
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మా త అంబేడ్కర్ జయంతి సందర్భంలో ఆ మహానేతను అవమానించేలా వ్యవహరించిన టీఆర్ ఎస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అభిప్రాయపడ్డారు. దళిత, బహుజనుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని టీఆర్‌ఎస్, అనేక సందర్భాల్లో వారిని కించపరుస్తూనే వచ్చిందని ఆదివారం ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు.
‘ఓటమి భయంతోనే చంద్రబాబు నాటకాలు’
సాక్షి, హైదరాబాద్: దేశంలో మోదీ ప్రభంజనం జీర్ణించుకోలేక ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు ఈవీఎంల పేరుతో తెరలేపారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతోనే ఆయన నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 2014లో ఈవీఎంలు బాగున్నాయని, ఇప్పుడేమో వద్దంటూ చంద్రబాబు అండ్ కంపెనీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. చంద్ర బాబుతోపాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని పేర్కొన్నారు. వారు చేస్తున్న ఆరోపణలు నిజమైతే బీజేపీకి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారం ఎందుకు పోగొట్టుకుంటుందని పొంగులేటి ప్రశ్నించారు.