Sambar
-
కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో దిగనున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించడం విశేషం. ఆమె నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె తల్లి తమిళనాడుకి చెందిన భారతీయురాలు, తండ్రి జమైకన్. ఆమె తల్లిదండ్రులిద్దరూ అమెరికాకి వలస వచ్చారు. అయితే కమలా హారిస్ ఆహార్యం ఎల్లప్పుడూ తన పూర్వీకులను ప్రతిబింబించేలా ఉండటం గర్వించదగ్గ విషయం. అదీగాక కమల హారిస్ చిన్నతనంలో తన తల్లి, చెల్లితో కలిసి తరుచుగా చెన్నై రావడంతో తన మూలాలను ఎన్నటికీ మరచిపోలేదని అంటోంది. అంతేగాదు 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా తమిళనాడు ప్రజలు ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో ఉందని తెలిసి మరింత సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాదు కమలా హారిస్ ట్రంప్‌పై విజయం సాధించాలంటూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేయడం విశేషం. ఇక ఆమె తరుచుగా బహిరంగా ప్రచారాల్లో భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. అంతేగాదు ఒకానొక ఇంటర్వ్యూలో తమ ఇంట్లో ఎలాంటి ఆహారం ఉంటుందో వివరిస్తూ..దక్షిణ భారతీయ వంటకాలైన అన్నం, పెరుగు, బంగాళాదుంప కూర, పప్పు, ఇండ్డీ సాంబార్ తింటూ పెరిగాననని సగర్వంగా చెప్పింది. ఆమెకు భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమే అమెరికాలో ఉండే భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దగ్గర చేసింది. అంతేగాదు తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ సాంబార్ తప్పనిసరిగా ఉంటుందని కూడా చెప్పారు కమలా హారిస్. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నప్పటికీ తన దేశ సంస్కృతిని, మూలాలను వదిలిపెట్టలేదు. అది కేవలం భోజనపరంగానే కాదు ఆహార్యం పరంగా కూడా పెద్ద బొట్టు, విభూతి పెట్టుకుని కనిపిస్తూ తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు కమలా హారిస్. దటీజ్ ఇండియన్ కదా..!(చదవండి: టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!) -
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్‌కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్‌స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్‌తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్‌తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
రెస్టారెంట్‌కు షాక్.. మసాలా దోసతో సాంబారు ఇవ్వలేదని..
పాట్నా: మసాలా దోసతో పాటు సాంబారు ఇవ్వనందుకు కస్టమర్‌కు రూ.3,500 జరిమానా చెల్లించాలని బిహార్‌లో ఓ హోటల్‌ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రూ.140 పెట్టి కొనుక్కున్న స్పెషల్ మసాలా దోసకు సాంబార్ ఇవ్వలేదంటూ మనీశ్ గుప్తా అనే లాయర్ కమిషన్‌ను ఆశ్రయించాడు. పుట్టిన రోజు సందర్భంగా బక్సర్‌లోని నమక్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. స్పెషల్ దోశ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి చూస్తే సాంబార్ లేదు. హోటల్‌కు ఇదేమిటని నిలదీస్తే, ‘రూ.140కి హోటల్ మొత్తం రాసిస్తారా?’ అంటూ ఓనర్ వెటకారం చేయడంతో అతనికి మనీశ్ లీగల్ నోటీసు పంపించాడు. స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ -
ఇంట్లో ఇవి ఉంటే చాలు.. రుచికరమైన, ఆరోగ్యానిచ్చే ఉడిపి సాంబార్ రెడీ!
రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►కందిపప్పు – అరకప్పు (కడిగి అరగంటసేపు నానబెట్టాలి) ►పసుపు– అర టీ స్పూన్ ►ఉప్పు– రుచికి తగినంత ►బీరకాయ ముక్కలు– 300 గ్రాములు ►టొమాటో ముక్కలు – కప్పు. సాంబార్ పేస్ట్ కోసం: ►మినప్పప్పు– టేబుల్ స్పూన్ ►గుంటూరు మిర్చి– 8 ►పొట్టి మిరపకాయలు – 6 ►ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు ►యాలకులు – 2 ►లవంగాలు – 3 ►దాల్చిన చెక్క– అంగుళం ముక్క ►జీలకర్ర – టీ స్పూన్ ; పచ్చి కొబ్బరి ముక్కలు– అర కప్పు ; గసగసాలు– టీ స్పూన్. సాంబార్ పోపు కోసం: ►నూనె : టేబుల్ స్పూన్ ►మెంతులు – చిటికెడు ►ఆవాలు– అర టీ స్పూన్ ►ఇంగువ పొడి – చిటికెడు ►కరివేపాకు– 2 రెమ్మలు ►చింతపండు– 70 గ్రాములు (300 మి.లీ రసం చేయాలి) ►నీరు– ముప్పావు లీటరు ►ఉప్పు – తగినంత. గార్నిష్ చేయడానికి: ►నూనె – 2 టీ స్పూన్లు ►వేరుశనగ పప్పు – 4 టేబుల్ స్పూన్లు ►ఆవాలు – అర టీ స్పూన్ ►ఎండు మిర్చి– 2 ►కొత్తిమీర తరుగు – కప్పు తయారీ: ►కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, పసుపు వేసి ఉడికించాలి. ►చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ►మందపాటి బాణలి వేడి చేసి సాంబార్ పేస్టు కోసం తీసుకున్న దినుసులను సన్నమంట మీద వేయించి చల్లారిన తరవాత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ►బీరకాయ ముక్కల్లో కొద్దిగా నీటిని చిలకరించి మీడియం మంట మీద ఒక మోస్తరుగా ఉడికించాలి. ►మరీ మెత్తగా ఉడకకూడదు. ►మందపాటి పాత్రలో నూనె వేడి చేసి పోపు కోసం తీసుకున్న దినుసులను వేసి వేయించి టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►తర్వాత చింతపండు రసం పోసి కలిపి అందులో సాంబార్ పేస్ట్, బీరకాయ ముక్కలు, కందిపప్పు పేస్ట్ వేసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ►చిన్న బాణలిలో నూనె వేసి గార్నిష్ చేయడానికి తీసుకున్న దినుసులను వేయించి ఉడుకుతున్న సాంబార్లో వేసి దించేయాలి. ►ఇది అన్నంలోకి చక్కటి రుచినిస్తుంది. రోటీ చపాతీల్లోకి చేసేటప్పుడు నీటి మోతాదు తగ్గించుకుని చిక్కగా చేసుకోవాలి. చదవండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్ -
వడ్డిస్తుండగా సాంబారులో బల్లి.. అప్పటికే తిన్న వారికి..
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని మహిళల వసతి గృహం (నాగావళి)లో శనివారం రాత్రి భోజనాల సమయంలో సాంబారులో బల్లి కనిపించింది. రాత్రి 9.30 సమయంలో విద్యార్థినులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక విద్యార్థినికి సాంబారు వేస్తుండగా బల్లి కనిపించింది. దీంతో విద్యార్థి నులంతా భోజనాలు ఆపేశారు. అంతా కలిసి వసతి గృహం వద్ద వంట నిర్వహణ సిబ్బందికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే అప్పటికే తిన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. వర్సిటీ ఆరోగ్య సిబంది సైతం పర్యవేక్షించారు. నిరసనకు దిగిన విద్యార్థులతో వసతి గృహ నిర్వాహకులు చర్చలు జరిపారు. చివరకు మళ్లీ వంట చేసి రాత్రి 11.30 సమయంలో భోజనం పెట్టారు. విద్యార్థులు ఫోన్లో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వంటకు వాడుతున్న నీటి నిర్వహణ, వంట గది పారిశుద్ధ్యం, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు చేశారు. గతంలోనూ ఇలాంటివి జరిగినా లోపాలపై దృష్టిపెట్టడం లేదని విద్యార్థులంటున్నారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ఏ రాజేంద్ర ప్రసాద్ వద్ద విషయం ప్రస్తావించగా దీనిపై విచారణ నిర్వహిస్తామన్నారు. చదవండి: ఇంజినీర్ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో.. -
వంటపని చేస్తున్న గురుకుల విద్యార్థి.. సాంబారు పడి తీవ్రగాయాలు
పుల్కల్(అందోల్): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఒంటిపై సాంబారు పడటంతో తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్కల్ గ్రామానికి చెందిన మైసనగారి ప్రణయ్ సింగూరు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న ఉదయం క్యాంటీన్‌లోంచి సాంబారును డైనింగ్ హాల్లోకి తీసుకురావడానికి ప్రణయ్ సహకారాన్ని వంటమనిషి కోరాడు. సాంబరు గిన్నె తీసుకెళ్తుండగా వేడివేడి సాంబారు ప్రమాదవశాత్తు ప్రణయ్ రెండు చేతులు, కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్ బాలస్వామి వెంటనే ప్రణయ్ కుటుంబసభ్యులకు సమాచారమందించి అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గురుకులంలో నలుగురు వంటమనుషులు ఉండాలి. కానీ, ఒక్కరే ఉండటంతో రోజూ సీనియర్ విద్యార్థులను సహాయకులుగా వాడుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న సింగూరు గురుకుల ప్రిన్సిపాల్, కేర్ టేకర్‌పై చర్యలు తీసుకోవాలని స్వేరోస్ నాయకులు డిమాండ్ చేశారు. -
సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు
బెంగళూరు: ఇటీవల కాలంలో కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు చిన్న చిన్న విషయాలకు హత్యలు చేస్తున్నారు. తాజాగా సాంబారు రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లాలోని డోడ్‌మణెలో నివాసముంటున్న నారయణ హస్లర్ అనే యువకుడు మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఆకలిగా ఉందని భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలానే తన తల్లి ఆహారాన్ని వడ్డించింది. అయితే ఆ రోజు ఇంట్లో వండిన సాంబారు అతనికి నచ్చలేదు. దీంతో కర్రీ రుచిగా చేయలేదని తల్లి, సోదరితో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న తుపాకీతో కిరాతకంగా వారిద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతని తల్లి, సోదరి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: అడల్ట్ కంటెంట్ వ్యసనం.. ఆన్లైన్ ప్రియురాలు.. కోరికల కోసం కోటి స్వాహా -
దారుణం: సాంబార్ పడి చిన్నారి మృతి
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): వేడి సాంబార్ మీదపడి ఏడాదిన్నర బాలుడు మృతి చెందిన సంఘటన చెన్నపట్టణ తాలూకా దేవరహొసహళ్లి గ్రామంలో జరిగింది. చౌడేశ్, రాధ దంపతుల కుమారుడు ధన్విక్ మృతి చెందిన చిన్నారి. సోమవారం రాత్రి ఇంట్లో స్టౌ మీద మరుగుతున్న సాంబార్ పాత్రను ధన్విక్ లాగడంతో ఒంటిమీద సాంబార్ పడి తీవ్ర గాయాలయ్యాయి. మండ్యలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతిచెందాడు. చదవండి: శాడిస్టు భర్త.. పీకలదాక మద్యం తాగి.. ఆపై -
సాంబార్లో సగం బల్లి..
-
సాంబార్లో సగం బల్లి.. మిగతాది ఏమైనట్లు?!
న్యూఢిల్లీ: అసలే ఇది కరోనా కాలం. హోటళ్లలో భోజనం చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. అనవరసరంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు అని శుభ్రంగా ఇంట్లోనే తింటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హోటల్లో టిఫిన్ చేసిన ఓ వ్యక్తికి భయంకరమైన అనుభవం ఎదరయింది. దోశ తింటుండగా సాంబారులో బల్లి ప్రత్యక్షమైంది. కన్నాట్ ప్లేస్‌లో దక్షిణాది వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఓ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. వివరాలు.. కొందరు వ్యక్తులు టిఫిన్ చేసేందుకు ఢిల్లీలోని పాష్ ఏరియా.. లగ్జరీ హోటళ్లకు ప్రసిద్ధి చెందిన కన్నాట్‌కు వెళ్లారు. అక్కడ దక్షిణాది వంటకాలకు ఫేమస్ చెందిన ఓ రెస్టారెంట్‌కు వెళ్లి సాంబార్, దోశ ఆర్డర్ ఇచ్చారు. టిఫిన్ వచ్చాక.. తినడం ప్రారంభించారు. ఇంతలో ఓ వ్యక్తికి సాంబారులో బల్లి కనిపిచింది. ఐతే సగం బల్లి మాత్రమే ఉండటంతో వణికిపోయాడు. మిగతా సగం బల్లి ఎక్కడుంది.. వేరే వారికి వెళ్లిపోయిందా.. లేదంటే కొంపదీసి తనే తిన్నానా ఏంటి అని భయడిపోయాడు. వెంటనే హోటల్ మేనేజర్ని పిలిచి నిలదీశాడు. అందరిపై విరుచుకుపడి నానా రచ్చ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (వంటింటి వైద్యంతో కరోనా ‘ఆవిరి’) 'నా నోటి నుంచి ఈ బల్లిని తీశాను. సగమే ఉంది. మిగతా సగం నేనే తిన్నానా? లేదంటే హోటల్ కిచెన్‌లోని సాంబారు గిన్నెలోనే ఉండిపోయిందా? లేదంటే ఇతరులకు వడ్డించారా?' అని ఆ కస్టమర్ వాపోయాడు. అనంతరం రెస్టారెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిచెన్‌తో పాటు హోటల్లో ఉన్న సీసీ ఫుటేజీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే దోశ తయారీకి వాడే పదార్థాల వివరాలను అందజేయాలని ఆదేశించారు. -
సాంబారు వెనుక రహస్యం
ఆ తండ్రీకొడుకుల్ని చూసినవారు ముచ్చటపడకుండా ఉండలేరు. హడావుడిగా ఉండే ఆ ప్రాంతం వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అందరూ అక్కడకు వచ్చేది సాంబారు కోసమే. వింతగా ఉంది కదూ. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. అక్కడకి ఇడ్లీ కోసమో, దోసె కోసమో కాదు, కేవలం సాంబారు రుచి చూడటానికే వస్తారు. అదే చెన్నై ట్రిప్లికేన్‌లోని రత్నాకేఫ్. ఎంతోకాలంగా ఆ ప్రాంతానికి ఒక మైలురాయిగా నిలబడిపోయింది రత్నాకేఫ్. నిరంతరం ఆ కేఫ్ భోజన ప్రియులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గుప్తా కుటుంబీకులు 1948లో ప్రారంభించిన రత్నాకేఫ్ అనేక బ్రాంచీల స్థాయికి విస్తరించింది. ఈ కేఫ్‌కు వచ్చేవారంతా సాంబారు ప్రియులే. ‘మా దగ్గర సాంబారే ప్రధాన వంటకం’ అంటారు నిర్వాహకులు లోకేశ్ గుప్తా. ఇక్కడ చిత్రమేమిటంటే, వెయిటర్లంతా సాంబారు మగ్గులు పట్టుకుని కస్టమర్లకు వడ్డించడానికి సిద్ధంగా ఉంటారు. ప్లేటులో ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ... ఏముందో చూడరు. అన్నిటినీ సాంబారులో మునకలు వేయిస్తారు. ఇడ్లీ సాంబారు, కాఫీకి ప్రసిద్ధి రత్నా కేఫ్. మధుర నుంచి మద్రాసు వరకు మధురకు 25 కి.మీ. దూరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరుకు చెందిన జగ్గిల గుప్తా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనే ఆశయంతో మద్రాసు వచ్చారు. అక్కడ చిన్న హోటల్ ప్రారంభించారు. మొదట్లో ఇడ్లీ సాంబారు, కాఫీతో ప్రారంభించారు. సాంబారు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. నాణ్యమైన సరుకులను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి, సాంబారు రుచిగా వచ్చేలా పొడి తయారు చేసేవాడు. ఆ ఫార్ములాను చాలా రహస్యంగా ఉంచారు. ఇది కేవలం ఆ కుటుంబీకులకు, వారి దగ్గర పనిచేసే సాంబారు మాస్టర్లకు మాత్రమే తెలుసు. ఇక్కడి సాంబారు ఇంత ఫేమస్ కావటానికి కారణం సాంబార్ స్పెషలిస్టు పెరుమాళ్. ఈయన ఇక్కడ 50 సంవత్సరాలపాటు పనిచేశాక, వయసు మీద పడటంతో స్వచ్ఛంగా 2013లో రిటైర్ అయ్యారు. పెరుమాళ్ స్థానంలో ఇప్పుడు కందస్వామి సాంబార్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు.. అని గుర్తుచేసుకుంటారు లోకేశ్ గుప్తా. పెరుమాళ్ వామనుడు. పైన ఉంచిన వస్తువులు అందుకోవటం కష్టంగా ఉండేది. అందుకే సాంబారులోకి కావలసిన వస్తువులన్నీ అందుకోవటం కోసం ఒక చిన్న బల్ల మీద నిలబడి, సాంబారు తయారు చేసేవాడని చెబుతారు లోకేశ్ గుప్తా. ఇలా మొదలైంది.. రత్నాకేఫ్‌ని రాజేంద్ర గుప్తా మేనమామ అయిన త్రిలోక్‌నాథ్ గుప్తా (జగ్గీలాల్ గుప్తా కుమారుడు) 1948లో ప్రారంభించారు. ఎంతో వైభవంగా నడిచింది రత్నా కేఫ్. 2002లో ఈ హోటల్ని రాజేంద్ర గుప్తా నడపటం ప్రారంభించారు. వీరు శాంతి విహార్, ప్యాలెస్ కఫ్, అంబాల్ కేఫ్‌లను కొని ప్రారంభించినా, రత్నా కేఫ్ మాత్రమే నేటికీ రత్నంలా మెరుస్తూ ఉంది. ఇక్కడకు ఎక్కువమంది బ్యాచిలర్స్ వస్తుంటారు. సాంబారు వెనుక రహస్యం సాంబారులో ఉపయోగించే దినుసులలో ఈ డెబ్బయ్యేళ్లుగా ఎటువంటి మార్పు లేదు. అదే వారి విజయ రహస్యం అంటారు నిర్వాహకులు. సాంబారు రుచి చూసినవారంతా, ‘ఇన్ని సంవత్సరాలుగా సాంబారు రుచిలో ఏ మాత్రం మార్పు లేదు. అదే రుచిని కొనసాగిస్తున్నారు ’ అని చెబుతారు లోకేశ్ గుప్తా. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడమని చెబుతారు లోకేశ్. సాంబారులోకి కావలసిన వస్తువుల కొనుగోలు కోసం ఇప్పటికీ రాజస్థాన్ వెళ్తానని చెబుతారు లోకేశ్. కేవలం ఇందులోనే మార్పు రత్నా కేఫ్ రాజేంద్ర గుప్తా నుంచి లోకేశ్ గుప్తా చేతిలోకి వచ్చాక, చిన్నమార్పు జరిగింది. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. ఇప్పుడు స్టీమ్ బాయిలర్స్‌లో తయారుచేస్తున్నాం. ఈ మార్పును వంటవారు అంగీకరిం^è లేదు. దానితో సంప్రదాయంగాను, కొత్త విధానంలోనూ సాంబారు తయారు చేశారు కొంతకాలం. కస్టమర్లకు మాత్రం రుచి చాలా బావుందని చెబుతుండటంతో, వంటవారు కొత్తవిధానానికి అంగీకరించారు. నేను ఆర్కిటెక్ట్‌ని. ఎన్నడూ ఫుడ్ బిజినెస్‌లోకి వస్తాననుకోలేదు. అసలు నేను నిర్వహించగలననుకోలేదు. ఇక్కడ వారు చూపే ప్రేమ, వీరంతా మా కోసం పనిచేయడం చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అయితే ఈ పని మాత్రం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. వారు మెచ్చుకున్నప్పుడు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే సమయంలో చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రస్తుతం మా కేఫ్‌లో ఉత్తరాది వంటకాలను కూడా పరిచయం చేశాం. రైల్వే క్యాటరింగ్‌లోకి ప్రవేశించాం. ట్రిప్లికేన్‌లోనే ఉన్న పార్థసారథి దేవాలయానికి వచ్చినవారంతా రత్నా కేఫ్‌ని తప్పక దర్శించుకుని సాంబారు రుచి చూస్తారు.– లోకేశ్ గుప్తా -
సాయం అందేలోపే..మృత్యువు మింగేసింది!
ప్రకాశం, ఉలవపాడు: కరేడు పంచాయతీ పరిధి కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కిలగడ్డ రాస్య (2) తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం చెన్నైలో మృతి చెందింది. రాస్య సాంబార్లో పడటంతో తీవ్రంగా గాయపడింది. చెన్నైలోని వైద్యశాలలో చికిత్స పొందుతోంది. డబ్బులు లేని కారణంగా ఆ బాలికను ఆదుకునే వారు కావాలని గురువారం ‘సాక్షి’లో ఓ కథనం కూడా ప్రచురితమైంది. దాతల నుంచి సాయం అందేలోపు ఆ చిన్నారి మృత్యుఒడికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలకుపైన తల్లిదండ్రులు ఖర్చు పెట్టినా చిన్నారి దక్కలేదు. రాస్య పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఊటుకూరులో తన అమ్మమ్మ వద్ద ఉన్నప్పుడు వేడి వేడి సాంబార్లో పడిపోయింది. సాంబార్ ఆ చిన్నారి పాలిట విలన్‌గా మారి ప్రాణాలు తీసింది. -
శోకాన్ని మిగిల్చిన శ్రావణి
ఆ దంపతులకు పెళ్లయిన ఏడేళ్లకు జన్మించింది ఆ చిన్నారి. అందుకే ఆ పాపంటే వాళ్లకు ప్రాణం. బుడిబుడినడకలతో ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడేవారు. ఇంతలో విధి వక్రించింది. సాంబారు గిన్నెలో పడి ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. కన్నతల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): ప్రమాదవశాత్తూ సాంబారు గిన్నెలో పడిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రాయవరం ఎస్సై కొండపల్లి సురేష్‌బాబు బుధవారం తెలిపారు. మండలంలోని వెదురుపాక శెట్టిబలిజ రామాలయం వద్ద ఈ నెల 14న శ్రీరామ నవమిని పురస్కరించుకుని అన్నసమారాధన నిర్వహించారు. గ్రామానికి చెందిన వాసంశెట్టి శ్రావణి అనే ఏడేళ్ల బాలిక వంటలు చేస్తున్న ప్రాంతంలో నిప్పులను గమనించకుండా వాటిపై కాలు వేసింది. బాధతో అరుస్తూ బాలిక తూలి పక్కనే వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడిపోయింది. వెంటనే బాలికను తల్లిదండ్రులు వరలక్ష్మి, వీరబాబు బిక్కవోలు మండలం పందలపాకలో ఉన్న ప్రై వేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మృతి చెందింది. -
సాంబార్లో పురుగులు
అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని మహానంది వసతిగృహంలో శుక్రవారం మధ్యాహ్నం వడ్డించిన సాంబార్లో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహించారు. పుచ్చుపట్టిన వంకాయలను సాంబార్‌లోకి యథాతథంగా వాడటంతో పురుగులు బయటపడ్డాయి. ఇటువంటి భోజనం ఎలా తినాలంటూ విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాసిరకమైన ఆహారంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు ప్రకటించారు. నాయకులు రాధాకృష్ణ, కళ్యాణ్ కుమార్, వినోద్, అనిల్, హేమంత్ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి నాణ్యమైన భోజనం అందించాలని అనేక దఫాలుగా విన్నవించినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఇటీవల టెండర్లలో రేట్లు తగ్గించేలా ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయినా కిందిస్థాయి అధికారులు వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కూరగాయలు చెడిపోయినవి సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులందరూ ర్యాలీగా వచ్చి ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతి విజయ్‌కుమార్ విద్యార్థులకు నచ్చచెప్పారు. స్టోర్ కీపర్, సప్లయర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
సాంబారు రుచిగా రావాలంటే ...
సాంబారు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తమిళనాడు సాంబారు. వాళ్లకి సాంబారు లేనిదే వంట లేదు. అసలు సాంబారును ఇష్టపడని వారే ఉండరు. సాంబారును చాలా రకాలుగా చేస్తారు. సాంబారులో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కావలసినవి: కంది పప్పు – ఒక కప్పు; చింత పండు – 10 గ్రా. (నీళ్లలో నానబెట్టి రసం తీయాలి); టొమాటో తరుగు – అర కప్పు; బెండ కాయ ముక్కలు – అర కప్పు; వంకాయ ముక్కలు – పావు కప్పు; సొరకాయ ముక్కలు పెద్ద సైజువి – ఆరు; మునగ కాడ ముక్కలు – 4 ; ఉల్లి తరుగు – అర కప్పు; మిరప కారం – కొద్దిగా; పసుపు – చిటికెడు; బెల్లం పొడి – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – నాలుగు (నిలువుగా కట్ చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత సాంబారు పొడికి కావలసిన పదార్థాలు: ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెగన పప్పు, మినప్పప్పు – 6 టీ స్పూన్లు చొప్పున; ఆవాలు, జీలకర్ర – ఒక టీ స్పూను చొప్పున; ఎండు మిర్చి – 6; ఇంగువ – చిటికెడు తయారీ: కందిపప్పుని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి కుకర్‌లో ఉడికించాలి. మరొక గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టాలి.ముక్కలు మెత్తగా ఉడికిన తరవాత, ఉడకబెట్టిన కందిపప్పును మెత్తగా మెదిపి ముక్కలలో వేయాలి. చిక్కగా తీసిన చింతపండు రసం, మిరప కారం, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క వేసి, మరిగించాలి. వేరొక పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె లేకుండా ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని సాంబారులో వేసి బాగా కలిపి మరిగించాలి. వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక, చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. పోపు దినుసులు వేసి వేయించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించాక, రెండు గరిటెల మరుగుతున్న సాంబారును పోపులో పోసి, బాగా కలిపి మూత పెట్టి మరిగించాలి. ఆ తరవాత సాంబారు గిన్నెలో పోసి కలపాలి. కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. – ఎన్. కల్యాణ్ సిద్ధార్థ్ -
ఉలిక్కిపడిన ఏయూ విద్యార్థులు
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల మెస్–1లో సాంబరులో బల్లి పడడంతో కలకలం రేగింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భోజనానికి సిద్ధమైన విద్యార్థులు సాంబారు బకెట్లో బల్లిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే కొద్దిమంది తమ భోజనం ముగించారు. దీంతో వారంతా తమకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. మిగతా విద్యార్థులు భోజనం చేయకుండానే బయటకు వచ్చేశారు. హాస్టల్ మెస్ నుంచి బల్లి దర్శనమిచ్చిన సాంబారు బకెట్‌ను పట్టుకుని ర్యాలీగా ఏయూ మెయిన్‌గేట్ వద్దకు చేరుకున్నారు. తమ అవస్థలను ఏకరువు పెట్టారు. గేటు మూసివేసి ధర్నాకు దిగారు. తరచూ ఇదే తంతు: ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో పనిచేసే సిబ్బందికి నిర్లక్ష వైఖరి ఎక్కువైందని ఆరోపించారు. వండిన ఆహార పదార్థాలపై ఎటువంటి మూతలు పెట్టడడం లేదన్నారు. దీని కారణంగానే ప్రస్తుతం సాంబారులో బల్లి పడి ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు కారణంగా విద్యార్థులు అస్వస్తతకు గురైతే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమను ప్రశ్నించేవారు లేరనే ధీమాతో హాస్టల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాణ్యత దేవుడెరుగు: హాస్టల్లో ఆహార పదార్థాల నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆహారం రుచిగా ఉండడం లేదని అడిగితే ఛీదరించుకుంటున్నారన్నారు. వర్సిటీ అధికారులు సైతం తమ సమస్యలను వినడం లేదన్నారు. సాంబారుకు, రసానికి తేడా ఉండడం లేదన్నారు. అధికారులు తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏయూ మెయిన్‌గేట్ మూసివేసి ఆందోళనకు దిగారు. వర్సిటీ ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని నినదించారు. హాస్టల్ మెస్‌లను ప్రక్షాళన చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. విద్యార్థులకు అండగా ఎస్ఎఫ్ఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. సంఘీభావం తెలిపి బాసటగా నిలిచారు. ప్రిన్సిపాల్ హామీతో శాంతించిన విద్యార్థులు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.వినోదరావు, వార్డెన్ రమేష్‌బాబు విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యను విన్నారు. సాయంత్రం మెస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళన విరమించి తరగతులకు వెళ్లారు. -
సాంబారు బాగాలేదనందుకు ఆత్మహత్య..
సాక్షి, బనశంకరి: సాంబారు బాగా లేదని భర్త నిందించడంతో భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈఘటన కేపీ.అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే చోళూరుపాళ్యలో శ్రీనివాస్–నాగరత్నమ్మ(45) దంపతులు నివాసముంటున్నారు. కుటుంబ విషయంలో అప్పుడప్పుడు భర్త శ్రీనివాస్ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి భోజనం చేయడానికి కూర్చున్న శ్రీనివాస్ సాంబారు బాగా వండలేదంటూ భార్యను నిందించాడు. దీంతో తీవ్రమనస్ధాపం చెందిన నాగరత్నమ్మ అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం శ్రీనివాస్ నిద్రలేచి గమనించగా భార్య ప్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న దృశ్యం కనిపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. -
విషాదం: సాంబారు పడి బాలుడి మృతి
మెదక్: జిల్లాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు మరుగుతున్న పప్పు చారు మీద పడి బాలుడు మృతి చెందాడు. ఈ హృదయ విచారక ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్ల స్వప్న, సురేష్‌ల ఏకైక కుమారుడు అరవింద్(2) సోమవారం సాయంత్రం ఆడుకుంటూ కట్టెల పొయ్యి మీద మరుగుతున్న సాంబారు పాత్రను తాకాడు. దీంతో పప్పు చారు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని వెంటనే గాంధీ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక కొడుకు మరణించడంతో ఆ తల్లి తండ్రులు రోదనలు ప్రతి ఒక్కరికి కన్నీటిని తెప్పించాయి. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం నోటీసులు ఇచ్చింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ సాంబారు పాత్రలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒకటో తరగతి చదువుతున్న బల్కూరి జయవర్ధన్(5) శుక్రవారం (డిసెంబర్ 23) మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ ఒక్కసారిగా వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తల, ముఖ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయవర్థన్ శనివారం ఉదయం మృతి చెందాడు. -
పొలాల్లో దోశ, సాంబార్ సాగు అట..
• ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు • అందకుండా పోయిన ఇన్పుట్ సబ్సిడీ • ఆందోళనలో రైతులు మద్నూర్: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు.. ‘రైతులు తమ పంట పొలాల్లో దోశ, సాంబార్, హోటల్ పువ్వులు పండించారు. మంచి దిగుబడులు సాధించి లాభాల్లో ఉన్నారు’ అంటూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కారణంగా రైతులకు కరువు సాయం అందకుండా పోయిన వైనమిది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గా, సుల్తాన్‌పేట్ గ్రామాలకు చెందిన రైతులు గతేడాది ఖరీఫ్‌లో సోయాబీన్, పెసర తదితర పంటలు పండించారు. కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాన్ని అంచనా వేసిన అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అందులో ఎక్కడా లేని విధంగా రైతులు సాంబార్, దోశ, హోటల్ పువ్వులు వంటి పంటలు పండించారని, మంచి లాభాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో వారికి ఇన్పుట్ సబ్సిడీ అందకుండా పోయింది. మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గాకు చెందిన రైతు హన్మంత్‌రావ్, పీరాబాయి, రుక్మిణీబాయి, దేవిదాస్, నాగ్నాథ్, అర్జున్ పటేల్, అహ్మద్‌ఖాన్‌లు దోçశ, సాంబార్, హోటల్ పువ్వులు వేశారని నమోదు చేశారు. సుల్తాన్‌పేట్‌కు చెందిన ధన్రాజ్గౌడ్ నాలుగు ఎకరాలలో సోయా వేయగా.. చిక్కుడుకాయ పండించారని, మౌలానా రెండు ఎకరాలలో హోటల్ పువ్వులు పండించారని పేర్కొన్నారు. అధికారుల నివేదిక మేరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాని రైతులు మంగళవారం తహ సీల్ కార్యాలయానికి వచ్చి అధికారులను నిలదీశారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. కొందరు రైతులు సాంబార్, దోశ పండించినట్లు జాబితాలో వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదని, దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. -
సాంబారు పాత్రలో పడిన విద్యార్థి మృతి
కట్టంగూరు: మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన బల్కూరి జయవర్ధన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తల, ముఖ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థిని నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామస్తుల్లో విషాదం అలుముకుంది. -
పొంగనివ్వవు... పొర్లనివ్వవు..!
బేబీ పాలు పొంగుతున్నాయ్ చూడు... అంటూ పెరట్లోంచి అమ్మ కేకలు వినిపిస్తాయి... ఓ ఇల్లాలు తాను తరుగుతున్న కూరగాయలను మధ్యలోనే వదిలేసి స్టవ్ దగ్గరకు పరుగెడుతుంది సాంబార్ పొంగి ఎక్కడ స్టౌ పాడవుతుందోనని! ఇలాంటివి ప్రతి ఇంట్లో తరచూ జరుగుతూనే ఉంటాయి. కాదంటారా? ఇలాంటి సమస్యలకు ఓ కంపెనీ వారు పరిష్కారం కనుగొన్నారు..! అందుకే ఈ ‘బాయిల్ ఓవర్ సేఫ్‌గార్డ్’ను తయారు చేశారు. ఫొటోలో కనిపిస్తున్నదదే. ఈ సేఫ్‌గార్డ్‌ను పూర్తిగా సిలికాన్‌తో రూపొందించారు. దాంతో ఇది 400 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలుగుతుంది. పాలు, నీళ్లు, సాంబార్ లాంటి ద్రవ పదార్థాలు పొంగకుండా, స్టౌ పాడవకుండా చేస్తుందీ సేఫ్‌గార్డ్. ఇకపై స్టౌను పొంగిన ప్రతిసారీ శుభ్రం చేయాల్సిన పని లేదు. దీన్ని మిగతా సమయాల్లో గిన్నెలు, డబ్బాల మీదకు మూతలాగా ఉపయోగించుకోవచ్చు. -
చికెన్ చెట్టినాడు
నల్లా ఇరుక్కు... అంటే నల్లాలో నీళ్ళు వస్తున్నాయని కాదు. సాంబారు వస్తుందని! చాలా బాగుంది. అదే తమిళంలో నల్లా ఇరుక్కు. తమిళ భోజనమంటే, అంతా... సాంబరమే! అదేనండీ! సంబరమే!ఇవాళ డైనింగ్ టేబుల్ని త‘మిళ’ మిళ లాడించండి! ఇంక వెయిటింగ్ దేనికి? పొట్టంతా ఇరుక్కు... ఇరుక్కుగా ఉండేలా లాగించండి. వాంగో... వక్కారుంగో... సాపుడుంగో... (రండి... కూర్చోండి... ఆరగించండి...) అవల్ వడై కావల్సినవి: అటుకులు - 200 గ్రా.లు; ఉల్లిపాయలు - 1అల్లం తరుగు - అర టీ స్పూన్; వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్పచ్చిమిర్చి - 2 (తరగాలి); కొత్తిమీర - చిన్న కట్ట బియ్యప్పిండి - మూడున్నర టేబుల్ స్పూన్లు నూనె - వేయించడానికి తగినంత; ఉప్పు - తగినంత తయారీ: వేడినీళ్లలో అటుకులు వేసి 5 నిమిషాలు నానబెట్టి, వడకట్టాలి. అటుకులను నీళ్లు లేకుండా పిండేసి దీంట్లో ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం, వెల్లుల్లి, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి.బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల్లా చేసుకోవాలి. కడాయిలో నూనె కాగాక తయారుచేసుకున్న అటుకుల వడలను వేసి గోధుమరంగు వచ్చేంతవరకు రెండు వైపులా వేయించాలి. వీటిని టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. మద్రాస్ సాంబార్ కావల్సినవి: మెంతులు - టీ స్పూన్ బెల్లం పొడి - మూడు టేబుల్ స్పూన్లు మునక్కాడలు - 1 (3 అంగుళాల పొడవులో ముక్కలు చేయాలి) టొమాటో - 2 (ముక్కలు చేయాలి) ఉల్లిపాయలు - పెద్దవి 2 (నిలువుగా ముక్కలు చేయాలి); శనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు ధనియాలు - టేబుల్ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; ఆవాలు - అర టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; కందిపప్పు - పావు కేజీ చింతపండు గుజ్జు - 6 టేబుల్ స్పూన్లు ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత నూనె - 4 టేబుల్ స్పూన్లు; మిరపకాయలు - 4పసుపు - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 4వెల్లుల్లి రెబ్బలు - 5 (కచ్చాపచ్చాగా దంచాలి) తయారీ: కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి పప్పు ఉడికించి, పక్కన ఉంచాలి. నెయ్యి వేసి శనగపప్పు, ధనియాలు, మెంతులు వేయించి, పొడి చేసి పక్కనుంచాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించాలి. దీంట్లో పసుపు, మునక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. ఉడికిన కందిపప్పును మెత్తగా చేసి పై మిశ్రమంలో వేసి, కలపాలి. దీంట్లో బెల్లం, తగినన్ని నీళ్లు, ఉప్పు, వేయించి - మసాలా పొడి వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. అన్ని దినుసులు సరిపోయావో లేదో సరి చూసుకొని దించాలి. నెయ్యితో ఈ సాంబారును వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. చికెన్ చెట్టినాడు కావల్సినవి: చింతపండు - నిమకాయ పరిమాణం అంత టొమాటో - 1; ఉప్పు - తగినంత మిరియాలపొడి - టేబుల్ స్పూన్ జీలకర్ర - టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 3; వెల్లుల్లి - 4 పసుపు - చిటికెడు; నూనె - 2 టీ స్పూన్లు ఆవాలు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాలి. టొమాటోను గుజ్జు చేసి తీసిన చింతపండు రసంలో కలపాలి.మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. మరికాస్త నూనె వేసి టొమాటో గుజ్జు కలిపిన చింతపండు రసాన్ని కడాయిలో పోయాలి. పిప్పిని చేత్తోనే వడకట్టుకోవాలి. దీంట్లో మిరియాలు, వెల్లుల్లి కలిపి చేసిన మసాలా మిశ్రమం, ఉప్పు కలిపి మరిగించాలి.మంట తగ్గించి, కొత్తిమీర వేసి రసం మంచి వాసన వచ్చేంతవరకు ఉంచి దించేయాలి. మోర్ కుళంబు కావలసినవి: చికెన్ ముక్కలు - పావుకేజీ సోంపు - ఒకటిన్నర టేబుల్ స్పూన్ అనాసపువ్వు - 5; ఎండుమిర్చి - 5 పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్రపొడి - టీ స్పూన్; కొత్తిమీర - చిన్న కట్ట ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 5 ఉల్లిపాయ తరుగు - 200 గ్రా.లు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు గరం మసాలా - టీ స్పూన్; నూనె - 5 టేబుల్ స్పూన్లు తయారీ కొబ్బరి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి. గిన్నెలో చికెన్ ముక్కలు వేసి, దాంట్లో పచ్చిమిర్చి వేసి నూరిన కొబ్బరి మిశ్రమం, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలిపి అర గంటసేపు నానబెట్టాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో అనాసపువ్వు, ఎండుమిర్చి వేసి, ఆ తర్వాత ఉల్లిపాయ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.బాగా నానిన చికెన్‌లో గరం మసాలా వేసి కలిపి బాగా వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో కలిపి, 15 నిమిషాలు ఉడికించాలి. చికెన్ ఉడుకుతుండగా సరిపడా ఉప్పు వేసి కలపాలి. పూర్తిగా అయ్యాక దించి, వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. రసం కావల్సినవి: చింతపండు - నిమకాయ పరిమాణం అంత టొమాటో - 1; ఉప్పు - తగినంత మిరియాలపొడి - టేబుల్ స్పూన్ జీలకర్ర - టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 3; వెల్లుల్లి - 4 పసుపు - చిటికెడు; నూనె - 2 టీ స్పూన్లు ఆవాలు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాలి.టొమాటోను గుజ్జు చేసి తీసిన చింతపండు రసంలో కలపాలి.మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి.కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.మరికాస్త నూనె వేసి టొమాటో గుజ్జు కలిపిన చింతపండు రసాన్ని కడాయిలో పోయాలి. పిప్పిని చేత్తోనే వడకట్టుకోవాలి. దీంట్లో మిరియాలు, వెల్లుల్లి కలిపి చేసిన మసాలా మిశ్రమం, ఉప్పు కలిపి మరిగించాలి. మంట తగ్గించి, కొత్తిమీర వేసి రసం మంచి వాసన వచ్చేంతవరకు ఉంచి దించేయాలి. మిళగు పొంగల్ కావల్సినవి: బియ్యం - గ్లాసు పెసరపప్పు - అర గ్లాసు మిరియాలు - 2 స్పూన్లు జీలకర్ర - 2 స్పూన్లు నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు జీడిపప్పు - తగినన్ని అల్లం తరుగు - అర టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ తయారీ మూకుడులో బియ్యం, మినపప్పు వేయించుకోవాలి.{పెజర్ కుకర్‌లో 3 కప్పుల నీళ్లు బియ్యం-పప్పు పోసి, పైన వెయిట్ పెట్టి, 5-6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.మిరియాల పొడి, జీలకర్ర పొడి చేసి పక్కన ఉంచాలి.విడిగా మూకుడులో నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర పొడి, జీడిపప్పు, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. కుకర్ మూత తీసి, పోపు మిశ్రమాన్ని కలపాలి. కావాలనుకుంటే మరికాస్త నెయ్యి వేసుకొని, సాంబారుతో వడ్డించాలి. పాల్ పణి యారమ్ కావల్సినవి: కొబ్బరిపాలు - అర లీటరు నెయ్యి - 100 ఎం.ఎల్; పంచదార - 200 గ్రా.లు యాలకుల పొడి - టీ స్పూన్; మినప్పప్పు - 100 గ్రా.లు బియ్యం - 100 గ్రా.లు; నూనె - వేయించడానికి తగినంత జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్ తయారీ గోరువెచ్చని నీటిలో మినప్పప్పు, బియ్యం కడిగి, వేసి 2 గంటల సేపు నానబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. గిన్నెలో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు పలుకులను వేయించాలి. దీంట్లో కొబ్బరి పాలు, పంచదార వేసి బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. కడాయిలో నూనె పోసి కాగిన తర్వాత అందులో మెత్తగా రుబ్బిన మినప్పప్పు - బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన వాటిని తీసి, మరుగుతున్న కొబ్బరి పాలలో వేసి, మంట తీసేయాలి. వేయించిన ఉండలు మెత్తగా అయ్యేంతవరకు ఉంచి, సర్వ్ చేయాలి. -
సాంబార్‌మాశ్చర్యాల సీక్వెల్!
హ్యూమర్ సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట. అలా సాంబారనే పేరు వచ్చింది. మా రాంబాబుగాడు సందు చివర నుంచి వస్తూ కనిపించడం చూసి తప్పించుకు పోదామనే ప్రయత్నంలోనే వాడికి పట్టుబడిపోయాను. ‘‘ఏంట్రా చూసి కూడా చూడనట్లు వెళ్లిపోతున్నావు’’ అడిగాడు నిష్టూరంగా. ‘‘మొన్నంతా ఇడ్లీ గురించి మాట్లా డావు కదా. మళ్లీ ఇప్పుడు సాంబార్ గురించి సీక్వెల్ స్టోరీ ఏదైనా చెబుతావని భయమేసి...’’ అంటూ ఏదో నసుగు తుండగానే మధ్యలో తుంచేశాడు. ‘‘సాంబార్ గొప్ప గురించి వేరే చెప్పే దేముందిరా. సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట. అలా సాంబారనే పేరు వచ్చింది. నాకు మొన్న చేతి ఎముక విరిగితే ప్లేట్లు వేస్తా నన్నారు కదా డాక్టర్లు! ఇడ్లీ, అన్నం తినే టైమ్‌లో దాంట్లోనూ ఎక్స్ట్రా సాంబార్ పోయించుకోవచ్చుకదా అని ఆశపడ్డాను. కానీ ఆ ప్లేట్స్ ఒంటి లోపల ఉంటాయట. సాంబార్ పోసుకోడానికి వీలు కాదని డాక్టర్ చెప్తే కాస్త డిజప్పాయింటయ్యా.’’ ‘‘నువ్వు మరీ టూమచ్రా’’ అన్నాను నవ్వాలో ఏడవాలో అర్థం కాక. ‘‘ఇందులో టూమచ్ ఏముంది! మొదట్లో దాన్ని అందరూ ‘చాంపార్’ అని పిలిచేవారట. వంటింట్లోంచి చాంపార్ వాసన వస్తుంటే, అప్పటి వరకూ పరుషంగా ఉన్నవాళ్లు కూడా సరళంగా మారిపోయేవారట. దీన్ని గుర్తించిన తమిళ సోదరులు సాంబార్ అని పిలవడం మొదలు పెట్టారట.’’ ‘‘నువ్వు కనిపించగానే అనుకున్నా నేను సూప్‌లో పడిపోయానని’’ అన్నాను బిక్కమొగమేసి. ‘‘నువ్వు చెప్పే ‘సూప్’ కూడా మన సంస్కృత పదమైన సూపమ్ నుంచి వచ్చింది. ‘భోజనం దేహి రాజేంద్రా... ఘృత సూప సమన్వితం’ అంటూ భోజ రాజు దగ్గర భోజనంతో పాటు పప్పును అడిగి తీసుకునేవారట పండితులు. మన సూప మహత్యాన్ని కనిపెట్టిన మ్లేచ్ఛులు మన పప్పుచారు ఫార్ములాను దొంగి లించి, దాన్ని కాస్త మార్చి సూప్ అని పేరు పెట్టుకున్నారు తెలుసా? అన్నట్టు సాంబార్ కుతకుత ఉడికినట్లుగానే పౌరు లందరిలోనూ నెత్తురు మండించి, శక్తులు నిండేలా చేయాలనే సోషలిస్టు భావనతోనే పప్పుచారు తయారు చేశారు.’’ ‘‘పప్పుచారుకూ సోషలిస్టు భావాలకూ సంబంధమేముందిరా?’’ ‘‘ఇప్పుడున్న ప్రభుత్వాల అసమర్థత వల్ల పప్పుల ధర భవిష్యత్తులో బాగా పెరుగుతుందని బ్రహ్మంగారు కాల జ్ఞానంలో ఎప్పుడో చెప్పేశారు. దాంతో పప్పును అందరికీ అందుబాటులోకి తేవా లనే సోషలిస్టు భావనతో పప్పుచారును కనిపెట్టారు మనవాళ్లు. అలా పప్పుకు అడ్వాన్స్డ్ రూపమైన మన సాంబారు ఆవిర్భవించింది.’’ ‘‘పప్పుకు అడ్వాన్స్డ్ రూపమా సాంబారు!?’’ అయోమయంగా అడిగా. ‘‘కాదా మరి. కర్రీ పాయింట్లలో కాస్త ఆలస్యంగా పప్పు కోసం అడిగావనుకో. దొరకదు. కానీ సాంబారు మాత్రం లేటైనా దొరుకుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్‌లో పప్పుకంటే సాంబారు ఎక్కువ ఫిట్టెస్టు అని తెలిసిపోయింది కదా? పరిణామ క్రమంలో పప్పు తర్వాత వచ్చినా సాంబారు సర్వైవల్ విషయంలో మరింత సమర్థమైనదని తేలిపోయింది. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న సూక్తిని గుర్తుం చుకున్నారు డార్విన్. అందుకే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్టు అన్న విషయాన్ని తన కిచెన్లోనే ముందుగా కనిపెట్టినా... ఆరిజిన్ ఆఫ్ పప్పూస్ అండ్ పల్సెస్ నుంచే ‘ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్’ అన్న విషయాన్ని ఆ తర్వాత విశ్వవ్యాప్తం చేశాడట’’ అన్నాడు. ‘‘కొయ్... కొయ్’’ అన్నాను. ‘‘పప్పును కొయ్యడం కుదరదు. పప్పు గింజను ఎంతసేపు చప్పరించినా దాని చవి తెలియదు. అదే పంటి కింద నలగ్గొట్టావనుకో, దాని టేస్టు పెరుగుతుంది. రుచి తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న మన పూర్వీ కులు పప్పును నలగ్గొట్టడానికి పప్పుగుత్తిని కనిపెట్టారు. అలా పప్పు నుంచి పప్పుచారును ఆవిర్భవింప జేశారు. ఆ తర్వాత డార్విను, ఇతర పాశ్చాత్యులు ఆ పరిజ్ఞానాన్ని పరిగ్రహించి మరింత పరిపక్వం చేశారంతే’’ అన్నాడు పక్వం అనే మాటను ఒత్తిపలుకుతూ. ‘‘నా పప్పులు ఉడికాయ్. ఇక నన్ను విడిచిపెట్టు’’ అంటూ ఇల్లు చేరీ చేరగానే తలుపులు బార్లా తెరచి, సాంబార్లా జారిపోయాను. - యాసీన్ -
పప్పుచారు.. ఉప్పు చేప.. ఓ మంత్రి!
గోదావరి జిల్లాల్లో పప్పుచారు - ఉప్పుచేప కాంబినేషన్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ ఖర్చులు భరించలేని వాళ్లు, వ్యవసాయ కూలిపనులకు వెళ్లేవాళ్లు కాస్త రుచికరమైన ఆహారం తీసుకోవాలంటే.. ఎక్కువగా ఈ కాంబినేషన్నే ఇష్టపడుతుంటారు. అందరికీ అందుబాటులో ఉండే మాంసాహారం కావడంతో అన్ని తరగతుల వాళ్లు కూడా దీన్ని ఇష్టపడుతుంటారు. ఉప్పు చేపలు నిల్వ ఉండే పదార్థం కావడంతో ఏడాది పొడవునా ఇంట్లో ఉంచుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుచారు చేసుకుని దాంట్లోకి దీన్ని నంజుకుని తింటారు. స్వతహాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చిన సందర్భంగా తొలిసారి ఈ పప్పు చారు - ఉప్పు చేప కాంబినేషన్ రుచి చూశారు. అద్భుతః అంటూ ఇష్టపడ్డారు. మరికొంత కావాలంటూ అడిగి తీసుకుని మరీ తిన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మల్యే అనంతలక్ష్మి, రూరల్ ఎంపీపీ పుల్లా సుధాచంద.. వీళ్లంతా వ్యవసాయ కూలీలతో కలిసి కళ్లంలోకి దిగి నాట్లు వేశారు. కలెక్టర్ సహా అందరికీ మంత్రి రఘునాథ రెడ్డే తన చేత్తో నారు అందించారు. ఆ తర్వాత కూలీలు తెచ్చుకున్న అల్పాహారాన్ని మంత్రి తీసుకుని తాను తింటూ వాళ్లకు కూడా తినిపించారు. తలపాగా చుట్టుకుని కాసేపు ఎడ్లబండి నడిపించారు. తర్వాత కూలీలతో మాట్లాడారు.