
పొద్దుపొద్దునే ముక్కుపుటలను తాకి మేల్కొలిపే కాఫీ వాసనకు ఫిదా కానివాళ్లు ఉండరు. అలాంటి కాఫీల్లో మంచి నాణ్యతను డిసైడ్ చేసే వాళ్లు ఉంటారని, మరిన్ని విబిన్నమైన బ్రూలను తయారు చేస్తారని తెలుసా..?. జస్ట్ కాఫీ గింజలతోనే చేసే కాఫీ కాదు. వాటిని ఉడకించి లేదా రోస్ట్‌చేస్తే వచ్చే ఫ్లేవర్‌లలో ఏది ది బెస్ట్ టేస్ట్ అని డిసైడ్ చేసి వాటికి రేటింగ్ ఇచ్చి మార్కెటింగ్ చేస్తాయి కంపెనీలు. అందుకోసం ప్రత్యేక కాఫీ టేస్టర్‌లను పెడతారు. వాళ్లే మంచి నాణ్యతతో కూడిన కాఫీని రైతులతో తయారు చేయిస్తారు. అలా మనదేశలో తొలి మహిళా కాఫీ టేస్టర్‌గా పేరుగాంచిన ఆమె ఎవరో తెలుసా..!. ఆమె అక్షరాల అచ్చ తెలుగింటి ఆడపడుచు..!. మరీ ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది? ఎలా అంచెలంచెలుగా ఎదిగింది తదితరాల గురించి చూద్దామా..!.
కాఫీ ప్రపంచంలో ది బెస్ట్ కాఫీలను మనకందించేది సునాలిని ఎన్. మీనన్. ఆమె భారతదేశంలోని తొలి మహిళా కాఫీ టేస్టర్. మీనన్ తన నిపుణుల బృందంతో కాఫీ బీన్స్‌ని అంచనా వేస్తారు. వాటిని ఉడికించడం లేదా రోస్ట్ చేయడం ద్వారా దాని రుచి, రంగుని డిసైడ్ చేసి ఏది బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే కాఫీలను తయారు చేయించేది సునాలినే. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..
ఆమె ఫుడ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె డైటీషియన్ కావాలని అనుకుంది. ఆ నేపథ్యంలో న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైటెటిక్స్‌లో డైటెటిక్స్‌లో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అలా స్కాలర్‌షిప్ కూడా పొందింది. ఇక యూఎస్ వీసా వచ్చేస్తే వెళ్లిపోవడమే తరువాయి.
ఆ తరుణంలో స్థానిక వార్తాపత్రికలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాఫీ టేస్టర్ రిక్రూట్‌మెంట్ ప్రకటన చూసింది. ఇది కాఫీకి ప్రభుత్వ నోడల్ సంస్థ. ఈ ప్రకటన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే తన మేనమామ టీ ఫ్యాక్టరీలోని ఘటన గుర్తుకొచ్చింది. అక్కడ తన మావయ్య వాళ్ల బృందం టీలని సిప్ చేసి చర్చిస్తున్న విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పడుది టీ రుచి, సూక్ష్మ నైపుణ్యాలు అంచనా వేయడానికి అలా చేస్తున్నారనేది ఆమెకు తెలియదు.
వెంటనే ఆ ఆసక్తితోనే ఆ ఉద్యోగ ప్రకటనకు అప్లై చేసింది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. కానీ సునాలిని ఎంపికవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదుగుతూ.. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా బెంగళూరులో ప్రత్యేకంగా కాఫీలాబ్‌ను స్థాపించే వరకు వెళ్లిపోయింది. ఇది కాఫీ నాణ్యతను నిర్థారించడంలో ఆమె చేసిన అచంచలమైన కృషికి సంకేతం అని చెప్పొచ్చు.
సునాలిని తెలుగమ్మాయే..
ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కడలూరుకి చెందింది. అది తన అమ్మమ్మగారి ఊరు. మద్రాస్‌లో పెరగడంతో కాఫీతో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం మద్రాసుని చెన్నైగా పిలుస్తున్నారు. ఇది దక్షిణ భారత ఫిల్టర్ కాఫీకి కేంద్రంగా ఉండేది. అలా సునాలినికి ఇంటి నుంచే కాఫీపై ఆసక్తి ఏర్పడటం జరిగింది.
ఇక ఆమె తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ రంగంలో సముచిత స్థానం ఏర్పరుచుకునేలా చాలా కష్టపడింది. పురుషాధిక్య ప్రదేశంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఏ మహిళకైనా చాలా ధైర్యం ఉండాలని అన్నారామె. ఇలా కాఫీ రుచులను చూస్తూ విసుగొచ్చేసిందా అని సునాలిని ప్రశ్నిస్తే..మరింతగా వాటి గురించి తెలుసుకునేలా మక్కువ ఏర్పరచుకున్నానంటోందామె.
ఏ రంగంలోనే బాగా రాణించాలంటే విసుగుకి చోటివ్వకూడదని నొక్కి చెబుతోంది. ఆ ఆసక్తి వల్లే తనకు ప్రతిరోజూ విభిన్న కాఫీ రుచలను ఆస్వాదించడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కుంటున్నాని చెబుతోంది. ఇక చివరిగా తనకు ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ అంటే మహా ఇష్టమని అన్నారు. ఏరంగంలోనైనా సవాళ్లు ఉంటాయనేది సహజం, ఐతే దాన్ని ఇష్టంగా మార్చుకుని ఆసక్తి ఏర్పరుచుకుంటే కచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకుంటానేందుకు సునాలిని విజయగాథే నిదర్శనం.
(చదవండి: అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..)
Comments
Please login to add a commentAdd a comment