ponguleti sudhakar reddy
-
బీజేపీలో చేరిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి
సాక్షి, చైన్నె: విలవన్ కోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి బీజేపీలోకి చేరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల కో– ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. కన్యాకుమారి జిల్లా విలవన్ కోడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011, 2016, 2021లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయధరణి గెలిచిన విషయం తెలిసిందే. మూడుసార్లు ఆమె అసెంబ్లీకి ఎన్నికై నా కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. పార్టీ పరంగా పదవులు తనకు దక్కకుండా సీనియర్లు అడ్డుకుంటున్నట్లు పలుమార్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తగిన గుర్తింపు లేని కారణంగా బీజేపీలో చేరాలని నిర్ణయించారు. గతవారం రోజులుగా ఆమె ఢిల్లీలోనే తిష్ట వేశారు. ఈ పరిస్థితులలో శనివారం బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. తనకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని, ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి ఉండేదని ఈసందర్భంగా విజయ ధరణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తన సేవలను విస్తృతం చేస్తానని, బీజేపీ బలోపేతంకు తన వంతుగాకృషి చేస్తానన్నారు. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆమె బీజేపీలో చేరిన మరుక్షణం పార్టీ నుంచి తొలగిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఆమైపె అనర్హత వేటుకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అప్పావుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కాగా ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు పడ్డ పక్షంలో కన్యాకుమారి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీకి విజయధరణి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. -
పొంగులేటి వ్యాఖ్యలతో పెరిగిన రాజకీయ వేడి.. పోటీకి సై అంటున్న మాజీలు..
సాక్షి, ఖమ్మం : ‘కారు’లో కాక పుట్టింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీలు, ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీలో చర్చకు దారి తీశాయి. తాజాగా శుక్రవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరగణం ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్లో సమావేశమైంది. పాలేరు నుంచే పోటీ చేసేలా తుమ్మలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. పాలేరు నియోజకవర్గకేంద్రంగా రాజుకున్న రాజకీయ వేడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ రగులుతోంది. పార్టీ నుంచి టికెట్ వస్తే సరి.. లేకున్నా పోటీకి దిగడం ఖాయమని మాజీలు ఇస్తున్న సంకేతాలతో వారి అనుచర గణం, నేతల్లో జోష్ నెలకొంది. జిల్లాలో తుమ్మల, పొంగులేటి కలిసి పనిచేయాలని కోరుతున్న కేడర్... అధిష్టానం కూడా ఇద్దరికీ సముచిత స్థానం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రచారంతో దూకుడు అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు దూకుడు పెంచారు. దీంతో వారి అనుచరగణం, కేడర్ కూడా ఇదే స్థాయిలో నియోజకవర్గాల్లో జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా పక్షం రోజులుగా చోటు చేసుకుంటు న్న పరిణామాలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు ప్రభుత్వ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ముందుకెళ్తుండగా.. మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పరామర్శలు, సొంత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ముందస్తు ఎన్ని కల వేడితో ఇప్పటి నుంచే పోటీకి సై అంటున్న వారంతా కార్యాచరణకు దిగడమే కాక పార్టీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఖాయమని అధిష్టానానికి సంకేతాలు పంపుతుండడం గమనార్హం. చదవండి: తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు.. అసమ్మతి గళం అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఇటీవల తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు వ్యతిరేకంగా తుమ్మల, పొంగులేటి అనుచరులు సమావేశమైన విషయం విదితమే. మధిరలోనూ పొంగులేటి అనుచరగణం జెడ్పీ చైర్మన్, ఆయన కేడర్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటోంది. ఇక వైరా నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ వర్గం ఎమ్మెల్యే రాములునాయక్ వర్గంతో కలవకుండా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మె ల్యే, మాజీ ఎమ్మెల్యేకు తోడు పొంగులేటి వర్గం కూడా సై అంటే సై అంటుండడం గమనార్హం. ఇలా తమ నేతలు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంకేతాలకు అనుగుణంగా కేడర్ క్షేత్రస్థాయిలో కదం తొక్కుతుండడంతో ముందస్తు ఎన్నికలు వస్తాయో, లేదో తెలియకున్నా జిల్లాలో రాజకీయ వేడి మాత్రం మొదలైంది. ముల్లు గుచ్చుకుంటున్నాయని.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్లో ఉన్న అసమ్మతి గళం ఇప్పుడిప్పుడే బహిరంగ వేదికలకు ఎక్కుతోంది. తిరుమలాయపాలెంలో తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలోనే కాక రాష్ట్ర పార్టీలో కూడా చర్చ జరిగింది. ‘ముల్లు గుచ్చుకుంటున్నా ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నా, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ వచ్చినా, రాకున్నా ప్రజాతీర్పు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా’ అని ఆయన ప్రకటించారు. అంతేకాక ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాలు తనతో సంప్రదింపులు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో పొంగులేటి తన దూకుడు పెంచారని రాజకీయంగా విశ్లేషణ జరుగుతోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన ఆయనకు టికెట్ దక్కలేదని, ఈసారి తాడోపేడో తేల్చుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయన అనుచర గణం కూడా చెబుతోంది. మొత్తంగా పాలేరు కేంద్రంగా పార్టీ అధిష్టానానికి పొంగులేటి తన నిర్ణయమేంటో చెప్పకనే చెప్పినందున ఇక పార్టీనే తేల్చుకోవాల్సి ఉంటుందని ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు. చదవండి: యూఎస్‌లో వీటికి చాలా డిమాండ్.. నువ్వు ఊ అంటే కోట్లే సమాలోచనల్లో తుమ్మల వర్గం మాజీ ఎంపీ పొంగులేటి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరగణం ఖమ్మంలోని జూబ్లీక్లబ్‌లో సమావేశమైంది. పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొనగా, గత ఎన్నికల్లో పార్టీలోని నేతల కుట్రలతోనే తుమ్మల ఓడిపోయినందున ఈసారీ అక్కడి నుంచే పోటీ చేసేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని చర్చించుకున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మలకు టికెట్ ఇస్తారనే విశ్వాసం ఉందని చెబుతూనే, మరోవైపు టికెట్ రాకున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేలా ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాలేరు ఎమ్మెల్యే కందాల వర్గం – తుమ్మల వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో తుమ్మల వర్గం తమ కార్యాచరణను నియోజకవర్గంలో వేగవంతం చేసింది. ఈమేరకు నాగేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు యుగంధర్‌ను ఆహ్వానిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, పొంగులేటి, తుమ్మల ఇద్దరు కలిసి అడుగేస్తే జిల్లాలో పార్టీకి తిరుగుండదనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. -
ముందు సొంత పార్టీని చక్కదిద్దుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందుగా సొంత పార్టీని చక్కదిద్దుకున్నాక ప్రధాని మోదీపై, బీజేపీపై విమర్శలు చేస్తే మంచిదని కాంగ్రెస్ నేతలకు బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే విపక్షాలు ఒక్కటై విమర్శలు సంధిస్తున్నాయని పేర్కొన్నారు. మోదీపై, బీజేపీపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను ఖండిస్తున్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధనస్వామ్యం వర్ధిల్లుతోంది కాబట్టి తమ పార్టీ కొన్ని ఎన్నికల్లో ఓడిపోవచ్చునేమోనని వ్యాఖ్యానించారు. దేశంలో రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు, విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నాయా అని పొంగులేటి ప్రశ్నించారు. కేంద్రంలో విపక్షాలు కలలో కూడా అధికారంలోకి రాలేవని ఎద్దేవా చేశారు. -
బీజేపీ బెస్ట్ అనిపిస్తా.. నమ్మకం నిలబెట్టుకుంటా: అన్నామలై
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో నలుగురు సభ్యులతో బీజేపీ అడుగుపెట్టింది, రాబో యే రోజుల్లో పార్టీని తదుపరి ఉన్నతస్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కే అన్నామలై అన్నారు. తనపై ఎంతో విశ్వాసంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తన పదవికి రాజీనామా చేసి గత ఏడాది ఆగస్టులో బీజేపీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో... పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఎల్ మురుగన్‌కు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో అన్నామలై నియమితులయ్యారు. పార్టీలో చేరిన కొద్దినెలలకే రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందిన అన్నామలై కేంద్రమంత్రి ఎల్ మురుగన్, బీజేపీ హైకమాండ్ తమిళనాడు ఇన్చార్జ్ సీటీ రవి, కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్ నేతలు హెచ్ రాజా, ఇలగణేశన్, బీజేపీ శాసనసభాపక్ష నేత నయనార్ నాగేంద్రన్, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అన్నామలై మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. ‘‘గ్రామీణ ప్రాంత విద్యార్థుల మేలుకోరే నీట్ ప్రవేశపరీక్షను కేంద్రం అమలు చేస్తోంది. లక్షలు, కోట్ల రూపాయలు చెల్లించి వైద్య విద్యలో చేరే పరిస్థితి నుంచి తప్పించి మేలు చేసేందుకే నీట్ ప్రవేశపరీక్ష. పేద, గ్రామీణ విద్యార్థులకు నీట్ ఒక వరప్రసాదం. ఈ సత్యాన్ని ఇంటింటికి వెళ్లి పార్టీ ప్రచారం చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ సరఫరాలో కేంద్రం సమభావం ప్రదర్శిస్తోంది. రాష్ట్రాలపై పక్షపాత వైఖరిని ప్రదర్శించడం లేదు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్ సరఫరా సాగుతోందేగానీ వివక్ష లేదు’’ అని అన్నారు. తమిళనాడుకు అదనంగా వ్యాక్సిన్ కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. పొంగులేటి పుస్తకావిష్కరణ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడేళ్ల కాలంలో తమిళనాడుకు కేటాయించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన మేలుపై బీజేపీ తమిళనాడు శాఖ జాతీయ కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తమిళ, ఇంగ్లిషు భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని అన్నామలై చేతుల మీదుగా ఆవిష్కరించారు. -
కేసీఆర్ స్కామ్‌ల సీఎం : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శనివారం ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసైని కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, అక్రమ సంపాదన కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీలుగా విభజించి కొత్తగా టెండర్లను పిలిచారని ధ్వజమెత్తారు. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. (విద్వేషాలు రెచ్చగొడుతోంది ఎవరు? ) లాక్డౌన్ పురస్కరించుకుని కేసీఆర్ నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు అపహాస్యంగా మారాయని, మీడియా మొత్తం ఆయనకు అనుకూలంగా ఉందని భ్రమల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బెదిరించి మీడియాను కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్ డైరెక్షన్లో జరుగుతున్న లూటీకి బీజేపీ వ్యతిరేకమని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. దీనిపై సీబీఐ, సీఐడీ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఇక ప్రతిపక్షాలను సీఎం ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరైనది కాదని పేర్కొన్నారు. (సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..: హరీశ్‌రావు) -
దేశద్రోహులకు మద్దతిస్తారా?: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి కి, ఉగ్రవాదులతో సంబంధమున్న వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలా? దేశ ద్రోహులకు విపక్షాలు మద్దతునిస్తాయా అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని శరణార్థుల కోసం తీసుకొస్తే విపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయన్నారు. పార్టీ నేతలు పద్మ, సుధాకరశర్మలతో కలసి ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం మోకాలికి, బోడి గుండుకు లంకె పెట్టేలా వ్యవహరిస్తున్నా యని ధ్వజమెత్తారు. దేశంపై తమ గుత్తాధిపత్యం కొనసాగాలనే అక్కసుతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో కాంగ్రెస్ పార్టీ కాస్తా కమర్షియల్ పార్టీగా మారిందన్నారు. -
తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు
సాక్షి, పాల్వంచ: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కబడితే అక్కడ మద్యం దుకాణాలకు లైసెసన్సులు ఇచ్చారని, దీంతో బెల్టు దుకాణాలు గల్లీకొకటి ఏర్పడిందని, విచ్చలవిడిగా మద్యం విక్రయించడంతో అది తాగిన యువకులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నిదర్శనమే దిశ, టేకులపల్లి లక్ష్మి ఉదంతాలని చెప్పారు. దేశంలో ఎన్ఆర్సీ, సీఏబీ బిల్లును దేశ భవిష్యత్, భద్రత దృష్ట్యా ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ, విపక్షాలు మైనార్టీలను రెచ్చగొట్టి ఈశాన్యా రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, స్థానిక బీజేపీ కార్యాలయంలో భారతదేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ 69వ వర్ధంతి సందర్భంగా సుధాకర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎన్నికల అధికారి సత్యప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా ప్రసాద్, ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ కుటుంబరావు, మీడియా కన్వీనర్ జైన్, మాధవ్, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు. -
‘తెలంగాణను కాంట్రాక్టర్ల రాష్ట్రంగా మార్చేశారు’
సాక్షి, ఖమ్మం టౌన్: రాష్ట్రంలో ఓటు రాజకీయాలు తప్ప.. అభివృద్ధి కార్యక్రమాలు లేవని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరోగ్య తెలంగాణను అనారోగ్య తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా బీజేపీపై టీఆర్ఎస్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలను మభ్య పెడుతూ ఆర్థిక సంక్షోభం అంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దుబారా ఖర్చులు పెడుతూ.. రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని కాంట్రాక్టర్ల రాష్ట్రంగా మార్చేశారని.. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని.. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా ఖమ్మం మారిందని పొంగులేటి వ్యాఖ్యానించారు. -
ఆడపిల్లల తండ్రిగా బాధతో చెబుతున్నా: పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా బాధతో ఈ విషయాన్ని చెబుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక పాశవిక మృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. భవిష్యత్తులో మరెవ్వరూ కూడా ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడేందుకు భయపడేలా కఠినమైన చట్టాలను రూపొందించాలన్నారు. పౌరహక్కుల సంఘాలు ఈ విషయంలో సహకరించాలని, తాను కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నానని సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. -
అక్రమ తవ్వకాలపై కోర్టును ఆశ్రయిస్తాం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నింబంధనను తొలగించటాన్ని అడ్డుకోవాలని గవర్నర్ తమిళిసైను బీజేపీ నాయకులు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి కలిశారు. అనంతరం కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ మైనింగ్‌పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. రెండు విషయాలపై గవర్నర్‌ను కలిసినట్లు, గ్రానైట్‌పై జరుపుతున్న అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 2008 నుంచి 2011 నాటికి ఎనిమిది క్వారీలలో అనుమతులు ఇచ్చినప్పటికీ అధికారులు అంతకుమించి తవ్వకాలు జరిపారని ఎంపీ విమర్శించారు. ఈ విషయంపై రానున్న రోజుల్లో కోర్ట్‌ను సైతం ఆశ్రయిస్తామని, అక్రమ మైనింగ్ సంబంధించి వేసిన ఫైన్ రూ. 749 కోట్లు బకాయిలు కట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మైనింగ్ తవ్వకాలు చేస్తూ.. కార్మికుల ఇవ్వాల్సిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని, గ్రానైట్, మైనింగ్ విషయంలో గతంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. మైనింగ్ పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. -
ఖమ్మంలో ఘనంగా మోదీ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించి స్పెషల్ ఆఫీసర్లు నియమించి, ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగే దోపిడీని అరికట్టాలని పొంగులేటి అన్నారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి పొంగులేటి సంతాపం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరపి, ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. -
‘టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కిలాడి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదని పొంగులేటి మండిపడ్డారు. ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. రాష్ట్ర్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే విజయం అని పొంగులేటి సుధాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్ర్రంలో కేసీఆర్ నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతుందని ఆరోపించారు. టీఆర్ఎస్ను ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థ సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుది బిల్డప్: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్న విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో తన పార్టీ ఘోరంగా ఓడిపోతుందని జాతీయ మీడియా సర్వేలన్నీ తేల్చి చెబుతున్న సందర్భంలో దాన్ని కప్పిబుచ్చుకునేందుకు ఢిల్లీ వేదికగా ఆయన తెగ బిల్డప్ ఇస్తున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసిన తర్వాత మోదీకి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఇతర పార్టీ నేతల మాట ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం ఎగ్జిట్ ఫలితాల తర్వాత నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని, ఈ విషయాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు నేతలే చెబుతున్నారని తెలిపారు. బాబు డ్రామాలన్నింటికీ ఈనెల 23న తెరపడుతుందని, మోదీ నేతృత్వంలో బీజేపీ మరోమారు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. -
వాళ్లతో కాంగ్రెస్ భ్రష్టుపట్టింది: పొంగులేటి
హైదరాబాద్: తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉదంతాలను కాంగ్రెస్ కార్యకర్తలెవరూ మరచిపోలేదని, అట్లాంటి తీవ్రవాద వ్యతిరేక నినాదంతో ముందుకెళ్లిన కాంగ్రెస్.. ఇటీవల కాలంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీవ్రవాదులకు మద్ధతు తెలుపుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. హింసావాదంపై అవకాశవాద వ్యాఖ్యలు చేస్తోన్న కాంగ్రెస్ నాయకుల తీరుతో పార్టీ భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు. పుల్వామా దాడి తర్వాత యావత్ భారతదేశం పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం పాకిస్తాన్‌కు వత్తాసు పలికే విధంగా అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ కారణం చేతనే తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని పొంగులేటి పేర్కొన్నారు. ‘నేను కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో కూడా పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కాంగ్రెస్ మేధావులమని చెప్పుకునే కొందరు నేతల అహంకారపూరిత, బాధ్యతారహితమైన వ్యాఖ్యల వల్ల పార్టీ పేరు మంట గలుస్తోందని, వారి అదుపులో ఉంచాలని హెచ్చరించాను.కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ఆక్రోశంతో, ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మతి భ్రమించిన విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ అపరమేధావి శామ్ పిట్రోడా, సిక్కుల ఊచకోతకు సంబంధించి ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారో.. అవి ఎంత దుమారం రేపాయో చూశాం. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సిగ్గు పడాలని, ఆయన సిక్కులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ కంటి తుడుపుగా ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే పిట్రోడాను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి. అలా చేయని పక్షంలో సిక్కులు ఎన్నటికీ కాంగ్రెస్‌ను క్షమించర’ని పొంగులేటి వ్యాఖ్యానించారు. ‘నేను ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఏ రాష్ట్రానికి వెళ్లినా మోదీ ప్రభంజనమే కనిపిస్తోంది. మోదీకి సాటిగా నిలబడగలిగే నేత లేకపోవడం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి నేతలంతా తాము కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అరచేతితో సూర్యుడి వెలుతురును ఆపలేరు. అనామక పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడినా మోదీ ప్రధాని కావడాన్ని అడ్డుకోలేవ’ని అన్నారు. -
‘శశిలలిత’ నిర్మించడం అభినందనీయం
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలిచిన వ్యక్తి జయలలిత అని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో ఆమె విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జయలలిత జీవిత కథ ఆధారంగా జయం మూవీస్ పతాకంపై దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ (ది స్ట్రోమ్) రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ ఫస్ట్‌లుక్, పోస్టర్, టీజర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జగదీశ్వర రెడ్డి శనివారం ఆవిష్కరించారు. శశిలలిత సినిమా వాస్తవాలకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. ‘శశిలలిత’ నిర్మించడం అభినందనీయమని ప్రశంసలు కురిపించారు. జయలలిత ముగిసిన చరిత్ర కాదని, ఆమె ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చిత్ర దర్శకుడు జగదీశ్వరరెడ్డి అన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా, నిజాల్ని ప్రేక్షకులకు చెప్పేందుకే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. జయలలిత క్యారెక్టర్లో కాజల్ దేవ్గన్, శశికళ పాత్రలో అమలాపాల్ నటిస్తున్నారని వెల్లడించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రం నిర్మిస్తున్నట్టు వివరించారు. వచ్చేనెలలో సినిమా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు’
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మా త అంబేడ్కర్ జయంతి సందర్భంలో ఆ మహానేతను అవమానించేలా వ్యవహరించిన టీఆర్ ఎస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అభిప్రాయపడ్డారు. దళిత, బహుజనుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని టీఆర్ఎస్, అనేక సందర్భాల్లో వారిని కించపరుస్తూనే వచ్చిందని ఆదివారం ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘ఓటమి భయంతోనే చంద్రబాబు నాటకాలు’ సాక్షి, హైదరాబాద్: దేశంలో మోదీ ప్రభంజనం జీర్ణించుకోలేక ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు ఈవీఎంల పేరుతో తెరలేపారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతోనే ఆయన నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 2014లో ఈవీఎంలు బాగున్నాయని, ఇప్పుడేమో వద్దంటూ చంద్రబాబు అండ్ కంపెనీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. చంద్ర బాబుతోపాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని పేర్కొన్నారు. వారు చేస్తున్న ఆరోపణలు నిజమైతే బీజేపీకి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారం ఎందుకు పోగొట్టుకుంటుందని పొంగులేటి ప్రశ్నించారు. -
హస్తం పార్టీకి మరో షాక్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆయన పంపించారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సుధాకర్‌రెడ్డి పార్టీలో ఇమడలేక, జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవటం లేదన్న మనస్తాపంతో ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పార్టీకి రాజీనామా చేసిన పొంగులేటి వెనువెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి సుమారు అర్ధగంట సేపు సమావేశమయ్యారు. అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. అనేక సందర్భాల్లో చేతిదాకా వచ్చిన టికెట్ చేజారినా.. దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఆయన పార్టీలోని పరిణామాలపై అంతర్లీనంగా మధనపడ్డారు తప్ప పార్టీ మారేందుకు ప్రయత్నించలేదు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్‌రెడ్డి ఎన్నికల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత ఖమ్మం లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆయన పార్టీ పరంగా తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసినా ఫలించలేదు. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేశారు. టికెట్ తనకు దక్కుతుందని భావించిన తరుణంలో ఈ స్థానాన్ని ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీకి కేటాయించి కాంగ్రెస్ మద్దతు పలికింది. అయినా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకొని ఖమ్మం స్థానం తనకు కేటాయిస్తుందని చివరి నిమిషం వరకు ఎదురుచూసి టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నం చేసిన సుధాకర్‌రెడ్డి ఖమ్మం లోక్‌సభ సైతం చేజారటంతో తీవ్ర కలత చెందినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తనను కాదని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరికి టికెట్ కేటాయించటంతో కినుక వహించిన పొంగులేటి.. ఆమె నామినేషన్ దాఖలు ప్రక్రియ, ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి హాజరుకాలేదు. వి.హన్మంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, మల్లు భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్ వంటి నేతలు హాజరైన సుధాకర్‌రెడ్డి రాకపోవటం ఆ సమయంలోనే పార్టీ వర్గాల్లో అనుమానాలు రేకెత్తాయి. గతంలో కొత్తగూడెం, సత్తుపల్లి శాసనసభ స్థానాలకు, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా, గాంధీ కుటుంబానికి వీర వీధేయుడిగా పేరొందిన సుధాకరెడ్డి పార్టీ మారాల్సిన పరిస్థితులు కలగటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2008నుంచి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటికి ఈ నెలలో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. మరోసారి శాసనమండలి సభ్యత్వం కోసం తీవ్ర ప్రయత్నం చేసిన కాంగ్రెస్ శాసనమండలిలో ఒకే ఒక స్థానం లభించే అవకాశం ఉండటం, అది సైతం చివరి సమయంలో చేజారింది. దీంతో మరింత ఆవేదనకు గురైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదని భావించి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో అనేక మంది ముఖ్యమంత్రులకు సన్నిహితుడన్న పేరుంది. ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అ«ధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యదర్శిగా, పలు రాష్ట్రాల ఇన్చార్జిగా, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, సీఎల్పీ ఉపనేతగా ఆయన పని చేశారు. -
కాంగ్రెస్‌కు పొంగులేటి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాష్ట్ర నాయకత్వం పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైందని, టికెట్ల కేటాయింపును డబ్బుమయం చేసి కాంగ్రెస్‌ను కమర్షియల్ పార్టీగా మార్చేసిందంటూ లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ లోటుపాట్లను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ అదే నాయకత్వానికి లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు ఇచ్చారని విమర్శించారు. ఈవీఎంల వల్లే టీఆర్ఎస్ గెలిచిందని కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీపై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇక దేశ రక్షణ, జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయడం బాధించిందన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించిన సాక్ష్యాలు చూపాలని అడగడం సిగ్గుచేటన్నారు. ఈ తరుణంలో దేశానికి ఒక బలమైన నాయకత్వం అందించగలిగే పార్టీలో చేరాలని నిర్ణయించుకొని కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించడంతో ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పొంగులేటి బీజేపీలో చేరారు. ఆయనకు అమిషా షా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఒక కార్యకర్తగా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఏన్నో ఏళ్లపాటు కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవ్వగానే పార్టీని వీడటం అవకాశవాదం కాదా అని ప్రశ్నించగా కాంగ్రెస్ కోసం తాను 35 ఏళ్లు కష్టప డ్డానని, కానీ పార్టీ తన కష్టంలో 20 శాతమే గుర్తించి అవమానించిందన్నారు. -
రేపు బీజేపీలో చేరుతున్నా : పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ మాజీ సెక్రటరీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కమళం గూటికి చేరుతారని గతకొంత కాలంగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. బీజేపీలో రేపు అధికారికంగా చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తనకు అవమానాలు జరిగాయని అన్నారు. ‘నేను చేసిన పనికి కాంగ్రెస్‌లో 20% ఫలితమే దక్కింది. కాంగ్రెస్ కమర్షియల్ పార్టీ మారిపోయింది. ఇటీవల ఆ పార్టీలో దళారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. నాలాంటి విధేయులకు కాంగ్రెస్ పార్టీలో తగిన స్థానం లేకుండా పోయింది. ఎన్నికల్లో పోటీ చేద్దామంటే డబ్బులున్నాయా అని అడుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడినా మళ్లీ అదే నాయకత్వానికి లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీఆర్ఎస్ గెలిచిందని టీపీసీసీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బలమైన నాయకత్వంలో పని చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నా. 1993 నుంచి నరేంద్ర మోదీతో నాకు పరిచయం ఉంది. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పనిచేస్తా’ అన్నారు. కాగా, కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కక్కొరూ టీఆర్ఎస్లో చేరుతుండటంతో తలలు పట్టుకుంటున్న అధిష్టానం.. ఏళ్లుగా పార్టీకి విధేయంగా ఉన్న సీనియర్లు సైతం హ్యాండివ్వడంతో తెలంగాణలో ఆ పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితి నెలకొంది. (చదవండి : కాంగ్రెస్‌కు పొంగులేటి రాజీనామా!) -
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఓ వైపు ఓటమి, మరోవైపు నేతలు వరుసపెట్టి పార్టీనీ వీడటంతో ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఆ పార్టీ సీనియర్, ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా హస్తాన్ని వీడనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఘోర ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యాలు కూడా చేశారు. అంతేకాకుండా గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మొండి చేయి ఎదురు కావడంతో పాటు, కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. కొద్దిరోజుల క్రితం పొంగులేటి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు పొంగులేటి కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ...ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం విదితమే. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లో రేగిన ‘ఢీ’సీసీల చిచ్చు..!
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని రాజేస్తోంది. పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు పొందినవారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖుల అనుచరులకు డీసీసీ అధ్యక్ష నియామకాల్లో పెద్దపీట వేయడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించిన అనంతరం ఖమ్మం, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు బహిరంగంగానే ఎగసిపడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా డీసీసీ నియామకాల పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆ నాలుగు జిల్లాల్లో ముఖ్యంగా ఖమ్మం, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అసమ్మతి తీవ్రంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోడీసీసీతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనుచరులకే కేటాయించడం పట్ల ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గుర్రుమంటున్నారు. డీసీసీ ఎంపికలో సమతుల్యం లోపించిందని, ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా చల్లా నర్సింహారెడ్డిని నియమించడం పట్ల ఆ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన త్వరలోనే పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఈర్లకొమురయ్యను నియమించడంతో ఆ పదవిని ఆశించిన మరికొందరు నేతలు అసమ్మతి భేటీ నిర్వహించారు. అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే రాజీనామాలకూ సిద్ధమని ప్రకటించారు. కొమురయ్య మాత్రం 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన బలహీన వర్గాల నేతగా తనకు అవకాశం లభించిందని అంటున్నారు. నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేశవేణు నియామకాన్ని నిరసిస్తూ కొందరు నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టినట్లు తెలుస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడి అలక..! జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అలకబూనారని తెలుస్తోంది. తనను సంప్రదించకుండానే జంగా రాఘవరెడ్డిని ఆ పదవిలో నియమించడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పూర్వ వరంగల్ జిల్లాలోని నాలుగు డీసీసీ అధ్యక్ష పదవులు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం కూడా అక్కడి కేడర్ మండి పడుతోంది.వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవలే పార్టీలో చేరిన పైలట్ రోహిత్‌రెడ్డిని నియమించడం పట్ల సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ప్రధాన నేతలు వారి అనుచరులను డీసీసీ అధ్యక్షులుగా నియమించుకోవడం పట్ల స్థానిక కేడర్‌లో, ఆ పదవులు ఆశించి భంగపడిన వారిలో నిరాశ కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అసంతృప్తిని అలాగే వదిలేయకుండా నేతలను పిలిపించి మాట్లాడాలని, లేదంటే ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుం దని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అనుచరులే అధ్యక్షులు పార్టీలో సీనియర్లుగా గుర్తింపు పొందిన నేతలంతా డీసీసీ నియామకాల్లో చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. కామారెడ్డిలో షబ్బీర్‌అలీ శిష్యుడు కైలాశ్ శ్రీనివాస్, గద్వాలలో డీకేఅరుణ విధేయుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌కు సునీతా లక్ష్మారెడ్డి అనుచరుడు తిరుపతిరెడ్డి, సూర్యాపేటలో దామోదర్‌రెడ్డి అనుచరుడు చెవిటి వెంకన్న, నల్లగొండలో జానారెడ్డి ప్రధాన అనుచరుడు శంకర్‌నాయక్, మంచిర్యాలలో ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు సతీమణి సురేఖ, ఆసిఫాబాద్‌లో ఆయన అనుచరుడు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నిర్మల్, ఆదిలాబాద్‌లలో డీసీసీ మాజీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అనుచరులు రామారావు పటేల్, దేశ్‌పాండే, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సతీమణి జ్యోతి, సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, వనపర్తిలో చిన్నారెడ్డి అనుచరుడు శంకర్ప్రసాద్లను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం గమనార్హం. -
‘సత్తుపల్లి, అశ్వారావుపేటలను కలిపి జిల్లా చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : సత్తుపల్లి, అశ్వారావుపేటలను కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో అర్ధ సత్యాలే ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం తవ్విన గుంతలను ఇప్పటికీ పూడ్చలేదని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 18 జిల్లాలో రైతుల పరిస్థితి బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పెంచిన పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విఙ్ఞప్తి చేశారు. మంచి రేవులలో ఉన్న వాటర్ బాడీని కాపాడాలని కేసీఆర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
చట్టం అమలులో కేంద్రం విఫలం: పొంగులేటి
హైదరాబాద్: పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణాకు నష్టం లేదని చంద్రబాబు అన్న మాటల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నడూ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు ముంచిన మండలాలు చాలని, ఇంకా ముంచవద్దని మాత్రమే అడుగుతున్నట్లు తెలిపారు. భద్రాద్రి రామాలయం ముంపునకు గురవకుండా కాపాడుకోవాలని వ్యాక్యానించారు. పోలవరం కోసం అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ దగ్గరకు కేసీఆర్ తీసుకెళ్తానని అన్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ కేసీఆర్ తీసుకెళ్లలేదని విమర్శించారు. పోలవరం బ్యాక్ వాటర్ లెవెల్స్..వరద అంచనాలను పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయటానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి తీరిక లేకపోవడం శోచనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా నోరు విప్పాలని, ప్రాజెక్టు రీడిజైన్ కోసం కేసీఆర్ డిమాండ్ చేయాలని కోరారు. -
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజే ఆ వార్త నిజమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి.. నిన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసిన ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్ కాంగ్రెస్ మండలి పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు శుక్రవారం లేఖ సమర్పించారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఉన్న 7 మంది ఎమ్మెల్సీల సంఖ్య రెండుకు చేరింది. మిగిలిన ఇద్దరు సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల పదవీకాలం మార్చిలో ముగియనుంది. దీంతో మండలిలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం శూన్యమవనుంది. ఇదిలాఉండగా..విలీన పరిణామాలతో షాక్ తిన్న కాంగ్రెస్ హైకమాండ్ స్పందించింది. తమ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను హుటాహుటిన మండలికి పంపింది. మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్‌ని కలిసిన షబ్బీర్, పొంగులేటి విలీన ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపారు. -
రాష్ట్ర నాయకత్వానిదే బాధ్యత: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ఓటమికి ఏఐసీసీని తప్పుపట్టాల్సిన పనిలేదని, ఈ ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి గుండెకాయలాంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. సంస్థాగతంగా బలంగా ఉన్న తెలంగాణలో ఓటమి పాలవ్వడం దురదృష్టకరమన్నా రు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చినప్పటికీ 2014లో ప్రచారం చేసుకోలేక ఓడిపోయామని, ఇప్పుడు ఏం మాయ జరిగిందో కానీ ప్రజాకూటమి ఓటమి పాలైందని పేర్కొన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో రాష్ట్ర నాయకత్వం గుర్తించాలని, సెంటిమెంట్ మీద ఏర్పడ్డ రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలన్నారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్న కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. -
‘ఏంమాయ జరిగిందో కానీ ఓడిపోయాం’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం నాయకుల్లో అంతర్మధనం మొదలైంది. కూటమి ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పొంగులేటి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..సెంటిమెంట్ మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణా అని, అలాంటి రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడంలో నాయకత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉన్న పరిస్థితిని కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా తీసుకురావడంలో కేసీఆర్ సఫలమయ్యారని, అందువల్లే తాము ఓడిపోయామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో తాము గెలిచినా కూడా తెలంగాణాలో ఓడిపోవడం బాధాకరంగా ఉందన్నారు. అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, రాష్ట్రం ఇచ్చి కూడా ప్రచారం చేయలేక 2014లో ఓడిపోయామని చెప్పారు. ఏమాయ జరిగిందో ఏమో కానీ ప్రజాకూటమి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లగడపాటి సర్వే, ఎగ్జిట్ పోల్లు కూడా తలకిందులు అయ్యాయని అన్నారు. ఏఐసీసీని తప్పుపట్టడం లేదని.. రాష్ట్ర నాయకత్వంలోనే ఎక్కడో తప్పు జరిగిందని, దానిని తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, రాహుల్ గాంధీ రంగంలోకి దిగాలని కోరారు. రెండో సారి ముఖ్యమంత్రి అవుతున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
అంతర్మథనంలో పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడి నుంచి అన్ని హోదాల్లో పనిచేసిన నాయకుడిగా, ఆలిండియా యూత్‌కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎనిమిదిన్నరేళ్లు ఏఐసీసీ సెక్రటరీగా పనిచేసిన తనకే అసెంబ్లీ టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందనే అవమానంతో ఆయన సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. 35 ఏళ్ల నుంచి పార్టీకి చేస్తున్న సేవను గుర్తించకుండా పొత్తు పేరుతో పొంగులేటి ఆశించిన ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని దక్కకుండా కొందరు టీపీసీసీ పెద్దలు కుట్ర చేశారనే భావనలో ఆయన అనుచరులు, సన్నిహితులు ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఐతో, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని పొంగులేటికి టికెట్ రాకుండా చేశారని చెబుతున్నారు. పార్టీలో పదవులు రాకుండా అడ్డుకున్న నేతలే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే టీపీసీసీ ముఖ్యులు ఇదంతా చేశారని భావిస్తున్న పొంగులేటి వర్గీయులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పొంగులేటిని బుజ్జగించేందుకు గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నేరుగా రాహుల్‌గాంధీతో సంబంధాలున్న ఆయనకు పార్టీలో అన్యాయం జరగకుండా చూస్తామని, భవిష్యత్తులో ఆయన సేవలను కీలకంగా ఉపయోగించుకుంటామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ ఆశించి రాకపోవడంతో రెబెల్స్‌గా బరిలో ఉన్న తండు శ్రీనివాసయాదవ్ (సూర్యాపేట), దళ్‌సింగ్ (ఇల్లెందు), ఎండీ ఫజల్ (ఖమ్మం), కె.శ్రీరాములు (అశ్వారావుపేట) తదితరుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయాలని కూడా ఆయనపై ఏఐసీసీ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. పొంగులేటి మాత్రం తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వడంలో టీపీసీసీ పెద్దలు అన్యాయం చేశారనే అవమానభారంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరి అధిష్టానం బుజ్జగింపులతో పొంగులేటి సర్దుకుంటారా..? పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై రాహుల్‌కు ఫిర్యాదు చేస్తారా..? తొలి నుంచీ టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆయన ఖమ్మంలో ఆ పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. -
పొన్నాలకు రాహుల్ భరోసా..!!
సాక్షి, హైదరాబాద్ : పొన్నాల లక్ష్మయ్య.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేత. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నాయకుడు. కానీ, ఆయనకే టికెట్ దొరకని కష్టకాలం వచ్చింది. జనగాం టికెట్ ఆశించిన పొన్నాలకు భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఖంగుతిన్న పొన్నాల అధిష్టానం ఎదుట తన గోడు వెళ్లబోసుకోవడానికి ఢిల్లీకి పయనమయ్యారు. నేనున్నా.. పొన్నాల, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని గురువారం కలిశారు. 35 ఏళ్లుగా జనగామకు ప్రాతినిథ్యం వహిస్తున్నాననీ, ఎమ్మెల్యే టికెట్ తిరిగి ఇవ్వాలని పొన్నాల రాహుల్‌ను కోరినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా రాహుల్‌తో మాట్లాడారు. పొత్తుల వల్ల రాజకీయంగా తన గొంతు కోశారని పొంగులేటి రాహుల్ వద్ద ఆవేద వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, సీట్ల విషయంలో ఈ ఇద్దరు నేతలకు రాహుల్ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ ప్రకటించే మూడో జాబితాలో తమ పేర్లుంటాయని పొన్నాల, పొంగులేటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఆంటోనీతో భేటీ అయిన ఖమ్మం కాంగ్రెస్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్ బుధ వారం ఢిల్లీలో పార్టీ కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని కలిశారు. జిల్లాలో మెజారిటీ సీట్లను పొత్తులో భాగంగా టీడీపీ, సీపీఐలకే కేటాయిం చారని, ఇతర నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు సేవచేస్తున్న వారిని విస్మరించారని తెలిపారు. దీనిపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, సీట్ల కేటాయింపులో అధిష్టానంతో తేల్చుకోవాలని కోరుతున్నారన్నారు. సమస్యను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరిస్తానని, అప్పటివరకు వేచిచూడమని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెం టు నియోజకవర్గం పరిధిలో బీసీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిరాహార దీక్షకు దిగారు. షాద్‌నగర్ నుంచి కడియంపల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవర కద్ర నుంచి ప్రదీప్‌గౌడ్‌లు దీక్షలో పాల్గొన్నారు. -
‘శ్వేతపత్రం విడుదల చేయండి’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలును కేంద్రం ఇటీవల ఒక లేఖలో వివరించిందని, తెలంగాణకు ఇచ్చిన హామీల పురోగతిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యా రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని పొంగులేటి ప్రశ్నించారు. -
నోటా సినిమాను నిలిపివేయాలి
హైదరాబాద్: నోటా సినిమాను నిలిపివేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. నోటా సినిమా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. యువతపై ప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..నోటా ట్రైలర్ ఓటర్ను ప్రభావితం చేసేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం నోటా ప్రివ్యూ చూసిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ స్పందించలేనంత మాత్రాన కాంగ్రెస్ మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. -
ఆ విషయంలో సీఎంగా కేసీఆర్ రికార్డు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్లలో ప్రగతిభవన్, సచివాలయంలో ప్రతిపక్షాలకు కలిసే అవకాశమివ్వని సీఎంగా కేసీఆర్ రికార్డుకెక్కారని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ, భద్రాచలానికి సంబంధించి ఆ 4గ్రామాలను రాష్ట్రంలో కలపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై మంత్రివర్గం ఆమోదించాలని కోరారు. ఉద్యమంలో 1,200 మంది చనిపోతే 500 మందిని మాత్రమే గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 ఉద్యమ నాయకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సంకుచిత మనస్తత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. -
‘మోదీ వ్యాఖ్యలు అరుంధతి నక్షత్రాన్ని చూపినట్లున్నాయి’
సాక్షి, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ ధరల పెరగుదలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రూపాయి విలువ తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు అరుంధతి నక్షత్రాన్ని చూపినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో ఈ పరిస్థితి వస్తుందని మన్మోహన్ సింగ్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. నాడు మన్మోహన్ మాటలను తప్పుపట్టిన మోదీ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మోదీ కాళ్లు మొక్కుతారు.. ఇక్కడ నిలదీస్తానంటాడని విమర్శించారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణం, పెట్రో ధరలపై కేసీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. క్రూడాయిల్ బ్యారెల్ ధర తగ్గినా పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో తేవాలి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెట్రో, డీజిల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను రద్దచేయాలని కోరారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సామాన్యుల శాపాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పకుండా తగులుతాయని తెలిపారు. పెరిగిన పెట్రో ధరలను నిరనగా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. -
1900 ట్రాక్టర్లతో ప్రగతి నివేదన సభకు ర్యాలీ
-
దృష్టి మరల్చేందుకే ‘ముందస్తు’: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రజల దృష్టిని మరల్చేందుకే ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభలంటూ సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రగతి నివేదన సభలో ప్రజలకు వాస్తవాలను చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదన్నారు. ప్రధాని మోదీతో విభజన హామీలను ప్రస్తావించాలన్నారు. అవినీతిపై సీఎం కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్‌కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనే దానిపై ప్రగతి నివేదన సభలో చెప్పాలన్నారు. కాగా కేరళ వరద బాధితులకు పొంగులేటి రూ.లక్ష విరాళం ప్రకటించారు. చెక్‌ను రాజీవ్ గాంధీ నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు పంపారు. -
హామీలను గాలికొదిలేశారు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ విభజన చట్టం హామీలను గాలికొదిలేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఒడిసిపోయిన సబ్జెక్ట్ అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికలంటూ..ప్రగతి నివేదన సభలంటూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని తూర్పార బట్టారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఈ సారైనా మోదీతో విభజన హామీలను ప్రస్తావించాలని కోరారు. ఇంకా మాట్లాడుతూ..‘ ముస్లిం, గిరజనుల రిజ్వేషన్ల అంశం ఎటు పోయింది. లెజిస్లేచరీ వ్యవస్థను కించపరిచేలా ప్రవర్తించడం సరికాదు. ప్రతి ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకోవడం సరికాదు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలిపోయాయి..పట్టించుకునే నాథుడే లేడు. ప్రగతి నివేదనలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితిపైనా నివేదికలో ప్రస్తావించాలి. రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు, భూ ఆక్రమణలపైన సభలో జవాబు చెప్పాలి. గ్రామ పారిశుద్ధ్య కార్మికులపై సర్కార్ వ్యవహరిస్తోన్న తీరు సరిగా లేద’ ని వ్యాఖ్యానించారు. అవినీతిని అరికట్టడానికి సీఎం కార్యాలయం ఇచ్చిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి..ఎన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ తాను ఇచ్చిన హామీల అమలుపై చూసీ చూసీ జనం కళ్లు కాయలు కాస్తున్న తరుణంలోనే కంటి వెలుగు స్కీం పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్వంతంగానే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని, ఇప్పుడే పొత్తులపై మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేరళ వరద బాధితులకు లక్ష రూపాయల విరాళాన్ని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్‌ను రాజీవ్ గాంధీ నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు పంపారు. -
రాహుల్ పర్యటనపై ప్రభుత్వం నిర్బంధకాండ!
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై నిర్బంధకాండకు పూనుకున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతకానితనానికి ఇది నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండారు శ్రీకాంత్ ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి వస్తుంటే ముఖ్య అతిథిగా ఆహ్వానించాల్సింది పోయి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని రాహుల్‌ను 20 విద్యార్థి సంఘాలు ఆహ్వానిస్తే అడ్డుకోవడం ప్రభుత్వ దురహంకారమేనని అన్నారు. ప్రధాని అభ్యర్థికే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ‘ఇది కేసీఆర్ మార్కు ప్రజాస్వామ్యమా?’ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభకు అనుమతినివ్వకపోవడం కేసీఆర్ మార్కు ప్రజాస్వామ్యమా అని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ చొరవతో ఏర్పడ్డ రాష్ట్రంలో ఆయనకిచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ పర్యటన అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని శుక్రవారం ఎద్దేవా చేశారు. -
వారిని సమాజ బహిష్కరణ చేయాలి
సాక్షి, హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కేంద్రంగా సాగిన వ్యభిచారంతో సంబంధమున్న వారిని సమాజ బహిష్కరణ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కూపంలోకి చిన్నారులను సైతం దించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, దీనిపై సీఎం జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో సమీక్షించాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మంలో హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో మహ్మద్ రఫీ అనే వ్యక్తి రూ.100 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని, దీనిపై సీబీసీఐడి దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. -
బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు నినాదం ఏమైంది?
హైదరాబాద్: బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసలు బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అన్న నినాదం ఏమైందంటూ కేసీఆర్‌ను పొంగులేటి ప్రశ్నించారు. ‘బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి కేసీఆర్ పెదవి విప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 11 అంశాల మీద ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ మాట్లాడారు. మరి ఇక్కడ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మోదీ వద్ద ఎందుకు మాట్లాడలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేటీఆర్ చెవిలో పువ్వులు పెట్టే మాటలు చెప్పారు. రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో కానీ.. రాష్ట్ర ప్రయోజనాల గురించి అసలు మాట్లాడరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉస్మానియాకి ఘన స్వాగతం పలకాల్సింది పోయి.. అడ్డుకుంటామని అనడం ఎందుకు?, అందరం కలిసి పోట్లాడదాం అంటే కేసీఆర్ ఒక్కడే మోదీని కలిసి వస్తారు. రహస్య అజెండా.. రాజకీయ అజెండా తప్పితే కేసీఆర్‌కు మరొకటి లేదు’ అని పొంగులేటి విమర్శించారు. -
ఖమ్మం కాంగ్రెస్‌లో కుమ్ములాట!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాలుగు స్తంభాలాట నడుస్తోంది. జిల్లా నుంచి పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ల మధ్య సమన్వయం కుదరక ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా సమన్వయ లోపాన్ని నివారించే ప్రయత్నం జరగకపోవడంతో జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. డీసీ సీ అధ్యక్ష పదవి ఖాళీ అయి 4 నెలలవుతున్నా భర్తీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, కొందరు నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో తలో మాట చెబు తుండటం, పార్టీ పెద్దల సమక్షంలోనే బల నిరూపణ కు యత్నించడం, కొందరికి వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు గాంధీభవన్ మెట్లెక్కడం ఖమ్మం కాంగ్రెస్ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. అంతా కంగాళీ వాస్తవానికి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో 3 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకు కేటాయించినా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో కొంత మార్పొచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్ బలంగానే ఉంది. కానీ ఈ కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో మాత్రం జిల్లా నాయకత్వం విఫలమవుతోంది. దీనికి తోడు తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై ఆర్థిక ఆరోపణలు చేస్తూ వైరా నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి భార్య గాంధీభవన్‌లో ధర్నా చేయడం ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమెను కొందరు వెనుక ఉండి నడిపిస్తున్నారని, రేణుక చరిష్మాను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని రేణుక వర్గం ఆరోపిస్తోంది. ఈ విషయంలో మిగిలిన కీలక నేతలు గుంభనంగానే ఉన్నా కొందరు స్థానిక నేతలు ప్రోత్సహిస్తుండటం రేణుక వర్గానికి మింగుడు పడటం లేదు. ప్రసాదరావు విషయంలో.. సీనియర్ నేత జలగం ప్రసాదరావును పార్టీలో చేర్చుకునే విషయంలోనూ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ విషయంలో భట్టి తటస్థంగా ఉంటున్నా ప్రసాదరావు చేరికను పొంగులేటి, రేణుక బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ప్రసాదరావు చేరికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియాతో పొంగులేటి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరోవైపు పార్టీలో తమ చేరికకు లైన్ క్లియర్ అయిందని, వారం రోజుల్లోనే తాము కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం తథ్యమని ప్రసాదరావు వర్గం అంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేణుకాచౌదరి, జలగం ప్రసాదరావుల అంశాలను పార్టీ ఎలా పరిష్కరిస్తుందోనని ఆసక్తి నెలకొంది. డీసీసీ కోసం ‘ఢీ’ ఇక ఖమ్మం కాంగ్రెస్‌ను ప్రధానంగా వేధిస్తున్న సమస్య డీసీసీ అధ్యక్ష పదవి. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న అయితం సత్యం 4 నెలల క్రితం మరణించడంతో ఖాళీ అయిన ఆ పదవిని తమ వారికే ఇప్పించాలని కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన పేరును బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించకున్నా తమ వర్గం నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేసులో రేణుక వర్గానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు, దిలిశాల భద్రయ్య, మానుకొండ రాధాకిషోర్, ఎం. శ్రీనివాసయాదవ్, ఎడవెల్లి కృష్ణల పేర్లు వినిపిస్తున్నాయి. భట్టి మాత్రం పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుని హోదాలో హుందాగానే ఉంటూ ఎవరిని నియమించినా అభ్యంతరం లేదంటున్నారు. అయితే స్థానిక నాయకులు నాగుబండి రాంబాబు, పి.దుర్గాప్రసాద్‌లు మాత్రం భట్టి కోటాలో తమకు డీసీసీ పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తన సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కె.రంగారావు, పరుచూరి మురళి పేర్లూ వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా పినపాక అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి ఇవ్వాల్సి వస్తే ఎస్టీ కోటాలో రేగా కాంతారావు కూడా డీసీసీ అధ్యక్ష బరిలో ఉండనున్నారు. చాంతాడంత జాబితాతో పదవి ఎవరికివ్వాలో పీసీసీ నాయకత్వానికీ తలనొప్పిగా మారి పెండింగ్‌లో పడిపోవడం గమనార్హం. -
ఆ ఆస్తులు పంచాలని చట్టంలో లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పొందుపరిచిన సంస్థల ఆస్తులు పంచాలని ఆ చట్టంలో ఎక్కడా లేదని, కేవలం ఆయా సంస్థల సేవలను కొద్దిరోజులపాటు రెండు రాష్ట్రాలకు పొడిగించడం కోసమే సెక్షన్ 75ను పొందుపరిచారని కేంద్ర హోం శాఖ తెలిపింది. పదో షెడ్యూలులోని సంస్థల యాజమాన్య హక్కులు పంచేందుకు ఎలాంటి నిబంధనను చట్టంలో పొందుపరచలేదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కేంద్ర హోం శాఖ శుక్రవారం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టంలో పొందుపరిచిన నిబంధనల అమలుకు కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాలతో పలుమార్లు సమావేశమైందని, ఇటీవల మూడుసార్లు సమావేశమైందని వివరిస్తూ ఆయా సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిని అఫిడవిట్‌కు జోడించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలుపై పలు మంత్రిత్వ శాఖలు సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయని, కేసులో ఇంప్లీడ్ కాని మంత్రిత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని తామే అఫిడవిట్లో పొందుపరుస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలు ఇవీ.. షెడ్యూలు పదిలోని సంస్థల ఆస్తులు పంచాలన్న నిబంధన ఎక్కడా ఈ చట్టంలో లేదు. ఆయా సంస్థల ద్వారా సేవలను పక్క రాష్ట్రానికి కొనసాగించడానికి మాత్రమే సెక్షన్ 75ను నిర్దేశించారు. సంబంధిత సెక్షన్ అమలుకు నిబంధనల ఖరారు కోరుతూ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరాం. ఇంకా ఖరారు చేయలేదని ఏపీ సమాధానం ఇచ్చింది. తెలంగాణ సమాచారం ఇవ్వలేదు. షెడ్యూలు 9లోని సంస్థల ఆస్తులు, హక్కులు, అప్పులు పంచేందుకు 2014 మే 30న షీలా భిడే కమిటీని ఏర్పాటు చేశారు. 2018 మే 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఆయా సంస్థల ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పుల విభజన ముగింపు దశలో ఉంది. షీలా భిడే కమిటీ గడువును 2018 ఆగస్టు 31 వరకు పొడిగించారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ఇందులో కొందరు ఐఏఎస్ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు 2015 నవంబర్ నుంచి 2017 డిసెంబర్ మధ్య విడతల వారీగా 56,400 మంది ఉద్యోగులను విభజించారు. మరో 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్‌లో ఉంది. షెడ్యూలు 13లోని అంశాలపై.. షెడ్యూలు 13లోని అంశాలపై 22–01–2018, 12–03–18, 29–05–2018 తేదీల్లో హోం శాఖ ఆయా రాష్ట్రాల అధికారులతో సమీక్షించిందని చెబుతూ ఆయా సమావేశాల్లో వచ్చిన పురోగతిని అఫిడవిట్లో వివరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం స్థల నిర్ణయం, మౌలిక వసతుల ఏర్పాటు తర్వాతే హైకోర్టు ఏర్పాటుకు తమ నుంచి ప్రక్రియ మొదలవుతుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో ని విద్యాసంస్థల ఏర్పాటులో పురోగతి వివిధ దశల్లో ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరి జన విశ్వవిద్యాలయం మినహా మిగిలినవన్నీ తాత్కాలిక భవనాల్లో ప్రారంభమయ్యాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్టీలు ప్లాంట్ల విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి కేవలం ఫీజిబులిటీ నివేదికను మాత్రమే సమర్పించాల్సి ఉంది. గడువు లోపే నివేదిక వచ్చింది. అయితే వాణిజ్యపరమైన యోగ్యత లేదని నివేదిక తేల్చింది. అయినప్పటికీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి కొత్తగా మరో ఫీజిబులిటీ నివేదిక ఇవ్వాలని మెకాన్‌ను కోరాం. అవసరమైన సమాచారం ఏపీ నుంచి వచ్చింది. తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి సమాచారం వచ్చాక మెకాన్ నివేదిక సమర్పిస్తుంది. విజయవాడ మెట్రో రైలుకు ప్రతిపాదన వచ్చింది. అయితే కేంద్రం కొత్త మెట్రో రైలు విధానం తెచ్చినందున ఏపీ ప్రతిపాదనలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రతిపాదనలు కూడా తిరస్కరించాం. నూతన విధానం ప్రకారం ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)కి ఆంధ్రప్రదేశ్ 200 ఎకరాలు ఇచ్చినప్పటికీ అది వివాదంలో చిక్కుకుంది. వివాదాలు పరిష్కరించి స్థలాన్ని అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాం. సమీపంలో ఉన్న పోర్టుల ద్వారా ఎదురవుతున్న పోటీతత్వం కారణంగా దుగరాజపట్నం పోర్టుకు వాణిజ్య యోగ్యత లేదని నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలు సూచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా జవాబు రాలేదు. అయినప్పటికీ నౌకాయాన శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఏపీలో ఒక మేజర్ పోర్టు స్థాపనకు గల అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, గెయిల్, హెచ్‌పీసీఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంజినీర్ ఇండియా లిమిటెడ్ ఈ విషయమై ఫీజిబులిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు స్థాపనకు వయబులిటీ గ్యాప్ ఫండ్ అవసరమని, దానిని సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. ఏపీ నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు, ఇతర తెలంగాణ నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ స్థాపనకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటాం. విశాఖ– చెన్నై పారిశ్రామిక కారిడార్ విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫీజిబులిటీ అధ్యయనం చేసి తన తుది నివేదికను సమర్పించింది. ఏపీలో కొత్త రైల్వే జోన్ స్థాపనకు విభజన చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి ఆరు నెలల్లోగా ఫీజిబులిటీ నివేదిక ఇవ్వాలని మాత్రమే ఉంది. రైల్వే జోన్ స్థాపనకు యోగ్యత లేదని ఇదివరకే కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇదివరకే 16 రైల్వే జోన్లు ఉన్నందున కొత్త రైల్వే జోన్ నిర్వహణకు వాణిజ్య యోగ్యత ఉండదని మార్చి 12, 2018 నాడు జరిగిన సమావేశంలో రైల్వే శాఖ అభిప్రాయపడింది. అయినప్పటికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు. దేశంలో ఇప్పటికే 5 కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి సామర్థ్యం కూడా పూర్తిగా వినియోగంలో లేదు. కొత్త ఫ్యాక్టరీకి వాణిజ్య యోగ్యత ఉండదని రైల్వే శాఖ అభిప్రాయపడింది. -
విశాఖలో రైల్వేజోన్.. సాధ్యం కాని పని!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంపై ఈ ఏడాది మూడు సార్లు భేటీ అయ్యామని, షెడ్యూల్ 10 ప్రకారం కేంద్ర సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయో.. అక్కడే కొనసాగుతాయని, అంతే తప్ప ఆస్తుల పంపకం చేయమని కేంద్రం తెలిపింది. షెడ్యూల్ 10 కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో 142 సంస్థలున్నాయని చెప్పింది. అయితే 13వ షెడ్యూల్ కింద ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుపై కూడా నివేదిక అందిందని, ఇప్పటికే దేశంలో 16 రైల్వే జోన్లు ఉన్నాయని, మరొక జోన్ ఏర్పాటు దాదాపుగా సాధ్యమయ్యే పనికాదని, నిర్వహణపరంగా కూడా లాభదాయకం కాదని కేంద్ర చెప్పింది. అయితే దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, స్టేక్ హోల్డర్లతో చర్చించిన తర్వాత తీసుకుంటామని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక ఆస్తులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఏ ప్రాంతంలో ఉంటే, ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలిపింది. ఉద్యోగుల పంపిణీ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయని కూడా తేల్చి చెప్పింది. ‘ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ అధికారుల పంపిణీ ఇప్పుడే పూర్తయింది. దీనిపై 12 మంది ఐఏఎస్ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం కమల్‌నాథ్ కమిటీ ఏర్పాటైంది. పోలీసు శాఖలోని 753 మంది ఉద్యోగుల విషయంలోనే ఇంకా తుది నిర్ణయం రాలేదు. చట్టంలోని అన్ని అంశాలు పూర్తయ్యాయి లేదా తుది దశలో ఉన్నాయి. పొంగులేటి అఫిడవిట్‌ను తిరస్కరించండి’ అని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. -
‘ఆ మాటలను వెంటనే వాపసు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అమరవీరులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ర్ట విభజన అనైతికం అనే వ్యాఖ్యలు వెంటనే వాపసు తీసుకోని, వివరన ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మోదీ స్పీచ్ 2019 ఎన్నికల స్పీచ్‌లా ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న అనేక సమస్యలు, 2014లో మోదీ ఇచ్చిన హామీ అంశాలు ప్రస్తావించలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్ ట్రైన్ గురించి మోదీ మాట్లడం మరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయాలు చేస్తారన్నారు. నిజాలను పార్లమెంట్ వేదికగా ప్రజలముందు ఉంచిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. విభజన హామీలను సాధించడంలో చంద్రబాబు, కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. -
కాంగ్రెస్‌పై విమర్శలు సరికావు
ఖమ్మంసహకారనగర్: కాంగ్రెస్ పార్టీపై పలువురు ప్రజాప్రతినిధులు విమర్శలు చేయటం సరికాదని సీఎల్పీ ఉప నాయకులు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టం లో పొందుపర్చిన అంశాలపై దృష్టి సారించి ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. జూన్‌లో రుణ ప్రణాళిక పెట్టాల్సి ఉండగా, ఇటీవలే సమావేశం నిర్వహించారన్నారు. యుద్ధప్రాతిపదికన పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు, అధికార యంత్రాం గం చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక సమీపం లోని ఆల్మట్టి, నారాయణపూర్ తదితర ప్రాం తాల నుంచి నీటిని అక్కడ రాష్ట్రాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గత ంలో మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలతో అనే క మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీసీసీ(కార్పొరేట్, కాంట్రాక్టర్, కరప్షన్)గా పరిపాలన ఉందని విమర్శించారు. టీఆర్ఎస్లోనే అవిశ్వా సం పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్య త్తులో అది రెట్టింపవుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీకి 7 మండలాలు పోయి నష్టాల్లో ఉన్నామని, నల్గొండకు రెండు మెడికల్ కళాశాలలు కేటాయించారని, ఖమ్మం జిల్లా విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించా రు. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ఆం దోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎండి ఫజల్, నాయకులు వీరారెడ్డి, రంగారావు పాల్గొన్నారు. -
‘మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గు రాదు’
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిగ్గురాదని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. 2013లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఒప్పించిందని అన్నారు. యాభై శాతం నిబంధనను పక్కన పెట్టి 60 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని పేర్కొన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు లేకుండా సస్పెండ్ చేసి బిల్లును పాస్ చేశారని మండిపడ్డారు. సలహాలు ఇస్తామన్నా ఒప్పుకోకుండా.. ఇప్పుడు తప్పు ప్రతిపక్షంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద అంశంపై కోర్టు వాదనలు జరుగుతుంటే అడ్వకేట్ జనరల్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. బీసీలపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ది తాను చెప్పిందే ఖానూన్ అనే వైఖరి అని.. అందుకే కోర్టు మొట్టికాయలు వేస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది ఓట్ల రాజకీయం.. హైదరాబాద్ : కేసీఆర్‌ది ఓట్ల రాజకీయమని, చిత్తశుద్ధి ఎప్పుడూ లేదని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని.. కేసీఆర్ స్వామ్యమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నాడు కోర్టును ఒప్పించి బీసీలకు 60శాతం రిజర్వేషన్లు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు. ఒక గ్రామ కార్యదర్శికి ఐదు గ్రామాల బాధ్యత ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. -
‘దేశం’ పిల్లి మొగ్గలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ పాతరేస్తున్నా.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సాకుగా చూపి రాద్ధాంతం చేస్తుండడం..ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరికొత్త డ్రామాకు తెరతీసినట్లయింది. రాష్ట్రానికి ఓ వైపు అన్యాయం జరగుతుందని తెలిసినా బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు.. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాక యూటర్న్ తీసుకుని హడావుడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పుడు అఫిడవిట్లో చెప్పిన వాటినే ఆనాడు స్వాగతించిన టీడీపీ నాయకులు నేడు హంగామా చేస్తుండడం దొంగే.. దొంగ దొంగ అని అరిచిన చందాన్ని గుర్తుచేస్తోంది. పోలవరానికి ఇరిగేషన్ కాంపౌండ్ నిధులే ఇస్తామంటున్న కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు పెట్టిన ఖర్చును ఇచ్చేది లేదని కేంద్రం ముందునుంచీ మొండికేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు రాద్ధాంతం చేయడం విస్మయం గొలుపుతోంది. 2016 సెప్టెంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలోనూ ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లోని ఆంశాలే ఉన్నప్పటికీ.. అప్పుడు నోరు మెదపని చంద్రబాబు రెండేళ్ల తర్వాత ఇప్పుడు రభస మొదలు పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్ కాంపౌండ్ నిధులు మాత్రమే ఇస్తామని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. ఈ విషయాలనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటనలోనూ, ఢిల్లీలోనూ పలుమార్లు స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినదాని ప్రకారం ఈ ప్రభుత్వం ఏర్పడకు ముందు ఖర్చు పెట్టిన రూ.5,135.87 కోట్లు, ఇరిగేషన్ కాంపౌండ్ పరిధిలోకి రాని పవర్‌హౌస్, తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,868 కోట్లు మొత్తం కలిపి రూ.8003.87 కోట్లు ఇచ్చేది లేదని గతంలోనే తేల్చేశారు. అయినా బీజేపీతో అంటకాగినప్పుడు ఈ విషయాలను పట్టించుకోకుండా ఇప్పుడు పోలవరానికి సహాయం చేయడం లేదని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై మాట్లాడడం లేదని గగ్గోలు పెడుతూ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. లోటు బడ్జెట్‌పైనా డ్రామాలే.. రెవెన్యు లోటు రూ.16 వేల కోట్లు ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం అంగీకరించకపోయినా చంద్రబాబు బీజేపీని నాలుగేళ్లపాటు వెనుకేసుకొచ్చారు. రైతు రుణమాఫీ, పించన్ల సొమ్మును లోటు బడ్జెట్లో ఎలా చేరుస్తారని, ఈ రెండూ మినహాయించగా మిగిలిన సొమ్ము ఇస్తామని చెప్పి రూ.3,900 కోట్లే విడుదల చేసినా.. దానిపై పట్టు పట్టకపోగా అప్పట్లో సమర్థించుకున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు కేంద్రం అఫిడవిట్లో పేర్కొంటే దీన్ని ఇప్పుడే కనుగొన్నట్లు డ్రామాలు మొదలుపెట్టారు. రుణమాఫీ, పింఛన్ సొమ్మును కేంద్రం లోటు బడ్జెట్ కింద పరిగణించడంలేదని, దీనిపై చేసేదేమీ లేదని చంద్రబాబే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. అధికారం కోసం బీజేపీతో రాజీపడి ఇప్పుడు దాని గురించి కొత్తగా మాట్లాడడం రాజకీయం కాక మరేమిటనే ప్రశ్నలకు టీడీపీ నాయకులు దబాయింపే సమాధానంగా ఎంచుకున్నారు. రైల్వే జోన్‌పై ఎనాడైనా మాట్లాడారా? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో రైల్వే జోన్ ఏర్పాటు అంశం ప్రధానంగా ఉన్నా.. దాని గురించి నాలుగేళ్లపాటు కేంద్రాన్ని టీడీపీ నిలదీసిన పాపానపోలేదు. రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం తొలి నుంచి అనుమానాస్పదంగానే మాట్లాడుతున్నా పట్టించుకోకపోగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేసింది. బీజేపీతో కలిసి త్వరలో జోన్ వచ్చేస్తుందని, దీనిపై ప్రకటన వెలువడుతుందనే లీకులను అనుకూల మీడియా ద్వారా ఇచ్చారు. అదే అంశంపై విపక్షాలు ఆందోళన చేసినపుడు కలిసిరాని టీడీపీ ఇప్పుడు దీక్షల పేరుతో హడావుడి చేయడాన్ని బట్టి వారి చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. రాజధాని నిధుల విషయంలోనూ అదే ధోరణి.. రాజధాని నిర్మాణానికి నిధులిచ్చే అంశంపై కేంద్రం తొలి నుంచి కొర్రీలు వేస్తున్నా.. నాలుగేళ్లపాటు చంద్రబాబు మారుమాట్లాడకుండా ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం హంగామా సృష్టిస్తున్నారు. రాజధాని డీపీఆర్ ఇవ్వలేదని కేంద్ర అధికారులు అనేకసార్లు చెప్పగా అప్పట్లో దానిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకుండా అన్నీ ఇచ్చామని సమర్థించుకుంది. ఇచ్చిన రూ.2,500 కోట్లకు లెక్కలు చెప్పలేదని కేంద్రం ప్రకటించగా, లెక్కలన్నీ ఇచ్చేశామని చెప్పి ప్రజలను గందరగోళానికి గురిచేసింది. రాజధానిలో ముఖ్యమైన నిర్మాణాలకు నిధులిస్తాంగానీ రాష్ట్ర ప్రభుత్వం చూపే గాలిమేడలకు నిధులు ఎలా ఇస్తారనే ప్రశ్నలు కేంద్రం నుంచి చాలాసార్లు వచ్చినా బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఈ అంశాలను పట్టించుకోలేదు. నాలుగేళ్లుగా రాజధానికి నిధులివ్వకపోయినా కేంద్రంతో కలిసి పనిచేసిన చంద్రబాబు గొప్పలకు పోయి ప్రధాని తనను రష్యాలోని ఆస్తానా నగరాన్ని చూడాలని చెప్పారని, అక్కడికెళ్లి తనకు ఫోన్ చేసి అలా రాజధాని కట్టాలని చెప్పారని చెప్పుకున్నారు. రూ.2,500 కోట్ల నిధుల్లో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరు నగరాలకు ఇచ్చినవనే విషయం గురించి మొన్నటివరకూ మాట్లాడకుండా, బీజేపీతో విడిపోయాక వాటి గురించి చెప్పడం, రాజధానికి కేంద్రం సహకరించడంలేదని ఆరోపించడం వెనుక రాజకీయ కారణాలు తప్ప వేరే ఏమీ లేదని తేటతెల్లమవుతోంది. వెనుకబడిన జిల్లాలకిచ్చే నిధులపైనా అంతే! వెనుకబడిన జిల్లాలకిచ్చే నిధులపై కేంద్రంపై పెద్దగా ఒత్తిడి తేకుండా ఇచ్చిన వాటితోనే రాష్ట్ర ప్రభుత్వం మొన్నటివరకూ సరిపెట్టుకుంది. మూడు సంవత్సరాలకు సంబంధించి రూ.1,050 కోట్లు కేంద్రం ఇవ్వగా వాటికి సరైన లెక్కలు చెప్పలేదనే కారణంతో మిగిలిన సంవత్సరాల నిధులను కేంద్రం నిలిపివేసింది. ఈ నిధులను దేనికి, ఎంత ఖర్చు పెట్టారనే విషయాలను గోప్యం ఉంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు నిధులు ఇవ్వడంలేదనే విషయాన్ని ఎత్తిచూపుతూ గొడవ మొదలు పెట్టింది. దుగరాజపట్నం పోర్టుకు ఇస్రో అభ్యంతరం చెబుతోందని ప్రత్యామ్నాయంగా మరోచోటును చూపించాలని కేంద్రం రెండేళ్ల క్రితమే చెప్పినా.. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇప్పుడు పోర్టుపైనా అన్యాయం చేస్తున్నారనే పల్లవి అందుకుంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీపై సరికొత్త డ్రామా.. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం తాజాగా ఇటీవలే దాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు నాలుగేళ్లు దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు దానిపై తన పార్టీ నేతలతో దీక్షలు చేయించి చంద్రబాబు సరికొత్త డ్రామా నడిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నా అభ్యంతరం చెప్పకపోగా అందులో కీలకపాత్ర పోషించారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతోనే ప్రత్యేక హోదాకు కేంద్రం పాతరేసిందని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం అసలు ప్రత్యేక హోదాయే వద్దని, దాని స్థానంలో ప్యాకేజీయే మేలని అంగీకరించి, అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని చేసిన విషయాన్ని మరచిపోతోంది. బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని మోసం చేసి ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా రాజకీయ లబ్ధికోసం తాను చేసిన మోసాన్ని తానే ప్రశ్నిస్తూ ప్రజలను వంచించేందుకు చంద్రబాబు రకరకాల డ్రామాలాడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అనుకూల మీడియా ద్వారా గతంలో జరిగిన అంశాలు తెరపైకి రాకుండా కేంద్రం చేసిన అన్యాయం ఇప్పుడే తెలిసినట్లు నటిస్తూ డ్రామాను రోజురోజుకూ రక్తికట్టిస్తున్నారు. -
కేసీఆర్ కనీసం నోరు మెదపడం లేదు..
సాక్షి, హైదరాబాద్ : విభజన చట్టంలోని హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ తాను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశానని, ఈ రిట్ పిటిషన్‌పై కేంద్ర ఉక్కు, ఆర్థిక, జల మంత్రిత్వశాఖలు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ పిటిషన్ స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. విభజన చట్టంలోని కొన్ని హామీలను కేంద్రం ఇప్పటివరకు కనీసం ముట్టుకోలేదని ఆయన అన్నారు. రూ. 1350 కోట్లు ప్రత్యేక సహాయం కింద రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలిపారు. ఉద్యమ సీఎం అని చెప్పుకొనే కేసీఆర్.. కనీసం ఈ విషయం మీద నోరు కూడా మెదపడం లేదని ఆయన తప్పుబట్టారు. తన పిటిషన్‌పై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ కనీసం స్పందించడం లేదని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం సిగ్గుచేటు అని పొంగులేటి మండిపడ్డారు. దీనికంటే ముఖ్యమైన విషయం ప్రభుత్వానికి ఏముందని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజలకు ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి, బీజేపీ అధినేత అమిత్ షాకు కోపం వస్తుందనే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన హామీల విషయం, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు ఉందని అన్నారు. మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అమరవీరుల త్యాగాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
మేమొచ్చి కేసీఆర్ పనిపడతాం
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచి తీరుతుందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పనిపడతామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తనకు తానే తెలివిగలవాడినని, అందరినీ మోసం చేయగలనని అనుకుంటున్నాడు. ఇన్నాళ్లూ ఫెడరల్ ఫ్రంట్ పాట పాడాడు. ఇప్పుడు ప్రధాని మోదీతో స్నేహం చేస్తున్నాడు’’అని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడెక్కడుందో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందని, టీఆర్ఎస్ను గద్దె దించే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. ఇందిరది చెరగని ముద్ర దివంగత ప్రధాని ఇందిరా గాంధీని బీజేపీ నేతలు హిట్లర్‌తో పోల్చడాన్ని జైపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇటీవల పాస్‌పోర్ట్ రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న ఒక హిందూ ముస్లిం జంట విషయంలో కేంద్రంలోని పెద్దలు వివక్ష చూపారని జైపాల్ ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అనుచరులు ఆ జంటపై సోషల్ మీడియాలో అసభ్య విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇలాంటి వారే హిట్లర్ మనస్తత్వం కలవారని ఎద్దేవా చేశారు. ఇందిరపై దాడి రాజకీయ కుట్రలో భాగమేనని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మోదీ నేతృత్వంలో దేశ సార్వభౌమత్వంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ఇందిర ఇమేజ్ను బీజేపీ నేతలు ఏమీ చేయలేరన్నారు. రెండు చోట్లా మా ప్రభుత్వాలే దేశంలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశముందని జైపాల్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ సొంత ప్రభుత్వం ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులందరికీ అందడం లేదన్నారు. తన డ్రైవర్ కుమార్తె పెళ్లి జరిగి మూడేళ్లవుతున్నా ఇంతవరకు కల్యాణలక్ష్మి డబ్బులు రాలేదని చెప్పారు. -
‘కేసీఆర్ అది చూసైనా కళ్ళు తెరవాలి’
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వంపై సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత ఇందిరాగాంధీని హిట్లర్‌తో పోలుస్తూ.. దోషిగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. ఇందిరా గాంధీ ఈ దేశానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో ఆమెది చెరగని ముద్ర అన్నారు. రాజకీయల కోసం బీజేపీ ఎమర్జెన్సీని వాడుకుంటోందని పొంగులేటి ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఓ ఎంపీ దీక్ష చేస్తున్నారు.. కేసీఆర్ దాన్ని చూసైనా కళ్ళు తెరవాలని పొంగులేటి పేర్కొన్నారు. ‘ఇందిరా గాంధీపై జరుగుతున్న దాడి రాజకీయ కుట్రలో భాగమే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశ సార్వభౌమాతృత్వంపై దాడి జరుగుతోంది. విభజన చట్టం అమలు కోసం మేము వేసిన పిటిషన్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలి. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తున్నాము. అఖిలపక్షంలో కలిసి సీఎం కేసీఆర్ కేంద్రంపై వత్తిడి తీసుకురావాలి. పీసీసీ ఆధ్వర్యంలో దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానికి లక్ష పోస్ట్ కార్డులతో ఉత్తారాలు రాస్తున్నాం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలపై పార్టీల కతీతంగా పోరాడాలి. కలిసిరాని పార్టీలు ద్రోహులుగా మిగిలిపోతాయి. అగ్రిగోల్డ్ తెలంగాణ బాధితులకు న్యాయం కోసం హైకోర్ట్ కమిటీ వేసింది. చీఫ్ సెక్రెటరీ దీనిపై మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని’ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ప్రతి కార్యకర్తకు శక్తి యాప్
ఖమ్మంసహకారనగర్ : దేశంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాం«ధీ శక్తి యాప్ ప్రాజెక్ట్ చేపట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అవగాహన కల్పించేందుకు యాప్ ఆలిండియా కో ఆర్డినేటర్ స్వప్న, రాష్ట్ర కో ఆర్డినేటర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఈ యాప్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి ఆలిండియా స్థాయి వరకు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చేయవచ్చన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పది వేల మంది చొప్పున ఈ యాప్‌లో చేర్చాలని నిర్ణయించారని తెలిపారు. అనంతరం స్వప్న, రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పార్టీకి అనుబంధంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ సెల్‌తో పాటు డేటా అనాలైటిస్ట్ డిపార్ట్మెంట్ అనే కొత్త విభాగం ఉన్నాయని, నాయకులు, కార్యకర్తల పనితీరును గుర్తించి మండల, గ్రామస్థాయి పదవులను త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. పదవులు పొందిన మరింత బాధ్యతగా పనులు చేసే అవకాశం ఉందన్నారు. జూలై 17 వరకు లక్ష మందిని శక్తి యాప్‌లో చేర్చాలని నిర్ణయించామన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్యను మూడు లక్షలకు పెంచుతామన్నారు. కేసీఆర్ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, ఒకేసారి రైతు రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చలేదని, ఇలాంటి విషయాలను యాప్ ద్వారా ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ నాగుబండి రాంబాబు, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాయకులు యడవల్లి కృష్ణ, దిరిశాల భద్రయ్య, నర్సింహారావు, వీరభద్రం, హరిప్రియ, నాగేశ్వరరావు, లక్ష్మి, దుర్గాప్రసాద్, రాధాకిషోర్, జహీర్ అలీ, నరేందర్, శ్రీనివాస్‌యాదవ్, ఫజల్, రాములు నాయక్ పాల్గొన్నారు. యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఫోన్ నెంబర్ 7996179961ని శక్తి ఏఐసీసీగా ఫోన్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటరు ఐడీ కార్డు నంబర్ శక్తి ఏఐసీసీకి మేసేజ్ చేయాలి. తర్వాత మీ సభ్యత్వాన్ని స్వీకరించాం అని లేదా ప్రాసెస్‌లో ఉందని ఏఐసీసీ నుంచి ఒక మేసేజ్ వస్తుంది. ఏఐసీసీ స్వీకరించినట్లు మేసేజ్ వస్తే శక్తి యాప్‌లో వివరాలు తెలుసుకోవటంతో పాటు సూచనలు చేయవచ్చు. -
‘ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హెచ్చరిచ్చారు. గాంధీభవన్‌లో అగ్రిగోల్డ్ బాధితులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయం కోసం బాధితులు సచివాలయంకు వెళ్తే హోంమంత్రి అరెస్ట్ చేయమనడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ సంస్థపై చర్యలు తీసుకోకపోవడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటాం: ఉత్తమ్ అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. లక్షలాది మందికి అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా 9 నెలలేనని జోస్యం చెప్పారు. -
కేంద్రం చేసిందేమీ లేదు : ఏపీ అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఆ విషయాన్ని పక్కన బెట్టిందని అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రం తీరును తప్పుబట్టింది. అంతేకాదు హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా పన్ను రాయితీలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టింది. వెనుకబడిన జిల్లాలకు 24,350 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరామని, 1050 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇచ్చిందని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం 7,918.40 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కేంద్రం 5,349.70 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ 57,948.86 కోట్లను అనుమతించలేదని, విభజన హామీల్లో ఏ ఒక్క దాన్ని కేంద్రం అమలు చేయలేదని ఆరోపించింది. షెడ్యూల్-9లో ఉన్న 142 విద్యాసంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని, కడప స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ పేర్కొంది. నాలుగేళ్లలో జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి 10 శాతం కన్నా తక్కువ నిధులు కేటాయించారని, దుగ్గరాజపట్నం పోర్టు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాట్లపై దృష్టి సారించలేదని వాపోయింది. రైల్వేజోన్ ఇంకా పరిశీలనలోనే ఉందని కేంద్రం చెబుతోందని, అమరావతి నిర్మాణానికి 11,602 కోట్ల రూపాయలతో డీపీఆర్ పంపామని, 1500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. -
ముస్లిం రిజర్వేషన్లు ఏమయ్యాయి?
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పూర్తిగా విఫలమయ్యారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. గిరిజన, ఉద్యానవన విశ్వ విద్యాలయం, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అంశాల సాధన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ముస్లిం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీర్మానం చేసినా ఇంతవరకూ అతీగతీ లేదన్న జానారెడ్డి, ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీతో భేటీలో సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అంశాన్నీ సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. ఆదివారం జరిగే నీతిఆయోగ్ భేటీలో అయినా ఈ అంశాల్ని ప్రస్తావించాలని సూచించారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు ప్రధానిని ఒప్పించాలని జానా కోరారు. విభజన అంశాల సాధనలో అధికార పార్టీ చేసే పోరాటానికి కాంగ్రెస్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. బయ్యారంపై నోరు విప్పడం లేదెందుకు?: పొంగులేటి ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’అని నినదించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఈ అంశంపై నోరెందుకు విప్పడం లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నిం చారు. ఏపీలోని కడప స్టీలు ప్లాంటుపై అధికార పక్షం, ప్రతిపక్షనేత, ఇతర పార్టీలు పోరాడుతుంటే ఉద్యమ నేతగా చెప్పుకునే కేసీఆర్ గొంతెందుకు మూగబోయిందన్నారు. మూడు రోజులుగా బయ్యారం ఉక్కుపై ఆందోళన నెలకొన్నా ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రకటన లేదన్నారు. కేసీఆర్‌కు ప్రజా సమస్యలు పట్టడం లేదని, రాజకీయ, వ్యక్తిగత ఎజెండానే కీలకంగా మారిందని విమర్శించారు. బయ్యారంపై సోమవారం ఖమ్మంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం సంతకాల సేకరణ చేపడతామని ఆయన తెలిపారు. బలరాం నాయక్ మాట్లాడుతూ, కేసీఆర్ మాటలకూ, చేతలకూ పొంతన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, వారి సమస్యలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపడం లేదన్నారు. -
‘రాముడు తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో’
సాక్షి, హైదరాబాద్: ‘భద్రాచల రాముడు తెలంగాణలో కొలువై ఉంటే, ఆయన ఆస్తులు మాత్రం ఆంధ్రలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణకు ఇవ్వడానికి సుముఖంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేద’ని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ ఆయన చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్రాలు కుమ్మక్కు ‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014’లో పేర్కొన్న చట్టబద్ధమైన హామీల సాధనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సుధాకర్ రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలయ్యేలా లేవనీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇచ్చిన వివరణ అన్యాయమని ఆయన వాపోయారు. కేసీఆర్‌కు కేంద్రానికి మధ్య ఈ ప్లాంట్ విషయంలో జరిగిన రహస్య ఒప్పందమేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బయ్యారం ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కేంద్ర, రాష్ట్రాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయడానికి తప్పించి రాష్ట్ర బీజేపీ నాయకులు ఒరగబెట్టిందేం లేదని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు గురించి ఒక్కసారైనా ప్రధాని మోదీతో మాట్లాడారా అని ప్రశ్నించారు. -
విభజన హామీలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోరుతూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదులైన ఉక్కు శాఖ, ఆదాయపు పన్ను విభాగం ఈ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఏపీలోని వైఎస్సార్ జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తూ విభజన చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలల్లో యోగ్యత నివేదిక ఇవ్వాలని మాత్రమే చట్టం చెప్పిందని, ఆయా ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుకూలత లేదని సెయిల్ నివేదిక ఇచ్చిందని ఉక్కు శాఖ పేర్కొంది. తదుపరి 2016లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని వివరించింది. 2017 డిసెంబర్ 12న ఈ కమిటీ చివరిసారిగా సమావేశమైందని, యోగ్యతపై అధ్యయనం చేస్తున్న మెకాన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమాచారాన్ని పంచుకోవాలని కమిటీ సూచించిందని వివరించింది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పన్ను రాయితీల విషయంలో అదనపు డిప్రిసియేషన్‌ను సాధారణంగా ఇచ్చే 20 శాతానికి అదనంగా మరో 15 శాతం ప్రకటించామని, అలాగే అదనపు పెట్టుబడి భత్యం కింద 15 శాతం ప్రకటించామని ఆదాయపు పన్ను శాఖ తన అఫిడవిట్లో పేర్కొంది. -
‘తెలంగాణలో అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయండి’
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ఉదాసీన వైఖరి సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘంతో కలిసి ఆయన బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 2 లక్షల 65 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే ఆ సంస్థ చైర్మన్, డెరెక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ కుంభకోణంలో రూ. 500 కోట్లకు పైగా మోసపోయిన డిపాజిటర్ల పక్షాన నిలవాలని సుధాకర్ రెడ్డి తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేశారు. సంస్థ నిర్వాహకులపై కేసులు పెట్టాలనీ, ఏపీ ప్రభుత్వం తరహాలో కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో గల ఆ సంస్థ ఆస్తులను జప్తు చేయాలన్నారు. తెలంగాణలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఏపీ సర్కార్ జప్తు చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ తక్షణమే ఈ వ్యవహారంపై చొరవ తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సుధాకర్ రెడ్డి అన్నారు. -
దీర్ఘకాలిక చర్యలు తీసుకోండి: సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై దీర్ఘకాలిక చర్యలు తీసుకోకుండా చందాలు ఇచ్చినట్లు డబ్బులిస్తే ఫలితం ఉండదని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. అలాగే రుణ పరిమితి పెంచకపోతే రైతులు ఇబ్బందిపడతారని ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం సురేశ్‌రెడ్డి, కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సచివాలయంలో సీఎస్ ఎస్పీ సింగ్‌ను కలసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట పెట్టుబడి మొత్తం, బ్యాంకులు ఇస్తున్న రుణానికి చాలా వ్యత్యాసం ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. -
‘అగ్రిగోల్డ్ బాధితుల కోసం కార్పస్‌ఫండ్ పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయా లని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో 3లక్షల మంది కి పైగా బాధితులు రూ.465 కోట్ల వరకు ఆ సంస్థలో డిపాజిట్లు చేశారన్నారు. డిపాజిట్లు రాక 70మంది చనిపోయారని వారి కుటుంబాలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
ఉగాది పచ్చడిలా టీఆర్ఎస్ పాలన: పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో టీఆర్ఎస్ పాలన ఉగాది పచ్చడిలా ఉందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి చేయాల్సింది ఇంకా చాలా ఉందని, అభివృద్ధిలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కలుపుకునిపోవాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లైనా నీటి సమస్య తీరలేదని పేర్కొన్నారు. రైతులకు మేలు చేయాలంటే రైతు బంధు పథకం సరిపోదని, పంటలకూ గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. నగరమంతా పాదయాత్ర చేస్తా: అంజన్ కుమార్ సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్‌కు పూర్వ వైభ వం తెచ్చేందుకు త్వరలో హైదరాబాద్ అంతటా పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్ర వారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రజాసమ స్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా నియమించినందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి వంద సీట్లు గెలిచిందని ఆయన ఆరోపించారు. దళితులకు మూడెకరాలు, పేదలకు ‘డబుల్’ ఇళ్లు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. -
‘తెలంగాణ భవన్ లేకపోవడం బాధాకరం’
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్లయినా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించుకోకపోవడం బాధాకరమని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌ను యుద్దప్రాతిపదికన నిర్మించుకున్నారన్నారు. భూమి అందుబాటులో ఉన్న ఏపీ భవన్లో కొనసాగడమెందుకని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ నిర్మిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, సందర్శకులకు ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్‌కు రారని, ప్రగతిభవన్‌లో అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రతిపక్షాలను కలవరని మండిపడ్డారు. తెలంగాణలో మిషన్ భగీరథ నత్తనడకన నడుస్తోందన్నారు. 17 వేల కోట్ల మిగులు బడ్జెట్ మేమిస్తే, లక్షన్నర కోట్ల అప్పు చేశారని విమర్శించారు. దళితులకు భూమి ఇవ్వలేదని, డబుల్ బెడ్రూం ఇళ్ల ఊసే లేదన్నారు. రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో అనేక హామాటు నెరవేరలేదని, అందుకే సుప్రీంకోర్టులో కేసు వేశామన్నారు. కేసీఆర్ రాజ్యాంగ ధర్మాన్ని పాటించాలన్నారు. సోనియాగాంధీ చలువతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. -
శాసన సభ్యత్వాలు పునరుద్ధరించండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల శాసన సభ్య త్వాలను పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ లీగల్ మెమొరాండం ఇచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అన్యాయమని రాజ్యాంగాన్ని రక్షించే అన్ని సంస్థలను సంప్రదించామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, శాసనసభ వెబ్సైట్లోనూ వారిద్దరినీ ఎమ్మెల్యేలుగా చూపిస్తున్నారని, దీన్ని అధారంగా చేసుకుని వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని మెమొరాండం ఇచ్చామని చెప్పారు. -
రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతోంది: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులను లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 12వేలకు పైగా ప్రైవేటు విద్యాసంస్థలుండగా, 4వేల సంస్థలే ఆదా య, వ్యయ లెక్కలను చూపుతున్నాయని, మిగిలిన కళాశాలలపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేట్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల దోపిడీపై సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని, ఈ ఫీజుల దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కళాశాలలు మేనేజ్మెంట్ కోటా సీట్లను నిబం« దనలకు విరుద్ధంగా అమ్ముకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. -
‘ప్రమాదాల నివారణలో ప్రభుత్వ వైఫల్యం’
సాక్షి, హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల్లో ప్రమాదాలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. కార్మిక, హోం, ఇమిగ్రేషన్ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లడంలో, అధికారులను సమన్వయం చేయడంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గురువారం సీఎల్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగం పనుల్లో బ్లాస్టింగ్ జరిగిన సందర్భంగా ఇద్దరు కూలీలు మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. -
రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘కర్ణాటక’ జోష్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక రాజకీయ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపాయి. ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడం, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై టీపీసీసీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్లో మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్‌ల నేతృత్వంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సీఎల్పీ కార్యాలయ సిబ్బందికి ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్వీట్లు తినిపించారు. ఇది రాహుల్ గాంధీ విజయమని, ఈసారి ఆయన ప్రధాని కావడం ఖాయమంటూ నినాదాలు చేశారు. ఆ ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నా: ఉత్తమ్ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామానికి గొప్ప విజయం లభించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి గుణపాఠం చెప్పడం శుభ పరిణామమని, కర్ణాటక పరిణామాలు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తాయన్నారు. కర్ణాటక విధాన సభలో రాజ్యాంగం రక్షించబడిందని, ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి, వీహెచ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, గీతారెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. కష్టానికి ఫలం... కన్నడ రాజకీయానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారడం కూడా కాంగ్రెస్ నేతలకు సంతోషం కలిగిస్తోంది. ‘మా అధినాయకత్వం ఆదేశాల మేరకు శుక్రవారమంతా మేం చాలా కష్టపడ్డాం. బడా నేతలతోపాటు ఎమ్మెల్యేలందరికీ ఏ లోటూ రాకుండా ఆతిథ్యం ఇచ్చాం. విమానాశ్రయం నుంచి హోటళ్లకు, హోటళ్ల నుంచి బెంగళూరుకు తరలించే వరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇప్పుడు మేం అనుకున్నట్లుగా విజయం సాధించడం చాలా తృప్తిగా ఉంది. ఈ కష్టంలో మాకూ భాగముందనే భావన వస్తోంది. ఇది కచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్‌కూ శుభ పరిణామమే’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. -
కుంభకోణాలపై విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పాత కేసులను తిరగదోడటం కన్నా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై ముందు విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎంసెట్, మియాపూర్ భూముల కుంభకోణం, నయీం ఎన్కౌంటర్ స్కాం.. ఇలా చాలా స్కాములు వెలుగులోకి వచ్చాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయ ఎజెండాలో భాగంగానే కాంగ్రెస్ నేతలపై మళ్లీ కేసులు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న సబ్సిడీ పథకాల్లో జరుగుతున్న కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విభజన చట్టం హామీలపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు మూడోసారి విచారణకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని విమర్శించారు. విభజన హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసులో ఇంప్లీడ్ కావాలని కోరారు. -
పంట నష్టంపై పట్టించుకోరా: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర నష్టంలో కూరుకుపోయి ఉంటే, వారికి పరిహారం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్ యార్డుల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, రైతులు పంటలను అమ్ముకునేందుకు రోజుల తరబడి కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ హౌజ్ కమిటీలు నామమాత్రంగా మారాయని, కమిటీ సమావేశాలపై అశ్రద్ధ సరికాదని, స్పీకర్, చైర్మన్లు కమిటీల పనితీరుపై దృష్టి సారించాలని కోరారు. -
ఇదేం బంగారు తెలంగాణ ?
సత్తుపల్లి: ‘రైతే రాజు అంటారు.. రైతు లేనిదే ప్రభుత్వం లేదంటారు.. రైతు పంటలను కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు.. ఇదెక్కడి బంగారు తెలంగాణ’ అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు రాజుల కాలం తరహాలో మారువేషాలతో తిరిగితే రైతుల బాధలు ఏంటో తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కోట్లు ఖర్చు పెట్టి గోదాంలు నిర్మించింది రైతుల కోసం కాదా..? రైతుల పంటలను ఆరుబయట నిల్వ చేసుకోవాల్సి వస్తోంది.. పంట దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. మొక్కజొన్న అమ్మిన తర్వాత కూడా బస్తాలకు కాపలా రైతులే ఉండాలని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి కాంటా వేయకపోతే రైతులు పడిగాపులు పడాల్సి వస్తోందని.. మంచినీరు, భోజన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని, కొందరు అధికారులు అత్యుత్సాహంతో రైతులను అవమానించే రీతిలో మట్లాడుతున్నారని ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మార్కెట్ యార్డు దుస్థితిని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సీఎం, సీఎండీకి ధన్యవాదాలు.. సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలోని పలు ఇళ్లకు బాంబ్ బ్లాస్టింగ్‌తో పగుళ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే చర్యలు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సుధాకర్‌రెడ్డి అన్నారు. సింగరేణి నిధులను బాధిత గ్రామాలలో ఖర్చు చేయాలని, డిస్పెన్సరీ, సీసీరోడ్లు, మంచినీరు ఇవ్వాలని, పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు పెంచాలని కోరారు. ఆయన వెంట కట్ల రంగారావు, రామిశెట్టి సుబ్బారావు ఉన్నారు. కడియం.. నీ బాగోతం బయటపెడతాం అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కడియం ఆ మాటలు చెప్పిన బహిరంగ సభలోనే.. అదే మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు చేసిన పనికి సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వెళితే ఖర్చు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సత్తుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యాశాఖలో అక్రమాలు, కార్పొరేట్ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే తానే స్వయంగా వచ్చి అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని, మంత్రి కడియం శ్రీహరి బాగోతాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో మూడు శాతం పర్సంటేజీలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ చెప్పినట్లు స్వయంగా మున్సిపల్ చైర్మన్ చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో దందా చేస్తోందని, పినపాకలో గోదావరిలోనే రోడ్డు వేశారంటే ఇసుక మాఫియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. -
రైతులను నిర్లక్ష్యం చేస్తూ యాత్రలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజలు ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఆదుకోకుండా ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతున్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా అల్లాడిపోతున్నారు. నిర్మాణంలో ఉన్నప్పుడే డబుల్ బెడ్రూం ఇళ్లు కూలిపోతున్నాయంటే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం, అప్పుల ఊబిలో ఉన్న రైతుకు ఏ మూలకు సరిపోతుంది. ఈ పథకం రైతుబంధు కాదు, వడ్డీ బంధుగా మారనుంది’అని విమర్శించారు. -
అవినీతి సొమ్ముతోనే కేటీఆర్‌కు అహంకారం
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి సభ పేరుతో ఖమ్మంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘కేటీఆర్ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో వచ్చిన అహంకారంతోనే రెచ్చిపోతున్నాడు. కాంగ్రెస్ నేతలు నకిలీ గాంధీలని మాట్లాడడం సరికాదు. మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ పాటించకుండా భట్టి విక్రమార్కను అవమానించడం రాష్ట్రంలోని దళితుల్ని అవమానించినట్టే’అని విమర్శించారు. -
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
-
‘తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలి’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలనే ఏపీ విభజన చట్టంలోని హామీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాలు గడిచినా ఏపీ విభజన చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయలేక పోయారో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని న్యాయస్థానం సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పిటీషన్లో ఇంప్లీడ్ కావాలన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రీడిజైన్ జరగాలని తెలిపారు. పోలవరం రీడిజైన్ జరగాలనే అంశాన్ని కేసీఆర్ గాలికొదిలేశారని, ఇపుడు ఆయన దృష్టంతా రాజకీయాల చుట్టే తిరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా, కాంగ్రెస్‌పై విమర్శలకే కేసీఆర్ సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఎలా పోరాడుతున్నాయో చూసి నేర్చుకోవాలని సూచించారు. -
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయం, పోలవరం ముంపుపై అధ్యయనం చేయడం వంటి విభజన హామీలను వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని గతంలో సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో న్యాయస్ధానం జారీ చేసిన నోటీసులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు హాజరైనా కేంద్రం స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇస్తామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల వారి కుటుంబ రాజ్యాంగమే అమలవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారన్నారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విస్మరించి కల్వకుంట్ల రాజ్యాం గాన్ని అమలు చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలను టీఆర్ఎస్ పార్టీ సమావేశాలుగా నిర్వహించారంటూ ఆక్షేపించారు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పుల ద్వారా గ్రామ సభలకు కోరలు పీకారని విమర్శిం చారు. కలెక్టర్లకు అధికారం కట్టబెట్టారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారికి విలువ లేకుండా పోయిందన్నారు. పేదలకు ఉన్నత విద్యను దూరం చేయడానికే ప్రైవేటు వర్సిటీల బిల్లును ఆమోదించారని ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. కాగ్ నివేదికపై సీఎం సమాధానం చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌వన్నీ కాకి లెక్కలే..
సాక్షి, హైదరాబాద్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినవన్నీ కాకి లెక్కలని తేలిపోయింది. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు ..పేద రాష్ట్రం’ అని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగ్ నివేదిక కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ లేదని కాగ్ స్పష్టం చేసిందని, తప్పుడు లెక్కలతో తెలంగాణను ధనిక రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై పొంగులేటి మండిపడ్డారు. గారడీ లెక్కలతో ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రంగంలోను టీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందించలేదని విమర్శించారు. విద్య, వైద్యంలో ఎంతో పురోగతి సాధిస్తున్నామని గొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ నేతలు సర్కార్ వైద్యం డొల్లగా మారిందనీ, విద్యా వ్యవస్థ కుంటుపడిందన్న కాగ్ రిపోర్టుపై ఎందుకు నోరుమెదపడం లేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ రాజ్ చట్టానికి మార్పులు చేసి గ్రామ సభలకు కోరలు పీకారని ధ్వజమెత్తారు. ప్రయివేట్ యూనివర్సిటీలు తీసుకురావడమంటే కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. -
టీఆర్ఎస్ రాజ్యాంగం అమలవుతోంది
సాక్షి, హైదరాబాద్: అం బేద్కర్ రాసిన రాజ్యాంగం, భారత పార్ల మెంటు చేసిన చట్టాలు కాకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజ్యాంగం అమలవుతోందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజ్యాంగం అమల్లో ఉన్నందునే తమ పార్టీని అకారణంగా అసెంబ్లీ నుంచి బయటకు పంపించి చట్టాలు చేసుకుంటున్నారని బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. వాళ్లే పొగుడుకుని, వాళ్లే చట్టాలు చేసుకుంటున్న తీరు పాఠశాలల్లో జరిగే ‘సెల్ఫ్ గవర్నమెంట్’ను తలపిస్తున్నాయని అన్నారు. లక్షలాది రూపాయలను కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకునేందుకు వీలుగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును అసెంబ్లీలో పెట్టారన్నారు. సభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ బిల్లు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు. -
కేసీఆర్‌వి కిలాడీ రాజకీయాలు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కిలాడీ రాజకీయాలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి అని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటిని పట్టించుకోకుండా, తన రహస్య ఎజెండాతో జాతీయస్థాయి ఫ్రంట్ అంటూ చర్చనంతా తన చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఆర్ఎస్ఎస్ చేతిలో పావుగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అనుకూల ఓట్లను చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ పెద్దల వ్యూహంలో పావుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ అంటున్నారని కాంగ్రెస్‌నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో సోమవారం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను, సమస్యలను చర్చకు రాకుండా దృష్టి మళ్లించేందుకు ఇదో ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు. గవర్నర్ గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే, సీఎం మాత్రం కంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళ్తున్నారన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణంలో కుంభకోణం, సహారా ఇండియా కంపెనీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతోందని, ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే ఫ్రంట్ రాగం అందుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యూహంలో భాగంగా ఆర్ఎస్ఎస్ పెద్దలు వదిలిన బాణమే కేసీఆర్ అని, వారి చేతిలో కీలుబొమ్మగా మారా డని ఆరోపించారు. బీజేపీని, ప్రధాని మోదీని కాపాడటంలో భాగంగానే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాలుగేళ్లలో రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో ఉందన్నారు. ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకుండా లంబాడీ, ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టాడని మండిపడ్డారు. ఈ ఫ్రంట్ ప్రకటనకు కుటుంబపోరు, వారసత్వం కోసం జరుగుతున్న కొట్లాటతో పాటు సీబీఐ కేసులు కారణమని ఆరోపించారు. తనను ముఖ్యమంత్రి చేయాలంటూ కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నాడని, దీనికోసం అలిగిపోయి మైహోంలో కేటీఆర్ కుటుంబం నివాసం ఉంటుందని చెప్పారు. పూటకోమాట, వేషం, భాషను 15 ఏళ్లుగా మారుస్తున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మరన్నారు. ఏపీ విభజన చట్టం అమలు చేయాలి సుప్రీంకోర్టులో పొంగులేటి పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను సోమవారం విచారించింది. చట్టాలు అమలు చేయాలని తాము ఆదేశాలు ఎలా ఇవ్వగలమని ధర్మాసనం ప్రశ్నించగా గతంలో పలు చట్టాల అమలుపై దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ఉదహరించారు. దీంతో ప్రతివాదులైన కేంద్ర హోం, ఆర్థిక, ఉక్కు, జల వనరుల, మానవ వనరుల అభివృద్ధి శాఖలకు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పిటిషన్ కాపీని అందజేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినట్టు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ తెలిపారు. -
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మండలి, శాసనసభల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని హామీల సభా కమిటీలో ప్రశ్నిస్తే.. 16 హామీలకు గాను ఒక్క హామీ అమలు కోసం మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులు వివరించడం దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హౌసింగ్ అక్రమాలపై వేసిన కమిటీ 18 నెలలవుతున్నా సమావేశం కాలేదని, ఇలాంటి కమిటీల్లో తాము ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. రైతుల గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ముందుగా ఖమ్మంలో బేడీలు వేసి అరెస్టు చేసిన రైతులపై కేసులు ఎత్తివేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. -
కేటీఆర్ మాటలు మితిమీరుతున్నాయ్
సత్తుపల్లి : దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్‌కు విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్సీ, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. రోజురోజుకు కేటీఆర్ మాటలు మితిమీరుతున్నాయన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సింగరేణి బాంబు బ్లాస్టింగ్లతో దెబ్బతిన్న ఇళ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శాసన మండలి హక్కుల కమిటీలో సభ్యుడి హోదాలో సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న నష్టాలను స్వయంగా పరిశీలించేందుకు వచ్చానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్యూరిటీని పక్కన బెట్టి మారువేషాల్ల తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాటిని విస్మరించి ప్రజలను వంచించారన్నారు. తెలంగాణలో కేసీఆర్ మార్క్ ప్రజాస్వామ్యం, దేశంలో మోదీ మార్క్ ప్రజాస్వామ్యం నడుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ.40వేల కోట్లు ఇవ్వకపోయినా మంత్రులు, ఎంపీలు నోరు మెదపటం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన మంచినీటి పథకాలకు పేరుమార్చి మిషన్ భగీరథ పథకాలుగా గొప్పగా చెప్పుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీ ఫిరాయించి 11వేల గజాలు అక్రమంగా రెగ్యులైజ్ చేసుకున్నారని ఆరోపించారు. ఖమ్మం డీసీసీబీ అక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజిలెన్స్‌తో విచారణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానన్నారు. అనంతరం సింగరేణి పీఓ బి.సంజీవరెడ్డిని కలిసి బ్లాస్టింగ్ సమస్యలను వివరించారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి మనోహర్‌నాయుడు, డీసీసీ కార్యదర్శి గాది రెడ్డి సుబ్బారెడ్డి, తుంబూరు ప్రతాప్‌రెడ్డి, కేశబోయిన నర్సింహారావు, ప్రకాష్, నందునాయక్ పాల్గొన్నారు. -
తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడరు
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని తెలంగాణకు చెందిన హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని, ఆ హామీలు రాష్ట్రానికి వర్తించవా అని మండలిలో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రెండూ తనకు సమానమేనంటున్న పవన్ తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హామీలను సాధించడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 8 వేల ఎకరాల్లో, 20 వేల క్వింటాళ్ల కందులను రైతులు పండించారని, ఇప్పటిదాకా కేవలం 2 వేల క్వింటాళ్లను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మిగిలిన కందులను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.