shoots
-
చండీగఢ్ కోర్టులో కలకలం.. ఐఆర్ఎస్ అల్లుడిపై ఐపీఎస్ మామ కాల్పులు
చండీగఢ్: చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం రేగింది. పెళ్లి వివాదంపై రెండు బృందాలు ఫ్యామిలీ కోర్టుకు రాగా, అదే సమయంలో పంజాబ్ పోలీస్ మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడు హర్‌ప్రీత్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మృతిచెందాడు. మల్వీందర్ అల్లుడు వ్యవసాయ శాఖలో ఐఆర్ఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు ప్రారంభించారు.హర్‌ప్రీత్ సింగ్‌కు అతని భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. విచారణ సందర్భంగా అతని బావ, సస్పెండైన ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఈ సమయంలో నిందితుడైన మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. కోర్టులో న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్‌ప్రీత్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. -
ట్రంప్‌పై కాల్పులు జరిపింది అతడే.. ఎఫ్‌బీఐ ప్రకటన!
నూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.అయితే.. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ట్రంప్ హత్యాయత్నంపై అతని అసలు ఉద్దేశ్యం ఏంటనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో థామస్ మాథ్యూ క్రూక్స్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఇక.. థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ, అతడు 2021లో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్ టర్న్‌ఔట్ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీవ్వకుండా భద్రత పెంచారు. మరోవైపు.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దర్యాప్తుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చునని తెలిపింది. ఈ కాల్పులు ఘటనకు సంబంధిచి ఏదైనా సమాచారం తెలిస్తే.. తమకు చెప్పాలని ర్యాలీకి హాజరైన ప్రజలను ఎఫ్‌బీఐ కోరింది. -
భార్య మృతి.. ఐసీయూలో ఐపీఎస్ భర్త ఆత్మహత్య
భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటుంటారు. పెళ్లితో ముడిపడిన జంట తాము జీవితాంతం కలిసుంటామని ప్రమాణం చేస్తారు. ఎన్ని కష్టనష్టాలొచ్చినా కలిసి నడుస్తారు. పరస్పరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్న దంపతుల్లో విధివశాత్తూ ఒకరు మరణిస్తే, మరొకరు ఆ ఎడబాటును తట్టుకోలేక విలవిలలాడిపోతుంటారు.అసోం హోమ్‌శాఖ సెక్రటరీ శిలాదిత్య చెతియా(44) తన భార్య మరణంతో తీవ్రంగా కలతచెంది, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త అసోంలోని అందరినీ షాక్‌నకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో తన భార్య మృతదేహం ముందు శిలాదిత్య చెతియా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మృతిచెందిన కొద్ది నిమిషాలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అతని భార్య కొంతకాలంగా అదే ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్సపొందుతున్నారు. శిలాదిత్య చెతియా రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్న ఐపీఎస్ అధికారి. రాష్ట్ర హోమ్‌శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేప్టటడానికి ముందు ఆయన టిన్సుకియా, సోనిత్పూర్ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా, అసోం పోలీసు నాల్గవ బెటాలియన్‌కు కమాండెంట్‌గా పనిచేశారు. ఆయన భార్య అగమోని బోర్బరువా(40) నామ్కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఈ ఘటన గురించి నామ్కేర్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ బారువా మాట్లాడుతూ ‘బుల్లెట్ శబ్దం వినగానే మేమంతా పరిగెత్తుకుంటూ ఐసీయూలోని వెళ్లాం. అక్కడ శిలాదిత్య చెతియా తన భార్య మృతదేహం పక్కనే రక్తపు మడుగులో పడివున్నారు. మేము అతని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని’ అన్నారు. కాగా చెతియా మృతిపై అసోం డీజీపీ జీపీ సింగ్ విచారం వ్యక్తం చేశారు. -
‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’
ప్రేమ పేరుతో ఆకతాయిల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయి ఒప్పుకోలేదని, దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించి, తనను దూరం పెట్టిందన్న కక్షతో యువతి ఇంట్లో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన షాజపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. 25 ఏళ్ల సుభాష్ ఖరాడి దేవాస్ నగరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో శివాని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి యువతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో అతడిని ఆమె దూరం పెట్టింది. అప్పటి నుంచి శివాని, ఆమె కుటుంబ సభ్యులపై సుభాష్ కక్ష పెంచుకున్నాడు. చదవండి: అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు ఈ క్రమంలో ఆదివారం రాత్రి మలిఖేడి గ్రామంలోని యువతి తండ్రి జాకీర్ ఖాన్ ఇంట్లోకి కంట్రీమేడ్ పిస్టోల్‌తో చొరబడ్డాడు. ఇంట్లో శివానీ ,ఆమె తండ్రి, సోదరుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో తండ్రి జాకీర్ అక్కడికక్కడే మరణించగా.. యువతి, ఆమె సోదరుడు ఇండోర్ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. అయితే శివాని పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాల్పుల అనంతరం ఖరాడీ తన ఫేస్బుక్లో యువతితో కలిసి దిగిన ఫోటోతో పోస్టు పెట్టారు. ‘ ప్రేమ పేరుతో నాకు ద్రోహం చేసింది. అందుకే ఆమెను చంపాను. జీవితంలో తనకు మర్చిపోలేని బాధను ఇచ్చాను’ అని పోస్టులో పేర్కొన్నాడు. అయితే కొన్ని గంటలకే అతడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. కదులుతున్న రైలు నుంచి కిందకు దూకండంతో అతడు మరణించి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా పోలీసు చీఫ్ యశ్పాల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. -
ఉద్యోగం నుంచి తీసేశారని..బీపీఓ కంపెనీ హెడ్‌పై కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్ సింగ్ అనే వ్యక్తి గేట్రర్ నోయిడా సెక్టార్2లో ఎన్సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్‌లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్ సద్రూల్ ఇస్లాం అనూప్‌ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. ఐతే గత నెల అనూప్ మేనేజర్ సద్రూల్ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్ అంగీకరించ లేదు. దీంతో అనూప్ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్ దేశీయ తుపాకీతో మేనేజర్ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్ సద్రూల్ని హుటాహుటినా కైలాష్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ
శాన్ ఫ్రాన్సిస్కో: 74 ఏళ్ల భారత సంతతి వ్యక్తి తన కోడలిని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి సితాల్ సింగ్ దోసాంజ్గా పోలీసులు గుర్తించారు. సౌత్శాన్ జోస్పార్కింగ్లోని వాల్‌మార్ట్ వద్ద ఆమె శవమై కనిపించిందని తెలిపారు. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసంజ్గా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు సితాల్ సింగ్ విచారణలో ఆమె తన కొడుకు నుంచి విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తుండటంతో కోపంతో షూట్ చేసి చంపేశానని చెప్పాడు. అంతేగాదు భాధితురాలు ఫోన్లో తన మామా తనను చంపడం కోసం వెతుకుతున్నాడంటూ భయపడినట్లు ఆమె మేనమామ పోలీసులకు చెప్పాడు. ఆమె తన ఆఫీస్‌లో విరామ సమయంలో బయటకు వచ్చి తనకు కాల్ చేసిందని, అదే సమయంలో తన మామా తన కారు వద్దకు వస్తున్నాడంటూ భయపడుతూ చెప్పిందని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్ డిస్ కనక్డ్ అయ్యిందని వివరించాడు. సుమారు ఐదు గంటల తర్వాత బాధితురాలి సహోద్యోగురాలు ఆమె తన కారులోనే చనిపోయి ఉన్నట్లు గుర్తించిందని తెలిపాడు. గురుప్రీత్ ఆమె భర్త, మామ గారితో కలిసి ఫ్రెస్నోలో ఉంటోందని బాధితురాలి మేనమామ చెప్పాడు. ఐతే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. ఈ మేరకు నిందితుడు సితాల్ సింగ్‌ని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఇంటి నుంచి క్యాలిబర్ బెరెట్టా పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసకున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలిని చివరిసారిగా ఆమె డ్రైవ్ చేస్తుంటే కలిసింది సితాల్ సింగ్ అని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని శాన్‌జోస్ జైలుకి తరలించినట్లు తెలిపారు. అతనిని నవంబర్14న కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. (చదవండి: రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు) -
అత్తారింటికి వెళ్లి కాల్పులు.. ఘరానా భర్త హల్చల్
యశవంతపుర: గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రావాలని ఒత్తిడి చేయడానికి కాల్పులు జరిపాడో ఘరానా భర్త. బెళగావి జిళ్లా అథణి తాలూకాలో ఈ సంఘటన జరిగింది. విజయపుర జిల్లా సింధగికి చెందిన శివానంద కాలేబాగ సోమవారం సాయంత్రం భార్య ప్రీతి పుట్టినిల్లు అయిన అథణికి వెళ్లాడు. ప్రీతితో అతనికి నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా మూడేళ్ల చిన్నారి ఉంది. భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సంసారంలో విభేదాలు ఏర్పడడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం శివానంద అత్తవారింటికి వెళ్లి ప్రీతితో గొడవపడ్డాడు. తన వెంట రావాలని కోరగా ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేక శివానంద తనవద్దనున్న రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. నిన్ను చంపి నేను చచ్చిపోతానని వీరంగం సృష్టించాడు. దీంతో ప్రీతి, ఆమె తల్లిదండ్రులు అథణి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతన్ని అరెస్ట్ చేసి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని, విజయపుర జిల్లా వరకు మాత్రమే అనుమతి ఉందని గుర్తించారు. (చదవండి: అమ్మ కావాలి.. కన్నీరు పెట్టించిన విషాద ఘటన..) -
తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్
US Boy Playing With His Father Gun: ఎనిమిదేళ్ల బాలుడు తండ్రి తుపాకితో ఆడుకుంటూ...అనుకోకుండా జరిపిన కాల్పుల్లో పసికందు మృతి చెందింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....45 ఏళ్ల రోడెరిక్ రాండాల్ తుపాకిని కలిగి ఉండకుండా నిషేధింపబడిన నేరచరిత్ర కలిగిన వ్యక్తి. ఒక రోజు అతను తన కొడుకుతో కలిసి తన స్నేహితురాలిని కలిసేందుకు మోటెల్ ప్రాంతానికి వెళ్లాడు. అతడి స్నేహితురాలు తన ఇద్దరు కలలు, ఒక ఏడాది కుమార్తెతో అక్కడకి వచ్చింది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్లంతా కలుసుకుని కాసేపు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏదో పని పై రాండల్ బయటకి వెళ్లాడు. ఇంతలో కొడుకు అలమరాలో దాచిన తుపాకీని తీసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలికల తల్లి నిద్రిస్తుంది. అంతే ఆ పిల్లాడు ఆ గన్‌తో ఆడుకుంటూ..ఆడుకుంటూ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అంతే అక్కడే ఉన్న పసికందు శరీరంలోకి తూట దూసుకుపోయింది. అక్కడికక్కడే ఆ పసికందు మృతి చెందింది. ఐతే ఇలాంటి దారుణ ఘటనలు యూఎస్‌లో ఏటా కోకొల్లలు. పెద్దలు దాచిన గన్ని పిల్లలు తెలుసుకుని ఆడుకుంటూ తమను కాల్చుకోవడం లేదా తమ తోటివారిని కాల్చడం జరుగుతోంది. ఇలా ఏటా మైనర్లు హత్యలు చేయడం...తెలిసి తెలియని వయసులో జైలు పాలుకావడం జరుగుతోందని, ప్రతి ఏడాది సగటున ఇలాంటి ఘటనలల్లో 350 మందికి పైగా మృతి చెందుతున్నారని యూఎస్ పోలీసులు చెబుతున్నారు. సదరు వ్యక్తి పై నిర్లక్ష్యం, చట్ట విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం తదితర ఆరోపణలతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇటీవలే యూఎస్ అత్యున్నత న్యాయస్థానం న్యూయార్క్ పౌరులు తమ వెంట గన్లు తీసుకువెళ్లొచ్చు అంటూ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు దేశ అధ్యక్షుడు జోబైడెన్ సైతం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైగా ఇది రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞాననికి విరుద్ధంగా ఉందంటూ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పులు ఇవ్వడం అత్యంత బాధకరం. (చదవండి: శిథిలాల నడుమ అయిన వాళ్ల కోసం.. గుండెల్ని పిండేస్తున్న ఫొటో) -
సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు
బెంగళూరు: ఇటీవల కాలంలో కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు చిన్న చిన్న విషయాలకు హత్యలు చేస్తున్నారు. తాజాగా సాంబారు రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లాలోని డోడ్‌మణెలో నివాసముంటున్న నారయణ హస్లర్ అనే యువకుడు మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఆకలిగా ఉందని భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలానే తన తల్లి ఆహారాన్ని వడ్డించింది. అయితే ఆ రోజు ఇంట్లో వండిన సాంబారు అతనికి నచ్చలేదు. దీంతో కర్రీ రుచిగా చేయలేదని తల్లి, సోదరితో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న తుపాకీతో కిరాతకంగా వారిద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతని తల్లి, సోదరి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: అడల్ట్ కంటెంట్ వ్యసనం.. ఆన్లైన్ ప్రియురాలు.. కోరికల కోసం కోటి స్వాహా -
దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు
కెలమంగలం(కర్ణాటక): సంతోషంగా ఉగాది పండుగను జరుపుకొనేందుకు పుట్టింటికి వెళ్లిన కూతురు తల్లిదండ్రుల గొడవలో చిక్కి తూటాలకు బలైంది. ఈ దుర్ఘటన తళి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకొంది. డెంకణీకోట తాలూకా అంచెట్టి సమీపంలోని కరడికల్ గ్రామానికి చెందిన అరుణాచలం కూతురు వెంకటలక్ష్మి (20)కి కోలారు జిల్లా మాలూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్‌తో నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. పుట్టింటిలో ఉగాదిని జరుపుకొనేందుకు గత రెండు రోజుల క్రితం కరడికల్ గ్రామానికి వచ్చింది. మద్యం మత్తులో వీరంగం.. బుధవారం రాత్రి అతిగా మద్యం తాగి అరుణాచలం భార్యతో గొడవ పడ్డాడు. అరుణాచలం తీవ్ర ఆవేశం చెంది ఇంట్లో దాచిన నాటు తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు. ఈ సమయంలో అడ్డుకొనేందుకెళ్లిన కూతురు వెంకటలక్ష్మిపై తుపాకీ గుండు పేలింది. వెంకటలక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తండ్రి తుపాకీ పడేసి పరారయ్యాడు. డెంకణీకోట డీఎస్పీ సంగీత, తళి పోలీసులు చేరుకొని శవాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న అరుణాచలం కోసం గాలిస్తున్నారు. చదవండి: యూట్యూబ్‌లో పూజలు చూసి బిడ్డను బలిచ్చిన తల్లి జుత్తాడ ఫ్యామిలీ మర్డర్: అదును చూసి ఆరుగురిని చంపాడు -
ఐటీ సిటీలో అర్ధరాత్రి కలకలం
మంగళవారం అర్ధరాత్రి... బెంగళూరు రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధి, ముందు కారులో రౌడీలు, వెనుక జీప్‌లో పోలీసుల చేజింగ్. ఎస్ఐ గురిపెట్టి తుపాకీ పేల్చాడు, కారు టైర్ పేలిపోయి ఆగిపోయింది. రౌడీలు– పోలీసుల మధ్య బాహాబాహీ. కత్తుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు. ఎస్ఐ మళ్లీ తుపాకీకి పనిచెప్పాడు. దుండగులకు తీవ్ర గాయాలు. సినీఫక్కీలో చేజింగ్– గోలీబార్ ఘటన అలా ముగిసింది. సాక్షి, యశవంతపుర: ఇంటి ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసం చేసిన కేసులో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పాత నేరస్తులు రఫిక్, సుధాకర్‌ను అరెస్టు చేశారు. కురబరహళ్లి, మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల ఇంటీ ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసంచేసి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఇందులో పాత నిందితులు రఫిక్, సుధాకర్‌లు ఉన్నట్లు గుర్తించారు. దుండగుల అరెస్టుకు కార్యాచరణ నిందితులను అరెస్టు చేయాలని ఉత్తర విభాగం డీసీపీ పలువురు ఎస్ఐలతో ఒక బృందాన్ని నియమించారు. మంగళవారం అర్ధరాత్రి నిందితులు రఫిక్, సుధాకర్‌ను మారుతి జెన్ కారులో తిరుగుతుండగా అనుమానం వచ్చి ఆపారు. వారు తప్పించుకోవటానికి కారును వేగంగా నడుపుతూ దూసుకెళ్లారు. దీనితో ఎస్ఐలు లోహిత్, మహేంద్రకుమార్, నిరంజన్ కుమార్‌లు సిబ్బందితో వెంబడించారు. వారు కారును ఆపకపోవడంతో రాజగోపాలనగర పోలీసు స్టేషన్ సరిహద్దులోని కరీంసాబ్ లేఔట్ వద్ద ఎస్ఐ లోహిత్ రివాల్వర్‌తో కాల్చగా నిందితుల కారు టైర్ పేలిపోయి వాహనం అక్కడే నిలిచిపోయింది. నిందితులు కారు దిగి పారిపోతుంటే పోలీసు సిబ్బంది పట్టుకోవడానికి యత్నించారు. దీంతో దుండగులు కత్తులతో దాడి చేయగా కానిస్టేబుల్ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ హనుమంతరాజు గాయపడ్డారు. ఎస్ఐ లోహిత్ అత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరపగా నిందితుల ఇద్దరి కాళ్లకు గాయాలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీనితో రఫిక్, సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఘరానా నేరగాళ్లే ఈ ఇద్దరూ జూన్ 17న రాత్రి ఇళ్ల ముందు నిలిపిన 14 వాహనాలు కారళ్లాటోల అద్దాలను ధ్వంసం చేసి మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి పారిపోయారు. అదే రాత్రి రాజాజీ నగరలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి సెల్‌ఫోన్, బైక్‌ను లాక్కెళ్లిన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. గతంలో కూడా జేసీ నగరలో 17 వాహనాల అద్దాలను ధ్వంసం చేసినట్లు విచారణలో తెలింది. పాత నిందితుడు సుధాకర్ 2016లో శ్రీరామపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. అప్పటినుంచి పోలీసులకు కళ్లకప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. వీటితో పాటు మొత్తం 18 కేసులు ఇతనిపై ఉన్నాయి. కమలనగరకు చెందిన రౌడీ రఫీక్‌పై బసవేశ్వరనగర పోలీసుస్టేషన్లో మూడు హత్య కేసులు, రెండు దోపిడీ, ఒక దాడికేసు, కామాక్షిపాళ్య పోలీసుస్టేషన్లో ఒక దొపిడీ, తావరెకెరె పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకేసు, తమిళనాడులో అపహరణ కేసులున్నాయి. -
రాజమండ్రిలో కాల్పుల కలకలం
-
జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం
-
అనుకోకుండా అక్కపై కాల్పులు
భీండ్: మధ్యప్రదేశ్ భీండ్ జిల్లా లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ తమ్ముడి చేతిలో అక్కప్రాణాలు కోల్పోయిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తుపాకీతో ఆడుకుంటున్న ఓ మైనర్ బాలుడు అంజు (8) చేతిలో మరో మైనర్ బాలిక నిధి(10) ప్రాణాలు విడిచింది. తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ ఘటన కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది. భిండ్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పి) రాజేంద్ర వర్మ అందించిన సమాచారం ప్రకారం బాధిత బాలిక తండ్రి దినేష్ కుమార్ ఓఝా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్నారు. తండ్రికిచెందిన లెసెన్స్డ్ తుపాకీతో పిల్లలిద్దరూ తుపాకీతో మంచంమీద ఆడుకుంటుండగా, పొరపాటున అంజు ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో తీవ్రమైన బుల్లెట్ గాయంతో నిధి అక్కడికక్కడే చనిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోవడం కుటుంబం కన్నీని సంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. -
‘రంగస్థలం’ కోసం కష్టపడుతున్న రామ్‌చరణ్
మెగా హీరో రామ్ చరణ్ తాజా చిత్రం ‘రంగస్థలం’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రొమాంటిక్-డ్రామా కోసం ఈ యంగ్ హీరో చాలా కష్టపడుతున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాడని చిత్ర యూనిట్ వర్గాల కథనం. చాలా కష్టతరమైన షెడ్యూల్ కోసం రోజంతా పనిచేస్తున్నాడని చెబుతున్నారు. సూర్యోదయానికి ముందు షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెడితే సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఇవి ముగిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో షూటింగ్ కారణంగా చరణ్ గాయపడుతున్నప్పటికీ, అలాంటివేమీ లెక్కచేయకుండా రామ్ చరణ షూటింగ్ కార్య క్రమాలను కొనసాగిస్తున్నారంటూ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. గోదావరి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ చాలా సంతృప్తికరంగా జరుగుతోందని యూనిట్ ప్రకటించింది. ఈ నెలాఖరువరకు ఈ షూటింగ్ కొనసాగుతుందనీ, అనంతరం హైదరాబాద్‌లో నిర్మించిన గ్రాండ్ సెట్లో ఉంటుందని తెలిపింది. ఈ సెట్నిర్వహణ బాధ్యతలను ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ చూస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం వానలు జోరుగా కురుస్తుండడంతో వాటిని కూడా ఉపయోగించుకుంటున్నారట డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాలో వర్షం సీన్లు చాలా కీలకం కావడంతో వానల్లో కూడా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మరోవైపు లుంగీ కట్టుకొని న్యూలుక్లో చెర్రీని చూసి అక్కడి అభిమానులు మురిసిపోతున్నారట. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారని భావిస్తున్నారు. కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి , జగపతి బాబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
పిజ్జా షాపులో కస్టమర్ సాహసం
లెవిట్ టౌన్: అమెరికాలోని ఓ పిజ్జా షాపులో కాల్పులు జరిగాయి. దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు దొంగలపై అదే సమయంలో అక్కడికొచ్చిన ఓ కస్టమర్ తన తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో ఓ దొంగ ప్రాణాలు కోల్పోగా మరో దొంగ గాయపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఫిలడెల్పియాకు సమీపంలోని లెవిట్ టౌన్ లో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు పిజ్జా షాపులో పనిచేసే వాళ్లు మాత్రమే ఉన్నారు. కాల్పులు జరిపిన కస్టమర్ వద్ద ఉన్న తుపాకీ రిజిస్ట్రేషన్ ఉన్నదేనని, అయితే అతడు అనుమతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి, దొంగల వివరాలు కూడా వెల్లడించలేదు. -
కుక్కని గన్‌తో కాల్చి చంపాడు
-
భార్యతో పాటూ ఐదుగురిని కాల్చి చంపాడు
సెర్బియా: సెర్బియాలో ఓ వ్యక్తి తన భార్యతో పాటూ ఐదుగురిని కాల్చిచంపాడు. ఈ సంఘటన రెంజనిన్ నగరంలోరి మకిజటో కెఫేలో శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మకిజటో కెఫేకి వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితులతో ఉండటం చూశాడు. వెంటనే తిరిగి ఇంటికి వెళ్లి తన వెంట గన్ను తీసుకు వచ్చాడు. ఓ రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపి తొలుత తన భార్యను కాల్చిచంపాడు. అనంతరం మరో మహిళపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా పక్కన ఉన్న వారి పై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో కేఫేలో అంతా గందరగోళం నెలకొందని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదు. కేఫేలోని సభ్యులు ఘటన అనంతరం సదరు వ్యక్తిని పట్టుకొని గన్ను లాక్కున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లైసెన్స్ లేని గన్ని అక్రమంగా వాడాడని పోలీసులు తెలిపారు. -
సమాజం కోసమే...వేట
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ బీహార్ రాష్ట్రంలో మరో వేట ప్రారంభించారు. అక్కడి మకామా ప్రాంతంలో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నీల్గాయిల వేట ప్రారంభించారు. ఈ విషయంపై గురువారం కేంద్ర మంత్రులు మేనకాగాంధీ, ప్రకాష్ జవదేకర్ మధ్య మాటల యుద్ధం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు..మకామా ప్రాంతంలోని అడవుల నుంచి బయటకు వచ్చి సమీపంలోని పొలాలపై నీల్గాయిలు దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. వాటిని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వేటగాడు షఫత్ అలీ ఖాన్‌ను పిలిచింది. దీంతో ఆయన ఆదివారం అక్కడికి చేరుకుని రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో చర్చించారు. పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత నీల్గాయిలను అవసరమైన సంఖ్యలో కాల్చిచంపడమే పరిష్కారమని నిర్ణయించారు. దీనికి బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సైతం అనుమతి తెలపడంతో అలీ ఖాన్ తన ఆపరేషన్ ప్రారంభించారు. మకామా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కాపుకాసిన ఆయన నాలుగు రోజుల్లో 300 నీల్గాయిలను చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న జంతు ప్రేమికురాలు మేనకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన సహచర మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను ‘వేట’పై తీవ్రంగా విమర్శించారు. దీనికి జవదేకర్ సైతం ఘాటుగా స్పందించడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మేనకాగాంధీ సదరు జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన షూటర్ కుటుంబం మూడు తరాలుగా జంతువుల్ని వేటాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ‘సాక్షి’ ఫోన్ ద్వారా షఫత్ అలీ ఖాన్‌ను సంప్రదించగా... ‘మూడు తరాల నుంచి మా కుటుంబం వేటాడుతోంది సమాజం కోసమే. మ్యానీటర్స్గా మారిన పులులు, చిరుతలతో పాటు అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న ఏనుగుల్ని మాత్రమే చంపాం. ప్రతి అంకంలోనూ ఆయా ప్రభుత్వాలు అధికారికంగా కోరి, అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పని చేస్తున్నాం. పట్టుకోవడం, మత్తు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలోనే ఆఖరి అవకాశంగా ఆయా జంతువుల్ని చంపాల్సి వస్తోంది. మకామాలో నిరుపేద రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలోనే నీల్గాయి(బ్లూబుల్స్)లను వేటాడాల్సి వస్తోంది. ఏసీ గదుల్లో కూర్చునే వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియక, అర్థం చేసుకోలేక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని అన్నారు. -
ఆపరేషన్ చేస్తుండగా నగ్నంగా చూశాడని..
రియాద్: సౌదీలో దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడిన డాక్టర్ పై కాల్పులు జరిపాడో వ్యక్తి. దైవంతో సమానంగా చూసే వైద్య వృత్తిలో కూడా చెడునే వెతుక్కున్నాడు ఆ వ్యక్తి. వివరాలు.. ఓ మహిళ పురిటి నొప్పులతో సౌదీలోని రియాద్‌లో కింగ్ ఫహాద్ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేయాల్సిందిగా ఆమె భర్తతో డాక్టర్లు తెలిపారు. మహిళా డాక్టర్లతోనే ఆపరేషన్ చేపించాలని ఆ వ్యక్తి కోరాడు. అయితే అందుబాటులో మహిళా డాక్టర్లు లేకపోవడం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావడంతో డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్ ఆ మహిళకు ఆపరేషన్ చేశాడు. అయితే ఆపరేషన్ ఓ పురుష డాక్టర్ చేయడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యను నగ్నంగా మరో పురుషుడు చూశాడని ఆగ్రహావేశాలకు గురయ్యాడు. ఆసుపత్రి యాజమాన్యం పై కూడా తన కోపాన్ని వెళ్లగక్కాడు. అంతేకాకుండా ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ పై కసిని పెంచుకున్నాడు. ఆపరేషన్ అనంతరం డాక్టర్‌తో సరదాగా మాట్లాడినట్టు నటించాడు. తల్లి, బిడ్డలను ఎలాంటి హాని జరగకుండా క్షేమంగా ఉండేలా ఆపరేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి కలవాలని కోరాడు. ఆసుపత్రి ప్రాంగణంలో కలవడానికి వచ్చిన డాక్టర్ పై తనతోపాటు తీసుకువచ్చిన గన్ తో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. సౌదీ పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. కాగా కాల్పుల్లో గాయపడిన డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతనికి ఎంలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. -
ఐ ఫోన్ ను గన్‌తో పేల్చేసింది!
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని జీవితాన్ని ఊహించలేం. ఫోన్ వాడకం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల చేతుల్లో కూడ ఐఫోన్లు, యాండ్రాయిడ్స్ కనిపించడం సాధారణంగా మారిపోయింది. అంతేకాదు తల్లిదండ్రులతో ఏమాత్రం సంబంధం లేకుండా పిల్లలు ఫోన్లకే అతుక్కుపోతున్న జాడ్యం రాను రాను పెరిగిపోతోంది. ఇటువంటి మితిమీరిన వినియోగం ఒక్కోసారి పిల్లలపట్ల తల్లిదండ్రులకు ఏహ్యభావాన్ని, విసుగును, చికాకును కూడ తెప్పిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న ఓ వీడియో అందుకు తార్కాణంగా నిలుస్తోంది. యాండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో లేని కాలంలో కుటుంబ సభ్యుల మధ్యా... తల్లిదండ్రులు, పిల్లల మధ్యా కాస్తో కూస్తో ఉండే సంబంధాలు.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పూర్తిగా తగ్గిపోతున్నాయి. అదే నేపథ్యంలో తన పిల్లలు విసుగు వచ్చేంత ఎక్కువగా ఐ ఫోన్ వాడటం, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోవడం చూసి విసుగు చెందిన ఓ తల్లి భరించలేకపోయింది. పిలిచినా పలక్కుండా ఉండే మితిమీరిన ఫోన్ వాడకం ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే తన పిల్లలు వాడుతున్న ఐ ఫోన్ ను గన్ తో పేల్చేసింది. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతూ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాల మోజులో తన మాటలను కూడ పట్టించుకోని పిల్లల ప్రవర్తనకు ఆ తల్లి విసుగు చెందిపోయింది. అందుకే ఓ చెట్టు కొమ్మపై ఐ ఫోన్ ను పెట్టి గన్ తో పేల్చేసింది. అయినా ఆమె కోపం చల్లారలేదు. కొమ్మ పైనుంచి తెచ్చి, సుత్తితో చితక్కొట్టేందుకు ప్రయత్నించింది. తిరిగి మరోసారి ఫోన్ పై తుపాకీతో తన ప్రతాపం చూపించింది. తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని, దాని ముందు ఎంతటి ఎలక్ట్రానిక్ వస్తువైనా పనికిరాదంటూ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. -
తల్లిని షూట్ చేసిన నాలుగేళ్ల బాలుడు!
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడి గన్‌కల్చర్ ఎలాంటి అనర్థాలకు కారణమౌతుందో చెప్పె ఘటన ఇది. కారులో వెనుక సీట్లో కూర్చున్న ఓ నాలుగేళ్ల బాలుడు.. డ్రైవింగ్ చేస్తున్న తల్లిని వెనుక నుండి షూట్ చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జాక్స్విల్లే ప్రాంతానికి చెందిన జేమీ గిల్ట్ వృత్తి రిత్యా న్యాయవాది. మంగళవారం ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో పుట్నం కౌంటీ ప్రాంతంలో కారులో వెళ్తుంది. ఆ సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్న బాలుడు అక్కడే ఉన్న హ్యండ్ గన్ను చేతిలో పట్టుకొని ఆడుతూ అనుకోకుండానే ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో బుల్లెట్ జేమీ వీపు భాగం నుంచి దూసుకెళ్లింది. జేమీని ప్రాణాపాయ స్థితిలో గమనించిన అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటన జరగడానికి కొద్ది గంటల ముందే.. టార్గెట్‌ను షూట్ చేస్తున్నాడంటూ తన కుమారుడి షూటింగ్ ప్రతిభను మెచ్చుకొంటూ జేమీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేయడం విశేషం. జేమీ ఉదంతంతో గన్‌కల్చర్‌పై సోషల్ మీడియాలో మరోసారి భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
చంఢీగడ్: భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనుకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్. ఆ ఘటనలో భార్య మృతి చెందగా, కానిస్టేబుల్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సంఘటన చంఢీగడ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అనంతకుమార్ పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని... అతడి భార్య డింపుల్ ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తుందని తెలిపారు. అయితే ఇద్దరు మధ్య గత కొద్ది కాలంగా మనస్పర్థలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆ ఘటన చేసుకుని ఉంటుందని చెప్పారు. కానిస్టేబుల్ అనంతకుమార్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.