"పర్యావరణ ప్రేమికురాలైన ఈష్న అగర్వాల్ డాక్యుమెంటరీ 'శాలరీ' దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్(కాప్ 28)లో ప్రదర్శించబడింది. పర్యావరణంపై ఉప్పు పరిశ్రమ చూపుతున్న ప్రభావం, ఉప్పును పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకొని ఈష్న అగర్వాల్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రపంచ ప్రతి నిధుల నుంచి ప్రశంసలు లభించాయి."
'కాప్ 28లో నా డాక్యుమెంటరీని ప్రదర్శించడం నాకు మాత్రమే కాదు పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న ఎంతో మంది యువతీ, యువకులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. చర్చను రేకెత్తించే, మార్పును ప్రేరే పించే, అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి యువతకు ఉంది. వాతావరణ మార్పును కేవలం ఒక సమస్యగా కాకుండా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలకు అవకాశంగా భావిస్తాను. విభేదాలకు అతీతంగా అందరికీ ఒకే భూమి పేరిట ఐక్యత రాగం ఆలపించడానికి ఇది మంచి తరుణం' అంటుంది అగర్వాల్.
పర్యావరణ కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆగర్వాల్‌కు హిందు స్థానీ సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్ ప్రవేశం ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రతిభ చూపుతుంది. తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించింది. మోటివేషనల్ స్సీకర్‌గా కూడా రానిస్తోంది. వ్యక్తిత్వ వికాసం నుంచి పర్యావరణ సంక్షోభం వరకు ఎన్నో అంశాలపై ప్రసంగాలు చేసింది.
ఇవి చదవండి: ఇదిగో 'కొత్త సంవత్సరం..' ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా!
Comments
Please login to add a commentAdd a comment