చండీగఢ్: చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం రేగింది. పెళ్లి వివాదంపై రెండు బృందాలు ఫ్యామిలీ కోర్టుకు రాగా, అదే సమయంలో పంజాబ్ పోలీస్ మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడు హర్‌ప్రీత్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మృతిచెందాడు. మల్వీందర్ అల్లుడు వ్యవసాయ శాఖలో ఐఆర్ఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు ప్రారంభించారు.
హర్‌ప్రీత్ సింగ్‌కు అతని భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. విచారణ సందర్భంగా అతని బావ, సస్పెండైన ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఈ సమయంలో నిందితుడైన మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. కోర్టులో న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్‌ప్రీత్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment