చండీగఢ్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. ఈలోపు.. మంగళవారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. షా వ్యాఖ్యల నేపథ్యంతో.. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గత వారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో అమిత్ షా రాజీనామా చేయాలంటూ చండీఘడ్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఆరోపించారు.
దీంతో కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు.
#WATCH | Scuffle erupted between Congress and BJP councillors over the subject of Dr BR Ambedkar during the general house meeting of Chandigarh Municipal Corporation today
Nominated councillor Anil Masih had targeted Congress and stated that Rahul Gandhi is out on bail, citing… pic.twitter.com/iZmLidgbT0— ANI (@ANI) December 24, 2024
అయితే జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్ అధికారి, నామినేటడ్ కౌన్సిలర్ అనిల్ మసీహ్ వివాదాస్పదంగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తేలింది. దీనిపై సుప్రీం కోర్టు అనిల్ మసీహ్‌పై అంక్షితలు వేసింది.
ఇవాళ జరిగిన మున్సిపల్ సమావేశంలో బీజేపీ నుంచి నామినేటెడ్ కౌన్సిలర్‌గా ఉన్న అనిల్ మసీహ్‌ను కాంగ్రెస్ కౌన్సిలర్లు నాటి ఘటనను ప్రస్తావిస్తూ ఎన్నికల దొంగ అంటూ సంభోదించారు. బదులుగా అనిల్ మసీహ్ సైతం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఘర్షణకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment