబజోడు ఉత్సవం ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే ఆలయానికి చేరుకుంటుంది స్వర్ణలత. ‘ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి నాకు ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. నేరుగా రంగం వద్దకు వస్తాను. ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు...’ అంటున్న మాతంగి స్వర్ణలత ఆ తుదిఘట్టంలో 15 నిమిషాల పాటు భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె వినిపించే భవిష్యవాణి కోసం ఎదురు చూద్దాం. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ -
మా రాజాకి మీ భవిష్యత్తు తెలుసు
‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు.చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు. ‘అమ్మా, నీ మనసు మంచిది. ముక్కుసూటిగా మాట్లాడతవు. అడిగినవారికి లేదనని పెద్ద చేయి తల్లి నీది..’ వరుసగా అన్నీ మంచి లక్షణాలే. మా స్నేహితురాలి ముఖం వెలిగిపోతోంది ఆ మాటలకు. ‘అయినవాళ్ల చెడుసూపు నీ మీద ఉంది. జాగ్రత్తగా ఉండాలి..’ మా స్నేహితురాలి ముఖంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెంటనే ‘ఈ శ్రావణమాసంలో ఇల్లు కడతావు తల్లీ..’ ఆ మాటతో తన ముఖం మతాబులా వెలిగిపోయింది. అతని మాటల అల్లిక ముచ్చటగా ఉంది. కిందటివారం అమ్మవారి దర్శనానికి స్నేహితులతో కలిసి విజయవాడ వెళ్లినప్పుడు కొండదిగి కిందకు వచ్చాక రోడ్డుకు ఎడమవైపున కూర్చొని కనిపించారు చిలుకజోస్యం చెప్పేవాళ్లు. సరదాగా చిలుకజోస్యం చెప్పించుకుందామన్నారు. మా మాటలు విన్నారేమో అన్నట్టుగా ‘అమ్మా, రండి మా రాజా (రామచిలుకపేరు) జోస్యం నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అవుతుంది..’ జోస్యం చెప్పే అతను పిలిచాడు. అతని ముందు ఒక ప్లాస్టిక్ సంచి పరిచి, దానిమీద కార్డులు పేర్చి ఉన్నాయి. పక్కన చిలుక పంజరం. వద్దన్నా వినకుండా ఇద్దరూ అక్కడ చేరిపోయారు. ఒక జాతకానికి ముప్పై రూపాయలు అనడంతో మరేమీ ఆలోచించకుండా అతని ముందు మూడు పది నోట్లు పెట్టింది మా ఫ్రెండ్. ‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు. చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన అక్కడక్కడా, అప్పుడప్పుడూ చూసిందే కానీ, అతని మాటలు ఆ ప్రాంతం వారివిగా అనిపించలేదు. ‘ఏ ఊరు మీది..’ అనడంతో సూర్యాపేట. తెలంగాణవాళ్లం’ అన్నాడు. కొంచెం ఆసక్తిగా అనిపించింది. అక్కణ్ణుంచి ఇంతదూరం వచ్చావా? అక్కడ జోస్యం చెప్పించుకునేవారు లేరా! అనడంతో ‘మేం దేశమంతా తిరిగిటోళ్లమమ్మా. బతుకుదెరువుకోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే, మాకు ఓ ప్రాంతం అనేది ఏముంది?’ అన్నాడు. ‘సూర్యాపేటలో సొంత ఇల్లు ఉంది. మా సుట్టాలంతా అక్కడే ఉంటారు. నెలలో పది రోజులు సూర్యాపేటలో మిగిలిన రోజులు ఇక్కడే. ముప్పై ఏళ్లుగా ఇదే పని. ఇంకో నలుగురం కలిసి ఇక్కడే ఓ రూమ్ తీసుకొని ఉంటున్నాం. వాళ్లూ నాలాగే జోస్యం చెప్పుకుంటారు. నాకు ఒక కూతురు, నలుగురు కొడుకులు. ఈ చిలుకజోస్యం చెప్పుకునే వాళ్లను పెద్దోళ్లను చేశా. వాళ్లందరి పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు కూడా! పట్నంలో పనులు చేసుకుంటు బతుకుతున్నరు..’ అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు. ఈ రామచిలుకను ఎక్కణ్ణుంచి తీసుకొస్తారు? అనడంతో ‘మా సుట్టాలలోనే కొంతమంది వీటికి ట్రైయినింగ్ ఇస్తారు. ఆ పని నాకు తెల్వదు. వాళ్ల దగ్గర్నుంచి మా లాంటివాళ్లు వెయ్యి, రెండు వేలకు ఓ రామచిలుకను కొనుక్కుంటాం’ అన్నాడు. ఎంతసేపూ ఈ చిలుకను పంజరంలోనే ఉంచితే ఎలా? అంటూ.. నా మాట పూర్తికాకుండానే ‘సాయంత్రం మా రూమ్‌కి వెళతాం కదా! అక్కడ పెద్ద పంజరంలో మా చిలుకలన్నీ విడిచిపెడతాం. అన్నీ కలిసి ఉంటాయి. పొద్దున్నే ఎవరి చిలుకను వాళ్లు తీసుకుంటాం. ఒక్కొక్కరం ఒక్కోచోటుకి వెళ్లిపోతాం.’ అంటూనే ‘అమ్మా, మీ పేరున ఓ రాగిరేకు, కొన్ని మూలికలు ఇస్తాను. వాటిని కృష్ణలో వదిలేయాలి. మీ మీదున్న చెడు దృష్టి నీళ్లలో కొట్టుకుపోయినట్టు పోతుంది. దానికి ఖర్చు వంద రూపాయలు!’ అన్నాడు. అతను చెప్పిన ఆ వస్తువులేవో తీసుకొని తను కృష్ణానదివైపుగా అడుగులేసింది. మీ జాతకాన్ని మీరు చూసుకుంటారా అని అడిగితే–‘రోజూ వ్యాపారానికి బయల్దేరే ముందే చూసుకుంటాం. ఏముందమ్మా మనం మంచి అనుకుంటే మంచే అవుతుంది. చెడు అనుకుంటే అంతా చెడే’ అన్నాడు అతను బతుకునేర్పిన అనుభవంతో! ‘ఒక్క గింజ కూడా దాచుకోలేని పిట్ట మనిషి భవిష్యత్తును ఏం చెబుతుంది?’ అని ప్రశ్నించే ఓ కవి మాటలు గుర్తుకువచ్చాయి. వ్యాపారం అని అతనే అంత స్పష్టంగా చెప్పాడు. మంచి‘మాట’ను అందుకు ఎంచుకున్నాడు. మంచే జరుగుతుందనే ఆలోచన మైండ్‌లో ఉంది. వ్యాపారంలో ప్రాథమిక సూత్రాలు ఇవే కదా! ఫ్రెండ్ తిరిగి రావడంతో నేనూ తనతో బయల్దేరాను. వెడుతూ వెనక్కి తిరిగి పంజరం వైపు చూశాను. జాతకం చెప్పించుకోవడానికి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ చేరారు. పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక ముక్కుతో కార్డు లాగి, ఆ వెంటనే లోపలికి వెళ్లిపోయింది. – నిర్మలారెడ్డి -
ఆలోచన ఉన్నవారిదే భవిష్యత్తు
పూర్వం ఒకానొక దేశంలో ప్రజలు ఏడాదికోసారి తమ రాజును ఎన్నుకునేవారు. ఏడాది పాలన ముగిసిన రాజుకు అమూల్యమైన వస్త్రాభరణాలను ధరింపజేసి ఏనుగుపై ఊరేగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వస్తారు. ఈ షరతుకు లోబడిన వారినే గద్దెపై కూర్చోపెట్టేవారు. ఆ రాజ్యంలో ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతూ వస్తోంది. ఇలా ఒక ఏడాది తమ రాజును నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వస్తుండగా వారికి సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకను, అందులో నుంచి ప్రాణాలతో బయటపడ్డ యువకుడినీ చూశారు. అతన్నే తమ చక్రవర్తిగా నియమించాలనుకున్నారు. ఆ యువకుణ్ని తమ పడవలో ఎక్కించుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లి, రాజును చేశారు. అక్కడి ప్రముఖులంతా ఆ యువచక్రవర్తికి అన్ని పాలనా నియమాలతోపాటు, ఏడాది తర్వాత పాలన ముగిసిపోయే విషయాన్ని కూడా వివరించారు. రాజుగా బాధ్యతలు చేపట్టిన మూడోరోజునే ఆ యువకుడు తన మంత్రిని వెంటబెట్టుకుని ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ ప్రాంతమంతా క్రూరమృగాలు, విషసర్పాలతో భయంకరంగా ఉంది. అక్కడక్కడా శవాలు, అస్తిపంజరాల గుట్టలు కూడా కనిపించాయి. అవి తనకన్నా ముందు ఆ రాజ్యాన్ని ఏలిన వారివనీ, ఏడాది తర్వాత తనకూ అదే గతి పడుతుందని ఊహించాడా యువకుడు. రాజ్యానికి వెళ్లగానే వంద మంది కూలీలను ఆ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అడవిని మొత్తం నరికేసి, అందులో ఉన్న క్రూర మృగాలను తరిమేయాలని ఆజ్ఞాపించాడు. రాజు పర్యవేక్షణలో కొద్దికాలంలోనే ఆ అటవీ ప్రాంతమంతా పలు రకాలైన పండ్ల చెట్లు, పూల మొక్కలతో నిండిపోయింది. వాటితోపాటు పెంపుడు జంతువులు, పాడి పశువులు, పక్షులతో ఆ ప్రాంతమంతా అందమైన తోటగా, ఆదర్శమైన పట్టణంగా మారింది. చూస్తుండగానే కొత్త రాజు ప్రజానురంజకమైన పాలన ముగిసింది. పురప్రముఖులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు కట్టబెట్టి, ఏనుగుపై ఎక్కించి ఊరేగింపునకు సిద్ధం చేశారు. రాజు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఇష్టం ఉన్న వారంతా తనతోపాటు కొత్త ప్రదేశానికి రమ్మని ఆహ్వానించాడు! అంతా సంతోషించారు. గత చక్రవర్తులంతా భోగభాగ్యాలలో మునిగి తేలుతూ భవిష్యత్తును విస్మరించారు. ఇతను మాత్రం నిత్యం భవిష్యత్తు గురించే ఆలోచించి, దానికోసం ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నాడు. ఆ నిర్మానుష్య ప్రాంతాన్ని సుందర నిలయంగా, శేష జీవితాన్ని హాయిగా గడిపేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడు. – ముహమ్మద్ ముజాహిద్ -
ఈ సంవత్సరం ఏ నాయకుడికి కలిసొచ్చేనో..
షడ్రుచుల సమ్మిళితం ఉగాది పచ్చడి. ఈ పచ్చడి సారం మన జీవితానికే కాదు.. భవిష్యత్తుకూ వర్తిస్తుంది. జీవన గమనంలో ఎప్పుడు ఏ రుచి చవి చూస్తామో తెలియదు. ఏదీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందో తెలియదు. నమ్మకం, విశ్వాసమనే పునాదులపై ఏర్పడ్డ మన సమాజాన్ని జ్యోతిష్యం, పంచాంగం బలంగా ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యవాణిని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. తెలుగు పండగైన ఉగాది రోజున పంచాంగాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో విళంబినామ సంవత్సరంలో కొందరు నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.. రాజకీయంగా వారెదుర్కొనే ఆటుపోట్లు ఏమిటి తదితర అంశాలపై పంచాంగకర్తలను అడిగి తెలుసుకునే చిరు ప్రయత్నం చేశాం. పేర్లు, రాశుల ద్వారా వారి భవిష్యత్తును అంచనా వేసిన జ్యోతిష్యులు.. ఈ ఏడాది ఏ రాశివారికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం అనేది విశ్లేషించారు. ఈ రాజకీయ పంచాంగం మీకోసం.. సరదాగా.. సింహ రాశి: ఈ ఏడాది అంతగా అనుకూలంగా లేదు. గురువు 3వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 11, వ్యయం 11, పూజ్యం 3, అవమానం 6. ప్రత్యర్థులు పైచేయి సాధించే అవకాశముంది. సన్నిహితులు కూడా బలహీనపరిచే వీలుంది. మొత్తమ్మీద విళంబి సంవత్సరం నిరాశజనకంగానే ఉండనుంది. పి.మహేందర్‌రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కుంభ రాశి: విళంబి నామ సంవత్సరం అన్ని విధాలా కలిసి రానుంది. సమాజంలో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. గురువు 8వ స్థానంలో, శని 11వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 7, అవ మానం 1. మొదలు పెట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన పనులు ప్రారంభిస్తారు. అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి.. పెద్దల మన్ననలు పొందుతారు. సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి తుల రాశి: ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే కానుంది. ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 2, గురువు 2వ స్థానంలో ఉండి శని సంచారం 3వ స్థానంలో ఉండడం వల్ల చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి కార్యంలోనూ ఇతరుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించడం ద్వారా తన పలుకుబడిని పెంపొందించుకుంటారు. రామ్మోహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే సింహ రాశి: ఈ ఏడాది ఆశావహంగా లేదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. సొంత వాళ్లు కూడా వ్యతిరేకంగా మారే అవకాశముంది. గురు 3వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 11, వ్యయం11, పూజ్యం 3, అవమానం 6. ఈసారి శ్రమకు తగిన ఫలితాలు తక్కువగా ఉన్నాయి. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం మిథునరాశి: ఆరోగ్యం, మానసిక ఆందోళన తప్పదు. మొదలుపెట్టే ప్రతి పనులకు ఆటంకం కలిగి తీవ్ర జాప్యం జరుగుతుంది. శని 7వ స్థానంలో, గురువు 6, 7 స్థానాల్లో ఉండడం ఈ పరిస్థితి తలెత్తుతోంది. వ్యయం కూడా ఎక్కువే. పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వృషభ రాశి: చేపట్టే ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తికాదు. ఆరోగ్య సమస్యలుంటాయి. ఈ సంవత్సరం శని 2వ స్థానంలో, గురువు 12వ స్థానాల్లో ఉండడంతో ఈ పరిణామం జరుగుతుంది. వ్యయ నియంత్రణ ఉండదు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సివుంటుంది. సానుభూతిని సంపాదించుకుంటారు. యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల తుల రాశి: విళంబి నామ సంవత్సరం అన్ని విధాలా కలిసిరానుంది. ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 2, గురువు 2వ స్థానంలో ఉండి శని సంచారం 3వ స్థానంలో ఉండడంతో సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా మంచి గౌరవం దక్కుతుంది. కార్యనిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది లాభదాయకంగా కూడా ఉంటుంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా ఇదే రాశి కావడంతో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొడంగల్ -
టెక్నాలజీతో నాణ్యమైన ఫలితాలు
తెయూ(డిచ్పల్లి): టెక్నాలజీ వినియోగం మానవ జీవనంలో భాగమై పోయిందని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ ఖాజీం నఖ్వీ పేర్కొన్నారు. దైనందిన జీవనంలో ప్రతీ సందర్భంలోనూ సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరైందన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తాధ్వర్యంలో ‘రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ’ అంశంపై జరిగిన జాతీయ సెమినార్ తొలి రోజున నఖ్వీ కీలకోపన్యాసం చేశారు. వ్యవసాయంతో పాటు విద్య, విజ్ఞానం, అంతరిక్షం వరకూ ప్రతి విషయంలోనూ సాంకేతిక పరిజ్ఞానం అవసరం తప్పనిసరిగా మారిందన్నారు. ఉన్నత విద్యారంగంలో డిజిటల్ విద్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సమయం ఆదా అవడమే కాకుండా నాణ్యతతో కూడిన ఫలితాలు వస్తాయన్నారు. విద్య, వైద్యారోగ్య రంగాలతో పాటు ప్రతి అంశంలోనూ ఐటీ ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. నేటి యువత విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకున్నపుడే ఉజ్వలమైన భవిత సాధ్యమని టెక్ మహీంద్రా సంస్థ యూరోప్ హెడ్ మురళి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, సమయం ఆదా చేయడంతో పాటు చేసే ప్రతి పనిలోనూ ఫలితాలు ప్రయోజనకరంగా ఉండేలా చొరవ చూపాలని టెక్ మహీంద్రా సంస్థ అసోసియేట్ జనరల్ మేనేజర్ నరేశ్ నేటంకి సూచించారు. సాధించిన ఫలితాలే వ్యక్తిని, వ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలబెడతాయని తెలిపారు. తెయూ సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ విద్యావర్థని అధ్యక్షత వహించగా, సెమినార్ కన్వీనర్ ఆరతి ప్రాధాన్యతను వివరించారు. -
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్ : దేశ భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను చేపట్టాలని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ రంగంలో దేశం అవసరాలు పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో ఏయే టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, పదార్థాలు అవసరమవుతాయో గుర్తించి, వాటిని సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో గురువారం సెమీకండక్టర్లపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్య కూడా ఎక్కువవుతోందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ (సీమెట్) ఈ వ్యర్థాల రీసైక్లింగ్‌కు టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుండటం అభినందనీయమన్నారు. దేశ రక్షణ రంగంలో కీలకమైన క్షిపణులతో పాటు అనేక ఇతర రంగాల్లో సీమెట్ ఆవిష్కరణలు ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. ఏ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలోనైనా అందుకు తగ్గ పదార్థాలను గుర్తించి, తయారు చేయడం కీలకమని కేంద్ర ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారు ఆర్.చిదంబరం అన్నారు. సీమెట్ అభివృద్ధి చేసిన అనేక టెక్నాలజీలు, పదార్థాలు టెక్నాలజీ రంగంలో దేశం స్వావలంబన సాధించేందుకు ఉపయోగపడ్డాయని కొనియాడారు. త్వరలో పీసీల్లోని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను రీసైక్లింగ్ చేసే పని మొదలవుతుందని తెలిపారు. ఈ–వేస్ట్ నుంచి మరింత చౌకైన పద్ధతుల్లో వనరులను రీసైకిల్ చేసే ప్రక్రియలను అభివృద్ధి చేయాలని కోరారు. 2020 నాటికి కార్ల విడిభాగాల నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల అల్యూమినియం వృథా అవుతుందన్న అంచనాలున్నాయని.. ముడి అల్యూమినియం సేకరణ, తయారీ కంటే విడిభాగాల రీసైక్లింగ్ ద్వారా చౌకగా వెలికి తీయొచ్చని చెప్పారు. -
పనికొచ్చే పేటిక
కొండ శిఖరానికి చేరుకున్నాక, ఉన్నట్టుండి ఆ పేటికలోంచి ఏదో వెలుగు వచ్చింది. ఒక జెన్ కథ ఇలా సాగుతుంది. ఒక రైతు ముసలివాడయ్యాడు. ఒంట్లో శక్తి ఉడిగింది. పొలానికి వెళ్లడం మానేశాడు. ఊరికే ఇంటి అరుగు మీద కూర్చుని ఉండేవాడు. ఇది ఆ రైతు కుమారుడికి నచ్చేది కాదు. తండ్రి వల్ల ఏం ఉపయోగం? పైగా తిండి దండగ. ఈ ఆలోచన రావడంతోనే చెక్కతో ఒక శవపేటిక తయారుచేశాడు. దాన్ని ముందర పెట్టి, అందులోకి వెళ్లమని తండ్రిని ఈడ్చాడు. మారు మాట్లాడకుండా ఆ వృద్ధుడు శవపేటికలోకి వెళ్లి పడుకున్నాడు. మూత బిగించి, ఆ పేటికను ఒక కొండ దగ్గరకు మోసుకెళ్లాడు కొడుకు. కొండ శిఖరానికి చేరుకున్నాక, ఉన్నట్టుండి ఆ పేటికలోంచి ఏదో వెలుగు వచ్చింది. చూద్దామని మూత తీశాడు కొడుకు. లోపల ప్రశాంతంగా పడుకుని వున్న తండ్రి, ‘నాయనా, ఎటూ ఈ కొండ అంచు నుంచి నన్ను తోస్తావు; కానీ చనిపోయేముందు నీకో సలహా ఇవ్వనా?’ అన్నాడు. ‘ఏమిటది?’ అడిగాడు కొడుకు. ‘కావాలంటే నన్ను తోసెయ్; కానీ ఇంత కొత్త పేటికను ఎందుకు వృథా చేస్తావు? ఇది రేపు నీ కొడుకులకు పనికి రావొచ్చుగదా’ అన్నాడు. కథ ఇంతే. ఆ తండ్రి ఇచ్చిన వెలుగు ఆ కొడుకు హృదయంలోని చీకటిని తొలగించిందో లేదో కథ చెప్పదు. ఆ కొడుక్కు భవిష్యత్ దర్శనం కలిగిందో చెప్పదు. కానీ ఒక పరంపర పట్ల చూపాల్సిన మర్యాదను చెబుతుంది. చేసినదానికి చూపాల్సిన కృతజ్ఞతను చెబుతుంది. ఈ గుణాలే కదా, మన లోపలిని వెలిగించేవి! -
ఐదేళ్లలో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏ దేశమైనా సాంకేతికంగా శరవేగంగా అభివద్ధి చెందుతుంటే దాని ప్రభావం కచ్చితంగా ఉద్యోగులపై ఉంటుందనేది తెల్సిందే. ఫలితంగా ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. పర్యవసానంగా పాత ఉద్యోగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులే కొత్త ఉద్యోగాల్లో కుదురుకోగలరు. మిగితా వాళ్లకు ఉద్వాసన చెప్పక తప్పదు. 2022 నాటికి భారత్‌లో కూడా ఈ పరిణామాలు సంభవిస్తాయని ‘యర్నెస్ట్ అండ్ యంగ్’ అనే మేనేజ్మెంట్ కన్సెల్టింగ్ సంస్థ డిసెంబర్లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. పలు రకాల పరిశ్రమలు, 130 మంది వ్యాపారవేత్తలు, పలువురు విద్యావేత్తల అభిప్రాయలను తెలుసుకోవడం ద్వారా ఈ సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం ఈ నాలుగేళ్ల కాలంలో ప్రస్తుతమున్న ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 నుంచి 35 శాతం వరకు ఉద్యోగాలు పోతాయి. ప్రతి మందిలో ఒకరికి కొత్త ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉనికిలోనే లేని ఆ ఉద్యోగం రేపు ఎక్కడా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. ముఖ్యంగా భారత టెక్ సెక్టార్లో ఉద్యోగాల నియామకం క్రమంగా మందగిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రత్యక్షంగా 38 లక్షల మంది పనిచేస్తుండగా, పరోక్షంగా 1.30 మంది పనిచేస్తున్నారు. ఈ రంగంలో ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతో ఆధునిక సాంకేతిక జ్ఞానం అవసరం అవుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంను సమకూర్చుకోవడం వల్ల పాత ఉద్యోగులు పోతారు. కొత్త నియామకాలు తగ్గుతాయి. ఉదాహరణకు ఐటీ–బీపీఎం పురోభివద్ధి శాతం ఆరు శాతం ఉంటే నియమకాలు మూడు నుంచి మూడున్నర శాతం వరకు ఉంటాయి. 2022 నాటికి మూడొంతుల ఉద్యోగాలకు కొత్త నైపుణ్యం అవసరం అవుతుంది. ఐటీ–బీపీఎం రంగంలోనే 2022 నాటికి 45 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో నాలుగున్నర లక్షల నుంచి తొమ్మిది లక్షల ఉద్యోగాలు కొత్తవి ఉంటాయని సర్వేలో అంచనా వేశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ రంగాల్లో కొత్త స్కిల్స్ అవసరం అవుతాయని, ఒక్క ఐటీ–బీపీఎంలోనే కాకుండా వెలుపలున్న ఐటీ రంగంలో కూడా భారీగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. -
అధినేత మనసులో ఏముందో!
బొగ్గు గని కార్మికుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి ఆలోచన ఏంటి? సంస్థ భవితవ్యంపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇచ్చిన హామీలపై గందరగోళం నెలకొన్న తరుణంలో అధినేత మనసులో ఏముంది? ఎందుకని టీబీజీకేఎస్ కమిటీ కూర్పును జాప్యం చేస్తున్నారు? మాట్లాడుకుందాం రండీ! అంటూ పిలిచిన ముఖ్యమంత్రి కార్మిక నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ఎందుకు సుముఖత చూపడం లేదు? సింగరేణి కార్మికులు, నాయకుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికే రెండు నెలలు దాటినా ఇంకా గుర్తింపు సంఘం కమిటీ కూర్పు పూర్తి కాకపోవడం అయోమయానికి దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పూర్తి స్థాయి కమిటీని నియమించాలని భావించిన ముఖ్యమంత్రి ఆ సంఘం నేతల్ని హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు. వారం రోజులుగా టీబీజీకేఎస్ నేతలు సీఎంఓ కార్యాలయం నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? అని ఎదురుతెన్నులు చూస్తున్నారు. గుర్తింపు కార్మిక సం ఘం ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటింది. ఎట్టకేలకు ఈ నెల 5న «చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ) నుంచి సింగరేణి సీఎండీకి గుర్తింపు యూనియన్‌కు సంబంధించిన లేఖ అందింది. అయినా టీబీజీకేఎస్ రాష్ట్ర, ఏరియాల కమిటీలు ఎంపికపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కరీంనగర్ పర్యటన సందర్భంగా సీఎం సైతం ‘మాట్లాడుకుందాం రండి’ అని చెప్పడంతో కమిటీల ఎంపిక ఇక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు. కాని వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో కమిటీల కూర్పు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ సమీకరణాలతోనే ఆలస్యం..! టీబీజీకేఎస్ కమిటీల ఏర్పాటుకు రాజకీయ జోక్యం ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. గుర్తిం పు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. గతంలో ఐఎన్టీయూసీలో జాతీయ నేతగా పని చేసిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు టీబీజీకేఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఎంపీ కవిత గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతోపాటు ఏరి యాల వారీగా కొందరు నేతలు టీబీజీకేఎస్‌లో చేరారు. మరోవైపు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద టీఆర్ఎస్లో చేరా రు. వీరి రాకతో రాజకీయ సమీకరణాల్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీరితో పా టు మరికొన్ని జాతీయ కార్మిక సంఘాలకు చెం దిన వారు, టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ నుంచి ఒకరిద్దరు నేతలు టీబీజీకేఎస్‌లో చేరా రు. ఇలా పలు పార్టీలు, పలు కార్మిక సంఘాల నుంచి నేతల తాకిడి నేపథ్యంలో రాజకీయ జోక్యం కమిటీల కూర్పునకు ప్రతిబంధకంగా మారిందా అనే అనుమానాలకు తావిస్తోంది. మాజీ నాయకుల దూరం? సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో అధికార టీబీజీకేఎస్ గెలుపుకోసం సార్వత్రిక ఎన్నికల స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది. వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత లేకపోవం దీనికి ఓ కారణమైతే... గత నాలుగేళ్లు సింగరేణిలో పాలన సాగించిన గుర్తిం పు సంఘం నేతల వైఖరి మరో కారణం. మెడికల్ అన్‌ఫిట్‌ల విషయంతో పాటు కార్మికుల పక్షాన నిలవాల్సిన నాయకులు కొందరు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారినట్లు అధిష్టానా నికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయాన్ని ఎన్ని కల ప్రచార సభల్లో ఎంపీ బాల్క సుమన్‌తో పాటు సీఎంఓ నుంచి పరిశీలకులుగా వచ్చి న నేతలు కూడా ఒప్పుకుంటూ... ‘టీబీజీకేఎస్ గెలిచిన తరువాత కొత్త కమిటీని మేమే నియమిస్తాం’ అని స్పష్టం చేశారు. అలాగే టీబీజీకేఎస్ నాయకులను ఎన్నికల ప్రచార సభల్లో కూడా కనిపించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అంటే ప్రస్తుత టీబీజీకేఎస్ నేతల ప్రమేయం లేకుండా ఎంపీ కవిత, ప్రభుత్వ సలహాదారు వివేక్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌లతో పాటు ముఖ్యమైన ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కొత్త కమిటీ కూర్పు ఉంటుందని అప్పుడే స్పష్టమైంది. వీరినుంచి సూచనలు తీసుకొని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తింపు సంఘం కార్యవర్గానికి తుదిరూపం ఇచ్చే అవకాశం ఉంది. నెలాఖరుకల్లా స్పష్టత? ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పూర్తిస్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియ ఈ నెలఖారు దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 19వ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తి కానున్నాయి. డిసెంబర్ మూడో వారం వస్తుంది కనుక మరో రెండుమూడు రోజుల పాటు కమిటీల కూర్పుపై కసరత్తు చేసి చివరి వారంలో అధికారికంగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయని ఓ ఎంపీ తెలిపారు. కమిటీల ఎంపికపై ముఖ్యమంత్రి వద్ద స్పష్టమైన జాబితా ఉందని, కేవలం తమ ముందు ప్రతిపాదనలు పెట్టి ఆయా కమిటీలను స్వయంగా కేసీఆర్ ప్రకటించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కాగా కారుణ్య నియామకాలు ఇతరత్రా హక్కుల అమలు కోసం పడిగాపులు కాస్తున్న కార్మికులు మాత్రం ఇంకా కలవరానికి గురవుతున్నారు. కమిటీలు ఇలా జాప్యం జరుగుతుంటో తమ సమస్యలు సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి అందిన ఆదేశాల పుణ్యమా అని టీబీజీకేఎస్‌కు చెందిన ఏ నాయకుడు జీఎం కార్యాలయాల వైపు కన్నెత్తి చూడడం లేదని, చిన్నచిన్న పనులు సైతం పెండింగ్‌లో పడిపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అధినేత తన మనసు విప్పి తమకు న్యాయం చేసే దిశగా కమిటీల కూర్పునకు తుది రూపం ఇస్తే బాగుంటుందని కార్మికవర్గం కోరుతోంది. -
మీ భవిష్యత్.. మాకు వర్తమానం!
ప్రొఫెసర్ ఇల్లు. కిషోర్ తన గ్యాంగ్ మొత్తాన్నీ వెంటేసుకొని వచ్చి గేటు బయట నిలబడ్డాడు. కిషోర్‌తో సహా గ్యాంగ్ అంతా పిల్లలే! ‘‘ఇదే ప్రొఫెసర్ గారిల్లు. గేట్ మూసుందే!?’’ అంటూ అందరినీ గేటెక్కమన్నట్టు సైగ చేశాడు కిషోర్. పిల్లలంతా గేటెక్కి అక్కణ్నుంచి ఇంట్లోకి దూకారు. లోపలకొచ్చి ఓ పెద్ద మెషీన్ వంక చూస్తూ నోరెళ్లబెట్టారు. ఒక చిన్నపాటి గదంత పెద్దగా ఉంది ఆ మెషీన్. కనిపించిన బటన్స్ అన్నీ నొక్కేస్తున్నారు. లైట్లు వెలుగుతున్నాయి. పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. పిల్లలు ఆ శబ్దం ఏమై ఉంటుందా అని జోక్స్ చేసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడుకున్నట్లు అక్కడున్నకంప్యూటర్స్తో ఆడుకుంటున్నారంతా. మెల్లిగా ఆ మెషీన్ డోర్ మూసుకుపోయింది. పిల్లలు భయపడిపోతున్నారు. ఈలోపే కృష్ణకుమార్‌కు పిల్లలంతా ప్రొఫెసర్ ఇంటికి వెళ్లారన్న విషయం తెలిసింది. అప్పటికి కృష్ణకుమార్ కూడా ప్రొఫెసర్ ఇంట్లోనే ఉన్నాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి పిల్లలందరినీ ఆ మెషీన్ నుంచి బయటపడేశాడు. కృష్ణకు తోడుగా అతడి గర్ల్‌ఫ్రెండ్ హేమ కూడా పిల్లల్ని కాపాడుతూ ఓ చెయ్యందించింది. పిల్లలందరూ బయటపడ్డారు. లైట్లు మళ్లీ వెలిగాయి. శబ్దం మరింత పెరిగింది. హేమ కళ్లు తిరిగి పడిపోయింది. అయోమయంలో ఏదో బటన్ నొక్కింది. డోర్ మూసుకుంది. మెషీన్ పనిచేయడం మొదలుపెట్టింది. అది టైమ్ మెషీన్. గతంలోనికైనా, భవిష్యత్లోకైనా తీసుకెళ్లగలిగే మెషీన్. కృష్ణకుమార్, హేమ మాత్రమే చిక్కుకుపోయారా మెషీన్లో. గతంలోకి వెళుతోందా మెషీన్. సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి.. అలా సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి వెళుతోన్న టైమ్ మెషీన్ సరిగ్గా 1526వ సంవత్సరంలోకి వెళ్లి ఆగిపోయింది. డోర్ తెరుచుకుంది. కృష్ణకుమార్, హేమ ఇద్దరూ ఆ మెషీన్ నుంచి బయటపడ్డారు. కృష్ణ అప్పటికే హేమ వాళ్ల నాన్నను తిడుతున్నాడు. హేమ తండ్రే టైమ్ మెషీన్‌ను తయారు చేసిన ప్రొఫెసర్. చుట్టూ గమనించారిద్దరూ. అంతా కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా చెట్లే. అడవి. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మెల్లిగా నడుస్తూ ముందుకు వెళుతున్నారు. ‘‘ఇదంతా అడవిలా ఉంది కృష్ణా!’’ అంది హేమ.‘‘అసలిది ఏ దేశమో.. ఏ కాలమో..’’‘‘తిరిగి వెళ్లిపోదామా?’’ అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరగ్గానే ఏవో శబ్దాలు వినిపించాయి. అటు దిక్కుగా చూస్తే ఎవరో మనుషులు. అక్కడి మనుషులు, వ్యవహారం చూసి ఇదేదో రాజుల కాలంలా ఉందన్న నిశ్చయానికి వచ్చారిద్దరూ. కృష్ణ, హేమ.. వాళ్లను అలా గమనిస్తూండగానే ఏదో పెద్ద గొడవ మొదలైంది. ఎవరో దుండగులు ఒక యువతిపై దాడి చేస్తున్నారు. కృష్ణ ఒక్క క్షణంలో వారిమీద విరుచుకుపడ్డాడు. అందరినీ చితకబాది ఆ యువతిని కాపాడాడు. ‘‘నా మానప్రాణములను కాపాడిన యువ కిషోరమునకు కృతజ్ఞతలు..’’ అంది ఆ యువతి గట్టిగా ఊపిరి పీల్చుకొని. ‘‘మీరూ?’’ అడిగాడు కృష్ణ. ఆ యువతి నవ్వుతూ.. ‘‘నేను రాజనర్తకిని. సింహనందిని నా నామధేయము. రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి..’’ అంది. ‘‘రాయలవారంటే?’’ ‘‘శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు..’’ కృష్ణ, హేమ ఒక్కసారే ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ఓ మై గాడ్! మనం శ్రీకృష్ణదేవరాయల కాలానికి వచ్చామా?’’ అంది హేమ, సంతోషంతో!సింహనందినికి కృష్ణ, హేమ కొత్తగా కనిపించారు. వాళ్లు వేసుకున్న బట్టలు, వారి భాష.. అంతా కొత్తగా ఉంది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మేము మీకంటే ఐదు వందల సంవత్సరాల ముందు వాళ్లం!’’ అన్నాడు కృష్ణ, సింహనందిని వరుస ప్రశ్నలకు, చూపులకు సమాధానంగా. ‘‘నాకేమీయూ అవగతం కాకున్నది..’’ అంది సింహనందిని, అమాయకంగా.కృష్ణకుమార్, హేమ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ నిలబడ్డారు. మళ్లీ సింహనందినే మాట్లాడుతూ, ‘‘నాతో రండి! ప్రభువులను కలసి.. నన్ను కాపాడినందులకు బహుమతులు అందుకొందురు..’’ అంది. ∙∙ కృష్ణ, హేమ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానానికి విచ్చేశారు. ప్రభువులు సభకు విచ్చేస్తున్నారంటూ అక్కడివారంతా సందడి చేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. కృష్ణ అందరినీ చూస్తూ కూర్చున్నాడు. హేమ ‘వీళ్లెవరూ? వీళ్లెవరూ?’ అంటూ అమాయకంగా ప్రశ్నలడుగుతోంది. వాళ్లిద్దరి మాటలలా కొనసాగుతుండగానే, వైభవంగా సభకు విచ్చేశాడు కృష్ణదేవరాయలు. ఆయన వస్తూంటే సభలో కూర్చున్నవారంతా గౌరవంగా లేచి నిలబడి నమస్కరించారు. ప్రభువు తన పీఠంపై కూర్చోగానే అందరూ కూర్చున్నారు. తమ పెద్దలకు అంజలి ఘటించి సభను మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు. సభ జరుగుతుండగానే, కృష్ణ, కృష్ణదేవరాయల కంట పడ్డాడు. ‘‘ఎవరీ పరదేశీయుడు?’’ కృష్ణదేవరాయల ప్రశ్నకు..సింహనందిని లేచి, అడవిలో దుండగుల బారినుంచి తనను కాపాడారని చెప్పింది. ‘‘ఓ! అలాగా!! వీరకుమారా? మీరు ఏ దేశ వాసులు?’’ అనడిగాడు కృష్ణదేవరాయలు. ‘‘మేము తెలుగు వారమే మహారాజా?’’ అని సమాధానమిచ్చాడు కృష్ణ. కృష్ణదేవరాయలు వరుసగా ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నారు. ‘‘మహారాజా! మీ భవిష్యత్ కాలం.. మాకు వర్తమాన కాలం. మేం భవిష్యత్ నుంచి వచ్చిన వాళ్లం.’’కృష్ణదేవరాయలకు కృష్ణ చెప్పేది ఏదీ అర్థం కాలేదు. ‘‘అంటే?’’ అనడిగాడు. ‘‘మేము 20వ శతాబ్దకాలం వాళ్లం. మీకంటే 500 సంవత్సరాలు ముందు వాళ్లం. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు..’’ నవ్వుతూ సమాధనమిచ్చాడు కృష్ణ. ‘‘వీరి నాన్నగారు..’’ హేమను చూపిస్తూ.. ‘‘కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది..’’ కృష్ణ చెప్తూ వెళ్తున్నాడు. కృష్ణదేవరాయలకు ఇదంతా కొత్తగా కనిపిస్తూ ఉంటే, అలా వింటూ ఉన్నాడు. -
భవిష్యత్తులో జరిగేవి హైబ్రిడ్ యుద్ధాలే
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో సంప్రదాయ ఆయుధాలతో పాటు అంతరిక్షం, సైబర్, సమాచార రంగాలతో కూడుకున్న హైబ్రిడ్ యుద్ధాలే జరుగుతాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్‌లో భారత సాయుధ వాహనాలు–2017’ పేరిట బుధవారమిక్కడ జరిగిన సదస్సులో రావత్ మాట్లాడారు. ‘సంప్రదాయ యుద్ధరీతుల్లో పోరాడుతున్నప్పుడు ఉగ్రదాడులు, చొరబాట్లను, పరోక్ష యుద్ధాలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఈ రెండింటినీ ఏకకాలంలో ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలి. భవిష్యత్‌లో సంప్రదాయ ఆయుధాలతోపాటు అంతరిక్ష, సైబర్, సమాచార రంగాలతో కూడిన హైబ్రిడ్ యుద్ధాలే జరుగుతాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు శత్రువుల వద్ద ఉండే ఆయుధ వ్యవస్థలు, సామగ్రి, సాంకేతికతల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని రావత్ చెప్పారు. -
ఆన్లైన్ ఊబిలో మరెన్నో బ్లూవేల్స్!
-
క్రమశిక్షణ
-
ఆన్లైన్ ఊబిలో మరెన్నో బ్లూవేల్స్!
► విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న గేమ్స్ ► అత్యంత ప్రమాదకరంగా 23 రకాల ఆటలు ► పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ► పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తి, విపరీత ధోరణులు ► తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులతో విద్యాశాఖ భేటీ ► పిల్లల ప్రవర్తనను పరిశీలించి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: బ్లూవేల్ గేమ్ మాత్రమేకాదు ఆన్లైన్లో, కంప్యూటర్లు, మొబైల్ఫోన్లలో ఆడే మరెన్నో గేమ్స్ విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హింసా ప్రవృత్తి, విపరీత ధోరణులు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాము ఏదైనా చేయగలమనే అత్యుత్సాహం, ఇవి ప్రమాదకర అంశాలనే విచక్షణను కోల్పోవడం వంటి లక్షణాలు నెలకొనడంతోపాటు చివరికి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితికీ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. బ్లూవేల్ గేమ్‌తోపాటు గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ), వైస్సిటీ, మారియన్, స్వార్డ్, డెడ్లీ తదితర 23 రకాల ఆటలు కూడా యుక్త వయసు పిల్లల్లో ప్రమాదకర ధోరణులకు కారణమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. బ్లూవేల్ గేమ్‌తో పాటు విద్యార్థుల రక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై శుక్రవారం పాఠశాల విద్యాశాఖ తల్లిదండ్రుల కమిటీలు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో అవగాహన, చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించి పాఠశాలలకు పంపించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రమాదకర గేమ్స్‌ను నిషేధించాల్సిందే.. బ్లూవేల్ గేమ్‌తో పాటు అలాంటి ప్రమాదకర ఆటలను నిషేధించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అది పిల్లలు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే కౌన్సెలింగ్ ఇప్పించడం, వారు వినియోగించే మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడం వంటి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు, ఐటీ నిపుణులు సూచించారు. జీటీఏ కూడా ప్రమాదకరమే.. బ్లూవేల్ గేమ్ మాత్రమేకాదు.. గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ), జీటీఏ సాన్ ఆండ్రూస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, మారియన్, స్వార్డ్, డెడ్లీ వంటివి గేమ్స్ కూడా ప్రమాదకరమేనని నిశ్చిత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా జీటీఏ గేమ్ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటోందని తెలిపారు. ఆ గేమ్ పిల్లలను తనకు తానే హీరో అన్న భావనలోకి తీసుకెళుతుందని... పోలీసులను వెంబడించి చంపేలా, రోడ్లపై ఇష్టానుసారంగా వెళ్లేలా ఉండే ఆ గేమ్ కారణంగా పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఈ గేమ్ ప్రభావంతో ఢిల్లీలో ఓ విద్యార్థి తనకు తాను హీరోగా భావించి.. తన తాతనే చంపేశాడని వివరించారు. ఈ యాప్‌తో పిల్లల ఫోన్లపై నిఘా పిల్లలను టార్గెట్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లు, ఈ–మెయిళ్లు వంటి రకరకాల మార్గాల్లో బ్లూవేల్ గేమ్ వెబ్‌లింకును పంపుతున్నారని ఐటీ సంస్థ నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివిధ సాఫ్ట్వేర్ సంస్థలు బ్లూవేల్ గేమ్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన గేమ్స్‌ను అడ్డుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్లు, యాప్‌లను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాము కూడా పిల్లల ఫోన్లను నియత్రించేందుకు, నిఘా పెట్టేందుకు తోడ్పడే మొబైల్ యాప్‌ను రూపొందించామని నిశ్చిత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతిని«ధి రాఘవ్ చెప్పారు. తల్లిదండ్రులు తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని.. తమ ఫోన్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని, తర్వాత పిల్లల ఫోన్లలోనూ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవాలని వివరించారు. అప్పటి నుంచి పిల్లల ఫోన్లను తల్లిదండ్రులు నియంత్రించవచ్చని... వారు చూసే వెబ్సైట్లు, ఆడుతున్న గేమ్స్ వంటి వాటిని బ్లాక్ చేయవచ్చని చెప్పారు. తమ సేవలు వినియోగించుకునేందుకు ఏడాదికి రూ.182 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సమస్యను అధిగమించేందుకు రెండు మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం సైబర్, డిజిటల్ సెక్యూరిటీకి ప్రాధాన్యమిస్తోందని.. అందుకు తగిన చర్యలు చేపడుతోందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. బ్లూవేల్ గేమ్ యుక్త వయసు పిల్లలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, టీచర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని.. పిల్లల ప్రవర్తనను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రధానంగా రెండు మార్గాల ద్వారా వాటి నుంచి పిల్లలను దూరం చేయవచ్చన్నారు. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిని గమనిస్తూ వారిలో సానుకూల దృక్పథం పెంపొందించడం ఒక మార్గమని... విద్యార్థులు వినియోగించే సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పకడ్బందీగా నియంత్రించే చర్యలు రెండో మార్గమని తెలిపారు. పిల్లల రక్షణకు ప్రాధాన్యం.. ‘‘పిల్లల రక్షణకు విద్యా శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే బ్లూవేల్ గేమ్‌పై ఈ అవగాహన, చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐటీ రంగ నిపుణులను కూడా ఇందులో భాగస్వాములను చేశాం..’’ – పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ -
నిద్రలేమితో భవిష్యత్తులో అలై్జమర్స్!
పరిపరిశోధన కంటి నిండా నిద్రలేకపోతే చురుకుదనం లోపిస్తుందన్న అంశం మరోమారు నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. బ్రెయిన్ అనే మెడికల్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ప్రతి రాత్రీ తగినంతగా నిద్రలేనివారిలో మెదడు చురుకుదనం లోపించడంతో పాటు జ్ఞాపకశక్తిపై కూడా దుష్ప్రభావం పడుతుంది. అంతేగాక భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయే అలై్జమర్స్ వ్యాధికి దారితీయవచ్చు. ఇటీవలే నిర్వహించిన ఒక అధ్యయన ఫలితం ప్రకారం... రాత్రిపూట తగినంత నిద్రపోనివారిలో అమైలాయిడ్ అనే ప్రోటీన్ పాళ్లు పెరుగుతాయి. ఇవి మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అంతేగాక టావు అనే మరో ప్రోటీన్ పాళ్లు కూడా పెరుగుతాయి. ఈ ప్రోటీన్ల పెరుగుదల అలై్జమర్స్ వ్యాధిని ప్రేరేపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ అధ్యయనం కోసం కొంత మంది ఆరోగ్యవంతులైన ఎలాంటి నిద్ర సంబంధమైన వ్యాధులు లేని వాలంటీర్లను ఎంచుకొని వారిని రాత్రి సరిగా నిద్రపోనివ్వకుండా చూశారు. ఒక నెల రోజులు పరిశీలించి చూసినప్పుడు ఆ వ్యక్తుల్లో అంతకు ముందు లేని అమైలాయిడ్, టావు ప్రోటీన్ల పెరుగుదలను గమనించారు. ఈ ప్రోటీన్లు పెరిగినప్పుడు అవి భవిష్యత్తులో అలై్జమర్స్ వ్యాధిని కలగజేసే అవకాశం ఉన్నందున కంటి నిండా నిద్రపోవాలనీ, డిస్టర్బ్డ్ స్లీప్ మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు. -
సాధనతోనే క్రీడాకారులకు భవిష్యత్
ఆదిలాబాద్‌కల్చరల్: సాధనతోనే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో క్రీడాపాఠశాల అకాడెమికి ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన క్రీడాకారులు 34మంది హాజరు కాగా వయస్సు కారణంగా 15మందిని అనర్హులుగా గుర్తించి 15మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు సాధనతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. క్రీడాకారులు కష్టపడితే భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. క్రీడా పాఠశాలల్లో చేరితే అన్ని రకాలుగా సౌకర్యాలుంటాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.