
పిజ్జా షాపులో కస్టమర్ సాహసం
లెవిట్ టౌన్: అమెరికాలోని ఓ పిజ్జా షాపులో కాల్పులు జరిగాయి. దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు దొంగలపై అదే సమయంలో అక్కడికొచ్చిన ఓ కస్టమర్ తన తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో ఓ దొంగ ప్రాణాలు కోల్పోగా మరో దొంగ గాయపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఫిలడెల్పియాకు సమీపంలోని లెవిట్ టౌన్ లో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు పిజ్జా షాపులో పనిచేసే వాళ్లు మాత్రమే ఉన్నారు. కాల్పులు జరిపిన కస్టమర్ వద్ద ఉన్న తుపాకీ రిజిస్ట్రేషన్ ఉన్నదేనని, అయితే అతడు అనుమతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి, దొంగల వివరాలు కూడా వెల్లడించలేదు.