
బెంగళూరు: ఇటీవల కాలంలో కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు చిన్న చిన్న విషయాలకు హత్యలు చేస్తున్నారు. తాజాగా సాంబారు రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లాలోని డోడ్‌మణెలో నివాసముంటున్న నారయణ హస్లర్ అనే యువకుడు మద్యం తాగి ఇంటికి వెళ్లాడు.
ఆకలిగా ఉందని భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలానే తన తల్లి ఆహారాన్ని వడ్డించింది. అయితే ఆ రోజు ఇంట్లో వండిన సాంబారు అతనికి నచ్చలేదు. దీంతో కర్రీ రుచిగా చేయలేదని తల్లి, సోదరితో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న తుపాకీతో కిరాతకంగా వారిద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతని తల్లి, సోదరి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: అడల్ట్ కంటెంట్ వ్యసనం.. ఆన్‌లైన్ ప్రియురాలు.. కోరికల కోసం కోటి స్వాహా
Comments
Please login to add a commentAdd a comment