ఇడ్లీ(Idli) అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్‌ని బట్టి ధరలు కూడా వేరేలెవల్‌లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్‌లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా...?. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది.
బెంగుళూరు వ్లాగర్(Bengaluru Vlogger) వీధుల్లో ఉండే హోటల్లో(roadside shop) దొరికే రూ. 5ల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్‌లో దొరికే రూ. 5 వేల రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టేస్ట్ చేశాడు. పైగా వాటికి టేస్ట్‌కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధులలో అమ్మే రూ. 5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుర్స్ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు.
ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్(Rameshwaram cafe)లోని రూ. 50ల ఇడ్లీని టేస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఈ ఇడ్లీ టేస్ట్‌కి ఏడున్నర మార్కులు వేశాడు. తాజ్ హోటల్(Taj Hotel)లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దానిని చక్కగా ప్లేట్‌లో తీసుకురావడం తోపాటు నైఫ్, ఫోర్క్‌లు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్‌కి నాలుగున్నర మార్కులే వేశాడు.
ఇక చివరగా ఓ లగ్జరీయస్ ప్యాలెస్‌లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ. 5వేల రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వెచ్చించినా..కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నావల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్‌గా రూ. 5 ఇడ్లీనే చాలా టేస్ట్‌గా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్‌ని బట్టికాదు..చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిగ్గా రుచి బాగుంటుందని కొందరూ, మరీ రూ. 5 కోట్ల రూపాయల ఇడ్లీని ఎప్పుడూ తింటావ్ అని కామెంట్లు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.
(చదవండి: సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం..ఆ భారతీయ సంప్రదాయ మొక్క..! )
Comments
Please login to add a commentAdd a comment