Taste
-
'ఉమామి దినోత్సవం': ఆరు రుచులు కాకుండా మరో టేస్ట్ గురించి విన్నారా?
దశాబ్దాలుగా మన నాలుకపై ఉండే రుచి మొగ్గలు ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం, తీపి వంటి షడ్రుచులను గుర్తిస్తుందని తెలుసు. అవి కాకుండా ఉన్న మరో ఏడో రుచి గురించి విన్నారా..?. అదే 'ఉమామి' టేస్ట్. దీని కోసం ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ ఈ ఏడో రుచి గురించి చెబుతున్నారు. ప్రతి ఏటా జూలై 25న ఈ ఉమామి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును ఈ టేస్ట్‌కి సంబంధించిన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఏంటీ ఉమామి..? ఎవరూ కనిపెట్టారు? ఎలా ఉంటుంది ఈ రుచి..? అంటే..'ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్‌ని ఎలివేట్ చేసేలా రిచ్‌నెస్, ఫుల్నెస్ కూడిన ఒక విధమైన రుచి. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. రుచి ఎలా ఉంటుందంటే...ఇది ఒక సంక్లిష్టమైన రుచి. ఒక డిష్ మొత్తం రుచిని, గొప్పతనాన్ని తెలియజేసేలా ఉంటుంది. మాంసాహారం, కూరగాయాలు గంటలు తరబడి ఉడకబెట్టిన పులుసులో ఈ రుచి తెలుస్తుంది. అంతేగాదు తల్లి పాలల్లో కూడా ఈ రుచి ఉంటుందట. ఏఏ వంటకాల్లో ఉంటుందంటే..చైనా: పులియబెట్టిన సోయాబీన్ పేస్ట్ (డౌబంజియాంగ్, ఓస్టెర్ సాస్ లెక్కలేనన్ని చైనీస్ వంటకాల్లో ఇది కనిపిస్తుంది. ఉమామి డెప్త్‌ను జోడిస్తాయి.భారతదేశం: నెయ్యి, స్పష్టమైన వెన్న, భారతీయ కూరలు, పప్పుతో కూడిన రెసిపీల్లో ఇది కనిపిస్తుంది. ఆగ్నేయాసియా: ఫిష్ సాస్, థాయ్ వంటకాలైనా స్టైర్-ఫ్రైస్, సూప్‌లలో ఈ ఉమామి టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదేనా..?'ఉమామి' మన రుచి మొగ్గలను మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉమామి సంతృప్తతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది కడుపునిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. ఉమామి అధికంగా ఉండే ఆహారాలు గ్లుటామేట్, అమైనో ఆమ్లాల మూలం. కాబట్టి ఇది మెదడు పనితీరు, న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి మంచిది. (చదవండి: పౌల్ట్రీ వ్యర్థాలతో బెడ్షీట్లు,జాకెట్లు,కాగితాలు! సరికొత్త వస్త్ర పరిశ్రమ..) -
స్పేస్‌లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!
తినడం అనేది దృష్టి, వాసన, రుచి, వినికిడి స్పర్శతో కూడిన బహుళ-ఇంద్రియ అనుభవం. భూమిపై అద్భుతమైన రుచి కలిగిన ఆహారం కక్ష్యలోకి వెళ్లగానే టేస్ట్ మారిపోతుంది. వ్యోమగాములు తినేందుకు చాలా కష్టపడతారు. అక్కడ భోజనం బోరింగ్‌గా, టేస్ట్ లేకుండా చప్పగా ఉంటుందట. అంతేగాదు తరుచుగా చాలామంది వ్యోమగాములు అంతరిక్షంలో తినే ఆనందం పోతుందని చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి వాసన,ఆహార అనుభవాన్ని అంతరిక్ష ప్రయాణం ఎలా ప్రభావితం చేస్తుందని అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన ఫలితాలు భవిష్యత్తులో స్పేస్ మెనూలను రూపొందించడంలో సహాయపడతాయట. ఇక్కడ శాస్త్రవేత్తలు అంతరిక్ష యాత్రికులు రుచిని భిన్నంగా ఎందుకు అనుభవిస్తారు అనేదానిపై అధ్యయనం చేయగా.. అందుకు కారణం గురత్వాకర్షణ లేకపోవడమని గుర్తించారు. ఇక్కడ గురుత్వాకర్షణ లేకపోవడంతో స్పేస్‌లో ఉండే వ్యోమగాములు శరీరంలోని ద్రవాలు పాదాల వైపుకి గాకుండా రివర్స్‌లో తల వైపుకి ఒత్తడిని చూపిస్తాయి. ఫలితంగా ముక్కు మూసుకపోయిన ఫీలింగ్ వస్తుంది. అచ్చం జలుబు చేసినప్పుడు మనం ఎలా అయితే వాసనను కోల్పోతామో అలా ఉంటుంది మన పరిస్థితి. అందులోనూ అంతరిక్షం మన భూమ్మీద ఉండే పర్యావరణం మాదిరిగా ఉండదు, ఆహారం పట్ల అవగాహనను ఇవ్వగలిగేది కూడా కాదు. పైగా స్పేస్‌క్రాఫ్ట్ పరిమిత పరికరాలతో చుట్టుముట్టబడిన గాలి చొరబడిన కంటైనర్‌లో తినడం తదితర కారణాల వల్ల రుచిగా ఉండదని అంటున్నారు పరిశోధకులు. చెప్పాలంటే మనం ఇంటి వద్ద ప్రశాంతంగా అమ్మ వడ్డిస్తే హాయిగా తింటున్న దానికి..ఆఫీస్‌లో డెస్క్ వద్ద హడావిడిగా తిన్న దానికి చాలా తేడా ఉంటుంది. అలానే ఇది కూడా అని వివరించారు పరిశోధకులు. అందుకోసం అని దాదాపు 54 మందికి భూమ్మీదే వీఆర్ సెటప్ ద్వారా అంతరిక్ష అనుభవాన్ని ఇచ్చారు. ఆ స్పేస్ వాతారణంలో వివిధ సువాసనలను ఎలా గుర్తిస్తున్నారనేది గమనించారు. అంతరిక్షం లాంటి వాతావరణంలో నిర్దిష్ట సుగంధ సమ్మేళనాలు మాత్రమే విభిన్నంగా గుర్తించబడతాయని అధ్యయనంలో తేలింది. ప్రతిఒక్కరి అభి రుచులు వేరుగా ఉంటాయి కాబట్టి వారందరి అనుభవాల ద్వారా రుచికరంగా భోజనాన్ని ఎలా అందించాలి, వారిని ఇష్టంగా ఎలా తినమని ప్రొత్సహించచ్చో తెలుస్తుందన్నారు. ఈ అధ్యయన ఫలితాలు భూమిపై నివశించే వ్యక్తులకు, నర్సింగ్ హోమ్‌లో ఉండేవాళ్లకు, ఆర్మీలో ఉండేవాళ్లకు, జలాంతర్గామి సిబ్బందికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమయ్యింది. (చదవండి: అనంత్ రాధికల పెళ్లిలో సందడి చేసిన లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..) -
మన దేశంలో అత్యంత చెత్త వంటకాలు ఇవే..! అందులో ఉప్మా..!
అంతర్జాతీయ సంస్థ టేస్ట్ అట్లాస్ మన దేశంలో చెత్త వంటకాల జాబితాను విడుదల చేసింది. అలాగే మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారాలు, ఇష్టంలేని ఆహారాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. వాటి గురించి వివరాలు సేకరించి... ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను, ఎక్కువ మంది తినడానికి ఇష్టపడని వంటకాల జాబితాను సిద్ధం చేస్తుంది ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ. టేస్ట్ అట్లాస్ అనేది ఆన్లైన్ ఫుడ్ పోర్టల్. ఇది ప్రపంచంలోని బెస్ట్ వంటకాలు, బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ప్రకటిస్తుంటుంది. అలానే తాజాగా మనదేశంలో ఎక్కువశాతం ప్రజలు ఇష్టపడే వంటకాలు, ఇష్టపడని వంటకాల గురించి టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ పదిలో ఉన్న చెత్త , ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల వివరాలను వెల్లడించింది. చెత్త వంటకాలు ఇవే…టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం చెత్త రేటెడ్ ఫుడ్స్ ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడే జల్జీరా… ఈసారి చెత్త వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర భారతదేశంలో ఈ పానీయాన్ని విపరీతంగా తాగుతారు. అలాంటిది మనదేశంలోని చెత్త వంటకాల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం షాక్‌కి గురిచేస్తుంది. చెత్త వంటకాల్లో రెండో స్థానంలో శీతాకాలంలో అతిగా తినే గజ్జక్ ఉంది. మూడో స్థానంలో దక్షిణ భారత వంటకం తెంగై సదం, నాలుగో స్థానంలో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ పంతా బాత్, ఐదో స్థానంలో ఆలూ వంకాయ కర్రీ, ఆరో స్థానంలో తండాయ్ ఉన్నాయి. దీని తరువాత, కేరళ వంటకం అచ్చప్పం ఏడవ స్థానంలో, ప్రసిద్ధ హైదరాబాదీ మిర్చి కా సలాన్ ఎనిమిదో స్థానంలో, తీపి వంటకం మల్పువా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో అల్పాహారంలో అధికంగా తినే ఉప్మా పదో స్థానంలో నిలిచింది. ఉప్మాను అధికంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తింటారు.బెస్ట్ ఫుడ్ ఇవే..మనదేశంలో బెస్ట్ ఫుడ్ జాబితాలో ఏ ఆహారాలు నిలిచాయో టేస్ట్ అట్లాస్ వివరించింది. ఆ ఫుడ్ లిస్ట్‌లో ఉన్న రుచికరమైన మామిడి లస్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మసాలా చాయ్ రెండో స్థానంలో, బటర్ గార్లిక్ నాన్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానంలో అమృత్ సర్ కుల్చా, ఐదో స్థానంలో బటర్ చికెన్, ఆరో స్థానంలో హైదరాబాదీ బిర్యానీ, ఏడో తేదీన షాహి పనీర్, ఎనిమిదో స్థానంలో అందరికీ ఇష్టమైన చోలే భటురే నిలిచాయి. ఆ తర్వాత తందూరీ చికెన్ తొమ్మిదో స్థానంలో, కోర్మా పదో స్థానంలో నిలిచాయి. సాధారణంగా హైదరాబాదీ బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఈసారి బిర్యానీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.టేస్టీ అట్లాస్ నిర్వాహకులు తమ పోర్టల్‌లో ఎవరికి ఏ ఆహారం అధికంగా నచ్చుతుందో, ఏ ఆహారం నచ్చదో చెప్పమని అడుగుతారు. మనదేశంలోని ఎవరైనా ఆ పోర్టల్ రెస్పాండ్ కావచ్చు. ఈ సర్వేలో పాల్గొన వచ్చు. ఆ విధంగా ఎక్కువ ఓట్లు పడిన వంటకాల జాబితాను సిద్ధం చేసి విడుదల చేస్తారు.(చదవండి: ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ది బెస్ట్ సీఫుడ్ డిష్‌గా ఈ భారతీయ కర్రీకి చోటు!..ఎన్నో స్థానం అంటే..?
భారతదేశంలోని తీర ప్రాంతాలు సీఫుడ్‌కి పేరుగాంచినవి. మన దేశంలో సముద్రపు ఆహారానికి సంబంధించిన అనేక ఐకానిక్ కూరలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ వెజ్ కర్రీ, బెస్ట్ స్వీట్స్,బెస్ట్ రెస్టారెంట్స్ వంటి జాబితాను అందించింది.అలానే తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ సీఫుడ్స్ డిష్‌ల జాబితాను విడుదల చేసింది.భారతదేశంలోని తీరప్రాంతాలు మంచి రుచికరమైన సీఫుడ్లను అందించడంలో అపారమైన పాక నైపుణ్యం కలిగి ఉంది. ఇవి ఎల్లప్పుడు ది బెస్ట్ సముద్రపు ఆహార వంటకాలుగా నిలుస్తాయి. పైగా ప్రజల మనసును కూడా దోచుకుంటాయి. అయితే టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ది బెస్ట్ సీ ఫుడ్ జాబితాలో మన భారతీయ సీఫుడ్ కర్రీకి స్థానం దక్కడం విశేషం. జూలై 2024న విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో మన భారతదేశంలోని బెంగాలీ రుచికరమైన వంటకం చింగ్రి మలై కర్రీ 31వ స్థానంలో నిలిచింది. ఇది మంచి ఘుమఘమలాడే రొయ్యల కర్రీ. దీన్ని కొబ్బరిపాలు, రొయ్యలు, గరం మాసాలాలు, ఆవాల నూనెతో తయారు చేస్తారు. దీని తయారీలో వేడి మిరపకాయలు, వెల్లుల్లి వేయించాలి, అల్లం పేస్టు, దాల్చిన చెక్కె, చక్కెర, ఏలుకులు చేర్చి.. చిక్కటి గ్రేవితో సర్వ్ చేశారు. ఇది దశల వారీగా ఓపికతో తయారు చేయాల్సిన రుచికరమైన వంటకం. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?) -
కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?
చక్కగా కూర్చొని ఆహారం తింటుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడూ ఈ ఉరుకులు పరుగులు జీవన విధానంలో చాలామంది నిలబడి గబగబ తినేసి భోజనం కానిచ్చాం అన్నట్లుగా తింటున్నారు. అంతెందుకు పెళ్లిళ్లలో కూడా బఫే పేరుతో నిలబడి తినడమే. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే తీరు. ఇంతకీ ఇలా తినడం మంచిదేనా? అంటే..ముమ్మాటికి కాదనే చెబుతున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.నిలబడి తింటే..నిలబడి తినడం వల్ల వేగంగా జీర్ణమయ్యి, కొవ్వు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇది ఒక్కోసారి పొట్ట ఉబ్బరాన్ని కలిగించి ఆకలిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఇటీవల చాలామంది టైం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో నిలబడి ఏదో కానిచ్చాం అన్నట్లు భోజనం చేస్తుంటారు. ఇది జీర్ణక్రియకు హానికరం అని, అతిగా తినేందుకు దారితీస్తుందని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. గురత్వాకర్షణ కారణం కడుపులోని ఆహరం వేగంగా ప్రేగుల్లో కదులి, త్వరగా జీర్ణమయ్యిపోతుంది. ఫలితంగా అతి ఆకలికి దారితీస్తుందని తెలిపారు.చాలామంది నిలబడి తినడం వల్ల బరువు తగొచ్చని భావిస్తుంటారు. కానీ దీని వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరానికి అవసరమయ్యే కొవ్వుల, నష్టం, పోషకాల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా నిలబడి తింటే ఆహారం టేస్టీగా అనిపించదట. అదీగాక వాళ్లు కూడా ఆటోమేటిగ్గా రచి తక్కువ ఉన్న ఆహారపదార్థాలను ఇష్టపడతారని చెబుతున్నారు. ఎందుకంటే నిలబడి తింటున్నప్పుడూ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు 30 మంది వ్యక్తులను తీసుకుని అధ్యయనం చేయగా నిలబడి తిన్న వాళ్లలో బరువు కోల్పోడమే గాక టేస్టీగా ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్ని గుర్తించామని చెప్పారు. కూర్చొని తినడం..మీరు తినేటప్పుడు అనుసరించే భంగిమ మీ ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి కూర్చొన్నప్పుడు కడుపులోని ఆహారం నెమ్మదిగా ఖాళీ అవుతుందని అన్నారు. నిలబడి భోజనం చేసిన దానికంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని అన్నారు. అలాగే శరీరం ప్రోటీన్లు గ్రహించేలా మంచిగా జీర్ణం అవుతుంది. అంతేగాక రక్తానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాల లభ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక కూర్చొని తినడం వల్ల టేస్టీగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. పైగా నిలబడి తిన్నప్పటి కంటే కూర్చొని భోజనం చేసినప్పుడూ ఆహారం టేస్టీగా అనిపిస్తుందట కూడా. తక్కువ ఆకలి ఉంటుంది. నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు పరిశోధుకులు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందిలో.. కూర్చొన తిన్న వారిలో జీర్ణ సంబధ సమస్యలు లేకపోవడమే గాక బరువు అదుపులో ఉన్నట్లు తెలిపారు. పైగా నిలబడిన వారితో పోలిస్తే టేస్టీగా ఉండే భోజనాన్నే ఇష్టపడినట్లు గుర్తించామని అన్నారు. ఏదీ బెటర్ అంటే..కూర్చొని తినే భంగిమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కూర్చొవడం అంటే..డైనింగ్ టేబుల్స్ మీద కాదు. నేల మీద నిటారుగా కూర్చొని భోజనం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గూని లేకుండా నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపులోంచి ఆహరం ప్రేగుల్లోకి నెట్టడానికి అనుమతిస్తుంది. అలాగే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నిజానికి ఇది భారతీయ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న భోజన సాంప్రదాయం కూడా ఇదే.ఇక నిలబడినప్పుడు త్వరితగతిన ఆహారం విచ్ఛిన్న అయ్యి కాలక్రమేణ కొవ్వులు నష్టానికి దారితీస్తుందని పరిశోధనలో తేలిందన్నారు పరిశోధకులు. అలాగే టేస్టీగా తినాలనుకుంటే కూర్చొని హాయిగా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిదని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే "నో రా డైట్" అంటే..!) -
మినిమం 30.. తగ్గేదేలే..! ఇది కదా పానీ పూరీ మజా....వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత ఇష్టమైన,అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పానీ పూరీ. ఖట్టా-మీఠా ఇలా వివిధ రకాల రుచులు, స్టఫ్ఫింగ్స్‌తో .. అసలు ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్ చాలామందికి. అలాంటి పానీ పూరీ తాజాగా, అమెరికావాసులను కూడా ఫిదా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Curry Corner (@currycornermn) మిన్నియాపాలిస్ వాసులు అక్కడి భారతీయ రెస్టారెంట్ , కర్రీ కార్నర్ వద్ద పానీ పూరీ తెగ లాగించేస్తూ మురిసిపోతున్నారు. ‘ఆహా తినరా మై మైరచి అంటున్నారు. మరికొందరైతే మాటల్లేవు.. అంటూ పానీ పూరీని ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. పానీపూరి ప్యూర్ లవ్ అని అని ఒక ఇన్‌స్టా యూజర్ కామెంట్ చేశాడు. మినిమం 30 పూరీలు ఏగబిగిన లాగించేయాల్సిందే.. 20కి పైగా పానీ పూరీలు తింటూ ఉంటే.. అలా కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోతే ఉంటే అప్పుడు గానీ పానీ పూరీ తినడంలోని మజా అర్థం కాదు.. ఇలా పలు కామెంట్లు సందడి చేస్తున్నాయి. పాపులర్ పానీ పూరీని మిన్నియాపాలిస్ వాసులకు పరిచయం చేశాము అంటూ సదరు రెస్టారెంట్ ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్ చేసిన ఈ రీల్ ఏకంగా 3.9 మిలియన్ల వీక్షణలు, 90వేలకు పైగా లైక్స్ సాధించింది. -
బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు!
ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు దక్కింది. టాప్ 20 బెస్ట్ శాండ్విచ్లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడ పావ్క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రకారం..ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్ రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన ఆశోక్ వైద్య అనే వీధి వ్యాపారీ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట. అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్‌ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: మన దేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే!) -
పెరిగే వయసుతో... నచ్చే రుచుల మార్పు
రుచి కేవలం నాలుక మీద మాత్రమే తెలుస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఒక రకం తిండి మనకు ఇష్టమా లేదా అని తెలియడానికి నాలుక ఒక్కటే ఆధారం కాదు. ఉదాహరణకు మనం ఏదో ఒక పండును కొరుకుతాము. ఒక్కసారిగా మెదడుకు రకరకాల నాడీ రసాయన స్పందనలు అందుతాయి. వాటి కారణంగా ఆ పండును మరొక సారి మనం కొరుకుతామా లేదా అన్నది నిర్ణయం అవుతుంది. నాలుక మీద ఉండే రుచిని గుర్తించే కణాలను ‘టేస్ట్ బడ్స్’ అంటారు. అంగిలి అంటే నోటిలో పైభాగం, గొంతు లోపలి పక్క, ఇంకొంచెం కిందకు ఉండే ఈసోఫేగస్ లాంటివన్నీ తిండి గురించిన సమాచారాన్ని మెదడుకు చకచకా పంపిస్తాయి. దానితో నోటిలోకి అందిన తిండి రుచి తెలుస్తుంది. మనకు కలకాలంగా ఆరు రుచులు అన్న సంగతి గురించి చెబుతున్నారు. శాస్త్రజ్ఞులు ఇంకొక పక్కన ఉన్నది ఐదు రుచులు మాత్రమే అంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదులతోపాటు ఉమామి అనే ఒక కొత్త రుచిని కూడా ఈ మధ్యన చెబుతున్నారు. మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రుచులు తెలుసుకొని ఇష్టపడే లక్షణాలు మారుతూ ఉంటాయట. ‘రుచులు తెలిసేది మెదడు కారణంగానే! ఈ మెదడు మొండిగా ఉండదు. మారుతూ ఉంటుంది. కనుకనే వయస్సుతో పాటు రుచి, వాసనలను గ్రహించే తీరు మారుతూ పోతుంది’ అంటున్నారు ఫిలడెల్ఫియా పరిశోధకురాలు జూలీ మెనెల్లా. ముఖ్యంగా బాల్యంలో అంటే మరీ చిన్న వయసులో రుచులను ఇష్టపడడంలో చాలా మార్పులు వస్తాయి అంటారావిడ. మరీ చిన్న వయసులో రుచి గురించిన తీరు చాలా వేరుగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది అని ఆమె వివరించారు. తీపి, ఉప్పు రుచిగల తిండి పదార్థాలను ఇష్టపడడం అన్నది బాల్యంలో మెదడులో గట్టిగా పాతుకుపోయి ఉంటుంది. మానవ పరిణామం దృష్ట్యా చూస్తే తీపి అన్నది ఎక్కువ శక్తి గల ఆహార పదార్థాలతో సంబంధం కలిగిన విషయం. ఇక శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజలవణాలు ఉప్పగా ఉండే తిండితో అందు తాయి. చిన్న వయసులో ఉన్న వారికి శరీరం పెరుగుదల కారణంగా చాలా శక్తి అవసరం ఉంటుంది అన్నది తెలుసు. ‘అందుకే ఆ వయసులో ఎక్కువ శక్తిని అందించగల తీయని పదార్థాల వైపు దృష్టి ఉంటుంది. ఈ లక్షణం శరీరంలోనే సహజంగా ఉంటుంది. శరీరానికి శక్తి ఆ రకంగా అందుతుంది’ అంటారు మెనెల్లా. ఇక చేదు రుచి గురించి చూస్తే, చేదు రుచి మనకు ఇష్టం లేని పదార్థాలతో గట్టిగా ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ వాటిని తిన్నందువల్ల నష్టం జరగదు, మంచి జరగవచ్చు అని అర్థమైతే అప్పుడు వాటిని అంగీకరించే మానసిక పరిస్థితి వస్తుంది. బిడ్డలు తల్లి కడుపులో ఉండగానే ఆహార పదార్థాల రుచి అలవాటు అవుతుంది అని గమనించారు. గర్భంతో ఉన్న స్త్రీలకు చేదు రుచి పట్ల ఏవగింపు ఉంటుంది. తల్లి తీసుకుంటున్న ఆహారం ప్రభావం కడుపులోని బిడ్డ మీద కూడా పడుతుంది. తల్లి ఏదో మందు మింగితే కడుపులోని పాప ముఖం ముడుచుకుంటున్నట్టు అల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపించింది. బాల్యం, యవ్వనం గడుస్తున్న కొద్దీ ఆ మేర రుచులకు స్పందించడం తగ్గుతుంది. చేదును అంగీకరించడం మొదలైన కొద్దీ, తీపి, ఉప్పుల మీద కొంత ఆసక్తి తగ్గినా తగ్గవచ్చు. కనుకనే యుక్త వయసు దాటిన తరువాత తిండి విషయంగా అంతగా పట్టింపు ఉండకపోవచ్చు. అప్పుడిక అంతకు ముందు ఏవగించు కున్న తిండి పదార్థాలను కూడా తినే పద్ధతి మొదలవుతుంది. 50వ పడిలో పడిన తరువాత నాలుక మీద అంతవరకు ఉన్న పదివేల రుచి కణాల సంఖ్య రాను రాను తగ్గుతుంది. అవి మళ్లీ తిరిగి పెరగవు. అంతకు ముందు మాత్రం అవి పది రోజులకు ఒకసారి సమసిపోయి తిరిగి పుడుతుంటాయి. పాడయిన కణాల స్థానంలో కొత్తవి రాకపోవడంతో రుచి తెలియడం తగ్గుతుంది. వాసన విషయంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మార్పులు అంతగా గుర్తించగలిగే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏదో ఒక్క రుచీ, ఒక్క వాసనకే పరిమితం కాకపోవచ్చు. అంటే అన్ని వాసనలూ తెలియకుండా పోయే పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రకాలు, ఉదాహరణకు మల్లెల వాసన తెలియకపోవచ్చు, ఉల్లివాసన మాత్రం బాగా తెలియ వచ్చు. రుచులు తెలియకుండా పోవడానికి వయసు ఒకటే కారణం కాదు. రక్తపు పోటును తగ్గించడానికి వాడే కొన్ని మందులు కూడా ఈ రకం ప్రభావాన్ని చూపిస్తాయి. శ్వాస మండలంలోని పైభాగంలో వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు ఇచ్చే మందులు కూడా రుచి, వాసనలు తెలియకుండా చేస్తాయి. ఈ విషయం కోవిడ్ వల్ల తెలిసింది. అసలు కోవిడ్ గురించి మొదటి సూచన లుగా ఈ లక్షణాలను ఎంచుకున్నారు. ప్రభావం తగ్గిన తర్వాత చాలామందికి రుచి, వాసనలు తెలియడం తిరిగి మొదలయింది. కొందరికి మాత్రం ఆ రకంగా జరగలేదు. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత ‘ 98490 62055 -
కచోరీ, జిలేబీ సూపర్: జపాన్ రాయబారి!
భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్‌ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో దీనికి సంబంధించిన రెండు క్లిప్‌లను షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది. జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు. Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023 -
Coffee : షేక్‌పేటలో కాఫీ కొత్త రుచులు
బెంగెట్, బెర్గెండాల్, బెర్నార్డినా, బ్లూమౌంటెన్, బోర్బన్.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు కాఫీల్లో. కతుర్రా, ఛారియర్, హరార్, ఫ్రెంచ్ మిషన్ ఇలా ఒక్కో దేశంలో కాఫీది ఒక్కో రుచి. కోన, జావా అంటూ దీవుల్లో, మోచా, పాకాస్ అంటూ లాటిన్ అమెరికాల్లో, సగడ, శాంటోస్ పేరిట దక్షిణాది దేశాల్లో.. ఇలా కాఫీ అంటే ప్రాణం ఇచ్చేవారు లోకమంతా కనిపిస్తారు. కాఫీ రుచులు, ఐస్ క్రీం టేస్టులు అందించే లా రొసెట్టా, సౌత్ పోల్ షాపులను షేక్‌పేట, ఓయూ కాలనీలో ప్రారంభించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నాణ్యత, ప్రామాణికాలే వ్యాపారాభివృద్ధికి దోహదపడతాయన్నారు. నాణ్యత ప్రమాణాలు కలిగి రుచికరమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించగలిగితే వ్యాపారం అంచలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని సూచించారు. కల్తీలేని ఆహార పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్న చోటుకు వినియోగదారులు వెతుక్కుంటూ రావడానికి ఇష్టపడతారన్నారు. పిల్లలకు యువతకు ఇష్టకరమైన అన్ని ఐటమ్స్ ఉంచగలిగితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ఛైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. బి.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, నేపథ్య గాయకుడు, సంభాషణల రచయిత రాకేందు మౌళి వెన్నెలకంటి, శ్యామ, శ్రీనివాసరావు, ప్రశాంతి, శ్యామ్ సుందర్, శిరీష, రవికాంత్ , శ్రీకాంత్ మరియు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరిక్షం రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా?
భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ.. గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్‌తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 2003లో పెర్సెయస్ గెలాక్సీ క్లస్టర్ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్ హోల్) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. గ్రహాల ‘పాటలు’ ఇవి నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్రోవర్ మార్స్పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వనిఅతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. విజిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్ వాక్ చేస్తుంటారు. అలా స్పేస్ వాక్ చేసి, తిరిగి ఐఎస్ఎస్లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. ‘టచ్’లో మార్పు లేదట! అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. రకరకాల రుచుల్లో నక్షత్రాలు సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు. కళ్లు ‘ఫ్లాట్’ అవుతాయట! అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ (సాన్స్)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్ డిస్క్‌లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును! -
క్యాండీస్ తినటమే పని.. జీతం రూ.61 లక్షలు!
ఒట్టావా: ఒళ్లు వంచి రోజంతా కష్టపడినా జీతం అంతంతమాత్రమేనని చాలా మంది బాధపడుతుంటారు. అయితే.. తినటమే పనిగా ఉంటే.. దానికి లక్షల్లో జీతం వస్తే.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదా? అవునండీ.. అలాంటి ఉద్యోగాలూ ఉన్నాయి. ఓ ఛాక్లెట్ల తయారీ సంస్థ ‘చీఫ్ క్యాండీ టేస్టర్’ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాండీలు(మిఠాయిలు, ఛాక్లెట్లు) తినటమే ఆ ఉద్యోగం. జీతం కూడా భారీగానే ఇస్తోంది. ఏడాదికి రూ.61 లక్షలు మరి. క్యాండీలు అంటే ఇష్టపడే వారు వెంటనే ఈ ఆఫర్‌ను ఒడిసిపట్టండి మరి. కెనడాకు చెందిన క్యాండీ ఫన్‌హౌస్ అనే ఆన్లైన్ రిటైలర్ సంస్థ ఛాక్లెట్స్ నుంచి వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తోంది. చీఫ్ క్యాండీ ఆఫీసర్‌ను నియమించుకోవాలని భావిస్తోంది. అందుకు 1,00,000 కెనెడియన్ డాలర్లు(సుమారు రూ.61.14 లక్షలు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను గత జులైలో లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది సంస్థ. తల్లిదండ్రుల అనుమతితో 5 సంవత్సరాల వయసు పైబడిన వారంతా ఈ ఉద్యోగానికి పోటీ పడొచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. భారీస్థాయిలో దరఖాస్తులు వస్తాయని తాము ఊహించలేదని సీఈఓ జమిల్ హెజాజి పేర్కొన్నారు. ఒక చీఫ్ క్యాండీ ఆఫీసర్‌గా నెలకి 3,500 పీసులు తినాలి. రోజుకు 117 అన్న మాట. అయితే.. అవి చాలా ఎక్కువని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ ఉద్యోగానికి పెద్ద వారితో పాటు చిన్న పిల్లలు సైతం దరఖాస్తులు పంపించారు. తమ పిల్లలు దరఖాస్తు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తల్లిదండ్రులు. Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists. Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6 — Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022 ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
వైరల్ వీడియో.. ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు..
కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు. అయితే, ఒకసారి ఒకదాన్నే రుచి చూసి చెప్పగలరు. అదేంటి ఎవరైనా ఒకసారి ఒకదాన్నే రుచి చూడగలరు అంటారా? కానీ బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు. ఆమె నాలుక అలాంటిది మరి! అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్.. అదేనండి శరీరంలో మార్పులు చేసుకోవడమంటే మహా సరదా. సర్జరీ ద్వారా ఆమె తన నాలుకను రెండుగా స్ప్లిట్ చేయించుకుంది. ఇటీవల ఆమె ఒక గ్లాస్లో స్ప్రైట్ కూల్‌డ్రింక్, మరోగ్లాస్లో మంచినీళ్లు పెట్టుకుని రెండింటిని ఒకేసారి తాగి తన స్ప్లిట్ నాలుకతో రెండింటి రుచులు చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా పిచ్చపిచ్చగా లైక్స్ వచ్చాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,28,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఈ స్ప్లిట్ టంగ్ అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. చదవండి: చేనులో చేపలే పంట! View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) -
ష్యాషన్ కోసం నాలుకను రెండుగా విడగొట్టింది...ఆ తర్వాత
Woman With Split Tongue Tastes 2 Drinks At: చాలామంది యువత ఫ్యాషన్ మాయలో పడి విచిత్రమైన విధంగా తమ శరీరం సౌష్టవాన్ని మార్చుకుంటుంటారు. అంతేందుకు కొంతమంది మగవాళ్లు చెవులకు రింగులు పెట్టుకోవడాలు, టాటులు వేయించుకోవడం వంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు చెవులకు రింగులు కుట్టించుకుంటే వీళ్లు నాలుకకి, నోటికి రింగులు పెట్టుకుంటున్నారు. పైగా జుట్టుకు కూడా విచిత్రమైన రంగురంగుల డైలు వేసుకుని దెయ్యాన్ని తలపించేలా రెడీ అవుతున్నారు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక ఆమె ఫ్యాషన్ కోసమో లేక మరేందుకో గానీ నాలుకను రెండుగా విడగొట్టుకుంది. పైగా ఇప్పుడు తాను ఒకేసారి రెండు రకాల పదార్థాలను టేస్ట్ చేయగలనని మరీ చెబుతోంది. వివరాల్లోకెళ్తే.... కాలిఫోర్నియాలో నివసిస్తున్న బ్రియానా మేరీ షిహదేహ్ ఆమె తన శరీరాన్ని రకరకాలు మార్చుకోవడం ఆమెకు ఇష్టం. ఈ మక్కువతోనే తన నాలుకను శస్త్ర చికిత్స ద్వారా రెండుగా విడదీసింది. అంతేగాదు మీరెప్పుడైన రెండు రకాల ఆహార పదార్ధాలను ఒకేసారి టెస్ట్ చేయగలిగారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఆమె రెండు రకాల ఆహార పదర్థాలను ఎలా టేస్ట్ చేయగలదో కూడా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) (చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు...) -
ఎంతెంత మెంతి.. అంతంత రుచి
మెంతి ఆకులు, గింజలు వంటింటి నేస్తాలని మనకు తెలిసిందే! కుండీల్లో పెరిగే ఆకులు కూరకు రుచినిస్తాయి. జీలకర్రతో దోస్తీ చేసే మెంతులు. ఘుమఘుమలతో మదిని దోచేస్తాయి. ఆరోగ్యప్రదాయినిగా పేరొందిన మెంతి. వేపుడుకైనా, గ్రేవీకైనా రెడీ అంటూ ముందుంటుంది. వెజ్, నాన్‌వెజ్ వంటకాలకు ఇంత అనేది లేకుండా ఎంతెంత మెంతి వేస్తే అంతంత రుచిని జత చేరుస్తుంది. ఖీమా సోయా మెంతి కావలసినవి: నూనె – పావు కప్పు; ఉల్లిపాయ – 2 (మీడియం సైజువి); అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్లు; ఖీమా– పావు కేజీ; జీలకర్ర – టీ స్పూన్ (వేయించి, పొడి చేయాలి); ఎర్ర మిరపకాయలు – 2; పసుపు పొడి – పావు టీస్పూన్; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – 8–10; యాలకులు – 2; లవంగాలు – 4; సోంపు – అర టీ స్పూన్; టమోటా – 1 (సన్నగా తరగాలి); నీళ్లు – కప్పు; మెంతి ఆకులు – అర కప్పు; సోయా – పావు కప్పు; జావత్రి, జాజికాయ పొడులు – చిటికెడు; పచ్చిమిర్చి – 3; కొత్తిమీర – తగినంత. తయారీ: ∙బాణలిలో నూనె, ఉల్లిపాయ తరుగు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ∙అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ∙పచ్చిమిర్చి వేగాక, ఖీమా వేసి, రంగు మారే వరకు బాగా వేయించాలి. 8–10 నిమిషాలు లేదా నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ∙నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు, సోంపు వేసి కలపాలి. ∙టొమాటోలు వేసి 2–3 నిమిషాలు ఉడికించాలి. ∙టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలపాలి. దీంట్లో సోయా వేసి, మూత పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. ∙మెంతి ఆకులు, మెంతులు వేసి బాగా కలపాలి. ∙నూనె విడిపోయే వరకు మూతపెట్టి, తక్కువ మంటపై ఉడికించాలి. ∙జాపత్రి, జాజికాయ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ∙కొత్తిమీర తరుగు వేసి, మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచి, తర్వాత సర్వ్ చేయాలి. మెంతి ఫిష్ కర్రీ కావలసినవి: చేప ముక్కలు – 4; తాజా మెంతి ఆకులు – 4 కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు – అర కప్పు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పెద్ద టమోటా – 1 (సన్నగా తరగాలి); కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – అర టీ స్పూన్. తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పురాసి, రుద్ది, పక్కన పెట్టి, ఓ ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, మెంతులు వేసి ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అప్పుడు నూనె నుండి గింజలను బయటకు తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసి, వేయించాలి. ∙అల్లం– వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి, తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి, మిశ్రమం సాస్ లాగా మారే వరకు ఉడికించాలి. తర్వాత మెంతి ఆకులను వేసి, కలపాలి. ∙ చేప ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీరు (కావాలనుకుంటే) వేసి నెమ్మదిగా మంట మీద ఉడికించాలి. ∙వడ్డించే ముందు కొంచెం నిమ్మరసం పిండాలి. మెంతి కార్న్ మలాయ్ కావలసినవి: మెంతి ఆకులు – 2 కప్పులు; మొక్కజొన్న గింజలు – అర కప్పు; టొమాటోలు – 4; జీడిపప్పు – 15; పాలు – కప్పు; క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; పంచదార – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వంట నూనె – 2 టేబుల్ స్పూన్లు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక గిన్నెలో మెంతి ఆకులు, టీ స్పూన్ స్పూన్ ఉప్పు వేసి, మూతపెట్టి, 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ∙తర్వాత మెంతి ఆకులను మంచినీటితో బాగా కడగాలి.∙మొక్కజొన్న గింజలను ప్రెషర్ కుకర్‌లో వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, పక్కన పెట్టుకోవాలి. ∙జీడిపప్పును తరిగి 3 టేబుల్స్పూన్ల పాలలో 15 నిమిషాలు నానబెట్టాలి.∙నానబెట్టిన జీడిపప్పును గ్రైండ్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ∙తరిగిన టొమాటోను ప్రెజర్ కుకర్‌లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నీళ్లు కలపద్దు. ∙బాణలిలో నూనె, వెన్న వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, యాలకుల పొడిని కలపాలి. ∙ ఇప్పుడు తరిగిన మెంతి ఆకులు వేసి, నిమిషం సేపు వేయించాలి. ∙ఇప్పుడు టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ∙టొమాటో, మసాలా నుండి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేసి నిమిషం సేపు ఉడికించాలి. ∙దీంట్లో క్రీమ్ కలిపి, మూతపెట్టి సన్నని మంట మీద నిమిషం సేపు ఉడికించాలి. ∙ఈ మలాయ్ కర్రీని నాన్ లేదా రోటీ లేదా పరాఠాతో వేడి వేడిగా వడ్డించాలి. ఓట్స్ మెంతి కావలసినవి: ఓట్స్ – ముప్పావు కప్పు (గ్రైండ్ చేసి, పక్కనుంచాలి); మెంతి ఆకులు – 2 కప్పులు; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; కారం – ఒకటిన్నర టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; నువ్వులు – అర టీ స్పూన్. తయారీ: ∙ఒక పాత్రలో ఓట్స్, మెంతి ఆకులు, రవ్వ, పెరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి, బాగా కలపాలి. ∙కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, ఒత్తి పక్కనుంచాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న ముట్టీలను నూనె వేసి లేదా వేయకుండానే వేయించుకోవాలి. ∙విడిగా ఒక మూకుడును స్టౌ మీద పెట్టి వేడయ్యాక రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. దీంట్లో ఆవాలు, నువ్వులు వేసి చిటపటలాడాక వేయించిన ముట్టీలను వేసి, మరోసారి వేయించాలి. వీటిని వేడి వేడిగా ఏదైనా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
గమ్మత్తైన టీవి.. చూస్తే నోరూరుతుంది.. నాకితే రుచి తెలుస్తుంది.. ఎక్కడో తెలుసా!
కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలను తలచుకోగానే నోరు ఊరుతుంది. కళ్లముందు కనపడితే.. అసలు ఆగలేరు. ఇలాంటి వారినే ఊరిస్తూ ఉంటాయి.. టీవీలో కనిపించే కొన్ని ఆహారపదార్థాలకు సంబంధించిన ప్రకటనలు, ఫుడ్ షోలు. ఆ ఆహార పదార్థాలను ఎంచక్కా రుచి చూడొచ్చు కాణి ఖర్చు లేకుండా. నిజం.. జపాన్‌లో టీటీటీవీ అంటే ‘టేస్ట్ ద టీవీ’ పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించారు. ఇందులోని ప్రొటోటైప్ తెరకు ప్రత్యేకమైన సెటప్ ద్వారా కొన్ని టేస్టీ ట్యూబ్‌లను అమర్చారు. దీంతో తెరపై కనిపించే ఆహార పదార్థాలను నాకి, రుచి చూడొచ్చు. అంతేకాదు మీకు నచ్చిన ఫ్లేవర్స్నూ కోరి మరీ టేస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెబితే.. వెంటనే, తెర మీద ఉన్న ఫ్లాస్టిక్ షీట్‌పై ఆ ఫ్లేవర్ బొమ్మ వచ్చి పడుతుంది. చక్కగా ఆ చాక్లెట్‌ను చప్పరించొచ్చు. ప్రస్తుతం జపాన్‌కు చెందిన ప్రసిద్ధమైన పది వంటకాల రుచులను మాత్రమే తెలియజేస్తుందీ టీవీ. త్వరలోనే మరింత అ‹ప్డేట్ అయ్యి అన్ని రుచులనూ ఆస్వాదించేలా ఆ టీవీని రూపొందిస్తామని చెప్తోంది సదరు టీవీ కంపెనీ యాజమాన్యం. -
వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు
Japan Licking TV Screen With Food Flavours: ‘జపానోడు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే’.. అంటూ ఓ అరవ డబ్బింగ్ సినిమాలో ఫన్నీ డైలాగ్ ఉంటుంది. అయితే అడ్వాన్స్ టెక్నాలజీని పుణికిపుచ్చుకున్న దేశంగా జపాన్.. క్వాలిటీ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ఈ తరుణంలో జపాన్ నుంచి వచ్చిన ఓ తాజా ఆవిష్కరణపై సరదా చర్చ మొదలైంది. ‘టేస్ట్ ద టీవీ’ TTTV పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించాడు ఓ జపాన్ ప్రొఫెసర్. ప్రొటోటైప్ టీవీ తెరను డెవలప్ చేసి దీనిని తయారు చేశాడు. ఇందులో తెర మీద రకరకాల రుచులను చూసే వీలు ఉంటుంది. ప్రత్యేకమైన సెటప్ ద్వారా టేస్టీ ట్యూబ్‌లను అమర్చి ఉంటుంది. చూడడానికి ఇది పది ఫ్లేవర్ల రంగులరాట్నం మాదిరి ఉంటుంది. మల్టీపుల్ సెన్సార్‌తో పని చేసేలా రూపొందించాడు ఆ ప్రొఫెసర్. వాయిస్ కమాండ్ తీసుకోగానే(ఏ ఫ్లేవర్ కావాలో.. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పాలి).. అప్పుడు తెర మీద ఉన్న ప్లాస్టిక్ షీట్‌పై ఆ ఫ్లేవర్ వచ్చి పడుతుంది. అప్పుడు ఎంచక్కా నాకి రుచిచూసేయొచ్చు. ప్రొఫెసర్ హోమెయి మియాషిటా.. మెయిజి యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇది తయారు చేయడానికి మియాషిటా ఆధ్వర్యంలోని 30 మంది విద్యార్థుల బృందం కష్టపడింది. ‘‘కరోనా టైంలో జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి కదా. అందుకే రెస్టారెంట్, వాళ్లకు నచ్చిన రుచి అనుభవం ఇంట్లోనే అందించేందుకు ఇలా ఫుడ్ ఫ్లేవర్లను అందించే డివైజ్‌ను రూపొందించాం’’ అని ప్రొఫెసర్ హోమెయి మియాషిటా చెప్తున్నారు. Taste the TV కమర్షియల్ వెర్షన్‌ను 875 డాలర్లకు అందించబోతున్నారు. వీటితో పాటు టేస్టింగ్ గేమ్స్, క్విజ్‌లను కూడా రూపొందించబోతున్నారు. పిజ్జా, చాక్లెట్ రుచిని అందించే స్ప్రేను సైతం తయారు చేయనుంది ఈ టీం. ఎక్స్‌క్యూజ్‌మీ.. కొంచెం మీ ముఖాన్ని అద్దెకిస్తారా? -
ప్రపంచంలోనే ఖరీదైన ద్రాక్ష, ఒక్కోటి రూ.35వేలు
సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ఖరీదైన మామిడి పళ్లు గురించి విన్నాం.ఇపుడిక ప్రపంచంలోనే అతి ఖరీదైన, అరుదైన ద్రాక్ష పండ్లు గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అనేక రకాల ద్రాక్షలు కనిపిస్తాయి. కానీ చక్కటి రంగు,రుచితో పింగ్‌పాంగ్ బంతి సైజులో ఉండే ‘రూబీ రోమన్ ద్రాక్ష’ ప్రత్యేకతే వేరు. ఈ రకానికి చెందిన ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాముల కంటే ఎక్కువే. రుచిలో కూడా రాయల్‌గా ఉంటాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు తప్పదు. ఐఫోన్, తులం బంగారం కంటే కంటే ఎక్కువ పెట్టాల్సిందే. ఇంతకీ ఏంటబ్బా అంత స్పెషాలీటీ! రూబీ రోమన్ ద్రాక్ష అని పిలిచే ఈ ద్రాక్ష తక్కువ పుల్లగా, ఎక్కువ తీపిగా, జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది. అందుకే అంత పాపులర్. ఈ ద్రాక్ష కిలో ధర 11 వేల డాలర్లు. అంటే అక్షరాలా రూ.7.5 లక్షలు. షాకవ్వకండి..ఇది నిజం. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఖ్యాతి దక్కించుకుంది. రూబీ రోమన్ ద్రాక్ష జపాన్‌లో 2019లో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఫైల్ ఫోటో జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో రుబీ రోమన్ ద్రాక్ష పండ్లను పండిస్తారు. 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. జపనీస్ లగ్జరీ ఫ్రూట్ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్. ఈ ద్రాక్షనుమొదట మార్కెట్లో విక్రయించరు. వేలంలో అధిక ధర చెల్లించిన వారికి మాత్రమే సొంతం. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు క్యూ కడతారు. ప్రతీ ఏడాది రికార్డు ధరను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2019లో ఈ ద్రాక్షను కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్‌కు చెందిన హయాకురాకుసో అనే సంస్థ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. మొత్తం 24 ద్రాక్ష పండ్ల గుత్తిని 12 లక్షల యెన్లకు సొంతం చేసుకుంది. అంటే ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలన్న మాట. మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందని స్థానిక రైతులు చెప్పారు. అలాగే వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారనీ, వీఐపీ గెస్టులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కొన్ని విలాసవంతమైన హోటల్స్ కొనుగోలు చేస్తుంటాయని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లోని ఒక జంట జపనీస్ మియాజాకి మామిడి పండ్లను పండించి ఇటీవల వార్తల్లోకె క్కిన సంగతి తెలిసిందే.కిలోకు రూ.2.70 లక్షలతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డు కొట్టేసిన వీటి రక్షణకు నలుగురు భద్రతా సిబ్బందిని, ఆరుకుక్కలను ఏర్పాటు చేసుకోవడం విశేషంగా నిలిచింది. -
బంపర్ ఆఫర్: ఏడాదికి 38 లక్షల జీతం
లండన్: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్‌లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్ టెంప్టింగ్గా ఉంది.. పని ఎంత కష్టమో అనుకుంటున్నారా. అది మరీ సులభం. కేవలం బిస్కెట్లు టేస్ట్ చేసి.. ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ఇందుకు గాను ఏడాదికి అక్షరాల 38 లక్షల రూపాయల జీతం చెల్లించేందుకు సిద్ధం అంటూ ఓ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది కుప్పల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయట. కంపెనీ అడ్రెస్ ఇవ్వండి మేం కూడా అప్లై చేస్తాం అంటారా వెయిట్. ఇది మన దగ్గర కాదు. యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్ ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. అదే బిస్కెట్ రుచి చూసే పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు బిస్కెట్ రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లించనున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు 40 లక్షలుగా ఉండనుంది. అంటే నెలవారీగా 3 లక్షల రూపాయలకు పైగా జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగం కోసం, మీకు ప్రత్యేక ప్రతిభ ఉండాలి. (చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు) ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తారు, బిస్కెట్లపై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఇది మాత్రమే కాక, నాయకత్వ నైపుణ్యాలు, సమాచార మార్పిడిలో మంచి అవగాహన ఉండాలి. దాంతో పాటు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచడానికి కావాల్సిన సూచనలు ఇచ్చే వారికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. బేకరీ ఉత్పత్తులు, ప్రక్రియలతో శాస్త్రీయ, ఆచరణాత్మక అనుభవం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వంటి ఐటి నైపుణ్యాలు ఉండాలని తెలిపారు. వీటితో పాటు యూకే చట్టాలు, సాంకేతికత, పరిశ్రమ సంకేతాల గురించి తగిన అవగాహన ఉన్న వ్యక్తి అవసరం అని కంపెనీ తెలిపింది. సెలక్టయిన వ్యక్తికి సంవత్సరానికి 35 రోజుల సెలవు, బోనస్ పథకం, 1000 కి పైగా రిటైలర్లలో డిస్కౌంట్, ఉచిత ఆన్లైన్ వ్యాయామ కార్యక్రమాలు, ఉచిత బిస్కెట్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. -
ప్రగతి భవన్‌కు రండి
కెరమెరి (ఆసిఫాబాద్): ఏళ్ల తరబడి పడిన శ్రమకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఆపిల్ రుచిని చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో ఆపిల్ సాగు చేస్తున్న కేంద్రె బాలాజీకి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందింది. ప్రగతి భవన్‌కు వచ్చి తనను కలవాలని కోరారు. ఈ నెల 5న ‘ఇదిగో తెలంగాణ ఆపిల్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్లో ఉద్యానశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆపిల్ సాగు విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆపిల్ సాగు చేస్తున్న రైతును ఆహ్వానించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి నుంచి బాలాజీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆపిల్ పంట సాగు గురించి సీఎంకు వివరించాం.. మిమ్మల్ని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చి కలవమన్నారు’అని చెప్పారు. కాగా, ఈ నెలాఖరులో సీఎంను కలసి ఆపిల్ రుచి చూపిస్తానని బాలాజీ అంటున్నారు. ఆపిల్ పండ్లను చూపుతున్న రైతు బాలాజీ -
పచ్చడి పచ్చడి చేయండి
ఒక్కదాన్ని చితకబాది పచ్చడి చేస్తే... రుచిగా ఉంటుంది.రెండిటిని కలిపి బాది బాది పచ్చడి చేస్తే... రుచిరుచిగా ఉంటుంది...ఈ రకం కాంబినేషన్ పచ్చళ్లు ఆల్రెడీ కలిపి కొడుతున్నాం కాబట్టిదేనితో కలిపినా రుచిగానే ఉంటుంది.కాని వేడి వేడి అన్నంలోకి నేతితో కలిపి తింటే రుచి రెట్టింపవుతుంది.ఇంకెందుకు ఆలస్యం... మీకు నచ్చిన కాంబినేషన్లను పచ్చడి పచ్చడి చేయండి.వేడివేడిగా ముద్దలు ముద్దలు లాగించేయండి. గోంగూర–పండుమిర్చి కావలసినవి: గోంగూర – అర కేజీ; పండు మిర్చి – పావు కేజీ; చింత పండు – 50 గ్రా.; నువ్వుల నూనె – పావు కేజీ; ఉప్పు – తగినంత; మెంతులు – ఒక టేబుల్ స్పూను (వేయించి పొడి చేయాలి); ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 50 గ్రా.; ఇంగువ – రెండు టీ స్పూన్లు తయారీ: ►గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి ►పండు మిర్చిని శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి పొడి వస్త్రం మీద ఆరబెట్టాక, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర, చింత పండు వేసి కలపాలి ►బాగా వేగిన తరవాత దింపేసి, చల్లారనివ్వాలి ►మిక్సీలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, బయటకు తీసేయాలి ►చల్లారిన గోంగూర వేసి మెత్తగా చేయాలి ►మిక్సీ పట్టిన గోంగూర, పండు మిర్చి మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని బాగా కలపాలి ►మూడు రోజుల తరవాత, ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ►చల్లారాక పచ్చడిలో వేసి కలిపి, జాడీలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. పండుమిర్చి దొరక్కపోతే, పండుమిర్చి పచ్చడిలో కలుపుకోవచ్చు. కొబ్బరి–కొత్తిమీర కావలసినవి: కొబ్బరి ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; చింత పండు – కొద్దిగా; పోపు కోసం:ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; నూనె – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ►కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి ►కొత్తిమీర, చింత పండు, ఉప్పు జత చేసి, అన్ని పదార్థాలు బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి దింపేయాలి ►పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, వేయించి ఉంచుకున్న పోపును జత చేయాలి ►ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసెలలోకి రుచిగా ఉంటుంది. టొమాటో– బీరకాయ కావలసినవి: బీరకాయలు – అర కిలో; టొమాటోలు – 4 (పెద్దవి); నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 8; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; పోపు కోసం: ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఆవాలు + జీలకర్ర – ఒక టీ స్పూను; మినప్పప్పు + పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►బీరకాయలను శుభ్రంగా కడిగి, (చెక్కు తీయకుండా) ముక్కలు చేయాలి ►టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బీరకాయ ముక్కలు వేసి కలపాలి ►కొద్దిగా మగ్గి నీరు బయటకు వచ్చిన తరవాత టొమాటో ముక్కలు జత చేయాలి ►బాగా మగ్గిన తరవాత దింపి పక్కన పెట్టాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►మిక్సీలో ముందుగా ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేయాలి ►పోపు వేసి మరోమారు మిక్సీ పట్టి మెత్తగా అయ్యాక, బీరకాయ, టొమాటో ముక్కల మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►కొద్దిగా వేగిన తరవాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►చివరగా కరివేపాకు వేసి కలపాలి ►తయారైన పచ్చడి జత చేసి రెండు నిమిషాల పాటు బాగా కలియబెట్టి స్టౌ మీద నుంచి దింపేయాలి ►కొత్తిమీరతో అలంకరించి, వేడివేడి అన్నంలోకి వడ్డించాలి. వంకాయ–ఉల్లిపాయ కావలసినవి: వంకాయలు – పావు కేజీ; ఉల్లిపాయ – 1 (పెద్దది); చింతపండు – కొద్దిగా; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేసుకోవాలి ►ఉల్లిపాయలను కూడా ముక్కలు చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వంకాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి, మంట బాగా తగ్గించాలి ►ముక్కలు మెత్తబడ్డాక మంట ఆర్పేసి, ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►వేయించి ఉంచుకున్న పోపును కొద్దిగా పక్కన ఉంచుకుని, మిగతా పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►చల్లారిన వంకాయ, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►పక్కన ఉంచుకున్న పోపు, పసుపు జత చేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొబ్బరి – కందిపప్పు కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింతపండు – కొద్దిగా; ఎండు మిర్చి – 12; ఆవాలు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక కంది పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపేయాలి ►చల్లారిన కందిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►కొబ్బరి ముక్కలను జత చేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ పచ్చడి మెత్తగా వచ్చేవరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాక, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పచ్చడి పైన వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యి, అప్పడాలు, వడియాలు నంచుకుంటూ తింటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దోసకాయ – చింత కాయ కావలసినవి: దోసకాయలు – పావు కేజీ; చింత కాయలు – 50 గ్రా.; తరిగిన పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 10; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; తయారీ: ►దోసకాయ తొక్కు తీసి, సన్నగా ముక్కలు తరగాలి ►చింతకాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►జీల కర్ర, కరివేపాకు జత చేసి వేయించాలి ►మిక్సీలో వెల్లుల్లి రేకలు, చింతకాయలు, వేయించి ఉంచుకున్న పచ్చి మిర్చి మిశ్రమం వేసి, మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి ►కొన్ని దోసకాయ ముక్కలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని మిగిలిన దోసకాయ ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి తయారుచేసి ఉంచుకున్న పచ్చడి మీద వేసి కలపాలి ►వేడి వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. చింత కాయల బదులు చింతకాయ పచ్చడి కలుపుకో వచ్చు. క్యాబేజీ – ఉల్లిపాయ కావలసినవి: క్యాబేజీ – పావు కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; ఎండు మిర్చి – 2; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; చింత పండు – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►క్యాబేజీని సన్నగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక క్యాబేజీ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు, చింత పండు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మూత పెట్టి, కొద్దిసేపు మగ్గిన తరవాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, వరుసగా వేసి వేయించాలి ►మిక్సీలో క్యాబేజీ, ఉల్లి తరుగు మిశ్రమం వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►వేయించి ఉంచుకున్న పోపు జత చేయాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నేతితో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. నిమ్మకాయ – కాకరకాయ కావలసినవి: కాకరకాయలు – 4 (చక్రాలుగా తరగాలి); నిమ్మ కాయలు – 6 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – 10; నిమ్మ రసం – ఒక కప్పు; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 10; ఉప్పు – తగినంత; నూనె – 200 మి.లీ.; వేయించిన మెంతుల పొడి – అర టేబుల్ స్పూను. తయారీ: ►ఒక పాత్రలో కాకర కాయ చక్రాలు, నిమ్మ కాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి ►మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ►వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక వేడి నూనెను పచ్చడిలో వేసి కలిపి మూడు రోజుల పాటు ఉంచాలి ►మెంతి పొడి వేసి మరోమారు కలిపి మరో మూడు రోజుల తరవాత వాడుకోవాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. టొమాటో – పుదీనా కావలసినవి: టొమాటోలు – అర కిలో; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి వేడిచేయాలి ►జీలకర్ర వేసి వేయించాలి ►పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►పుదీనా తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, నూనె జత చేసి మరోమారు తిప్పాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసి, పచ్చడి మీద వేసి కలపాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. ముల్లంగి – పుదీనా కావలసినవి: ముల్లంగి తరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 5; చింతపండు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►చింతపండును పది నిమిషాల పాటు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►ముల్లంగి తురుము, పుదీనా అకులు జత చేసి ఐదారు నిమిషాల పాటు వాసన పోయేవరకు వేయించి, ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ►నానబెట్టిన చింతపండు, ముల్లంగి తురుము మిశ్రమం మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►ఇంగువ జత చేసి బాగా కలిపి దింపేయాలి ►ముల్లంగి పచ్చడి మీద వేసి కలియబెట్టాలి ►ఇడ్లీ, దోసె, పొంగల్, ఊతప్పం వంటి టిఫిన్లతో తింటే రుచిగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి కావలసినవి: తాజా కొత్తిమీర – 2 కప్పులు (శుభ్రపరిచి తరగాలి)పచ్చిమిర్చి – 4 (రెండుగా కట్ చేసుకోవాలి)చింతపండు పేస్ట్ – 1 టేబుల్స్పూన్ఉప్పు – రుచికి తగినంత తయారీ: కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అయితే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఈ పచ్చడి పెసరట్టుకు, ఇడ్లీ, దోశ, వడ... ఏ టిఫిన్‌లోకైనా మంచి కాంబినేషన్ అవుతుంది. మిరపకాయబజ్జీలను ఈ చట్నీలో అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్ రోల్స్‌ని కూడా ఈ చట్నీలో ముంచుకొని తినచ్చు. నోట్: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికీ, శ్వాసనాళాల్లో కఫం తొలగించడానికీ సహకరిస్తుంది. కొత్తిమీరను ఏదో ఒక రూపంలో తరచు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో భాగమే ఈ పచ్చడి. నువ్వులు–మామిడికాయ కావలసినవి: నువ్వులు– అర కప్పు; మామిడికాయ – 1 (మీడియం సైజుది); ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను, నూనె – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి ►మామిడికాయ తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►మిక్సీలో నువ్వులు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి, పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►వేయించుకున్న పోపు జత చేయాలి ►వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పల్లీ– దొండకాయ కావలసినవి: దొండకాయలు – పావు కేజీ; వేయించిన పల్లీలు – 50 గ్రా.; చింత పండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; పోపు కోసం... నూనె – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; బాదం పప్పులు – 5 (నీళ్లలో సుమారు రెండు గంటలు నానబెట్టాలి). తయారీ: ►దొండకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గిన తరవాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీల కర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పల్లీలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►దొండకాయ ముక్కలు, బాదం పప్పులు జత చేసి మెత్తగా అయ్యేవరకు తిప్పి, పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►పసుపు, కొత్తిమీర జత చేయాలి. -
పెరుగు మంగమ్మ
చాలా ఏళ్ళుగా మాకు వాడుకగా పెరుగు పోస్తోంది మంగమ్మ. మాములుగా మా పేట వేపు వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, ‘‘పెరుగు తీసుకుంటారా అమ్మా, మంచి పెరుగు తెచ్చాను’’ అనడం మేం అవసరమైతే తీసుకుని, ఆరోజు ధర ఎలా ఉందో తెలుసుకుని అప్పుడే డబ్బులు ఇచ్చేయడం, లేదా మర్నాడివ్వడం, ఇదీ మా వాడుక.వాళ్ళ ఊరు అవలూరు పక్కన ఏదో పల్లెటూరు. వస్తూ మా ఇంటి ముందు నుంచే రావాలి. వెళ్లేటప్పుడు మా ఇంటి మీదుగానే వెళ్ళాలి. వచ్చేటప్పుడొకసారి, వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి రావడం అలవాటు. మా లోగిట్లో కాసేపు కూర్చొని, మమ్మల్ని పలకరించి, తమలపాకులు, వక్క నోట్లో వేసుకుని, లేకపోతే మా దగ్గర పుచ్చుకొని తరువాత ఊరికి వెళ్ళేది. నేను కొంచెం తీరిగ్గా ఉంటే తన కష్టసుఖాల్ని చెప్పుకుని, నన్ను కూడా ఏమైనా చెప్పమంటుంటుంది.నాకేమున్నాయి కష్టాలు? దేవుడి దయవల్ల అంతా బాగానే ఉంది.సుమారు నెలాళ్ళ క్రితం మంగమ్మ పొద్దున్నే ‘‘పెరుగు తీసుకుంటారామ్మ?’’ అంటూ వచ్చినప్పుడు మా కుర్రాడు ‘‘ఇయ్యి పెరుగు’’ అంటూచెయ్యి జాపాడు.‘‘బంగారంలాంటి బిడ్డని కన్నావు. కానీ ఇయ్యన్నీ ఎన్నాళ్ళు? కుర్రోడు పెద్దోడయ్యే వరకే. అప్పుడెవతో వస్తుంది. ఇప్పుడు ‘అమ్మ! అమ్మ!’ అని కొంగట్టుకు తిరిగిన కొడుకు అప్పుడు అమ్మ ఉందో సచ్చిందో కూడా అడగడు’’ అంది మంగమ్మ.నేను ‘‘ఏమైంది మంగమ్మా? కొడుకు నువ్వు చెప్పిన మాట విన్లేదా?’’ అన్నాను.‘‘సర్లే తల్లీ, కట్టుకున్న మొగుడిన్లేదు, ఇక కొడుకేటి వినేది? అయ్యో, నాయమ్మ! నేనేనాడూ మంచి కోక్కట్టుకుని ఎరగను. మరెవతో కట్టుకుంది. కోక అందం చూసి అటెల్లాడు. నా ఇల్లు, నా ఆడది అనుంటే చాలు మగాడికి అనూరుకున్నాను. అమురుతం అన్నాను. మొగుణ్ణి పోగొట్టుకున్నాను. ఏదో నాకంతే రాసుంది. నువ్వు మటుకు మొగుడొచ్చే ఏలకు మంచికోక కట్టుకునుండు. మగాళ్ళ మనసు శానా చంచలం. ఇదుగో, ఇప్పుడు కట్టుకున్నావే, ఇలాంటి కోకలు పనీపాటు చేసేటప్పుడు కట్టుకోవాలి తల్లీ’’ నాక్కొద్దిగా నవ్వొచ్చింది. కాని ఆమె అనుభవంలోంచి వచ్చిన మాటల్లోని తెలివి గొప్పగా తోచింది. ఆ మాటల వెనకాల ఆమె స్వానుభవంలో కలిగిన నొప్పి తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. అది గ్రహించగానే నాకెంతో బాధ కలిగింది. ‘‘చూడు తల్లీ భర్తని సరిగ్గా వుంచుకోవాలంటే నాలుగు చిటకాలు. అప్పుడప్పుడు తింటానికి రుచిగా ఏమన్నా చేసి పెట్టడం, సక్కగా కళ్ళకింపుగా తయారై, కష్టనిష్ఠూరమో ఏదెలా ఉన్నా నవ్వుతూ పలకరించాలి.ఇంటిక్కావల్సినవన్నీ ఒక్కసారే తెప్పించుకొని, మళ్ళీ మళ్ళీ అడక్కుండా ఉండాలి. మూడు పైసలో, ఆరు పైసలో పోగేసి దాచి, అవసరమన్నప్పుడొక రూపాయి చేతిలో పెట్టాలి. ఆడదిట్టా సేస్తే మొగుడన్నోడు ఇంటికుక్కలా పడుంటాడు. లేదనుకో ఈదులెంట తిరుగుతాడు. నాకు మంగమ్మ మాటల చమత్కారం చూసి ఆశ్చర్యమేసింది. మరోరెండు మాటలాడి ఆ వేళటికి ఇంటికి పంపించేశాను.పదిహేను రోజుల క్రితం మంగమ్మ వచ్చినపుడదోలాగ ఉన్నట్టనిపించి ‘‘ఏ మంగమ్మా! అదోలా వున్నావేమిటి? కొడుకేమన్నా అన్నాడా?’’ అనడిగాను.‘‘అన్నాడమ్మా. వాడి పెళ్ళాం ఏ మెరగని పసివాణ్ణి, వాడేదో చేశాడని పట్టుక్కొట్టింది. ఏమే గయ్యాళీ, ఎందుకు రాక్షసిలా ఆ పసివాడిని బాదుతావు?’’ అని అడిగాను. నాకే ఎదురు తిరిగిందది. నోటికొచ్చినట్టంది. ‘‘ఇదేటే నీ మొగుణ్ణి కన్నదాన్ని నేను.నన్నే ఇంతలేసి మాటలంటావా? కానీయ్, ఆణ్ణే రానీ అడుగుతాను’’ అన్నాను. ఆ దొర ఇంటికొచ్చాడు. ‘‘చూడయ్యా, సంటోణ్ణూరికే బాత్తుంటే ‘ ఒద్దే’ అన్నానని నన్ను నానా తిట్లూ తిట్లింది. నీ పెళ్ళానికి కాస్త బుద్ధి చెప్పుకోరాదా’’ అన్నాను. కోడలొచ్చి ‘‘ఏటి నాకు బుద్ధి చెప్పేది? కుర్రోడల్లరి చేస్తే ఒద్దంటానికి నాకధికారం లేదా? నువ్వు నా మొగుణ్ణి కన్నట్టే, నేనూ ఈణ్ణి కనలేదా? నాకేటి బుద్ధి సెప్పేది?’’ అంది. ఎంతైనా అది ఆడి పెళ్ళాం కదా! ఆడన్నాడూ ‘ఔనే అమ్మా! కన్నబిడ్డనది కొట్టుకుంటుంది. నువ్వెందుకు దాని జోలికి పోతావు? నేను నీ కొడుకుని కదా, నన్నేమన్నా అను, చెల్లు’’ అన్నాడు. ‘‘నాకెవరయ్యా దిక్కు?’’ అన్నాను. ‘‘నీకేమిటమ్మా పాడి, డబ్బు ఉన్నాయి. నిన్ను నేను సాకక్కర్లేదుగా’’ అన్నాడు. ‘‘అంటే నన్ను వేరు పొమ్మంటావేటిరా?’’ అన్నాను. ‘‘నీ ఇష్టం. పోతానంటే వద్దనను. మీ ఇద్దరి గోల పడలేకుండా ఉన్నాను’’ అన్నాడు. ‘‘సరేనయ్యా, మద్దేనం నుంచి నేను వేరే పోతాలే. నువ్వు, నీ పెళ్ళాం సుకంగా ఉండండి అనేసి పెరుగు తీసుకుని సక్కా వచ్చాను తల్లీ’’ అంటూ మంగమ్మ ఏడ్చింది. నేను ఓదార్చాను. ‘‘సర్లే మంగమ్మా ఇవన్నీ ఉట్టి మాటలే. అంత సర్దుకుంటుంది’’ అని ధైర్యం చెప్పి పంపాను.మర్నాడు మంగమ్మొచ్చినప్పుడు నిన్నటంత దిగాలుగా లేదు. కాని ఎప్పటిలా చురుగ్గానూ లేదు. ‘‘గొడవలన్నీ సర్దుకున్నాయా మంగమ్మా?’’ అనడిగాను. ‘‘సర్దుకోడానికిడుస్తుందా అది. నిన్న నేను పెరుగమ్మి ఇంటికివెళ్లేసరికి, నా కుండలవీ వారగా ఉంచింది. ఓ దాంట్లో బియ్యం, మరోదాంట్లో రాగులు, ఉప్పు, మిరకాయలు అన్నీను.తను, తన మొగుడూ అన్నం తిన్నామన్నట్లుగా కాళ్ళు జాపుక్కూర్చుంది. ఇంకేముంది తల్లీ సర్దుకునేది. నేనూ ఒకింత ముద్ద (సంగటి) కెలుక్కుని తిన్నాను. నేనేదో అన్నాననుకో. అదే చాలన్నట్టు ఊరుకున్నారు వాళ్ళు. రోజూ ఆ పిల్లాడికింత పెరుగు పెట్టిగాని అమ్మకానికొచ్చేదాన్ని కాదు. పోద్దున్నే ఆ వేళకి ఆడ్నెక్కడికో తీసికెళ్ళిపోయింది. ఆ పిల్లాణ్ణి నాకు దూరం చెయ్యాలనే అలా చేసింది’’ అంది. ఒక చిన్నమాట ఎంత దూరం పోయింది అని ఆశ్చర్యమేసింది నాకు. తరువాత ఒకట్రెండు రోజులు ఆ మాట ఎత్తలేదు. మంగమ్మ వేరుగా ఉంటున్నట్లుగా అనిపించింది. తరువాతొకరోజు మంగమ్మ, ‘‘నువ్వేసుకుంటావే, ఆ మకమల్ జాకెట్టు బట్ట గజమెంత?’’ అనడిగింది.‘‘ఎందుకు మంగమ్మా’’ అన్నాను. ‘‘ఇన్ని రోజులు కొడుక్కి, మనవడికి అనుకుంటూ పైసా పైసా కూడ బెట్టాను. ఇంకెందుకు? నేను మకమల్ జాకెట్టు కుట్టించుకుని తొడుక్కు తిరుగుతాను’’ అంది.‘‘జాకెట్టుకు ఏడెనిమిది రూపాయలవుతుంది మంగమ్మా’’ అన్నాను. ఆ వేళే దర్జీ కొట్లో మంగమ్మ మకమల్ బట్ట బేరం చెయ్యనూ చేసింది, కుట్టడానికియ్యనూ ఇచ్చింది. మర్నాడు ఊరికెళుతూ దాన్ని తొడుక్కుని వచ్చింది. ‘‘చూశావా అమ్మయ్యా...నా సింగారం. మావోడొచ్చినప్పుడు కూడా మంచి కోక కట్టలేదు నేను. వాడెవతెనో వెంట పోయాడు. కన్న కొడుకు కోసం పైసా పైసా కూడబెట్టి దాస్తే దాని కథ ఇట్టాగయింది. చూడు నా సింగారం’’ అంది. కొడుకుని దూరం చేసుకున్న దుఃఖంలో మంగమ్మకు కొంచెం మతిచలించిందేమో అనిపించింది నాకు. కాని ఆ జాకెట్ వల్ల ఆమెకి మిగతా వాళ్ళతో గొడవొచ్చింది. వాళ్ళ ఊళ్ళో కుర్రాడొకడు బెంగుళూర్లో చదువుకుంటున్నాడట. అతను టై, కాలర్ వేసుకునే నాజుకు మనిషి. అతను మంగమ్మనిచూసి ‘‘ఏంటవ్వోయ్ ఏకంగా మఖమల్ జాకెట్టు తొడిగేసావ్?’’ అన్నాట్ట. ‘‘నువ్వు గొంతుక్కి ఊరిపోసుకోగా లేంది నేను జాకెట్టు తొడుక్కుంటేనేం?’’ అందంట. మాటా మాటా పెరిగింది. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు.బయటవాళ్ళ సంగతలా ఉంచి, మంగమ్మ కోడలే, ‘‘కోడలికో రవిక కుట్టించలేక అత్త వేరు పోయి, మఖమల్ జాకెట్టు తొడిగింది చూడండి’’ అందట పొరుగు వాళ్ళతో మంగమ్మకి వినబడేలా.మంగమ్మ కోడలికి పెళ్ళిలో కమ్మలు, కడియాలు, నాగర, కంటి, ఒడ్డాణం అన్నీ పెట్టింది.తరువాత ఏడాదికొకటి చొప్పున ఏదో ఒక నగ కొంటూనే ఉంది. అవన్నీ గుర్తులేవా కోడలికి? మంగమ్మ రెండుమూడుసార్లు ఊరుకొని ఆఖరికి ఓ రాత్రివేళ కొడుకుతో ‘‘నీ పెళ్ళాం నన్నేదేదో అంటోంది. నేను దానికేమీకొనివ్వలేదా?’’ అందట. కోడలు మొగుణ్ణి మాట్లాడనియ్యకుండా ‘‘మొగుడు లేని ముసల్దానివి నువ్వు. ఇప్పుడు కమ్మలు, ఒడ్డాణం కావల్సొచ్చాయా? తీసుకుపో, ఏస్కో’’ అంది. ఆ మొగుడు, ‘‘ఎందుకే అన్ని మాటలు!’’ అని పెళ్ళాంతో అని, తల్లితో ‘‘అమ్మా! మీ ఇద్దరి తగూల సంగతి నాకెందుకుగానీ, నీ నగలు నీక్కావాలంటే పట్టుకుపో’’ అన్నాడట. మంగమ్మ ‘‘ఇరుగు పొరుగుతో అలాంటి మాటలెందుకే’’ అని పెళ్ళానికి చెప్పుకోలేడుగానీ, కావాలంటే నగలు తీసుకుపో అని నా మీదే తప్పు మోపాడు’’ అని వాపోయింది. అదంతా విని చాలా బాధపడ్డాను. ఈమె చూస్తే ముసల్ది. అతనా ఒక్కడే కొడుకు. ఆ మనిషి మొగుణ్ణి, మొగుడి తల్లిని కాస్త బాగా చూసుకోకూడదూ. ఇంతకీ ముసల్ది మనవణ్ణి కొట్టొద్దన్నందుకు ఇంత గొడవా? ఎందుకిలా చేస్తారో కదా అనిపించింది. అవును, ఎక్కడచూసినా దెబ్బలాటలకి కారణాలిలాగే ఉంటాయి. ఒకరికి ఒకరంటే పడకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలవుతాయి’’ అనిపించింది.ఇది జరిగిన కొన్నాళ్ళకి మంగమ్మ నాతో, ‘‘అమ్మా మీరు సత్యవంతులు. నాది కొంచెం డబ్బుంది. దాన్ని ఎక్కడైనా బ్యాంకి అంటారు కదా అలాంటి చోట దాచిపెట్టగలరా? దానికి మీ సాయం కావాలి. ఆ డబ్బు మీద వాళ్ళు, వీళ్ళు కన్నేస్తున్నారు...’’ అంది. ఏం జరిగిందని అడిగాను. నిన్నేం జరిగిందంటే. మా ఊళ్ళో రంగప్పని ఒకడున్నాడు. జూదగాడు, సోకులెక్కువ. నేను పెరుగు తీసుకొస్తుంటే తోవలో ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడు. ‘‘ఏటి మంగమ్మా బాగుండావా?’’ అన్నాడు. ‘‘ఏం బాగులే రంగప్పా, నీకు తెలీందేముంది?’’ అన్నాను. ఆడన్నాడు, ‘‘ఇప్పుడు బాగు సంగతెవడిక్కావాల? ఈ కాలం కుర్రోళ్ళు నీ లెక్కేట్టన్నట్టు మాట్టాడతారు. మాలాంటి వయసు మళ్ళినోళ్ళు ‘అయ్యో ఇలా జరిగిందేటి?’’ అనుకుంటామంతే. ఇంకేటి సేస్తాంలే’’ అన్నాడు. అట్టాగే నడుసుకుంటూ వచ్చాం. దార్లో తోపు, నుయ్యి ఉన్నాయి. అక్కడికొచ్చేసరికి ఆడేటి చేస్తాడోనని భయమేసింది. ఈ సంచిలో డబ్బుందిలే. అందుకే ఆడు కొంచెం సున్నవుంటే ఇస్తావా?’’ అన్నాడు. ఇచ్చాను. తీసుకుపోయాడు. ఈరోజు వస్తుంటే ఆ తావులోనే మళ్ళీ కలిశాడు. ఆమాట, ఈమాట చెప్ని, ‘‘మంగమ్మా! కాస్త డబ్బుతో పనిబడింది. అప్పిస్తావా? ఈసారి రాగులమ్మగానే తీర్చేస్తాను’’ అన్నాడు. ‘‘నా దగ్గర యాడుంది?’’ అన్నాను. ‘‘సర్లే మంగమ్మా, నాకు తెల్దా డబ్బు ఆడా, ఈడా పూడ్చి పెడితే ఏటొస్తాది? నాకు అప్పిస్తావా, నన్ను సమయానికి ఆదుకున్నదానివవుతావు. నీకు వడ్డీ వస్తది’’ అన్నాడు. కాసేపాగి, ‘‘నువ్వు కొడుకు కలిసున్నట్టయితే నేనడిగేవాణ్ణే కాదు. ఏదో కోడలికి నగా–నట్రా చేయించుకునేదానివి. ఇప్పుడు అట్టాటిదేవీ లేదు కదా! అందుకే అడిగా’’ అన్నాడు. చూడమ్మయ్యా, ఆడదొంటిగా ఉంటే జనం కళ్ళెట్టా పడతాయ్యో’’ అంది. మా వాళ్లను అడిగి చెబుతాను’’ అన్నాను. నేనింకా వారికి ఈ సంగతింకా చెప్పనేలేదు’’ అంది. మర్నాడు మంగమ్మ పెరుగుపోసి, రొంటిన ఉన్న సంచీ తీసింది. ‘‘లోపలికి పదండి లెక్కెట్టుకుందురుగాని’’ అంది. ‘‘నేనింకా ఆయనకి చెప్పలేదు, ఇంకో రోజు ఇద్దువుగానిలే’’ అన్నాను. మంగమ్మ, ‘‘నాకు శానా బయంగా ఉందమ్మయ్యా. రంగప్ప ఇయాల కూడా వచ్చాడు. తోపు దగ్గర, ‘‘కూచో మంగమ్మ, తొందరేటి? ఎల్దువుగాన్లే’’ అన్నాడు. మంచి ఒయసులో ఉన్నప్పుడే కట్టుకున్నోడే పట్టుకున్న సెయ్యొదిలేశాడు. మరోడు ముట్టలేదు దాన్ని. ఇయాల ఈడట్టుకున్నాడు. ఇడిపింసుకుని, ‘ఏటి రంగప్పా, సరసం ముదిరిందే. నా అందసందం ఊసెత్తడానికి నువ్వేమన్నా, నా కట్టుకున్న మొగుడివా? ఇడిసిసెట్టు’’ అని ఇదిలించుకుని వచ్చేసినా.ఇదేమిటి, ఈమె కథ ఏదో ప్రమాదానికి దారి తీసెటట్టుందే అనిపించింది.‘‘ఇదంతా ఎందుకొచ్చిన గొడవగాని మంగమ్మా అయిందేదో అయిందిగాని, వెళ్ళి కొడుకుదగ్గర ఉండరాదా?’’ అన్నాను. ‘‘నేనుంటానంటే ఏంలాబంలే అమ్మాయ్యా, ఆడుండ నియ్యొద్దూ’’ ‘‘కొడుకుతో చెప్పు ఇదంతా’’ ‘‘అయ్యో నా తల్లి, రచ్చకీడ్చి వెలివేయిస్తుంది నా కోడలు. నాకు పొద్దుపోతుంది. నేనెన్ళొస్తా. అయ్యగార్నడిగి రేపు చెప్పు’’ అంటూ వెళ్ళిపోయింది మంగమ్మ.మళ్ళీ ఒంటిగంటకొచ్చింది ‘‘అమ్మయ్యా, ఇవాళొక పనయింది. పిల్లాడికుంటుందిలే అని కాస్త మిఠాయి కొని తట్టలో పెట్టుకున్నా’’ అంది. ‘‘ఏ పిల్లాడు?’’ అని అడిగాను. ‘‘మా పిల్లాడికే...నా దగ్గరికి వెళ్ళొద్దని ఆళ్ళమ్మ సెబుతుందిగాని, ఆడుండ గలడా. ఆళ్లు సూడకుండా ఎప్పుడో వచ్చి కాసిన్ని పాలు తాగుతాడు. కూసింత పెరుగు బిళ్ళ పెట్టమంటాడు. ఏదైనా ఇస్తే గంతులేస్తాడు. ఆడి కోసమని మిఠాయి తట్టలో ఎట్టుకుంటే ఈ సంకరపురంలో వచ్చేటప్పుడు కాకి తన్నుకు పోయింది. ఇట్టా జరిగిందెందుకు?’’ అంది. ‘‘ఏమైందిలే, ఓ పొట్లం కాకెత్తుకుపోతే మరోటి కొనుక్కెళ్తే పోలా?’’ అన్నా. ‘‘కాకి మనుషుల్ని ముట్టకూడదంటారు కదా!’’ అంది. ‘‘ముట్టుకుంటే ఏమంటా?’’ అన్నాను. ‘‘పానానికి ముప్పు అంటారు. నాకు కొనకాలం వచ్చిందేమోనని బయం వేసింది ముందు. మళ్ళీ అనుకున్నా, ఇదీ మంచిదే ఎవురికీ పనికిరాని జల్మమెందుకని’’ అంది. ‘‘ఏంమాటలవి? ఏంఫరవాలేదుగాని, ఇంటికెళ్ళిరా’’ అన్నాను. ‘‘అయితే బయం లేదంటావా అమ్మాయ్యా?’’ ‘‘భయం లేదు, గియం లేదు. ఆపదలొచ్చిన కొద్దీ ఆయుస్సు ఎక్కువంటారు. ఆలోచించకుండా హాయిగా ఇంటికెళ్ళు’’మంగమ్మ వెళ్ళిపోయింది. కొడుకు కావాలి, కోడలు కావాలి, మనవడు కావాలి. కాని తన పెద్దరికాన్ని అంతా గౌరవించాలి. మనిషన్నవాడికి ఈ చాపల్యం తప్పనిది. అది లేకపోతే బ్రతుకులో ఏదో బాధ. అయినా చావడానికి ఇష్టం లేదు. మంగమ్మ ఈసారి మరొక సంగతి చెప్పింది. ఆ మనవడు అమ్మని, నాన్నని వదిలి ఈవిడ దగ్గరికే వచ్చేశాడట. ‘‘నిన్న మద్దేన్నం నా కాడికి వచ్చినోడు మళ్లీ అమ్మ దగ్గర కెళ్ళనని మొరాయించాడు. ఇన్నాళ్ళు దొంగచాటుగా వచ్చేవోడు, ఎప్పుడైతే ఇట్టా చేశాడో ఆళ్ళమ్మొచ్చి నానా గోలా చేసింది. ఉహు...ఎల్లనే లేదు. నాకాడే ఉండిపోయాడు తెలుసా తల్లి. పసిపిల్లాడైనా ఈడుతోడుగా ఉంటే ఎంత దయిర్యంగా ఉందో నాకు. ఎంతైనా మగనలుసు కదా!ఒకే ఇంట్లో ఉంటుంటే నా కోడలు ఎంత అందగత్తో నాకు తెలవనే లేదు. ఇప్పుడు దూరం నించి సూత్తానా...మొకం ముడుసుకుంటే ఏదో లాగుంటుందిగానీ, లేకపోతే మంచి అందగత్తెల్లోకే లెక్క. ఆడినీ అంతే, పొలానికెప్పుడొస్తాడో సూసేదాన్ని కాదు. ఇప్పుడు గుమ్మం కాడ కూసుని ఇంకా రాలేదేటి అనో, ఇంత తొరగా ఎల్తున్నాడేటనో సూస్తాను కదా. దానికి అంతే కదా. ఇప్పుడు కొడితే, ఆడు రేపు నాతో బాటు ఇటొచ్చేస్తే ఏటి సేస్తాది? కొడుకునిడిసి పెట్టుకుంటాదా?’’ ‘‘ఈమె ఊహలు ఎంత దూరం పోతున్నాయి కదా’’ అని ఆశ్చర్యం వేసింది నాకు. ఈలోపలే వీళ్ళ మధ్య పొరపొచ్చాలు తొలగిపోయే సూచనలు కనబడుతున్నట్టుగా తోచింది నాకు. అలాగే జరిగింది కూడా. రెండు రోజులాగి తల్లి దగ్గర కెళ్ళిన కుర్రాడు మర్నాడు నాన్నమ్మతో బెంగుళూరొస్తానని పేచీ పెట్టాడు. మంగమ్మకి ఏం చెయ్యాలో తోచలేదు.కొడుకు–కోడలు వచ్చి ‘‘ఏదో మా వల్ల తప్పయిందనుకో, నువ్వు కోపం చేసుకుంటే ఎట్టాగమ్మా?’’ అన్నారు. తన బింకం సడలకుండా మంగమ్మ ఇష్టంగానే కోడలితో కలిసిపోయింది. కాని ఈ మనవడు నానమ్మతో ఉండాలని పట్టుబట్టాడు. దాని వల్ల కొత్త ఏర్పాటే చేసుకున్నారు. ‘‘ఏటి ఎండలో పోడం, రాడం! పెద్దతనం వచ్చాక ఎన్నాళ్ళీ చాకిరీ. ఇంత ముద్ద కెలికి చారుపెట్టి ఇంట్లో ఉండు. నేనెళ్ళి పెరుగమ్ముతాను’’ అంది కోడలు. మంగమ్మ ఒప్పుకుంది. ఓరోజు అత్తాకోడళ్ళిద్దరూ వచ్చారు. ఒకరి చంకలో పిల్లాడు, మరొకరి నెత్తి మీద పెరుగుతట్ట.‘‘ఇదిగో నమ్మయ్యా నా కోడలు. పాపం ముసల్ది, తనే ఉడుకేసుకొని అవస్థ పడుతుందని, మళ్ళీ నన్నింట్లో చేర్చుకుంది. ఉట్టినే ఎండలో పడి తిరగద్దని అంది. ఇక నుంచదే తెస్తుంది పెరుగు. పోయించు కోండమ్మయ్యా’’ అని చెప్పి కోడలికి మా ఇల్లు అప్పజెప్పింది. ఈమధ్య ఆ కోడలే పెరుగుపోస్తోంది.అత్త వేపు నుంచి మాటలు జరిగాయి కదా, ఇక కోడలేమంటుందో విందామనిపించి ఓ రోజు.‘‘సంజమ్మా...అత్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టచ్చా?’’ అని అడిగాను. దానికి సంజమ్మ అందికదా– ‘‘అత్తనెల్లగొట్టడానికి నేనేటి రాచ్చసినా అమ్మగారూ, అత్త అన్న మనిషి అన్నింటికీ నేనే పెద్దనంటూ తయారైతే, ఇక ఆడు మొగుడేటీ, నేను పెళ్ళానేటి, మేం సంసారం చేసేదేటి? నా మొగుణ్ణి కావాలంటే తనకి సొంతం అని అట్టే పెట్టుకోనీ. కాని నా కొడుకుని నేనుకొట్టకూడదని రూలు పెడితే ఇదెక్కడి కోడంట్రికం అమ్మగారు?’’ అంది.‘కొడితేనే కొడుకు నీ సొంతమని లెక్కా?’’ అని అడిగాను.‘‘నా కొడుకంటే, నా కొడుకే. నా మొగుడంటే నా మొగుడే. కోడలంటూ వచ్చాక, అత్త ఒక మాటంటే అనచ్చు. ఇది లేకుండా ఎవరి సంసారం మాత్రముంటుంది?’’ నాకు మంగమ్మ చెప్పినప్పుడు తను చెప్పింది ‘సరి’ అనిపించినట్టుగానే, కోడలు చెబుతుంటే కోడలిదీ సరిగ్గాఉన్నట్టుగానే అనిపించింది. ‘‘అయితే ఇప్పుడు నీకు ఇంట్లో కొంత స్వతంత్రం వచ్చినట్టేనా?’’ అనడిగాను. ‘‘ఇప్పుడు మొదటి కన్నా నయం తల్లీ. ఎట్టాగో సద్దుకుపోవాలి. గొడవ పడితే మాకే నష్టం. మాఅత్త డబ్బు మీద కన్నేసి ఉన్నారెంతోమంది. కాజేసినా చెయ్యొచ్చు. రంగప్ప అని ఒకడున్నాడు. ఆడు మా అత్త వేరు కాపురం పెట్టినప్పుడు అప్పడిగాడట. ఈమె ఇస్తానందట. ఆడొచ్చి ఆ మాట చెప్నాడు. మా కుర్రాణ్ణి పిలిచి, ‘‘ఒరేయ్ నానమ్మ దగ్గరకెళ్ళి అడుగు, మిఠాయి పెడుతుంది. మళ్లీ పిల్చేదాకా రామాకు’’ అని కట్టడి చేశా. గొడవలెలాగైనా సర్దుకుంటే చాలని అట్టా చేశానమ్మా. కాని అమ్మగారూ, ఇయ్యన్నీ పైకి చెప్పుకోగలమా? మగవాళ్ల కివన్నీ ఏం తెలుస్తాయి?’’ అంది. మంగమ్మ కంటే సంజమ్మ తెలివితేటల్లో తక్కువదేం కాదు. అతడిని తన పట్టు నుంచి వదులుకోకూడదని తల్లి మనోవాంఛ, అతడిని గుప్పిట బంధించాలని ఈ కోడలి పట్టుదల. ఇదీ ప్రతిచోట జరిగే భాగోతమే. ఇందులో గెలుపు–ఓటమి, ఈవిధంగా ఉంటాయని చెప్పడానికి లేదు. పల్లెలో అయితే పెరుగు మంగమ్మ ఇంట్లో, పట్నంలో అయితే పెరుగుకొనే తంగమ్మ ఇంట్లో ఈ నాటకం జరుగుతూనే ఉంటుంది. ఆఖరి అంకం ఊహించలేని నాటకం. కన్నడ మూలం : డా.మాస్తి వెంకటేశ అయ్యంగార్ - అనువాదం: శర్వాణి -
సాంబారు రుచిగా రావాలంటే ...
సాంబారు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తమిళనాడు సాంబారు. వాళ్లకి సాంబారు లేనిదే వంట లేదు. అసలు సాంబారును ఇష్టపడని వారే ఉండరు. సాంబారును చాలా రకాలుగా చేస్తారు. సాంబారులో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కావలసినవి: కంది పప్పు – ఒక కప్పు; చింత పండు – 10 గ్రా. (నీళ్లలో నానబెట్టి రసం తీయాలి); టొమాటో తరుగు – అర కప్పు; బెండ కాయ ముక్కలు – అర కప్పు; వంకాయ ముక్కలు – పావు కప్పు; సొరకాయ ముక్కలు పెద్ద సైజువి – ఆరు; మునగ కాడ ముక్కలు – 4 ; ఉల్లి తరుగు – అర కప్పు; మిరప కారం – కొద్దిగా; పసుపు – చిటికెడు; బెల్లం పొడి – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – నాలుగు (నిలువుగా కట్ చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత సాంబారు పొడికి కావలసిన పదార్థాలు: ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెగన పప్పు, మినప్పప్పు – 6 టీ స్పూన్లు చొప్పున; ఆవాలు, జీలకర్ర – ఒక టీ స్పూను చొప్పున; ఎండు మిర్చి – 6; ఇంగువ – చిటికెడు తయారీ: కందిపప్పుని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి కుకర్‌లో ఉడికించాలి. మరొక గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టాలి.ముక్కలు మెత్తగా ఉడికిన తరవాత, ఉడకబెట్టిన కందిపప్పును మెత్తగా మెదిపి ముక్కలలో వేయాలి. చిక్కగా తీసిన చింతపండు రసం, మిరప కారం, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క వేసి, మరిగించాలి. వేరొక పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె లేకుండా ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని సాంబారులో వేసి బాగా కలిపి మరిగించాలి. వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక, చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. పోపు దినుసులు వేసి వేయించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించాక, రెండు గరిటెల మరుగుతున్న సాంబారును పోపులో పోసి, బాగా కలిపి మూత పెట్టి మరిగించాలి. ఆ తరవాత సాంబారు గిన్నెలో పోసి కలపాలి. కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. – ఎన్. కల్యాణ్ సిద్ధార్థ్ -
ఫార్... ఇన్ కిచెన్
వియత్నాం వంటలోసారిప్రయత్నించి చూస్తారా? థాయ్ వంటకాలకు హాయ్ చెప్పాలని ఉందా? ఇవన్నీ మనవి. అంటే మన ఆసియా ఖండానివి. మరి పొరుగింటి పుల్లకూర రుచి కదా! అందుకే...యూరప్ ఖండపు పొరుగు ఖాద్యాలనూ చూద్దాం. టేస్టీ టేస్టీ ఫ్రెంచు... బోల్డంత నోరూరించు అంటూ... ఇటాలియన్ డిషెస్‌తో నాల్కను మిటకరిస్తూ... లాలాజల వర్షంతో నోరు చిరపుంజీ కాగా దేశదేశాల వంటల్ని మన ఇంట తయారు చేసుకుని... ఆవురావురుమంటూ తిందాం... బ్రేవు బ్రేవుమందాం. సెసేమ్కోటెడ్ స్వీట్ స్టఫ్డ్ పాన్ కేక్స్ (ఫ్రెంచ్) ఫ్రెంచ్ క్విజైన్ డెజర్ట్స్కి బాగా ప్రసిద్ధి. మనం కూడా ఈ రోజు ఇంటి దగ్గరే ఒక డెజర్ట్ తయారుచేసి ఫ్రెంచ్ రుచిని ఇంటి దగ్గరే ఆస్వాదించుదాం. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – కొద్దిగా; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్ – కొద్దిగా; పాలు – అర కప్పు; బటర్ – తగినంత; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; తేనె – కొద్దిగా; ఎల్లో బటర్ – కొద్దిగా; వేయించిన నువ్వులు – 25 గ్రా. స్టఫింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – తగినన్ని (కిస్మిస్, జీడి పప్పు); ఎండు ఖర్జూరాలు – ఆరు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఎల్లో బటర్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒక టే బుల్ స్పూను తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపాక, పిండి మధ్యలో గుంటలాగ చేసి పాలు, గిలకొట్టిన కోడి గుడ్డు, కరిగించిన బటర్ వేసి బాగా కలిపి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక బటర్ వేసి కరిగించాలి ∙కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి, ఎండు ఖర్జూరాలు, పంచదార వేసి బాగా కలపాలి ∙మిశ్రమాన్ని తడిపోయేవరకు కలుపుతూ ఉడికించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి కరిగించాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి కొద్దిగా తీసుకుని, పాన్ మీద దోసె మాదిరిగా వేసి రెండు వైపులా కాల్చాలి ∙బాగా కాలిన తరవాత స్టఫింగ్ మిశ్రమాన్ని దోసె మధ్యలో ఉంచి కర్రతో జాగ్రత్తగా ఒత్తి, మరోమారు కాల్చాలి ∙తయారయిన పాన్ కేక్‌లను కట్ చేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, పంచదార పొడి, తేనెలతో అలంకరించి, చివరగా నువ్వులతో గార్నిష్ చేసి అందించాలి. పాడ్ థాయి నూడుల్స్ ఎట్ హోమ్ థాయి క్విజీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటగా పాడ్ థాయి నూడుల్స్‌ను తలచుకుంటారు. ఈ వంటకాన్ని సులువుగా తయారు చేసుకుందామా. కావలసినవి: నూడుల్స్ – అర కేజీ; ఉల్లి కాడలు – ఒక కట్ట; పుట్ట గొడుగులు / బేబీ కార్న్ – 100 గ్రా. ; వేయించిన పల్లీలు – 100 గ్రా.; పల్లీ నూనె – 100 మి.లీ.; చిక్కుడు గింజలు – కొద్దిగా; వెల్లుల్లి తరుగు – కొద్దిగా; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పంచదార – టీ స్పూను; సోయా సాస్ – టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; మిరప కారం – అర టీ స్పూను; అజినమోటో – చిటికెడు తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙నీళ్లు మరుగుతుండగా నూడుల్స్ వేసి ఉడికించి దింపేయాలి ∙నీరు ఒంపేసి, నూడుల్స్‌ను ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ∙ఇవి చల్లారేలోగా పచ్చి మిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, బేబీ కార్న్, పుట్ట గొడుగులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాక, పచ్చికొబ్బరి తురుము మిశ్రమం ముద్దను వేసి మరోమారు బాగా వేయించి, ఉడికించాలి ∙ఉడికించిన నూడుల్స్‌ను జత చేసి మిశ్రమం అంతా నూడుల్స్‌కు పట్టేవరకు కలపాలి ∙ఉప్పు, ఎండు మిర్చి, మిరియాల పొడి, పంచదార, అజినమోటో, సోయా సాస్, ఉల్లి కాడల తరుగు, చిక్కుడు గింజలు, నిమ్మ రసం జత చేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. ఇండియన్ హోమ్ మేడ్ పిజ్జా (ఇటాలియన్ ఫ్యూజన్) పిల్లలు ఈ రోజుల్లో సాయంత్రం స్నాక్స్‌లా తినడానికి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు. ముందుగా మనం ఇటాలియన్ పిజ్జా తయారీ చూద్దాం. ఇంటి దగ్గరే ఈ పిజ్జాలను తయారుచేసుకోవచ్చు. కావలసినవి... బేస్ కోసం: మైదా పిండి – రెండున్నర కప్పులు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; డ్రై ఈస్ట్ – అర టీ స్పూను; రిఫైన్డ్ ఆయిల్ లేదా ఎల్లో బటర్ – ఒక టీ స్పూను; గోరువెచ్చని నీళ్లు – ఒక కప్పు; మైదా పిండి∙– 3 టే బుల్ స్పూన్లు (అద్దడానికి) టాపింగ్ కోసం: మోజరిల్లా చీజ్ – 150 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు (సన్నగా తరగాలి); కొత్తిమీర – అర కప్పు వెజ్ టాపింగ్స్: సన్నగా తరిగిన పుట్ట గొడుగులు – ఒక కప్పు; బేబీ కార్న్ / ఉడికించిన కూరలు / వేయించిన పనీర్ (వీటిలో ఏదో ఒకటి); నాన్ వెజ్ టాపింగ్స్; బోన్ లెస్ చికెన్ (బ్రాయిల్డ్ లేదా గ్రిల్డ్, ఏదైనా నాన్ వెజ్) సాస్ కోసం: టొమాటో తరుగు – 2 కప్పులు (తొక్క తీసేయాలి); ఆలివ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; పంచదార – కొద్దిగా; నల్ల మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); టొమాటో కెచప్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు –50 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; కార్న్ ఫ్లోర్ – కొద్దిగా (పావు కప్పు నీళ్లలో కలిపితే కార్న్ స్టార్చ్ తయారవుతుంది) సాస్ తయారీ: స్టౌ వెలిగించి, మంటను మీడియంలో ఉంచి, బాణలి పెట్టాలి. ఉల్లి తరుగు జత చేసి వేయించాలి. వెల్లుల్లి తరుగు, నల్ల మిరియాల పొడి, ఎండు మిర్చి ముక్కలు వేసి బాగా వేయించాక టొమాటో తరుగు, ఉప్పు, పం^è దార వేసి కలపాలి. టొమాటోలు మెత్తగా ఉడికి, నీరంతా పోయేవరకు కలుపుతుండాలి. టొమాటో కెచప్, కార్న్ స్టార్చ్ జత చేసి బాగా కలపాలి. మంట బాగా తగ్గించి, మిశ్రమం మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. (టొమాటలో మరీ పుల్లగా అనిపిస్తే మరి కాస్త పంచదార జత చేస్తే సరి). బేస్ తయారీ: ∙ఒక చిన్న పాత్రలో గోరువెచ్చని నీటికి ఈస్ట్ జత చేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙వేరొక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙‘పిజ్జా మృదువుగా రావాలంటే పిండిని చాలాసేపు చే తితో బాగా అదమాలి) ∙ఈ మిశ్రమానికి ఈస్ట్ నీటిని జత చేసి మరోమారు కలపాలి ∙పిండిని కలుపుతూ మధ్యమధ్యలో ఆగుతూ సుమారు ఐదు నిమిషాల పాటు పిండిని కలపాలి ∙పిండి∙మెత్తగా ఉండాలే కాని, చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ∙చేతికి అంటుతుంటే కొద్దిగా మైదా పిండి జత చేయాలి ∙పిండి బాగా కలిపిన తరవాత ఒక టేబుల్ స్పూను నూనె జత చేసి, పిండి సాగేలా అయ్యేవరకు కలపాలి ∙పెద్ద పాత్రకు నూనె పూయాలి ∙మైదా పిండికి కూడా మరి కాస్త నూనె పూసి, పాత్రలో ఉంచి వస్త్రంతో మూసేసి, సుమారు రెండు గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండి రెట్టింపు పరిమాణంలోకి అయ్యాక, పిండిని బయటకు తీసి కొద్దిగా పొడి పిండి జత చేసి మళ్లీ చేతితో బాగా కలిపి, పిండిని రెండు సమాన భాగాలుగా చేసి, సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచేయాలి. నాన్ స్టిక్ పాన్ మీద బేస్ తయారుచేసుకోవాలి: ∙పిండిని చపాతీ కర్రతో ఒత్తి, గుండ్రంగా కట్ చేసుకోవాలి ∙గుండ్రంగా అక్కర్లేని వారు వారికి కావలసిన ఆకారంలో కట్ చేసుకుని, కొద్దిగా పొడి పిండి అద్ది, నూనె పూసిన పిజ్జా పాన్ మీద ఉంచాలి (అంచులు గుండ్రంగా వచ్చేలా కట్ చేసుకోవాలి) ∙గోధుమరంగులోకి వచ్చేవరకు సన్నని మంట మీద ఉంచాలి ∙చివరగా పిజ్జా బేస్‌ను వేరొక ప్లేట్లోకి తీసి, తయారుచేసి ఉంచుకున్న సాస్‌ను పిజ్జా మీద వేసి సమానంగా పరచాలి ∙ముందుగా కట్ చేసి ఉంచుకున్న టాపింగ్స్‌తో అందంగా అలంకరించాలి ∙కొత్తిమీర, చీజ్ తురుము కూడా చల్లాలి ∙ఇప్పుడు పిజ్జాను పాన్ మీద ఉంచి చీజ్ కరిగేవరకు ఉంచి దింపేయాలి ∙ఇలా ఇంటి దగ్గరే పిజ్జా తయారుచేసుకుని అందరూ కలిసి సరదాగా ఆరగించవచ్చు. సతాయ్ హోమ్ స్టైల్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఈ వంటకాన్ని మనం ఇంటి దగ్గరే తయారుచేసుకుందాం. కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; చీజ్ – 100 గ్రా.; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; ఆవాల ముద్ద – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో సాస్ – ఒక టీ స్పూను; బటర్ – ఒక టీ స్పూను; (వెజిటేరియన్లు పుట్ట గొడుగులు, పనీర్, బేబీ కార్న్‌తో తయారుచేసుకోవచ్చు) తయారీ: ∙ఒక పాత్రలో శుభ్రం చేసిన రొయ్యలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి కలపాలి ∙వీటికి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం, ఆవాల ముద్ద, చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఇదే విధంగా వెజిటేరియన్లు కూరముక్కలను ఊరబెట్టుకోవాలి. టూత్ పిక్‌లు తీసుకుని ఊరబెట్టిన ఉల్లి పాయ, క్యాప్సికమ్, టొమాటో, రొయ్యలను వరుసగా గుచ్చాలి ∙సమాంతరంగా ఉండే పాన్ తీసుకుని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక బటర్ వేసి కరిగాక, గుచ్చి ఉంచుకున్న పుల్లలను పాన్ మీద ఉంచి బాగా కాల్చాలి ∙చివరగా చీజ్ తురుము వేసి బాగా కలపాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని వేడివేడిగా తయారుచేసి పెడితే బాగుంటుంది. – డా. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ -
మధురం మధురమే
శుభమైనా, సుఖమైనా; మంచికైనా మాటకైనా; వార్తకైనా, వలపుకైనా; అనుబంధమైనదీ అన్యోన్యమైనదీ ‘మధుర’ రసమే గాని మరొకటి కాదు. మిఠాయిని అందిస్తే మైత్రి కుదిరినట్లే. ఇది మన సాంప్రదాయం. జీవశాస్త్రం కూడా దీనికి దాసోహమే. రుచిని గ్రహించేది నాలుక. షడ్రసాలకు సంబంధించి నాలుకపై ఒక్కొక్క చోట ఒక్కొక్క రసానికి సంబంధించిన ‘రసగ్రంధులు’ ఉంటాయి. ఏ పదార్థానికైనా ముందుగా తగిలేది నాలుక చివరి భాగమే. ఈ జిహ్వాగ్ర స్థానంలోనే మధుర రసాన్ని ఆస్వాదించే ‘రస గ్రంధులు’ ఉంటాయని వైద్యశాస్త్రం నిరూపించింది. ఉప్పు, పులుపులకు పార్శ్వ భాగం, ఇతర స్థానాలలో తిక్త కటు కషాయాలు (చేదు, కారం, వగరు) ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఈ షడ్రసాలకు సంబంధించి నిర్దిష్టమైన ఆరోగ్య మరియు పోషక ప్రయోజనాలు, అతి సేవన వలన కలిగే అనర్థాలు సుస్పష్టంగా వివరించింది ఆయుర్వేదం. మధుర రసం: (అష్టాంగ హృదయ సంహితా) ఇది అన్నిటి కంటె శ్రేష్ఠమైనది. జన్మతః అందరికీ హితకరం. ఓజస్సు, ఆయుష్షు, శరీరకాంతి వర్ధకం, ధాతు పుష్టికరం, కేశ వర్థకం. కంఠస్వరాన్ని మెరుగు పరుస్తుంది. బాలింతలలో చనుబాలు (స్తన్యం) కలగడానికి దోహదకారి. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వ్యక్తులకు కూడా హితకరం. (అంటే వ్రణాలు మానడానికి సహాయకారి అని అర్థం). విషహరం కూడా. వాతపిత్త హరం. మధుర రసం ‘గురువు’. అంటే జీర్ణమవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అనంతరం శరీరం బరువుగా ఉంటుంది. అందువలన స్థూలకాయానికి దారి తీస్తుంది. ఆజన్మ సాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం‘ బాలవృద్ధ క్షతక్షీణ, వర్ణ కేశేంద్రియ ఓజసాం.... స్తన్యం సంధానకృత్... ఆయుష్యో.. జీవనః... అతిగా సేవిస్తే... స్థౌల్యం, మధుమేహం, అగ్ని మాంద్యం, ఆంత్రకృతములు, ఇతర కఫ జన్య రోగాలు, కంతులు కలుగుతాయి. సన్యాసం (కోమా) కూడా సంభవించే అవకాశం ఉంది.కురుతే అత్యుపయోగేన సమేదః కఫజాన్, గదాన్‘స్థౌల్య అగ్నిసాద, సన్యాస, మేహ, గండ, అర్బుదాదికాన్‘తీపి ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది? ప్రకృతిసిద్ధ ద్రవ్యాలు: పండ్లు (ఫలాలు): అరటి, సీతాఫలం, సపోటా, పనస, మామిడి, ఖర్జూరం వంటి ఫలాలు అత్యంత మధురంగా ఉంటాయి. అలాగే దానిమ్మ, బొప్పాయి, జామ, ఆపిల్ మొదలైనవి. ద్రవరూప రసంతో ఉండేవాటిలో బత్తాయి, కమలా, ద్రాక్ష, పుచ్చకాయ ప్రధానమైన వి. స్ట్రాబెర్రీ, చెర్రీ, రామాఫలం మొదలైనవి కూడా ఎక్కువ తీపిగా ఉంటాయి. ద్రవాలు: చెరకు రసం, కొబ్బరి నీళ్లు, పాలు, తేనె (కొంచెం వగరు కూడా కలిపి ఉంటుంది) ఔషధ ప్రధానమైనవి: అతి మధురం, శతావరీ (పిల్లి పీచర) మొదలైనవి. ఆహార శాకాలు: తియ్య గుమ్మడి, చిలగడ దుంప, సొరకాయ, బీరకాయ, టొమాటో మొదలైనవి. పప్పులు: నువ్వులు, పెసలు, సెనగలు మొదలైనవి. 2. పిండి వంటలు: వీటి తయారీలో వరి పిండి, గోధుమ పిండి, మైదా పిండి ప్రధాన భూమికలు. పప్పులలో నువ్వులు, మినుములు, పెసలు, సెనగలు, కందుల వంటివి విరివిగా వాడతారు. శర్కర, బెల్లం ప్రధాన పాత్రధారులు. కొన్ని పాయసాలలో పాలు, తేనె, భాగస్వాములు. మరిగించిన నూనెలతో చేసిన డీప్ ఫ్రైలను మిఠాయిలుగా మలుస్తారు. ఉదా: కాజా, లడ్డు, కజ్జికాయ, జిలేబి, అరిసెలు మొదలైనవి. అలాగే పాలు, మీగడలు ప్రధానంగా ఉండే బర్ఫీ, రసగుల్లా, రసమలైల వంటివి కోకొల్లలు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మిఠాయిలు ప్రాచుర్యం పొందుతున్నాయి. చాక్లేట్లు, ఐస్‌క్రీమ్‌ల వంటివి అదోరకం. తెలుగు వారి పిండివంటల్లో... మినపసున్ని, బూరెలు, కొబ్బరి లస్కోరా, అరిసెలు, హల్వాలు అత్యంత ప్రధానమైనవి. చాలా వాటిల్లో నెయ్యి కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది.తీపి ఏదైనా ఒకటే విలువా? ఒకటే ప్రయోజనమా? కాదు, కానే కాదు. ప్రకృతి సిద్ధమైనవి ఆరోగ్యపరంగా ప్రథమ స్థానంలో ఉంటాయి. వీటిలో ఉండే సహజమైన పీచు మరియు ఇతర పదార్థాల వల్ల దేహానికి హాని కలుగదు. పిండివంటల్లో వాడే ఇతర పదార్థాలు (వరి, గోధుమ), నూనె, నెయ్యి... వీటి వల్ల ఆయా మిఠాయిల గుణధర్మాలు మారి, కేలరీలు పెరిగి, శరీరం మీద వివిధ ప్రభావాలు చూపిస్తాయి. మరో విషయం ఏమిటంటే, ‘రిఫైన్డ్ ఆయిల్స్, స్వీట్ కోసం ఎసెన్స్, నిల్వ కోసం రసాయనాలు.. ఇలా ఎన్నెన్నో రసాయనిక పదార్థాలు అతిథులుగా చేరి అపార నష్టం కలిగిస్తాయి. బజారులో, స్వీట్ షాపుల్లో లభించే వాటిలో అత్యధిక శాతం ఇలాంటివే. ఆధునిక జీవ రసాయన శాస్త్రం మిఠాయిలన్నీ కార్బోహైడ్రేట్సు ప్రధానమైనవే. ఇవి ధాతు పరిణామంలో గ్లూకోజ్‌గా మారాల్సిందే. అందుకు ఇన్సులిన్ అవసరం కాబట్టి మధుమేహ రోగులు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రకృతిసిద్ధ మధుర ద్రవ్యాలలో నేరుగా ‘సుక్రోజ్’ ఉంటుంది. (సుక్రోజ్ = ఫ్రక్టోజ్+ గ్లూకోజ్). కాబట్టి వీటి అరుగుదల ధాతుపరిణామాలలో ఇన్సులిన్ అతి తక్కువ పాత్ర పోషిస్తుంది. ఇది గమనించాల్సి ఉంది. గుర్తుంచుకోవలసిన సారాంశం: రసములారింట ‘మధురమ్ము’ రమ్య రసము ప్రకృతి దత్తపు మధురిమల్ వరము మనకు తీపి యెంతేని సర్వదా తృప్తికరము ఆయురారోగ్యసిద్ధికై అగ్రగామి లె గువ వహియించి మితిమీరి తినగవలదు గృహ మిఠాయిలు తినవయ్య ఇంపు మీర అంగడివి యేల దేహ బాధార్తి యేల సప్త ధాతుసారమునకు సహకరించు మినపసున్నిని సేవించు తనివి తీర! అమిత తక్షణ శక్తికై అరటి పండు. డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు