Chandigarh
-
Ambedkar Row: కౌన్సిలర్ల డిష్యూం.. డిష్యూం
చండీగఢ్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. ఈలోపు.. మంగళవారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. షా వ్యాఖ్యల నేపథ్యంతో.. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత వారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో అమిత్ షా రాజీనామా చేయాలంటూ చండీఘడ్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు జవహర్లాల్ నెహ్రూ హయాంలో బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఆరోపించారు. దీంతో కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు. #WATCH | Scuffle erupted between Congress and BJP councillors over the subject of Dr BR Ambedkar during the general house meeting of Chandigarh Municipal Corporation todayNominated councillor Anil Masih had targeted Congress and stated that Rahul Gandhi is out on bail, citing… pic.twitter.com/iZmLidgbT0— ANI (@ANI) December 24, 2024అయితే జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్ అధికారి, నామినేటడ్ కౌన్సిలర్ అనిల్ మసీహ్ వివాదాస్పదంగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తేలింది. దీనిపై సుప్రీం కోర్టు అనిల్ మసీహ్‌పై అంక్షితలు వేసింది.ఇవాళ జరిగిన మున్సిపల్ సమావేశంలో బీజేపీ నుంచి నామినేటెడ్ కౌన్సిలర్‌గా ఉన్న అనిల్ మసీహ్‌ను కాంగ్రెస్ కౌన్సిలర్లు నాటి ఘటనను ప్రస్తావిస్తూ ఎన్నికల దొంగ అంటూ సంభోదించారు. బదులుగా అనిల్ మసీహ్ సైతం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఘర్షణకు దారి తీసింది. -
బ్యాట్‌తో రాణించిన షమీ.. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ చండీఘడ్‌పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్ లాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదిప్త ప్రమాణిక్ 30, వ్రిత్తిక్ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ బవా 2, నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భగ్మేందర్ లాథర్ తలో వికెట్ తీశారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్ను దెబ్బకొట్టాడు. కనిష్క్ సేథ్ 2, షాబాజ్ అహ్మద్, షమీ తలో వికెట్ పడగొట్టారు. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో రాజ్ బవా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ యాదవ్ (27), మనన్ వోహ్రా (23), నిఖిల్ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కాగా, డిసెంబర్ 11న జరిగే క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది. -
చండీగఢ్ లో ప్రధాని మోదీ పర్యటన
-
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్‌లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్‌తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్‌లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్‌లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్‌లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
చండీగఢ్ కోర్టులో కలకలం.. ఐఆర్ఎస్ అల్లుడిపై ఐపీఎస్ మామ కాల్పులు
చండీగఢ్: చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం రేగింది. పెళ్లి వివాదంపై రెండు బృందాలు ఫ్యామిలీ కోర్టుకు రాగా, అదే సమయంలో పంజాబ్ పోలీస్ మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడు హర్‌ప్రీత్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మృతిచెందాడు. మల్వీందర్ అల్లుడు వ్యవసాయ శాఖలో ఐఆర్ఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు ప్రారంభించారు.హర్‌ప్రీత్ సింగ్‌కు అతని భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. విచారణ సందర్భంగా అతని బావ, సస్పెండైన ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఈ సమయంలో నిందితుడైన మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. కోర్టులో న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్‌ప్రీత్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. -
Paris Olympics : ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది
చండీగఢ్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం విశేషం. చండీగఢ్ యూనివర్సిటీకి అలాంటి అరుదైన అవకాశం దక్కింది.ఈ యూనివర్సిటీ విద్యార్థులు భజన్ కౌర్ (ఆర్చరీ), అర్జున్ (షూటింగ్), సంజయ్ (హాకీ), రితిక (రెజ్లింగ్), అక్ష్దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లి (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ గౌరవం పట్ల చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్, ఎంపీ సత్నామ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. క్వార్టర్ ఫైనల్లో అనాహత్, శౌర్య ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఇద్దరు భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బాలికల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్... బాలుర సింగిల్స్‌లో శౌర్య బావా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అనాహత్ 11–6, 13–11, 11–2తో అకారి మిదోరికావా (జపాన్)పై, శౌర్య 11–9, 5–11, 11–5, 13–11తో సెగుండో పొర్టాబాలెస్ (అర్జెంటీనా)పై విజయం సాధించారు. -
ప్రమాదం బారిన చండీగఢ్ బీఎస్ఫీ అభ్యర్థి
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. తాజాగా చండీగఢ్ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు కుట్లు వేశారు.వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న ఒక కాలనీలోని బీఎస్పీ నేతలు, కార్యకర్తలు డాక్టర్ రీతూ సింగ్‌ను నాణేలతో తూకం వేస్తున్నారు. ఇంతలో ఆ తూకం తెగిపోయి, దాని రాడ్డు ఆమె తలకు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి, తలకు కుట్లు వేసి ఇంటికి పంపించారు.చండీగఢ్ నుంచి డాక్టర్ రీతూ సింగ్‌ను బీఎస్పీ పోటీకి నిలిపింది. రీతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సైకాలజీ సబ్జెక్టులో ఆమెకు విశేష అనుభవం ఉంది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆమె దళితుల పక్షాన గొంతెత్తారు. ఈ నేపధ్యంలో ఆమెను డిస్మిస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ రీతూ సింగ్ పీహెచ్డీ పకోడా వాలీ పేరుతో ఓ స్టాల్ కూడా పెట్టారు. కుల వేధింపుల ఆరోపణలతో 2023, సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. ఈ సమయంలోనే ఆమె విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గుర్యయ్యారు. -
హర్యానాలో కర్ఫ్యూ విధించిన సూర్యుడు
హర్యానాలో వేసవి తాపం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పగటిపూట ఎక్కడ చూసినా కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చండీగఢ్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణీయంగా పెరిగాయి. దేశంలోని హాటెస్ట్ నగరాల్లో హర్యానాలోని నుహ్ రెండో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నగరంగా యూపీలోని ఆగ్రా నిలిచింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలోని 25 నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హర్యానాలోని 11 జిల్లాల్లో మే 23 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో మహేంద్రగఢ్, రేవారీ, గురుగ్రామ్, నుహ్, పల్వాల్, ఫరీదాబాద్, సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, చర్కి దాద్రీ జిల్లాలు ఉన్నాయి. పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కైతాల్, కర్నాల్, ఝజ్జర్, రోహ్తక్, సోనిపట్, పానిపట్, జింద్ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంబాలాలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటిపూట మార్కెట్లు వెలవెల బోతున్నాయి. సాయంత్రం పూట కొద్దిసేపు మాత్రమే వ్యాపారం జరుగుతున్నదని దుకాణదారులు వాపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. -
డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్‌లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్‌లో ఓ ఆహార విక్రేత డీజిల్‌తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్‌స్టామ్‌లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!) -
హోలీ 2024 : యూనివర్శిటీలో విద్యార్థుల హంగామా చూసి తీరాల్సిందే!
చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో వార్షిక హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు హోలీ ఆడుతూ సందడి చేశారు. సరదాగా వాటర్ బెలూన్, తదితర ఆటపాటలతో విద్యార్థులంతా హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈవేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by '*·舞~ 𝕐άŜ𝓗Ɨ𝔰H ~舞*'¨¯ (@yashish023) అయితే ఈ సందర్బంగా క్యాంపస్‌లో భద్రతా తనిఖీలతో గందరగోళం ఏర్పడింది. అంతకుముందు విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటనలో విద్యార్థులు నిరసనకు దిగడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నిరసనకారులు చెదరగొట్టారు.దాడి కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.ఈ గందరగోళం హోలీ వేడుకల భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించిందని పేరుచెప్పడానికి అంగీకరించని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. View this post on Instagram A post shared by Chandigarh (@the__chandigarh) -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
ఛండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బ!
పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత కుల్జీత్ సంధు విజయం సాధించారు. అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. డిప్యూటీ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి రాజిందర్ కుమార్ శర్మ గెలుపొందారు. మీడియా దగరున్న సమాచారం ప్రకారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కుల్జీత్ సింగ్ సంధుకు మొత్తం 19 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ హర్దీప్ సింగ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒక ఓటు చెల్లదని ప్రకటించారు. గతంలో మేయర్ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్న నేపధ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రిసైడింగ్ అధికారిని కోర్టు మందలించింది. అనంతరం డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. కాగా కొద్ది రోజుల క్రితం ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరు ఇప్పుడు బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్, ఆప్‌లకు 20 మంది కౌన్సిలర్లు ఉండేవారు. వీరిలో ముగ్గురు బీజేపీలో చేరడంతో ‘ఇండియా కూటమి’ కౌన్సిలర్ల సంఖ్య 17కు తగ్గింది. అదే సమయంలో బీజేపీకి అకాలీ, కిరణ్ ఖేర్ మద్దతు పలకడంతో ఆ పార్టీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. -
‘సర్వోన్నత’ న్యాయం!
వ్యవస్థలు నిర్మాణం కావటానికి సమయం పట్టినట్టే అవి భ్రష్టుపట్టడానికి కూడా ఎంతో కొంత వ్యవధి పడుతుంది. అప్రమత్తంగా వుండి సకాలంలో దాన్ని గమనించుకుంటే వాటిని రక్షించు కోవటం సులభమవుతుంది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీసుకున్న అసాధారణ నిర్ణయం ఆ కారణం రీత్యా హర్షించదగింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్‌ను మేయర్‌గా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు వక్రమార్గాల్లో విజయం సాధించటానికి అలవాటుపడిన రాజకీయ నేతలకూ, వారికి దాసోహమయ్యే అధికారులకూ చెంపపెట్టు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీ కనీసం సీసీ కెమెరాలున్నాయన్న వెరపు కూడా లేకుండా ఆప్ అభ్యర్థికి పడిన ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై స్వహస్తాలతో గీతలు పెట్టి అవి చెల్లని ఓట్లుగా లెక్కేసి బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఆయన వ్యవహారశైలి పూర్తిగా చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పటంతోపాటు అఫిడవిట్లో సైతం ఆ అధికారి బొంకటం నేరంగా పరిగణించి ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 340 కింద విచారణ జరపాలని నిర్ణయించటం మంచి పరిణామం. నిజానికి ఏ ఇతర నగరాలతో పోల్చినా చండీగఢ్ మేయర్ పదవి ఏమంత ప్రాధాన్యత వున్నది కాదు. కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న ఆ నగరానికి మేయర్ అయినవారు కార్పొరేషన్ సమావేశాలు నిర్వహించటం, ఎజెండాను రూపొందించటం మాత్రమే చేయగలరు. పైగా ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ వరకూ ఎవరి దారి వారిదే అని ప్రకటించిన ఆప్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ మేయర్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 13 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడింటిని గెలుచుకుంది. బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చండీగఢ్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన బీజేపీ నేత కిరణ్ ఖేర్, ఒకే ఒక్క సభ్యుడున్న శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్‌ను కూడా కలుపుకొంటే బీజేపీ బలం 16. కనుక 36 మంది సభ్యులున్న కార్పొరేషన్లో 20 మంది సభ్యులున్న ఆప్–కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం. కానీ ఏం చేసైనా నెగ్గి తీరాలనుకున్న బీజేపీ వ్యూహానికి అనిల్ మాసీ వంతపాడారు. ఆది నుంచీ మేయర్ ఎన్నికను ఆయన ప్రహసన ప్రాయంగా మార్చారు. షెడ్యూల్ ప్రకారం వాస్తవానికి గత నెల 18న మేయర్ ఎన్నిక జరగాలి. కానీ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం కోసం వెళ్లాక మాసీ అస్వస్థులయ్యారంటూ దాన్ని కాస్తా వాయిదా వేశారు. కేంద్రపాలిత పాలనావ్యవస్థ ఈ ఎన్నికను ఫిబ్రవరి 6న జరపాలని నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ పంజాబ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం దీన్ని జనవరి 30న జరపాలని ఆదేశించింది. ఈ క్రమం అంతా పరిశీలిస్తే, 30న జరిగిన తతంగం గమనిస్తే నాయకులు, అధికారులు ఎంత నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈనెల 5న ఈ కేసు విచారణకొచ్చినప్పుడు మాసీ వ్యవహరించిన తీరును జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని వంచించటం, హత్య చేయటం తప్ప మరేమీ కాద’ని ఆయన అన్నారు. నిజానికి ప్రజలకు బాధ్యత వహించాల్సిన స్థానంలో, వారి విశ్వాసాన్ని పొందాల్సిన స్థానంలో వున్న రాజకీయ పార్టీలకు ఈ స్పృహ వుండాలి. రేపన్న రోజు అధికారంలోకొచ్చే మరో పార్టీ కూడా ఇదే తీరులో గెలుపును తస్కరించే ప్రమాదం వున్నదని గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల దృష్టిలో ఈ ఎన్నికల తతంగం మొత్తం గుప్పెడుమంది బల వంతులు చేసే వంచనాత్మక విన్యాసమన్న అభిప్రాయం స్థిరపడితే తమ మనుగడే ప్రశ్నార్థక మవుతుందన్న ఎరుక వుండాలి. కానీ సమస్యాత్మకంగా వున్న బడి పిల్లలకు ఉపాధ్యాయులు చీవాట్లు పెట్టే రీతిలో సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని చెప్పవలసిరావటం అధికారుల, నేతల పరువు ప్రతిష్ఠలకే తలవంపు. దాన్ని కనీసం గుర్తించలేని స్థితిలోనే మన నాయకగణం వున్నదని ఆదివారంనాటి పరిణామాలు చెబుతున్నాయి. మేయర్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేసి, మళ్లీ ఎన్నికకు ఆదేశి స్తుందన్న అంచనాతో బీజేపీ నాయకులు ఫిరాయింపులకు తెరలేపి, ముగ్గురు ఆప్ సభ్యులను బుట్టలో వేసుకున్నారు. దాంతో ఆప్–కాంగ్రెస్ కూటమి బలం 17కి పడిపోగా, బీజేపీ బలం 19కి పెరిగింది. ఒకపక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో వుండి, దేశమంతా దానిపై దృష్టిపెట్టిన తరుణంలో ఈ తరహా జుగుప్సాకర చేష్టలకు పాల్పడటం భావ్యంకాదన్న ఇంగితజ్ఞానం లోపించటం నిజంగా బాధాకరం. మేయర్‌గా పార్టీ అభ్యర్థి నెగ్గటంపైనే తమ భవిష్యత్తంతా ఆధారపడి వుందనుకోవటం దివాలాకోరుతనం. మాసీ మాయోపాయంవల్ల మేయర్ అయిన మనోజ్ సోంకార్ రాజీనామా చేశారు గనుక తిరిగి ఎన్నికకు ఆదేశించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను తోసిపుచ్చి 142వ అధికరణ కింద సంక్రమించిన అధికారాన్ని వినియోగించి ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించటాన్ని చూసైనా అటు నాయకులూ, ఇటు అధికార గణమూ కళ్లు తెరవాలి. అక్రమాలతో, అన్యాయాలతో గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర అపచారం చేయటమేనని అందరూ గుర్తించాలి. అసాధారణమైన ఈ తీర్పు మన వ్యవస్థలకు భయభక్తులు నేర్పాలి. -
‘ఆప్’ అభ్యర్థే చండీగఢ్ మేయర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అత్యున్నత న్యాయస్థానంలో ఘన విజయం లభించింది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్‌ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్‌గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది. రిటర్నింగ్ అధికారి ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్ కుమార్‌కు పడినట్లు గుర్తించింది. చండీగఢ్ మేయర్‌గా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు తేల్చిచెబుతూ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. ఎన్నిక ప్రక్రియను తారుమారు చేశారు మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఆప్’ నేత, మేయర్ అభ్యర్థి కులదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చెల్లనివిగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను స్వయంగా పరిశీలించింది. అవి ఎక్కడ పాడైపోయాయి? ఎందుకు చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్ మాసిని ప్రశ్నించింది. ఆ 8 ఓట్లు కులదీప్ కుమార్‌కు పడినట్లు తేల్చింది. పిటిషనర్‌కు అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే చెల్లనివిగా గుర్తించినట్లు ఆక్షేపించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. మేయర్ ఎన్నిక విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వైఖరి సక్రమంగా లేదని వెల్లడించింది. మేయర్ ఎన్నిక ప్రక్రియను ఆయన చట్టవిరుద్ధంగా తారుమారు చేశారని, అంతేకాకుండా కోర్టులో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని, ఇందుకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అనిల్ మాసిపై సీఆర్పీఎస్ సెక్షన్ 340 కింద ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అసలేం జరిగింది? చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించారు. కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీ 8 ఓట్లపై రహస్యంగా ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించారు. ఈ వీడియో బయటకు వచ్చింది. మిగిలిన ఓట్లను లెక్కించగా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్‌కు 12, బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. దీంతో కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆప్ జాతీయ కన్వి నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందన్నారు. ఇదో చరిత్రాత్మక తీర్పు అన్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా పని చేస్తే బీజేపీని ఓడించడం సులువేనని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోలయ్యే 90 కోట్లకు పైగా ఓట్లను బీజేపీ ఎలా దొంగిలిస్తుందని ప్రశ్నించారు. నీచ రాజకీయాలను ఎదిరించాలి: ఖర్గే సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ బీజేపీ కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానం రక్షించిందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలంతా కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి బీజేపీ పన్నిన కుట్రలో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి ఒక పావు మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ముఖం నరేంద్ర మోదీ అని ఆరోపించారు. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం .. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించింది. మేయర్ఎ న్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే అనిల్ మసీహ్ 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. అంతకముందు మేయర్ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించి పక్కకు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎనిమిది బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలెట్ పత్రాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనంతరం ఆ 8 ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని.. వాటితో కలిపి మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్‌గా ప్రకటించాలని తెలిపింది. తాజాగా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించడంతో ఈవివాదానికి తెరపడింది. చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట కాగా జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్‌ను ఓడించి మనోజ్ సోంకర్ మేయర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బ్యాలెట్ పేపర్లను మార్కింగ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ కెమెరాకు చిక్కారు. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆదివారం సోంకర్ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. -
బ్యాలెట్‌పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్‌ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్‌గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్‌ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్‌ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్‌కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. సు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్‌ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది. -
బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్‌ను ఓడించి మేయర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’! రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్‌కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్‌కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్‌కు ఏడుగురు ఉన్నారు. -
మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు.. అప్పటి వరకు నో యాక్షన్
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్‌లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు. చండీగఢ్‌లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్ గోయల్ ఆహారం, పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,. కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు. అంతకముందు కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. -
సన్‌రైజర్స్ ఓపెనర్ ఊచకోత.. ఏకంగా 205 పరుగులతో
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్, చండీగఢ్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను ప్రారంభించలేదు. అయితే మూడో రోజు ముగిసే సమయానికి పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 477 పరుగులు చేసింది. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ ఆజేయ దిశ్వతకంతో చెలరేగాడు. అన్మోల్ప్రీత్ 329 బంతుల్లో 25 ఫోర్లతో 205 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్ సైతం భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ప్రభుసిమ్రాన్ 215 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 171 చేసి ఆజేయంగా ఉన్నాడు. కాగా అన్మోల్ప్రీత్ సింగ్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో ఓపెనర్‌గా వచ్చి ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు అన్మోల్ప్రీత్ ఆడాడు. అతడిని ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. అదే విధంగా ప్రభుసిమ్రాన్ సైతం క్యాష్‌రిచ్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. చదవండి: IND vs ENG: ధోనిని గుర్తుచేసిన రోహిత్.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్ -
‘ఇండియా కూటమి చారిత్రక గెలుపు నమోదు చేస్తుంది’
న్యూఢిల్లీ: చంఢీఘర్ మేయర్ స్థానాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత రాఘవ్ చద్దా జోష్యం చెప్పారు. ఎప్రిల్/మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు చంఢీఘర్ మేయర్ విజయం.. ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుందని తెలిపారు. జనవరి 18వ తేదీ జరిగే చంఢీఘర్ మేయర్ ఎన్నికలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి చారిత్రక, నిర్ణయాత్మక గెలుపు సొంతం చేసుకుంటుంది. మొదటి సారిగా ఇడియా కూటమి, బీజేపీ మధ్య పోరు జరగనుంది. మేయర్ ఫలితాలు విడుదలయ్యాక ఇండియా కూటమి-1, బీజేపీ-0గా మారబోతుంది. ఈ గెలుపుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుంది’ అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. #WATCH | Delhi | AAP MP Raghav Chadha says, "INDIA Alliance will fight the Chandigarh Mayor elections with all its strength and register a historic and decisive victory. Don't consider this an ordinary election. This will be an election where for the first time it will be INDIA… pic.twitter.com/l7d4Ej1kpg — ANI (@ANI) January 16, 2024 ఇండియా కూటమి చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోరాడి గెలుపొందుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా భావించమని పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు తాము ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు. చదవండి: ‘రామ మందిర కార్యక్రమం... మోదీ రాజకీయ కార్యక్రమం’ -
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్‌కు భారత్‌లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్‌లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో పెరిగిన ఆర్ధిక వ్యయానికి సంబంధించి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్రంలో అప్పు రూ.50,000 కోట్లు పెరిగిపోవడంపై వివరణ కోరగా ముఖ్యమంత్రి భగవంత్ మన్ గత ప్రభుత్వం చేసిన రుణాలకు చెల్లించిన వడ్డీలతోపాటు ఇటీవలి కాలంలో పెరిగిన జీఎస్టీ, వాహన పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ చార్జీల వల్లనే వ్యయం పెరిగిందని లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి భగవంత్ మన్ రాసిన లేఖలో.. గడిచిన ఏడాదిలో పంజాబ్ ఎక్సయిజ్ పన్ను ఏకంగా 37 శాతం పెరిగిందని అలాగే వస్తు సేవల పన్ను 16.6 శాతం, వాహనాలపై మన్ను వసూళ్లు 13 శాతం స్టాంపు రిజిస్ట్రేషన్ల వసూళ్లు 28 శాతం పెరిగాయని వెల్లడించారు. ఏప్రిల్ 1, 2002 నుండి ఆగస్టు 31,2023 వరకు పంజాబ్ రాష్ట్రం అప్పు రూ.47,107 కోట్లు పెరిగిందని అందులో రూ.27,016 కోట్లు అంతకుముందు తీసుకున్న అప్పుకు వడ్డీగా చెల్లించామని తెలిపారు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వాలు వదిలిపెట్టిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశామని వారు విస్మరించిన సంస్థల పునరుద్ధరణకు అలాగే వారు అమలు పరచిన కొన్ని పథకాలను కొనసాగించడానికి అప్పులను అలాగే సొంత ఆర్ధిక వనరులను కూడా వినియోగించామని లేఖలో నివేదించారు. ఇక రాష్ట్రంలో మూలధన వనరులను ఏర్పరిచి అభివృద్ధి పనుల కోసం కొత్తగా చేసిన అప్పులను వినియోగించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం -
గురపత్వంత్ సింగ్‌కి భారత్ బిగ్ షాక్
ఢిల్లీ: ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ Gurpatwant Singh Pannun కు భారత్ సాలిడ్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థNIA.. భారత్‌లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో.. NIA దర్యాప్తులో.. అమృత్సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్‌నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్‌పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. ఇదీ చదవండి: మోదీ, షాలను వదలని గురపత్వంత్