‘అంబేద్కర్‌కు అవమానం..’ షా వర్సెస్‌ ఖర్గే | Kharge Vs Amit Sha Over Remarks On Ambedkar | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. అమిత్‌ షా వర్సెస్‌ ఖర్గే

Published Wed, Dec 18 2024 6:34 PM | Last Updated on Wed, Dec 18 2024 6:54 PM

Kharge Vs Amit Sha Over Remarks On Ambedkar

సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభలో అంబేద్కర్‌పై కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌ షా  చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్‌ షా వ్యాఖ్యలపై బుధవారం(డిసెంబర్‌ 18) తొలుత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత వెంటనే అమిత్‌ షా మీడియా సమావేశం నిర్వహించారు. అమిత్‌ షా దేశానికి క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్‌ చేయగా రాహుల్‌గాంధీ ఒత్తిడితోడే ఖర్గే మాట్లాడుతున్నారని అమిత్‌ షా కౌంటర్‌​ ఇచ్చారు. 

ప్రధానికి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే అమిత్‌ షాను వెంటనే తొలగించాలి: ఖర్గే 

  • షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల దేశానికి  క్షమాపణ చెప్పాలి
  • ప్రధాని మోదీకి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే షాను మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలి
  • బీజేపీకి రాజ్యాంగం పై నమ్మకం లేదు 
  • మనుస్మృతినే వారు నమ్ముతారు 
  • అంబేద్కర్‌ కులం గురించి ఎప్పుడు మాట్లాడలేదు
  • పేదల తరపున అంబేద్కర్‌ గొంతెత్తారు
  • అంబేద్కర్‌ను కొందరికి పరిమితం చేయడం సరికాదు 

 

నా మాటలు ఎడిట్‌ చేసి వక్రీకరించారు: అమిత్‌ షా 

 

  • అంబేద్కర్ పై  నా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది.
  • దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.
  • నేను మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి వక్రీకరించారు.
  • అంబేద్కర్ ను, ఆయన సిద్ధాంతాలను కలలో కూడా మేము వ్యతిరేకించలేదు.
  • అంబేద్కర్ అంటే మాకు అపారమైన గౌరవం.
  • నేను రాజ్యసభలో మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా చూస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి.
  • గతంలో నా మాటలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది.
  • మా ప్రభుత్వం రిజర్వేషన్లను బలపరిచింది. 
  • రాజీవ్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేశారు.
  • రాహుల్ గాంధీ ఒత్తిడితో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు.
  • కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అంబేద్కర్‌ను అవమానించింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement