ఇది చీకటి రోజు
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్ట సవ రణ బిల్లును కేవలం మూడున్నర నిమిషా ల్లోనే ఆమోదింప చేసుకున్నారని, అంత తొందరపాటు ఎం దుకో అర్థం కావడం లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. కీలకమైన బిల్లుపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 2013 చట్టాన్నే అమలు చేసి రైతులు, నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ఇదో చీకటిరోజు అని విమర్శించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు టెర్రరిస్ట్ పాలనలా ఉం దని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ప్రాజె క్టులు పూర్తి చేయాలని లేదని, అవి ఆలస్యమైతే ఆ నెపాన్ని కాంగ్రెస్‌పైకి నెట్టేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు.
ప్రత్యేక సమావేశంలో పాల్గొనకుండా కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిని ఖమ్మంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సీఎంకు అన్నదాత ఆత్మహత్యలు కనిపించడం లేదా అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సంఖ్యా బలంతో అధికార పార్టీ దౌర్జన్యంగా బిల్లు పాస్ చేసుకుందని, రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు.