idly
-
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
'కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా?
ఇడ్లీ అనంగానే తేలిగ్గా అరిగిపోయే వంటకం. చాలా సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం కూడా. పేషెంట్లే కాదు, సామాన్య ప్రజల వరకు అందరూ బ్రేక్‌ఫాస్ట్ మొదటగా ఈ రెసిపీకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ఇడ్లీలు అందరి మనసులో దోచుకున్న గొప్ప ప్రసిద్ధ వంటకంగా పేరుగాంచింది. అయితే వీటిని పలు రకాలుగా చేస్తారు. ఆయా ప్రాంతాల వారీగా చేసే విధానం మారుతుంటుంది. అందులోకి ఆరోగ్య స్ప్రుహతో మరింత ఆరోగ్యవంతంగా ఆస్వాదించే వైరైటీ ఇడ్లీలు కూడా మన ఆహారంలో భాగమైపోతుండటం మరింత విశేషం. అయితే ఇడ్లీలకే కింగ్‌గా పిలిచే వెరైటీ ఇడ్లీ వంటకం గురించి విన్నారా..?.ఇడ్లీలకే రాజుగా పేరుగాంచిన ఈ వంటకం కేరళలోని పాలక్కాడ్‌లోని గ్రామానికి చెందింది. ఈ ఇడ్లీలు మనం తినే ఇడ్లీలకు చాలా విభిన్నంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఆకృతి పరంగా పెద్దవిగానూ మల్లెపువ్వులా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తయారు చేసే విధానం కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది. పాలక్కాడ్‌లోని రామస్సేరి గ్రామం కింగ్ ఆఫ్ ఇడ్లీలకు పేరుగాంచింది. ఈ ఇడ్లీలనే తినేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి తరలి వస్తుంటారా..!. వీటిని పాన్కేక్ మాదిరిగా తయారు చేస్తారు.తయారు చేయు విధానం..మట్టికుండపై ఒక గుడ్డ కప్పి ఆవిరిపై ఉడకబెడతారు. 200 ఏళ్ల క్రితం తమిళనాడు, కాంచీపురం, తిరుపూర్, తంజావూర్ వంటి ప్రాంతాల నుంచి కొన్ని ముదలియార్ కుటుంబాలు కేరళకు రావడంతో ఈ వంటకం పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతుంటారు. వాళ్లంతా బతుకుదెరువు కోసం రామస్సేరి అనే చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడటంతో ఈ వంటకం ఉనికిలోకి వచ్చిందని ఓ కథనం. ఆయా కుటుంబాల్లో మగవాళ్లంత చేనేత కార్మికులు కాగా, మహిళలు రుచికరంగా వంట చేసేవారట. అలా ఈ రామస్సేరి ఇడ్లీలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇడ్డీని తయారు చేసేందుకు ఉపయోగించే మెష్క్లాత్ ఇడ్డీని సమానంగా ఉడికేలా చేయగా, స్లీమింగ్ కోసం ఉపయోగించే మట్టికుండా ఆ ఇడ్లీలకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. తయారీ..కావాల్సిన పదార్థాలు..కప్పుల బియ్యం (ఇడ్లీ బియ్యం మరియు ముడి బియ్యం)ఉరద్ పప్పు 1 కప్పు నీరు 1 కప్పు మెంతు గింజలు 1 స్పూన్ తగినంత ఉప్పునాలుగు గంటలు పైనే నానబెట్టిటన మినపప్పు, బియ్యం, మెంతులు కలిపి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కనీసం ఓ పది నుంచి 12 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా మట్టిప్లేటులో పెద్ద మొత్తంలో పరుచుకుని మట్టికుండపై ఉడికిస్తే.. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రామస్సేరి ఇడ్లీలు రెడీ..!.(చదవండి: -
'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!
తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీని పలుచోట్ల వివిధ రకాల పేర్లుతో పిలవడం గురించి విన్నాం. కానీ మరీ ఇలా ఓ ప్రముఖ నటి పేరుమీదుగా బ్రేక్‌ఫాస్ట్‌ని పిలవడం గురించి విని ఉండరు. ఈ ఇడ్లీ తమిళనాట బాగా ఫేమస్. కోలివుడ్ చెందిన ప్రముఖ నటి ఖుష్బు పేరు మీదుగా అక్కడ ఇడ్లీ వంటకం ఉంది. అసలు ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక దాగున్న స్టోరీ ఏంటంటే..?.భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి ఇడ్లీలు. ఇవి అత్యంత మృదువుగా మెత్తటి ఇడ్లీలా ఉంటాయి. సింపుల్‌గా చేసే ఈ అల్పాహారాన్ని దక్షిణ భారతదేశంలో ఓ గిన్నె సాంబార్, చట్టితో సర్వ్ చేస్తారు. దక్షిణ భారత సాంప్రదాయ వంటకమే ఈ ఇడ్లీ. అయితే తమిళనాట పేరుగాంచిన 'ఖుష్బూ ఇడ్లీ' తయారీ మాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇది మిగతా ఇడ్లీల కంటే పువ్వులా కోమలంగా తెల్లటి మల్లెమొగ్గల్లా అందంగా ఉంటాయి. నోట్లే వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. అంతలా సుకుమారంగా ఉంటాయి ఈ ఇడ్లీలు. అదీగాక తమిళనాడులో ఒకప్పుడూ అత్యంత అందమైన హీరోయిన్గా ఖుష్బు ఓ వెలుగు వెలిగింది. ఆమె కూడా బొద్దుగా అందంగా ఉంటుంది. ఈ ఇడ్లీలు కూడా చక్కగా ప్లవ్వీగా మల్లెపువ్వులా ఆకర్షణీయంగా ఉండటంతో ఆ నటి పేరు మీదగా వాళ్లంతా ఈ ఇడ్లీని పిల్చుకుంటున్నారు. దీన్ని వాళ్లు మల్లిగే ఇడ్లీ లేదా మల్లిగై పూ ఇడ్లీ అని కూడా పిలుస్తారు. తమిళంలో మల్లిగె, మల్లిగై అంటే 'మల్లెపువ్వు' అని అర్థం. మల్లె పువ్వులా చాలా కోమలంగా ఈ ఇడ్లీలు ఉంటాయి. ఐతే ఈ ఇడ్లీ 'ఖుష్బూ ఇడ్లీ' పేరు మీదగానే ఎక్కువ ప్రజాధరణ పొందింది. ఎవరు తయారు చేశారంటే..?నాలుగు దశాబ్దాల క్రితం, ధనభాగ్యం అమ్మ ప్రస్తుత కరుంకలపాళయం ఈ ఖుష్బు ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఈ అసాధారణమైన మృదువైన ఇడ్లీలు రాను రాను ఆహార ప్రియులకు ప్రీతికరమైనవిగా మారిపోయాయి. పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన రెసిపీ తయారీ గురించి 20 కుటుంబాలకు తెలియజేసింది. వాళ్లంతా ఆమెకు సహాయం చేయడానికి వీలుకల్పించారు. అలా లగ్జరీ హోటళ్ల నుంచి చెఫ్‌లు కూడా ధనభాగ్యం అమ్మ చేసిన ప్రత్యేక ఇడ్లీల తయారీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా నేడు రోజుకు దాదాపు 10 వేలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఖుష్బు ఇడ్లీ విలక్షణమైన ఆకృతి దాని పదార్థాల నుంచి వస్తుంది. ముఖ్యంగా సబుదానా, బియ్యం, మినప్పులతో ఈ ఇడ్లీని తయారు చేస్తారు. దీన్ని పులియబెట్టడం వల్ల మృదువుగా స్పాంజ్‌లా వస్తాయి.(చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో దిగనున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించడం విశేషం. ఆమె నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె తల్లి తమిళనాడుకి చెందిన భారతీయురాలు, తండ్రి జమైకన్. ఆమె తల్లిదండ్రులిద్దరూ అమెరికాకి వలస వచ్చారు. అయితే కమలా హారిస్ ఆహార్యం ఎల్లప్పుడూ తన పూర్వీకులను ప్రతిబింబించేలా ఉండటం గర్వించదగ్గ విషయం. అదీగాక కమల హారిస్ చిన్నతనంలో తన తల్లి, చెల్లితో కలిసి తరుచుగా చెన్నై రావడంతో తన మూలాలను ఎన్నటికీ మరచిపోలేదని అంటోంది. అంతేగాదు 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా తమిళనాడు ప్రజలు ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో ఉందని తెలిసి మరింత సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాదు కమలా హారిస్ ట్రంప్‌పై విజయం సాధించాలంటూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేయడం విశేషం. ఇక ఆమె తరుచుగా బహిరంగా ప్రచారాల్లో భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. అంతేగాదు ఒకానొక ఇంటర్వ్యూలో తమ ఇంట్లో ఎలాంటి ఆహారం ఉంటుందో వివరిస్తూ..దక్షిణ భారతీయ వంటకాలైన అన్నం, పెరుగు, బంగాళాదుంప కూర, పప్పు, ఇండ్డీ సాంబార్ తింటూ పెరిగాననని సగర్వంగా చెప్పింది. ఆమెకు భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమే అమెరికాలో ఉండే భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దగ్గర చేసింది. అంతేగాదు తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ సాంబార్ తప్పనిసరిగా ఉంటుందని కూడా చెప్పారు కమలా హారిస్. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నప్పటికీ తన దేశ సంస్కృతిని, మూలాలను వదిలిపెట్టలేదు. అది కేవలం భోజనపరంగానే కాదు ఆహార్యం పరంగా కూడా పెద్ద బొట్టు, విభూతి పెట్టుకుని కనిపిస్తూ తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు కమలా హారిస్. దటీజ్ ఇండియన్ కదా..!(చదవండి: టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!) -
కొబ్బరితో కార్న్ ఇడ్లీ..రుచి మాత్రమే కాదు, చాలా బలం కూడా
కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి: మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్ చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి) ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి. -
24 క్యారెట్స్ బంగారంతో చేసిన ఇడ్లీ.. మన హైదరాబాద్‌లోనే
హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ డిషెస్‌లో మరో కొత్త రకం వంటకం యాడ్ అయ్యింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ డిష్ ఇప్పుడు సిటీ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీని ధరెంత అన్నది ఈ స్టోరీలో తెలసుకుందాం.. సాధారణంగా ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుంది? మహా అయితే రూ.30-50 వరకు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర ఏకంగా 1200 రూపాయలు. అంత స్పెషల్ ఏముంటుందబ్బా? అదేమైనా బంగారంతో చేశారా ఆని ఆలోచిస్తున్నారా? నిజమే మరి. ఇది బంగారు ఇడ్లీనే. 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్ఫుల్గా గార్నిష్‌తో చేసి సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే మాత్రం బంజారాహిల్స్‌లోని కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్‌కు వెళ్లాల్సిందే. అక్కడ గోల్డ్ ఇడ్లీనే కాదండోయ్.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్ జామున్ వంటి వెరైటీ నోరూరించే వంటలెన్నో ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈసారి బ్రేక్ ఫాస్ట్‌కి బంగారు వంటలను ఓ పట్టు పట్టండి. View this post on Instagram A post shared by Pooja♡ (@foodnlifestyleby_pooja) View this post on Instagram A post shared by Krishna’s Idli and dosa (@krishna_idli_dosa) -
హైదరాబాదీ రికార్డు.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారాల్లో ఇడ్లీకున్న క్రేజే వేరు. ఆ క్రేజే ఓ రికార్డును సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ రికార్డు సృష్టించినట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఆయన ఇడ్లీపై తన ఇష్టాన్ని ఓ రేంజ్లో చూపించాడు. గత ఏడాది కాలంలో రూ.6 లక్షలు కేవలం ఇడ్లీల కోసమే ఖర్చు చేశాడు. తన కోసం, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం.. ఏడాది మొత్తంలో 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. తాను ప్రయాణించిన వివిధ ప్రదేశాల్లో కూడా ఆయన ఇడ్లీ జపమే చేసినట్లు స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది. ఇడ్లీ క్రేజ్‌కు సంబంధించిన ఇలాంటి విశేషాలెన్నో స్విగ్గీ వివరించింది. ఇటీవల ప్రపంచ ఇడ్లీ దినోత్సవం పురస్కరించుకుని ఇడ్లీ ఆర్డర్లపై నిర్వహించిన అధ్యయనంతో ఓ నివేదికను సంస్థ విడుదల చేసింది. చాలాచోట్ల డిన్నర్గా కూడా.. గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్లను పంపిణీ చేసినట్టు నివేదిక తెలిపింది. వినియోగదారుల్లో ఈ వంటకానికి ఇప్పటికీ ఉన్న విపరీతమైన క్రేజ్‌కు ఇది సూచికగా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధిక ఇడ్లీలను ఆర్డర్ చేసిన మొదటి మూడు నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. కొల్‌కొతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పుణే, వైజాగ్, ఢిల్లీ నగరాలు ఆ తర్వాత ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, ముంబై వాసులు డిన్నర్‌గానూ ఇడ్లీని ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. కారం, నెయ్యి ఇడ్లీకి హైదరాబాద్ జై బెంగళూరు వాసులు రవ్వ ఇడ్లీలు, చెన్నై వాసులు నెయ్యి, పొడి ఇడ్లీలు ఇష్టపడుతుండగా.. హైదరాబాదీలు కారం పొడి, నెయ్యితో కూడిన ఇడ్లీని ఇష్టపడుతున్నారని తేలింది. ఇక ముంబయి వాసులు ఇడ్లీ..వడ కాంబినేషన్‌కు జై కొడుతున్నారు. అయితే అల్పాహారాల ఆర్డర్స్‌లో మసాలా దోశ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా ఇడ్లీ రెండోస్థానంలో ఉంది. -
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
Recipes: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా
Millet Recipes In Telugu: ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. పండగ సందడిలో క్యాలరీలను పట్టించుకోకుండా నోటికి రుచించిన ప్రతివంటకాన్ని లాగించేశాం. ఇప్పుడు ఒక్కసారిగా చప్పగా ఉండే మిల్లెట్స్ తినాలంటే కష్టమే. అయినా కూడా క్యాలరీలు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే ‘సిరి’ ధాన్యాలను నోటికి రుచించేలా ఎలా వండుకోవాలో చూద్దాం.... కొర్రల ఇడ్లీ కావలసినవి: కొర్రలు – మూడు కప్పులు మినపగుళ్లు – కప్పు మెంతులు – రెండు టీస్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: కొర్రలు, మినపగుళ్లు, మెంతులను శుభ్రంగా కడిగి కొర్రలను విడిగా, మినపగుళ్లు, మెంతులను కలిపి ఐదుగంటలు నానబెట్టాలి కొర్రలు, మినపగుళ్లు చక్కగా నానాక కొద్దిగా నీళ్లు పోసుకుని విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రెండిటినీ కలిపి కొద్దిగా ఉప్పు వేసి పులియనియ్యాలి పులిసిన పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఆవిరి మీద ఉడికించాలి. వేడివేడి కొర్రల ఇడ్లీలు సాంబార్, చట్నీతో చాలా బావుంటాయి. మిల్లెట్ హల్వా కావలసినవి: కొర్రలు – కప్పు బెల్లం – కప్పు జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను కిస్మిస్లు – టేబుల్ స్పూను నెయ్యి – పావు కప్పు యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ముందుగా కొర్రలను మరీ మెత్తగా కాకుండా బరకగా పొడిచేసుకుని పక్కన పెట్టుకోవాలి మందపాటి బాణలిలో బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించి పొయ్యిమీద నుంచి దించేయాలి మరో బాణలిలో నెయ్యివేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి కాగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పక్కనపెట్టుకోవాలి ఇదే బాణలిలో కొర్రల పొడి వేసి ఐదు నిమిషాలు వేయించాలి వేగిన పొడిలో నాలుగు కప్పులు నీళ్లుపోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి నీళ్లన్నీ ఇగిరాక బెల్లం నీళ్లను వడగట్టి పోయాలి కొర్రలు, బెల్లం నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించాలి. నెయ్యి పైకి తేలుతున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలిపి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Dussehra 2022 Sweet Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! -
Recipe: పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్కేక్ తయారు చేసుకోండిలా!
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్కేక్ ఇలా తయారు చేసుకోండి! పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ తయారీకి కావలసినవి: ►పన్నీర్ తురుము – అరకప్పు ►క్యారట్ తురుము – పావు కప్పు ►క్యాబేజీ తరుగు – పావు కప్పు ►సూజీ రవ్వ – అరకప్పు ►పెరుగు – కప్పు ►శనగపిండి – అరకప్పు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ►ఒక గిన్నెలో సూజీ రవ్వ, శనగపిండి, పెరుగువేసి కలపాలి. ►దీనిలో పావు కప్పు నీళ్లు కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ►నానిన పిండిలో మిగతా పదార్థాలు, ఉప్పు వేసి చక్కగా కలపాలి. ►ఇడ్లీ పాత్రలో ఈ పిండిని వేసి ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకోవాలి. కోకోనట్ పాన్కేక్ తయారీకి కావలసినవి: ►కొబ్బరి పాలు – ముప్పావు కప్పు ►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ►గుడ్లు – రెండు ►పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ►గోధుమ పిండి – కప్పు ►వంటసోడా – మూడు టీస్పూన్లు ►ఉప్పు – అరటీస్పూను ►నూనె – అరకప్పు ►మేపుల్ సిరప్ – పావు కప్పు. కోకోనట్ పాన్కేక్ తయారీ: ►గిన్నెలో కొబ్బరిపాలు, పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి. ►మరో గిన్నెలో గుడ్లసొనను బీట్ చేయాలి. ►బటర్‌ను కరిగించి గుడ్ల సొనలో వేసి మరోసారి బీట్ చేయాలి. ►ఇప్పుడు కొబ్బరిపాల మిశ్రమంలో గుడ్లసొన, బటర్ మిశ్రమాన్ని వేసి చక్కగా కలపాలి. ►మరో గిన్నెలో గోధుమపిండి, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కూడా కొబ్బరిపాల మిశ్రమంలో వేసి కలపాలి. ►స్టవ్ మీద పాన్‌పెట్టి టేబుల్ స్పూను నూనెవేసి పాన్ మొత్తం రాయాలి. ►నూనె వేడెక్కిన తరువాత పావుకప్పు మిశ్రమం వేసి నీటిబుడగలు లేకుండా అట్టులా పోసుకోవాలి. ►సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసి మేపుల్ సిరప్ చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! Oats Uthappam Recipe: ఓట్స్ ఊతప్పం తయారీ విధానం ఇలా! -
అక్కడ తెలుగోడి నల్ల ఇడ్లీ ఎంత ఫేమసో..!!
-
రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ... ప్రతి ఉదయం 10 వేలు!
రాగి ఇడ్లీ.. రవ్వ ఇడ్లీ.. నెయ్యి ఇడ్లీ.. కాంచీపురం ఇడ్లీ... జయలలిత ఇడ్లీ.. పూల సంతలాగా పండ్ల సంతలాగా ఇడ్లీల హోల్‌సేల్ సంత. తమిళనాడు ఈరోడ్‌లోని కరుంగల్ పాళ్యంలో దాదాపు స్త్రీలే నడిపే 35 హోటళ్ల సంత ఇది. రోజుకు 10 వేల ఇడ్లీలు అమ్ముతారు. పెళ్లిళ్ల సీజన్లో 40 వేల ఇడ్లీలు. నలభై ఏళ్ల క్రితం ఇద్దరు స్త్రీలు మొదలెట్టిన ఈ సంత నేడు దాదాపు స్త్రీల చేతుల మీదుగానే నడుస్తోంది. స్త్రీల చేతుల్లో తయారవుతున్న మల్లెపూల వంటి ఇడ్లీల విజయగాథ ఇది. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పసుపు కొనడానికి వర్తకులు ఈరోడ్‌కు వస్తారు. తమిళనాడులోని పెద్ద ఊరు అది. ఆ వర్తకం పని అయిపోతుంది. ఉదయాన్నే ఆటో మాట్లాడుకుని 150 రూపాయలు ఇచ్చి అక్కడికి 14 కిలోమీటర్లు ఉన్న కరుంగల్ పాళ్యానికి మరుసటి రోజు పొద్దున్నే వస్తారు. అక్కడ ఇడ్లీ సంత ఉంటుంది. ఉదయం 5 నుంచి తొమ్మిదిన్నర లోపు ముగిసిపోయే సంత. అనుక్షణం వేడి వేడి ఇడ్లీ ఈలోపు. రెండిడ్లీ 7 రూపాయలు. 150 ఖర్చు పెట్టుకొని మరీ వచ్చి ఆ ఏడు రూపాయల ఇడ్లీ తింటారు. కరుంగల్ పాళ్యం ఇడ్లీ అంటే అంత రుచి. అంత డిమాండ్. ఊళ్లో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. తమ కార్యకర్తల కోసం 200 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ కరుంగల్ పాళ్యంకు వెళుతుంది. ఇంట్లో శుభకార్యం ఉండి బంధువులు వస్తారు. టిఫిన్‌కు వంద ఇడ్లీలు అవసరం అవుతాయి. కరుంగల్ పాళ్యంకు వెళితే రెడీ. పెళ్లి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌లో పొంగల్, ఉప్మా మనం వొండుకుంటాం. ఇడ్లీ మాత్రం కరుంగల్ పాళ్యం నుంచి రావాల్సిందే. ఇంకా విశేషం ఏమిటంటే ఈరోడ్‌లో చాలా పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇవి ఉదయాన్నే కరుంగల్ పాళ్యం నుంచి హోల్‌సేల్‌లో ఇడ్లీ తెచ్చుకుని తమ చట్నీ, సాంబారులతో కస్టమర్లకు రెట్టింపు రేట్‌కు అమ్ముకుంటాయి. కరుంగల్ పాళ్యంలో రోజుకు ప్రతి ఉదయం 6 నుంచి 9 లోపు పదివేల ఇడ్లీలు అమ్ముతారు. ఎలక్షన్లు ఉన్నా, పెళ్ళిళ్ల సీజన్ అయినా ఈ సంఖ్య నలభై వేలు. మొత్తం 40 లోపు వరుస షాపులున్నాయి అక్కడ. మొత్తం స్త్రీలే నిర్వహిస్తారు. మగవాళ్లు సహాయం చేస్తారు. ఇడ్లీ ఉడికే పాత్రల్లో ఒకే సమయంలో ఇద్దరు ఆడవాళ్లు పిండి నింపడం ఇక్కడే చూస్తాం. ఇలాంటి ఇడ్లీ సంతను కూడా ఇక్కడే చూస్తాం. విఫలం నుంచి విజయం వైపు నిజానికి ఇది ఒక వైఫల్యం నుంచి మొదలైన విజయగాథ. నలభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నేత పని కార్మికులు జీవించేవారు. ఆ సమయంలోనే ఈరోడ్‌లో మిషన్ క్లాత్ ఉత్పత్తి మొదలైంది. దాని దెబ్బకు నేత పని మూలపడింది. శ్రీరంగన్ అనే నేత కార్మికుడు ఎడ్ల బండి మీద సరుకులు వేసే కూలీగా మారాడు. ఇది అతని భార్య చెల్లమ్మాళ్ను బాధించింది. ఆమె అతనికి సహాయంగా నాలుగు డబ్బులు సంపాదించడం కోసం ఇంటి ముంగిట్లో ఉదయాన్నే ఇడ్లీలు వేయడం మొదలెట్టింది. ఆ రోజుల్లో ఆ ప్రాంతం పల్లె. ఎవరూ ఉదయం టిఫెన్ ఇడ్లీ తినేవారు కాదు. కాని చెల్లమ్మాళ్ చుట్టుపక్కల డాక్టర్లను కలిసింది. జబ్బు చేసిన వారిని ఉదయం ఇడ్లీ తినమని డాక్టర్లు చెప్పడం అప్పుడే మొదలైంది. ‘మా షాపు గురించి చెప్పండయ్యా’ అని చెల్లమ్మాళ్ వారిని కోరితే వారు సరేనన్నారు. అలా ఆమె ఇడ్లీలకు గిరాకీ మొదలైంది. ఆ సమయంలోనే మరో నేత కార్మికుని భార్య ధనపకియం కూడా ఇడ్లీ వేయడం మొదలెట్టింది. కాలక్రమంలో అక్కడి ఇడ్లీల రుచికి టౌన్ నుంచి వెతుక్కుంటూ రావడం మొదలెట్టారు. చెల్లమ్మాళ్కు ఐదుగురు కూతుళ్లు. అందరూ పెళ్లిళ్లు అయిన వెంటనే ఇడ్లీ అంగళ్లు తెరిచారు. ధనపకియం బంధువులు... అంతా కలిసి దాదాపు 40 అంగళ్లుగా అవి ఎదిగాయి. రుచికరమైన ఇడ్లీ తక్కువ ధర... ఈ మంత్రంతో వారు గెలిచారు. కరుణానిధి నుంచి జయలలిత వరకు ఈరోడ్‌కు రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినా లేదా ఆ దారి మీదుగా వెళుతున్నా ఉదయాన్నే కరుంగళ్ పాళ్యం ఇడ్లీ తెప్పించుకుని లేదా ఆగి తినాల్సిందే. కరుణానిధి, జయలలిత ఇలా తిన్నవారిలో ఉన్నారు. సినిమాస్టార్లు, వర్తకులు, సామాన్యులు వారూ వీరూ అని లేదు. ఇక్కడ కూడా సీజన్‌ను బట్టి కొత్తరకం ఇడ్లీని తయారు చేస్తారు. తమిళనాడులో కుష్బూ ఊపు మీద ఉన్నప్పుడు ‘కుష్బూ ఇడ్లీ’ అమ్మారు. జయలలిత పేరుతో కూడా ఇడ్లీ ఉంది. ‘మేము అరిటాకులో చుట్టకుండా ఇడ్లీ ఇవ్వం’ అని ఇక్కడ 30 ఏళ్లుగా ఇడ్లీ అమ్ముతున్న మల్లిక అంది. ‘నాన్‌స్టిక్ ఇడ్లీ గిన్నెల్లో కొంతమంది ఇడ్లీలు ఉడికిస్తారు. కాని మేము సంవత్సరాలుగా తడి గుడ్డ మీదే ఇడ్లీ ఉడకబెడతాం. అందుకే మా ఇడ్లీ రుచి’ అని మరొకామె అంది. ఈరోడ్ చుట్టుపక్కల ఉత్సవాలు, వేడుకలు, తిరునాళ్లు జరుగుతుంటే కరుంగళ్ పాళ్యం నుంచి టీమ్‌లు అన్ని సరుకులు, గిన్నెలు ట్రాలీలో వేసుకుని అవసరమైతే ఐదు పది రోజులు ఉండి ఇడ్లీలు అమ్ముతాయి. వీళ్లొచ్చి స్టాల్ పెట్టారంటే ఆ ఉత్సవానికే గ్లామర్ వస్తుంది. తినేవారి పక్షం అయితే వీరికి కూడా కష్టాలు లేకపోలేదు. వంట చెరుకు, వంట నూనె, గ్యాస్ సిలిండర్, మినప్పప్పు ధరలు పెరిగినప్పుడల్లా వీరి ఆదాయానికి గండి పడుతుంది. కస్టమర్ కోసం వీరు వెంటనే ఇడ్లీ రేటు పెంచరు. క్వాలిటీ తగ్గించరు. ‘ఏం చేస్తాం... కస్టమర్లను వదులుకోలేము కదా’ అంటారు. కరుంగళ్ పాల్యం స్త్రీలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరి ఆడపిల్లలకు దిగులూ చింతా లేదు. పెళ్లి అవడంతోటే అల్లుడు ఇక్కడికే వచ్చి ఒక ఇడ్లీ షాపు తెరుస్తాడు. దూరంగా తల్లి, దగ్గరలో కూతురు ఉదయాన్నే హడావిడిగా ఇడ్లీలు పొట్లాలు కట్టే మనోహర దృశ్యం ఇక్కడే కనిపిస్తుందంటే నమ్మండి. ఎప్పుడైనా ఈరోడ్‌కు వెళితే ఈ ఇడ్లీల సంగతి మర్చిపోవద్దు. చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం! -
అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..
పెద్దాపురం: ఈ రోజుల్లో రూపాయి పెట్టి ఏం కొనుక్కోవచ్చో ఠక్కుమని చెప్పండి.. కాస్త ఆలోచించారు కదూ.. రూపాయి పెడితే ఓ చిన్న చాక్లెట్టో, ఓ బిస్కెట్టో కొనుకోవచ్చు అని అనుకుంటున్నారా? నిజమే.. కానీ ఆ హోటల్లో రూపాయికి 3 చట్నీలతో ఇడ్లీ వస్తుంది. ఏంటి రూపాయికి ఇడ్లీయా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. రాజమహేంద్రవరం–కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆర్బీ కొత్తూరు గ్రామం వస్తుంది. పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ (రాంబాబు), రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్క రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు బజ్జీ కూడా ఒక్క రూపాయే. ఊళ్లోని ఇతర హోటళ్లు అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు. క్రమేపీ సరుకుల ధరలు పెరగడంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. రాంబాబు హోటల్లో రుచికే కాదు శుచికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్ అందిస్తారు. దీనికి నాణ్యత కూడా తోడవడంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ క్యూలో నిలుచుని మరీ టిఫిన్ చేస్తుంటారు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్‌ను నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్‌కు వస్తారని తెలిపాడు. వేడివేడిగా బజ్జీలు వేస్తున్న అత్త రత్నావతి నాకు సంతృప్తిగా ఉంది రూపాయి అనే పదానికున్న ప్రత్యేకత వేరు. రూపాయికే వైద్యం అంటారు. రూపాయికే కిలో బియ్యం అంటారు. ఇవన్నీ జనం నోట్లో విపరీతంగా నానుతాయి. అందుకే నేను కూడా నష్టం రానంతవరకూ రూపాయికే ఇడ్లీ అమ్మాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ధర పెంచాలన్నారు. కానీ నాకు నచ్చలేదు. 16 ఏళ్ల కిందట అర్ధ రూపాయితో ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టా. నా భార్య రాణి, అత్త రత్నావతి సహకారంతో ఇప్పటికీ అదే రేటుతో వ్యాపారం కొనసాగిస్తున్నాను. నష్టం లేకుండా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. – చిన్ని రాంబాబు, హోటల్ వ్యాపారి, ఆర్బీ కొత్తూరు, పెద్దాపురం మండలం ఇవీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు -
చికెన్- పాలకూర ఫ్రిట్టర్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?
చికెన్–పాలకూర ఫ్రిట్టర్స్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ (మెత్తగా ఉడికించుకుని తురుములా చేసుకోవాలి), మొక్కజొన్న పిండి, చిక్కటి పాలు – అరకప్పు చొప్పున, బియ్యప్పిండి – పావు కప్పు, పాలకూర తురుము – 1 కప్పు, పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, టొమాటో గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా, గుడ్డు – 1 (అర టేబుల్ స్పూన్ పాలలో కలిపి పెట్టుకోవాలి.. అభిరుచిని బట్టి). తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, ఉడికించిన చికెన్ తురుము వేసుకుని, పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము, పాలకూర తురుము వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా చేసుకుని ఓవెన్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత అభిరుచిని బట్టి.. గుడ్డు – పాల మిశ్రమంలో ముంచి, పాన్ మీద ఇరువైపులా కొద్దిగా నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. లేదంటే ఓవెన్లో ఉడికించినవి టొమాటో సాస్‌లో తింటే భలే రుచిగా ఉంటాయి. వాల్నట్ లడ్డూస్ కావలసినవి: శనగపిండి – 2 కప్పులు, వాల్నట్స్ – ముప్పావు కప్పు (నేతిలో దొరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి), పంచదార పొడి –1 కప్పు, నెయ్యి – 1 కప్పు, యాలకుల పొడి – 1 టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నెయ్యి వేసుకుని అందులో శనగపిండి వేసుకుని తిప్పుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత నీళ్లు పోసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వాల్నట్స్ పౌడర్, పంచదార పొడి, యాలకుల పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. పొడిపొడిగా మారి, దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఆ మిశ్రమం చల్లారనివ్వాలి. అనంతరం లడ్డూల్లా చేసుకోవాలి. అభిరుచిని బట్టి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కోకోనట్–రైస్ ఇడ్లీ కావలసినవి: కొబ్బరి కోరు, అన్నం – అర కప్పు చొప్పున, బెల్లం కోరు – పావు కప్పు (అభిరుచిని బట్టి), అరటిపండ్లు – 2, నెయ్యి – (ఇడ్లీ ప్లేట్స్కి అప్లై చేసుకునేందుకు సరిపడా) తయారీ: ముందుగా మిక్సీ బౌల్లో అన్నం, కొబ్బరికోరు, బెల్లం కోరు (అభిరుచిని బట్టి) అరటిపండు ముక్కలు వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసుకుని, అందులో అన్నం–కొబ్బరికోరు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని పది లేదా పన్నెండు నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. బెల్లం కోరు వెయ్యకుంటే చేసుకున్న ఇడ్లీలైతే.. సాంబార్లో భలే రుచిగా ఉంటాయి. -
‘ఇడ్లీ’ రెండక్షరాలు.. వెరైటీలు వెయ్యి రకాలు!
ఆబాలగోపాలానికి ఇడ్లీ ఇష్టమైన ఫుడ్. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈ అద్భుత వంటకం ఆరోగ్యానికి అదనపు బలం. మన ఆల్‌టైమ్ ఫేవరెట్ ఇడ్లీ గురించి కొన్ని విషయాలు...బటన్ ఇడ్లీ, తల్లే ఇడ్లీ, సాంబర్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ...ఇలా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల వెరైటీ ఇడ్లీలు ఉన్నాయి. లాంగ్ లాంగ్ ఎగో, వన్స్ ఆపాన్ ఏ టైమ్ ‘ఇడ్లీ’ ఇండోనేషియా నుంచి ఇక్కడికి వచ్చిందని ఫుడ్ హిస్టారియన్ కె.జె.ఆచార్య పరిశోధనాత్మకంగా తెలియజేశారు. వారి ‘కెడ్లీ’నే మన ‘ఇడ్లీ’ అంటారు ఆచార్య. లిజి కొలింగమ్ అనే మరో ఫుడ్ హిస్టారియన్ మాత్రం అలనాడు అరబ్ వ్యాపారులు సముద్రతీర ప్రాంత ప్రజలకు ఇడ్లీని పరిచయం చేశారని అంటారు. ‘ఇడ్డలిగె’ అనే కన్నడ పదం నుంచి ‘ఇడ్లీ’ వచ్చింది అంటారు. కొందరు మాత్రం 12వ శతాబ్దానికి చెందిన సంస్కృత పదం ‘ఇడ్డరిక’ నుంచి వచ్చింది అంటారు. మరికొందరు సౌరాష్ట్ర (గుజరాత్) ప్రాంతానికి చెందిన నేతకార్మికులు ఉపయోగించే ‘ఇడడ’ నుంచి వచ్చింది అంటారు.‘రామసేరి ఇడ్లీ’ అనేది ఇడ్లీలలో ప్రత్యేకత సంతరించుకుంది. సదరు ఈ ఇడ్లీ మనం రోజూ చూసే ఇడ్లీ సైజులో కాకుండా ఏకంగా దోసె సైజ్‌లో ఉంటుంది. డిఫెన్స్ ఫుడ్ రిసెర్చి లెబోరేటరి(డీఎఫ్ఆర్ఎల్) ఆస్ట్రోనాట్స్ కోసం ‘స్పేస్ ఇడ్లీ’తో పాటు పౌడర్ చెట్నీ కూడా తయారు చేసింది. చెన్నైకి చెందిన ఎనియవన్ అనే వ్యక్తి ఇడ్లీకి ఈరాభిమాని. ఇడ్లీకి ఒకరోజు ఉండాలంటూ ‘వరల్డ్ ఇడ్లీ డే’ మొదలుపెట్టాడు. ఫుడ్వరల్డ్లో ఇదొక ట్రెండ్‌గా మారింది. -
ఇప్పుడు కూడా రూపాయికే ఇడ్లీ...
చెన్నై : కమలాతాళ్.. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తమిళనాడులోని పెరూర్‌కి చెందిన ఈ బామ్మ 80 ఏళ్ల వయసులోనూ ఇడ్లీలు తయారు చేసి ఒక్క రూపాయికే విక్రయిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్ ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లినప్పటికీ.. కమలాతాళ్ తన ఇడ్లీల ధరను ఒక్క పైసా కూడా పెంచలేదు. నష్టాలు వచ్చినప్పటికీ పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఒక్క రూపాయికే వేడి వేడి ఇడ్లీ(ఒక ఇడ్లీ ఒక్క రూపాయి), ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది. (చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె) అవ్వకు దాతల సాయం లాక్డౌన్ నేపథ్యంలో కూడా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న కమలాతాళ్‌కు పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. భారతీయార్ విశ్వవిద్యాలయం ఆమెకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ పి కలిరాజ్ ఆహార, కిరాణా వస్తు సామగ్రిని విరాళంగా ఇచ్చారు. భారతీయార్ విశ్వవిద్యాలయ తలుపులు తన కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని కమలాతాళ్ చెప్పారు. హిందూస్తాన్ స్కౌట్స్ మరియు గైడ్స్ సభ్యులు కమలాతాళ్‌కు అవసరమైన వస్తువులను ఇచ్చారు. కోయంబత్తూర్ సెక్టార్ హెడ్ ప్రశాంత్ ఉతమా మాట్లాడుతూ.. ‘కమలాతాళ్ బామ్మ గురించి చాలా సార్లు విన్నాం. ఆమె ఒక్క రూపాయికే ఇడ్లీ ఎలా అందిస్తున్నారో కూడా విన్నాం. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో కూడా ఆమె ఒక్క రూపాయి ఇడ్లీని ఎలా నిర్వహించగల్గుతున్నారో విని ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవకు మా వంతుకు కొంత సహాయం చేశాం’ అని అన్నారు. రెట్లు పెంచే ఆలోచన లేదు లాక్డౌన్ వల్ల భారీగా నష్టం వాటిల్లింది. అయినప్పటికీ రేట్లు పెంచే ఆలోచన నాకు లేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా రూపాయికే క్వాలిటీ ఇడ్లీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా మంది ఇడ్లీల కోసం వస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయినా వలస కూలీలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. దాతల సహాయంతో వారందరికీ ఒక్క రూపాయికే ఇడ్లీ అందించగల్గుతున్నాను’అని కమలాతాళ్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో చెప్పారు. -
స్ప్రౌటెడ్ మిలెట్ దోసె, ఇడ్లీ విత్ జింజర్ చట్నీ
పిండి కోసం కావలసినవి: స్ప్రౌట్స్ – ఒక కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు); ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. చట్నీ కోసం కావలసినవి: ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క; వెల్లుల్లి రెబ్బలు – 3 (లేకపోయినా పరవాలేదు); మెంతులు – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 12; కరివేపాకు – పావు కప్పు; ఇంగువ – అర టీ స్పూను; చింతపండు – పావు కప్పు కంటె ఎక్కువ; బెల్లం పొడి – పావు కేజీ పిండి తయారీ: ఉప్పు మినహా పిండి కోసం చెప్పిన మిగతా పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, నానబెట్టిన వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాక, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙సుమారు ఎనిమిది గంటలపాటు ఈ పిండిని నానబెట్టాలి ∙ఈ పిండితో దోసెలు, ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు ∙అల్లం చట్నీతో అందించాలి ∙ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లం చట్నీ తయారీ: చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ధనియాలు, పచ్చి సెనగ పప్పు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, అల్లం ముక్క వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙నానబెట్టిన చింతపండు, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ∙దోసె, ఇడ్లీలతో అందించాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన వంటకాలను బామ్మలు, అమ్మమ్మలు మాత్రమే చెప్తారు. ఇందులో నూనె ఎక్కువగా వాడలేదు. మినుముకు విరుగుడైన అల్లం చట్నీతో తినడం వల్ల శరీరం గట్టి పడుతుంది. -
బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..
ప్రస్తుతం అందరినీ వేధించి సమస్య అధిక బరువు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. మరి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి. సెనగలు: వీటిలో ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి. మినప పప్పు: మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి. నట్స్: బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు: వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తామర గింజలు: వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎండు బఠాణి: ప్రొటీన్స్, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. -
సాంబారు వెనుక రహస్యం
ఆ తండ్రీకొడుకుల్ని చూసినవారు ముచ్చటపడకుండా ఉండలేరు. హడావుడిగా ఉండే ఆ ప్రాంతం వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అందరూ అక్కడకు వచ్చేది సాంబారు కోసమే. వింతగా ఉంది కదూ. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. అక్కడకి ఇడ్లీ కోసమో, దోసె కోసమో కాదు, కేవలం సాంబారు రుచి చూడటానికే వస్తారు. అదే చెన్నై ట్రిప్లికేన్‌లోని రత్నాకేఫ్. ఎంతోకాలంగా ఆ ప్రాంతానికి ఒక మైలురాయిగా నిలబడిపోయింది రత్నాకేఫ్. నిరంతరం ఆ కేఫ్ భోజన ప్రియులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గుప్తా కుటుంబీకులు 1948లో ప్రారంభించిన రత్నాకేఫ్ అనేక బ్రాంచీల స్థాయికి విస్తరించింది. ఈ కేఫ్‌కు వచ్చేవారంతా సాంబారు ప్రియులే. ‘మా దగ్గర సాంబారే ప్రధాన వంటకం’ అంటారు నిర్వాహకులు లోకేశ్ గుప్తా. ఇక్కడ చిత్రమేమిటంటే, వెయిటర్లంతా సాంబారు మగ్గులు పట్టుకుని కస్టమర్లకు వడ్డించడానికి సిద్ధంగా ఉంటారు. ప్లేటులో ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ... ఏముందో చూడరు. అన్నిటినీ సాంబారులో మునకలు వేయిస్తారు. ఇడ్లీ సాంబారు, కాఫీకి ప్రసిద్ధి రత్నా కేఫ్. మధుర నుంచి మద్రాసు వరకు మధురకు 25 కి.మీ. దూరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరుకు చెందిన జగ్గిల గుప్తా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనే ఆశయంతో మద్రాసు వచ్చారు. అక్కడ చిన్న హోటల్ ప్రారంభించారు. మొదట్లో ఇడ్లీ సాంబారు, కాఫీతో ప్రారంభించారు. సాంబారు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. నాణ్యమైన సరుకులను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి, సాంబారు రుచిగా వచ్చేలా పొడి తయారు చేసేవాడు. ఆ ఫార్ములాను చాలా రహస్యంగా ఉంచారు. ఇది కేవలం ఆ కుటుంబీకులకు, వారి దగ్గర పనిచేసే సాంబారు మాస్టర్లకు మాత్రమే తెలుసు. ఇక్కడి సాంబారు ఇంత ఫేమస్ కావటానికి కారణం సాంబార్ స్పెషలిస్టు పెరుమాళ్. ఈయన ఇక్కడ 50 సంవత్సరాలపాటు పనిచేశాక, వయసు మీద పడటంతో స్వచ్ఛంగా 2013లో రిటైర్ అయ్యారు. పెరుమాళ్ స్థానంలో ఇప్పుడు కందస్వామి సాంబార్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు.. అని గుర్తుచేసుకుంటారు లోకేశ్ గుప్తా. పెరుమాళ్ వామనుడు. పైన ఉంచిన వస్తువులు అందుకోవటం కష్టంగా ఉండేది. అందుకే సాంబారులోకి కావలసిన వస్తువులన్నీ అందుకోవటం కోసం ఒక చిన్న బల్ల మీద నిలబడి, సాంబారు తయారు చేసేవాడని చెబుతారు లోకేశ్ గుప్తా. ఇలా మొదలైంది.. రత్నాకేఫ్‌ని రాజేంద్ర గుప్తా మేనమామ అయిన త్రిలోక్‌నాథ్ గుప్తా (జగ్గీలాల్ గుప్తా కుమారుడు) 1948లో ప్రారంభించారు. ఎంతో వైభవంగా నడిచింది రత్నా కేఫ్. 2002లో ఈ హోటల్ని రాజేంద్ర గుప్తా నడపటం ప్రారంభించారు. వీరు శాంతి విహార్, ప్యాలెస్ కఫ్, అంబాల్ కేఫ్‌లను కొని ప్రారంభించినా, రత్నా కేఫ్ మాత్రమే నేటికీ రత్నంలా మెరుస్తూ ఉంది. ఇక్కడకు ఎక్కువమంది బ్యాచిలర్స్ వస్తుంటారు. సాంబారు వెనుక రహస్యం సాంబారులో ఉపయోగించే దినుసులలో ఈ డెబ్బయ్యేళ్లుగా ఎటువంటి మార్పు లేదు. అదే వారి విజయ రహస్యం అంటారు నిర్వాహకులు. సాంబారు రుచి చూసినవారంతా, ‘ఇన్ని సంవత్సరాలుగా సాంబారు రుచిలో ఏ మాత్రం మార్పు లేదు. అదే రుచిని కొనసాగిస్తున్నారు ’ అని చెబుతారు లోకేశ్ గుప్తా. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడమని చెబుతారు లోకేశ్. సాంబారులోకి కావలసిన వస్తువుల కొనుగోలు కోసం ఇప్పటికీ రాజస్థాన్ వెళ్తానని చెబుతారు లోకేశ్. కేవలం ఇందులోనే మార్పు రత్నా కేఫ్ రాజేంద్ర గుప్తా నుంచి లోకేశ్ గుప్తా చేతిలోకి వచ్చాక, చిన్నమార్పు జరిగింది. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. ఇప్పుడు స్టీమ్ బాయిలర్స్‌లో తయారుచేస్తున్నాం. ఈ మార్పును వంటవారు అంగీకరిం^è లేదు. దానితో సంప్రదాయంగాను, కొత్త విధానంలోనూ సాంబారు తయారు చేశారు కొంతకాలం. కస్టమర్లకు మాత్రం రుచి చాలా బావుందని చెబుతుండటంతో, వంటవారు కొత్తవిధానానికి అంగీకరించారు. నేను ఆర్కిటెక్ట్‌ని. ఎన్నడూ ఫుడ్ బిజినెస్‌లోకి వస్తాననుకోలేదు. అసలు నేను నిర్వహించగలననుకోలేదు. ఇక్కడ వారు చూపే ప్రేమ, వీరంతా మా కోసం పనిచేయడం చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అయితే ఈ పని మాత్రం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. వారు మెచ్చుకున్నప్పుడు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే సమయంలో చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రస్తుతం మా కేఫ్‌లో ఉత్తరాది వంటకాలను కూడా పరిచయం చేశాం. రైల్వే క్యాటరింగ్‌లోకి ప్రవేశించాం. ట్రిప్లికేన్‌లోనే ఉన్న పార్థసారథి దేవాలయానికి వచ్చినవారంతా రత్నా కేఫ్‌ని తప్పక దర్శించుకుని సాంబారు రుచి చూస్తారు.– లోకేశ్ గుప్తా -
ఇడ్లీ తిన మనసాయె!
‘రోజూ ఇడ్లీయేనా..’ మన ఇళ్లలో డైనింగ్ టేబుళ్ల దగ్గర, టిఫిన్ చేసేటప్పుడు ఈ డైలాగ్ తరచూ వింటుంటాం. ఇక హోటల్‌కు వెళితే మెనూలో ఇడ్లీ తప్పించి మిగతా వెరైటీలపైనే మన దృష్టంతా ఉంటుంది. రకరకాల కాంబినేషన్లలోని దోసెలు, పెసరట్లు, పూరీలు ఆర్డర్ చేసి లొట్టలేస్తాం. అయితే జిల్లాలోని హోటళ్లకు వచ్చే కస్టమర్లు మాత్రం మాకు ఇడ్లీయే కావాలంటున్నారు. మెనూ కార్డు చూడకుండా.. ఏం టిఫిన్లు ఉన్నాయని సర్వర్‌ను అడక్కుండానే.. ఇడ్లీ, సాంబారు ఆర్డర్ చెసేస్తున్నారు. ఓ పేరొందిన హోటల్లో గతంలో రోజుకు 2వేల ఇడ్లీలు అమ్ముడవుతుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 4 వేలు దాటింది. ఇంతకీ ఇడ్లీకి హఠాత్తుగా అంత డిమాండ్ ఎందుకొచ్చింది. తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. అనంతపురం న్యూసిటీ : జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ జ్వర పీడితులతో నిండిపోయాయి. అదే సమయంలో హోటళ్లలో ఇడ్లీలకు డిమాండ్ రెండు రెట్లు పెరిగింది. ఈ రెండిటికీ లింకేంటి అంటారా? చాలా ఉంది. సులువుగా జీర్ణమయ్యే ఇడ్లీయే తినాలన్న వైద్యుల సూచనలతో జనం రెండు పూటలా వాటిని ఇడ్లీతోనే సరిపెడుతున్నారు. మామూలుగా ఉదయం లేదా సాయంత్రం జనం వీటిని తినేందుకు ఇష్టపడేవారు. విజృంభించిన జ్వరాలతో డాక్టర్ల సలహా మేరకు మూడు పూటలా ఇడ్లీ సాంబర్తో సరిపెట్టుకుంటున్నారు. దీంతో హోటళ్లలో ఇడ్లీలు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోజూ 3వేల మంది చికిత్స పొందుతుంటే.. ఇందులో వెయ్యి మందికి పైగా జ్వరపీడితులే ఉన్నారు. జ్వరంతో నీరసించడంతో సులువుగా జీర్ణమయ్యే ఆహారమైన ఇడ్లీ వైపే రోగులు మొగ్గుచూపుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. ఇడ్లీనే ఎందుకు? ఇడ్లీలో చాలా పోషకాలున్నాయి. జ్వరం వచ్చినప్పుడు మూడు ఇడ్లీలు తింటే మనకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పిండి పులియబెట్టడం వల్ల విటమిన్లు పెరుగుతాయి. ఆవిరితో ఉడికించడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. నూనె వాడకపోవడం వల్ల ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు దరిచేరవు. ధాన్యం, పప్పు కాంబినేషన్ వల్ల సంపూర్ణ పోషకాలు అందుతాయి. వేడివేడిగా కావాలంటే క్యూ తప్పదు ఇటీవల అనంతపురం హోటళ్లలో ఇడ్లీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. జ్వరపీడితులతో పాటు వృద్ధులు, యువతలో ఎక్కువ మంది ఇడ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. జంక్‌ఫుడ్ వల్ల అనేక గ్యాస్ట్రిక్, ఇతర సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇడ్లీ ఫేవరేట్ ఫుడ్‌గా మారింది. నగరంలోని ప్రధాన హోటళ్లతో పాటు సప్తగిరి సర్కిల్, క్లాక్‌టవర్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, కమలానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా సంఖ్యలో ఇడ్లీ సెంటర్లున్నాయి. గతంలో విక్రయాలతో పోలిస్తే ఇటీవల వ్యాపారం 30 నుంచి 50 శాతం పెరిగినట్లు చెపుతున్నారు. నగరంలోని ప్రధాన హోటళ్లలో ఒక్క పూట వెయ్యి నుంచి 1,500 ఇడ్లీలు అమ్ముడుపోతున్నాయి. మంచి పోషక విలువలున్నాయి ఇడ్లీలో మంచి పోషక విలువలు ఉంటాయి. జ్వరంతో బాధపడుతున్న వారికి అవసరమైన అన్ని రకాల క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఇడ్లీని ఆహారంగా తీసుకోవచ్చు. – నందిని, న్యూట్రిషియన్ కౌన్సిలర్, సర్వజనాస్పత్రి, అనంతపురం సులువుగా జీర్ణమవుతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇడ్లీనే ఆహారంగా తీసుకోవాలని చెబుతుంటాం. ఎందుకంటే చాలా సులువుగా జీర్ణమవుతుంది. దీని ద్వారా ఇతర ఇబ్బందులు ఏమీ ఉండవు. – డాక్టర్ ప్రవీణ్ దీన్‌కుమార్,చిన్నపిల్లల వైద్య నిపుణులు,సర్వజనాస్పత్రి, అనంతపురం -
ఇడ్లీ ప్లేటు రంధ్రంలో బుడ్డోడి వేలు
కర్ణాటక ,శివాజీనగర: ఇంట్లో చిన్న పిల్లలుంటే ఎంతో సందడిగా ఉంటుంది, ఒక్కోసారి వారిపట్ల పెద్దలు అజాగ్రత్తగా ఉంటే సమస్యలు కూడా వస్తాయి. నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకోవడం, మింగడం వంటివి చేస్తుంటారు. ఓ 18 నెలల బాలుడు ఇడ్లీ తట్ట రంధ్రంలో వేలును దూర్చడంతో అది కాస్తా ఇరుక్కుపోయింది. దీంతో మార్తహళ్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు స్టీల్ కటింగ్ మిషన్‌ను తీసుకొచ్చి ఇడ్లీ తట్టను కత్తిరించాలని నిర్ణయించారు. సుమారు ఒక గంట పాటు కష్టపడి ప్లేటును కత్తిరించి బిడ్డ వేలుకు విముక్తి కల్పించారు. రంధ్రంలో వేలు చిక్కుకొని తక్షణమే ఉబ్బటం మొదలైంది. బయటకు తీయడం సాధ్యం కాలేదు, దీంతో ప్లేటును కత్తిరించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. -
ఇడ్లీ చాలెంజ్.. ఈ బామ్మతో పోటీ పడగలరా
బెంగళూరు: ఇడ్లీ చాలామందికి ఇష్టమైన అల్పాహారం. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేలీకగా జీర్ణం అవుతుంది. అయితే ఇడ్లీ అంటే ఎంత ఇష్టం ఉన్నా మాములుగా ఎన్ని తినగల్గుతారు.. నాలుగు, ఆరు సరే ఓ పది. కానీ నిమిషంలోనే ఆరు ఇడ్లీలు స్వాహా చేసే వారిని ఎప్పుడైనా చూశారు. అది కూడా 60 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా. కానీ ఇది వాస్తవం. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఇడ్లీ తినే పోటీ పెట్టారు. హుల్లాహళ్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఏకంగా నిమిషంలో ఆరు ఇడ్లీలు తిని ఔరా అనిపించడమే కాక పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. యువతులు, పెళ్లైనవారు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ వారందరిని సరోజమ్మ ఓడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో హిందుస్తాన్ టైమ్స్, ఏఎన్ఐలో వచ్చింది. -
రూపాయికే ఇడ్లీ
-
రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె
ఆమె వయసుఎనిమిది పదులు.నిండు పండు ముదుసలి.యువతరం కంటె ఎక్కువ శక్తి, ఉత్సాహం ఉన్నాయి.సామాన్యుల కోసం రూపాయికి ఇడ్లీ తయారుచేస్తోంది.తమిళనాడులోని పెరూర్‌కి దగ్గర ఉన్న వడివేలయంపాలయానికి చెందిన కమలాతాళ్ ఇడ్లీ షాపేఈ వారం ఫుడ్ ప్రింట్స్... కమలాతాళ్. పండు ముదుసలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేస్తుంది. స్వచ్ఛంగా స్నానం చేసి, భగవంతుడిని మనసారా ప్రార్థించి, పొలానికి వెళ్లి, తాజా కూరగాయలు తీసుకొస్తుంది. చట్నీ తయారుచేయడం కోసం రోలు సిద్ధం చేసి, తాజా కొబ్బరి, ఉప్పు వేసి, రుచికరమైన పచ్చడి చేస్తుంది ఈ అవ్వ. సాంబారులోకి కావలసిన కూరలన్నీ స్వయంగా తరిగి, మట్టితో అలికి చేసిన కట్టెల పొయ్యి మీద ఒక గిన్నెలో వేసి ఉడికిస్తుంది. ముందురోజు రాత్రే ఇడ్లీ పిండి రుబ్బి సిద్ధం చేస్తుంది. తమిళనాడులోని పెరూర్‌కి దగ్గరలో ఉన్న వడివేలయంపాలయం గ్రామంలో నివసించే ఈ అవ్వ, తన ఇంటి తలుపులు ఉదయం ఆరు గంటలకు తెరుస్తుంది. అప్పటికే ఇడ్లీ కోసం బోలెడుమంది బయట నిలబడి ఉంటారు. అవ్వ తలుపులు తెరవగానే, వారంతా ఆమెను నవ్వుతూ పలకరిస్తారు. అందరినీ ఆప్యాయంగా చూస్తూ, ఎవరెవరికి ఎన్నెన్ని కావాలో అడుగుతూ, వేడి వేడి ఇడ్లీ, ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది అవ్వ. ఇన్నీ కలిపి చాలా ఎక్కువ ధర అనుకుంటే పొరపాటే. ఒక ఇడ్లీ కేవలం ఒక రూపాయి మాత్రమే. ఉదయం ఎనిమిది గంటలవుతున్నా వినియోగదారులు తమ వంతు వచ్చేవరకు ఎంతో ఓరిమిగా నిరీక్షిస్తూ ఉంటారు. ఇంతలోనే తన కోసం ఎవరైనా అతిథులు వస్తే, చిరునవ్వుతో పలకరిస్తుంది ఈ అవ్వ. అంతలోనే లోపలకు వెళ్లి ఒక చేతితో బకీటెడు సాంబారు, ఒక చేతితో ఇడ్లీలు అలవోకగా తెస్తుంటే, ఈ వయసులో ఇంత వేగంగా ఎలా పనిచేయగలుగుతుందా అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ‘‘మాది రైతు కుటుంబం. ప్రతిరోజూ మా కుటుంబ సభ్యులంతా నన్ను ఇంట్లో వదిలి పొలానికి వెళ్లేవారు. నేను ఒంటరిగా ఉండటంతో విసుగ్గా అనిపించేది. ఏదో ఒక పనిచేయాలనుకున్నాను. ఆ చుట్టుపక్కల ఉండేవారికోసం ఇడ్లీ వేయడం ప్రారంభించాను. ఇప్పుడు నా దగ్గరకు ఎంతోమంది రోజు కూలీలు వస్తుంటారు. అతి తక్కువ ధరలో స్వచ్ఛమైన కల్తీ లేని ఇడ్లీలు తింటున్నామన్న ఆనందం వారికి కలుగుతుంది. నేను వడివేలయంపాలెంలోనే ఇంటి దగ్గరే 30 సంవత్సరాలుగా ఇడ్లీలు అమ్ముతున్నాను’ అంటారు కమలాతాళ్. కమలాతాళ్‌కు చిన్నతనం నుంచి రోట్లో రుబ్బిన పప్పుతోనే ఇడ్లీలు తయారుచేయడం అలవాటు. నేటికీ ఆమె అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. గ్రైండర్ కొనడం అనవసరమని భావించారు ఆమె. ‘‘నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. అందువల్ల ఎక్కువమందికి వంట చేయడం అలవాటు నాకు. ప్రతిరోజూ పప్పు నానబెట్టి, శుభ్రంగా కడిగి, రుబ్బి మరుసటి రోజుకి సిద్ధం చేసుకుంటాను. ఇందుకోసం నాకు ప్రతిరోజూ ఆరు కిలోల పప్పు, బియ్యం కావాలి. రుబ్బడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. రోజూ తాజా పిండినే ఉపయోగిస్తాను. ఉదయాన్నే మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు ఇడ్లీలు అమ్ముతారు కమలాతాళ్. ఒక వాయికి కేవలం 37 ఇడ్లీలు మాత్రమే సిద్ధమవుతాయి. రోజుకి మొత్తం వెయ్యి ఇడ్లీలు అమ్ముతారు ఈ అవ్వ. ‘‘పది సంవత్సరాల క్రితం ఒక ఇడ్లీ అర్ధరూపాయికి అమ్మేదాన్ని. రెండు సంవత్సరాల నుంచి ఇడ్లీ ధర రూపాయి చేశాను’’ అంటారు బోసి నవ్వుల అవ్వ.సాంబారుతో పాటు, రోజుకో కొత్తరకం చట్నీ తయారుచేస్తారు కమలాతాళ్. టేకు ఆకులు, అరటి ఆకుల్లో ఇడ్లీలు అందిస్తారు. వీటిని కూడా తన పొలం నుంచే తీసుకువస్తారు కమలాతాళ్. ‘‘మా ఇంటి చుట్టుపక్కల ఉన్న దిగువ మధ్యతరగతి వారే నా దగ్గర ఇడ్లీలు కొంటారు. వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. అంతా రోజు కూలీలే. అటువంటివారు రెండు ఇడ్లీలు 15 రూపాయలకో 20 రూపాయలకో కొనడం కష్టం.చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో ఒక ప్లేట్‌కి నాలుగు ఇడ్లీలు ఇస్తారు. కాని వీరు చేసే కష్టానికి ఆ నాలుగు ఇడ్లీలతో ఆకలి తీరదు. అందువల్ల కమతాతాళ్ వీరి గురించి ఆలోచించి, తాను తక్కువ ధరకు ఇడ్లీలు పెట్టడం వల్ల వారు నాలుగు రూపాయలు వెనకేసుకోగలుగుతారని భావించారు. ఇంత తక్కువకు ఇస్తున్నా, కమలాతాళ్కి రోజుకి 200 రూపాయలు మిగులుతున్నాయంటారు ఆవిడ. ‘‘ఇడ్లీ ధర పెంచరెందుకు అని నన్ను చాలామంది అడుగుతుంటారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెబుతాను, ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపుతున్నాను. అదే నాకు పెద్ద ఆదాయం’’ అని.కమలాతాళ్ ఇడ్లీల విషయం వార్తల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో, ఆయా ప్రాంతాల నుంచి ఇడ్లీల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ కమలాతాళ్ ఇడ్లీ ధర ఒక్క పైసా కూడా పెంచలేదు. రాబోయే రోజుల్లో కూడా పెంచనని చెబుతున్నారు. ఈ ఇడ్లీలో సంప్రదాయం ఉంది ఇక్కడి ఇడ్లీ పూర్తి సంప్రదాయంగా తయారవుతుంది. రోట్లో రుబ్బిన పిండి, శుభ్రంగా అలికిన మట్టి పొయ్యి, కట్టెల మంట మీద ఉడికే ఆరోగ్యకరమైన ఇడ్లీ, గారెలతో ఈ అవ్వ ఎంతోమందికి ఆరోగ్యం ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ అవ్వను స్ఫూర్తిగా తీసుకోవాలేమో! ఇదే నా ఆరోగ్య రహస్యం వయసు పైబడుతుండటంతో, మా మనవలు నన్ను ఈ వ్యాపారం మానేసి, ఆరోగ్యం చూసుకో మంటున్నారు. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు నేను ఈ పని చేయడం మానను. ఇలా చేస్తుండటం వల్లే నేను చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. ఇటీవలే గారెలు కూడా మొదలుపెట్టాను. ఒక్కోగారె ధర 2.50 పైసలు.