ambedkar
-
విజయవాడ: ‘గో బ్యాక్ అమిత్ షా’
విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్‌పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్‌ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షానగరంలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్‌పీ నేతలకు అమిత్‌షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్‌షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు.. నగరంలోని నోవాటెల్‌లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు. -
జీవితాంతం అంబేడ్కర్‌ను అవమానించారు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను జీవితాంతం అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కనీసం చిత్రపటం కూడా ఏర్పాటు చేయకపోవడం చూస్తే కాంగ్రెస్‌కు అంబేడ్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇందిరాగాంధీ సహా ఎంతోమందికి భారతరత్న ఇచి్చనా.. కాంగ్రెస్ అంబేడ్కర్‌కు ఇవ్వలేకపోయిందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ కావాలనే ఓడించిందని ఆరోపించారు. ఎన్డీయే హయాంలోనే అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని గుర్తుచేశారు. ఏడాదిపాటు వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన ప్రసంగం వినడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది వచ్చేవారన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో వాజ్‌పేయి జనసంఘ్ నేతలతో కలిసి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఇంటింటికీ తెలియచేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అబద్ధాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్: బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ 70 ఎంఎం సినిమా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాజ్‌పేయి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. దేశభక్తి, అభివృద్ధి, చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల నిర్మాణంతో దేశాన్ని ఒక ప్రాంతంతో మరో ప్రాంతాన్ని అనుసంధానించారన్నారు. అన్ని పారీ్టల్లోనూ ఆయనను అభిమానించే నేతలు ఉన్నారని చెప్పారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు. సంతుïÙ్టకరణ విధానాలకు వాజ్‌పేయి వ్యతిరేకమని, అవినీతికి ఆమడదూరం ఉన్నారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌కు, అంబేడ్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని, అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేడ్కర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి కృషి: భట్టి మధిర: క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం రోమన్ కేథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని మతాల అభ్యున్నతికి స్థిర సంకల్పంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు. -
Ambedkar Row: కౌన్సిలర్ల డిష్యూం.. డిష్యూం
చండీగఢ్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. ఈలోపు.. మంగళవారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. షా వ్యాఖ్యల నేపథ్యంతో.. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత వారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో అమిత్ షా రాజీనామా చేయాలంటూ చండీఘడ్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు జవహర్లాల్ నెహ్రూ హయాంలో బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఆరోపించారు. దీంతో కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు. #WATCH | Scuffle erupted between Congress and BJP councillors over the subject of Dr BR Ambedkar during the general house meeting of Chandigarh Municipal Corporation todayNominated councillor Anil Masih had targeted Congress and stated that Rahul Gandhi is out on bail, citing… pic.twitter.com/iZmLidgbT0— ANI (@ANI) December 24, 2024అయితే జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్ అధికారి, నామినేటడ్ కౌన్సిలర్ అనిల్ మసీహ్ వివాదాస్పదంగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తేలింది. దీనిపై సుప్రీం కోర్టు అనిల్ మసీహ్‌పై అంక్షితలు వేసింది.ఇవాళ జరిగిన మున్సిపల్ సమావేశంలో బీజేపీ నుంచి నామినేటెడ్ కౌన్సిలర్‌గా ఉన్న అనిల్ మసీహ్‌ను కాంగ్రెస్ కౌన్సిలర్లు నాటి ఘటనను ప్రస్తావిస్తూ ఎన్నికల దొంగ అంటూ సంభోదించారు. బదులుగా అనిల్ మసీహ్ సైతం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఘర్షణకు దారి తీసింది. -
మాటలు.. మంటలు
న్యూఢిల్లీ: మాటలు మంటలు రేపాయి. అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు మంగళవారం ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేడ్కర్ ప్రస్తావన తెచ్చారు. ‘‘అంబేడ్కర్, అంబేడ్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ పదేపదే అంబేడ్కర్ నామస్మరణ చేస్తుండటం మాకూ ఆనందమే. కానీ ఆయనపై వారి అసలు వైఖరేమిటో కూడా బయటపెట్టాలి. అంబేడ్కర్‌ను పదేపదే అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఆర్టికల్ 370తో పాటు పలు విధానాలపై నెహ్రూ సర్కారు విధానాలతో విభేదించి ఆయన మంత్రివర్గం నుంచి అంబేడ్కర్ వైదొలిగాల్సి వచి్చంది. అలా మీరు నిత్యం వ్యతిరేకించిన అంబేడ్కర్ పేరునే ఇప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇదెంత వరకు సమంజసం?’’ అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అయితే అమిత్ షా చేసిన ‘అంబేడ్కర్–దైవ నామస్మరణ’ పోలిక తీవ్ర విమర్శలకు దారితీసింది. జాతీయ రాజకీయాలు బుధవారమంతా వాటిచుట్టే తిరిగాయి. రాజ్యాంగ నిర్మాతనే గాక దేశంలోని దళితులందరినీ అమిత్ షా తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ఆయన తక్షణం బహిరంగంగానూ, పార్లమెంటులోనూ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరో అడుగు ముందుకేసి, ‘‘షా తక్షణం రాజీనామా చేయాల్సిందే. లేదంటే ప్రధాని మోదీయే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి. అంబేడ్కర్ పట్ల మోదీకి ఏమాత్రం గౌరవమున్నా బుధవారం అర్ధరాత్రిలోపు ఈ పని చేయాలి’’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు, వీధి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంటు కూడా అట్టుడికిపోయింది. ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపక్షాలు నిరసనలకు, ఆందోళనలకు దిగాయి. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ‘అమిత్ షా సిగ్గు పడు’, ‘క్షమాపణలు చెప్పు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ‘‘ప్రసంగంలో కొంత భాగాన్ని తీసుకుని వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌కు మరే అంశాలూ లేక నిస్పృహతో చౌకబారు చర్యలకు అన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అమిత్ షాకు బాసటగా మాట్లాడారు. దేశమంతా అగ్గి రాజుకుంటుంది: ఖర్గే బీజేపీ అహంభావ ధోరణికి, అంబేడ్కర్‌పై వారికున్న ద్వేషానికి అమిత్ షా వ్యాఖ్యలు అద్దం పట్టాయని ఖర్గే మండిపడ్డారు. ‘‘అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వొద్దని మనుస్మృతి సిద్ధాంతాన్ని ఆచరించే బీజేపీ, ఆరెస్సెస్ నిర్ణయించుకున్నాయి. మనుస్మృతికి చోటివ్వలేదంటూ రాజ్యాంగ ప్రతిని, అంబేడ్కర్ దిష్టి»ొమ్మలను తగలబెట్టిన చరిత్ర బీజేపీది’’ అని ఆరోపించారు. ఉభయ సభలు వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలన్నీ అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనకు దిగాయి. నేతలంతా నల్లజెండాలు, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌గాం«దీ, ప్రియాంకతో పాటు తృణమూల్, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన (యూబీటీ), వామపక్షాల నేతలు పాల్గొన్నారు. వారితో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఇలాగే మాట్లాడితే దేశమంతటా అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఎవరైనా రాజ్యాంగంపై ప్రమా ణం చేసిన మీదటే కేంద్ర మంత్రి అవుతారు. రాజ్యాంగ నిర్మాతనే అవమానించే వారికి ఆ పదవిలో కొనసాగే అర్హతే లేదు’’ అన్నారు. ఆయన రాజీనామాకు విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయన్నారు. ‘‘అమిత్ షాపై మోదీ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. ఆప్తమిత్రులు ఒకరి పాపాలను ఒకరు కప్పిపుచ్చుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు.మనువాదానికి తార్కాణం: రాహుల్ ‘‘మనువాదులకు అంబేడ్కర్ సహజంగానే నచ్చరు. అమిత్ షా వ్యాఖ్యలు దాన్ని మరోసారి నిరూపించాయి’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమే. అంబేడ్కర్ చరిత్రను, రాజ్యాంగ రచనలో ఆయన కృషిని తెరమరుగు చేసేందుకు ప్రయతి్నస్తోంది. కానీ బాబాసాహెబ్‌ను అవమానిస్తే దేశం సహించబోదు. అమిత్ షా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని స్పష్టం చేశారు. ప్రియాంక కూడా ఈ మేరకు ఎక్స్‌లో డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్‌ది చౌకబారుతనం: బీజేపీ అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. ఇది ఆ పార్టీ చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, కిరెణ్ రిజిజు, అశ్వినీ వైష్ణవ్, రవ్నీత్ బిట్టూ తదితరులు మండిపడ్డారు. అంబేడ్కర్‌ను ఆయన జీవితపర్యంతమూ, తదనంతరమూ పథకం ప్రకారం అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. ‘‘దాన్నే అమిత్ షా రాజ్యసభ సాక్షిగా నిరూపించారు. దాన్ని తట్టుకోలేక ఆయనపై తప్పుడు ఆరోపణలకు దిగింది’’ అని రాజ్‌నాథ్ ఆరోపించారు. తీవ్ర నిస్పృహలో కూరుకుపోయిన కాంగ్రెస్ చివరికి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి దిగజారిందని నడ్డా ఎద్దేవా చేశారు. బీజేపీ మనస్తత్వం బయటపడిందిపుణే: అమిత్ షా వ్యాఖ్యలను అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన అఘాడీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ ఖండించారు. బీజేపీ పాత మనస్తత్వం ఆయన మాటలతో బయటపడిందని అన్నారు. అంబేడ్కర్ పట్ల బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. ‘‘బీజేపీ మాతృసంస్థలు ఆర్ఎస్ఎస్, జన సంఘ్ అంబేడ్కర్‌ను వ్యతిరేకించాయి. రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో అంబేడ్కర్‌ను తప్పుబట్టాయి. అంబేడ్కర్ భావజాలం దేశంలో బలంగా ఉండటం వల్లే బీజేపీ తన పాత ప్రణాళికలు అమలు చేయడానికి జంకుతోంది. ఆ ఉక్రోషం కొద్దీ ఆయన పట్ల కోపాన్ని ఇలా వెళ్లగక్కుతోంది’’ అని ఆరోపించారు. అట్టుడికిన రాజ్యసభ షాపై హక్కుల తీర్మానం సభలో టీఎంసీ నోటీసు అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల తీర్మానం పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 187వ నిబంధన మేరకు టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ బుధవారం రాజ్యసభలో ఈ మేరకు నోటీసిచి్చనట్టు సమాచారం. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యుల నిరసనలతో సభ అట్టుడికింది. మంత్రి రాజీనామాకు సభ్యులంతా డిమాండ్ చేశారు. షా ప్రసంగంలో కేవలం 12 సెకన్ల భాగాన్నే ప్రచారం చేస్తూ కాంగ్రెస్ వక్రీకరిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. 1990 దాకా ఆయనకు భారతరత్న కూడా ఇవ్వని చరిత్ర ఆ పారీ్టదని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నే అమిత్ షా నిండు సభలో ఎండగట్టారన్నారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. ‘అంబేడ్కర్‌కు అవమానాన్ని దేశం సహించబోదు’’ అంటూ పెద్దపెట్టున నినాదాలకు దిగారు. ఆయన్ను అవమానించింది కాంగ్రెసేనంటూ రిజిజు కౌంటరిచ్చారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి అంబేడ్కర్ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం రెండింటి దాకా చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కూడా అవే దృశ్యాలు కొనసాగడంతో సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. విపక్ష సభ్యులు అంబేడ్కర్ పోస్టర్లతో వెల్‌లోకి దూసుకెళ్లి ‘జై భీమ్’ అంటూ నినాదాలకు దిగారు. దాంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా, తర్వాత గురువారానికి వాయిదా పడింది. ముసుగు తొలగింది ‘‘మొత్తానికి ముసుగు తొలగింది. రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ రాజ్యాంగ నిర్మాతనే అమిత్ షా అవమానించారు. ఆయన వ్యాఖ్య లు బీజేపీ కులవాదానికి, దళిత వ్యతిరేక భావజాలానికి నిదర్శనం. 240 లోక్‌సభ సీట్లొస్తేనే ఇలా ప్రవర్తిస్తున్నారు. అదే 400 వస్తే అంబేడ్కర్ స్మృతులనే పూర్తిగా చెరిపేస్తూ చరిత్రను తిరగరాసేవాళ్లేమో!’’ – తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీఅంబేడ్కర్ పేరే జపిస్తాం ‘‘పాపాలు చేసేవాళ్లే పుణ్యం కోసం ఆలోచిస్తారు. దేశం, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి తపించేవాళ్లు అంబేడ్కర్ నామాన్నే జపిస్తారు’’ – డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దొందూ దొందే ‘‘బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. అంబేడ్కర్ పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. దళితులకు, అణగారిన వర్గాలకు అవి చేసిందేమీ లేదు’’ – బీఎస్పీ అధినేత్రి మాయావతి -
బదులివ్వలేకే దుష్ప్రచారం
న్యూఢిల్లీ: అంబేడ్కర్‌పై రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పూర్తిగా వక్రీకరించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఫక్తు అంబేడ్కర్ వ్యతిరేకి. రాజ్యాంగ వ్యతిరేకి. రిజర్వేషన్ల వ్యతిరేకి. ఈ వాస్తవాలను రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా నిరూపించాం. మేం లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ వద్ద ఏ సమాధానమూ లేకపోయింది. అందుకే తీవ్ర అసహనంతో ఇలా తప్పుడు దారి ఎంచుకుంది.ప్రధాని వ్యాఖ్యలను కూడా ఇలాగే వక్రీకరిస్తోంది. వాటిపై ఆందోళనలకు దిగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాజ్యసభలో అంబేడ్కర్ గురించి తాను మాట్లాడినదాంట్లో ఎలాంటి సందిగ్ధతా లేదని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కలలో సైతం అవమానపరచని పార్టీ నుంచి, సిద్ధాంతం నుంచి వచ్చాను. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా అంబేడ్కర్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసింది.రిజర్వేషన్లను బలోపేతం చేసేందుకు కృషి చేసింది’’ అన్నారు. ‘‘కాంగ్రెస్ చర్యలు ఆక్షేపణీయం. నాపై ఆ పార్టీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా అన్ని అవకాశాలూ పరిశీలిస్తామన్నారు. అంబేడ్కర్‌పై తాను చేసిన పూర్తి వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. నెహ్రూ కుటుంబం అంబేడ్కర్ వ్యతిరేకికాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రసంగంలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తోందని అమిత్ షా ఆక్షేపించారు. తద్వారా అయోమయం సృష్టించడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కృత్రిమ మేధ సాయంతో తన వ్యాఖ్యలను, మోదీ వ్యాఖ్యలను వక్రీకరించేందుకు ప్రయతి్నంచిందని ఆరోపించారు.‘అంబేడ్కర్‌ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన చరిత్ర తొలి ప్రధానినెహ్రూది. నెహ్రూ కుటుంబంలో నాలుగు తరాల నేతలూ అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఆయనకు భారతరత్నను వీలైనంతగా ఆలస్యం చేసింది కాంగ్రెసే. కనీసం ఇప్పుడైనా ఆ పార్టీ అంబేడ్కర్ గురించి మాట్లాడుతుండడం ఆనందం కలిగిస్తోంది. అయితే అంబేడ్కర్‌కు ఇన్నాళ్లూ వాళ్లు ఏమాత్రం గౌరవం ఇవ్వని విషయం కూడా చెబితే బాగుంటుంది’’ అన్నారు. చీలిక దిశగా పయనిస్తున్న విపక్ష ఇండియా కూటమికి తిరిగి ఒక్కటయ్యే అవకాశాన్ని మీ వ్యాఖ్యలు కల్పించాయా అని ప్రశ్నించగా తప్పుడు పునాదులపై ఒక్కతాటిపైకి రావడం వారికి అలవాటేనని అమిత్ షా అన్నారు. ‘‘ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. విపక్షాలకు వ్యతిరేకంగా వారు వరుసగా తీర్పులిస్తున్నారు. అందుకే ఓసారి ఈవీఎంలపై, మరోసారి ఇంకో అంశంపై ఆరోపణలు తదితరాలతో ప్రజలను అయోమయపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆరోపించారు. బాక్సు ఖర్గే సంతోషిస్తానంటే తప్పుకుంటా తాను రాజీనామా చేయాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ హాస్యాస్పదమని అమిత్ షా అన్నారు. ‘‘నా రాజీనామా ఖర్గేకు సంతోషం కలిగిస్తుందంటే అలాగే చేస్తా. కానీ నేను పదవి నుంచి తప్పుకున్నా ఖర్గే సమస్యలు తీరవు. ఆయన కనీసం మరో 15 ఏళ్లపాటు అక్కడే (ప్రతిపక్షంలోనే) ఉంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అంబేడ్కర్ మాదిరిగానే ఖర్గే కూడా దళితుడే. కనీసం ఆయనైనా ఈ బురదజల్లుడు కార్యక్రమంలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుండేది. రాహుల్‌గాంధీ ఒత్తిళ్లకు తలొగ్గి నాపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు’’ అని అమిత్ షా అన్నారు. -
‘అంబేద్కర్‌కు అవమానం..’ షా వర్సెస్ ఖర్గే
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభలో అంబేద్కర్‌పై కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్ షా వ్యాఖ్యలపై బుధవారం(డిసెంబర్ 18) తొలుత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత వెంటనే అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు. అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేయగా రాహుల్‌గాంధీ ఒత్తిడితోడే ఖర్గే మాట్లాడుతున్నారని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే అమిత్ షాను వెంటనే తొలగించాలి: ఖర్గే షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల దేశానికి క్షమాపణ చెప్పాలిప్రధాని మోదీకి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే షాను మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలిబీజేపీకి రాజ్యాంగం పై నమ్మకం లేదు మనుస్మృతినే వారు నమ్ముతారు అంబేద్కర్ కులం గురించి ఎప్పుడు మాట్లాడలేదుపేదల తరపున అంబేద్కర్ గొంతెత్తారుఅంబేద్కర్ను కొందరికి పరిమితం చేయడం సరికాదు #WATCH | Delhi: On Union HM's speech in RS during Constitution debate, Rajya Sabha LoP and Congress president Mallikarjun Kharge says, "Our demand is that Amit Shah should apologize and if PM Modi has faith in Dr Babasaheb Ambedkar then he should be sacked by midnight... He has… pic.twitter.com/uKoMZqj8F4— ANI (@ANI) December 18, 2024నా మాటలు ఎడిట్ చేసి వక్రీకరించారు: అమిత్ షా అంబేద్కర్ పై నా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది.దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.నేను మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి వక్రీకరించారు.అంబేద్కర్ ను, ఆయన సిద్ధాంతాలను కలలో కూడా మేము వ్యతిరేకించలేదు.అంబేద్కర్ అంటే మాకు అపారమైన గౌరవం.నేను రాజ్యసభలో మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా చూస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి.గతంలో నా మాటలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది.మా ప్రభుత్వం రిజర్వేషన్లను బలపరిచింది. రాజీవ్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేశారు.రాహుల్ గాంధీ ఒత్తిడితో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అంబేద్కర్‌ను అవమానించింది#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "...When the discussion was going on in the Parliament, it was proved how the Congress opposed Baba Saheb Ambedkar. How the Congress tried to make fun of Baba Saheb even after his death... As far as giving Bharat Ratna is… pic.twitter.com/rzMAU3mzNg— ANI (@ANI) December 18, 2024 -
దాచేస్తే నిజాలు దాగవు
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. అంబేడ్కర్‌ను పదేపదే దారుణంగా కించపర్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటపెట్టారని చెప్పారు. అది తట్టుకోలేక ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజానిజాలేమిటో దేశ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. దాచేస్తే నిజాలు దాగవని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వాస్తవానికి అంబేడ్కర్‌ను అమితంగా గౌరవిస్తున్నది తామేనని వెల్లడించారు. అంబేడ్కర్ పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. ‘‘సులువుగా అబద్ధాలు చెప్పేస్తే, చాలా ఏళ్లపాటు చేసిన తప్పిదాలన్నీ మరుగున పడిపోతాయని కాంగ్రెస్ భావిస్తోంది. అంబేడ్కర్‌ను కించపర్చింది ముమ్మాటికీ కాంగ్రెస్సే. అబద్ధాలతో నిజాలను కప్పిపుచ్చాలనుకుంటే అది పొరపాటే అవుతుంది. నెహ్రూ–గాంధీ కుటుంబం నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను పదేపదే అవమానించింది. ఆయన ఘనతను తక్కువ చేసి చూపడానికి చిల్లర ప్రయత్నాలన్నీ చేసింది. ఎస్సీ, ఎస్టీలను సైతం ఘోరంగా అవమానించింది. అంబేడ్కర్ పట్ల కాంగ్రెస్ పాపాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఆయనను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది. అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ ప్రచారం చేశారు. ఆయనను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వడానికి నిరాకరించారు. ఆ మహోన్నత వ్యక్తి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ఎస్సీ, ఎస్టీలపై లెక్కలేనన్ని మారణహోమాలు జరిగాయి. ఏళ్ల తరబడి అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల సాధికారత, అభివృద్ధి కోసం ఏనాడూ కృషిచేయలేదు. అంబేడ్కర్ దయ వల్లే మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సిద్ధాంతాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత గౌరవాన్ని మరింత ఇనుమడింపజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. చైత్యభూమిలో స్వయంగా ప్రార్థనలు చేశా అంబేడ్కర్ దార్శనికతే మాకు ప్రామాణికం. దేశంలో గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశాం. సమాజంలో పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్ వంటి పథకాలు తీసుకొచ్చాం. మేము ప్రారంభించిన ప్రతి పథకం పేదల జీవితాలను ప్రభావితం చేస్తోంది. అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ప్రముఖ క్షేత్రాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నాం. అంబేడ్కర్ స్మృతిస్థలమైన చైత్యభూమికి సంబంధించిన భూమి దశాబ్దాలుగా వివాదంలో ఉండేది. మేము అధికారంలోకి వచ్చాక ఆ వివాదం పరిష్కరించాం. ఆ పవిత్రమైన స్థలంలో నేను స్వయంగా ప్రార్థనలు చేశా. ఢిల్లీలో అంబేడ్కర్ చివరి రోజులు గడిపిన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. లండన్‌లో ఆయన నివసించిన భవనాన్ని మా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంబేడ్కర్ పట్ల మా భక్తి ప్రపత్తులు, గౌరవం తిరుగులేనివి’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…— Narendra Modi (@narendramodi) December 18, 2024 -
ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అంబేడ్కర్ విగ్రహంపై దాడి తర్వాత వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసింది. ఒకవేళ.. ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్‌లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.చంద్రబాబు సర్కార్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు -
జాతీయ ఎస్సీ కమిషన్ ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
-
మీరు చెరిపిస్తే చెరిగిపోయే పేరు కాదు..ఆదిమూలపు సురేష్ ఫైర్
-
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. ఎస్సీకమిషన్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం బుధవారం(ఆగస్టు14) ఢిల్లీలో కలిసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద టీడీపీ శ్రేణుల దాడిపై నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు నేతలు కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు, సీసీ కెమెరాలు ఆపేసి అంబేద్కర్ విగ్రహంపై దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీకమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఏ. సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎంఎల్సీ అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులున్నారు. కమిషన్ చైర్మన్‌ను కలిసి బయటికి వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ సిద్ధాంతాలపై దాడి: గురుమూర్తి,ఎంపీజాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానను కలిశాంఅంబేద్కర్ విగ్రహం పై దాడి అంటే ఆయన సిద్ధాంతాలపై దాడిఇది దళిత సమాజాన్ని అవమనపరచడమేఈ ఘటనపై ఎస్సీ కమిషన్ దర్యాప్తు చేయాలిఓర్వలేకపోతున్నారు: మేరుగ నాగార్జున, మాజీ మంత్రిఅంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఓర్వ లేక పోయారుపలుగులు, గుణపాలతో పొడిచి దాడి చేశారు.దీనిపై చర్యలు తీసుకోవాలని ధర్నాలు, నిరసనలు చేశాం.కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.ఎవరిపైనా కేసు పెట్టలేదు.పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు.అందుకే ఎస్సీ కమిషన్ ను కలిసి పరిస్థితి వివరించాం.చంద్రబాబు ప్రభుత్వం పై నమ్మకం లేదు.కేంద్ర బలగాలతో అంబేద్కర్ విగ్రహానికి భద్రత కల్పించాలి.రెండు నెలల నుంచి రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి.వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంబేద్కర్ విగ్రహం నిలబెట్టిన వేదికను పగలగొడితే దాడి కాదా ?త్వరలో ఏపీకి ఎస్సీ కమిషన్: ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రిటీడీపీ నాయకుల ప్రోద్బలంతో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది.దాడిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.వైఎస్ జగన్ పేరు తీసేస్తే.. చెరిగిపోయే పేరు జగన్‌ది కాదు.ఏపీ ప్రజల గుండె చప్పుడు వైఎస్ జగన్.రెండునెలల నుంచి జరుగుతున్న దాడులకు పరాకాష్ట అంబేద్కర్ విగ్రహం పై దాడిత్వరలోనే ఎస్సీ కమిషన్ ఏపీకి వస్తుంది.విగ్రహానికి కేంద్ర బలగాల భద్రత కల్పించాలి.పోలీసుల నిర్లక్ష్యం పై విచారణ జరపాలి.ప్రాణాలు అడ్డుపెట్టి విగ్రహాన్ని కాపాడుతాం.ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు: నందిగం సురేష్, మాజీ ఎంపీఅంబేద్కర్ విగ్రహం దాడి చేస్తే టీడీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.ఎస్సీ కమిషన్ కు అన్ని వివరించాం.దాడులు చూస్తే ఏపీ అంటేనే జనం హడలిపోతున్నారు.ఏపీని చంద్రబాబు అరాచకం వైపు నడిపిస్తున్నారు.బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలెక, దాడులకు పాల్పడుతున్నారు.దాడులకు భయపడేది లేదు.రెండు నెలలో టీడీపీ ఓటు బ్యాంకు అయిదు శాతం పడిపోయింది.దాడులు జరిగితే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి? -
అంబేద్కర్ విగ్రహం విధ్వంసం.. మౌనమెందుకు చంద్రబాబూ?
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ మహాశిల్పంపై దాడి ఘటనలో చంద్రబాబు సర్కార్ ఇప్పటికీ స్పందించలేదు. దాడిపై అంబేద్కర్ వాదులు మండిపడుతున్నారు. దాడి జరిగి రెండు రోజులవుతున్నా ఒక్కరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. కనీసం కేసు నమోదు చేసి విచారిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు. అంబేద్కర్ మహాశిల్పంపై సుత్తెలు, ఇనుప వస్తువులతో దాడి చేయగా, ఇంకా విచారణ చేయకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్ అవమానించడంపై వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. నేడు ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేయనుంది.కాగా, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనేనని అంబేద్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘం నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేపట్టారు.భావితరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరం నడిబొడ్డులో అంబేడ్కర్ విగ్రహం ఉండకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఉద్దేశమని, ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసిందని పలువురు మండిపడుతున్నారు. -
అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి: భరత్
-
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ విషయమై అంబటి శుక్రవారం(ఆగస్టు9) మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక దాడులు జరిగాయి. ఇప్పటివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాలపై, వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై టీడీపీ నేతలకు దాడులకు పాల్పడ్డారు. తాజాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపైనే దాడికి పాల్పడ్డారు. దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’అని మండిపడ్డారు.బాబు, లోకేష్‌ల ఆధ్వర్యంలోనే దాడి.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డిడాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి చేయడమే. రాష్ట్రంలో లాఅండ్ఆర్డర్ పనిచేయడం లేదు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలోనే విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం పై దాడి జరిగింది. అంబేద్కర్ స్మృతివనంపై కుట్ర ప్రకారమే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడిలో టీడీపీకి ప్రమేయం లేకపోతే వెంటనే అంబేద్కర్ స్మృతి వనంలో తొలగించిన వైఎస్జగన్ పేరును పున: ప్రతిష్టించాలి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావుయావత్తు దళిత జాతితో పాటు ప్రజాస్వామ్యవాదులంతా రాత్రి విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని ఖండించాలి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికి భరోసా లేదు. యావత్తు ప్రజానీకం భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు.దాడుల పర్వం కొనసాగుతోంది: గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమారాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం కేవలం దాడులకే పరిమితమయింది. సీఎం చంద్రబాబు అభివృద్ధిలో పోటీపడాలి కాని విధ్వంసాలతో పరిపాలన చేయడం మంచి విధానం కాదు. -
ఇది ప్రజాస్వామ్యంపై దాడి: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ స్మృతివనం దగ్గర నిరసనకు దిగారు. భావితరాలకు దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే టీడీపీ నేతలు దాడి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. వెంటనే దాడి ఘటనపై విచారణ చేయాలి. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం గుంటూరు: గుంటూరు లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం వద్ద శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి రాంబాబుఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ స్మృతివనంపై దుండగులు దాడి చేశారు. చంద్రబాబు,లోకేష్ ప్రమేయంతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది. దాడి దురదృష్టకరం. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. దాడి ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.టీడీపీ నేతల హస్తం ఉంది: పోతిన మహేష్అంబేద్కర్ విగ్రహంపై దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి. దాడిలో టీడీపీ నేతల హస్తం ఉంది. అధికారుల అండదండలతో దాడి చేశారు వెంటనే ప్రజలకు చంద్రబాబు క్షమాప చెప్పాలి -
అంబేద్కర్‌పై ‘పచ్చ’మూకల ఉన్మాదం.. దళిత సంఘాల ఆందోళన
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ వాదులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. గత రాత్రి జరిగిన దుశ్చర్య అంబేద్కర్ మహనీయుడి పై జరిగిన దాడిగానే చూస్తాం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన దాడేనని.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పరాకాష్టకు టీడీపీ దాడులు: మల్లాది విష్ణుఅంబేద్కర్ విగ్రహంపై దాడిని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ మాన్యుమెంట్‌పై వైఎస్ జగన్ పేరును తొలగించిన ప్రాంతాన్ని నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అంబేద్కర్‌పై దాడి హేయమైన చర్య అన్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: పుష్పశ్రీవాణిపార్వతీపురం మన్యం జిల్లా: డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరాయి. అంబేద్కర్ విగ్రహం పై దాడి చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగ మాత్రం అమల్లో ఉంటుందని అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదని చెప్పినట్టుగా వీళ్లు తీరు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రూ. 440 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారులు, పోలీసులు సమక్షంలో అంబేద్కర్ విగ్రహం పై దాడి జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది’’ అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు.విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం.గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి.రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. -
అంబెడ్కర్ విగ్రహ ధ్వంసానికి తరలివచ్చిన ఎల్లో గ్యాంగ్
-
విజయవాడ అంబెడ్కర్ విగ్రహంపై అర్ధరాత్రి టీడీపీ నేతల కుట్ర..
-
రిజర్వేషన్ల పితామహుడు..
భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి) -
అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు నెటజన్లలలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాధారణంగా సినీ నటీనటులలో సామాజిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, జాన్వీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.అంబేద్కర్, గాంధీ మధ్య డిబేట్ చూడటం తనకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని జాన్వీ కపూర్ తెలిపింది. ఒక నిర్దిష్ట అంశంపై అంబేద్కర్, గాంధీ అభిప్రాయాలు ఎలా మారాయి అనే దాని మధ్య చర్చ ఉండాలని ఆమె కోరింది. ఆమె మాటలతో ఇంటర్వ్యూయర్లు కూడా 'వావ్' అని ఆశ్చర్యపోయారు. ఈ సమాజం పట్ల వారిద్దరూ ఎంచుకున్న మార్గం పట్ల బలంగా నిలబడ్డారు. వాళ్లిద్దరూ మన సమాజానికి ఎంతో సహాయం చేశారు. వారు ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో అనేది తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన చర్చగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక నిర్దిష్ట అంశంపై వారి అభిప్రాయాలు కాలక్రమేణా ఎలా మారాయి..? కుల ఆధారిత వివక్ష, అంటరానితనం పూర్తిగా అంతమవ్వాలి అనే అంశంపై అంబేద్కర్ వైఖరి ఏమిటో స్పష్టంగా ఉంది. కానీ గాంధీ అభిప్రాయాలు నిరంతరం మారుతూ వచ్చాయి. ఎందుకంటే మన దేశంలో కులతత్వం కాకుండా, దానిపై మూడవ వ్యక్తి నుంచి అభిప్రాయాలు పొందడం అనేది వాస్తవ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ పాఠశాలలో ఎప్పుడైనా కులతత్వం గురించి చర్చించారా? అనే ప్రశ్నకు జాన్వీ ఇలా సమాధానమిచ్చింది. 'లేదు, నా స్కూల్లో కాదు, నా ఇంట్లో కూడా కులం గురించి ఎప్పుడూ చర్చ జరగదు.' అని జాన్వీ చెప్పింది. దీంతో నెటిజన్లు కూడా ఆమె మాటలకు ఫిదా అవుతున్నారు. Rather surprised to see this from a mainstream Bollywood actor. Janhvi Kapoor on Ambedkar, Gandhi & caste 👏pic.twitter.com/KyH8Ad08f5— Siddharth (@DearthOfSid) May 24, 2024 -
అంబేద్కర్ సాధించిన అద్భుత విజయాలు
నేడు అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బి ఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే. నిజానికి అంబేద్కర్ ఇంటిపేరు అంబావ్డేకర్ (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం ‘అంబవాడే’ పేరు నుండి వచ్చింది). అయితే అతని గురువు మహదేవ్ అంబేద్కర్ ఇంటిపేరును ‘అంబావ్డేకర్’ నుండి ‘అంబేద్కర్’గా పాఠశాల రికార్డులలో మార్చారు. అంబేద్కర్ మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పనివేళలను 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు. బాబా సాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్‌లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకనిగా పేరుగాంచారు. పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొలంబియా యూనివర్శిటీలో ఉన్న మూడేళ్లలో, అంబేద్కర్ ఆర్థికశాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో ఆరు, ఫిలాసఫీలో ఐదు, హ్యుమానిటీస్‌లో నాలుగు, పాలిటిక్స్‌లో మూడు, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్లలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1995లో అంబేద్కర్ రాసిన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్. హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితన తొమ్మిది భాషల్లో అంబేద్కర్‌కు పరిజ్ఞానం ఉంది. ఇంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశాడు. బుద్ధ భగవానుడు కళ్లు తెరిచి చూస్తున్న మొదటి చిత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. అంతకు ముందు బుద్ధ భగవానునికి చెందిన పలు చిత్రాలు కళ్లు మూసుకున్న తీరులో ఉండేవి. -
అంబేద్కర్‌కు యూపీ సీఎం నివాళులు!
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగుస్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సీఎం యోగి పేర్కొన్నారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ నగరంలో జన్మించారు. ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. -
కుల రహిత భారతం సాధ్యమే
భారతదేశానికి ‘కులం’ అనేది ఓ శాపం లాంటిది. కుల వ్యవస్థ... తద్వారా వచ్చిన సామాజిక అంతరాల వల్ల ఉత్పత్తి శక్తుల ప్రతిభ నిర్వీర్యమైంది. మని షిని మనిషిగా చూడ లేని దుర్మార్గ వ్యవస్థ వేల ఏండ్లుగా కొనసాగు తోంది. అంబేడ్కర్ లాంటి ప్రపంచ మేధా వియే కుల వ్యవస్థ దుర్మార్గం వల్ల విపరీత మైన వేదనకు గురయ్యారు. ఈ కులవ్యవస్థ పొడగింపు ప్రజాస్వామ్య ప్రభుత్వాల కాలంలోనూ కొనసాగడం గమనార్హం. కులవ్యవస్థ భారత జాతిని నిర్వీర్యం చేసింది. దేశంలోని 85 శాతం ప్రజలను సేవ కులుగా మార్చింది. అందుకే కుల రహిత భారతాన్ని కోరుకున్నారు అంబేడ్కర్. భారత దేశం కుల రహితంగా మారేంత వరకూ, ఆ వ్యవస్థ వల్ల వచ్చిన సామాజిక అంతరాలు పోయే వరకూ శూద్రులకు, అతిశూద్రులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచారు. కుల నిర్మూలన సిద్ధాంతాన్ని అందించారు. కులరహిత భార తాన్నీ, సెక్యులర్ భారతాన్నీ అంబేడ్కర్ కోరు కున్నారు. కానీ, రాజ్యాధికారంలో ఉంటు న్నదీ, రాజ్యాంగాన్ని అమలుపరిచే స్థానంలో ఉంటున్నదీ కుల వ్యవస్థ వల్ల లాభపడుతున్న వారే కావడం వల్ల కుల నిర్మూలన జరుగడంలేదు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు కూడా అమలు కావడం లేదు. ఏది ఏమైనా దేశాన్ని అంధకార యుగంలోకి తీసుకు వెళ్ళే కులవ్యవస్థ అంతరించాల్సిందే. కులవ్యవస్థ అంతరించడమంటే వృత్తి పనులు అంతరించడం కాదు. అన్ని దేశా ల్లోనూ వివిధ వృత్తులకు సంబంధించిన పనులున్నాయి, కానీకులాలు లేవు. కులవృత్తులు లేవు. అయితే కులవ్యవస్థ లేనిచోట అన్ని సమస్యలూ పరిష్కారమైనాయా అంటే కాక పోయి ఉండవచ్చుగాక. కాని, కులవ్యవస్థ వల్ల వచ్చే పుట్టుకతోనే దఖలుపడే అధి కారాలు, ఆస్తులు, వివక్ష, పేదరికం, సామా జిక అంతరాలు అక్కడ లేవు. దేశంలోని కోట్లాది మందిని అస్పృశ్యులుగా ముద్ర వేయడం ఏ దేశంలోనూ లేదు. ఒక్క భారత్‌లో తప్ప. కుల రహిత భారతం ఏర్పడితే భారత జాతి అంతా ఒక్క టవుతుంది. సామాజికఅంతరాలు దూరమవుతాయి. ఎ వరికిష్టమైన పనిని, వృత్తిని వారు స్వీకరిస్తారు. ఇది తక్కువ పని, అది ఎక్కువ పని అనే భేద భావాలు తొలగిపోతాయి. విదేశాల్లోలా కులాల బట్టి కాకుండా ఎవరికి ఏ పనిలో నైపుణ్యముంటుందో ఏ పని చేయడానికి ఇష్ట పడుతారో ఆ పని చేస్తారు. అందరూ అన్ని పనులూ చేస్తుంటే సామాజిక అంతరాలు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. కులాలను కాపాడుతున్నవారు కులాలతో సామాజిక గౌరవం, ఆస్తులు, రాజ్యధికారం అనుభవిస్తున్నారు. వీళ్ళు కులనిర్మూలనకు సహకరించకపోగా కులాలను పెంచి పోషిస్తు న్నారు. వీరి స్థానంలో కుల బాధితులూ,కులంలో అత్యంత హీనస్థితిలో ఉన్నవారూ, మూలజాతుల వారూ రాజ్యాధికారంలోకి వస్తే మంచి ఫలితం ఉంటుంది. వీరు కనీసం యాభై ఏళ్లు పరిపాలన చేస్తే కుల నిర్మూలన జరుగుతుంది. నిచ్చెన మెట్ల కుల సమాజంలో అట్ట డుగున ఉన్నవారు రాజ్యాధిరారంలోకి వస్తే పై మెట్టుపై ఉన్న వారు మాకీ కులాలు వద్దని మొత్తుకుంటారు. కుల నిర్మూలనకు సహక రిస్తారు. ఎలాగూ వేల ఏండ్లుగా బాధితులైన మూలజాతుల వారు తాము పాలకులై తమను ఇన్నేండ్లుగా బాధలో ఉంచిన కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇలా అటు ఆగ్రకులాల వారూ, ఇటు శూద్ర, అతిశూద్ర కులాలవారూ కులనిర్మూలనకు సహకరిస్తే ఓ యాభై అరవై ఏళ్లల్లో దేశం లోంచి కులం మాయమైపోతుంది. - వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్: 91829 18567 - డా‘‘ కాలువ మల్లయ్య -
విగ్రహంపైనా టీడీపీ విష రాజకీయం
సాక్షి ప్రతినిధి, కడప: కాదేదీ దుష్ప్రచారానికి అనర్హం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిష్ట దెబ్బతీసేలా వారి వైఖరి ఉంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందుల కేంద్రంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సైతం రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా వివిధ సర్కిల్స్‌లో జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జాతిపిత మహాత్మాగాం«దీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తెలంగాణ నుంచి తీసుకువచ్చారు. ఇవి శుక్రవారం సాయంత్రానికి పులివెందుల చేరుకున్నాయి. పాత బస్టాండు సమీపంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు పిల్లర్ సిద్ధం చేశారు. అక్కడే విగ్రహాలు క్రేన్ సహాయంతో లారీ నుంచి దించారు. వైఎస్సార్ విగ్రహాన్ని పిల్లర్‌పైన పెట్టారు. అలాగే జాతిపిత విగ్రహం ఆవిష్కరణకు కోర్టు సర్కిల్ వద్ద ఏర్పాట్లు చేశారు. గరండల్ బ్రిడ్జి సమీపంలో సుందరీకరణతోపాటు అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచారు. ఇంకా పిల్లర్, సుందరీకరణ పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ నిరంజన్‌రెడ్డి ఇంట్లో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని భద్రపర్చారు. అంతలోనే క్రేన్ నుంచి కిందికి దించిన విగ్రహాన్ని ఫొటో తీసి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో అంబేడ్కర్ విగ్రహాన్ని వైఎస్సార్ విగ్రహం కింద ఉంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు మోడల్ టౌన్లో భాగంగా సుందరీకరణ పనులు, జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులు కొనసాగుతున్నాయి. అంతలోనే రాజకీయ స్వలాభం కోసం సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రతిష్టను దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పిల్లర్ లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని ప్రశి్నస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనం నుంచి దించి ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి ప్రచారం చేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. అంబేడ్కర్‌ను కించపరిచే విధంగా అవాస్తవాలు ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత సుందరంగా అంబేడ్కర్ విగ్రహం పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా సుందరంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పులివెందులలో మాటా్లడుతూ స్థానిక గరండాల్ బ్రిడ్జి దగ్గర విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్, పార్టీ పట్టణ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి స్థానిక ఎస్సీ, బీసీ నాయకులతో కలిసి స్థల పరిశీలించారని తెలిపారు. అందులో భాగంగా శిల్ప కళాకారుడితో ప్రత్యేకంగా కళాత్మకంగా రూపొందించిన అంబేడ్కర్ విగ్రహం కూడా పులివెందులకు చేరుకుందన్నారు. టీడీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. -
81 అడుగుల పీఠంపై 125 అడుగుల కాంస్య విగ్రహం
-
నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ర్యాలీలు
-
కొడాలి నాని బైక్ ర్యాలీ.. జై బీమ్...!
-
అంబేడ్కర్ స్మృతివనానికి మొత్తం ఖర్చు రూ.404.35 కోట్లు
-
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్న అభిమానులు
-
అంబేద్కర్ జీవిత చరిత్ర? మ్యూజియంలో నమ్మలేని విశేషాలు
-
విజయవాడ నగరం నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు
-
బౌద్ధ శిల్పకళ కాలచక్ర మహా మండలంగా విగ్రహ పీఠం
-
చంద్రబాబు, ఈనాడుకి అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదు: ఆదిమూలపు
-
అంబేడ్కర్ విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు
-
విజయవాడకు బయలుదేరిన ప్రజలు..!
-
ఆకాశమంత అంబేద్కర్..!
-
‘రామోజీ.. మరి నీకు అర్హత ఉందా?’
సాక్షి, విజయవాడ: తన వయసుకు తగినట్టు రామోజీరావు నడుచుకుంటే మంచిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు. రామోజీరావుకు ఏం అర్హత ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అంబేద్కర్ గురించి కథనాలు రాశారు. సీఎం జగన్‌కు అర్హత లేదని రామోజీ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిండచమే అవుతుందన్నారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి. సీఎం జగన్‌కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని చెప్పడానికి రామోజీకి ఏం అర్హత ఉంది. ఆయన వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. నేను 2009లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేశాను. ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్ రెడ్డి ఎవరు?. 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్సీపీ సాధిస్తుంది. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ముఖ్యమంత్రి జగన్ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు అంటూ కామెంట్స్ చేశారు. -
ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: సీఎం వైఎస్ జగన్
-
Vijayawada Ambedkar Statue: విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు (ఫొటోలు)
-
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర
-
చరిత్రలో నిలిచిపోయే ఘట్టం... అందరూ ఆహ్వానితులే
-
ఎంపీ విజయసాయిరెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్‌ను విడుదల చేశారు
-
AP: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. అందరూ ఆహ్వానితులే: విజయసాయిరెడ్డి అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపం అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విజయసాయి అన్నాయి. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని.. ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ►ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. -
పేదల పట్ల సీఎం జగన్‌కు ఎంతో మమకారం: విజయసాయిరెడ్డి
-
అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 19న విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, సీం టూర్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 400 కోట్లకు పైగా వ్యయం చేసి అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశాం. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తరతరాల వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేద్కర్ కృషి మరువలేనిది. అంటరానితనం నిర్మూలించాలని పోరాడిన యోధులు అంబేద్కర్. సమసమాజ నిర్మాణానికి అంబేద్కర్ న్యాయ మహాశిల్పం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అంబేద్కర్ భారత గడ్డ పై పుట్టి ఉండకపోతే నేటికీ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది ఉండేవి కాదు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగానే నవరత్నాలను రూపొందించారు’’ విజయసాయి పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశాం. సమతా సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలిరానున్నారు. లక్షా 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుంది. 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. దార్శనికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదు. చరిత్రలో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం నిలిచిపోతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
సామాజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’
‘‘అంబేడ్కర్ స్మతివనం చరిత్రాత్మకమైనది. ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుంది. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప నిర్మాణం ఇది’’ – విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా, ఆంధ్రప్రదేశ్ నడిరోడ్డున ఉన్న విజయవాడ నగరంలో సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం ఆవిష్కృతమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నత రూపం ప్రజలకు దర్శనమివ్వబోతోంది. ► పెడస్టల్‌తో కలిపి 210 అడుగుల ఎత్తయిన నిర్మాణం ► 18.81 ఎకరాల్లో స్మృతివనం నిర్మాణం ► రూ.400 కోట్లతో చరిత్రలో నిలిచేలా... ► అంబేడ్కర్ ఫొటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు ► కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టులు యిర్రింకి ఉమమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)’గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ స్మృతివనం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. స్మృతివనాన్ని, అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది. అంబేడ్కర్ ఆలోచనలకు అద్దం పట్టే అద్భుత కళాఖండంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అంబేడ్కర్ విగ్రహ పీఠం కింది భాగంలో నిర్మించే భవనంలో అంబేడ్కర్‌కు సంబంధించిన ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు, ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంధాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అవసరమైన జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ధ్యాన కేంద్రం కూడా నిరి్మస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, పచ్చటి తివాచీ పరిచినట్టు అందమైన గార్డెన్లు. మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా కింది భాగంలో గడ్డితో తీర్చిదిద్దిన నెమళ్ల ఆకృతులను సందర్శకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. స్మృతివనం భవనంలో గోడలపై స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చాక ఘట్టాలను అపురూప కళాఖండాలుగా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల ఫొటోలతో కూడిన కళాఖండాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహరీ మొత్తం రాజస్థాన్ పింక్ కలర్ రాళ్లతో అద్భుతంగా నిర్మించారు. అక్కడక్కడా పాల రాతిని ఉపయోగించారు. ప్రహరీ చుట్టూ ఆకట్టుకునే ఆకృతుల్లో వాటర్ ఫౌంటేయిన్లు, ఎలివేషన్ డిజైన్లతో తీర్చిదిద్దారు. స్మృతివనం చుట్టూ దారి పొడవునా గ్రీనరీ ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. ‘సామాజిక సమతా సంకల్పం’ అంబేడ్కర్ స్మృతివనం, విగ్రహం ప్రారం¿ోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తోంది. ‘సామాజిక సమతా సంకల్పం’ పేరుతో ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాయాల్లో ప్లెక్సీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికార సిబ్బంది భాగస్వాములయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 19న విజయవాడలో ప్రారం¿ోత్సవానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా స్మృతివనం దేశంలోనే మరెక్కడా లేని విధంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విగ్రహ నిర్మాణం వేగంగానే పూర్తయింది. స్మృతివనం కూడా పూర్తయ్యాకే ప్రారం¿ోత్సవం చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అన్ని పనులను అంతే వేగంగా పూర్తి చేశాం. సందర్శకులు ఒక్కసారి స్మృతివనానికి వస్తే అంబేడ్కర్ చరిత్ర పూర్తిగా అవగతమయ్యేలా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గతంలో చంద్రబాబు అంబేడ్కర్ స్మృతివనాన్ని అమరావతి రాజధానిలో నిరి్మస్తానని ప్రకటించి దాన్ని గాలికి వదిలేసి దగా చేశాడు. – మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రికార్డు సమయంలో స్మృతివనం పనులు పూర్తి అంబేడ్కర్ స్మృతివనం పనులు రికార్డు సమయంలో శరవేగంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్ మహోన్నత సంకల్పంతో చేపట్టిన ఈ గొప్ప ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఎనలేని కృషి చేశారు. ఈ నెల 19న అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దేశంలోనే ఇది అద్బుత కళాఖండంగా నిలుస్తుంది. ఈ ప్రాంతం గొప్ప దర్శనీయ క్షేత్రంగా మారుతుంది. – శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇవీ ప్రత్యేకతలు ► బేస్ (పెడస్టల్) 85 అడుగులు (జి ప్లస్ టు అంతస్తులు) ► విగ్రహం తయారీకి ఉపయోగించిన స్టెయిన్లెస్ స్టీల్ 400 మెట్రిక్ టన్నులు ► 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని విగ్రహం కోసం ఉపయోగించారు ► 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయి తాపడం ► కన్వెన్షన్ సెంటర్, యాంఫీ థియేటర్ ► మెడిటేషన్ సెంటర్ ► విశాలమైన కారిడార్లు (నడక దారులు) ► పచ్చని గార్డెన్, అందమైన మొక్కలు -
విజయవాడ అంబేద్కర్ విగ్రహం.. ఎన్నో విశేషాలు (ఫొటోలు)
-
19న అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మృతివవాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు. స్మృతివనం పనులను శ్రీలక్ష్మి గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 18.81 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, కాంస్య విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, పాదపీఠం ఎత్తు 85 అడుగులు అని, దీంతో మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు ఉంటుందన్నారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం అని తెలిపారు. స్మృతివనంలోని అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, చిన్నారులకు ప్లే ఏరియా, గార్డెన్లు, మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్లు కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారని వివరించారు. స్మృతివనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండం ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన అంబేడ్కర్ విగ్రహ ప్రారం¿ోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తారని చెప్పారు. -
దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం: విక్టర్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల డా. బీఆర్.అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.400 కోట్లతో స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని బడుగు, బలహీనవర్గాలవారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిఒక్కరూ కుల, మత, పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అందరివాడైన అంబేద్కర్ స్మృతి వనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా డా.బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండగ వాతావరణంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. -
జనవరి 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ: సజ్జల
సాక్షి, అమరావతి: జనవరి 19న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని బుధవారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఏ మూల నుంచి చూసినా రాజ్యాంగనిర్మాత అంబేడ్కర్ కనిపిస్తారని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ, సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేసినట్లు తెలిపారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని పేర్కొన్నారు. భారతజాతి గురించి, మనదేశం గురించి చెప్పాలనుకున్నా మొదట చెప్పాల్సిన పేర్లలో అంబేడ్కర్ పేరు ఉంటుందన్నారు. అది ప్రతి రాజకీయనేత తలుచుకునే పేరన్నారు. అంబేడ్కర్‌ని ఓ సిద్ధాంతంగా తీసుకుని మనసావాచా నమ్మిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటులో వైఎస్ జగన్ సంకల్పం కనిపిస్తుందన్నారు. అంబేడ్కర్ ఎక్కడో ఊరిబయట కాదు.. నగరం నడిబొడ్డున ఉండాలని సీఎం జగన్ భావించారన్నారు. అదృష్టవశాత్తు విజయవాడ నగరం కూడా అందుకు చాలా సానుకూలమైందన్నారు. ప్రోగ్రెసివ్ ఆలోచనలకు పురిటిగడ్డ అయిన విజయవాడ రాజకీయపరమైన ఆలోచనలో అత్యంత అభ్యుదయకరమైన ఆలోచనలకు, స్వాతంత్ర పోరాటానికి యూనివర్సల్‌గా అన్నింటిని యాక్సెప్ట్ చేసిన నగరమని చెప్పారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి మాట్లాడుతూ రూ.400 కోట్లతో సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేయడం పెద్ద చరిత్ర సృష్టిస్తోందన్నారు. చంద్రబాబు ఎక్కడో ముళ్లకంపల్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే సీఎం జగన్ మాత్రం విజయవాడలో ఎంతో విలువైన స్థలంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దళితులను అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న సీఎం జగన్‌కి అందరూ అండగా నిలవాలన్నారు. దళితులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. టీడీపీలోని ఎస్సీ లీడర్లు కూడా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో చేయాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి దళిత కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పేట, ప్రతి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ గురించి తెలియజేయాలని సూచించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. గతంలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు దళితులను మోసం చేశారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. దళితులంటే అసహ్యంగా భావిస్తారని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ప్రతి దళితుడు గర్వంగా ఫీలవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టాలని సీఎం జగన్ గొప్ప ఆలోచన చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ దళితవర్గాలను పైకి తీసుకురావాలనేది సీఎం జగన్ దృఢసంకల్పమని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు నందిగం సురేష్, గురుమూర్తి, రెడ్డప్ప, ఎమ్మెల్సీలు ఇజ్రాయేల్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, పచ్చమీడియా కలసి ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని, విమర్శలను పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకత్వాలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు పేదరికాన్ని ఏ విధంగా తగ్గిస్తున్నాయి, రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతిపథంలోకి తీసుకెళ్తున్నాయనే విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం ద్వారాగానీ, ప్రెస్‌మీట్ నిర్వహించిగానీ ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని అరికట్టేవిధంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రస్థాయిలో పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ రాష్ట్ర బాధ్యులు, మంత్రులు మాట్లాడుతుంటారని, కిందిస్థాయిలో ఎస్సీ సెల్ నేతలు, జిల్లా బాధ్యులు చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని సూచించారు. ఎన్నికలు రానున్న తరుణంలో ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలన్నారు. మన ఇంట్లో పని సానుకూలం చేసుకునేందుకు ఓ సంకల్పంతో, పట్టుదలతో ఎలా పనిచేస్తామో.. అదేవిధంగా 2024లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు! ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచే పార్టీలో పోటీచేయాలని చాలామంది ఆశపడతారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టికెట్ల కోసం డిమాండ్ కూడా ఉంటుందన్నారు. నాయకులు ఎక్కువగా ఉన్నప్పుడు పోటీకి ఆశపడతారన్నారు. ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. తమ పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే, పోటీచేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారని తెలిపారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని చెప్పారు. ఎవరూ టికెట్లు అడగలేదు, డిమాండ్ లేదు.. అంటే ఆ పార్టీ ప్రజల మనసుల్లో లేనట్లేనన్నారు. నిరసనలు సాధారణమని పేర్కొన్నారు. టీడీపీ లాంటి ఎత్తిపోయిన పార్టీల్లో అయితే నిరసలు ఉండవని చెప్పారు. పోటీకి ఆశపడే వారితో మాట్లాడతామని, అందరిని ఒక తాటిపైకి తెస్తామని, అదేమీ పెద్ద విషయం కాదని ఆయన తెలిపారు. -
అంబేడ్కర్ స్మృతివనం చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: ప్రజల మధ్య ఐక్యతను, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో అంబేడ్కర్ స్మృతివనం కీలకపాత్ర పోషిçస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయానికి చిహ్నం) కాన్సెప్ట్‌గా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుచేస్తున్నామన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్మృతివనం, విగ్రహం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసే విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అవి.. ►అంబేడ్కర్ స్మృతివనంలో కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తికావాలి. ఇందులో పక్కాగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీని నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ►స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలి. ►నడకదారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలి. ►ఈ పనులన్నింటిపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ► విగ్రహం, స్మృతివనం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా నిర్ధేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలి. జనవరి 15 నాటికి పనులు పూర్తిచేస్తాం అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనాన్ని జనవరి 24న ప్రారంభించేలా ఏర్పాట్లుచేస్తున్నామని, అన్ని పనులను జనవరి 15 నాటికి పూర్తిచేస్తామని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. సమీక్ష సందర్భంగా పనుల పురోగతిని అధికారులు వివరించారు. స్మృతివనంలో 81 అడుగుల ఎత్తయిన పీఠంపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఉంటుందన్నారు. దీంతోపాటు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో కృష్ణా నదికి నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దానికి ఆనుకుని పార్కు, వాకింగ్ ట్రాక్ పనులు చురుగ్గా జరుగుతున్నాయని కూడా అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్మృతివనం పనులు పరిశీలించిన మంత్రులు సమీక్ష సమావేశానంతరం అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులను ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునతోపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, ఇతర అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో సామాజిక అంతరాలను తొలగించి సమసమాజ స్థాపనకు కృషిచేస్తున్నారన్నారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు సీఎం జగన్ గొప్ప సంకల్పంతో స్మృతివనాన్ని నిర్మిస్తున్నారన్నారు. రూ.400 కోట్లతో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంటోందన్నారు. చివరి దశలో ఉన్న పనులను సత్వరం పూర్తిచేసి ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
అంబేద్కర్ విగ్రహావిష్కరణపై సీఎం జగన్ సమీక్షా
-
గడువులోగా అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనది ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం ఇది ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుంది నిర్ధేశించుకున్న గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలి స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రిపబ్లిక్‌డే నాటికి పూర్తయ్యే విధంగా... పనులు చేపడుతున్నామన్న సీఎంకు తెలిపిన అధికారులు. జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామన్న అధికారులు కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తి కావాలన్న సీఎం కన్వెన్షన్ సెంటర్లో మౌలిక సదుపాయాలును పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశం నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్ స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలన్న సీఎం నడక దారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలని ఆదేశం పనులు నిర్ధేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం ఆ మేరకు నిరంతరం పనుల పర్యవేక్షణ జరగాలన్న సీఎం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు. అంబేద్కర్ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు... విగ్రహం ఎత్తు 125 అడుగులు. కృష్ణలంక ప్రాంతంలో నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల సుందీకరణ పనులపై పలు ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు. పార్క్, వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు సీఎంకు వివరించిన అధికారులు. పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు -
సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఢిల్లీ: సుప్రీం కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్నిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని సుప్రీంకోర్టులో ఏర్పాటు చేయాలన్న అంబేద్కర్ మూమెంట్‌కు చెందిన కొందరు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు సీజేఐ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆర్గూయింగ్ కౌన్సిల్ అసోషియేషన్(ఎస్‌సీఏసీఏ) కూడా సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీజేఐకి విజ్ఞప్తి చేసింది. 1949 నవంబర్ 26న కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అనంతరం రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి..దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతియేటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల పౌరులలో గౌరవ భావాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం అనేది ప్రారంభమైంది. సామాజిక న్యాయం, సాధికారతను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తయింది. మన దేశ రాజ్యాంగం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అనేక దేశాల నియమాలను చేర్చారు. అమెరికా, ఐర్లాండ్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల రాజ్యాంగాల సహాయం తీసుకున్నారు. ఈ దేశాల రాజ్యాంగాల నుండి, పౌరుల విధులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పాత్ర, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
అంబేద్కర్ ని చంద్రబాబు అవమానించాడు
-
అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం
-
అంబేడ్కర్ స్మృతివనం పనులపై పరిశీలించిన స్పెషల్ సీఎస్
-
ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని స్వ రాజ్య మైదానంలో అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 26న స్మృతి వనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించే వేదిక కానుంది. ఈ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సూచనలు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది. 18.18 ఎకరాల్లో రూ.400 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తిస్థాయిలో విగ్రహ భాగాలు బిగించారు. సెంట్రింగ్ కర్రలు మాత్రమే తొలగించాల్సి ఉంది. అంబేడ్కర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు వీలుగా డిజిటల్ మ్యూ జియం, మినీ థియేటర్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. ప్రహరీ, మరికొన్ని అదనపు పనుల కోసం అదనంగా రూ.106 కోట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. లైటింగ్, గ్రానైట్, పాత్వే, వాటర్ ఫౌంటైన్, వెహికల్ పార్కింగ్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, సుందరీకరణ తదితర పనులు వేగంగా సాగుతున్నాయి. రేయింబవళ్లు వందలాది కార్మికులు, భారీ యంత్రాలతో పనులు సాగేలా అధికారులు చూస్తున్నారు. మంత్రుల సబ్ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నిర్మాణ పనులను పరిశీలిస్తోంది. మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పనులను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి సమయాల్లో సైతం పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పనుల వేగం పెంచుతున్నారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. తుది దశకు పనులు అంబేడ్కర్ స్మృతి వనం ప నులు వేగంగా సాగుతున్నాయి. విగ్రహానికి సంబంధించిన డిజైన్లు, ఢిల్లీ నుంచి వచ్చిన స్మృతివనం నిర్మాణం డిజైన్స్ ఆ ధారంగా పొరపాట్లకు తావు లేకుండా నాణ్య తా ప్రమాణాలు పాటించాం. సీలింగ్, ప్లాస్టింగ్ పనుల్లో జాప్యం లేకుండా చేస్తున్నారు. పనుల నాణ్యతా ప్రమాణాలను క్వాలిటీ కంట్రోల్ అ ధికారులు తనిఖీ చేస్తున్నారు. కారిడార్ మొ త్తం గ్రానైట్ ఫుట్‌పాత్, ల్యాండ్ స్కేప్, కాంపౌండ్ నిర్మాణం తుది దశకు చేరుకుంటున్నా యి. పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మునిసిపల్ కమిషనర్, విజయవాడ -
మహనీయుల మార్గంలో నడవాలి...
నవాబుపేట: అంబేడ్కర్ జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని లింగంపల్లిలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి అయిన అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. తాను అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి ఆయన పెట్టిన భిక్షేనని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, జగ్జీవన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ.. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ దేశానికి రెండు కళ్లలాంటివారన్నారు. వీరి జీవిత పాఠాలు అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టంచేశారు. అన్ని కష్టాలను వారు అనుభవించి మనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన మహానుభావులని కొనియాడారు. అందరూ ఆత్మ గౌరవంతో బతికేందుకు చదువే ఏకై క సాధనమని చాటిచెప్పిన మహనీయులన్నారు. జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి దేశానికి అందరికన్నా ఎక్కువ సేవ చేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. స్వాతంత్రోద్యమంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ప్రస్తుత రిజర్వేషన్లు ఆయన ఘనతేనని తెలిపారు. ఎమ్మార్పీస్ కేవలం రిజర్వేషన్ విభజన కోసమే పుట్టలేదన్నారు. ఆరోగ్యశ్రీ, సామాజిక పింఛన్ల పెరుగుదల ఉద్య మంలో తమది కీలక పాత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడుమూరి ఆనందం,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, సర్పంచు లు సోలిసేట నర్సింలు, రత్నం,పర్మయ్య,రంగారెడ్డి, నాయకులు కళ్యాణ్‌రావ్, ఆనందం పాల్గొన్నారు. -
రూ.10 వేలు అప్పు చెల్లించలేదని కాల్పులు.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్.కె.పురంలో ఒకతను 10 వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించమంటే తప్పించుకుని తిరుగుతున్న కారణంగా తుపాకీలతో దాడి చేసిన ముగ్గురు దుండగులు. ఈ కాల్పుల్లో అప్పు తీసుకున్న వ్యక్తి ఇద్దరు సోదరీమణులు మృతి చెందారు. నైరుతి ఢిల్లీలోని ఆర్.కె.పురం అంబేద్కర్ బస్తీలో నివాసముంటున్న లలిత్ కొన్నాళ్ల క్రితం 10 వేలు అప్పు చేశాడు. తీరా అప్పును తిరిగి చెల్లించమంటే తప్పించుకుంటున్నాడని 15 నుండి 20 మంది దుండగులు పథకం ప్రకారం లలిత్ ఇంటి పరిసరాల్లో ఉదయం 4 గంటలకు మాటేశారు. మొదట ఒకతను తలుపు తట్టగా ఎవ్వరూ తలుపు తీయలేదు. దీంతో కొద్దిసేపటికి డోర్ మీదకు ఇటుకలు విసరడం మొదలుపెట్టారు. ఆ తలుపు చప్పుళ్లకు ఇంట్లో నుంచి లలిత్ తోపాటు అతని సోదరీమణులు పింకీ(30), జ్యోతి(29) కూడా బయటకు వచ్చారు. రాళ్లు ఎందుకు విసురుతున్నారని దుండగలతో వాగ్వాదానికి దిగారు. మాట్లాడుతున్నంతలోనే వారిలో నుంచి ఒకతను తుపాకి తీసి కాల్పులు జరిపాడు. పింకీ, జ్యోతి ఇద్దరిలో ఒకరికి ఛాతీలోకి మరొకరికి కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోగా అక్కచెల్లెలిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. లలిత్ మాత్రం ఎలాగోలా అక్కడినుండి తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారమందించారు. హుటాహుటిన తెల్లవారు జామున 4.40 ప్రాంతంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ సౌత్ వెస్ట్ డెప్యూటీ కమిషనర్ మనోజ్.సి తెలిపిన వివరాల ప్రకారం పింకీ, జ్యోతిలను స్థానిక ఎస్.జె హాస్పిటల్ కు తరలించగా అప్పటికే వారు మృతి చెందారని, డబ్బు వివాదమే కాల్పులకు కారణమని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: 30 ఏళ్ల క్రితం చేసిన మర్డర్.. తాజాగా తాగి వాగేసి.. దొరికేశాడు -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పైప్‌లైన్ గ్యాస్ లీక్
-
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని..!
-
ఆహ్వానం అందితే వెళ్దామనుకున్నా: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: నగరంలో హుస్సేన్ సాగర్ తీరాన భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నిన్న(శుక్రవారం) అట్టహాసంగా సాగింది. అయితే.. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ దూరంగా ఉన్నారు. ఈ పరిణామంపై తాజాగా ఆమె స్పందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనకు ఆహ్వానమే అందలేని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందితే వెళ్దామనుకున్నా. అంబేద్కర్ మహిళల హక్కుల గురించే ఎక్కువ మాట్లాడేవారు. అయితే మహిళా గవర్నర్ అయినా నాకు ఆ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యం. అందుకే రాజ్‌భవన్‌లోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళులు అర్పించాను అని తమిళిసై తెలిపారు. -
కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇన్నేళ్లుగా రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.గతంలో ఈ కార్యక్రమాలకు హాజరుకాకుండా అంబేడ్కర్‌ను అవమానించిన కేసీఆర్ ఎన్నికలొస్తున్నాయని ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు. అలాగే, రూ.కోట్లు వెచ్చించి ప్రకటనలు ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సంజయ్, ఇతరనేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ‘దళితబంధు దేశానికి దిక్సూచి అంటూ ఇచ్చిన ప్రకటనలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంతమందికి దళితబంధు ఇచ్చారో, ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలి. దీనిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని అన్నారు. అంబేడ్కర్‌ను, దళితులను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించే అర్హత లేదన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడినే తొలి సీఎంగా చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు. దళితులకు మూడెకరాలు ఎందుకివ్వలేదు? దళితుల పేరిట ఉన్న జాగాలను ఎందుకు లాక్కుంటున్నారు? ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ నిధులివ్వకుండా పేదలకు విద్య, వైద్యాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు?’ అంటూ కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. వీటికి సమాధానాలు ఇవ్వలేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. అణగారిన వర్గాల దిక్సూచి అంబేడ్కర్ అని ఐక్యరాజ్యసమితి చెప్పిందంటే అంబేడ్కర్ గొప్పతనం అర్ధం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నేతలు బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కొప్పు బాషా, మాజీ డీజీపీ క్రిష్ణప్రసాద్ పాల్గొన్నారు. కాగా, ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి సంజయ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. మహాశయా... మన్నించు... ‘అంబేడ్కర్ మహాశయా... మాట ఇస్తున్నా. 2023లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారంలోకి వచ్చాక మీ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని పార్టీపక్షాన హామీ ఇస్తున్నా’ అని అంబేడ్కర్‌ను ఉద్దేశించి బండి సంజయ్ లేఖ రాశారు. ‘మహాశయా... మన్నించు.. మీ వంటి చారిత్రక వ్యక్తి విగ్రహాన్ని దళిత ద్రోహి ప్రారంభించడం బాధగా ఉంది. మీరు రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ మిమ్మల్ని అవమానించినోళ్లే ఓట్ల కోసం మీ జపం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వం ధారపోసిన మహనీయుడు మీరు. అందరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి మీరు. అలాంటి మీ విగ్రహం వద్దే ఓట్ల రాజకీయ క్రీడను మొదలుపెట్టడం బాధగా ఉందన్నారు. ౖ‘2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ మీ విగ్రహం సాక్షిగా చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నారు’ అని ఎద్దేవాచేశారు. ‘నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తున్నోళ్లే మీ సిద్ధాంతం గొప్పదని బాకాలు కొడుతున్నారని ధ్వజమెత్తారు. -
అంబేడ్కర్ లేనిదే తెలంగాణ లేదు
పంజగుట్ట (హైదరాబాద్): అంబేడ్కర్ లేనిదే తెలంగాణ లేదని, ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రవచించిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే తత్వాన్ని సంపూర్ణంగా వంటబట్టించుకున్న సీఎం కేసీఆర్.. లక్షల మందిని ఐక్యం చేసి పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తుచేశారు. శుక్రవారం పంజగుట్ట కూడలిలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పక్కనే ఉన్న సచివాలయంలో కూర్చునే ప్రతీ ఒక్కరికి దశాబ్దాలు, శతాబ్దాలపాటు దిశా నిర్దేశం చేసేలా ఆయన విగ్రహం ఉందని చెప్పారు. తెలంగాణ రాకముందు 270 గురుకులాలు ఉండేవని, ఇప్పుడు 1,001 గురుకులాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టికి చెందిన ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.20 లక్షలు ఖర్చుచేస్తూ ప్రపంచంతోనే పోటీపడే విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కేసీఆర్‌తోనే సాధ్యం దళితబంధు లాంటి గొప్ప పథకం తీసుకురా వాలన్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చే యాలన్నా, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నా అది విప్లవాత్మకమైన ఆలోచనలు, దమ్మున్న నాయకుడు కేసీఆర్‌తోనే సాధ్యమని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టిన విధంగా పార్లమెంట్‌కు కూడా అంబేడ్కర్ పేరుపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేద్దామని పిలుపునిచ్చారు. పంజగుట్ట కూడలికి అంబేడ్కర్ కూడలి అని నామకరణం చేయాలన్న డిమాండ్‌పై త్వరలోనే నిర్ణ యం తీసుకుంటామన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ కలలు కన్న పాలన మన తెలంగాణలో సాగుతోందన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టిలకు ఎన్నో పథకాలు తెచ్చారని చెప్పారు. ఈ సంవత్సరం దళితబంధుకు రూ.17,700 కోట్లు విడుదల చేశారని, మరో లక్షకు పైగా లబ్ది దారులకు ఈ పథకం అందుతుందన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబంలో వెలుగులు నిండుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సైదిరెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రాబోయే రాజ్యం మనదే.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్
నా మాటలు కొందరు శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే. చిన్న మిరుగు (నిప్పురవ్వ) చాలు అంటుకునేందుకు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి నేను కలలో కూడా ఊహించని ఆదరణ లభిస్తోంది. రాబోయే రోజుల్లో యూపీ, బిహార్, పశి్చమ బెంగాల్ సహా ప్రతిచోటా ఇదే ఆదరణ వస్తుంది. కేంద్రంలో కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే.. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఊహించని ఆదరణ వస్తోందని.. రాబోయే రోజుల్లో దేశంలో రాబోయేది తమ రాజ్యమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో తెలంగాణతోపాటు భారత్‌ను సరైన మార్గంలో పెట్టాలని.. దాని కోసం చివరి రక్తపు బొట్టు వరకు రాజీపడకుండా పోరాటం చేస్తానని ప్రకటించారు. ఏదో ఒరవడిలో, గాలికి కొట్టుకుపోకుండా.. నిజంగా పేదల కోసం పనిచేస్తున్న వారికి అండగా నిలవాలని, మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన మనవడు యశ్వంత్ ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అంబేడ్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదు. విశ్వమానవుడి విశ్వరూపాన్ని మూర్తి రూపంలో ప్రతిష్టించుకున్నాం. రాష్ట్ర సెక్రటేరియట్‌కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. సెక్రటేరియట్ ముందు అమరుల స్మారకం, అంబేడ్కర్ నమ్మిన బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. సందేశాత్మక అద్భుత చిహా్నలన్నీ ఒకేచోట ఉన్నాయి. ఇది విగ్రహం కాదు.. విప్లవం.. అంబేడ్కర్ సిద్ధాంతంతో మనసు ప్రభావితం కావాలి. ఆయన మార్గాన్ని అనుసరించడంతో పాటు ఆయన సిద్ధాంతాలు, ఆచరణ అందరి కళ్లలో మెదలాలి. తమ జీవితాలను అర్పించి తెలంగాణ సాధించిన అమరులు కూడా ఆదర్శం కావాలనే ఉద్దేశంతోనే ఈ కాంప్లెక్స్‌కు రూపకల్పన చేశాం. ఆర్థికమంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు ఇది విగ్రహం కాదు.. విప్లవం. కేవలం ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే చైతన్య దీపిక. ఇది దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుంది: కొప్పుల ఈశ్వర్ రాష్ట్రంలో భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భవిష్యత్తు తరాలకు అంబేడ్కర్ స్ఫూర్తిని అందించే లక్ష్యంతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని.. ఈ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ విగ్రహం పాలకులు, అధికారుల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని చెప్పారు. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళితబంధు ద్వారా కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. ఆశయ సాధనకు కార్యాచరణ దేశంలో 75 ఏళ్లుగా పార్టీలు, ప్రభుత్వాలు మారుతున్నా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు ఇంకా నిరుపేదలుగానే ఉండటం సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలంటే పార్టీ లుకాకుండా ప్రజలు గెలిచే రాజకీయం రావాలని పదే పదే చెప్తున్నాం. ఈ దిశగా దళిత మేధావులు ఆలోచన చేయాలి. ఎక్కడా పెట్టని విధంగా ఈ నెల 30న బీఆర్ అంబేడ్కర్ పేరిట నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నాం. వీటన్నింటినీ మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తులో భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిది, అంబేడ్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ఆచరణాత్మక కృషి ప్రారంభించాలి. అనేక పారీ్టలు గొడవలు, గందరగోళం సృష్టిస్తున్నాయి. అందువల్ల వాస్తవ దృక్పథంతో దళి తులు ముందుకు సాగేలా కార్యాచరణ కావాలి. ఎవరి వైఖరి ఏమిటి? ఎవరి మార్గం ఏమిటో చూడాలి. బీఆర్ఎస్ ఎలా పనిచేస్తుందనేది చూస్తే చాలు. జాతీయ రాజకీయాల్లో మీ ఆశీస్సులు కోరుతున్నా’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ పేరిట ఏటా అవార్డులు అంబేడ్కర్ పేరిట ప్రత్యేక అవార్డు ఏర్పాటు చేయాలని కత్తి పద్మారావు పత్రికాముఖంగా సూచన చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఏటా జాతీయ, రాష్ట్రస్థాయిలలో ఉత్తమ సేవలు అందించే వారికి అవార్డులు అందజేస్తాం. దీనికోసం రూ.51 కోట్ల శాశ్వత నిధిని డిపాజిట్ చేయాలని తక్షణమే ఉత్తర్వులు ఇస్తున్నాం. ఈ నిధి ద్వారా ఏటా వచ్చే రూ.3 కోట్ల వడ్డీతో అంబేడ్కర్ పేరు ప్రతిష్టలు శాశ్వతంగా ఉండేలా అవార్డులు ఇస్తాం. ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే.. తెలంగాణ తరహాలో దేశంలో ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింప చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 50వేల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపచేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 1.25 లక్షల మందికి దళితబంధు అందుతుంది. బీఆర్ఎస్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ దళిత సంక్షేమానికి రూ.16వేల కోట్లు ఖర్చు చేయగా.. మా ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ రిపోర్టులే వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్‌తో పూలవాన అట్టహాసంగా భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం బౌద్ధ భిక్షువుల ప్రత్యేక ప్రార్థనలు.. విగ్రహం దిగువన పీఠంలో ఫొటో ఎగ్జిబిషన్ హుస్సేన్‌సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 3.15కు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ 3.30 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు అంబేడ్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ కూడా అక్కడికి వచ్చారు. తొలుత బౌద్ధ భిక్షువులు సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు చేస్తూ వారికి ఆహా్వనం పలికారు. తర్వాత వారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక మీదుగా అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం పీఠం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌తో అంబేడ్కర్ భారీ విగ్రహంపై గులాబీ రేకులు వెదజల్లారు. తర్వాత అంతా విగ్రహం వేదికపైకి చేరుకుని.. బౌద్ధ భిక్షువులు చేసిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్, వీడియోల ప్రదర్శనలు విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహం దిగువన పీఠంగా ఏర్పాటు చేసిన భవనంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఆత్మబంధువు అంబేడ్కరుడు’వీడియోను వీక్షించారు. తర్వాత అంతా సభా వేదికకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ‘డిక్కీ’కార్యాలయం ఏర్పాటుకు రెండెకరాలను కేటాయిస్తూ.. సంబంధిత పత్రాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కలసి డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్‌కు అందజేశారు. తర్వాత కేసీఆర్ ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలసి ‘దళితబంధు విజయగాథ’సీడీని ఆవిష్కరించారు. కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్, కొప్పుల ఈశ్వర్ ప్రసంగించగా.. ఎమ్మెల్యే రసమయి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ప్రభు త్వ చీఫ్ విప్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: అట్టహాసంగా అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
‘ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదు’
సాక్షి, హైదరాబాద్: ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదని, అంబేద్కర్ విశ్వ మానవుడని.. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభాస్థలి నుంచి ఆయన ప్రసంగించారు. ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహ ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉంది. అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వనీయమైనది. అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్. అంబేద్కర్ చెప్పింది ఆచరించేది ఉందా? లేదా? అని ఈ సందర్భంగా ఆయన అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు.. అందరూ అంబేద్కర్ చెప్పిన మాటలు ఆచరించాలి. ఆయన ఆశయాల సాధన దిశగా ముందుకెళ్లాలి. ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవం. అంబేద్కర్‌ను చూడగానే అందరి మనసూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. విగ్రహ ఏర్పాటునకు కృషి చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు అని సీఎం కేసీఆర్ తెలిపారు. సెక్రటేరియెట్‌కు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాగే అంబేద్కర్‌పేరిట శాశ్వత అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా అంబేద్కర్ జయంతి రోజు అవార్డుల ప్రదానం చేస్తాం. ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందిస్తాం. ఇందుకోసం దాదాపు రూ. 50 కోట్లతో అంబేద్కర్ అవార్డు నిధి ఏర్పాటు చేస్తాం అని సీఎం కేసీఆర్ సభాస్థలి నుంచి ప్రకటించారు. పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి. దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. దళితుల ఆర్థికాభావిృద్ధికి దళిత బంధు పథకం తీసుకొచ్చాం. కేసీఆర్ జాతీయ నేతగా ఎదగాలని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. దేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే రాజ్యం మనదే. మహారాష్ట్రలో ఊహించని ఆదరణ వస్తుంది. యూపీ, బీహార్, బెంగాల్లో కూడా ఆదరణ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేస్తాం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. -
‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నది అంబేద్కర్ కోరిక’
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజ మార్పు కోసం ప్రయత్నించారన్నారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. శుక్రవారం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారాయన. అంబేద్కర్ ఆశయాల్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం దళితులకు, ఆదివాసీలకే పరిమితం కాదు. దేశంలో మతమైనారిటీలే కాదు.. కులమైనారిటీలు కూడా ఉన్నారన్నారాయన. అలాగే.. పొట్టీ శ్రీరాములు ఆంధ్రపప్రదేశ్ కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం చేసే వరకు కూడా రాష్ట్రం ఇవ్వలేదు. చిన్న రాష్ట్రాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అంబేద్కర్ భావించేవారు. మీ అందరి తరపున సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు ఆయన ప్రసంగించారాయన. దేశానికి రెండో రాజధాని అవసరమని రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్ కోరుకున్నారు. అదీ హైదరాబాదే కావాలని అంబేద్కర్ కోరుకున్నారని ప్రకాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమన్న విషయాన్ని అంబేద్కర్ లేవనెత్తారని, ఆ అవసరం ఇప్పుడు ఉందని ప్రకాష్ పేర్కొన్నారు. -
అంబేద్కర్ విశ్వ మానవుడు: సీఎం కేసీఆర్
అంబేద్కర్ విగ్రహావిష్కరణ లైవ్ అప్డేట్స్ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగం.. ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవం అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు అంబేద్కర్ పేరిట శాశ్వతమైన అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం ఏటా అంబేద్కర్ జయంతి రోజు అవార్డుల ప్రదానం ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అంబేద్కర్ విశ్వ మానవుడు అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీయమైనది అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలి అంబేద్కర్ మాటలు ఆచరించాలి ఎవడో డిమాండ్ చేస్తే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు ఈ విగ్రహ ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉంది సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం దళితుల ఆర్థికవృద్ధికి దళితబంధు పథకం తీసుకొచ్చాం ► గౌరవ అతిథి ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగిస్తూ.. మీ అందరి తరపున తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతులు చెబుతున్నా. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. దేశప్రజలందరూ సంతోషంగా ఉండాలని అంబేద్కర్ ఆకాంక్షించారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజంలో మార్పు కోసం ఆయన అహర్నిశలు తపించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారు. ► దళిత బంధు విజయగాథ పాటల సీడీని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్లు. ► అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. చారిత్రాత్మకం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని భారీగా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలు అవుతున్న దళిత బంధు పథకం.. ఒక విప్లవాత్మక మార్పును దోహదం చేస్తుంది. :: మంత్రి కొప్పుల ఈశ్వర్ ► రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు, విగ్రహావిష్కరణకు గౌరవ అతిథిగా హాజరైన ప్రకాష్ అంబేద్కర్‌కు కేసీఆర్ శాలువా, పుష్ఫ గుచ్ఛంతో సత్కరించారు. అంబేద్కర్ తనయుడు యశ్వంత్(భయ్యా సాహెబ్)కి తనయుడైన ప్రకాష్(బాలాసాహెబ్ అంబేద్కర్).. రచయిత, న్యాయవాదిగానే కాకుండా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు కూడా. ► అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మృతి వనం సందర్శన అనంతరం.. సభా వేదికపైకి చేరుకున్న కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్. ► స్మృతి వనం నుంచి బయటకు వచ్చి సభా ప్రాంగణంలోని ప్రజలకు అభివాదం చేసిన ప్రకాష్ అంబేద్కర్, కేసీఆర్. ► అంబేద్కర్ మహా కాంస్య విగ్రహం కోసం 11.80 ఎకరాల విస్తీర్ణం జాగా, రూ. 146 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ పీఠం 50 అడుగులు పార్లమెంట్ భవనం ఆకారంలో ఏర్పాటు చేయగా.. బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులతో ఏర్పాటు చేశారు. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్. ► అంబేద్కర్ స్మృతి వనంలోని స్క్రీన్‌పై అంబేద్కర్ విగ్రహ ఏర్పాటునకు సంబంధించిన క్లిప్స్‌ను వీక్షించారు విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాశ్ అంబేద్కర్. ► అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కలియదిరిగారు. వెంట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలంతా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ, లైబ్రరీ తదితరాలను వీక్షించారాయన. ► పూలు జల్లి అంబేద్కర్‌కు నివాళి అర్పించారు అక్కడ హాజరైన ప్రముఖులంతా. ► హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ జరిగింది. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా బౌద్ధ గురువులను సన్మానించారు. ► అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ► విగ్రహావిష్కరణ ఫలకం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, మంత్రులు, దళిత సంఘాల ప్రముఖులు. ► అంబేద్కర్ మహావిగ్రహంపై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ► అంబేద్కర్ స్మృతి వనానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, ఇతరులు.. విగ్రహ విశేషాలను ప్రకాష్ అంబేద్కర్‌కు వివరించిన సీఎం కేసీఆర్. ► ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్, కార్యక్రమ ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్. ప్రాంగణం వద్ద ఘన స్వాగతం. ► జనసంద్రంగా మారిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రాంగణం. కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ► ప్రగతి భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బయల్దేరిన సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. ► ట్యాంక్ బండ్ విగ్రహావిష్కరణ వేదిక వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ► దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని(125 అడుగులు) తెలంగాణ హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. ట్యాంక్ బండ్ మీద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగనుంది. రాజ్యాంగ నిర్మాతకు గౌరవ సూచీగా ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహాన్ని టూరిస్ట్ స్పాట్‌గానే కాకుండా నాలెడ్జ్ సెంటర్గానూ ప్రమోట్ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇదీ చదవండి: రాజ్యాంగ నిర్మాతకు నిలువెత్తు గౌరవం -
వాళ్లే నిజమైన యాంటీ నేషనల్స్: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పరస్కరించుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రస్తత ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమబద్దమైన దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆమె పేర్కొన్నారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ది టెలిగ్రాఫ్‌లో వ్యాసం రాశారు సోనియా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారతీయులను మతం, భాష, కులం, లింగం ఆధారంగా విభజిస్తున్న వారే నిజమైన జ్యాతి వ్యతిరేకులు(యాంటీ నేషనల్స్) అని సోనియా బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ రోజు మనం బాబా సాహెబ్ వారసత్వాన్ని గౌరవిస్తున్నప్పుడు, రాజ్యాంగం విజయం.. దాన్ని అమలు చేసే పాలకులను ఎంచుకునే ప్రజలపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ ఆనాడే చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి.' అని సోనియా అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి దాని పునాలుదైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయాన్ని బలహీనపరుస్తోందని సోనియా ఫైర్ అయ్యారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగ సంస్థలతో దాడులు చేస్తున్నారని, కొంతమంది స్నేహితులకే ప్రయోజనం చేకూర్చుతున్నారని ఆరోపించారు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా? -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పోతుల సునీత. పలువురు నాయకులు పూల మాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్‌పై వైఎస్సార్సీపీ నాయకుడు పెరికె వరప్రసాద్ రచించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన నాడు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొని నిల్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటి సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేశారు ఏ కులంలో జన్మించినా ప్రతి ఒక్కరికీ సమాజంలో బతికే అవకాశం ఉందన్న ఆయన, ఆ సమ సమాజ నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఏర్పడేందుకు ఎంతో చొరవ చూపారు. మన దేశం సమైక్యంగా ముందుకు సాగడంలో, నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాన కారణం. అంతటి మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. ఆ దిశలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాకుండా బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లోని పేదల కోసం ఆయన పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందాలని ఆశించారో.. నేడు సీఎం జగన్ సరిగ్గా అదే బాటలో నడుస్తూ.. ఆ మహనీయుని ఆశయాలు నిలబెడుతున్నారు. అదే గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిత్యం రాజ్యాంగం అపహస్యం పాలయ్యేలా.. దళితులు, అణగారిన వర్గాల వారు అవమానాలకు గురయ్యేలా వ్యవహరించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ వారిపై తనకున్న అక్కసును కూడా చంద్రబాబు వెళ్లగక్కారు. ఇంకా బీసీల తోకలు కత్తిరిస్తామంటూ వారినీ అవమానించారు. అందుకే గత ఎన్నికల్లో ఆ వర్గాలన్నీ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాయి. ఇక నారా లోకేష్ కూడా తండ్రి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి అని తెలిసి కూడా.. ‘దళితులు ఏం పీకుతారు?’ అని నిన్న వ్యాఖ్యానించిన లోకేష్ తన కండకావరాన్ని ప్రదర్శించారు. అందుకే చంద్రబాబు మాదిరిగా, లోకేష్‌కు కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. దళితులకు సమాన హక్కులు, సాధికారతకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం: బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సమాజంలో దళితులకు సమాన హక్కులు, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్, వారి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం జగన్ దళితులకు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. నిజానికి దళితులు జాతి సంపద. తన పాలనలో దళితులను తీవ్రంగా అవమానించి, వారి కోసం ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు, ఈరోజు తన స్వార్థం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారు. కడుపు నిండా కత్తులు పెట్టుకుని దళితులను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్ భారతీయులంతా గర్వించదగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయులంతా గర్వించతగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విరాజిల్లడానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. జాతి యావత్తూ పవిత్ర గ్రంధంగా భావించే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్, సమసమాజ స్థాపనకు ఎంతో దోహదం చేశారు అంబేద్కర్ ఆశయాలు, ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోంద చదవండి: బీఆర్ అంబేడ్కర్ జయంతి.. సీఎం జగన్ ట్వీట్ -
అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నగరం వేదిక కానుంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. అంబేద్కర్ మనువడు ప్రకాష్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు ప్రకటించారు హైదరాబాద్ పోలీసులు. రేపు అంటే ఏప్రిల్ 14 శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంత్లాలో ఆంక్షలు అమలు చేయనున్నారు. దీంతో వాహనాల దారి మళ్లింపు ఉండనుంది. నెక్సెస్ రోడ్డు, ఖైరతాబాద్, లకిడీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు అమలు కానున్నాయి. నెక్లెస్ రోడ్డు - ఎన్టీఆర్ మార్గ్ - తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు లక్డీకాపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లింపు మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం. ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని నెటిజన్స్‌కు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. -
జనం కోసం...
అంబేద్కర్‌గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. దేశంలో పీడితవర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పరిశ్రమించినవాడు. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుష్టించి, అనుసరించి, పరిపాలన చేసుకోగలుగుతున్నాం అంటే దానికి ఆయన ప్రధాన కారకులు. రాజ్యాంగ నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. ఆయన చెప్పిన ఒక మంచి మాట – ’నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తావు’ అని! సర్వసాధారణంగా ఏ వ్యక్తి అయినా మొట్టమొదట తన గురించే ఆలోచిస్తాడు. ‘నాకోసం నేను బతకాలి. నేను బాగుండాలి, నా భార్యాబిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి’ అని ఆశిస్తాడు. కేవలం నాకోసం నేను జీవించాలనుకోవడం తప్పుకాకపోవచ్చు. పరిధి పెరిగి తనకన్నా సమాజం గొప్పదనీ, తన ఇంటికన్నా దేశం గొప్పదనీ ఆలోచించాలి. అందరికోసం జీవించినవారు ధర్మాత్ములు. అటువంటి వారు కొన్ని కోట్లమందికి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పొంది ఉంటారు. అటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఎందరో ప్రభవించారు. స్వాతంత్య్ర సమర సమయంలో తమ ప్రాణాలను గడ్డిపోచకింద భావించి జీవితాంతం జైలుజీవితం అనుభవించినవారున్నారు. ఏకాంతవాసం చేసినవారు, ప్రవాస జీవితం గడిపిన వారు, ద్వీపాంతర జీవితం గడిపినవారు, లాఠీదెబ్బలు తిన్నవారు, తుపాకీ గుళ్ళకు ఒరిగిపోయినవారు, అంగవైకల్యం పొందినవారు, కుటుంబాలు పోగొట్టుకున్నవారు, ఆర్థికంగా చితికినవారు, .. ఇటువంటి మహాత్ములు ఎందరో... ఎవరికోసం అదంతా... ఈ దేశంకోసం.. ఈ దేశ ప్రజల కోసం.. ఈ ఉదాత్త భావన ఆనాడు దేశ ప్రజలందరిలో ఎంతగా పొంగిపొర్లుతూ ఉండేదంటే... వినోబా భావే భూదానోద్యమం ప్రచారానికి దేశమంతటా తిరుగుతూ తమ తమ ప్రాంతాలకు వస్తే... చిన్నకమతాల దగ్గరనుండీ వందల, వేల ఎకరాల భూమిని నీళ్ళలా దానం చేసేసారు.. దాదాపు 42 లక్షల ఎకరాల భూమి పంచిపెట్టడానికిగాను ప్రజలు ఆయనకు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గ్రామం ఆయనకు దానమిచ్చేసారు. సంపద ఉంటే సంపద దానం లేకుంటే దేశంకోసం శ్రమదానం చేసారు. ఇదీ నలుగురికోసం బతకడం అంటే... అంబేద్కర్ చెప్పినది ఇదే...ఇలాంటి త్యాగబుద్ధి ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేశంమంటే నేను, నా కుటుంబం అనే కాదు, దేశమున్నది నాకోసం, నా కుటుంబం కోసం మాత్రమే కాదు...పరిధి దాటాలి, కుటుంబం పరిధి, ఊరు పరిధి... ఈ దేశం మనది అన్న భావన, మన దేశం బాగుపడడం కోసం మనం ఏ చేద్దామనే భావన ప్రతి ఒక్కరిలో రగులుతూ ఉండాలి. ఒకరిన చూసి మరొకరు స్ఫూర్తి పొందాలి... అప్పడు మనం మహాత్మాగాంధీలను, అంబేద్కర్లను... రోజూ చూస్తూనే ఉండవచ్చు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గుర్తింపు తెచ్చేలా అంబేడ్కర్ స్మృతివనం
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతివనం పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని, విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను అధికారులు.. సీఎంకు వివరించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అన్నారు. ‘‘విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలి. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్‌కూడా అత్యంత ప్రధానమైనది. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి’’ అని సీఎం జగన్ సూచించారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ప్లానింగ్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ జి విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన స్పెషల్ సెక్రెటరీ శ్రీలక్ష్మి
-
విజయవాడ: అంబేద్కర్ స్మృతివనం పనులను పరిశీలించిన మంత్రుల బృందం
-
AP: శరవేగంగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ఏర్పాట్లు..
సాక్షి, అమరావతి: ఢిల్లీలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నిర్ణీత గడువు ప్రకారంగానే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడానికి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో రాష్ట్ర నలుగురు మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీలోని స్టుడియోను సందర్శించింది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న విగ్రహ నిర్మాణపనులను పరిశీలించింది. ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు ఈ బృందంలో ఉన్నారు. మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడం ఇది రెండవసారి. ఈ సందర్భంగానే మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని రాబోయే అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. విగ్రహ నిర్మాణ పనులను మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి కూడా స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అటు విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించిన నిర్మాణ పనులు, ఇటు ఢిల్లీలో రూపుదిద్దుకుంటున్న విగ్రహ నిర్మాణ పనులు కూడా వేగంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఒకవైపు విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతుండగానే మరోవైపున విగ్రహ ప్రాంతానికి చేరుకొనే రహదారులు, ప్రహారీ, లోపలివైపున పాదచారులు నడయాడేందుకు అంతర్గత రోడ్లు, విగ్రహ ప్రాంగణం చుట్టూ సుందరీకరణ పనులను కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన పలు విడిభాగాలు విజయవాడకు చేరుకున్నాయన్నారు. రూ.268 కోట్లతో నిర్మించాలనుకున్న ఈ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఖర్చు ఎంతగా పెరిగినప్పటికీ స్మృతివనం పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగానే మంత్రులు విగ్రహాన్ని నిర్మిస్తున్న శిల్పులతో మాట్లాడారు. ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న విగ్రహం విడిభాగాలు కాకుండా విగ్రహానికి సంబంధించిన ఇతర భాగాలు ఎప్పటికి రాష్ట్రానికి చేరుకుంటాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కాగా మంత్రుల బృందంతో పాటుగా సాంఘిక సంక్షేమశాఖ, ఏపీఐఐసి, కేపీసీలకు చెందిన పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, స్మతివనంపై సీఎం జగన్ సమీక్ష
-
CM YS Jagan: నిర్దేశిత గడువులోగా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తుండే అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. అత్యంత నాణ్యతతో అందంగా నిర్మాణాలు ఉండాలని, పనుల పర్యవేక్షణకు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 125 అడుగుల ఎత్తుండే విగ్రహంతో పాటు పీఠంతో కలిపి మొత్తంగా 206 అడుగుల ఎత్తు వస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుందన్నారు. ఈ ప్రాంగణంలో 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం రూ.268 కోట్లు అని, విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన కొన్ని భాగాలను ఇప్పటికే తరలించామని.. కారు, బస్ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామని వివరించారు. మీ (సీఎం) ఆదేశాల మేరకు స్మృతివనం వరకు రోడ్లను సుందరీకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సృజన, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కోనసీమ జిల్లా: అంకంపాలెంలో మహిళలపై తేనెటీగల దాడి
-
మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ
పోలీసులు ఒక మహిళా సముహంపై లాఠీ ఝళిపించారు. ఈ మేరకు మహిళలను లాఠీలతో కొడతూ చెదరగొట్టారు. ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వాహనాలపై మహిళలు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలతో దారుణంగా కొట్టి హింసించారు. ఈ నిరసనలు కారణంగా ఆ విగ్రహం ఉన్న స్థలంపై వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు తలెత్తాయి. ఐతే పోలీసులు మాత్రం పరిస్థితి అదుపు తీసుకురావడానికి ఇలా బలగాలను రంగంలోకి దింపి లాఠీ ఝళిపించాల్సి వచ్చిందని చెబుతున్నారు. (చదవండి: అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!’ దళితుణ్ణి ఘోరంగా హింసించి చంపారు) -
నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?
అంబేడ్కర్‌ను బీజేపీ కానీ, నరేంద్ర మోదీ కానీ విశేషంగా గౌరవిస్తున్నట్లు పైకి కనబడుతోంది. మోదీ అయితే తాను అంబేడ్కర్ భక్తుడిని అని చెప్పుకున్నారు. కానీ బీజేపీ నమ్ముతున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్ చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్ విశ్వసించారు. హిందూరాజ్ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుందని రాశారు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి అడుగుపెడుతుందని కూడా అంబేడ్కర్ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజాస్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృత్వానికి చోటిచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి ప్రమాదం ఈరోజు కనబడటం లేదా? నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బి.ఆర్. అంబేడ్కర్‌ను ఒక ఆదర్శ మూర్తిగానే కాకుండా, తమ విశిష్ట కథా నాయకుల్లో ఒకరిగా కూడా గౌరవిస్తోంది. 2015లో ప్రధాని మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు. 2016లో మరో సందర్భంలో తాను అంబేడ్కర్ భక్తుడిని అని ప్రకటించుకున్నారు. అయితే బీజేపీ విశ్వసిస్తున్న లేక పాటిస్తున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్ చెప్పిన దానికీ, పాటించిన దానికీ పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అధ్యయనం చేసి ప్రచురించిన ‘అంబేడ్కర్: ఎ లైఫ్’ వెల్లడించింది. హిందూయిజం, హిందూ–రాజ్‌పై అంబేడ్కర్, బీజేపీల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని శశి థరూర్ రచన పేర్కొంది. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. కానీ అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్ ఆనాడు విశ్వసించారు. ‘‘హిందూ రాజ్ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుంది’’ అని అంబేడ్కర్ రాశారు. ‘‘హిందువులు ఏమైనా చెప్పవచ్చు. కానీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు హిందూయిజం పెనుముప్పు. ఈ విషయంలో అది ప్రజాస్వామ్యంతో ఏమాత్రం సరిపోలదు. హిందూ –రాజ్‌ని ఏ విధంగానైనా సరే నిరోధించి తీరాలి’’ అని అంబేడ్కర్ పేర్కొన్నారు. వాస్తవానికి అంబేడ్కర్ హిందూయిజాన్ని ఏమాత్రం ఇష్టపడ లేదు. హిందూ నాగరికతను మానవజాతిని బానిసత్వంలోకి దింపడా నికి పన్నిన క్రూరమైన కుట్రగా ఆయన పేర్కొన్నారు. హిందూయిజా నికి సరైన పేరు అపకీర్తి అని మాత్రమే అన్నారాయన. దీన్ని బట్టి హిందువులను కూడా ఆయన ఇష్టపడనట్లే కనిపిస్తుంది. ‘‘హిందు వులు... పిదపతనంతో కుంగిపోయి ఉన్నప్పటికీ శక్తిని కోరుకుంటున్న పిగ్మీలు, మరుగుజ్జులకు చెందిన జాతి... హిందువులు మంచిగానో, చెడ్డగానో ఉండవచ్చు కానీ ఉత్తమ హిందువు అంటూ ఎవరూ ఉండరు’’ అన్నారు అంబేడ్కర్. అంబేడ్కర్ భావాల గురించి బీజేపీకి తెలియకుండా ఉంటుందా... లేదా మనం అజ్ఞానులం అనీ, అంబేడ్కర్‌ను మనం కనుగొనలేమనీ అది భావిస్తోందా? లేక తనకు ప్రయోజనకరమైన కారణాలతో అంబేడ్కర్‌ను అది ఉద్దేశపూర్వకంగా కౌగలించుకుం టోందా? అందుకోసమే నిక్కచ్చిగానూ, ఇబ్బందికరంగానూ ఉండే అంబేడ్కర్ భావాల్లో పొడసూపే వ్యత్యాసాలను కూడా బీజేపీ పట్టించుకోకుండా ఉంటోందా? భారతీయ మైనారిటీలపై అంబేడ్కర్ అభిప్రాయాలను మీరు చూసినట్లయితే, ఈ ప్రశ్నలు మరింతగా ఇబ్బందిపెడతాయి. 1948లో రాజ్యాంగ సభలో అంబేడ్కర్ ప్రసంగిస్తూ, మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి మెజారిటీ పైనే ఉందని స్పష్టంగా చెప్పారు. ‘‘భారతదేశంలోని మైనారిటీలు తమ అస్తిత్వాన్ని మెజారిటీ చేతుల్లో ఉంచడానికి అంగీకరించారు... వారు మెజారిటీ పాలన పట్ల విశ్వాసంతో ఉండటానికి అంగీకరించారు. ఆ మెజారిటీ ప్రాథమి కంగా మతపరమైన మెజారిటీనే తప్ప రాజకీయ మెజారిటీ కాదు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలి.’’ అలాంటి విధిని, బాధ్యతను ఆమోదించడం అటుంచి దాన్ని బీజేపీ గుర్తిస్తుందా? అంబేడ్కర్ ఎన్నడైనా ‘బాబర్ కి ఔలద్’, ‘అబ్బా జాన్’ అనే మాటల్ని ఆమోదించేవారా? ‘కబరస్తాన్, శ్మశాన్ ఘాట్’ అనే భావనలను ఆయన ఆమోదించేవారా? లేదా ముస్లిం మతస్థు లను మొత్తంగా పాకిస్తాన్‌కి పంపించేస్తామనే బెదిరింపులను ఆమో దించేవారా? ఇలా ప్రశ్నించడం ద్వారానే బహుశా ప్రశ్నలకు సమా ధానం రాబట్టగలం. అయితే అంబేడ్కర్ ఆనాడే ఒక హెచ్చరిక చేశారు. 1948 నవంబర్‌లో తాను చేసిన సుప్రసిద్ధ ప్రసంగంలో అత్యంత స్పష్టంగా ఒక విషయాన్ని వెల్లడించారు. ‘‘మైనారిటీలు విస్ఫోటక శక్తి. అది కానీ వెలుపలకు వచ్చిందంటే మొత్తం రాజ్యవ్యవస్థనే పేల్చివేస్తుంది’’ అన్నారు. నిజానికి 70 సంవత్సరాల క్రితం మైనారిటీలు చిన్న సంఖ్యలో ఉండేవారు. భయపడుతుండేవారు. తమను నిర్లక్ష్యం చేసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈరోజు వారి జనాభా 20 కోట్లు. తమను ఎంతగా ఆగౌరవ పరుస్తున్నారో, సమాజం నుంచి ఎంతగా తమను వేరుపరుస్తున్నారో అనే విషయంలో వీరు చైత న్యంతో ఉన్నారు. అంబేడ్కర్ బతికి ఉంటే ఈరోజు చాలా ఆందోళన చెంది ఉండే వారు. కానీ బీజేపీ ఆయన భయాలను పంచుకునేదా లేక అర్థం చేసుకునేదా? బీజేపీ నిప్పుతో చెలగాటమాడుతోందని అంబేడ్కర్ భావించేవారని మీరు ఊహించగలరా? కానీ బీజేపీ మాత్రం ప్రస్తుతం చాలా ఉల్లాసంగా పని చేసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.భారత్ ఎలాంటి తరహా ప్రజాస్వామిక దేశంగా మారిపోతోందో మీరు గుర్తించినప్పుడు అంబేడ్కర్ భావాలకూ, బీజేపీ ఆచరణకూ మధ్య ఉన్న మరో అంతరం స్పష్టమవుతుంది. స్వేచ్ఛా యుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ భార తీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి అడుగుపెడుతుందని అంబేడ్కర్ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజా స్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృ త్వానికి చోటిచ్చే అవకాశం ఉందని ఆయన ఆనాడే చెప్పారు. ప్రజామద్దతు ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా నియంతృత్వం ఆవిర్భవించే అవకాశం ఉంటుందని అంబేడ్కర్ 1948లోనే హెచ్చ రించారు. అలాంటి ప్రమాదం ఈరోజు జరగడం లేదా? మన రాజ కీయాల్లో ప్రస్తుతం ఒక ప్రచండాకృతి ఆధిపత్యం చలాయిస్తోంది. ఆ ప్రచండాకృతి చుట్టూ వ్యక్తి ఆరాధన అల్లుకుపోతోంది. ఎలాంటి అసమ్మతినీ అది సహించడం లేదు. పార్లమెంటును తరచుగా సంప్ర దించడం లేదు. ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ బలహీన పడి పోయాయి. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల కోరలు పెంచారు. మీడియాను నిర్వీర్యం చేసి పడేశారు. చివరగా, భారతదేశం విషయంలో బీజేపీని, దాని దార్శనికతను అంబేడ్కర్ ఎలా భావించి ఉండేవారో అని నేను ఆశ్చర్యపడు తున్నాను. నరేంద్ర మోదీ తనకు ఒక భక్తుడిగా ఉండటాన్ని చూసి అంబేడ్కర్ నిజంగా గర్వపడేవారా? బీజేపీవారు తన పాదముద్రల పైనే నడుస్తున్నారని అంబేడ్కర్ నమ్మి ఉండేవారా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!
అక్టోబర్ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్ లాబీ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్ శౌరి (వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్) తప్ప ఎవరూ అంబేడ్కర్‌కు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. అంబేడ్కర్ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 1956 అక్టోబర్ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. – డాక్టర్ పి. కృష్ణమోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
BR Ambedkar: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి. భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన పేరు పార్లమెంట్‌కు పెట్టడం సముచితమైంది. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు ప్రపంచ మేధావులు కాలేక పోయారు. అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా ఎదగ డానికి కారణం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో సాగిన ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలే. ఇక్కడ సంపాదించిన జ్ఞానంతోనే అస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఎదిరించగలిగాడు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లోనూ, పార్లమెంట్ లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడాడు. ఎన్నో పుస్తకాలు రాశాడు. హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటిష్ పార్లమెంట్)లో ఆయన శత జయంతిని జరిపారంటే... ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ముక్కుసూటిదనం, తప్పును నిర్భయంగా ఖండించే తత్వం, అధ్యయన శీలత, దేశం పట్ల ప్రేమ ఆయన్ని దార్శనికునిగా నిలిపాయి. ఆయన 1951 అక్టోబర్ 29న పాటియా లాలో జరిగిన ఒక మహాసభలో మాట్లాడుతూ... ‘కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా నాపై ఎంతో ఒత్తిడి తెచ్చారు. నా అస్పృశ్యులకు ఏమాత్రం మంచి పని చేయని పార్టీలో నేనెందుకు చేరాలి? నేను చేరలేదు సరికదా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశాను. ఇతర మంత్రులను రాజీనామా చేయమని అడిగినట్లుగా నన్నెవరూ రాజీనామా చేయమని అడగలేదు. నాపై ఎటువంటి ఆరోపణలూ లేవు. ఎవరైనా నా శీలంపైన మచ్చపడే విధంగా ఏవైనా చెప్పమని ఛాలెంజ్ చేశా. నాపై వేలెత్తి చూపడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు’ అన్నాడు. ఇక రాజ్యాంగ రచన దగ్గరికొద్దాం. రాజ్యాం గాన్ని రాజ్యాంగ పరిషత్ రాసింది. రాజ్యాంగానికి ఒక రూపాన్ని ఇచ్చే నిమిత్తం ఏడుగురు సభ్యులతో ఒక ‘రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం’ ఏర్పాటు చేయబడింది. ఆ సంఘానికి అంబేడ్కర్ అధ్యక్షులు. వివిధ ఉప సంఘాలు పంపిన నివేదికలను క్రోడీకరించి, క్రమబద్ధీకరించి ఆ సంఘం రాజ్యాంగ ముసాయిదాను (చిత్తుప్రతి) తయారు చేసింది. 1948 జనవరిలో ఆ రాజ్యాంగ ముసాయిదా ప్రచురించబడి విడుదలయింది. ఆ ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, వాటిలో కేవలం 2,473 సవరణలను మాత్రమే రాజ్యాంగ పరిషత్ చర్చించింది. మిగిలిన వాటిని తిరస్కరించింది. నూతన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించగా, 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. దీంతో భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. 1947 ఏప్రిల్ 29వ తేదీన సమావేశమైన చట్ట సభలో అస్పృశ్యతను నిర్మూలిస్తూ తీర్మానం జరిగింది. దీనికి సంబంధించిన చిత్తుబిల్లును సర్దార్ వల్లభాయ్ పటేల్ చట్ట సభలో ప్రవేశపెట్టారు. ఇలా అస్పృశ్యతను చట్టరీత్యా నిర్మూలించే పరిస్థితి రావడానికి కారణం అంబేడ్కర్ మహోన్నతమైన కృషే కారణం. తరతరాలుగా అస్పృశ్యతలో మగ్గిపోతున్న ప్రజలకు ఈ చట్టం ఎంతో ఊరటను కలిగించింది. ఒక్క ఉదుటన వారు సంకెళ్ళను తెంచుకొని ప్రధాన స్రవంతి సమాజంలోకి పరుగులెత్తడానికి ఈ చట్టం రాచబాట వేసింది. అయితే ఈ కీర్తినంతా మహాత్మ గాంధీకి అంటగట్టాలని కాంగ్రెస్‌పార్టీ ఎంతో ప్రయత్నం చేసి విఫలమైంది. ఏ అస్పృశ్యతకైతే అంబేడ్కర్ గురి అయ్యారో ఆ అస్పృశ్యతా నివారణ చట్టాన్ని నిర్మించగలగడం, దాన్ని అగ్ర వర్ణాలు అధికంగా వున్న రాజ్యాంగ పరిషత్తులో నెగ్గేలా చేయడం అంబేడ్కర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఆయన తన ప్రత్యర్థులను, శత్రువుల్ని కూడా తన వాదనా పటిమతో, తన జ్ఞాన వికాసంతో, తన శాస్త్ర ప్రమాణాలతో ఒప్పించగలిగిన ధీశక్తి గలవాడు. భారతదేశంలో ఉన్న ప్రతి మనిషినీ ఆయన కులం నుండి బయటపడేయాలని ప్రయత్నం చేశాడు. కులం మనిషికి గీతలు గీస్తుందనీ, అతడు ఎదగాల్సిన దిశ నుండి ఎదగకుండా, హద్దుల్లో వుంచుతుందనీ, ఇవ్వాళ అస్పృశ్యులుగా చెప్ప బడుతున్న వారు ఆర్యుల చేత ఓటమి చెందిన జాతులే కాని అస్పృశ్యులు కాదనీ, వారు భారత్‌ను పాలించిన జాతులనీ నొక్కి వక్కాణించారు. ఫ్రెంచి విప్లవం నుండి రూపొందిన స్వేచ్ఛ, సమానవత్వం, సౌభ్రాతృత్వ భావాలను ఆయన రాజ్యాంగంలో పొదిగారు. భారత పార్లమెంట్‌ను అత్యంత ఉన్నతమైన, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, భావజాల పూర్ణంగా రూపొందించారు. ఆయన నిర్మించిన ఈ ప్రజాస్వామ్య ‘భవనాని’కి ఆయన నామవాచకం పెట్టడం సముచితమైంది. అయోధ్యలోని రామ మందిరానికి రాముని పేరు పెడుతున్నారు కదా. అలాగే ఇదీ ప్రత్యా మ్నాయ భావజాలాల మానవతా మందిరం, మమతల సౌధం. అంబేడ్కర్ బౌద్ధ తత్వాన్ని జీర్ణించుకొన్న తాత్వికుడు. బౌద్ధ అంతస్సారమైన మానవత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, అవినీతి రహిత జీవనం లాంటి భావాలన్నింటినీ ఆయన రాజ్యాం గంలో పొందుపరిచారు. అలా మౌఖిక దశలో వున్న బౌద్ధ ధర్మాలను చట్టరూపంలోకి తీసుకురా గలి గాడు. ఈ రాజ్యాంగ సౌధాన్ని ఎవరూ కదిలించలేరు. దానికి ప్రతివాదం చేసిన వారంతా ఆ వాదంలో ఇమిడి పోవాల్సిందే. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...) భారతదేశం ఈనాడు ప్రపంచం ముందు ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, పౌర హక్కులు, స్త్రీ అభ్యున్నతి, రాజకీయ సమతుల్యత వంటి అనేక విషయాల్లో తల ఎత్తుకుని నిలబడిం దంటే అది అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు, నిర్మాణ దక్షత వల్లనే. భారత ఉపఖండంలో చరిత్రను మార్చిన వారు బుద్ధుడు, అశోకుడు, అంబేడ్కర్. వారు చరిత్ర విస్మరించలేని విశ్వజనీనులు. అందుకే అశోకుడి ధర్మ చక్రం భారత పతాకలో చేరింది. బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అంబేడ్కర్ అస్తమించని సూర్యుడయ్యాడు. ఇప్పుడు పార్లమెంట్ భవనానికి ఆయన పేరే ఒక వెలుగు దివ్వె. ఆ వెలుగులో మనం నడుద్దాం! - డాక్టర్ కత్తి పద్మారావు ‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ రచయిత -
అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...
ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశస్థులూ తమ పార్లమెంట్ భవనానికి ఒక వ్యక్తి పేరు పెట్టుకున్న దాఖలాలు లేవు. కానీ భారత నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ బయలుదేరింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణమిది. కొంతమంది ఇది సమంజసమైనది కాదంటున్నారు. కానీ ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సంక్షేమం, లౌకికత్వం వంటి ప్రజాస్వామ్య లక్షణాలు పాదుకొల్పడానికీ, అవి సజావుగా మనగలగడానికీ రాజ్యాంగంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినవారు అంబేడ్కర్. అటువంటి వ్యక్తి పేరు ప్రజాస్వామ్యానికి వాహికైన పార్లమెంట్ భవనానికి పెట్టడం ముమ్మాటికీ సబబే అని మరికొందరు అంటున్నారు. పేరు అంటూ పెట్టాల్సి వస్తే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్ పేరు పెట్టడమే సముచితం. ప్రపంచానికి పరివర్తన సంకేతం ప్రస్తుతం ఒక సరికొత్త డిమాండ్ పుట్టుకొచ్చింది. న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టాలో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనానికి తప్పకుండా అంబేడ్కర్ పేరు పెట్టాలన్నదే ఆ డిమాండ్. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మి స్తున్న సచివాలయ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 15న ప్రకటించింది. కొత్త పార్లమెంట్ భవనానికి ‘అంబేడ్కర్ పార్లమెంట్’ అని పెట్టాల్సిందిగా తాను ప్రధానికి ఉత్తరం రాస్తానని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దీని చుట్టూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియా చర్చలు మొదలైపోయాయి. దీనిపై రెండు ముఖ్య మైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వ్యక్తికి ఎంత స్థాయి, ఆమోదనీ యత ఉన్నా సరే... దేశం కోసం దీర్ఘకాలంగా చట్టాలను రూపొందిస్తున్న పార్లమెంట్‌కు ఆ వ్యక్తి పేరు పెట్టవచ్చా? భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా నిలిచిన మరికొందరిని పక్కనబెట్టి ఈ కొత్త భావనకు అంబేడ్కర్ అర్హుడేనా? తొలి ప్రశ్నకు సమాధానం పూర్తిగా నైతిక పరమైనది. సాధారణంగా పార్లమెంట్ భవంతికి ఒక వ్యక్తి పేరు పెట్టరు. ఆ వ్యక్తి ఎంత గొప్ప వారైనా సరే. కానీ భారతదేశంలో ప్రతి విషయానికీ వ్యక్తుల పేర్లను తగిలించే పద్ధతి, సంస్కృతి ఉన్నాయి కదా. అలాంటప్పుడు దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడంలో గొప్పగా దోహదం చేసిన ఏ వ్యక్తి పేరయినా పార్లమెంట్ భవనానికి ఎందుకు పెట్టకూడదు? ఇక రెండో ప్రశ్నకు సమాధానంగా భారత దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీక రించడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు వ్యక్తులను తులనాత్మకంగా మదింపు చేయవలసి ఉంది. వారెవరో కాదు. అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్. వీరిలో నెహ్రూ పట్ల ద్వేషపూరిత దృక్పథం రాజ్యమేలుతోంది. ప్రధాని మోదీ ఇప్పుడు నెహ్రూతో, ఆయన కుటుం బంతో ప్రత్యక్షంగా ఘర్ష ణాత్మక వైఖరితో వ్యవహ రిస్తున్నారు. మోదీ ప్రభుత్వం సానుకూలత ప్రద ర్శించడానికి అవకాశం గల పేర్లు రెండే. అవి అంబేడ్కర్, పటేల్. పటేల్ నేపథ్యం, పరిణామక్రమం చూస్తే ఆయన గొప్ప పోరాటయోధుడిగా, కార్యకర్తగా, నేతగా, పాలనా దురంధరుడిగా నిరూపించుకున్నారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఐక్యం చేసిన వానిగా నిలిచిపోయారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. కానీ పటేల్ ఎన్నడూ న్యాయ తత్వ వేత్త, చరిత్రకారుడు, ఆర్థికవేత్త, ప్రాపంచిక వ్యవహారాలలో నిపుణుడు కాలేదు. మరోవైపు దయనీయంగా అస్పృశ్యతను అను భవించి వచ్చిన అంబేడ్కర్, అనేకమందిలో ఒకే ఒక్కడుగా పరిణమించారు. ఆయన కూడా పోరాట యోధుడు, యాక్టివిస్టు, లీడర్, తనదైన కోణంలో పాలనా దురంధరుడు కూడా. న్యాయ, నైతిక పరమైన తత్వవేత్త. చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజకీయ అర్థ శాస్త్రం వంటి అంశాలలో శిక్షణ పొందారు. భారతీయ చరిత్రపై, బౌద్ధ, వైదిక, జైన, ఇస్లాం, క్రైస్తవ వగైరా బహుళ ప్రాపంచిక ఆలోచనా విధానాలపై అపారమైన పట్టు ఉండేది. రాజ్యాంగ రచన చేస్తూ, దాంట్లోని అన్ని ఆర్టికల్స్నీ రాజ్యాంగ సభలో ఆమోదింపజేసుకుంటున్నప్పుడు ఆయన దీక్ష గానీ, ఆయన జోక్యం చేసు కున్న తీరు గానీ మరే వ్యక్తిలో కంటే ఎక్కువగా ప్రదర్శితమయ్యేవి. ఢిల్లీ అధికార వ్యవస్థలు కాంగ్రెస్ పూర్తి నియం త్రణలో ఉన్నంతకాలం ఆయన్ను నిర్లక్ష్యం చేశారు. మండల్ కమిషన్ అనంతర కాలంలో భారత్ అంబేడ్కర్‌ను అధికాధికంగా కనుగొంది. రాజ్యాంగ సభలో ఆయన రాసిన రచనలు, చేసిన ప్రసంగాలు భారత్ సంక్షోభంలోకి ప్రవేశించిన ప్రతి సందర్భంలోనూ ప్రజాస్వామ్య రక్షణకు ఆయుధాలుగా మారాయి. అందుకే భారతీయ ప్రజాస్వామ్యం, అంబేడ్కర్ పర్యాయ పదాలైపోయాయి. ‘మండల్’ అనంతర కాలాలు భారత్‌ను ఒక జాతిగా మల్చడంలో ఆయన నిబద్ధతా శక్తిని పునరుత్థానం చెందించాయి. భారతీయ ప్రజాస్వామిక సంప్రదాయ జ్ఞానాన్ని ఆయన సంశ్లేషించారు. ప్రత్యేకించి బౌద్ధులు, గిరిజన జనాభాకు చెందిన సంప్రదాయిక జ్ఞానాన్ని ఆయన రాజ్యాంగంలోకి తీసుకురావడమే కాదు.. రాజ్యాం గంలోని ప్రతి ఒక్క నిబంధనకు న్యాయం చేయడా నికి, రాజ్యాంగ సభ ఉపన్యాసాలలో వాటిని పొందుపర్చారు. ప్రత్యేకించి ఇంగ్లండ్, అమెరికా ల్లోనూ; ఇంకా అనేక దేశాల్లోనూ ఉద్భవించిన పాశ్చాత్య రాజ్యాంగ మూల సూత్రాలు ఆయనకు తెలిసినప్పటికీ, భారతీయ చరిత్ర నుంచి సాధికారి కమైన సందర్భోచితమైన ఎన్నో మూలసూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. అందుచేత మన జాతీయవాదాన్ని ఆయన ఏ ఒక్కదాని కంటే మిన్నగా ఉన్నత స్థానంలో నిలిపారు. బుద్ధుడి ఉపమానాలను, అశోకుడి పాలనా సూత్రాలు, చిహ్నాలను ఆధునిక కాలంలో కూడా పునశ్చరణ కావడానికి అంబేడ్కరే కారణం. ఫ్రెంచ్ ఆలోచనా విధానం నుంచి కాకుండా, మన ప్రాచీన భారత చరిత్ర నుండి ప్రజా స్వామ్యం, స్వేచ్చ, సమానత్వం–సౌభ్రాతృత్వం అనే మూడు కీలక సూత్రాలను పదే పదే వల్లించేవారు. ఆయన జాతీయవాదానికి మూలాలు... పురాణాల్లో కాకుండా భారతీయ ప్రజారాశుల సజీవ ఉత్పాదకతా జీవితం నుంచి పుట్టు కొచ్చాయి. చారిత్రకంగా పీడితులైన దళితులు, ఆదివాసులు, శూద్ర ప్రజానీకం ఈరోజు తమ జీవితాల్లో నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా మార్పులు వస్తున్నందుకు అంబేడ్కర్‌కు రుణపడి ఉంటున్నారు. ఈ అన్ని కారణాల వల్ల భారత నూతన పార్లమెంట్ భవంతికి అంబేడ్కర్ పేరు పెట్టినట్ల యితే, భారతదేశంలో ఒక నిజమైన నాగరికతా పరివర్తన చోటు చేసుకుంటోందని ప్రపంచం గుర్తిస్తుంది. అప్పుడు మాత్రమే భారతీయ సంపూర్ణ నిర్వలసీకరణ ప్రక్రియ కొత్త ఉదాహర ణను ప్రతిష్ఠించుకుంటుంది. (క్లిక్: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు) - కంచె ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అంబేడ్కర్‌తో కేసీఆర్‌కు పోలికా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినవ అంబేడ్కర్‌గా పోలుస్తూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించడమేనని మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పినందుకు ఆయన్ను కలెక్టర్ అభినవ అంబేడ్కర్ అన్నారా? అని సోమవారం ఒక ప్రకటనలో మల్లు రవి ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా ఎనిమిదేళ్లుగా మోసం చేసినందుకు ఆయన అభినవ అంబేడ్కర్ అవుతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చేసినందుకు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించినందుకు కేసీఆర్ అభినవ అంబేడ్కర్ అయ్యారా అని నిలదీశారు. సంగారెడ్డి కలెక్టర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. భారత నూతన పార్లమెంటు భవనానికి సైతం అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని గత మంగళవారం రాష్ట్ర శాసనసభ ఏకగీవ్రంగా తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఏదో ఆశామాషీకి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరడం లేదని స్పష్టంచేశారు. దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, భారత సామాజిక తాత్వికుడు, రాజ్యాంగ నిర్మాతకు మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలందరికీ గర్వ కారణం రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేడ్కర్ తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ స్వయంపాలన కొనసాగించడం వెనక అంబేడ్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు. మమ్మల్ని అంబేడ్కర్ స్ఫూర్తే నడిపిస్తోంది.. ‘అంబేడ్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడతాయనే అంబేడ్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత. అప్పుడే నిజమైన భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేడ్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జై భీం. జై తెలంగాణ. జై భారత్’ అని సీఎం తన ప్రకటనను ముగించారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాం. అంబేడ్కర్తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపింది. అంబేడ్కర్ లక్ష్యం సమానత్వం. ఆయన భాషా ఆధిపత్యం, ప్రాంతీయ ఆధిపత్యంతోపాటు అన్నిరకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనలా సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే దాన్ని తానే ముందుగా తగలబెడతానని అంబేడ్కర్ అన్నారు. దేవుడు కోసం గుడి కడితే... దెయ్యాలు ముందే వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు. అంబేడ్కర్ కొన్ని కులాలు, వర్గాలకు మాత్రమే ప్రతినిధి కాదు. ఆయన మహాత్ముడితో సరిసమాన వ్యక్తి. అంబేడ్కర్ మహిళలకు కూడా సమాన హక్కులుండాలన్నారన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో రాజీనామా చేశారన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. దానికి ఆ పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు. అందుకే అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’అని ఆ తీర్మానంలో కోరారు. ఏకగ్రీవ ఆమోదం కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదని, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద కొన్ని వర్గాలకు మాత్రమే అందుతోందన్నారు. ఈ దేశంలో సోదరభావం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. అనంతరం పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జనవరిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తమ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి, ఇతర నేతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే బాగుండేదన్నారు. పంజగుట్టలో విగ్రహం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ... గతంలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని తానేమీ కాదనడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయినా ట్యాంక్‌బండ్ సమీపంలో 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నామని, ప్రస్తుతం విగ్రహ నిర్మాణం సాగుతోందన్నారు. జనవరిలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో మెరుపులే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మూడో రోజు సమావేశాల్లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. అంబేద్కర్ మూల సిద్ధాంతం ప్రజాస్వామం, సమానత్వం. దేశానికే దిశానిర్దేశం చేసిన దార్శనికుడు అంబేద్కర్. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదు.. విజయవంతంగా నిలదొక్కుకోదు అనే గొప్ప మాటను అంబేద్కర్ ఆనాడు చెప్పారు. నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే.. దాన్ని నేనే మొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్. జాతిపిత మహాత్మాగాంధీకి ఏ మాత్రం తగ్గని మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆయన మహిళల పక్షపాతి.. వారికి సమాన హక్కులు రావాలని పోరాడి పదవికి వదులుకున్న గొప్ప వ్యక్తి అంబేద్కర్. అంబేదర్క్ రాసిన రాజ్యంగంలో ఆర్టికల్-3 లేకపోతే.. కొత్త రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకపోతే.. నేడు తెలంగాణ రాష్ట్రమే లేదు, శాసనసభే ఉండేది కాదు. రాష్ట్ర శాసనసభ ఆమోదంతో గానీ.. శాసనసభ అంగీకారంతో నిమ్మితం లేకుండానే.. పార్లమెంట్లో సింపుల్ మెజార్టీతో కచ్చితంగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చునని చెప్పి ఆర్టికల్-3ను పొందుపరిచారు. కాబట్టి, మహానుభావుడు అంబేద్కర్‌కు తెలంగాణయావత్తు సర్వదా.. శతదా.. రుణపడి ఉంటుందని కామెంట్స్ చేశారు. Live: Minister Sri @KTRTRS speaking in Legislative Assembly https://t.co/VFsVWHG8gZ — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 13, 2022 -
‘పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ మహేశ్‌రాజ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవితో కలిసి గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రేవంత్ స్పందిస్తూ గద్దరన్న వినతిపై కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కమిటీ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి అఖిలపక్షం తీర్మానాన్ని సోనియాగాంధీకి అందజేస్తానని, పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరిగి నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: బీజేపీవి వేషాలు.. టీఆర్ఎస్ది అతి తెలివి: రేవంత్ రెడ్డి -
Ilayaraja: వివాదంలో ఇళయరాజా.. మోదీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇళయరాజా.. ప్రధాని మోదీ గురించి రాసిన ఒక పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో మోదీని డాక్టర్ అంబేడ్కర్‌తో పోల్చారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇళయరాజా వ్యాఖ్యలను కొందరు ఖండిస్తున్నారు. ఇళయరాజా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎంపీ పదవి కోసమే మోదీ భజన చేస్తున్నారని విమర్శి స్తున్నారు. ఈ విషయంపై ఇళయరాజా సోదరుడు, బీజేపీ సభ్యుడు గంగై అమరన్ స్పందిస్తూ.. అందరిలాగే ఇళయరాజా కూడా తన భావాలను వ్యక్తం చేశానని చెప్పారన్నారు. తన మాటల్లో తప్పు లేదనీ, అందుకు ఎలాంటి విమర్శలు ఎదురైనా తాను ఎదుర్కొంటానన్నారని, అదేవిధంగా తాను బీజేపీలో చేరలేదని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారని స్పష్టం చేశారు. ఇళయరాజా వ్యాఖ్యలపై ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్పందిస్తూ.. కరుప్పు ద్రవిడన్ గర్వించదగ్గ తమిళన్ అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కేంద్రమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
లక్నో: కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రికి ప్రమాదం తప్పింది. వేడుకల్లో వేదిక కూలిపోవడంతో ఫ్లడ్ లైట్లు వేదికపైనున్న నేతపై పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం... ఆగ్రాలో అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వేదికపైన ఎక్కువ మంది ఉండటంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో ఫ్లడ్ లైట్లు అక్కడున్న నేతలపైన పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. Organiser of the event also got injured. #Agra pic.twitter.com/nXpoI8MSpj — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) April 15, 2022 కాగా, ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది. స్ధానిక పోలీసులు, భద్రతా సిబ్బంది కిందపడిన ఆయనను పైకిలేపారు. ఆయనకు గాయాలేవీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వేదికపైన ఎక్కువ మంది ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. Union minister of state for parliamentary affairs and culture Arjun Ram Meghwal had a narrow escape after a heavy light stand fell down following hail storm in #Agra. He was a chief guest to attend Dr Bheem Rao Ambedkar Jayanti. At least 6 people were #injured in the mishap. pic.twitter.com/spMx7ZaU6a — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) April 15, 2022 -
బంపర్ ఆఫర్: రూపాయికే లీటర్ పెట్రోల్
సాక్షి, ముంబై: వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గురువారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఓనర్.. రూపాయికే లీటర్ పెట్రోల్ అని 500 మందికి పెట్రోల్ఇచ్చారు. దీంతో ఆఫర్ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. सोलापुरात डॉ. बाबासाहेब आंबेडकर जयंती निमित्त फक्त 1 रुपयात 1 लीटर पेट्रोल यावर तुमची प्रतिक्रिया कमेंट्स करून सांगा#maharashtratoday #solapur #AmbedkarJayanti #AmbedkarJayanti2022 pic.twitter.com/Bhhg4VxsP3 — Maharashtra Today (@mtnews_official) April 14, 2022 ఈ సందర్భంగా బంక్ యజమాని మాట్లాడుతూ.. భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. కాగా, 500 మందికే పెట్రోల్ ఇవ్వడంతో మిగిలిన వారంతా ఉసురూమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
అంబేద్కర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు: మంత్రి కేటీఆర్
-
సిగ్గుమాలిన మనిషి.. ఈ వీడియో చూసి బాబు,వర్ల సిగ్గు తెచ్చుకోవాలి
-
Ambedkar Jayanti 2022: అంబేడ్కర్‌కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం అమీర్‌పేట గ్రీన్‌పార్క్ మ్యారీగోల్ట్ హోటల్లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తమ పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. అంబేడ్కర్ దేశానికే గర్వకారణం: గవర్నర్ దేశం పూర్వవైభవం సాధించేందుకు రాజ్యాంగ ఆదర్శాలు, ఆదేశాలను అనుసరిస్తూ భారత రాజ్యాంగానికి లోబడి ఏర్పడిన చట్టబద్ధ కార్యాలయాలు, సంస్థలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గవర్నర్ ఆయనకు నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేడ్కర్ దేశానికే గర్వకారణమని, చురుకైన సంఘ సంస్కర్తగా, ప్రముఖ న్యాయవాదిగా చిరస్మరణీయుడని గవర్నర్ కొనియాడారు. అణచివేతపై మానవత్వం సాధించిన విజయానికి అంబేడ్కర్ అసలైన ఉదాహరణ అని, సమాజంలో అట్టడుగు వర్గాలు, పేదలతో పాటు ప్రతీఒక్కరికీ రాజ్యాంగ హక్కులు దక్కేలా అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని గవర్నర్ కీర్తించారు. అంబేడ్కర్‌కు సీఎం నివాళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని నూటికి నూరు శాతం రాయితీ కింద అందిస్తోందని తెలిపారు. -
Ambedkar Jayanti 2022: మలి అంబేడ్కరిజమే మేలు!
అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే ఆయన కృషి కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన కృషిని ‘తొలి అంబేడ్కరిజం’గా పరిగణించాలి. రాజ్యాంగ రచనా సమయంలో– అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా, విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. మొత్తం సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఈ బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి. తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాల్సిన తరుణమిది. అంబేడ్కర్ ఆలోచనలు, కృషిని గతం లో కంటే భిన్నంగా ప్రజాపోరాట శక్తులూ, పాలక శక్తులూ గుర్తిస్తుండటం చూస్తున్నాం. గతంలో చాలాకాలం పాటు అంబేడ్కర్‌ను ఏ మాత్రమూ గుర్తించని సామాజిక శక్తులు 1980 ల నుంచి హఠాత్తుగా ఆయనను ఆరాధించడంలోని ఔచిత్యం ఏమిటి? ప్రపంచ వ్యాప్త సామాజిక ఆర్థిక సంక్షోభం ప్రారంభం; సోషలిజం సహా సకల సైద్ధాంతిక భావజాలాల్లో సంక్షోభం; సామాజిక చైతన్య కేంద్రాల విస్ఫోటనం జరిగి... అస్తిత్వ ఉద్యమాలు, అస్తిత్వ సిద్ధాంతాలు అనే సరికొత్త కేంద్రాల చుట్టూ సమీకృతమయ్యేందుకు శకలాలుగా మారడం వంటి పరిణామాలు సంభవించాయి. ఈ సామాజిక నేపథ్యంలో ప్రబలంగా ముందుకొచ్చిన కుల అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా అంబేడ్కర్, ఆయన సిద్ధాంతాలు నిలిచాయి. ఈ నూతన ఒరవడి నుంచి లబ్ధి పొందేందుకు పాలక వర్గాలు సైతం అంబేడ్కర్‌ను తలకెత్తుకుంటున్నాయి. అయితే సమకాలీన సమాజంలోని ప్రగతిశీల శక్తులూ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ మూల తాత్వికతను గ్రహించడంలో విఫలమై... తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంబేడ్కర్ అనగానే దళిత సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహించే లేదా వారి నుంచి ఉద్భవించిన జాతీయ నాయకుడుగా పలువురు భావిస్తారు. ఆయనలో ఈ రెండు ఛాయలు ఉన్నమాట నిజమే. బ్రిటిష్ వలస పాలన కాలంలో ప్రధానంగా ఆయన అణగారిన దళిత, అçస్పృశ్య ప్రజానీకం పరిస్థితులు, సామాజిక అణచివేత, వివక్ష తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం అటు బ్రిటిష్ ప్రభుత్వంతోనూ; ఇటు స్వాతంత్రోద్యమకారులు, దేశీయ అగ్రకుల పెత్తందార్ల తోనూ సైద్ధాంతిక భావజాల పరంగా, భౌతికంగా ద్విముఖ పోరాటాలు చేయవలసి వచ్చింది. సమకాలీన సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ఆయన వ్యవహరించారు. అందులో భాగంగా కమ్యూనిస్టు/కార్మికోద్యమాల్లో కులం పాత్ర, వర్గపోరాటంలో (ప్రత్యామ్నాయంగా కాదు) కుల నిర్మూలన పోరాటానికున్న విశిష్ట స్థానం వగైరా అంశాలపై కమ్యూనిస్టులతోనూ తనదైన శైలిలో ఆయన ఘర్షణ పడటం సరైనదే. దాంతో ఆ కాలమంతా ఆయన కృషి దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన సైద్ధాంతిక, రాజకీయ కృషిని తొలి అంబేడ్కరిజంగా పరిగణించాలి. అంబేద్కర్ సుదీర్ఘకాలంగా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో; రాజ్యాంగ రచన ప్రభావంతో ఆయన అణగారిన అస్తిత్వాల దృక్పథం పునాదిగా సమగ్ర మానవ విముక్తి మార్గం వైపు అడుగులు వేశారు. 1955లో ఆయన ‘భారతీయ బుద్ధ మహాసభ’ను స్థాపించారు. 1956 ఆక్టోబర్ 14న 22 ప్రమాణాలతో రూపొందిన ‘ధర్మ చక్ర ప్రవర్తన’ సమావేశంలో లక్షలాది ప్రజల సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన బౌద్ధాన్ని స్వీకరించి ‘నవయాన’ బౌద్ధాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగ రచనా ప్రక్రియ అంబేడ్కర్‌ను సర్వమానవ విముక్తి దృక్పథాన్ని అలవర్చుకునేట్లు చేసింది. ‘ధర్మచక్ర ప్రవర్తన దినం’ సమావేశంలోని 22 ప్రమాణాల్లో ఏ ఒక్క ప్రమాణం కూడా కుల అణిచివేత పునాదిగా శుద్ధ అగ్రకుల వ్యతిరేకతను, ధిక్కారాన్ని మాత్రమే సూచించేదిగా లేకపోవడమనేది ఆయన దృక్పథంలో వచ్చిన విస్తృతిని తెలియజేస్తుంది. వర్గ పోరాటం, సామాజిక సమానత్వం అనే భావనలతో కూడిన నవయాన బౌద్ధ దృక్పథమే భారత విముక్తి మార్గంగా అంబేడ్కర్ బోధించారు. భారతీయ సమాజంలో అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా... విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. దళితులు, బహుజనులు, శ్రామికులు, మహిళలు తదితర అణగారిన ప్రజల దక్పథం పునాదిగా... మొత్తం భారత సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఆయన బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి.సామాజిక, వైయక్తిక బాధల నుంచి మానవ విముక్తి మార్గం ఆయనకు బౌద్ధంలో దర్శనమిచ్చింది. ఈ అవగాహనతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన స్వప్నించారు. 1956 సెప్టెంబర్ 30వ తేదీన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఆర్పీఐ)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన జీవితపు చరమదశలో ‘ఆర్పీఐ’ ద్వారా కమ్యూనిస్టేతర ప్రగతిశీల శక్తులను సమీకరించే పనికి శ్రీకారం చుట్టారు. బౌద్ధం ప్రభావంతో... సామాజిక సమానత్వం, వర్గపోరాటం అనే ద్విముఖ కార్యాచరణ పునాదిగా రాజకీయ పార్టీని నడపాలని ఆయన భావించారు. ఇంతలో ఆయన 1956 డిసెంబర్ 6వ తేదిన మరణించారు. ఆయన మరణానంతరం 1957లో ఆర్పీఐ ఏర్పడింది. అంబేడ్కర్ దార్శనిక పరిణామాన్ని సక్రమంగా ఆకళింపు చేసుకోలేని అంబేడ్కర్‌వాదులు చీలిపోయారు. అమెరికాలో ‘బ్లాక్ పాంథర్స్’ తరహాలో మహారాష్ట్రలో కూడా ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం కుల అత్యాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరింది. అయితే అస్తిత్వాన్ని మించి, అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులేనని ఈ ఉద్యమం నిర్వచించింది. ఆ తర్వాత 1980–90లలో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ తరం సాంకేతిక విప్లవ కాలంలో ముందుకొచ్చిన... ఆధునికానంతర వాద దార్శనికత ప్రభావంతో ఏర్పడిన అస్తిత్వ ఉద్యమాల ఒరవడిలో అంబేడ్కరిజం దేశ రాజకీయ యవనికపై ప్రబలంగా ముందుకొచ్చింది. ఆ కాలంలో వివిధ సంస్థలూ, వ్యక్తులూ అంబేడ్కర్‌వాద లేబుల్‌ను విస్తృతంగా వినియోగిస్తూ ఆయన దార్శనికతను కుల అస్తిత్వానికి సంబంధించినదిగానే (తొలి అంబేడ్కరిజం) కుదించి చూసేవారు. మలి అంబేడ్కరిజంలోని బౌద్ధ భావజాలం, సమతా వాదం వంటి అంశాలను ఇప్పటికీ వారు అస్సలు పట్టించుకోనేలేదు. బ్రాహ్మణిజం, కేపిటలిజం అనే రెండు రకాల సామాజిక శత్రువులను అంబేడ్కర్ గుర్తించారు. పెట్టుబదారీ సామ్రాజ్యవాదం కంటే అగ్రకుల నియంతృత్వానికి (బ్రాహ్మణిజం) మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉండటం వల్ల... హిందూ సామ్రాజ్యవాదాన్ని ముందుగా నిర్మూలించాలన్నది అంబేడ్కర్ లక్ష్యం. అందుకే ఆయన పోరాటాలన్నీ అగ్రకుల బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యతిరేక పోరాటాలే. అయితే మలి అంబేడ్కరిజంను ఆయన ప్రతిపాదించిన అనంతరం అతి కొద్ది కాలంలోనే మరణించడం వల్ల... ఆయనలోని పరిణామం వారి తర్వాత తరాలకు ఆచరణాత్మక పద్ధతుల్లో నేర్చుకునేందుకు అవకాశం కలగకపోవడం దురదృష్టకరం. అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. వివిధ దార్శనికతల కలనేత. పాలకవర్గాలే కాకుండా, అంబేడ్కర్ వాదులు, వామపక్షవాదులు సైతం అంబేడ్కర్ దార్శనికతను విమర్శనాత్మక, విప్లవాత్మక దార్శనికుడుగా చూడకుండా ఒక దేవునిగా, విగ్రహమాతృనిగా పూజిస్తున్న వైనం దురదృష్టకరం. మలి అంబేడ్కరిజంలోని సమతావాద స్వభావాన్ని ఆకళింపు చేసుకోకుండా, తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని మేధావులు, సామాజిక ఉద్యమశక్తులు సత్వరం గ్రహించాల్సిన తరుణమిది.కొందరు అస్తిత్వ వాద నాయకులు శకల మతవాదమైన కుల అస్తిత్వవాద దృక్పథాలకు పరిమితం కాకుండా సామాజిక సమానత్వం, వర్గ పోరాటం అనే భావనల పునాదిగా రూపొందిన మలి అంబేడ్కరిజాన్ని నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనే మలి అంబేడ్కరిజం వైఖరిని కుల అస్తిత్వ/వామపక్ష ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. (నేడు అంబేడ్కర్ జయంతి) వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు సీనియర్ పాత్రికేయుడు ∙95503 67536 -
ప్రజాస్వామ్యమే అంబేడ్కర్ భావసారం
బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగించిన కార్యాచరణ మీద చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అనుభవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. ఆ అధ్యయనాన్ని అక్షరబద్ధం చేశాడు. ఆయన తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. ఆయన చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్సరాల రచనల్లో కొన్నిటినైనా చదవాలి. ‘భిక్షువులారా! శ్రావస్తిలో ఒకప్పుడు ఒక రోజు... పుట్టుకతో అంధులైన వారిని పిలిచి, ఒక ఏనుగును తెప్పించి, దానిని గుర్తుపట్టమనీ, అది ఏ ఆకారంలో ఉంటుందో చెప్పాలనీ ఆజ్ఞాపించారు. అయితే అంధులు ఒక్కొక్కరు ఏనుగులోని ఒక్కొక్క భాగాన్ని తడిమిచూసి తమ అభిప్రాయాలను వివరించారు. తలను పట్టుకున్న మొదటివాడు అది ఒక కుండలాగా ఉందన్నాడు. చెవి పట్టుకున్న వాడు అది చేటలా ఉందన్నాడు. దంతాన్ని తాకిన వాడు నాగలికర్రుగా అనుకున్నాడు. మరొకరు తొండం ఎడ్ల బండి కాడిలా ఉందన్నాడు. ఆఖరి వాడు తోకను ముట్టుకొని అది రోకలిలా ఉందని చెప్పాడు. వీళ్ళందరు ఏనుగు మొత్తాన్ని తాకలేదు. అది ఎట్లా ఉందో చెప్పలేకపోయారు. వాళ్ళు పుట్టుకతో అంధులు కావడం వల్ల అట్లా అనుకున్నారు. అయితే కండ్లు ఉండి, ధమ్మాన్ని (ధర్మాన్ని) సమగ్రంగా అర్థం చేసుకోలేక చాలా మంది తమకు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకు ఏ ధర్మమైనా అర్థం కాదు. అందుకే ప్రతి చిన్న విషయానికీ వాదోపవాదాలకు రావడం, తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రదర్శించడం చేస్తున్నారు. మీరు అలా చేయకూడదు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి’’ అంటూ గౌతమ బుద్ధుడు తన శిష్యులకు హితబోధ చేశారు. ఇది బౌద్ధ సాహిత్యంలో తిత్తియసుత్తలో ఉంది. ఆ తర్వాత ఇదే కథ జైన, హిందూ, సూఫీ సాహిత్యంలోకి వెళ్ళింది. చాలా మందికి ఈ కథ తెలుసు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళ గురించీ, వాదోపవాదాలు చేసే వాళ్ళను గురించీ ఈ కథ చెప్పడం వింటూంటాం. అయితే ఇక్కడ సందర్భమేమిటనే సందేహం రాక తప్పదు. భారత దేశ సామాజిక గతినీ, స్థితినీ తెలియజేసి, దానిని ఎలా మార్చాలో తన విస్తృతమైన అధ్యయనం ద్వారా తెలియజేసిన భారత సామాజిక విప్లవకారుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ విషయంలో ఇటీవల ఇదే జరుగుతున్నది. అంబేడ్కర్ తాత్విక చింతన, ఆయన సాగించిన కార్యాచరణ, జీవిత ఘట్టాలు, ఇట్లా అనేక విషయాలపై చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అయితే ఎవరినీ నిందించడం నా ఉద్దేశ్యం కాదు. కానీ దాని వల్ల అంబేడ్కర్ ప్రధానమైన తాత్విక చింతన, ఆయన సాగించిన సంఘర్షణాయుతమైన జీవన గమనం తప్పుగా అర్థం అవుతుంది. నిజానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్విక కేంద్ర బిందువులను అర్థం చేసుకుంటే, ఆయన మనకు అర్థం అవుతారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ దేశపు మూలస్తంభపు పునాదిని కనిపెట్టారు. అందు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అంబేడ్కర్‌ని మనం మేధావిగా చెప్పుకుంటాం. అయితే అది సాధ్యం కావడానికి ఆయన అనుభవం, ఆందోళన, ఆలోచన, అధ్యయనం, అక్షరం, ఆచరణలు ఒకదాని వెంట ఒకటి నడిచాయి. అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అను భవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. అందుకు తగ్గట్టుగా అధ్యయనాన్ని అక్షరబద్దం చేశాడు. దానిని ఆచరణలో చూపెట్టాడు. తాత్విక వేత్తలు చెప్పినట్టుగా, ప్రపంచాన్ని చాలా మంది అధ్యయనం చేసి, వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ మార్చడమెలాగో చెప్పిన వాడే తాత్వికుడు. అటువంటి వాడే అంబేడ్కర్. బాబాసాహెబ్ అంబేడ్కర్ తన కాలేజీ చదువు ముగించుకొని, కొలంబియాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. అక్కడ తన జీవిత అనుభవం ద్వారా ఏర్పడిన ఆందోళనను ఆలోచనలో పెట్టి అధ్యయనం సాగించాడు. అక్కడే తన దృక్పథాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో తీర్చిదిద్దుకున్నాడు. 1913 నుంచి 1917 వరకు అంబేడ్కర్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యయనం ఆయనను ఒక తాత్వికుడిగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశా న్నిచ్చింది. దానికి ప్రధానమైన వ్యక్తి ఆయన గురువు ప్రొఫెసర్ జాన్ డ్యూయీ. పంతొమ్మిదవ, ఇరవైవ శతాబ్దాలలో అమెరికాలోని తాత్వికుల్లో జాన్ డ్యూయీ అగ్రగణ్యుడు. అటువంటి ఒక తాత్వికుడు అంబేడ్కర్‌కు గురువుగా దొరికాడు. జాన్ డ్యూయీ ప్రధానమైన పరి శోధన డెమోక్రసీ. ప్రజాస్వామ్య భావనను ఆధునికంగా ఆలోచించిన వాడు జాన్ డ్యూయీ. ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ సహా అనేక మంది పరిపాలనా సంబంధమైన విషయంగా వ్యాఖ్యానిస్తే, జాన్ మాత్రం దానిని ఒక సామాజిక అంశంగా, యావత్ సమాజానికి సంబంధించిన విషయంగా, మానవ సంబంధాలకు విస్తరింపజేశాడు. తన ‘ప్రజాస్వామ్యం – విద్య’ అనే పుస్తకంలో రాసిన విధంగా, ‘‘ప్రజాస్వామ్యం కేవలం పాలనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ప్రజల మధ్య, ప్రజల జీవనానికి సంబంధించినది. వారి మధ్య ఉండే సంబంధాలను నిర్దేశించేది’’. అయితే అంబేడ్కర్ తన మొత్తం ప్రయాణంలో ప్రజాస్వామ్య తాత్విక పునాదిని అర్థం చేసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జాన్ డ్యూయీ నుంచి ప్రేరణ పొందా డనడానికి ‘కుల నిర్మూలన’లో వ్యక్త పరిచిన ప్రాథమిక అభిప్రాయమే నిదర్శనం. అంబేడ్కర్ ప్రజాస్వామ్యాన్ని అన్ని రంగాలకు వర్తించే ఒక తాత్విక శక్తిగా మలుచుకున్నాడు. అంబేడ్కర్ తన నలభై సంవత్సరాల చురుకైన ఉద్యమ జీవితంలో సాగించిన పరిశోధనలు, అమలు చేసిన కార్యాచరణలు దానినే బలపరుస్తున్నాయి. ఆయన 1916లో కులాల పుట్టుక అనే అంశంపై పరిశోధన చేసి, దానిని కుల నిర్మూలనలో ఒక లక్ష్యంగా చేసుకొని, బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా ఒక సామాజిక ప్రజాస్వామ్యంగా మనకు అందించారు. అదే విధంగా 1919లో సౌత్భరో కమిటీ ముందు ప్రభుత్వ నిర్వాహణలో ప్రజల భాగ స్వామ్యం ఉండాలనీ, అందులో అణిచివేతకు గురైన వర్గాలను ప్రత్యే కంగా గుర్తించి తగు ప్రాధాన్యత కల్పించాలనీ ప్రసంగించాడు. సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ల ద్వారా దానికి ఒక బలాన్ని చేకూర్చి 1950లో ఆమోదించిన రాజ్యాంగంలో అందుకు తగ్గట్టుగానే చట్టబద్ధత కల్పించాడు. ఇది రాజకీయ ప్రజాస్వామ్యం. అదేవిధంగా 1918లో మొట్టమొదటి ఎకనామిక్ జర్నల్‌లో ‘థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్’ అనే వ్యాసంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిపై మార్గనిర్దేశనం చేశాడు. వ్యవసాయం మీదనే ప్రజలు ఆధారపడటం వల్ల ఆ వ్యవస్థ ఒత్తిడికి గురవుతోందనీ, తన 27వ ఏటనే దేశానికీ, ప్రపంచానికీ మార్గనిర్దేశనం చేశాడు. ఇదే విషయమై పరిశోధన సాగించిన సర్ ఆర్థర్ లూయీస్‌కు 1954లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అంటే దాదాపు 36 సంవత్సరాల ముందే అంబేడ్కర్ తన దార్శనికతను ప్రదర్శించాడు. అంతేకాకుండా, 1945లో తాను రాసిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అన్న డాక్యుమెంటులో దేశంలోని వనరులను, ముఖ్యంగా భూమినీ, భారీ పరిశ్రమలనూ, బ్యాంక్, ఇన్సూరెన్స్ సంస్థల వంటి వాటినీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచకూడదనీ, వాటిని జాతీయం చేయాలనీ ప్రతిపాదించాడు. అంబేడ్కర్ తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. అందుకే తాను చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వా మ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే ఆయన లక్ష్యాల్లో సమా నత్వం, స్వేచ్ఛ, సోదరత్వం ముఖ్యమైనవి. వాటి సాధనకు మార్గం సుగమం చేసేదే ప్రజాస్వామ్యం. అందుకే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్స రాల రచనల్లో కొన్నిటినైనా మనం చదవాలి. ఆయన మూలసిద్ధాంత మైన ప్రజాస్వామ్య భావనను అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
బాబా రాజ్యాంగ సాహెబ్
అంబేడ్కర్ రాజ్యాంగ రచయిత కాదు. అంబేడ్కర్ మన రాజ్యాంగానికి తండ్రీ, కీలక మైన నిర్మాత కూడా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూ షన్! రచయిత కన్నా... తండ్రి, నిర్మాత గొప్పవారు. పార్లమెంటు వేరు. రాజ్యాంగ రచనా సభ వేరు. కేవలం రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కను మరుగయ్యేది రాజ్యాంగ రచనా సభ. 1947, ఆగస్టు 29న అంటే మనకు స్వాతంత్య్రం వచ్చిన 14 రోజులకు రాజ్యాంగ రచనా సభ ఒక రచనా ఉప సంఘాన్ని రూపొందించింది. ప్రముఖ పరి పాలనాధికారి, న్యాయవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజ్యాంగ సభ సలహాదారు అయిన బీఎన్ రావ్ (కన్నడ) రూపొందించిన తొలి చిత్తుప్రతిని ఈ రచనా సంఘం పరిశీలించి రాజ్యాంగ సభ ముందు చర్చకు సమర్పించాలని... ఈ సంఘానికి లక్ష్యాన్ని నిర్దేశిం చారు. ‘‘రాజ్యాంగ నిర్మాణం చేసిన ఘనత నాకు ఇచ్చారు, కానీ నిజంగా అది నాకు చెందదు. అందులో కొంత సర్ బీఎన్ రావ్‌కు చెందుతుంది. రాజ్యంగ సభకు ఆయన రాజ్యాంగ సలహాదారు. ఆయనే తొలి చిత్తు ప్రతి రూపొందించి మా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు సిద్ధం చేశారు’’ అని అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చెప్పారు. అంబేడ్కర్ మహోన్నత విద్యావంతుడు. అటు ఆర్థిక శాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం ఆపోశన పట్టిన వాడు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించి అధ్య యనం చేసిన వ్యక్తి. కనుక రాజ్యాంగ రచనా ఉప సంఘంలో ఉండాలని రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఈ సంఘంలో ఇతర సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, కేఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిట్టర్ (వీరు అనారోగ్యంతో రాజీనామాచేస్తే ఎన్ మాధవరావు సభ్యులైనారు), డీపీ ఖైతాన్ (వీరు 1948లో మరణిస్తే టీటీ కృష్ణమాచార్య చేరారు). ఉప సంఘం సభ్యులు 1947 ఆగస్టు చివర తొలి సమా వేశంలో అంబేడ్కర్‌ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యవ్యవహారాల్లో తల మునకలై ఉన్నారు. సాదుల్లా, మాధవరావులకు డిల్లీ వాతావరణం సరిపడలేదు. పాలన, ఆయాదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనదేశంలో అప్పు డున్న ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ను విస్తరిస్తూ రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతిని న్యాయ, రాజ్యాంగ రంగాలలో నిపుణుడైన బెనెగల్ నర్సింగరావ్ రూపొం దించారు. ఆ తరువాత అందులో సూత్రాలను పునర్ని ర్మించడంలో కీలకమైన కృషి చేశారు. ఆయన కూడా తరువాత విదేశాల్లో ఉండిపోవడం వల్ల అందు బాటులో లేరు. ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరి కొందరి పాత్ర స్వల్పం, మొత్తం భారం అంబేడ్కర్ పైన పడిందని టీటీ కృష్ణమాచారి చెప్పారు. అంబేడ్కర్ ఆ బాధ్యతను నిర్వహించి రాజ్యాంగ పిత అయ్యారు. మరికొన్ని ఉపసంఘాలు కూడా చాలా సహకరిం చాయి. కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీకి నేతగా పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జేబీ కృపలానీ, ఇంకా అనేకానేక అంశాలపైన ఎన్నో ఉప సంఘాలు పనిని పంచు కున్నాయి. ప్రాథమిక హక్కుల కమిటీకి అంబేడ్కర్ ఇచ్చిన వివరమైన పత్రం చాలా కీలకమైంది. సభలో రాజనీతిజ్ఞులైన ప్రముఖులెందరో బాగా ఆలోచించి 7,635 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 2,473 సవరణలను చర్చించి ఆమోదించారు. మిగిలినవి చర్చించి తిరస్కరించారు. ప్రతి పదంపైనా, వాక్యం పైనా వివాదాలు వచ్చాయి. అన్నిటికీ అంబేడ్కర్ సమాధానం చెప్పారు. సరైనవనుకున్న వాటిని ఆమో దించారు. బీఎన్ రావ్ 243 ఆర్టికల్స్, 13 షెడ్యూళ్లతో రాజ్యాంగ చిత్తు ప్రతిని రూపొందిస్తే, అంబేడ్కర్ అధ్య క్షతన ఉన్న రచనా కమిటీ అనేక చర్చలు సవరణల తరువాత 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లతో పూర్తి చేసింది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
విదేశీ విద్యకు ‘అంబేద్కర్ విద్యానిధి’ అండ.. ఏటా రూ.20 లక్షల సాయం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకునేందుకు ఎస్సీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది. మన రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో సీట్ వస్తే చాలు ప్రభుత్వం ఈ ఆర్థికసాయం చేస్తుంది. దీంతో విద్యానిధి పథకానికి జిల్లా ఎస్సీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదట్లో రూ.10లక్షలు.. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ విద్యార్థి విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చదివేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకం కింద మొదట్లో రూ.10లక్షల ఆర్థికసాయం అందించింది. అయితే రూ.10లక్షలు సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి రావడంతో పెద్దగా విదేశాల్లో చదివేందుకు ఎస్సీ విద్యార్థులు పెద్దగా ముందుకు రాలేదు. అయితే ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మళ్లీ పథకం నిబంధనలు సడలించింది. కుటుంబ ఆదాయం రూ.5లక్షలకు పెంచడంతోపాటు విదేశీ విద్యకు అందించే ఆర్థికసాయాన్ని రూ.20లక్షలు చేసింది. దీంతో జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్యకోసం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కుల ఆధారంగా దరఖాస్తులు.. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు పరీక్షలు రాసి సీటు పొందితే ఆ మార్కుల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల శాఖలో దరఖాస్తు చేసుకున్నవారిని అన్ని ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రభుత్వం విదేశీ విద్యనభ్యసించేందుకు ఆర్థికసాయం అందిస్తుంది. ప్రధానంగా యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి వరకు 35 మందికి.. ప్రభుత్వం 2015లో విదేశీ విద్యకోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ విద్యార్థులు 65 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి అర్హతలు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించి 35 మందిని ఎంపిక చేసి ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం వారంతా వివిధ దేశాల యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. కాగా 2021లో అత్యధికంగా తొమ్మిది మంది విద్యార్థులు విదేశీ విద్యకు ఎంపిక కావడం గమనార్హం. -
అంబేడ్కర్ స్మృతివనాన్ని అపవిత్రం చేశారు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని (125 అడుగులు) నిర్మించే ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించి అపవిత్రం చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళిత వ్యతిరేక విధానంతో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న అగ్రవర్ణాల పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని సంజయ్ సందర్శించి వెళ్లాక పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, టీఆర్ఎస్ సీనియర్ నేత నారదాసు లక్ష్మణ్ రావులతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లాడారు. ఒకవైపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ దశలో ఉంటే ఇక్కడికి వచ్చి తలతోక లేకుండా సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది ఆఖరులోగా అంబేడ్కర్ విగ్రహంతో పాటు లైబ్రరీని ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై కేసులు పెరిగాయన్నారు. ‘రాష్ట్రంలో ప్రతి దళితుడి గుండెచప్పుడు కేసీఆర్. దళితబంధు పథకంతో 15 లక్షల దళిత కుటుంబాల దారిద్య్రాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తున్నారు’అని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించిన చరిత్ర బీజేపీదని వెంకటేశ్ నేత విమర్శించారు. ఎంపీలు అరవింద్, రవికిషన్ (గోరఖ్‌పూర్) దళితులను అవమానపరుస్తూ మాట్లాడారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ పేరెత్తే అర్హత సంజయ్‌కు లేదన్నారు. దేశంలో దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. -
అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు చాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ కా ర్యాలయాల్లో ఇకపై కేవలం బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ ఫొటోలు మాత్రమే ఉంచాలని, మరే నాయకుడి ఫొటో ఉంచకూడదని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వాఫీసుల్లో కనీసం ముఖ్యమంత్రి ఫొటో కూడా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, స్వాతంత్య యోధుడు భగత్ సింగ్‌ను ఆయన కొనియాడారు. వీరిరువురి ఆలోచనాధోరణికి అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రిపబ్లిక్‌డే ప్రసంగంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలో ప్రతి చిన్నారికి సరైన విద్య అందాలన్నది అంబేద్కర్ ఆశయమని గుర్తు చేశారు. ఇందుకోసం విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను ఆయన వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీ ఏర్పా టు చేస్తామన్నారు. విజయానికి కులమతాలతో పనిలేదని అంబేద్కర్, భగత్‌సింగ్ భావించారని కేజ్రీవాల్ చెప్పారు. తమ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన మార్పులను ఆయన వివరించారు. -
అంబేడ్కర్ మాట కూడా వినరా?
గాంధీజీ–అంబేడ్కర్ మధ్య వివాదమూ, చర్చలూ, ఆ తర్వాత 1932 సెప్టెంబర్ 24న జరిగిన పూనా ఒడంబడిక– ఈ ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య వివరించారు (సాక్షి; సెప్టెంబరు 23). యువతరంలో చాలామందికి అంతగా తెలియని ఉదంతమిది. 30 ఏళ్ళ యువ అంబేడ్కర్– అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలనీ; అదీ దళితుల ద్వారానే ఎన్నిక య్యేలా ఉండాలనీ బ్రిటిష్ పాలకులను కోరారు. ఇది హిందువులను చీలుస్తుం దనే కారణంతో గాంధీ వ్యతిరేకించినా, ‘కమ్యూనల్ అవార్డు’ పేరిట బ్రిటిష్‌వారు అంగీకరించారు. ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీ ఆమరణదీక్ష, ఫలితంగా అంబేడ్కర్‌పై ఒత్తిడి, చివరకు పూనా ఒడంబడిక జరి గాయి. దాని ఫలితమే నేడు అమలులోవున్న రిజర్వుడ్ స్థానాల విధానం. ఈ విధానంలో ‘నిజమైన దళిత ప్రజాప్రతినిధులు ఎన్నిక కావటం లేదు’ అన్న వాస్త వాన్ని లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఐతే అంబేడ్కర్ ఆశిం చినట్టుగా ఎన్నుకుంటే సామాజిక, రాజకీయరంగంలో ‘మౌలిక మార్పులు’ వచ్చేవి అనటం వాస్తవ విరుద్ధం. ఈ విషయాన్ని 1955 నాటికే అంబేడ్కర్ గుర్తిం చారు. విద్యావంతులైన దళితులు, వారి ప్రతినిధులు దళిత జనబాహుళ్యాన్ని విస్మరిస్తున్నారని బాహాటంగా 1956 మార్చి 18 ఆగ్రా ఉపన్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా తమ భవంతిలోకి ఆహ్వా నిస్తే, వెళితే వెళ్ళండి. అమ్ముడుపోవాలనుకుంటే మీ ఇష్టం... ఇతరుల నుంచి కాదు, నా వాళ్లనుండే నాకు ప్రమాదం ఉన్నట్టుగా భావిస్తున్నాను’ అన్నారు. అంబేడ్కర్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవ కుండా చూశాయి పాలకవర్గాలు. రాజ్యాంగం ఆమోద మైన రెండేళ్ళకే, వయోజన ఓటింగుతో జరిపిన పార్ల మెంటు తొలి 1952 ఎన్నికల్లోనూ (ఆయన ఓట్లలో నాల్గవ స్థానంలో ఉన్నారు), 1954 ఉప ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ దళిత అభ్యర్థితో రిజర్వుడ్ సీటులోనే ఆయన్ని ఓడించారు. ఆమాటకొస్తే 1946లోని పరి మిత ఓటింగ్‌తో జరిపిన ఎన్నికల్లోనూ అదే స్థితి! సొంత రాష్ట్రం సంయుక్త మహారాష్ట్ర నుంచి గెలిచే సీటు లేక, తూర్పు బెంగాల్ వెళ్ళి అక్కడి దళిత, ముస్లిం పార్టీల మద్దతుతో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. తమ ప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలన్న ఒక ‘రాజకీయ ఉద్యమా’నికి సన్నద్ధం కావాలని లక్ష్మయ్య రాశారు. ఇది సాధ్యం కాదు. గెలిచిన అభ్య ర్థులనే కాదు, పార్టీలనే కొనేస్తున్నారు, అమ్ముడు పోతున్నారు. ఎస్సీ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ తన సమావేశంలో – అంబేడ్కర్ ఆధ్వర్యంలోనే– 1955 ఆగస్టు 21 నాడు ఒక తీర్మానం (నంబర్ 6) పాసు చేసింది, బొంబాయిలో ఏకగ్రీవంగా: ‘పార్లమెంటు, శాసనసభలు, మున్సిపాలిటీలు, జిల్లాబోర్డులు వంటి స్థానిక సంస్థలలో ఎస్సీలకున్న రిజర్వేషన్ నిబంధ నను వెన్వెంటనే – రాబోయే ఎన్నికలకు ముందే – రద్దుచేయాలి అని వర్కింగ్ కమిటీ భావిస్తున్నది’. ప్రభుత్వం ప్రచురించిన అంబేడ్కర్ సమగ్ర రచనల్లో ఉంది (వాల్యూం 17; పేజీ 439). ధనంజయ కీర్ రాసిన ప్రసిద్ధ జీవిత చరిత్రలోనూ దీన్ని పేర్కొన్నారు. రాజకీయ రిజర్వేషన్ని ‘రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని’ తీర్మానించినట్టు ఇలా పేర్కొన్నారు: కాంగ్రెసు నిలబెట్టిన ‘ఎలకల్లాటి’ ఎస్సీ అభ్యర్థులు, ఫెడరేషన్ నిల్పిన ‘సింహాలను’ వారి కేంద్రాల్లోనే ఓడించారని దిగ్భ్రాంతితో చేసిన తీర్మానం ఇది. అంబేడ్కర్ అక్కడితో ఆగలేదు. తానే స్థాపించిన ఆ ఫెడరేషన్‌ని (ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీచేసి ఓడారు) రద్దుచేయటానికి, కులప్రాతిపదిక లేని రిపబ్లిక్ పార్టీ స్థాపనకు నిర్ణయించి 1956 సెప్టెంబర్ 30న ప్రకటిం చారు. ఆ డిసెంబర్ 6న మరణించారు పైవే కాదు, ఇంకా అనేక విషయాలను మేధావులు దాచిపెడుతుం టారు. తమకి అంగీకారం వున్నా లేకపోయినా అంబే డ్కర్ అభిప్రాయాలను, చరిత్రను మరుగుపరచడం అంబేడ్కర్‌వాదులకు తగదు. అంబేడ్కర్‌వాద నాయ కులు అనేకమంది కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు; కాంగ్రెస్తోనేకాదు, బీజేపీతోనూ బీఎస్పీ కలిసి పని చేసింది. అందువల్ల లక్ష్మయ్య సూచనలు సాధ్యం కావు, అభిలషణీయమూ కాదు. – ఎం. జయలక్ష్మి ఏజీఎం(రిటైర్డ్), ఆప్కాబ్, హైదరాబాద్ -
‘ప్రైవేటు’తో అంబేడ్కర్ ఆశయాలకు గండి
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జన్మదినోత్సవం అంటే ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ చాలా ముఖ్యమైంది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సాధించాల్సిన భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు వెన్నెముక వంటివి. వాటిని నాశనం చేయడానికి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వాలు 1991 నుండి డిజిన్వెస్టుమెంటు పేరుతో కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాలను 24 శాతం, 49 శాతం, 74 శాతం చొప్పున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొంటూ వస్తున్నాయి. ఇప్పుడు 100 శాతం వాటాలను, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలనే స్వదేశీ విదేశీ మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పనంగా అప్పగించడానికి మోదీ ప్రభుత్వం తెగబడింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌ని సమర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 24న ఒక వెబినార్‌లో సందేశం యిస్తూ ‘ప్రభుత్వం బిజినెస్ చేయకూడదు, బిజి నెస్ సంస్థలను మోనిటర్ చేయడం, వాటికి అవసరమైన వసతులు, సదుపాయాలు సమకూర్చడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి’ అని చెప్పుకొచ్చారు. ప్రధాని వ్యాఖ్య భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన బీఆర్ అంబేడ్కర్ ఆశయానికి అశనిపాతం వంటిది. 1944 ఆగస్టు 24న కలకత్తాలో చేసిన ప్రసంగంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విద్య, పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యత ఉండాలని అంబేడ్కర్ చెప్పారు. ప్రైవేట్ సంస్థల దోపిడీ నుంచి రక్షణ కోసం పరిశ్రమలు, వ్యవసాయం ప్రభుత్వరంగంలో ఉండాలని రాజ్యాంగ రచనా కమిటీలో అంబేడ్కర్ గట్టిగా వాదించారు. భారత సమాఖ్య తన రాజ్యాంగ సూత్రాల్లో క్రింది చట్టపరమైన అంశాలు ప్రకటించాలని ప్రతిపాదించారు. కీలక పరిశ్రమలు, కీలకంగా ప్రకటించబోయే పరిశ్రమలూ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రభుత్వమే వాటిని నడపాలి. మౌలిక పరిశ్రమలైన వాటిని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. అంబేడ్కర్ సూచనలకు అనుగుణంగా 1948లో బాంబే ప్లాన్ పేరుతో మొదటి పారిశ్రామిక తీర్మానం చేశారు. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పర్చారు. 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 1969లో 14 పెద్ద ప్రైవేట్ బ్యాంకులను, 1980లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు. 1951లో 5 ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉండగా 2019 మార్చి నాటికి 348కి పెరిగి, దాదాపు రూ. 16.41 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉండేవి. 2018–19లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే రూ. 25.43 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదించాయి, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థల్లో అత్యధికం 1990 వరకు లాభాలు గడించాయి. 1990–91 ప్రపంచ ఆర్థిక మాంద్యంలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రభుత్వరంగ సంస్థలే ఆధారం. దేశ స్వావలంబనకు, ప్రజా సంక్షేమానికి పట్టుకొమ్మలుగా అలరారుతున్న సంస్థలను ‘ఆత్మ నిర్భర భారత్‘ పేరుతో అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. కష్టపడి సంపాదించి సంసారాన్ని పోషించుకుంటూ భవిష్యత్ తరాల కోసం ఆస్తులను పోగేయడం చేతగానివారు తాతలు కూడబెట్టిన సంపదను తెగనమ్ముకొంటూ బడాయిగా బతుకుతుం టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని అదే. తొలి ప్రధాని జవహర్ లాల్ నుంచి దేవేగౌడ వరకు నడిచిన ప్రభుత్వాలన్ని ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యమిచ్చాయి. ఆ తర్వాతి ప్రధాన మంత్రుల ఏలుబడిలో ప్రభుత్వ సంస్థల్లోని పెట్టుబడుల వాటాలను అమ్ముకోవడం మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించక పోగా 338 సంస్థలను టోకుగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడానికి చర్యలు చేపట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి హరించుకు పోతుంది. రిజర్వేషన్లు డొల్లగా మారిపోతాయి. 30 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా 25 లక్షల మంది పనిచేసేవారు. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో.. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం, డిజిన్వెస్టుమెంటుతో పోస్టులు రద్దు కావడం వలన ఉద్యోగుల సంఖ్య 75% పైగా తగ్గిపోయింది. ఎల్ఐసీ, బ్యాంకులు, కోల్ మైన్స్, రక్షణ రంగ సంస్థలు, ఎయిర్ లైన్స్, హైవేస్, రైల్వేస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వంటి సంస్థల్లో లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో రిజర్వేషన్ల అమలు వలన సగానికంటే ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల వారు వున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం వలన ప్రభుత్వ రంగ సంస్థలు ఎగిరిపోవడంతో అందరి ఉద్యోగాలతో పాటు బలహీన వర్గాల ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఫలితంగా.. సామాజిక న్యాయం సమసిపోతుంది, అంబేడ్కర్ ఆశయం అంతమవుతుంది. వ్యాసకర్త: నాగటి నారాయణ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు 94903 00577 -
డాక్టర్ అంబేడ్కర్... జాతినిర్మాణ రూపశిల్పి
స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతిని అంగీకరించేలా చేశారు. మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా నిలబడి, భారతీయ సామాజిక అణచివేత చట్రాన్ని సవాలు చేసిన మహనీయ మూర్తులలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒకరు. స్వాతంత్య్రానంతరం తొలి చరిత్రకారులు అంబేడ్కర్‌ను విస్మరించినప్పటికీ, నేడు మనం నివసిస్తున్న భారత దేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేడ్కర్ ముద్రను, ఆయన పాత్రను గుర్తించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం అంటే దేశ స్వాతంత్య్రమేనని అర్థం చేసుకున్న అంబేడ్కర్ స్వతంత్ర దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం అనే సమస్యపై చర్చ జరగడానికి ప్రయత్నించారు. ఒకసారి బ్రిటిష్ వారు దేశంనుంచి వెళ్లిపోయాక, ప్రజలు దోపిడీ, పీడన లేకుండా స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తారా అన్నదే ఆయన ప్రశ్న. స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత రాజకీయ, సామాజిక రంగంపై అంబేడ్కర్ జోక్యం చేసుకున్న తీరు బలమైన ముద్ర వేయడమే కాకుండా, రాజ్యాంగ రచనా సమయంలో పౌరులందరి సామాజిక, రాజ కీయ సమానత్వం పట్ల విస్తృతమైన ఆమోదానికి వీలు కల్పిం చింది. పైగా పీడకస్వభావంతో ఉంటున్న సామాజిక చట్రం, దాని ఆచారాల కింద నలిగిపోయిన వారిని ఉద్ధరించే రీతిలో రాజ్యాం గాన్ని రూపొం దించడానికి అంబేడ్కర్ బాటలేశారు. స్వాతంత్య్రం తీసుకురావడంతో గాంధీ పాత్ర ముగిసిపోగా, జాతి మొత్తంలో సామాజిక, రాజకీయ సమానత్వా న్ని తీసుకురావడం కోసం అంబేడ్కర్ పాత్ర ప్రారంభమైంది. రాజకీయరంగంలో అంబేడ్కర్ తొలి జోక్యం ఒక మనిషికి ఒక ఓటుతో మొదలైంది. బ్రిటిష్ కాలంలో సార్వత్రిక వయోజన ఓటు ఉండేది కాదు. పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు మాత్రమే ఓటు వేసేవారు. అంబేడ్కర్ సార్వత్రిక ఓటు హక్కుకై పోరాడారు. మహిళల ఓటుహక్కు ఉద్యమం దీర్ఘకాలం పోరాడిన తర్వాత బ్రిటన్ మహిళలు 1928లో ఓటు హక్కు పొందగలిగారు. అమెరికాలో సైతం మహిళలు 1920లో మాత్రమే ఓటు హక్కు పొందగలిగారు. 1930లో ఆ తర్వాత కూడా రౌండ్ టేబుల్ సదస్సులో ఈ డిమాండును లేవనెత్తడానికి అంబేడ్కర్ తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికనూ ఉపయోగించుకున్నారు. స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఒక అత్యవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేడ్కర్ సృష్టించగలిగారు. నిరక్షరాస్యత అంశం ప్రాతిపదికన ఓటింగ్ హక్కులు కల్పించడంపై రాజ్యాంగ సభలో అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత నెహ్రూ సాయంతో అంబేడ్కర్ రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కును ముందుకు తీసుకొచ్చారు. ఏ కమ్యూనిటీ అయినా, వ్యక్తుల బృందాలు అయినా స్వయం నిర్ణయాధికార హక్కును కలిగి ఉండాలనే అంశాన్ని అంబేడ్కర్ నొక్కి చెప్పేవారు. ఏ కమ్యూనిటీకైనా ఏది మంచిది అనే విషయాన్ని ఇతరులు ఆదేశించకూడదని అంబేడ్కర్ భావించేవారు. పైగా తమకు ఏది మంచిది అని ప్రజలే నిర్ణయించుకునే హక్కు ఉండాలని చెప్పేవారు. రాజ కీయ అంగాల ప్రాతినిధ్య హక్కు భావనను రౌండ్ టేబుల్ సదస్సులో పోరాడి సాధించడం ద్వారా శాసనసభల్లో దళితులకు ప్రాతినిధ్యం కల్పించడంలో అంబేడ్కర్ ఘనవిజయం సాధించారు. ఆయన ప్రతిపాదించి అమలులోకి తీసుకొచ్చిన ఈ భావన తర్వాత పార్లమెంటులో గిరిజన ప్రాతినిధ్య హక్కుల పరికల్పనకు కూడా వీలు కల్పించింది. పంచాయతీలు, పురపాలక సంస్థల్లో కూడా దళితులకు, వెనుకబడిన వర్గాలకు కూడా ప్రాతినిధ్య హక్కులు లభించాయి. అణచివేత స్వభావంకల భారత సామాజిక చట్రం, అసమానమైన మత వ్యవస్థ, ఆచారాలపై నిరంతర చర్చ మొదలెట్టి, సవాలు చేయగలడం ద్వారా అంబేడ్కర్ సామాజిక రంగంలో గణనీయ పాత్ర పోషించారు. 1930-32 కాలంలో లండన్‌లో రౌండ్ టేబుల్ సదస్సులలో దళితుల ప్రతినిధిగా ఎలుగెత్తిన అంబేడ్కర్ దళితులకు రాజకీయ ప్రాతి నిధ్యం సాధించడంతో తన పేరు మార్మోగిపోయింది. 1932 సెప్టెంబర్‌లో పూనా ఒడంబడికపై సంతకం చేయడం ద్వారా గాంధీ ప్రాణాలను కాపాడటంలో అంబేడ్కర్ నిర్వహించిన పాత్రతో విశిష్టమైంది. 1932 ఒడంబడిక తర్వాతే గాంధీ దళితులకు దేవాలయ ప్రవేశంపై ఉద్యమం ప్రారంభించారు. కానీ 1935 అక్టోబర్ 13న హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను అనే సుప్రసిద్ధ ప్రకటన ద్వారా అంబేడ్కర్ పాతుకుపోయిన భారతీయ మత చట్రాన్ని సవాలు చేశారు. ఈ విస్పోటనా ప్రకటన ద్వారా అన్ని మతాలు, మతనేతలను తమలోకి తాము తొంగి చూసుకునేలా చేశారు. సమాజంలో వ్యక్తి సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయంపై మతాలు ఏం చెబుతున్నప్పటికీ వాటి ఆచారాలను, మత వ్యవస్థలను మళ్లీ మదింపు చేసుకోవాలని అంబేడ్కర్ వారిని కోరారు. 1935లో ఆయన చేసిన ఈ చారిత్రక ప్రకటనతో ప్రతి ఒక్కరూ స్త్రీపురుషుల సమానత్వం, న్యాయమైన సమాజం పట్ల తమ మతవిశ్వాసాలను, ఆచారాలను లోతుగా పునఃపరిశీలించుకోవలసి వచ్చింది. చివరకు గాంధీజీ సైతం ఈ చర్చలో పాల్గొన్నారు. ఇక 1936లో అంబేడ్కర్ చేయలేకపోయిన సుప్రసిద్ధ ప్రసంగం ‘కులనిర్మూలన’తో మరొక సవాల్ విసిరారు. ఈ ప్రసంగంలో మతం, మానవ సమానత్వం పాత్రను అంబేడ్కర్ లోతైన విశ్లేషణ చేశారు. 1940లలో తీసుకొచ్చిన ఆలయ ప్రవేశ చట్టాలను అంబేడ్కర్ గుర్తించలేదు. కేవలం ఆలయాల్లోకి ప్రవేశం కల్పించడం ద్వారా మాత్రమే రహదారులు, నీరు, విద్య వంటి అంశాలపై దళితులకు, పౌరులకు పౌర హక్కులు, సామాజిక హక్కులు కల్పించలేరని అంబేడ్కర్ తప్పుపట్టారు. దళితులకు ఆంక్షలు లేకుండా నీరు కల్పించడానికి 1927లో అంబేడ్కర్ మొదలెట్టిన మహద్ సత్యాగ్రహం కానీ, 1932లో నాసిక్‌లోని కాలారాం ఆలయ ప్రవేశం కోసం తాను చేసిన ప్రయత్నం కానీ.. భారతీయ సామాజిక చట్రం దళితులకు ఈ హక్కులను తిరస్కరిస్తోందనడానికి నిదర్శనాలుగా మిగి లిపోయాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతి లేచి నిలబడి చర్చించి, అంగీకరించేలా చేశారు. ఇది 1950లో భారత రాజ్యాంగంలో ఈ హక్కులన్నింటినీ పొందుపర్చడానికి దారి తీసింది. డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు వ్యాసకర్త ఐఏఎస్ అధికారి, హరియాణా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి -
కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్న పుస్తకం ‘శూద్రాస్’
ఏదైనా ఒక సమాజం అసమానతల ప్రాతిపదికన ఏర్పడినప్పుడు, దాని పునర్నిర్మాణం కోసం అడుగులు వేయడమొక అనివార్యమైన, అవసరమైన క్రియ. తరతరాలుగా అణచివేతకు గురైనవారు శూద్రులు. వారిని విముక్తి చేసే ప్రక్రియలో భాగంగా, జ్యోతిబా ఫూలే చాతుర్వర్ణ వ్యవస్థను సవాలు చేశాడు. దీన్నే గొప్ప కాంక్షతో అంబేడ్కర్ కూడా చేశాడు. హిందుత్వ బ్రాహ్మణీయ అధికార సంబంధాలను బహిర్గతం చేసి, సామాజిక పునర్నిర్మాణం కోసం తన వంతు పాత్రని నెరవేర్చడంలో భాగంగా వచ్చిన పుస్తకం ‘ద శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాథ్’. పెంగ్విన్, సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘రీథింకింగ్ ఇండియా’ సిరీస్‌లో భాగంగా వచ్చిన 14వ సంపుటం ఇది. ఈ నెల 22న విడుదలైంది. సామాజిక, రాజకీయ తత్వవేత్త కంచ ఐలయ్య షెపర్డ్, జేఎన్‌యూ పొలిటికల్ సైన్స్ పరిశోధక విద్యార్థి కార్తీక్ రాజా కరుప్పుసామి సంపాదకత్వంలో వెలువడింది. సంపాదకుల పరిచయ వ్యాసంతో కలిపి మొత్తం 12 అధ్యాయాలున్న ఈ పుస్తకం, శూద్రుల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను విశ్లేషించింది. రచయితలు శూద్ర సామాజిక వర్గం నుంచి రావడం, వివిధ రంగాలలో గుర్తింపు పొందినవాళ్లు కావడం పుస్తకానికి బలాన్ని చేకూర్చింది. పార్లమెంటు సభ్యుడు శరద్ యాదవ్, సామాజిక కార్యకర్త సునీల్ సర్దార్, జర్నలిస్ట్ ఉర్మిలేష్, సోషల్ జస్టిస్ లాయర్ బిందు దొడ్డ హట్టి, వైద్యుడు పుంజాల వినయ్ కుమార్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ అరవింద్ కుమార్, రామ్ భీనవేని షెపర్డ్, ప్రాచీ పాటిల్, పరిశోధక విద్యార్థి ఓం ప్రకాష్ మహతో వంటి వారి వ్యాసాలున్నాయి. అనేక ప్రశ్నలను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుంచారు వ్యాసకర్తలు. శూద్ర విప్లవ దశను, శూద్ర విముక్తిని ఈ పుస్తకం అత్యవసరంగా సూచిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వర్ణ ధర్మ పాలననూ, గుప్త యుగాన్నీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని హెచ్చరిస్తున్నది. ప్రాంతీయ పార్టీల ద్వారా తమ ఉనికిని ఆయా రాష్ట్రాలలో కాపాడుకుంటున్న శూద్రుల రాజకీయ పార్టీలను అంతం చేసే పనిలో హిందుత్వ రాజకీయం ఉందని చెబుతున్నది. ఈ వ్యవస్థ ఎవరి కోసం ధనాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు తరచుగా ‘ఉగ్రవాది’ అనే వాడుకభాషను అలవాటు చేస్తుంది? ‘రాజ్య/ రాజద్రోహి’ తనాన్ని ఎందుకు ‘దేశద్రోహి’ తనంగా చిత్రీకరిస్తుంది? స్త్రీలను కేవలం పునరుత్పత్తి యంత్రాలుగా ఎందుకు చూస్తుంది అనే ప్రశ్నలను వేసుకుంటే విముక్తి పథంలో తొలి అడుగు వేసినట్టే. శూద్రులకు ఆధ్యాత్మిక సమానత్వం లేదనే మాట ఎంత నిజమో, అసలు సమానత్వం అనే భావనను ఈ వ్యవస్థ వాళ్లకు పరిచయం లేకుండా చేసిందనే మాట కూడా అంతే నిజం. శూద్రత్వం అంటే పనితత్వం అని గొప్పగా చెబుతారు ద్విజులు. కానీ, పనితత్వానికి, అంటే లేబర్ వర్క్‌కు గౌరవం ఇవ్వటం బ్రాహ్మణిజానికి అలవాటు లేదు. ఇక్కడ పనితత్వం అంటే పై వర్ణాలకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు సేవ చేయటమే. గాంధీ తెలివిగా శూద్రుల సేవా గుణాన్ని పొగుడుతూ దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేశాడు. 1933లో వర్ణధర్మ వ్యవస్థను సరిచేయడం ఎలా అనే అంశంపై రాస్తూ, ‘తన విధిని విస్మరించే బ్రాహ్మణుడి కంటే తనకు తగిన కర్తవ్యాన్ని చేసే శూద్రుడే ఉత్తమం’ అన్నాడు. ఈ పుస్తకం చదివినవాళ్లు ఈ విషయాన్ని ఇంకోవిధంగా అర్థం చేసుకోవచ్చు. తనకు కేటాయించిన విధిని చేసే బ్రాహ్మణుడి కంటే, తనకు తగని కర్తవ్యాన్ని విడిచిపెట్టిన శూద్రుడే ఉత్తమం! శూద్రులు తమ మేధో సామర్థ్యాన్ని, స్పృహను, ఆధ్యాత్మిక సమానత్వం, ప్రజాస్యామ్యం కోసం ఉపయోగిస్తూ, మనువాద హిందుత్వ రాజకీయాలకు బానిస అవ్వకుండా తమ జీవన విధానాన్ని, లక్ష్యాలను గొప్పగా ఉంచుకుంటూ వాటి కోసం ప్రయత్నించినప్పుడే ఈ రాజకీయ ప్రజాస్వామ్యంలో శూద్రులకు సామాజిక ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో అధికారంలో ఉన్న రెడ్డి, కమ్మ, వెలమ, యాదవ్, కూర్మి, వొక్కలిగ, లింగాయత్, నాయర్, పటేల్, జాట్, గుజ్జర్ శూద్ర కులాలు ఈ ప్రశ్నలు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఒక్క నోబెల్ బహుమతి ఎందుకు శూద్రులకు రాలేదు? ఇంకా ఎన్నో ఉత్పత్తి కులాలు, భూమిని నమ్ముకొని బతుకుతున్న కులాలు అధికారం వైపు కాదు కదా, సంపూర్ణ విద్య, ఉద్యోగం వైపు కూడా ఎందుకు అడుగులు వేయలేదు? దీనికి గల కారణాలను ఈ పుస్తకం లోతుగా విశ్లేషించింది. రాజకీయ ఎదుగుదల ఉన్నంత మాత్రాన శూద్రులు సామాజిక సమానత్వ ఫలాలను అనుభవించే దశలో లేరు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమానత్వం చాలా అవసరం. అలా లేని పరిస్థితుల్లో సామాజిక బానిస త్వాన్ని శాశ్వతం చేసినవాళ్లం అవుతాము. అలాంటి చారిత్రక తప్పిదం జరగకూడదనే హెచ్చరికను ముందుకు తెచ్చిన పుస్తకమే ‘ద శూద్రాస్’. - పల్లికొండ మణికంఠ సమీక్షకుడు పరిశోధక విద్యార్ధి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
చింతలపూడి(పశ్చిమగోదావరి): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు ఆదివారం ఉదయం పాత బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. (చదవండి: అది టీడీపీ నేతల కుట్రే) దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆందోళనలకు వైఎస్సార్సీపీతో సహా పలు రాజకీయపారీ్టల నేతలు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎలీజా పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. దళిత నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.(చదవండి: టీడీపీ ప్రలోభాలు) దోషులకు కఠిన శిక్ష తప్పదు: డీఎస్పీ జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చెప్పుల దండను తొలగించారు. దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, సీసీ కెమెరాల ఆధారంగా దోషులను పట్టుకోవడానికి విచారణ జరుపుతున్నారు. -
అది ఆ మహనుభావుల భిక్షే: సుచరిత
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రపంచ దేశాల్లో బానిసత్వం ఉంటే.. మన దేశంలో అంటరానితనం చూశామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమించారని, దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్, జగ్జీవన్రామ్లు ఆనాడే పునాదులు వేశారని తెలిపారు. ‘‘నేడు మా లాంటి వారు పదవులు అనుభవిస్తున్నారంటే, దానికి ఆ మహనుభావుల భిక్షే కారణం. అంబేద్కర్ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.. కానీ చేతల్లో చూపించే వారుండరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. (చదవండి: హక్కులను పోరాడి సాధించుకోవాలి: సుచరిత) పథకాల ద్వారా లబ్ధిపొందే వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. సీఎం చేపట్టిన పథకాల వలన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనే మహత్తర కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. డిసెంబర్ 25న దాదాపు 30 లక్షలకు పైగా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజలందరి బాగు కోరుకుంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్’’ అని పేర్కొన్నారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మంత్రి సుచరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: చంద్రబాబుకు బాధ్యత లేదు: శ్రీరంగనాథరాజు) -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి
సాక్షి, అమరావతి: అంబేద్కర్ వర్థంతి సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంటకరమణ, ఎంపీ నందిగాం సురేష్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి, అధికార ప్రతినిధి ఈదా రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్‌కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన మన దేశానికి అందించిన రాంజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యున్నతంగా నిలిచిందని తెలిపారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన చూపిన రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విలువల్ని ప్రపంచం అంతా స్మరించుకుంటున్నారని తెలిపారు. మన దేశానికి భరతమాత ముద్దు బిడ్డ అంబేద్కర్అని తెలిపారు. ఎవరు ఆడిగారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కి లేఖ రాశారని సూటిగా ప్రశ్నించారు. ఆయన పరిధి ఏమిటో తెలుసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు లాయర్ల సలహా తీసుకోమని ఆయన గవర్నర్‌కి చెప్పటం ఏమిటని మండిపడ్డారు. గవర్నర్ ఎవరి సలహాలు తీసుకోవాలి, ఎలాచేయాలనే దానిపై విచక్షణాధికారం ఉంటుందని తెలిపారు. రమేష్ కుమార్‌ను సలహా ఇవ్వమని గవర్నర్ ఆడిగారా అని ప్రశ్నించారు. చట్ట సభల్లో తీసుకున్న నిర్ణయాలకు నీకేమి సంబంధం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయనపై ఎలా విశ్వాసం ఉంటుందని, ప్రతిపక్షం మౌత్ పీస్‌లా మారిపోయారని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధి ఏమిటో తెలుసుకుని పని చేయాలని హితవు పలికారు. -
అంబేద్కర్‌కు బండి సంజయ్ నివాళి
సాక్షి, హైదరాబాద్: దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మనిషి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు వెలుగు నింపిన వ్యక్తి అన్నారు. ఆదివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఆయన విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..రాబోయే తరాలకు న్యాయం జరగాలి చాటి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ఆయన జయంతి, వర్ధంతి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ చరిత్ర భావి తరాలకు చెప్పాలిసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అయితే అంబేద్కర్ జయంతి, వర్ధంతి రోజున బయటికి రాలేని వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు. మొన్ననే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, అంబేద్కర్‌ను స్మరించుకుంటే కనీసం జ్ఞానమైన వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగానే బాబా సాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. -
అంబేద్కర్‌కి నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీ సీఎస్ నీలం సాహ్ని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్.#BRAmbedkar pic.twitter.com/hw3zpKBkWy — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 26, 2020 విజయవాడ ప్రెస్ క్లబ్లో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో 71వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూలమూల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతంరెడ్డి, మాదిగ కార్పోరేషన్ చైర్మెన్ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూధనరావు, దళిత సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కాలే పుల్లారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దళితులు అణగదొక్కబడ్డారని, చంద్రబాబు దళితులను చిన్నచూపు చూశారని మండిపడ్డారు. అంబెద్కర్ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని, రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగుతోందని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగన్‌కు తాము ఎల్లప్పడూ అండగా ఉంటామని కాలే పుల్లారావు తెలిపారు. -
హథ్రాస్ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల బాధితురాలి సామాజిక వర్గం(వాల్మీకి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో ఆ వర్గానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన 236 మంది ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకి వర్గానికి చెందిన 236 మంది ప్రజలందరు బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో వీరు బౌద్ధంలోకి మారారు. హథ్రాస్ సంఘటనతో తాము బాధపడ్డామని, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ, నాయకులు, అధికారులు వారి బాధలు వినలేదని కుటుంబాలు ఆరోపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. దీనిలో రాజరత్న అంబేద్కర్, వాల్మీకి వర్గ ప్రజలను బౌద్ధమతంలోకి ప్రవేశపెట్టడాన్ని చూడవచ్చు. వీరందరు భారత బౌద్ధ సర్వసభ్య ధృవీకరణ పత్రం కూడా పొందారు. (చదవండి: హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..) బౌద్ధమతంలోకి వెళ్ళిన ప్రజలలో ఒకరైన బిర్ సింగ్ మాట్లాడుతూ, “మా గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన 236 మంది మహిళలు, పిల్లలతో సహా బౌద్ధమతంలోకి మారాము. దీనికి ఎటువంటి ఫీజు తీసుకోలేదు. బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత, సామాజిక సేవ వంటి మంచి కార్యకలాపాలను చేపట్టాలని మాకు బోధించారు" అని తెలిపారు. ఇక సెప్టెంబర్ 14 న, హథ్రాస్‌లోని బుల్గాది గ్రామంలో వాల్మీకి వర్గానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో ఆగ్రహం చెలరేగింది. ఈ సంఘటన తరువాత, వాల్మీకి సమాజ్ నిరసన వ్యక్తం చేసి వివిధ ప్రదర్శనలు నిర్వహించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. నలుగురు నిందితులను అలీగఢ్ జైలులో ఉంచారు. -
రేపు అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ జరిగిన అకృత్యాలపై నిరసన తెలుపుతూ ఈ నెల 31న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రకటించారు. అలాగే, సెప్టెంబర్ మొదటి వారంలో అన్ని జిల్లాలకు వెళ్లి దళిత మేధావులు ప్రజాసంఘాలు, సోషల్ ఆర్గనైజర్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో దళితుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన తీరు, దళితులపై జరిగిన దాడులు, సాంఘిక వెలివేతలు, రాజ్యాంగం కల్పించిన హక్కులను నీరుగార్చిన వైనంపై చర్చిస్తామని వారు చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. తన హయాంలో దళితులపట్ల అరాచకాలకు పాల్పడ్డారన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ‘దళితులూ వర్సెస్ చంద్రబాబు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడతామన్నారు. వీరిరువురూ ఇంకా ఏమన్నారంటే.. ► దళితులకు, అణగారిన వర్గాలకు వైఎస్ జగన్ సర్కారు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు చంద్రబాబు అకృత్యాలను ప్రజల ముందుంచుతాం. ► చంద్రబాబు తొలి నుంచీ దళిత వ్యతిరేకి. అధికారంలో ఉన్నపుడు దళితులపట్ల చులకనగా వ్యవహరించి, ఇప్పుడు వారిపై మొసలికన్నీరు కారుస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు హయాంలో.. దళి తులపై అకృత్యాల విషయంలో ఏపీ నాలుగో స్థానంలో వుంది. ► తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో దళితులపై జరిగిన దాడుల్లో బాధ్యులపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలా స్పందించారా? ► రాష్ట్రంలో పేద వర్గాలకు జగన్ సంకల్పించిన మేలును అడ్డుకుంటున్న చంద్రబాబు దుష్ట ఆలోచనలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తాం. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ జిల్లాల ఎస్సీ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశమై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు దళితులకు, బడుగు, బలహీనవర్గాలకు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై చర్చించారు. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబు ఒక్కసారిగా దళితులపై ప్రేమను కనబరుస్తుండడంపై సమావేశంలో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు కె. రక్షణనిధి, పి. జగన్మోహన్ రావు, కైలే అనిల్‌కుమార్, ఎలీజా, కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, టీజేఆర్ సుధాకర్‌బాబు, తలారి వెంకట్రావు, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, ఎస్సీ సెల్ నాయకులు క్రిస్టీనా, కాలే పుల్లారావు, డేవిడ్ రాజు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ప్రాజెక్టు నిర్వహణకు కమిటీ
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్‌మైదాన్‌లో.. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు, సూచనలు ఇచ్చేందుకు నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. (125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం) ఇప్పటి వరకు స్వరాజ్ మైదానానికి ఉన్న పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్గా మార్చారు. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ కింద ఉన్న 20 ఎకరాల మైదానాన్ని సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. మొత్తం ప్రాంతాన్ని మరింత బాగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు. అందులో పార్కు, గార్డెన్, తోట పనులు ఉంటాయి. ఇప్పుడు స్వరాజ్ మైదానంలో జరుగుతున్న అన్ని సాంప్రదాయ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఏపీఐఐసీ ఈ ప్రాజెక్టుకోసం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అవుతుంది. కమిటీ వివరాలు.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా, కమిషనర్ మెంబరు కన్వీనర్‌గా, ఎడ్యుకేషన్ మినిస్టర్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కార్యదర్శి, ఫైనాన్స్ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. (అంబేడ్కర్‌కి ఆంధ్రలో ‘పరీక్ష’?!) -
కాగ్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కాగ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. -
అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది. దీనికి మంత్రులు పి.విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన కృష్ణదాసు, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని సహా వివిధ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం ఎనలేని కృషి చేశారని మంత్రులు ప్రశంసించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు చేకూర్చారు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్టీ, ఎస్సీల కోసం ఖర్చు చేసిన మొత్తం 2018-19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలానే 2019-20లో ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది (2020-21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి పొందగా.. మొత్తంగా 1,01,82,319 మందికి లబ్ధి చేకూరిందని అధికారుల సీఎం జగన్‌కు తెలిపారు. మహిళా సాధికారిత కోసమే ఈ రెండు పథకాలు.. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మన ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చాం. ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచే. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మేలు జరిగితే అంత మంచిది. ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలు అవుతున్నాయి. దాంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది. వైయస్సార్ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. వైయస్సార్ చేయూత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్తోమత పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయి. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సీఎం జగన్ తెలిపారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి పార్కు నిర్మాణం పూర్తి ఆయన మాట్లాడుతూ.. ‘2021 ఏప్రిల్ 14, అంబేడ్కర్ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యం నెరవేరాలి. అంబేడ్కర్ పార్కును వేగంగా పూర్తి చేయాలి. పార్కు పనులను రెండు విభాగాలుగా విభజించాలి. విగ్రహ నిర్మాణం, ల్యాండ్ స్కేపింగ్ పనులను రెండుగా విభజించాలి. 20 ఎకరాల్లో విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా పార్కును తీర్చిదిద్దాలి. వచ్చే ఏప్రిల్ 14 నాటికి పార్కు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలి. విజయవాడ నగరానికి పార్కు తలమానికం కావాలి. మంత్రులు, అధికారులు సవాల్‌గా తీసుకుని అంబేడ్కర్ జయంతి నాటికి పూర్తయ్యేలా చూడాలి. వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వీలైనంత కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విజయవాడ బ్యూటీని పెంచేందుకు ఈ పార్కు చాలా ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. -
‘అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం లేదా’
సాక్షి, తాడేపల్లి: విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సీఎం జగన్ నిర్ణయానికి దళిత జాతి శిరస్సు వంచి నమస్కరిస్తోంది. దళితుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్లారు. అంబేడ్కర్ విగ్రహన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందేలా ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటులో టీడీపీ నానాయాగి చేస్తుంది. ఊరు చివర అంబేడ్కర్ విగ్రహం ఉండాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు దళితులను అనేక సార్లు అవమానించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడారు. మీకెందుకురా రాజకీయాలు అంటూ దళితులను చింతమనేని హేళన చేశారు’ అని గుర్తు చేశారు. (అంబేడ్కర్‌కు సముచిత గౌరవం) ఆయన మాట్లాడుతూ.. ‘125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయనకు ఘనంగా నివాళ్ళు అర్పించినట్లు అవుతుంది. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలి. కాల్ మనీ, సెక్స్ రాకెట్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు అంటూ గతంలో చంద్రబాబు ప్రకటన చేశారు. నాలుగేళ్లుగా అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు. రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపినట్లే అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో పెడితే దళితులకు గౌరవం ఇచ్చినట్లు అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. ఊరికి చివరన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు చూశారు. రెండు వేల కోట్ల విలువ చేసే స్థలంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలిపారు అంతేకాక ‘రానున్న రోజుల్లో స్వరాజ్య మైదానం పర్యాటక స్థలంగా మారుతుంది. విజయవాడ నగరం ప్రపంచ పటంలోకి ఎక్కుతుంది. చంద్రబాబుకు విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు. ఏడాది కాలంలో దళితులకు జరిగిన సంక్షేమంపై టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధం. దళితులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకుంది వాస్తవం కాదా. కోర్టులో కేసులు వేసి రాజధానిలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే లిటిగేషన్ పార్టీ. బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తూ అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి సీఎం జగన్. విగ్రహం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి’ అని సురేష్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి
-
‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’
సాక్షి, తాడేపల్లి : విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయడం గర్వించచదగ్గ విషయమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. నగరంలో అంబేడ్కర్ విగ్రహం ఉంటే విజయవాడకు ఎంతో గౌరవం వస్తుందన్నారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం పెట్టడాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ తీరును ఖండిస్తున్నామన్నారు. తన హయాంలో పూర్తి చేయలేని విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి చేస్తున్నందుకు చంద్రబాబు సంతోష పడాలన్నారు. విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై టీడీపీ రాజకీయాలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు వ్యాపార ధోరణి మీద గతంలో స్వరాజ్య మైదానం మీద కేసు వేశారని, ఇప్పుడు స్వరాజ్య మైదానం మీద కోర్టులో ఎలాంటి కేసు లేదని స్పష్టం చేశారు. (సీఎం జగన్‌ను కలిసిన మాణిక్య వరప్రసాద్) అంబేడ్కర్ విగ్రహానికి చంద్రబాబు శంకుస్థాపన మాత్రమే చేశారని మాణిక్య వర ప్రసాద్ అన్నారు. చంద్రబాబు అంబేడ్కర్ డమ్మీ విగ్రహం ఒకటి రాజధానిలో పెట్టారని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఎలాటి పనులు జరగలేదని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, 125 అడుగులు విగ్రహం విజయవాడ నడిబొడ్డున పెట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంబేడ్కర్ ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదని దేశం మెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. విజయవాడ పెద్ద టూరిస్టు సెంటర్ అవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విజయవాడకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. (‘ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తాం’) -
‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’
-
‘సంక్షేమంలో దేశానికే ఏపీ ఆదర్శం’
సాక్షి, తాడేపల్లి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పూల మాలలు వేసి నివాళర్పించారు. (అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి) అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. నేడు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలనుకున్నామని.. కానీ కరోనా వల్ల ఇళ్ల పట్టాల కార్యక్రమం చేయలేకపోయమని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళా సాధికారికతకు కూడా సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. -
వికేంద్రీకరణ కోసం.. అంబెద్కర్ విగ్రహానికి వినతి
సాక్షి, పశ్చిమ గోదావరి: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాధించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి: ఐటీ సోదాల్లో ఎలుకలు దొరికాయని.. ఇంకా సోదాలు చేస్తే ఏనుగులు, ఒంటెలు బయట పడతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విఆర్ ఎలిజా అన్నారు. ఆయన శనివారం మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లాలోని జంగారెడ్డిగూడెం బస్‌స్టాప్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఆర్ ఎలిజా మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అమరావతిలో పేద రైతుల వద్ద భూములు కొని ప్రభుత్వానికి అమ్మి.. బినామీ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. హవాలా పద్ధతిలో వేల కోట్లు కాజేసిన చంద్రబాబు నాయుడిపై ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలు సమగ్ర విచారణ చేయాలన్నారు. పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో అభివృద్ధి వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరికి నిరసనగా చేపట్టిని రిలే నిరాహార దీక్షలు పన్నెండవ రోజు కొనసాగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. దీక్ష చేస్తున్న నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి: మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ది ప్రసాదించాలని వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షులు మంతెన యోగేంద్రబాబు పాలకోడేరు మండలం శృంగవృక్షం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు , నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉండి గ్రామ వైఎస్సార్పీపీ కన్వీనర్ గుళ్ళు గొళ్లిపల్లి అచ్చారావు, ఉండి నియోజకవర్గ మహిళా కన్వీనర్ కటిక శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతెన యోగేంద్రబాబు మట్లాడుతూ.. చంద్రబాబు దోచుకున్న రెండు లక్షల కోట్ల మోసం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందన్నారు. త్వరలోనే టీడీపీకి ప్రజలందరూ బుద్ధి చెబుతారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ నాలుగు గోడల మధ్య దాక్కొని నోరు మెదపడం లేదు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రకాశం: మూడు రాజధానులకు మద్దతుగా సింగరాయకొండ, టంగుటూరు, కొండెపిల్లో అంబేద్కర్ విగ్రహాలకు కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య వినతి పత్రం సమర్పించారు. గుంటూరు: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, మేరుగ నాగార్జున అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతి పత్రం సమర్పించారు. అనంతపురం: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ వద్ద ప్రజల వద్ద నుంచి కొల్లగొట్టిన రూ. 2 వేల కోట్లు పట్టుబడడం చంద్రబాబు అవినీతికి నిదర్శనమన్నారు. చంద్రబాబు గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల డబ్బును దోచుకున్నారని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. చంద్రబాబు దోచుకున్న అక్రమ సంపాదనను రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిప్పే స్వామి అన్నారు. అనంతపురం: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని.. రాయదుర్గం మండలం మురిడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి వినతిపత్రం అందజేశారు. అనంతపురం: అధికార వికేంద్రీకరణ స్వాగతిస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కార్యకర్తలు, నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. -
అంబేడ్కర్ పత్రికకు వందేళ్లు
భారత సామాజిక వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వాలకు నోచుకోక, అంటరానితనానికి గురవుతున్న నిమ్నకులాల కోసం తొలిసారిగా కలం పట్టిన అక్షరయోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన గ్రంథకర్తగానే గాక ప్రజాహిత పాత్రికేయునిగా ముద్రవేసుకున్న మేధావి. ఆంగ్లేయ పాలనలో నిమ్నకులాలకు అంచలంచెలుగా రక్షణలు సాధించేం దుకు కృషి చేశారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎస్.కె.బోలే, ఘొలప్ వంటి సంస్కర్తలతో కలిసి 1924లో బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా నిమ్నకులాల విద్యార్థులకు పాఠశాలలు, హాస్టళ్ళ ఏర్పాటుతో పాటు ‘సరస్వతి విలాస్’ పత్రికను ఏర్పాటు చేశారు. నిమ్నకులాల ఉద్యమంలో భాగంగా పత్రికారచనకు పూనుకున్నారు. స్వయంగా పత్రికలను నిర్వహించారు. సామాజిక పునర్నిర్మాణం కోసం ఆయన పత్రికలు కీలకపాత్ర పోషించాయి. డాక్టర్ అంబేడ్కర్ నిర్వహించిన ‘మూక్‌నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘సమత’, ‘జనత’ పత్రికలు నిమ్నకులాల ఆత్మగౌరవ, హక్కుల ఉద్యమానికి వాహికగా నిలిచాయి. కొల్హాపూర్ మహారాజా ఆర్థిక సహకారంతో 31, జనవరి, 1920లో డాక్టర్ అంబేడ్కర్ ‘మూక్‌నాయక్’ పక్ష పత్రికను ప్రారంభించారు. నిమ్నకులాల పోరాటాలు, అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు, రచనలు ఈ పత్రిక ప్రచురించేది. విషయం పట్ల అవగాహనతో, ఆధారాలతో, పాఠకులు వాస్తవాలను గ్రహించి, అంగీకరించే రీతిలో ‘మూక్‌నాయక్’’ పత్రికను ఆయన నిర్వహించారు. అంటరానితనం నిర్మూలన, సంఘసంస్కరణ మీద జరుగుతున్న చర్చలు, వాదప్రతివాదాలు ఈపత్రికలో ప్రచురించేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎమ్మెస్సీ చదివే అవకాశం రావడంతో ఆయన తన మిత్రులకు ‘మూక్‌నాయక్’ పత్రిక నిర్వహణను అప్పగించారు. ఆర్థిక కారణాలతో పత్రిక ప్రచురణ ఆగిపోయింది. డాక్టర్ అంబేడ్కర్ 1927, ఏప్రిల్ 3న ‘బహిష్కృత భారత్’ మరాఠీ పక్ష పత్రికను బొంబాయి కేంద్రంగా ప్రారంభించారు. తాగునీటికోసం జరిగిన మహద్ పోరాటంలో సంఘసంస్కర్తలను తన రచనలతో సమన్వయ పరిచిన ఘనత ఆయనదే. నిమ్న కులాలను ఒకతాటిమీదకు తీసుకొచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపగలిగారు. ‘బహిష్కృత భారత్’ పత్రిక ద్వారా అంబేడ్కర్ నిమ్నకులాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగారు. ‘అంటరానితనం నిర్మూలన నా జన్మహక్కు’ అనే నినాదాన్ని 27 నవంబర్, 1927న ‘బహిష్కృత్ భారత్’ పత్రికలో ప్రచురిం చారు. ఈలోపు సైమన్ కమిషన్‌తో సంప్రదింపులు, అనంతరం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావలసి రావడంవల్ల అంబేడ్కర్ ‘బహిష్కృత్ భారత్’ పత్రిక ప్రచురణ నిలిపివేశారు. అంబేడ్కర్ తన పత్రికల ద్వారా కోట్లాది మంది అంటరాని ప్రజానీకంలో కొంతమేర సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితి గతుల్లో మార్పు తీసుకొచ్చారు. నిమ్నకులాలకు పత్రికా రచన వారసత్వాన్ని తీసుకొచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో పత్రిక స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మాట్లాడే స్వేచ్ఛ లేని, దోపిడీకి గురవుతున్న కోట్లాదిమంది నిమ్నకులాల కోసం అంబేడ్కర్ పాత్రికేయునిగా అవతరించారు. అణగారిన వర్గాల దాస్యవిమోచకునిగా నాటి పత్రికారంగం ఆయన సేవలను కొనియాడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందుస్తాన్ టైమ్స్, ది ప్రి ప్రెస్ జర్నల్, ది అమృత్ బజార్ పత్రిక, ది న్యూయార్క్ టైమ్స్, ది టైమ్స్ (లండన్) మొదలైన పత్రికలు అంబేడ్కర్ స్వాతంత్య్ర ఉద్యమంలోను, భారత సామాజిక పునర్మిర్మాణంలోనూ పోషించిన పాత్రను కొనియాడుతూ సంపాదకీయాలను ప్రచురించాయి. నిర్మాణాత్మక తప్పిదాలపై ఉద్యమించి ఫలితాలు సాధించిన వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను ఈ దేశం సుదీర్ఘ కాలం గుర్తిం చుకోవలసి వుంటుందని ‘ది ప్రి ప్రెస్ జర్నల్’ పేర్కొంది. ‘ది అమృత బజార్ పత్రిక’ తాను అనుకున్న లక్ష్యాలను సాధించడంలో, దేశభక్తునిగా వ్యవహరించడంలో భారత ఉపఖండంలోనే ఉన్నతునిగా డాక్టర్ అంబేడ్కర్‌ను కీర్తించింది. మానవహక్కుల కోసం, ప్రజాహితం కోసం పోరాటం చేసిన మరుపురాని వ్యక్తిగా ఆయన్ని కొనియాడింది. (అంబేడ్కర్ 1920 జనవరి 31న స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా) డా. జి.కె.డి. ప్రసాద్ వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం, ఏయూ, విశాఖపట్నం మొబైల్ : 93931 11740 -
మనుస్మృతి స్థానంలో మనస్మృతి
విప్లవాలు రాజ్యాంగాలకు పురుడుపోస్తాయి. విప్లవాల కాలంలో వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్షలు తరువాతి కాలంలో రాజ్యాంగాలుగా రూపుదిద్దుకుంటాయి. నేటి తిరుగుబాటు సాహిత్యమే రేపటి రాజ్యాంగం అనేది ఈ అర్థంలోనే.1789లో ఆరంభమైన ఫ్రెంచ్ విప్లవం పదేళ్ళు కొనసాగింది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే నూతన సామాజిక విలువల్ని... ఇది ప్రధాన నినాదాలుగా మార్చింది. అమెరికా అంతర్యుధ్ధం ముగింపు సందర్భంగా అప్పటి దేశాధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1863 నవంవరు 19న పెన్సిల్వేనియాలోని గెటిస్ బర్గ్‌లో అమరుల సమాధుల వద్ద ప్రసంగిస్తూ ‘‘ప్రజల యొక్క–ప్రజల చేత– ప్రజల కొరకు’’ పనిచేసేది అంటూ ప్రజాస్వామిక ప్రభుత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. భారత రాజ్యాంగ ఆవిర్భావం భిన్నమైనది. అది ఫ్రాన్స్ మాదిరి విప్లవంలో పుట్టినది కాదు. అమెరికాలా అంతర్యుద్ధంలో పుట్టిందీ కాదు. ఇది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమ ఫలితం. భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని 1935లో జాతీయ కాంగ్రెస్ వలస పాలకుల్ని కోరింది. మే 1946 నాటి బ్రిటన్ కేబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా వలస పాలకులే ఎన్నికలు నిర్వహించి 389 మందితో భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికయిన వారు 292 మంది, సంస్థానాల ప్రతినిధులు 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి వచ్చిన వారు మరో నలుగురు. 1947లో భారత స్వాతంత్య్ర చట్టం వచ్చి దేశవిభజన జరగడంతో రాజ్యాంగ సభను భారత్– పాకిస్తాన్ మధ్య పునర్విభజించారు. సామాన్య ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని రాజ్యాంగ సభకు సామాజిక విప్లవకర కోణాన్ని అందించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతుంది. (70 ఏళ్ల ప్రస్థానంలో నిలుపే... గెలుపు) రాజ్యాంగ సభలోనికి అంబేడ్కర్ ప్రవేశం కొన్ని నాటకీయ మలుపులతో సాగింది. 1946లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల్లో అంబేడ్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) పార్టీ అభ్యర్థ్ధిగా బొంబాయి సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు రాజ్యాంగ పరిషత్‌లోకి ప్రవేశించే మార్గం లేకుండాపోయింది. న్యాయ, రాజ్యాంగ, సామాజిక రంగాల్లో అంబేడ్కర్ చైతన్యాన్ని గుర్తించిన ముస్లిం లీగ్ ఆయన్ను ఎంపిక చేసి రాజ్యాంగ సభకు పంపింది. నాటి ముస్లిం లీగ్ నాయకులు ముహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్ తూర్పుబెంగాల్ లోని జెస్సోర్ – ఖుల్నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ పార్టీ అభ్యర్థి మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ చేత రాజీనామా చేయించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ ను గెలిపించి రాజ్యాంగ సభకు పంపించారు. అంబేడ్కర్ కోసం రాజ్యాంగ సభలో తన ప్రాతినిధ్యాన్ని త్యాగం చేసిన జోగేంద్ర నాధ్ కూడా ప్రముఖ దళిత నేత, న్యాయకోవిదుడు. తరువాత పాకిస్తాన్ రాజ్యాంగ రచన బాధ్యతల్ని జోగేంద్ర నాథ్‌కే అప్పగించాడు జిన్నా. 30 ఆగస్టు 1947న జరిగిన సమావేశంలో అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వ ఆదర్శాలను మనుధర్మశాస్త్రం ఏ దశలోనూ ఆమోదించదని అంబేడ్కర్ విమర్శించాడు. సామాజిక అసమానత్వాన్ని, అణిచివేతను తీవ్రంగా వ్యతిరేకించే అంబేడ్కర్ 1927 డిసెంబర్ 25న మనుధర్మశాస్త్ర ప్రతిని బహిరంగంగా... మహాత్మా గాంధీ ఫొటో సాక్షిగా దహనం చేశాడు. రాజ్యాంగాన్ని రచించే అవకాశం తనకు దక్కినపుడు అంబేడ్కర్ నిర్ణయించుకున్న ప్రధాన కర్తవ్యం మనుధర్మశాస్త్రాన్ని బలహీనపరచడం. న్యాయం, స్వేచ్చ, సమానత్వం, సోదర భావాలను భారత రాజ్యాంగానికి నాలుగు పునాదిరాళ్ళుగా పేర్చి అంబేడ్కర్ తన లక్ష్యాన్ని సాధించాడు. రాజ్యాంగం తుది ప్రతిని రాజ్యాంగ సభాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌కు లాంఛనంగా అందజేశాక బొంబాయిలో జరిగిన ఒక బహిరంగ సభలో భారత సమాజంలో మనుస్మృతికి ఇక కాలం చెల్లిందని బాహాటంగా ప్రకటించాడు. భారత రాజ్యాంగం తుది ప్రతిని 1949 నవంబరు 26న ఆమోదించారు. అంతకు ముందు రోజు అంటే నవంబరు 25న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ ఒక చారిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. నియంతల పాలనలో దేశమంతటా అరాచకం చెలరేగిపోయే సన్నివేశాన్ని బెర్తోల్ట్ బ్రెక్ట్ ‘గుడ్ వుమన్ ఆఫ్ షేజ్వాన్’ నాటకంలో చిత్రించాడు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ‘షిన్ టీ’ మూకోన్మాదంపై నిర్లిప్తంగా ఉన్న సమాజాన్ని సహించలేక ఆక్రోశిస్తుంది. ‘‘ఓరీ మొద్దుబారిపోయిన మనుషుల్లారా! మీ సోదరుడిపై మూకోన్మాదులు దాడి చేశారు. అతన్ని పొడిచి పారిపోయారు. మీరు కళ్లు మూసుకుని మౌనంగా వుండిపోయారు. ఇదేమి నగరం? మీరేమి మనుషులు? ఇలాంటి ఘోరం జరిగినపుడు మనుషులన్నవాళ్ళు రగిలిపోవాలి. నగరమంతటా నిరసనలు వెల్లువెత్తాలి. మనుషుల్లో అలాంటి తిరుగుబాటు రాకుంటే చీకటి పడడానికి ముందే ఆ నగరం మంటల్లో మాడి బూడిదై పోవాలి’’ అంటుంది. ఆ ప్రసంగంలో జాన్ స్టూవర్ట్ మిల్, డేనియల్ ఓ కానెల్ తదితరుల్ని ప్రస్తావించిన అంబేడ్కర్ బ్రెక్ట్ పేరును ప్రత్యేకంగా పేర్కొనలేదుగానీ ‘షిన్ టీ’ ఆవేశం అందులో కనిపిస్తుంది. ‘‘జనవరి 26, 1950న మనం ఒక వైరుధ్యాల జీవితంలోనికి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక ఆర్థిక జీవితంలో అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. మన సామాజిక ఆర్ధిక నిర్మాణం (లోని లోపం) కారణంగా సాంఘిక, ఆర్ధిక జీవితంలో ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. మరి ఎన్నాళ్ళీ వైరుధ్యాల జీవితాన్ని కొనసాగిద్దాం? మన సాంఘిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఇంకా ఎన్నాళ్లు నిరాకరిద్దాం? సాధ్యమైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాల్ని తొలగించి తీరాలి. అలా చేయకపోతే, ఈ రోజు ఈ రాజ్యంగ పరిషత్తు ఎంతో కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని సమాజంలోని అసమానత్వ బాధితులు అందరూ కలిసి పేల్చివేస్తారు’’ అంటాడు. ఈ హెచ్చరిక ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంది. వ్యాసకర్త రచయిత, సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు, మొబైల్: 90107 57776 -
వర్తమాన అవసరం అంబేడ్కర్
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. ఆయన, హోంమంత్రి అమిత్ షా కలిసి రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మానవ హక్కుల్ని నిరంతరం ఉల్లంఘిస్తున్నారు. వాస్తవానికి ఇది లౌకికవాదంపై సాగుతున్న దాడి. స్త్రీల హక్కులపై జరుగుతున్న దాడి. మైనారిటీల హక్కులపై జరుగుతున్న దాడి. రాజ్యాంగంపైనా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలపైనా స్పష్ట మైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తిం చగలరు. స్వాతంత్య్రోద్యమం సాగుతున్న కాలం లోనే అంబేడ్కర్ ఒక మాటన్నారు. ‘నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయిన ప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకునే శక్తిని, సామర్థ్యాన్ని సంతరించుకోగలదు. అంతర్గత బలం లేకుండా హిందువులకు స్వరాజ్యం వచ్చినా మళ్లీ దాస్యంవైపు ఒక అడుగు ముందుకు వేయడమే కావొచ్చు. బాగా ఆలోచిం చండి’’ అని ఆయన చెప్పారు. హిందూ సామ్రాజ్య భావనను అంబేడ్కర్ అప్పట్లోనే గుర్తించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్ఆర్సీ) వంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు దేశ పౌరుల హక్కులు కాలరాస్తున్నాయి. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు మనం భారతీయులమా కాదా అనే అను మానం కలిగేలా ప్రస్తుత పాలన కొనసాగుతోందని ఇటీవల చేసిన వ్యాఖ్యానం వర్తమాన పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది. మన రాజ్యాంగంలోని 14 నుంచి 18 వరకూ ఉన్న అధికరణలు చట్ట సమా నత్వానికి సంబంధించినవి. చట్టం ముందు ఎవరూ అధికులు కారు. అందరూ సమానులు. అయితే ఆర్థిక, సామాజిక, భౌగోళిక అసమాన తలు, విద్యా అసమానత ఉన్న దేశంలో సమా నావకాశాలు, చట్ట సమానత్వం ఎలా సాధ్యం? అందువల్ల ఈ అధికరణలను వాస్తవిక దృక్ప థంతో, విస్తృత పరిధిలో అన్వయించుకోవాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. పౌర సత్వ సవరణ చట్టం రాజ్యాంగేతరమైనదే కాక, ఆరెస్సెస్ ఎజెండాకు అనుగుణమైనది. పౌరులను మత ప్రాతిపదికన చూసేది. ఇలాంటి ప్రమాదాన్ని అంబేడ్కర్ చాలా ముందుగానే గుర్తించారు. అందువల్లే ఆ భావజాలంపై పోరాడటానికి పూను కొన్నారు. గాంధీ, జిన్నాలు ఇద్దరివల్లా రాజకీ యాల్లో వికార ప్రదర్శనల పోటీ మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. భారత ఉపఖండ విభజనకు వీరిద్దరే పునాదులు వేశారని కూడా అన్నారు. కానీ అంబే డ్కర్ మతం గురించి, కులం గురించి మాట్లాడు తున్నారని కమ్యూనిస్టులు అప్పుడు ఎద్దేవా చేశారు. తమకు హిందూ మతంలో రక్షణ లేదని, అందువల్ల బౌద్ధమతంలోకి వెళ్లిపోతున్నామని అంబేడ్కర్ చెప్పారు. సమాజంలో కనబడే అస్పృ శ్యతను అర్థం చేసుకోనివారికి తన ప్రకటన వెనక వున్న ఉద్దేశాలు అర్థం కావని వ్యాఖ్యానించారు. అట్టడుగు కులాలవారిపై అత్యాచారాలు, వారి పిల్లల్ని పాఠశాలలో చేర్చాలనుకున్నప్పుడు, ఊరి బావి నుంచి నీరు తోడుకోవడానికి ప్రయత్నించి నప్పుడు, వారు మంచి దుస్తులు ధరించినందుకు, వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగినందుకు, వ్యవ సాయం చేసినందుకు, గుర్రంపై పెళ్లి కొడుకు ఊరే గినందుకు వారిని అగ్రవర్ణాలు అనేక రకాలుగా హింసించిన తీరును, వారి ఇళ్లను తగలబెట్టిన ఉదంతాలను అంబేడ్కర్ వివరించారు. చాలా కాలం కమ్యూనిస్టులు అంబేడ్కర్ కుల నిర్మూ లనను, హిందూ మతవాద నిరసనను పట్టించు కోలేదు. అందువల్లే ఇప్పుడు భారత రాజ్యాంగ పరిరక్షణకు వారు పిలుపునిచ్చే పరిస్థితులు ఏర్ప డ్డాయి. దేశంలో జరుగుతున్న నిరసనల్లో ఉద్యమ కారులంతా మతాలకు అతీతంగా అంబేడ్కర్ ఫొటోలు, రాజ్యాంగం ప్రతులు చేతబూనడం కన బడుతుంది. కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను విడనాడి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంతో పాటు ఆయన సిద్ధాంతాలను ఆచ రించినప్పుడే ప్రజలు వారిని విశ్వసిస్తారు. ఇది చారి త్రక సమయం. లౌకికవాద వ్యవస్థను పునర్నిర్మిం చుకోవడానికి అందరూ సంసిద్ధులైతే సమసమాజం తథ్యం. డాక్టర్ కత్తిపద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు మొబైల్ : 98497 41695 -
సీఎం ముందే స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదాను తయారుచేసిన ఘనత అంబేద్కర్‌ది కాదని, బ్రాహ్మణ కులానికి చెందిన బెనగళ్ నరసింహారావుదని అన్నారు. దానికి బ్రాహ్మణ సామాజిక వర్గమంతా ఎంతో గర్వపడాలని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లో జరిగిన ‘మెగా బ్రాహ్మణ బిజినెస్ సమ్మిట్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ముసాయిదా తయారు చేసిన ఘనత ముమ్మాటికి బ్రహ్మణుడైన బీఎన్ రావ్‌కే దక్కుతుందన్నారు. రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్ చైర్మన్ కావడం మూలంగా ఆయన క్రిడిట్ ఆయనకు దక్కిందన్నారు. అలాగే భారత్ తరఫున నోబెల్ బహుమతి పొందిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది బ్రాహ్మణులని అని ఆయన గుర్తుచేశారు. అలాగే ఇటీవల ఆ బహుమతి గెలుచుకున్న అబిజిత్ బెనర్జీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారని పేరొన్నారు. కాగా స్పీకర్ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడుతున్నారు. రాజేంద్ర త్రివేది మాట్లాడుతున్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎంలు అదే వేదికపై ఉండటం గమనార్హం. -
తాడేపల్లిలో అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను శుక్రవారం వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, ఎస్సీ(మాదిగ) కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ, పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజతో పాటు పలువురు పార్టీ నేతలు హాజరై.. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఉపయుక్తమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆలోచన విధానంలోనే అందరూ నడవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అభిలాషించారు. అంబేడ్కర్ ఆలోచన విధానం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ అండగా నిలవాలని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల అభ్యున్నతికి అంబేడ్కర్ చూపిన బాటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు. దళితులను సామాజిక, రాజకీయ, ఆర్థికపరంగా అభివృధ్ది చెందేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పి.. దళితులతో పాటు అంబేడ్కర్‌ను సైతం మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులపై దాడులు చేసి, వారి భూములు లాక్కొని భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. -
దళితుల అభివృద్ధికి పెద్దపీట: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: అంబేద్కర్ మార్గంలో పయనిస్తూ.. దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. అంబ్కేదర్ ఏలూరు నగరాన్ని సందర్శించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వ్రిగహాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించే దిశగా నామినేషన్ పద్దతిలో 50 శాతం పనులు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ పేరు పెట్టాలనే దళితన నాయకుల విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా, మాజీ ఎంపీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
సిగ్నల్ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన!
సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు తొలగించిన ఘటన ఉప్పలగుప్తంలో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు రోజులుగా దళిత సంఘాలతో ఆందోళన, ధర్నాలు, రాస్తారోకోలతో ఉప్పలగుప్తం రగలిపోతుండగా తాజాగా బుధవారం ఉదయం ఐదుగురు దళిత యువకులు అధికారుల తీరును నిరసిస్తూ అక్కడే తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సైక్లోన్ సిగ్నల్ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉప్పలగుప్తం మెయిన్ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అనుమతులు లేవన్న కారణంతో ఆ విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. దీనిపై దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగడం... అధికారులను నిలదీయడం వంటి వరస పరిణామాలు తెలిసిందే. బుధవారం ఉదయం తిరిగి దళితుల ఉద్యమం మొదలైంది. ఆర్డీవో బి.వెంకటరమణ, డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆధ్వర్యంలో అధికారులు కోనసీమ దళిత ఐక్యవేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, దళిత నాయకులు కొంకి వెంకట బాబ్జి, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు గెడ్డం సంపదరావు తదితరులతో పలుమార్లు నిర్వహించిన చర్చలు సఫలం కాలేదు. సమస్య పరిష్కారానికి అధికారులు మూడు రోజులు గడువు కోరినా దళిత నాయకులు ససేమిరా అన్నారు. తొలుత తొలగించిన విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని...తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలన్న డిమాండ్లు అధికారుల ముందు ఉంచారు. ఇదే సమయంలో సమస్య పరిష్కారం కావడం లేదన్న అసహనం, ఆగ్రహంతో ఐదుగురు దళిత యువకులు అక్కడే ఉన్న సైక్లోన్ సిగ్నల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి దిగడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పైన ఉన్న యువకులను దిగమని ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు దిగిరాలేదు. విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించకపోతే దూకి చనిపోతామన్న సంకేతాలు పంపించారు. వారు అన్నంత పని చేస్తారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అక్కడ నేలపై నెట్లు సిద్ధం చేశారు. సుమారు ఐదు గంటలపాటు టవర్‌పై యువకులు చేసిన హైరానాతో వాతావరణం వేడిక్కింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దళితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడ పునః ప్రతిష్టించేందుకు వీల్లేదంటూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతాయని గ్రహించిన పోలీసులు అదనపు బలగాలను అక్కడకి రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. టవర్ ఎక్కిన యువకులు భార్యలు, తల్లులు వచ్చి దిగిపోమ్మని ఏడుస్తూ అభ్యర్ధించినా వారు దిగరాలేదు. పరిస్థితి చేజారిపోతుండడంతో దళిత నాయకులు సమన్వయం పాటించాలని యువకులను కోరారు. మరోసారి అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి మూడు రోజుల గడువు ఇవ్వాలని అధికారులు కోరడంతో దళిత నాయకులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు. చివరకు యువకులు టవర్ దిగిరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
సామాజిక ఉద్యమ స్ఫూర్తి ‘దండోరా’
వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించిన మాదిగ దండోరా ఉద్యమం ఉద్భవించి నేటికి పాతికేళ్లు పూర్తయింది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వాన ఇరవైమంది యువకులతో పురుడుపోసుకున్న ఈ ఉద్యమం ఆనాటినుంచీ సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ, సమాజాన్ని సంస్కరించడం కోసం అలుపెరగని కృషి చేస్తోంది. అణగారిన కులాల ఆత్మగౌరవ పతాకగా, ప్రతీకగా పాలకులను ప్రశ్నిస్తూ ప్రజలమధ్యే నిలిచి ఉంది. సామాజిక న్యాయమంటే ‘సమాన పంపిణీ’యేనని నినదించింది. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్ల కోటాను కోరుతూ అంబేడ్కర్ వారసత్వ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. ఈ ఉద్యమం తరతరాలుగా అవమానాలకూ, అన్యాయాలకూ, అణచివేతలకూ, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న జాతిని ఏకం చేసింది. జాతి మొత్తాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి దాన్నొక శక్తిగా మలిచింది. నిషిద్ధాక్షరిగా మారిన ‘మాదిగ’ పదాన్ని శక్తిమంతమైన నినాదం చేసి జాతిలోని ప్రతి ఒక్కరూ తమ పేరు చివర చేర్చుకోవడమే నిజమైన, నిండైన ఆత్మగౌరవమని ప్రకటించింది. దౌర్జన్యానికి గురయ్యే జాతికి సమాజంలో గుర్తింపునూ, గౌరవాన్నీ, సామాజిక భద్రతనూ సాధించిపెట్టింది. వివిధ పార్టీల్లో మాదిగల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచింది. మాదిగ దండోరా ఉద్యమం ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు, అవమానాలు, అవరోధాలు, నిందలు, నిర్బంధాలు, కష్టాలు, కన్నీళ్లు, కుట్రలు, కుతంత్రాలు అధిగమించింది. ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ల సామాజిక వర్గీకరణ సమస్త అణగారిన కులాల్లో సామాజిక స్పృహను రగిల్చింది. తుడుందెబ్బ, నంగారభేరి, మోకు దెబ్బ, పూసలకేక, కుర్రు, చాకిరేవు, మాలమహానాడు, ముదిరాజ్ మహాసభ తదితర కులహక్కుల సంఘాల ఆవిర్భావంలో దండోరా ఉద్యమ ప్రభావ స్ఫూర్తే ఉంది. వివిధ మాదిగ ఉపకులాల సంఘాలను బలోపేతం చేసి వాటిల్లో సైతం నాయకత్వాన్ని అభివృద్ధి చేసింది. ఉపకులాలవారికి ఆర్డీఓల ద్వారా కాక ఎమ్మార్వో ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా పోరాడి సాధించింది. ఏబీసీడీ వర్గీకరణ ఫలాల్లో ప్రథమ ఫలాన్ని మాదిగలకు కాకుండా వారికన్నా వెనకబడి ఉన్న రెల్లి ఉపకులాలకు అందించి కింది కులాలపట్ల తన బాధ్యతను ఆచరణాత్మకంగా నిర్వర్తించింది. అంబేడ్కర్ స్ఫూర్తిని నిలబెట్టింది. అంతేకాదు...సందర్భం వచ్చినప్పుడల్లా మాలల పక్షపాతిగా మాదిగ దండోరా నిలబడింది. ప్రజా గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు, సుద్దాల దేవయ్యను చంద్రబాబు అకారణంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు వారికి అండగా నిలబడింది. ఢిల్లీలో చందర్రావు అనే మాల అధికారిపై తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్‌రావు దాడిచేసినప్పుడు, గీతారెడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోరాడింది. ఉమ్మడి అభివృద్ధికి, పురోగతికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిపెట్టింది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని నీరుగార్చాలని చూసినప్పుడు జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించి ఆ కుట్రలను వమ్ము చేసింది. తెలుగు నేలపై ఇంతటి సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉన్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగలేదనే ఆవేదన మాదిగ జాతిని వెన్నాడుతోంది. పాలకపక్షాలు మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనం వహించడం, ఈ ఉద్యమ ప్రభావంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మాదిగ జాతి నేతలు రాజకీయ బానిసత్వం చేస్తూ ద్రోహం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. మాదిగల అస్థిత్వ ఉద్యమానికి పునాదులు వేసిన ఈదుమూడి వేదికగానే ఎంఆర్పీఎస్ ‘మాదిగల ఆత్మగౌరవ జాతర’ పేరుతో జరిగే 25 వసంతాల ఉద్యమ ప్రస్థాన వేడుకలో సమరశంఖం పూరించబోతోంది. రాగల్ల ఉపేందర్ మాదిగ ‘ మొబైల్: 95736 35356 -
కేసీఆర్ దళితుల వ్యతిరేకి : మల్లురవి
సాక్షి, హైదరాబాద్ : రాత్రిపూట అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేసి చెత్త కుప్పలో వేశారని మాజీ ఎంపీ మల్లురవి మండిపడ్డారు. ఇదే అంశంపై గవర్నర్‌ను కలిశామని, అఖిల పక్షం భేటీ జరిగిందన్నారు. కానీ, ప్రభుత్వం ఇంతవరకు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మంగళవారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి వెళితే లారీతో పాటు విగ్రహం కూడా తీసుకెళ్లారన్నారు. వి.హనుమంతరావుతో పాటు దాదాపు 60మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. కేసీఆర్ దళితుల వ్యతిరేకి అని మల్లు రవి నిప్పులు చెరిగారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడు అనిచెప్పి చేయలేదని, ఆ తరువాత ఉప ముఖ్యమంత్రిని చేసి కారణం లేకుండా తొలగించారని తూర్పారబట్టారు. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారని, వెంటనే ప్రభుత్వమే విగ్రహ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
మాలిన్యం తొలగించే దీపాలు
పుస్తకపఠనం, పుస్తకప్రచురణ, కాపీరై ట్లను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్ రచయిత మైఖెల్ సెర్వాంటిస్ వర్ధంతిని (ఏప్రిల్ 23) దృష్టిలో ఉంచుకొని 1995 నుండి యునెస్కో ప్రపంచ పుస్తకదినోత్సవాన్ని జరిపేందుకు నిర్ణయించింది. ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్ రచయిత మైఖెల్ కెర్విం టిస్ పేద కుటుంబంలో జన్మించాడు. తొలిరోజుల్లో స్పానిష్ రాణి ఎలిజిబెత్ వెలోయిస్ స్మృతి కవితల సంకలనాన్ని 1569లో ప్రచురించాడు. ఆర్థిక సమ స్యల వల్ల ఇటలీలో స్పానిస్ మిలటరి దళంలో సైనికుడిగా చేరాడు. «ధైర్య సాహసాలతో లెపాంటో యుద్ధంలో (1571) పాల్గొని తీవ్రంగా గాయప డ్డాడు. తిరిగి వచ్చిన తరువాత ‘లాగ లాటి’ అనే నవలను గ్రామీణ శృంగార జీవితం ఇతివృత్తంగా రాశాడు. తర్వాత సాహసవీరుల గాథలు ఇతివృత్తంగా ‘డాన్‌క్విక్సోటి’ నవల మొదటి భాగాన్ని 1605లో ప్రచురించాడు. రెండోభాగాన్ని 1615లో ప్రచురించాడు. ఆ నవలను ప్రపంచవ్యాప్తంగా 60 భాషల్లోకి అను వదించారు. ప్రపంచంలో అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన నవలగా ప్రసిద్ధి పొందింది. అప్పట్లో రచయితకు కాపీరైట్ హక్కు, రాయల్టీ సదుపాయం లేనందున ఆర్థికంగా సంపన్నుడు కాలేక పోయాడు. ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకొని యునెస్కో ప్రచురణ, కాపీ రైట్లను ప్రోత్సహించేందుకు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రకటించింది. ‘పుస్తకాలు మనో మాలిన్యాన్ని తొలగించే దీపాలు’ అని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర,్త కందుకూరి వీరేశలింగం ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో... మంచి పుస్తకం కొనుక్కో’ అన్న సూక్తిని ప్రచారం చేశారు. కానీ నేటి యువత పుస్తక పఠ నానికి దూరమైంది. రకరకాల చానళ్ల, మీడియా ప్రభావమే దీనికి కారణం. పుస్త్తకపఠనాసక్తితో విలువైన గ్రం«ధపఠ నంలో నిమగ్నమైన వారిని ఒకప్పుడు పుస్తకాల పురుగులు అనేవారు. నేడు పుస్తకాలు తొలిచే పురుగులే కాని, పుస్తక ప్రియులు లేరు. ప్రతిభావంతమైన రచ యితల మంచి పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమి వంటి సంస్థలు ప్రచురించాలి. గ్రంథా లయాలకు పంపిణి చేసి పాఠకులకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్రపంచ పుస్తక దినోత్సవ పరమార్థం నెరవేరుతుంది. ( ప్రపంచ పుస్తక దినోత్సవానికి నేటితో పాతికేళ్లు) డాక్టర్ పీవీ సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు మొబైల్: 98491 77594 -
అంబేడ్కర్‌కు అసెంబ్లీలో నివాళులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. -
గాంధీభవన్‌లో అంబేడ్కర్ జయంతి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 128వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అంబేడ్కర్ దేశానికి అందించిన స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశానికి మార్గదర్శకత్వం చేసిన ఆయన యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో టీపీసీసీ నేతలు బొల్లు కిషన్, సతీశ్మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు’
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మా త అంబేడ్కర్ జయంతి సందర్భంలో ఆ మహానేతను అవమానించేలా వ్యవహరించిన టీఆర్ ఎస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అభిప్రాయపడ్డారు. దళిత, బహుజనుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని టీఆర్ఎస్, అనేక సందర్భాల్లో వారిని కించపరుస్తూనే వచ్చిందని ఆదివారం ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘ఓటమి భయంతోనే చంద్రబాబు నాటకాలు’ సాక్షి, హైదరాబాద్: దేశంలో మోదీ ప్రభంజనం జీర్ణించుకోలేక ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు ఈవీఎంల పేరుతో తెరలేపారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతోనే ఆయన నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 2014లో ఈవీఎంలు బాగున్నాయని, ఇప్పుడేమో వద్దంటూ చంద్రబాబు అండ్ కంపెనీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. చంద్ర బాబుతోపాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని పేర్కొన్నారు. వారు చేస్తున్న ఆరోపణలు నిజమైతే బీజేపీకి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారం ఎందుకు పోగొట్టుకుంటుందని పొంగులేటి ప్రశ్నించారు. -
అంబేడ్కర్ రాజ్యాంగం చలవే
అలీగఢ్/కథువా: అంబేడ్కర్ అందించిన రాజ్యాంగానికి ఉన్న శక్తి కారణంగానే ఓ చాయ్‌వాలా(టీ అమ్మే వ్యక్తి) భారతదేశపు ప్రధానమంత్రి అయ్యాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాకుండా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అయ్యారని వ్యాఖ్యానించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ సహించలేకపోయిందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన మోదీ, విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘పంచతీర్థాల’ ఏర్పాటు.. అంబేడ్కర్ 128వ జయంతి నేపథ్యంలో ఆదివారం యూపీలోని అలీగఢ్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘బాబా సాహిబ్ అందించిన రాజ్యాంగం కారణంగానే వెనుకబడ్డ, అణచివేతకు గురైన సామాజికవర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు. ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. మీ అందరి మద్దతుతో అంబేడ్కర్ చూపిన బాటలో ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ నినాదంతో ఈ చౌకీదార్(కాపలాదారు) ముందుకెళుతున్నాడు. కేవలం అంబేడ్కర్ మార్గాన్ని అనుసరించడమే కాదు.. చరిత్రలో ఆయనకు స్థానమిచ్చి గౌరవించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా అంబేడ్కర్‌కు అనుబంధమున్న ఐదు ప్రాంతాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తాం’ అని ప్రకటించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ సహించలేకపోయింది యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తుపై స్పందిస్తూ..‘కనీసం 40 స్థానాల్లో కూడా పోటీచేయలేని వారు ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నారు. ప్రజలు ఎస్పీ, బీఎస్పీల కుల రాజకీయాలను తిరస్కరించారు. ఎన్నికల ఫలితాల తో ఈ రెండు పార్టీలు తాళాలు కొనుక్కోవాల్సిందే’ అని మోదీ వ్యాఖ్యానించారు. అలీగఢ్ తాళాల తయారీకి ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయనో గొప్ప ఆర్థికవేత్త, విధాన రూపకర్త, రచయిత, న్యాయశాస్త్ర కోవిదుడు. సామాజంలో వివక్ష తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ కనబర్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సహించలేకపోయింది. అంబేడ్కర్ చెప్పినట్లు సమాజాన్ని మారుస్తామన్న కొందరు నేతలు ‘ముందుగా నా కుటుంబం.. ఆ తర్వాత నా బంధువులు’ నినాదాన్ని ఎత్తుకున్నారు’ అని అన్నారు. ఆ కుటుంబాలను అడ్డుకుంటాం: ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు జమ్మూకశ్మీర్‌లో మూడు తరాల పాటు ప్రజల జీవితాలను నాశనం చేశాయని ప్రధాని ఆరోపించారు. భారత్‌ను విడగొట్టేందుకు ఈ రెండు కుటుంబాలను అనుమతించబోమన్నారు. కథువాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ..‘అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు రాష్ట్రాన్ని మూడు తరాల పాటు నాశనం చేశాయి. వీరిని ఓడిస్తేనే జమ్మూకశ్మీర్‌కు ఉజ్వలౖ భవిష్యత్ సాధ్యం. తొలిదశ పోలింగ్‌లో రాష్ట్ర ప్రజలు భారీగా ఓటేయడంతో ఉగ్రనేతలు, అవకాశవాదులు, మహాకల్తీ కూటమి సభ్యులు నిరాశకు లోనయ్యారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేస్తామంటూ బలగాల నైతికస్థైర్యాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఒక్క విషయం నేను స్పష్టం చేయదలచుకున్నా. కశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే’ అని స్పష్టం చేశారు. జలియన్ వాలాబాగ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరైన స్మారక కార్యక్రమానికి వెళ్లొద్దని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌పై వచ్చిన ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలనని మోదీ వ్యాఖ్యానించారు. జాతీయవాదం కాంగ్రెస్ పార్టీకి అవమానకరంగా అనిపిస్తోందని దుయ్యబట్టారు. కశ్మీరీ పండిట్లు ఇళ్లు విడిచి పారిపోవడానికి కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు. -
అంబేడ్కర్ విగ్రహం కోసం ఉద్యమిస్తాం: కోదండరాం
పెద్దపల్లి: దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ అని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ఆరాధిస్తున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డులో పడవేయడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి దానిని ఏర్పాటు చేయకపోగా ఉన్న విగ్రహాలకు రక్షణ కల్పించడంలో విఫలమైం దని ఆరోపించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కోసం దళిత మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు. విగ్రహాన్ని తరలించిన వ్యక్తుల రిమాండ్ హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో తరలించిన ఇద్దరు వ్యక్తులపై జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 13న పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అనంతరం విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిçస్తున్నారన్న సమాచారం అందుకుని దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెత్త లారీలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ డప్పు రాజ (35), ఇటాచీ డ్రైవర్ భీంగుప్త(29)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. యూసఫ్‌గూడ డంపింగ్‌యార్డు సూపర్వైజర్లు బాలరాజు, శ్రీకాంత్‌లతో పాటు జీఎహెచ్ఎంసీ అధికారులపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
మనువును కాల్చేశాడు పదవిని కాలదన్నాడు
అంబేడ్కర్ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది. మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం. స్త్రీ హక్కుల కోసం అంబేద్కర్ తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కులం దుర్మార్గాన్నే కాదు స్త్రీల మీద అణిచివేత ధోరణులను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలలో స్త్రీ అణచివేత, కులవ్యవస్థ మధ్య ఉన్న లంకెను గురించి చర్చించేవారు.‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ వుమెన్’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టేవేసిన సామాజిక పరిస్థితులు గురించి లోతుగా చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధసంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ... బుద్దుడు, ప్రసంజిత్ మహారాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు అంబేడ్కర్. తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ మహారాజు దుఃఖితుడవుతున్న సమయంలో–‘‘ఆడబిడ్డ పుట్టిందని ఎంత మాత్రం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డ మగబిడ్డకు ఏమాత్రం తీసిపోదు’’ అంటాడు బుద్దుడు.తన ఉపన్యాసాల ద్వారా స్త్రీ చైతన్యానికి ప్రయత్నించేవారు అంబేడ్కర్. మారుతున్న సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలివేయాలని, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు.వేశ్యవృత్తిలో ఉన్న కొందరు మహర్ మహిళలు, ఆ నరక చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంబేడ్కర్ మాటలు ఎంతో దోహదపడ్డాయి.స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేడ్కర్. ఆయన నేతృత్వంలో ఏర్పడిన ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. మహిళలు చదుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేసింది. అంబేడ్కర్ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది. మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం.కులం, స్త్రీ అణచివేతను విడి విడి సమస్యలుగా చూడలేదు అంబేడ్కర్. రెండు సమస్యలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని చెప్పిన అంబేడ్కర్, స్త్రీ దృష్టి కోణం నుంచి కుటుంబ నియంత్రణను గట్టిగా సమర్థించేవారు.దళిత స్త్రీల కట్టుబొట్టును నిర్ణయించి, నియంత్రించిన అగ్రకులవ్యవస్థ కుట్రను కూడా తన ప్రసంగాలలో ఎండగట్టేవారు అంబేడ్కర్. దళిత మహాసభలు జరిగినప్పుడు, స్త్రీల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రసంగించేవారు.‘‘పాత, మురికి బట్టలకు దూరంగా ఉండాలి’’ అని చెప్పేవారు. దీని ఉద్దేశం దళిత స్త్రీలు అందంగా, ఆడంబరంగా తయారవ్వాలని కాదు... కుల ఆధారిత వస్త్రధారణను నిరసించడం మాత్రమే ఆయన మాటల వెనుక ఉన్న సారాంశం. అంబేడ్కర్ మాటల ప్రభావంతో ఎన్నో దళిత మహిళాసంఘాలు తమాషా(పాటలతో కూడిన నృత్యం)లకు దళిత స్త్రీలు దూరంగా ఉండాలని ఒక తీర్మానం చేశాయి. ప్రదర్శన సమయంలో దళిత స్త్రీలు నెత్తి మీద గ్యాస్ దీపాలు మోయకూడదని కూడా తీర్మానం చేశాయి.పాట కావచ్చు, పని కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు...ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యను అనుమతించకూడదని అంబేడ్కర్ దళిత స్త్రీలకు చెప్పేవారు.కుటుంబవ్యవస్థలో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారుచేసిన ‘హిందూ కోడ్’ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి శతవిధాల ప్రయత్నించారు అంబేడ్కర్. సంప్రదాయ ఛాందసుల కుట్ర వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్దతను చాటుకున్న ధీశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. (సౌజన్యం : డాక్టర్ బి. విజయభారతి) -
‘ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏదీ పనిచేయదని ఒక నియంతం రాజ్యం నడుస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగా నిర్మాత, ప్రపంచ మేధావి డా.బి.ఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైవిధంగా స్పందించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చెడు జరుగుతుందని అన్నారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసి చెత్త డంపింగ్ యార్డ్‌లో పడేసినా.. సమాజంలో స్పందన రాకపోతే ఇంత నిస్తేజంగా ఉంటే రాజ్యం ఎలా నడుస్తుందని నిలదీశారు. 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పాడని గుర్తు చేశారు. చైనా, జపాన్ లాంటి దేశాలు తిరిగి నమూనాలు చూశారు కానీ మూడేళ్లైనా ఒక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయని దద్దమ్మలు పేదలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు. ఇంత నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులు చేస్తున్న ఈ పాలకులకు అంబేద్కర్ జయంతిని చేసే అర్హత లేదని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులకు ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా లేదని ఘాటుగా స్పందించారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని హామి మోసం చేశాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితుడుని సీఎల్పీ నేతగా చేస్తే భరించలేక రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత, బహుజనుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాలలో రకరకాలుగా వారిని కించపరుస్తూనే వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంలో ఆ మహానాయకుడిని అవమానించి, విగ్రహానికి ఇంత దుర్గతి పట్టించిన ఈ ప్రభుత్వానికి రాజ్యాంగబద్దమైన అధికారంలో కొనసాగే హక్కు ఎంతమాత్రం లేదన్నారు. -
వెలుగు దివిటీ
-
కవర్ స్టోరీ : జై భీమ్..
అట్టడుగు కులంలో జన్మించాడు. పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవి చూశాడు. అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నాడు. అంతమాత్రాన కుంగిపోలేదు. తనలో తానే కుమిలిపోలేదు. దుర్భర పరిస్థితులకు ఎదురీదుతూనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు. తన సాటి దళితులు తలెత్తుకుని బతికేలా చేసేందుకు అహరహం కృషి చేశాడు. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించాడు. ఆయనే అంబేద్కర్. దళితుల ఆత్మగౌరవ ప్రతీక. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, ఆయన చెప్పిన మాటలను మననం చేసుకుందాం... ‘‘మనం పోరాడితే తప్ప ఏదీ లభించదు. ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. స్వయం సహాయంతో ముందుకు సాగాలి. మనం తక్కువ వాళ్లం అనే భావన వదిలిపెట్టి సమాజంలోని ఇతర వర్ణాల వారితో సమాన హోదాతో జీవించడానికి ప్రయత్నించండి. మీ అలవాట్లను మార్చుకుని అందరిలా ఆత్మగౌరవంతో బతకండి’’.. మహారాష్ట్రలోని మహద్ గ్రామంలో 1927 మార్చి 19న జరిగిన దళిత మహాసభలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ అన్న మాటలివి. అలాగని ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రసంగించిన మరునాడే దళితుల మానవ హక్కులను అమలుపరచడానికి కార్యరంగంలోకి దిగారు. వందలాది మంది దళితులతో ఊరేగింపుగా ఆ ఊళ్లోని సవర్ణులు వాడుకునే చౌదర్ చెరువుకు వెళ్లి, అందులోని నీటిని దోసిలి పట్టి తాగారు. ఆయన అనుచరులందరూ ఆయననే అనుసరిస్తూ ఆ చెరువు నీటిని తాగారు. తరతరాలుగా నిమ్నజాతులలో పాతుకుపోయిన నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సంఘటన అది. నిజానికి మహద్‌లోని చౌదర్ చెరువును అన్ని కులాల వారూ ఉపయోగించవచ్చునని మునిసిపాలిటీ 1924లోనే ప్రకటించింది. అయినా అగ్రవర్ణాల వారికి భయపడి అక్కడి దళితులెవరూ ఆ చెరువు జోలికి పోయేందుకు సాహసించలేదు. చెరువు సంగతి తేల్చుకోవడానికే అక్కడ మహాసభలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆ మహాసభలలో పాల్గొని, దళితుల్లో స్ఫూర్తి నింపారు. వారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపారు. ఆయన చొరవతోనే మహద్‌లోని దళితులకు చెరువు నీళ్లను వాడుకునే హక్కు దక్కింది. అంబేద్కర్‌లోని ఈ పోరాట పటిమకు నేపథ్యం ఆయన బాల్యం, ఆయన ఎదుగుదలలోనే ఉంది. తండ్రి నుంచి స్ఫూర్తి అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావు రామ్‌జీ అంబేద్కర్. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్. తల్లి భీమాబాయి. అప్పటి సెంట్రల్ ప్రావిన్స్‌లోని (ఇప్పటి మధ్యప్రదేశ్) మహు గ్రామంలో 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టారు. మహులో బ్రిటిష్ సైనిక స్థావరం ఉండేది. అంబేద్కర్ తండ్రి రామ్‌జీ బ్రిటిష్ సైన్యంలో సుబేదారుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. రామ్‌జీ, భీమాబాయి దంపతులకు పద్నాలుగు మంది సంతానం. రామ్‌జీ పూర్వీకులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్గడ్కు ఐదు మైళ్ల దూరంలో ఉన్న అంబావాడే రామ్‌జీ వంశీయుల స్వగ్రామం. ఆ ఊరి పేరు మీదే ఆ కుటుంబానికి అంబేద్కర్ అనే ఇంటి పేరు వచ్చింది. రామ్‌జీ సక్పాల్ మహర్ కులానికి చెందినవారు. దళితుల్లో మహర్లు కొంత సాహసవంతులు. ఈస్టిండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో అందులో చేరిన వారు మహర్లే. రామ్‌జీ కుటుంబ సభ్యులు కబీరు బోధించిన భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేది. భక్తి సంప్రదాయానికి చెందిన ప్రవక్తలు కులభేదాలను పాటించలేదు. ఈ కారణంగానే నాటి దళితుల్లో చాలామంది భక్తి సంప్రదాయానికి ఆకర్షితులయ్యారు. అంబేద్కర్ తల్లి భీమాబాయి తండ్రి, ఆరుగురు పినతండ్రులు కూడా సైన్యంలో సుబేదార్లుగా పనిచేసిన వారే. భీమాబాయి తరఫు వారు ముర్బాద్ ప్రాంతంలో సంపన్నుల కిందే లెక్క. వారిది కూడా కబీరు భక్తి సంప్రదాయమే. రామ్‌జీ ఉద్యోగ విరమణ చేసే నాటికి అంబేద్కర్‌కు రెండేళ్లు మాత్రమే. ఉద్యోగ విరమణ తర్వాత రామ్‌జీ కుటుంబంతో దాపోలీకి చేరుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం లేరు. సతారాలో వేరే ఉద్యోగం వెదుక్కుని అక్కడకు చేరుకున్నారు. తల్లి పోయే నాటికి అంబేద్కర్‌కు ఆరేళ్లు. రామ్‌జీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజ చేసేవారు. పిల్లలకు రామాయణ, మహాభారత గాథలను, మహాపురుషుల చరిత్రలను, వీరగాథలను కథలుగా చెప్పేవారు. తుకారాం, ముక్తేశ్వర్, మొరోపంత్ల కీర్తనలను పిల్లల చేత పాడించేవారు. రామ్‌జీ ఒక మిలిటరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేశారు. మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో ఆయనకు చక్కని ప్రావీణ్యం, అనువాద నైపుణ్యం ఉండేవి. తండ్రి శిక్షణలోనే అంబేద్కర్ అనువాదంలో మంచి ప్రావీణ్యం సాధించారు. రామ్‌జీకి దళితుల దుస్థితిపై స్పష్టమైన అవగాహన ఉండేది. దళితులను ఆ దుస్థితి నుంచి బయటపడేయడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేశారు. అంటరానితనం వల్ల దళితులు ఎదుర్కొంటున్న వివక్షను ఆయన బొంబాయి గవర్నర్‌ను కలుసుకుని వివరించారు. దళితుల స్థితిగతులను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పట్లో మహర్లను సైన్యంలోకి తీసుకోరాదంటూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. వివక్షాపూరితమైన ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని రామ్‌జీ ప్రభుత్వానికి అర్జీ రాశారు. తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితోనే అంబేద్కర్ దళితుల స్థితిగతులను మెరుగుపరచడానికి తుదివరకు పోరాటం సాగించారు. బాల్యంలో చేదు అనుభవాలు అంబేద్కర్ తండ్రి రామ్‌జీ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు. చివరకు సతారాలోని ఒక ఉపాధ్యాయుడు వారిని తన క్లాసుకు రానిస్తానని ఒప్పుకున్నాడు. దాంతో రామ్‌జీ తన కుటుంబాన్ని సతారాకు తరలించారు. అంబేద్కర్, ఆయన అన్న ఆనందరావు సతారాలోని స్కూల్లో చేరారు. క్లాసులో ఒక మూలగా గోనెగుడ్డలు పరుచుకుని కూర్చునేవారు. తోటి పిల్లలు వీరితో మాట్లాడేవారు కాదు. ఉపా«ధ్యాయులు వీరిని ప్రశ్నలు అడిగేవారు కాదు. నోట్సులు దిద్దేవారు కాదు. స్కూల్లో దాహం వేస్తే సైగ చెయ్యాలి. ఎవరైనా దయతలచి దూరం నుంచే నీరు ఎత్తి పోసేవారు. అంటరానితనంలోని అమానుషత్వం అప్పుడే అంబేద్కర్‌కు అర్థమైంది. అలాంటి రోజుల్లోనే అంబేద్కర్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. స్కూల్‌కు వేసవి సెలవులు ఇచ్చారు. గోరేగాంవ్‌లో ఉన్న తండ్రి దగ్గరకు అంబేద్కర్, అతని అన్న, మేనల్లుడు బయలుదేరారు. వీరి రాక గురించిన సమాచారం అందకపోవడంతో రామ్‌జీ స్టేషన్‌కు రాలేదు. చాలాసేపు ఎదురు చూసి, ఇక లాభంలేకపోవడంతో స్టేషన్ మాస్టర్ సాయంతో ఎడ్లబండిని మాట్లాడుకున్నారు. బండి కొంత దూరం పోయిందో లేదో బండివానికి వీరు అంటరానివారని తెలిసింది. వెంటనే అతను బండి ఆపేసి, బండీ ఎద్దులూ మైలపడిపోయాయని కేకలు వేస్తూ వీరిని బయటకు విసిరేశాడు. బయట ఎండ మండిపోతోంది. అప్పటికే పిల్లలు ముగ్గురూ బాగా అలసిపోయి ఉన్నారు. అంబేద్కర్ అన్న రెట్టింపు బాడుగ చెల్లిస్తామని ఆశపెట్టడంతో బండివాడు శాంతించాడు. అయితే, బండిని తాను తోలనన్నాడు. అంబేద్కర్ అన్న బండి తోలుతుంటే, పిల్లలిద్దరూ వెనుక కూర్చున్నారు. బండివాడు నడుచుకుంటూ బండిని అనుసరించాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్నా తోవలో వాళ్లకు ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఎవరిని అడిగినా నీళ్లు లేవనేవారు. పక్కనే ఉన్న మురికి కాలువలోని నీళ్లు తాగమనేవారు. అంబేద్కర్ పసి మనసుపై ఈ సంఘటన బాగానే ప్రభావం చూపింది. అంబేద్కర్ జీవితంలో ఇలాంటి చాలా సంఘటనలే ఎదురయ్యాయి. ఆదరించిన ఉపాధ్యాయుడు బాల్యం నుంచి అంబేద్కర్‌లో సాహస ప్రవృత్తి ఎక్కువ. ఒకసారి చలిగాలులతో భోరున వర్షం కురుస్తోంది. గొడుగు లేకుండా స్కూలుకు వెళ్లాలని పందెం వేశారు తోటి పిల్లలు. అంతే, అంబేద్కర్ తన పుస్తకాల సంచి, గొడుగు అన్న చేతికి ఇచ్చి, తాను వర్షంలో తడుసుకుంటూనే స్కూలుకు బయలుదేరాడు. స్కూలుకు చేరే సరికి చిత్తుగా తడిసిపోయాడు. తల మీద నుంచి నీళ్లు కారుతున్నాయి. క్లాసు టీచరైన పెండ్సే అంబేద్కర్ పరిస్థితి చూసి చలించిపోయాడు. బ్రాహ్మణుడే అయినా ఆయన కాస్త మంచివాడు. వెంటనే తన కొడుకుని పిలిచి, అంబేద్కర్‌ను తమ ఇంటికి తీసుకెళ్లి వేణ్నీళ్ల స్నానం చేయించి, తడి బట్టలు ఆరవేసి, పొడిబట్టలు ఇవ్వమని చెప్పాడు. ఆ ఉపాధ్యాయుని ఆదరణను, తనపై చూపిన ఆప్యాయతను అంబేద్కర్ ఎప్పుడూ మరువలేదు. అంబేద్కర్‌పై ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. స్కూలు రికార్డుల్లో భీమ్‌రావుగా ఉన్న పేరును భీమ్రావు అంబేద్కర్గా నమోదు చేసిన ఉపాధ్యాయుడు ఆయనే. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూనే, కొందరు దయామయుల సహాయ సహకారాలతో అంబేద్కర్ 1907లో మెట్రిక్ పూర్తి చేశాడు. అంబేద్కర్ మెట్రిక్ ఉత్తీర్ణుడవడంతో అతని కులం వారంతా సంతోషించారు. ప్రముఖ సంఘ సంస్కర్త ఎస్.కె.బోలే అధ్యక్షతన సన్మాన సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న ప్రసిద్ధ మరాఠీ రచయిత, సంస్కర్త కృష్ణాజీ అర్జున్ తాను రచించిన ‘గౌతమబుద్ధ చరిత్ర’ను అంబేద్కర్‌కు బహూకరించారు. బుద్ధుని సామాజిక ధర్మం ఆ వయసులోనే అంబేద్కర్‌కు అవగతమైంది. ఉన్నత విద్యా ప్రస్థానం మెట్రిక్ పూర్తయిన కొద్ది రోజులకే అంబేద్కర్‌కు పెళ్లి జరిగింది. బాల్య వివాహాలు జరిగే ఆ కాలంలో తొమ్మిదేళ్ల రమాబాయితో ఆయన పెళ్లి జరిగింది. ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చేరాడు. అనారోగ్యం కారణంగా ఒక ఏడాది చదువుకు ఆటంకం కలిగింది. అదే సమయంలో తండ్రి రామ్‌జీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అంబేద్కర్ చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కేలూస్కర్ బాసటగా నిలిచాడు. అంబేద్కర్‌ను బరోడా మహారాజు దగ్గరకు తీసుకుపోయాడు. ‘అర్హులైన నిమ్నజాతీయులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాను’ అంటూ బొంబాయి సమావేశంలో ఆయన అన్న మాటలను గుర్తు చేస్తూ, అంబేద్కర్‌ను పరిచయం చేశాడు. బరోడా మహారాజు వెంటనే అంబేద్కర్‌కు నెలకు పాతిక రూపాయల ఉపకార వేతనాన్ని ఏర్పాటు చేశాడు. అంబేద్కర్ 1912లో బీఏ పూర్తి చేశాక కొంతకాలం బరోడా సంస్థానంలో ఉద్యోగం చేశాడు. బరోడా మహారాజు ఆర్థిక సాయంతో అమెరికాలోని కొలంబియా వర్సిటీలో చేరాడు. స్వదేశానికి వచ్చాక బరోడా సంస్థానంలో పదేళ్లు ఉద్యోగం చేయాలనే షరతులపై బరోడా మహారాజు అంబేద్కర్‌కు ఆర్థిక సాయం చేశారు. కొలంబియా వర్సిటీ నుంచి అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, డాక్టరేట్ పూర్తి చేశారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక 1917లో అంబేద్కర్ తిరిగి భారత్ చేరుకున్నాడు. బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా చేరారు. ఒక దళితుడు విదేశాల్లో చదువుకుని ఉన్నత ఉద్యోగంలో చేరడాన్ని సంస్థానంలోని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. కింది ఉద్యోగులు సైతం ఫైళ్లను ఆయన బల్లపై ఎత్తి వేసేవారు. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ ఎక్కువ సమయం సంస్థాన గ్రంథాలయంలో గడిపేవారు. అదేకాలంలో కొల్హాపూర్ మహారాజు సాహూ మహారాజు అస్పృశ్యత నిర్మూలన కోసం కృషి సాగిస్తుండేవారు. ఆయన ఆధ్వర్యంలోని ‘మూక నాయక్’ పక్షపత్రికకు అంబేద్కర్ సంపాదకత్వం వహించేవారు. సాహు మహారాజు అంబేద్కర్ తిరిగి విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక సాయం చేశారు. ఆయన సాయంతో విదేశాలకు వెళ్లిన అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా ఎంఏ, డీఎస్సీ పూర్తి చేశారు. లండన్‌లో బార్ ఎట్ లా పూర్తి చేశాడు. కొలంబియా వర్సిటీ నుంచి ఎల్ఎల్డీ పట్టా సాధించి, తిరిగి స్వదేశానికి వచ్చారు. కులవివక్షపై పోరాటం స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేద్కర్ కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆయన 1927లో ‘బహిష్కృత భారతి’ అనే మరాఠీ పక్షపత్రికను ప్రారంభించారు. అందులోని ఒక వ్యాసంలో ‘‘తిలక్ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేవాడు కాదు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, జన్మహక్కు అని ప్రకటించి ఉండేవాడు’’ అని రాశారు. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్ సాగించే జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ అస్పృశ్యతా నిర్మూలన కోసం సాగించిన కృషికి నాటి కాంగ్రెస్ నేతల నుంచి పూర్తి మద్దతు ఉండేది కాదు. గాంధీ దళితులను చూసిన కోణం వేరు. ఆయన వర్ణ వ్యవస్థను వ్యతిరేకించలేదు. వర్ణ వ్యవస్థ భారత దేశానికి గల ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉందని సమర్థించారు. అయితే, అంటరానివారుగా ఉన్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజం బాగు కోసం తమ వృత్తులను చేస్తున్నారని, అలాంటి వారిని ఇతర వర్ణాల వారందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయంగా అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్ర పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారు. రాజ్యాంగ సవరణలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం 1930, 31, 32 సంవత్సరాలలో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ అంబేద్కర్ పాల్గొన్నారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీ కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఆ సమావేశంలోనే గాంధీకి, అంబేద్కర్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ పట్టుబడితే, అలా చేయడం వల్ల హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందంటూ గాంధీ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గాంధీ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత 1932లో రామ్సే మెక్‌డొనాల్డ్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదిస్తూ ‘కమ్యూనల్ అవార్డు’ను ప్రకటించాడు. అప్పటికి ఎరవాడ జైలులో ఉన్న గాంధీ, ఈ ప్రకటన తెలిసిన వెంటనే జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనివల్ల అంబేద్కర్‌పై నైతిక ఒత్తిడి పెరగడంతో ఆయన గాంధీతో పూనా ఒప్పందానికి సిద్ధపడ్డారు. ఉమ్మడి నియోజకవర్గాల్లో ‘కమ్యూనల్ అవార్డు’ కంటే ఎక్కువ స్థానాలను దళితులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. గాంధీ అంటరానితనం నిర్మూలన కోసం చేపట్టిన ఉద్యమంలో అంబేద్కర్‌ను భాగస్వామిగా చేసినా, గాంధీ విధానాలతో పొసగక అంబేద్కర్ బయటకు వచ్చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ వంటి సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. అదే కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశానికి విభజనతో కూడిన స్వాతంత్య్రం వచ్చాయి. అంబేద్కర్ సూక్తులు ►మనిషికీ మనిషికీ మధ్యనున్న అసమానత్వమే అన్ని బాధలకూ మూలం. ►గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సద్వర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి. ►పుసక్తాలు దీపాల వంటివి. వాటిలోని వెలుతురు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. ►కేవలం పుస్తకాలను చదివి వదిలేస్తే ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్లేనా? ►కులం పునాదుల మీద దేనినీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు. ►రాజ్యాంగం దుర్వినియోగమైనట్లు తెలిస్తే, దానిని తగులబెట్టే తొలి వ్యక్తిని నేనే. ►మేధస్సుకు పదును పెట్టడమే మనిషి అస్తిత్వానికి పరమార్థం. ►స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్నే నేను ఇష్టపడతారు. ►సామాజిక స్వేచ్ఛను సాధించనంత వరకు చట్టం కల్పించిన స్వేచ్ఛ మీకు అందదు. ►రాజకీయ నియంతృత్వాన్ని సామాజిక నియంతృత్వంతో పోల్చలేం. ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కంటే, సమాజాన్ని ఎదిరించే సంస్కర్తే ధైర్యశాలి. ►ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోదలచిన వారు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఎంతటి మహాత్ముల వద్దనైనా వదులుకోరాదు. ►ఒక వర్గాన్ని మరో వర్గంపైకి ఉసిగొలిపే ధోరణి ప్రమాదకరం. ►నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ తలెత్తితే, ముందు నేను నా జాతి సమస్యలకే ప్రాధాన్యమిస్తాను. ►దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. ►నీ కోసం జీవిస్తే, నీలోనే మిగిలిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ► మండిన కొవ్వొత్తి మనది కానట్లే, గడిచిన కాలమూ తిరిగి రాదు. రాజ్యాంగ రచన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మనదైన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగ రచన కోసం ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే, దాదాపు మొత్తం రాజ్యాంగ రచనా భారాన్ని అంబేద్కరే నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు సమావేశంలోఅప్పటి కేంద్ర మంత్రి టి.టి.కృష్ణమాచారి మాట్లాడుతూ, ‘‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. మిగిలిన ఒకరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యంగ రచనా భారమంతా అంబేద్కర్ ఒక్కరే మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో సందేహం లేదు.’’ అన్నారు. అంబేద్కర్ కేంద్ర తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా, 1951లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. బౌద్ధమత స్వీకారం అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి 1935లో మరణించారు. తర్వాత ఆయన తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదా కబీర్‌ను పెళ్లాడారు. జీవిత చరమాంకంలో 1956 అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంతకు చాలాకాలం ముందే ఆయన ‘నేను హిందువుగా పుట్టినా, హిందువుగా మాత్రం మరణించను’ అని ప్రకటించారు. బౌద్ధం ఈ దేశ సంస్కృతిలో భాగమేనని, తన మత మార్పిడి వల్ల దేశ చరిత్రకు, సంస్కృతికి ఎలాంటి భంగం కలగకుండా చూశానని చెప్పుకున్నారు. బౌద్ధం స్వీకరించిన కొద్ది కాలానికే, 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ కన్నుమూశారు. రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా, ఆర్థిక, న్యాయ నిపుణుడిగా ఆయన చేసిన నిరుపమానమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించింది. -
‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య’ అద్భుతం
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి(ఏవోవీఎన్) పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనే ప్రతిభావంతులైన దళిత, గిరిజన యువత కల సాకారం చేసే పథకం ఇది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థికసాయం అందుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్యావకాశాన్ని సాకారం చేస్తున్న ఏవోవీఎన్ సత్ఫలితాలిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల ఒక పరిశీలన చేసింది. 117 మంది విద్యార్థుల వివరాలు తెలుసుకుని వారి పరిస్థితిని ఆరా తీసింది. ఇందులో మెజార్టీ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడినట్లుగా గుర్తించింది. ఐటీ రంగంలోనే అధికం... ఈ పథకం కింద ఇప్పటివరకు 518 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 407 మంది ఆయాదేశాల్లోని వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. 2017 వరకు ఎంపికైన విద్యార్థులు కోర్సులు పూర్తిచేయగా మిగతావారు కోర్సు కొనసాగిస్తున్నారు. పరిశీలన చేసిన 117 మందిలో 74 మంది ఇప్పటికే ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు సాధించారు. వారిలో దాదాపు 65 శాతం మంది చదువుకున్న చోటే ఉద్యోగాలు పొందారు. మరో 30 మంది అత్యుత్తమ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్నట్లు గుర్తించారు. మరో 13 మంది మాత్రం కోర్సు తుదిదశలో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.63.03 కోట్లు ఖర్చు చేయగా 78.57 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆర్నెళ్లలో సక్సెస్‌రేటు 95 శాతం ఉంటుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐదేళ్లలో ఏవోవీఎన్ పథకం అమలుతీరు ఏవోవీఎన్‌కు ఎంపికైన విద్యార్థులు : 518 కోర్సుల కోసం విదేశాలకు వెళ్లినవారు : 407 సక్సెస్ రేట్: 78.57 శాతం పథకం కింద ఖర్చు చేసిన మొత్తం: రూ. 63.03 కోట్లు ఏవోవీఎన్ లబ్ధిదారుల పరిశీలన ఇలా... పరిశీలించిన విద్యార్థులు : 117 ఉద్యోగాలు పొందినవారు : 74 ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు : 30 మాస్టర్స్ కోర్సు కొనసాగిస్తున్నవారు : 13 సంతృప్తికర స్థాయిలో లబ్ధి ఏవోవీఎన్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను అపరిమితం చేశాం. అర్హులు ఎంతమంది వస్తే అంతమందికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం ఆమోదిస్తుండడంతో విద్యార్థులు సైతం సాఫీగా కోర్సు పూర్తి చేయగలుగుతున్నారు. – పి.కరుణాకర్ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
మున్సిపాలిటీలో వార్డులను పెంచాలని నిరసన
సాక్షి, చింతలపాలెం (హుజూర్నగర్) : హుజూర్నగర్ మున్సిపాలిటీలో వార్డులను పెంచాలని కోరుతూ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్క్ర్ వ్రిగహానికి పూలమాలలు వేసి, విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మేజర్‌గ్రామ పంచాయతీని నగరపంచాయతీగా, ఆ తర్వాత గ్రేడ్3 మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ 20 వార్డులుగానే ఉండటం శోఛనీయమన్నారు. నూతన ఓటర్లతో కలుపుకుని సుమారు 29వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, వాటిని సరిచేసి వార్డులు సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు. గతంలో డీలిమిటేషన్లో వార్డుల పునర్విభజన చేయలేదన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం కొత్తగా మరో 6 వార్డులను పెంచేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అజీజ్ పాషా, వార్డు కౌన్సిలర్ మన్నీరు మల్లిఖార్జున్‌రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ, నాయకులు చిట్యాల అమర్నాధ్రెడ్డి, యరగాని గురవయ్య, ఎంఏ మజీద్, బాచిమంచి గిరిబాబు, పులిచింతల వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, బిక్కన్సాబ్, కోలమట్టయ్య, రామిశెట్టి మురళిప్రసాద్, మహేష్ గౌడ్, పెద్దబ్బాయి, ముత్తయ్య, రాములు, జగన్, నర్సింహారావు, మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని కీసర మండలం రాంపల్లి గ్రామ ప్రధాన చౌరస్తాలో గుర్తుతెలియని దుండగులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహ తలను పూర్తిగా తొలగించి కిందపడేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు సంఘటనా స్ధలానికి చేరుకొని దుండగులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళను దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కీసర సీఐ సంఘటన స్థలానికి అందోళకారులను శాంతింపజేశారు. దుండగులను అదుపులోకి తీసుకున్నామని సీఐ ప్రకాష్ పేర్కొన్నారు. -
బామ్మ
నేరు గీతలా మట్టిరోడ్డు, నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం కలిగిన ప్రాథమిక పాఠశాల, వరుసగా పెంకుటిండ్లు, ఇండ్ల చుట్టూ పంటపొలాలు... అంటూ ఎంతో అందంగా ఉన్నప్పటికీ ‘మోటపాలంజేరి’ ఎప్పుడూ నాకు నచ్చలేదు.ఎప్పటినుండి ఈ అయిష్టత ఏర్పడిందో తెలియదు. ‘‘మోటపాలం వీథికి వెళ్లాలి.’’ అన్న అమ్మతో, ‘‘మోటపాలంజేరి కా?’’ అని ఆటోడ్రైవర్ ఆశ్చర్యంగా అడిగిన క్షణం నుండా?కాదు... ఎవరూ లేని దారిలో, ఎదురుగా వచ్చిన సైకిల్‌కు దారివ్వమని బలవంతంగా నా చేతిని పట్టుకొని నొప్పి పుట్టేటట్టుగా బామ్మ నన్ను పక్కకు లాగిన క్షణం నుండా? లేదు... ఎనభైఏళ్ల తాతయ్యను ఇరవైఏళ్ల యువకుడు‘ఒరేయ్ షణ్ముగం’ అని పిలిచిన జ్ఞాపకం తప్పైన తరుణంలోనా?.... తెలియటం లేదు. మోటపాలంజేరి నాకు ఎప్పుడూ నచ్చలేదు. ఆ ఊరిమీదున్న అసహనాన్ని బయటపెట్టినప్పుడల్లా బామ్మ అంటుండేది. ‘‘అదేంటే అలా అనేశావు. ఈ మోటపాలెం ఊరిని ఏర్పరచిన మొదటి నలుగురిలో మా నాన్నకూడా ఒకరు. ఆయన ఏర్పాటుచేసినఊరిని కదా నువ్విలా మాట్లాడేశావు?’’ తాత గురించి బామ్మకు ఎప్పుడూ గౌరవభావమే ఉండేది. ఆ చుట్టుపక్కల ఊళ్లకంతా అప్పట్లోనే నాలుగు గుర్రాల చారెట్బండి ఉన్నది తాతయ్య ఒక్కడికేనని గొప్పలు చెప్పేది. బుద్ధి తెలిశాక... ‘‘ఆ చారెట్బండ్లో ఏ కులంవాళ్లు ఎక్కి వెళ్లేవాళ్లు నానమ్మా?’’ అని అడగాలనిపించేది. ఈ తరంవాళ్ల ముందు ఆమె గొప్పలు ఓడిపోతుందేమోనన్న భయంతోటే అడక్కుండా ఉండిపోయాను.సరదాగా గడపటానికి వీలుకాకపోయినప్పటికీ, మరో దారిలేక, ఆ మోటపాలంజేరిలో నేను ‘ఆలిస్’ గానూ, ఆ వాడను ‘వండర్ ల్యాండ్’ గానూ ఊహించుకొని ఉండాల్సి వస్తుంది. ఇంటి వెనక ప్రవహించే పంటకాలవ మీద, ఒక మనిషి మాత్రం వెళ్లేంతగా వెయ్యబడిన ఆ పొడవైన రాతి వంతెన మీద కూర్చుని, కాలవ నీటిలో కాళ్లు తడిసిన క్షణాలు, సమయాలే... నా వండర్ ల్యాండ్బ్రతుకులోని గొప్ప అనుభూతి తరుణాలు. దాన్ని మార్చటానికి పెద్ద తరుణం ఇప్పటివరకూ మరేదీ రాలేదన్నది అక్షర సత్యం. అయితే దాన్నంతా అధిగమించి ఒక గొప్ప వండర్ ల్యాండ్‌ను తనలో దాచుకొంది మోటపాలంజేరిలో ఉన్న మా బామ్మ ఇల్లు. ‘‘ఆ ఇంట్లో అలా నువ్వేం చూశావనీ?’’ అని అమ్మ మొదలు అమ్మమ్మ వరకూ అడిగి విసిగించిన సమయాలు గతించాయి. తెల్లని తెలుపూ కాస్త నీలిరంగూ కలిసి సున్నం కొట్టిన నున్నటి గోడలమీద ఎక్కణ్ణించో తీసుకొచ్చి నాటిన మనీప్లాంట్ తీగ. దానితోపాటు బచ్చలి తీగా, అల్యూమినియం డబ్బాలలో పెంచుతున్న పట్టు రోజా, సంపంగి, గోరింటాకుతో కలిసి ఇంద్రధనుస్సులా ఉన్న ఆ ఇంటి ద్వారబంధంలో చెక్కిన కిరీటం ధరించిన సింహం మరిక ఏ ఇంట్లోనూ నేను చూడలేదు. ఆ సింహాన్ని నేనెంతో ఆసక్తిగా స్పృశించిన రోజులలో, తాతయ్య చిరునవ్వుతోఅనేవారు... ‘‘అంతా మీ బామ్మ ఇష్టమే. ఆమే కదా ఆచారికి ఆ ఆలోచన చెప్పింది!’’ అని. ఆ తలుపులు మాత్రమే కావు... అంతా బామ్మే చెక్కి ఉంటుందా అని భ్రమించే విధంగా ఆ ఇంటిని నిర్మించుకుంది.పడమరన చూస్తే ఒంటరిగా ఉన్న పెద్ద వంటగది మరో ఇల్లులాగానే ఉంటుంది. నడవ, లోపల ఇల్లు, హాలు అంటూ అన్నీ వేర్వేరు ఇండ్లులాగా... ఒకే ఆవరణలో రెండు ఇండ్లు అన్నట్టుండేవి. ఆ వంటగదే నాకు బోధివృక్షం ఎప్పటికీ! సెలవు దినాల్లో కుటుంబమంతా నడవలోనూ, లోపలి ఇంట్లోనూ, హాల్లోనూ కలిసి ఉంటే... నేను మాత్రం వంటగదిలో కూర్చుని ఉండేదాన్ని. దెబ్బలు తిన్నా, ఏడ్చినా, సంతోష సమయాల్లోనూ, అన్నీ ఆ గదిలోనే. వర్షాకాలం అవసరాల కోసం, మండుటెండల్లో చెట్టూ పుట్టా గుట్టా అంటూ అంతా తిరిగి సేకరించిన కట్టెలతో నిండిన వంటగది. పెరుగుతో నిండిన ఉట్టి కుండలు, ఊరబెట్టిన ఊరగాయలు, చింతపండుతో రోజూ బాగా రుద్దిపెట్టిన రాగి మంచినీళ్ల బిందె, రోలూ దాని పక్కనే... బాగా దంచో, లేదా రుబ్బురాతిలో వేసి రుబ్బో, చేసిపెట్టిన మసాలాలతో కూడిన డబ్బాలూ అంటూ ఆ గది మొత్తమూ... నేను పక్కకువాల్చటానికి తగ్గ భుజాలతోటీ, నా తలను ఆప్యాయంగా తడిమే చేతులతోటీ నిండి ఉందన్నట్టుగా అనిపించేది. ఒకే సమయంలో పదిమంది కూర్చుని భోంచేసే విధంగా ఉన్న ఆ వంటగదిలో ఉన్న మసిపట్టిన కట్టెలపొయ్యికి పైన, బామ్మ అమ్మకు, వాళ్ల అమ్మ పెళ్లి కానుకగా ఇచ్చిన ఒక కత్తిపీట వ్రేలాడుతూ ఉండేది. పూర్తిగా ఇనుముతో చేసిన ఆ కత్తిపీటతో కాయలు కోసినా సరే, కూర కోసినా సరే, జారిపోయి అవిపరుగులు తీసేవి. అంత సన్నగా పదునుగా ఉండేది ఆ కత్తిపీట. ఆశగా కాయలు కొయ్యటానికి ప్రయత్నించి వేలిని కోసుకున్న (ఇంకా ఆ గాయంతో తిరుగుతున్న) ఇష్టం దానిమీద ఉంది నాకు.పళ్లెంమీద కత్తిపీటను పెట్టుకొని బామ్మ కాయలు కోయటం ఎంతో అందంగా ఉండేది. అందులోనూ ఆమె క్యాబేజీ కోసే అన్ని సమయాల్లోనూ నేనే ఆమె మొదటి అభిమానిని. క్యాబేజీలోని ఒక్కో ఆకునూవొలిచి, దాన్ని చెయ్యి పట్టేంతగా ఒకటిగా కలిపి పట్టుకొని, నిదానంగా ఒకే కొలతతో తరిగి తరిగి... ఆ పళ్లెం నిండిపోతున్నప్పుడు, బామ్మ కళ్ల మెరుపులు కోనేట్లో ప్రకాశవంతంగా పూసిన తెల్లతామరలను గుర్తుకుతెచ్చేవి.కాస్త పప్పు, కొన్ని టమోటాలూ, రెండు ఎండుమిరపకాయలూ గిల్లి వేసిన చారూ వేపుడుగా... ఆమెచేసే ఆ క్యాబేజీతోటే, ఒక కుంభం అన్నం తినొచ్చు అని నాన్న అప్పుడప్పుడూ అంటున్నప్పుడు, అదినిజమేనని అనిపిస్తుంటుంది.బామ్మ అద్భుతమైన వంటలకు ఆ కత్తిపీటే కారణమని చాలాకాలం వరకూ నమ్మిన నేను, మా అమ్మకు కూడా ఇవ్వని ఆ కత్తిపీటను నేను తీసుకెళ్లాలని ఎప్పుడూ ఆశపడేదాన్ని. ‘‘బామ్మా, నీ పెళ్లి తర్వాతే మీ అమ్మ నీకు ఈ కత్తిపీటను ఇచ్చిందా?’’ ‘‘ఔను. కానీ ఆ కత్తిపీటను వాళ్లమ్మ ఆమెకు పెళ్లి కానుకగా ఇచ్చింది.’’‘‘అయితే నేను పెళ్లిచేసుకొని వెళ్లేప్పుడు దాన్ని నాకిస్తావా బామ్మా?’’పదేళ్లుకూడా పూర్తిగా నిండని నేను అలా అడగ్గానే బామ్మ ఎంతగా నవ్విందనీ? అమ్మ, అత్త, పెద్దమ్మ, వదిన అంటూ అందరినీ దగ్గరకు పిలిచిన బామ్మ... మా నాన్నతో అంది:‘‘నీ కూతురి పెళ్లికి నగలేవీ వద్దట. ఈ కత్తిపీటే కావాలిట’’‘‘నీకెందుకమ్మా ఇవన్నీ. నీకు మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషిన్ అంటూ అన్నీ మెషిన్లనే కొనిస్తాగా.’’ అంటూ నా చేతిని పట్టుకొని నాన్న చెప్పిన ఆ క్షణంలో, ఆ కత్తిపీట నాది కాదన్న బాధ ఎక్కువైంది. అది కన్నీరుగా బయటికొచ్చింది. అది చూసి అదిరిపడ్డ బామ్మ... ‘‘మీ తాతయ్య కుటుంబంలో అయిదారు తరాల తర్వాత వరమై పుట్టిన ఆడబిడ్డవు నువ్వు. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకూడా ‘ఆడపిల్ల’ అని ముఖం తిప్పుకుంది. నేనే కదా ఆస్పత్రిలోని వాళ్లకంతా మిఠాయి కొని పంచాను. మా కులదేవతవు నువ్వు. నీకు లేనిదా? మా అమ్మ నాకు ఇచ్చిందంతా నీకే!’’ అని నా తలమీద కొట్టి ప్రమాణం చేశాకే నా కన్నీళ్లు ఆగాయి.ఆ కత్తిపీట మీద నాకు ఇష్టముందా లేక బామ్మ వంటమీదా? అని ఎప్పుడూ నాకొక అనుమానం ఉండేది. లేదూ... బామ్మ అద్భుతమైన వంటకు ఆ కత్తిపీటే కారణమన్న కుతూహలమా అన్నదీ అర్థమయ్యేది కాదు అప్పుడు.ఇంట్లో ఏ కాయగూరలూ లేక, కొనటానికి డబ్బుల్లేని సమయంలోకూడా, బామ్మ దానిగురించి పెద్దగా అంగలార్చేది కాదు.వంటగదిలోకెళ్లి, అక్కడ మూటల్లో నింపి ఉన్న బియ్యంలో నుండి ఒక చాటెడు బియ్యం తీసుకొని, మట్టి కుండలో ఒక ఊరు ఊరే తినేంతగా అన్నం పొంగించేది. కొంచెం కూడా అధైర్యపడకుండా పశువులకోసం ఉంచిన తవుడును చేతి నిండుగా జవురుకొని, ఒక పెద్ద చట్టిలో వేసి కొద్దిగా వేయించి, దానితోపాటు కాస్త చింతపండు, మిరపకాయలు వేసి, మూడింటినీ రుబ్బురోల్లో వేసి రుబ్బి, ఐదే ఐదు నిమిషాల్లో పచ్చడి చేసేది. ఎంత అర్థరాత్రి సమయంలోనైనా ఈ ఇంట్లో ఈ భోజనం కచ్చితంగా ఉంటుందన్న నమ్మకాన్ని అందరిలోనూ కలిగేలా చేసింది బామ్మ. ‘‘కాకరకాయను ఏం చేస్తారు?’’ అని అడిగిన ఆఫీసు ఫ్రెండుతో ‘‘సాంబార్లో వేస్తాను.’’ అన్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.‘‘చింతపులుసులోనేగా కాకరకాయలు వేస్తారు.’‘‘అలాగా. మా ఇంట్లో సాంబార్లో మాత్రమే కాకరకాయల్ని వేస్తాం. లేదూ దాన్ని పప్పులోవేసి వేపుడు చేస్తాం!’’బామ్మ అలాగే అలవాటు చెయ్యించింది. బామ్మకు పెద్ద కాకరకాయలు అంటూ ఒకటుండటం తెలుసో తెలియదో అని ఆలోచించాను. పొట్టి కాకరకాయల అభిమాని ఆమె. సంతలో నుండి పొట్టిపొట్టి కాకరకాయల్ని ఏరుకొని వచ్చేది. ఒక్కో కాకరకాయనూ అడ్డంగా తరిగి, గింజల్ని తీసేసి,దాన్ని అలాగే ఆ ఇటుకల పొయ్యిదగ్గర కటిక నేలమీద పరిచేది. ‘‘ఏం బామ్మా, కాకరకాయల్ని ఇలా కటిక నేలమీద పరిచావు. మసీ, దుమ్మూ ధూళీ అన్నీ అంటుకుంటాయిగా?’’ అని అడిగినపుడు... ‘‘లేదే, కటికనేల కాకరకాయల్లోని చేదునంతా పీల్చేస్తుంది. తర్వాత పులుసు పెడితే చేదుగా ఉండదు.’’ అని వివరణ ఇచ్చింది.ఆమె ఎలా చెప్పగలిగింది, ఏ ఆధారంతో ఈ కటికనేల చేదునుపీల్చేసే కాన్సెప్ట్ పనిచేస్తుంది అని నాకు తెలియలేదు. అయితే ఆమె పెట్టిన ఏ ఒక్క కాకరకాయ సాంబార్లోనూ చేదు అన్నది కాస్తంత కూడా లేదు అన్నది మాత్రం బాగా తెలుసు.శాఖాహారం మాత్రమే కాదు. మాంసాహారంలోనూ బామ్మ దుమ్ము లేపుతుంది. ‘తామ్రభరణి’లో నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నట్టుగా ప్రకటన వచ్చిన రోజుల్లో ఊరు ఊరంతా ఏట్లో ఉండేది, నీళ్లు తగ్గిపోగానే తేలిపోయే చేపల్ని పట్టుకోవటానికి. అయితే బామ్మ మాత్రం చేపల్ని పట్టుకునేది కాదు. మారుగా ఏట్లో అడుగుభాగాన ఉండి, తగ్గిపోయిన నీళ్లు కారణంగా పైకి కనిపించటం మొదలుపెట్టే నత్తగుల్లల మీదే బామ్మ చూపులన్నీ ఉండేవి. ఒక బిందె నిండుగా నింపుకొని వచ్చేది ఆ నత్తల్ని. తర్వాత ఇంటి పెరట్లోని మట్టిలో కూర్చుని, ఆ నత్తల్ని శుభ్రం చెయ్యటం మొదలుపెట్టేది. మూసుకున్న చిప్పల్ని విప్పదీసి, లోపల ఉండే ఆ చిన్ని మాంసాన్ని తీసి, దాన్ని కడిగి ఇంకో చట్టిలో వేసేది. బిందె నిండుగా ఉండే అన్ని నత్తల మాంసాన్ని తీసి, దాన్ని పులుసుగా పెట్టి ఇచ్చేది. మంచు కురిసే రాత్రుల్లో, ఆ కట్టెలపొయ్యి మంటల్లో, వంటగదిలో కూర్చుని, ‘‘తెల్లారన్నమూ నత్తల పులుసూ’’ తిన్న సమయాలు ఇంకా నాలో నేనే చెప్పుకునే విసుగుపుట్టని కథల్లో ఒకటై నిలుస్తోంది.ఏదో ఒక వర్షం కురుస్తున్న రోజు, హాల్లోని మధ్య స్తంభం దగ్గర కూర్చుని శొంఠి కాఫీ తాగుతున్నప్పుడు బామ్మను అడిగాను: ‘‘నువ్వు పెట్టే శొంఠి కాఫీకూడా ఎందుకు ఇంత బాగుంటుంది? ఇంత టేస్టుగా తాగీ తాగీ నాకే బోర్ కొట్టేసేలా ఉంది. నువ్వెందుకు ఇంత బాగా వంటచేస్తావు?’’ అని వరుసగా ప్రశ్నలమీద ప్రశ్నలు అడిగాను.బామ్మ ఏ మానసికస్థితిలో ఉందో, లేదూ వర్షం ఆమెను ఏ గతంలోకి తీసుకెళ్లిందో తెలియదు. మెల్లగానే అయినా ఎంత అద్భుతంగా చెప్పిందనీ?!‘‘మీ తాతయ్య మొదటిభార్య చనిపోవటంతో, ఆమెకు పుట్టిన చిన్ని తమ్ముళ్లందరినీ చూసుకోవటానికి మనిషే లేకుండాపోయారు. మీ తాతయ్య నాకు వరుసకు మేనమామ అవుతారు. ఆయన వయసుకు నేనొక్కదాన్నే సరిపోయాను.మా అక్క చనిపోయినావిడ కన్నా పెద్దది. మా చెల్లెలు చాలా చిన్నది. మరో దారిలేక నన్నే ఇచ్చిపెళ్లి చేసేశారు. అప్పుడు నాకు 16 ఏళ్ల వయస్సుండొచ్చు. పదోతరగతి పూర్తిచేసి టీచర్ ట్రైనింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పెళ్లికోసం చదువును ఆపేశాను.(తానే ఆగిపోయానని కొనసాగింపు సమాచారం ఇచ్చింది)స్కూలుకు వెళ్లి పెద్దపెద్ద చదువులంతా చదవటంవల్ల నన్ను వంటింటి వైపే మా అమ్మ అనుమతించేది కాదు. అయితే పెళ్లి నిశ్చయం కాగానే వంటకు అలవాటుపడ్డాను. కానీ పూర్తిగా వంట చెయ్యటం రాలేదు. అన్నం వార్చటం రాలేదు. కాయలు తరగటం తెలియలేదు. మసాలా పెట్టటం తెలియదు. ఉప్పు ఎంత వెయ్యాలో కొలత తెలీదు. ఏమీ తెలియదు. మా అమ్మ భయపడిపోయింది. పెద్ద ఇంటికి కోడలు కాబోతున్నాను, వంట చెయ్యటం రాదంటే ఎలా అని!పెళ్లికి ముందురోజే కడయం నుండి మా పిన్ని ఒకామె వచ్చింది. ఆమె దగ్గర మా అమ్మ ఏడవంది ఒక్కటే తక్కువ. నాకు వండటం రాదు అదీ ఇదీ అని చెప్పుకొని బాధపడింది. పిన్ని వెంటనే మా చిన్నాన్నను పిలిచి, ఇంటి వెనకున్న పంటపొలాల్లో ఎక్కడైనా పసరికపాము ఉంటే, దాన్ని పట్టుకు రమ్మని చెప్పింది. నా అదృష్టం, వెంటనే ఒక పాము దొరికిందట. దాన్ని చిన్నాన్న పట్టుకొచ్చాడు. చనిపోయిన ఆ పసరికపామును నా చేతికిచ్చి దాన్ని ఒలవమంది పిన్ని. కాస్త భయం భయంగానే అనిపించింది. కానీ మరో దారిలేదు. ఆ పసరికపామును మూడునాలుగు సార్లు తడిమి వొలిచేశాను. ఇంట్లోవాళ్లు నా చేతులను శుభ్రంచేసుకోకుండా అలాగే ఒకరోజంతా ఉండిపోయేలా చేసేశారు. భోజనం కూడా నాకు పిన్నీనే తినిపించింది. ‘‘పసరికపాము రక్తం మన చేతిలో ఊరితే, జీవితాంతం మనం చేసే వంటలు దేవామృతంలా ఉంటుంది.’’ అని పిన్ని చెప్పింది. కానీ నేను నమ్మలేదు. అయినప్పటికీ పిన్ని చెబుతోంది కదాని విన్నాను. మరుసటిరోజు పెళ్లి! మీ తాతయ్య ఇంటికెళితే, అందరూ కాఫీ పెట్టమని అడిగారు. అప్పుడూ కాస్త బెల్లంవేసి శొంఠి కాఫీనే పెట్టాను. దాన్ని తాగిన వాళ్లందరికీ సంతోషం. మా అమ్మకు చెప్పలేనంత ఆనందం. ఆ పసరికపామేనే ఇప్పటికీ నేను ఇలా అన్నం వార్చి, పులుసు పెట్టటానికి కారణం.’’ అంది ముక్తాయింపుగా బామ్మ.. ‘‘అందరూ ఇలా చేస్తారా?’’ అన్నాను. ‘‘తెలియదు. మన కులంలో ఇలా చేస్తారు.’’ అంది బామ్మ.‘‘మా అమ్మకు కూడా ఇలా చేశారా, ఏం?’’‘‘ఔను. మీ అమ్మను పిల్లను చూసి నిశ్చయం చేసిన వెంటనే నేనే ఆమెను పసరికపామును పట్టుకొని రమ్మని చెప్పి, వొలవమని చెప్పాను. లేకపోతే మీ నాన్నకు మంచి భోజనం ఎక్కణ్ణించి దొరికుండేది?’’కాలేజీలో ఉన్న నాకు, బామ్మ చెప్పినదంతా ఏడు కొండలు ఏడు సముద్రాల కావల ఒక చిలకలో ఉండే రాక్షసుడి ప్రాణం... లాంటి ఫ్యాంటసీ కథకన్నా గొప్పగా అనిపించింది. ఆ వర్షానికీ, ఆ శొంఠి కాఫీకీ ఆ ‘పసరికపాము’ ఎంతో హాయిగా అనిపించింది. ఆ విషయాన్ని చెప్పగానే ‘‘నిన్ను నేను సరిగ్గా పెంచినట్టు లేను.’’ అని చెప్పి బామ్మ లేచి వెళ్లిపోయింది. చదువు ముగించుకొని ఉద్యోగం కోసం చెన్నై వెళ్లి, ఒక ఒంటరి జీవితాన్ని అనుభవించటానికి తయారుగా ఉన్న సమయంలో నాలో కలిగిన పెద్ద అనుమానం ఏంటంటే...‘నాకు వంట చెయ్యటం వచ్చా?’ అన్నదే! వంటింట్లోనే జీవితాన్ని గడిపినా, ఒక్కరోజు కూడా నేను వంటచేసింది లేదనటం కన్నా... బామ్మో, అమ్మనో, అత్తో, పెద్దమ్మో ఎవరూ ఒకరు నన్ను వంట చేసేందుకు అనుమతించలేదన్నది మాత్రం వాస్తవం.చెన్నైలో ఇల్లు చూసి, మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, టి.వి. అన్నీ కొనిచ్చి, టి.నగర్ వెళ్లి వంటపాత్రలు కొనిచ్చి, కుకింగ్ గ్యాస్ బుక్ చెయ్యించి, నాకంటూ ఒక వేరే జీవితాన్ని ఏర్పాటు చేసి, అమ్నానాన్నలు అందరూ బయలుదేరి వెళ్లిపోయిన కొన్ని రోజులకు మా ఇంటి వంటగదిలో, నా మొదటి వంట మొబైల్ సాయంతో మొదలైంది.బామ్మను అడిగి తెలుసుకొని మరీ సాంబార్ పెడుతున్నాను.అలాగే కూరలూనూ. కొబ్బరి పాలను తియ్యటం తెలియక ఏడుపొచ్చేసింది. కొబ్బరి తురుముతున్నప్పుడే చెయ్యి కోసుకుంది. పచ్చి మిరపకాయ కంట్లో పడి మండింది. మూడు గంటల వంటకు నాలుగు గంటలుగా మొబైల్లో పాఠాలు చెబుతోంది బామ్మ. అంతా పూర్తయింది. నాకు నేనే వడ్డించుకొని, మొదటి ముద్ద తినగానే బామ్మకు ఫోన్ చేశాను. ‘‘నీలాగానే వండాను బామ్మా. అందులోనూ మొదటిసారే. ఎంతో సంతోషంగా ఉంది. అంత ఆశ్చర్యంగానూ ఉంది’’అన్నాను.బామ్మ నవ్వింది. ‘‘పసరికపాము పరుగెడుతోందే నీ రక్తంలో. పచ్చ నాగినివిగా నువ్వు.’’ అంటూనే ఫోన్ పెట్టేసింది. అరచేతిని చూసుకున్నాను. విచ్చుకున్న అరచేతిలో వేలవేల సంవత్సరాల పసరికపాము పాకుతున్నట్టు కనిపించింది. చెప్పటం మరిచిపోయాను. ఆ కత్తిపీటను నా పెళ్లికి ముందే పూర్తిగా నాకే ఇచ్చేసింది బామ్మ. తమిళ మూలం : కవితా స్వర్ణవల్లి అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ -
సభ సజావుగా నడిపించే బాధ్యత నాపై ఉంది
-
అంబేడ్కర్ విగ్రహ తొలగింపు యత్నం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని, పోలీసులను స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే విగ్రహ తొలగింపునకు ఒప్పుకునేది లేదంటూ జేసీబీకి అడ్డుపడ్డారు. దీంతో అక్కడున్న అధికారులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చివరకు రెవెన్యూ సిబ్బంది,పోలీసులు అక్కడి నుంచి వెనుతిరగడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో ఎస్సీ కమ్యూనిటీ హాలు వద్ద ఈ ఏడాది అక్టోర్ 24న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ స్థలంలో సుమారు రూ. 6 లక్షలతో వెలుగు గ్రామ సంఘం కార్యాలయ భవనాన్ని నిర్మించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని సోంబాబు మరికొందరు నిర్ణయించారు. అయితే ఆ స్థలంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించాలని రెవిన్యూ, పోలీస్ అధికారులపై సోంబాబు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ కాలనీ వాసులంతా కలసి కొద్దిరోజుల క్రితం సోంబాబు, చెలికాని వేణుగోపాలరావు, డొక్కా ధర్మరాజు, బొబ్బిలి గంగాధరరావు, మానుకొండ ఏసోబులపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం తహసీల్దారు టీడీఎల్ సుజాత, ఆర్ఐ వెంకటరమణ, ద్వారకాతిరుమల, భీమడోలు ఎస్సైలు ఐ.వీర్రాజు, బి.మోహనరావు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అంబేడ్కర్ విగ్రహాన్ని జేసీబీ సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎస్సీ కాలనీ వాసులంతా కలిసి జేసీబీని, అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్కడి నుంచి వెనుతిరగడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. చావడానికైనా సిద్ధమే అధికారం చేతిలో ఉంది కదా అన్న ధీమాతో సోంబాబు అతని అనుచరులు విగ్రహ తొలగింపునకు పట్టుబట్టడం సరికాదని ఎస్సీ కాలనీ వాసులు ధ్వజమెత్తుతున్నారు. విగ్రహ ఏర్పాటుకు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియక విగ్రహాన్ని నిర్మించామని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాన్ని తొలగిస్తానంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోసం తమ ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధమేనని అంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు దౌర్జన్యం ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు ధ్వజమెత్తారు. కాసులకోసం కక్కుర్తి! ఏదైనా ప్రభుత్వ భవనం నిర్మించాలంటే ముందు గ్రామ సభ నిర్వహించి, ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో దాన్ని నిర్మించాల్సి ఉంటుందని, అయితే దానికి విరుద్ధంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో నుయ్యి ఉండేదని, దాన్ని ఇటీవలే పూడ్చారని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో భవనం ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. భవనాలు నిర్మించడం ద్వారా వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాయకులు తమపై ఇలా అధికారులతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు విగ్రహ తొలగింపు చర్యలను విరమించకుంటే తాము పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని దిర్శిపాం తాతయ్య, డొక్కా ఎర్రవెంకటేష్, డొక్కా దుర్గారావు, డొక్కా పెద్దిరాజు, డి.నాగసుబ్బారావు తదితరులు హెచ్చరిస్తున్నారు. -
అంబేడ్కర్ ఆశయాలకు బాబు తూట్లు పొడుస్తున్నారు