అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో దిగనున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించడం విశేషం. ఆమె నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె తల్లి తమిళనాడుకి చెందిన భారతీయురాలు, తండ్రి జమైకన్. ఆమె తల్లిదండ్రులిద్దరూ అమెరికాకి వలస వచ్చారు.
అయితే కమలా హారిస్ ఆహార్యం ఎల్లప్పుడూ తన పూర్వీకులను ప్రతిబింబించేలా ఉండటం గర్వించదగ్గ విషయం. అదీగాక కమల హారిస్ చిన్నతనంలో తన తల్లి, చెల్లితో కలిసి తరుచుగా చెన్నై రావడంతో తన మూలాలను ఎన్నటికీ మరచిపోలేదని అంటోంది. అంతేగాదు 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా తమిళనాడు ప్రజలు ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో ఉందని తెలిసి మరింత సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాదు కమలా హారిస్ ట్రంప్‌పై విజయం సాధించాలంటూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేయడం విశేషం.
ఇక ఆమె తరుచుగా బహిరంగా ప్రచారాల్లో భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. అంతేగాదు ఒకానొక ఇంటర్వ్యూలో తమ ఇంట్లో ఎలాంటి ఆహారం ఉంటుందో వివరిస్తూ..దక్షిణ భారతీయ వంటకాలైన అన్నం, పెరుగు, బంగాళాదుంప కూర, పప్పు, ఇండ్డీ సాంబార్ తింటూ పెరిగాననని సగర్వంగా చెప్పింది. ఆమెకు భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమే అమెరికాలో ఉండే భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దగ్గర చేసింది.
అంతేగాదు తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ సాంబార్ తప్పనిసరిగా ఉంటుందని కూడా చెప్పారు కమలా హారిస్. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నప్పటికీ తన దేశ సంస్కృతిని, మూలాలను వదిలిపెట్టలేదు. అది కేవలం భోజనపరంగానే కాదు ఆహార్యం పరంగా కూడా పెద్ద బొట్టు, విభూతి పెట్టుకుని కనిపిస్తూ తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు కమలా హారిస్. దటీజ్ ఇండియన్ కదా..!
(చదవండి: టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!)
Comments
Please login to add a commentAdd a comment