land acquisition Act
-
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
‘రింగు’ భూసేకరణలో వందల ఎకరాలు మిస్!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)కు అవసరమైన భూసేకరణలో రెవెన్యూ అధికారులు 460 ఎకరాలను మరిచిపోయారు. అలైన్మెంట్ పరిధిలోని ఆ భూమిని భూసేకరణ జాబితాలో చేర్చకుండానే పరిహారం పంపిణీ అవార్డులు పాస్ చేసే కసరత్తు చేపట్టారు. విషయం తెలిసి ఇప్పుడు ఆ మరిచిపోయిన భూమిని సేకరించేందుకు హడావుడి మొదలుపెట్టారు. అందుకు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేశారు. మిగతా భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ల తంతు పూర్తి చేసిన 8 నెలల తర్వాత ఇప్పుడు ఈ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే.. రీజనల్ రింగురోడ్డులో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం దాదాపు పూర్తి చేసింది. అలైన్మెంట్ పరిధిలోకి వచి్చన భూములు ఇక రీజినల్ రింగురోడ్డు కోసం ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వ అదీనంలోకి వచ్చాయంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. భూపరిహారాన్ని నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు గ్రామాలవారీగా అవార్డులు పాస్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా భూముల వివరాలు పరిశీలిస్తుండగా అలైన్మెంట్ పరిధిలోకి వచి్చన భూముల్లో కొన్ని భూసేకరణ తుది జాబితాలోంచి మిస్ అయ్యాయని అధికారులు గుర్తించారు. నర్సాపూర్ ‘కాలా’ పరిధిలో 360 ఎకరాలు, గజ్వేల్ ‘కాలా’ పరిధిలో మరో 100 ఎకరాలు ఇలా గల్లంతైనట్లు తేల్చారు. అయినప్పటికీ గతేడాది భూసేకరణకు సంబంధించి రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పుడు ఆ గెజిట్ నోటిఫికేషన్ల గడువు కూడా తీరిపోయింది. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ల జారీ సేకరించాల్సిన భూములను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇందులో 3ఏ, 3డీలు కీలకమైనవి. గ్రామం పేరు, సర్వే నంబర్లు, భూమి పరిమాణం వివరాలు తెలుపుతూ మూడు రోజుల క్రితం 3ఏ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. నర్సాపూర్, గజ్వేల్ కాలాలకు సంబంధించి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. వీటిపై అభ్యంతరం ఉన్న వారు 21 రోజుల్లో తమ అభ్యంతరాలను ఆయా ‘కాలా’లకు సంబంధించిన ఆర్డీఓ కార్యాలయాల్లో అందజేయాల్సిందిగా కోరారు. ఆ తర్వాత భూ యజనమానుల పేర్లతో 3డీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. వాటి తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తేగానీ ఆయా గ్రామాల్లో భూసేకరణకు వీలుండదు. ఇలా ఇంకేమైనా గ్రామాల్లోనూ భూముల వివరాలు గల్లంతయ్యాయేమోనని అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. -
గల్లా పెట్టె ఘల్లుమనేలా!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు సర్కారు భూముల అమ్మకాలు, మరోవైపు లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సముపార్జనకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకాలకు చర్యలు చేపట్టిన అధికారులు.. సర్కారు ఖజానాను భర్తీ చేసేందుకు మరిన్ని చోట్ల భూముల అమ్మకాలకు ప్రణాళికలను రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా చోట్ల వివాదంలో ఉండడంతో లేఅవుట్ల అభివృద్ధి, ప్లాట్ల విక్రయాల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు లేని భూములపై అధికారులు తాజాగా దృష్టి సారించారు. గతంలోనే అమ్మకానికి సిద్ధంచేసిన లేమూరుతో పాటు, కుత్బుల్లాపూర్‌లోని హెచ్ఎంటీ భూములు, ఔటర్‌కు సమీపంలోని కుర్మగూడలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు కార్యాచరణను సిద్ధంచేశారు. రెండు చోట్ల వెంచర్లు.. లేమూరులో ప్రభుత్వ భూమితో పాటు కొంత భూమిని రైతుల నుంచి సేకరించారు. సుమారు 44 ఎకరాల్లో ప్లాట్లను సిద్ధం చేశారు. గతంలోనే ఈ ప్లాట్లకు వేలం నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం లేమూరు అన్ని విధాలుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. 300 చదరపు గజాలు, 200 చదరపు గజాల చొప్పున సుమారు 350 ప్లాట్ల వరకు లేఅవుట్లు వేసి విక్రయానికి ఏర్పాట్లు చేశారు. లేమూరు భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.250కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుమారు 90 ఎకరాల హెచ్ఎంటీ భూముల్లోనూ తాజాగా లేఅవుట్లకు సన్నాహాలు చేపట్టారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల వరకు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడ గజానికి రూ.25 వేల కనీస ధర నిర్ణయించే అవకాశం ఉంది. ఔటర్‌కు సమీపంలో ఉన్న కుర్మగూడలో ప్రభుత్వానికి మరో 60 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఇంకా లేఅవుట్ చేయాల్సి ఉంది. ఇక్కడ డిమాండ్ బాగా ఉంటుందని అంచనా. ఈ మూడు చోట్ల కలిపి ప్లాట్ల విక్రయం ద్వారా కనీసం రూ.750 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. క్రమబద్ధీకరణకు సన్నద్ధం... లేఅవుట్ల క్రమబదీ్ధకరణ కోసంఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు నాలుగు జోన్లలో కలిపి సుమారు 1000 లే అవుట్లను గుర్తించారు. వారంతా గతంలోనే ఎల్ఆర్ఎస్ కోసం డాక్యుమెంట్లను సమర్పించారు. రూ.10 వేల ఫీజు చెల్లించారు. అధికారులు గుర్తించిన లే అవుట్లలో సుమారు 700 కు పైగా లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ను ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ స్థలాలన్నీ ఎకరానికి పైగా ఉన్నవే కావడంతో ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. తాజాగా హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం అధికారులతో ఈ అంశంపై సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీపావళి తర్వాత అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం) -
పరిహారం... నాలుగింతలు
సాక్షి, హైదరాబాద్: వివిధ అభివృద్ధిపనుల్లో భూసేకరణకు గాను ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్లేలా జీహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తోంది. స్థలాల సేకరణకు పరిహారంగా నగదు చెల్లింపు బదులు అభివృద్ధి హక్కు బదిలీ పత్రాల్లో వెసులుబాటు కలి్పస్తూ సుందరీకరణ చేపట్టాలని భావిస్తోంది.ఇలా ఎస్పార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనుల భూసేకరణల కోసం జీహెచ్ఎంసీ ఖజానా నుంచి నిధులు చెల్లించకుండా అభివృద్ధి హక్కు బదిలీ పత్రాలను అంటే టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) తీసుకునేలా స్థల యజమానులను ప్రోత్సహిస్తోన్న జీహెచ్ఎంసీ.. నాలాల విస్తరణ, చెరువుల బఫర్జోన్ల సుందరీకరణ కోసం సైతం ఈ విధానాన్ని అనుసరించనుంది. ఇందులో భాగంగా యజమానులు కోల్పోయే భూములకు ప్రస్తుతం కలి్పస్తున్న 200% ఉన్న టీడీఆర్ హక్కులను 400 శాతానికి పెంచేందుకు సిద్ధమైంది. ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వంటి సాధారణ ప్రాంతాల్లో ఆస్తులు/భూములు సేకరించినప్పుడు ఈ విధానం అమల్లో ఉంది. చెరువులు, నాలాల ప్రదేశాల్లో మాత్రం ఇది కేవలం 200% మాత్రమే ఉంది. నగర అవసరాలకోసం నాలాలను విస్తరించాల్సి ఉంది. అందుకుగాను భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూసేకరణ చట్టం మేరకు నోటిఫికేషన్‌తో అమలుచేసే ఆర్థిక స్థితిలో జీహెచ్ఎంసీ లేదు. దీంతో గతేడాది కాలంగా టీడీఆర్ పద్ధతిపై ముమ్మర ప్రచారం చేయడంతోపాటు భూ యజమానులను ఒప్పించడంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సఫలమయ్యారు. ప్రస్తుతం ఉన్న 200% టీడీఆర్‌ను 400% చేస్తే ముందుకొస్తారని భావిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అనుమతి వస్తే ఫ్లై ఓవర్ల తరహాలోనే చెరువుల బఫర్జోన్ల సుందరీకరణ, నాలాల విస్తరణ పనులకు టీడీఆర్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తద్వారా వాటిని అభివృద్ధిచేసేందుకు, పచ్చదనం పెంచేందుకు మార్గం సుగమం కాగలదని భావిస్తున్నారు.దీనివల్ల నాలాల విస్తరణతోపాటు చెరువుల పరిరక్షణకు, వాటిని వినోదకేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని మేయర్ అన్నారు. బతుకమ్మ చెరువుల సుందరీకరణ.. వినాయక నిమజ్జనాలతోపాటు బతుకమ్మల నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన 32 చెరువుల ను కూడా తీర్చిదిద్దనున్నారు. ఇకపై నిర్మించబోయే నిమజ్జన కొలనుల్ని 5 ఎకరాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించాలని భావిస్తున్నారు. వీటిలో ఐదారడుగుల పెద్ద గణేశ్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేయవచ్చునని, తద్వారా హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే పెద్ద విగ్రహాల సంఖ్య తగ్గుతుందని అంచనా. టీడీఆర్ అమలు ఇలా.. వివిధ ప్రాజెక్టులు చేపట్టేప్పుడు ప్రభుత్వం అవసరమైన ఆస్తులు, భూసేకరణకు పరిహారంగా నగదు చెల్లించడం తెలిసిందే. నగరంలో భూముల విలువ ఎక్కువ కావడంతో ఆస్తులు కోల్పోయే వారికి నగదుకు బదులు వారు కోల్పోయే భూమికి నాలుగు రెట్ల బిల్టప్ ఏరియాతో మరో స్థలంలో నిర్మాణం చేసుకునేందుకు వెసులుబాటు కలి్పస్తూ ఇచ్చేవే ఈ హక్కు (టీడీఆర్) పత్రాలు. వీటితో హక్కుదారులు తాము కోల్పోయిన ప్లాట్ఏరియా బిల్టప్ ఏరియాకు నాలుగింతల బిల్టప్ ఏరియాను పొందవచ్చు. అందుకుగాను నిరీ్ణత సెట్‌బ్యాక్ వదలకుండానే అదనపు అంతస్తు వేసుకోవచ్చు.ఆయా ప్రాంతాల్లోని రిజి్రస్టేషన్ విలువ కనుగుణంగా నగరంలోని ఏ ప్రాంతంలోనైనా ఈ నిర్మాణం చేసుకోవచ్చు. లేదా తమకున్న ఈ హక్కుల్ని బిల్డర్లకు అమ్ముకోవచ్చు.ఈ ప్రయోజనాలు ఆకట్టుకోవడంతో దాదాపు 325 మంది టీడీఆర్ సరి్టఫికెట్లు తీసుకోవడం ద్వారా జీహె చ్‌ఎంసీకి రూ. 200 కోట్ల వరకు చెల్లింపులు మి గిలాయి. చెరువులు, నాలాల ప్రాంతాల్లో ప్రస్తు తం టీడీఆర్ పరిహారం 200% మాత్రమే ఉంది. దాన్ని 400 శాతానికి పెంచితే ఎక్కువ మంది ముందుకొస్తారని.. జీహెచ్ఎంసీ అంచనా. -
పరిహారమివ్వకుండా భూములెలా తీసుకుంటారు?
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహార చెక్కులు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఉన్న రెండు రిట్ పిటిషన్లను కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా 24న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కొండపోచమ్మ ప్రాజెక్టు భూసేకరణపై స్టే ఆదేశాలు ఉన్నా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అవార్డు ప్రకటించడం చెల్లదని ప్రకటించాలని కోరుతూ మామిడ్యాలకు చెందిన శ్రీనివాస్ మరో 24 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. చట్ట నిబంధనల ప్రకారం పునరావాసం, పునర్నిర్మాణ చర్యలు చేపట్టకుండా భూముల్ని స్వాధీనం చేసుకోవడం చెల్లదని, పిటిషనర్లను భూముల్లోకి వెళ్లనీయడం లేదని వారి తరఫు న్యాయవాది వాదించారు. భూసేకరణ నోటిఫికేషన్ తర్వాత చర్యలు చేపట్టరాదని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారని, దీనిని ధిక్కరిస్తున్నారని చెప్పారు. పరిహారం చెల్లించకుండా రైతుల నుంచి భూములు ఎలా తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్టం సెక్షన్ 181 కింద ఇచ్చిన నోటీసును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఈ పరిస్థితుల్లో సింగిల్ జడ్జి ఆదేశాలు వర్తించబోవన్నారు. ప్రాజెక్టు దాదాపు 80 శాతానికిపైగా పూర్తి అయిందని, ఇప్పటికే చాలా మంది రైతులకు ఇదే హైకోర్టులో పరిహార చెక్కులు ఇచ్చామని తెలిపారు. గతంలోని మరో రెండు కేసులతో కలిపి ఈ రిట్‌ను కూడా 24న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పునరావాస చర్యలు అమలు నిమిత్తం తమ భూముల్ని సేకరించడం అన్యాయమని పేర్కొంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన రైతులు దాఖలు చేసిన అత్యవసర రిట్‌ను కూడా ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యాన్ని కూడా 24నే విచారిస్తామని, అప్పటివరకూ పిటిషనర్ల భూముల్ని స్వాధీనం చేసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే తరహాలో గతంలో దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ కేసును విచారిస్తామని ప్రకటించింది. నిర్వాసిత రైతులను ఆదుకునేందుకు ఇతర రైతుల భూముల్ని మళ్లీ సేకరించడం అన్యాయమని, ప్రభుత్వ భూమిలోనే పునరావాసం, పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణకు ఆలస్యమెందుకు? హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో ఖరీదైన భూమి విషయంలో నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) జారీ చేసిన కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌పై విచారణ చేయాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల అమల్లో జాప్యానికి కారణాలు చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించింది. జాప్యానికి కారణాలపై నివేదికను ఆగస్టు 5 నాటికి తమకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సర్వే నంబర్ 284/6లోని 5,262 చదరపు గజాల భూమికి తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్ఓసీ తీసుకున్నారని పేర్కొంటూ శాంతి అగర్వాల్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఓసీ చట్ట నిబంధనలకు అనుగుణంగా జారీ చేయలేదని, ఇందుకు కారణమైన కమిటీ చైర్మన్, ఇతర సభ్యులపై, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్ఓసీ తీసుకున్న మహ్మద్ అబ్దుల్ వదూద్, మహ్మద్ రుక్ముద్దీన్, సయ్యద్ అబ్దుల్ రబ్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అప్పటి కమిటీకి చైర్మన్‌గా నవీన్ మిట్టల్, సభ్యులుగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ వి.దుర్గాదాస్, రిటైర్డు స్పెషల్ తహసీల్దార్ వి.వి.వెంకట్‌రెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ మధుసూదన్‌రెడ్డిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్ చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. ఆరు వారాల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ కోరగా అందుకు అనుమతించిన ధర్మాసనం విచారణను వచ్చే ఆగస్టు 5కి వాయిదా వేసింది. శాఖాపర విచారణ జాప్యంపై నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది. -
రైతుల భూముల్లో ‘రియల్’ చిత్రం
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూముల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. కార్పొరేట్, ఐటీ, వర్తక, వాణిజ్య సంస్థలకు భూములను విక్రయించాలని సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో టీడీపీ సర్కారు విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒకపక్క ఆదివారం నుంచి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సరే రాజధాని భూముల విక్రయంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ రెండు జిల్లాల పరిధిలోని రాజధాని భూముల కేటాయింపు విధానంలో సవరణలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జర్నలిస్టులు, ఉద్యోగులు, జడ్జీలకు ఇళ్ల స్థలాల కేటాయింపు ముసుగులో రాజధాని భూ కేటాయింపుల విధానం – 2017లో టీడీపీ ప్రభుత్వం సవరణలు తెచ్చింది. ఈ సవరణల ద్వారా కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు, వాణిజ్య, వర్తక సంస్థలు, మాల్స్, హెల్త్ కేర్ సెంటర్లకు భూములను విక్రయించేందుకు వీలుగా గేట్లను బార్లా తెరిచారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించేలా సవరణలు ప్రస్తుతం రాజధాని భూ కేటాయింపుల విధానంలో మౌలిక వసతుల కల్పనకు మాత్రమే భూములను ఇవ్వాలని ఉంది. అయితే ఇప్పుడు వ్యక్తులకు కూడా భూములను కేటాయించవచ్చని సవరణలు తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్‌కు ప్రస్తుత విధానంలో భూముల కేటాయింపులకు వీలు లేదు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను విక్రయించేలా సవరణలు తేవడం ద్వారా మార్గం సుగమం చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూమి ధరలో రాయితీలు ఇచ్చి మరీ విక్రయించాలని నిర్ణయించారు. అలాగే పెట్టుబడిదారులకు కూడా భూములను విక్రయించనున్నట్లు సవరణల్లో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా రాజధాని భూములను విక్రయించే అధికారాన్ని సీఆర్డీఏకు అప్పగించారు. రెసిడెన్సియల్ అవసరాలకు ప్రస్తుత భూ కేటాయింపు విధానంలో అవకాశం లేదు. ఈ నేపధ్యంలో సవరణలు చేస్తూ కార్పొరేట్ సంస్థలు, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలకు భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రంగాలకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గ సమావేశం నోట్లోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టంలో సవరణకు నిర్ణయం! భూసేకరణ చట్టం ద్వారా సేకరించిన భూమిని ప్రభుత్వం తరపున విక్రయించే అధికారం సీఆర్డీఏకు అప్పగించారు. అయితే సేకరించిన భూమి మాత్రమే అనే పదం ఉన్నందున భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు వస్తాయనే నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన ఎటువంటి భూమినైనా అభివృద్ధి చేసిన లేదా అభివృద్ధి చేయకపోయిన భూములనైనా విక్రయించే అధికారాన్ని సీఆర్డీఏకు అప్పగిస్తూ సీఆర్డీఏ 2014 చట్టం సెక్షన్ 30లో సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి. రైతుల నుంచి మూడు పంటలు పండే భూములను సమీకరణ పేరుతో తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోనే ఆగకుండా కార్పొరేట్ సంస్థలకు భూములను విక్రయించాలని నిర్ణయించడాన్ని అధికార వర్గాలు తప్పుపడుతున్నాయి. రాజధానిలో ఐటీ కంపెనీలకు రాయితీపై భూములను కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఏపీ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర భూసేకరణ చట్టానికి రాష్ట్రాలు సవరణలు చేస్తూ అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్ర దేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో నిర్వాసితులకు ప్రయోజనకారిగా ఉన్న అనేక నిబంధనలను తొలగిస్తూ ఆ చట్టానికి ఏపీ, తెలంగాణ, గుజ రాత్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలు సవరణ లు చేసి అమలు చేయడాన్ని సామాజికవేత్త మేథా పాట్కర్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. నిర్వాసితుల అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలు చేశారని, ఉపాధి, భద్రత కల్పించకుండా నిర్వాసితులను ఆందోళనలోకి నెట్టేశారని వాదించారు. సామాజిక ప్రభావ మదింపు అంచనా లేకుండానే భూసేకరణ జరపడం 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధమని నివేదించారు. నిర్వాసితుల ప్రాథమిక హక్కుల కు భంగం కలిగేలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని సవరించాయన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాస నం ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఐదు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. -
ముంపు భూముల్ని సేకరించి పరిహారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: చెరువులు తవ్వినప్పుడు భూములు ముంపునకు గురైతే భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువు తవ్వడం వల్ల తరచూ భూములు ముంపునకు గురవుతుంటే ఆ భూముల్ని ప్రభుత్వం సేకరించి రైతులకు చట్ట ప్రకారం పరిహారం ఇవ్వా లని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు ఇటీవల తీర్పు చెప్పారు. పదేపదే ముంపునకు గురయ్యే భూములకు ఒకసారి పరిహారం ఇచ్చేసి తాము సాయం చేశామని ప్రభుత్వం చెప్పడం న్యాయబద్ధం కాదని తేల్చి చెప్పారు. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం బెక్కన గ్రామంలో బెక్కం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణం కారణంగా పలువురు రైతులు జరిపిన న్యాయపోరాటం 14 ఏళ్లకు ఫలించింది. ఆ ప్రాంతంలోని 36 గ్రామాలకు తాగునీటితోపాటు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చెరువు విస్తీర్ణాన్ని పెంచారు. 2002లో జూరాల ప్రాజెక్టు పూర్తవ్వడంతో దాని నుంచి 30కిపైగా తూముల ద్వారా బెక్కం చెరువును నీటితో నింపడం ప్రారంభించారు. దీనివల్ల 111 ఎకరాల భూములు ముం పునకు గురవుతున్నాయని 56 మంది రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు వారి వినతులను ఖాతరు చేయకపోవడంతో 2004లో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖ లు చేశారు. హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ కూడా భూముల ముంపు వాస్తవమేనని తేల్చింది. భూముల ముంపుపై సంబంధిత సివిల్ కోర్టు నుంచి రైతులు పరిహారం పొందవచ్చునని కమిషన్ నివేదికలో పేర్కొంది. నీటిపారుదల శాఖ ఆ నివేదికపై అభ్యంతరం చెప్పింది. రెవెన్యూ శాఖ రైతులకు నష్ట పరిహారం ఇచ్చిందని తెలిపింది. వీటన్నింటినీ లోతుగా పరిశీలించిన న్యాయమూర్తి.. ‘పంట నష్టపోయినప్పుడు ఒకసారి పరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేశామని ప్రభుత్వం వాదించడం చట్ట వ్యతిరేకం. ఆ ముంపు భూముల్ని ప్ర భుత్వం సేకరించడం తప్ప వేరే మార్గం లేదు. నష్టపోయిన వివిధ సర్వే నంబర్లల్లోని రైతులకు 2013–భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. దీంతోపాటుగా హైకోర్టును ఆశ్రయించిన రైతులకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చులుగా చెల్లించాలి’అని తీర్పులో పేర్కొన్నారు. -
బలవంతపు భూసేకరణను నిలిపివెయ్యాలి
-
ఆ నిర్మాణాలకు మినహాయింపు ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన నిర్మాణాల నుచేపట్టేటప్పుడు 2013 భూసేకరణ చట్ట నిబంధనల ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నుంచి ఆ నిర్మాణాలను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తెలిపింది. సామాజిక ప్రభావ అంచనా వేయకుండానే ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ అన్నది ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన నిర్మాణమని ధర్మాసనం తెలిపింది. 2013 భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ ఎం.విజయభాస్కర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10 కింద సామాజిక ప్రభావ అంచనా నుంచి తప్పించి కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టే నిర్మాణాలను ఈ చట్టం కింద మినహాయించవచ్చని నిబంధనలు చెబుతున్నాయని, ప్రభుత్వం ఇక్కడ అదే చేసిందని, అందులో తప్పులేదని స్పష్టం చేసింది. కలెక్టరేట్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన కార్యాలయమని, అందువల్ల మౌలిక సదుపాయాల కింద చేపట్టే నిర్మాణమే అవుతుందని తేల్చి చెప్పింది. కాబట్టి ఖమ్మం కలెక్టరేట్ నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
చంద్రబాబు – లింగమనేని..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: భూములు దోచుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు–లింగమనేని గ్రూపు (రమేశ్)ల బంధం ఏళ్ల క్రితం నుంచి దృఢంగా కొనసాగుతోంది. అసలు లింగమనేని వ్యాపారంలోనే చంద్రబాబుకు వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. లింగమనేనికి వంద ఎకరాలకు పైగా సంతర్పణ చేశారు. దీని కోసం నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రజాప్రయోజనాలను గాలికొదిలారు. విజయవాడ–గుంటూరు మధ్యలో 16వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ప్రజావసరాల పేరుతో సేకరించిన భూములను 2003లో లింగమనేని గ్రూపునకు చంద్రబాబు కట్టబెట్టడం చూస్తే వాళ్ల బంధం ఎంతలా పెనవేసుకుందో ఇట్టే అర్థం అవుతుంది. చంద్రబాబు సహకారానికి ప్రతిగా ఆయనకు కృష్ణా నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను, హెరిటేజ్ సంస్థకు 14.22 ఎకరాల భూములను లింగమనేని సమర్పించుకున్నారు. ప్రజావసరాల పేరుచెప్పి.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా 2001లో ప్రజావసరాల పేరుతో (సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం) వీజీటీఎం–ఉడా ద్వారా ‘సైట్స్ అండ్ సర్వీసెస్’ పథకం పేరిట 115.91 ఎకరాలను తీసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం మంగళగిరి ప్రాంతంలోని నంబూరు, కాజ, కంతేరు గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన, నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఏసీసీ సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న భూములే లక్ష్యంగా వ్యూహం అమలు చేశారు. భూ సేకరణ క్రమాన్ని ఇలా కొనసాగించారు. 1. భూసేకరణ నోటిఫికేషన్ నం.ఆర్.సి.5549/2001– జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో సర్వే నంబరు 142/1బి, 144/1బిలో 7.63 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీచేసింది. 2. భూ సేకరణ నోటిఫికేషన్ నం.ఆర్.సి.5550/2001–జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో సర్వే నెంబరు 203, 204/ఏ, 204/బి2, 206/1, 206/2, 213/ఏ (పి), 207, 213/బి (పి), 214(పి), 215, 216/2, 217లో 69.81 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. 3. భూసేకరణ నోటిఫికేషన్ నం.ఆర్.సి.5551/2001– జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని సర్వే నంబరు 142, 143/1బి, 144,145, 146/1బిలో 38.47 ఎకరాలు కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 115.91 ఎకరాలను వీజీటీఎం – ఉడా 11 నెలల వ్యవధిలో సేకరించింది. పేరు ఒకరికి.. ఫలితం మరొకరికి సేకరించిన 115.91 ఎకరాలను స్వల్పకాలంలోనే లింగమనేని రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వీజీటీఎం–ఉడా కట్టబెట్టేసింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆ భూముల వేలం ప్రకటన (ఆర్.సి.నెం:365/2001, తేదీ 13–03–2003) జారీచేసింది. 27–03–2003న బిడ్లు పిలిచింది. వేలం ఆపాలని హైకోర్టు స్టే ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఏమాత్రం జాప్యం లేకుండా లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీకి 115.91 ఎకరాలను రూ. 8 కోట్లకు ప్రభుత్వం అప్పగించేసింది. అదే భూమిలో మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేసి విక్రయించి ఉంటే అప్పట్లోనే కనీసం రూ. 100 కోట్ల వరకు ఉడాకు సమకూరేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇదంతా అప్పటి ప్రభుత్వాధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందనేది బహిరంగరహస్యమే. భూసేకరణ ద్వారా తీసుకున్న భూమిని సేకరించిన అవసరాల కోసం కాకుండా, ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఉడా యథాతథంగా విక్రయించడమనేది చట్టవిరుద్ధమని నిపుణులు చెప్పినా అప్పట్లో సర్కార్ పట్టించుకోలేదు. ఐజేఎం–రెయిన్ ట్రీపార్కు.. సీఎం చంద్రబాబుకు సింగపూర్, మలేసియాలతో వ్యాపారపరమైన సంబంధాలు గతం నుంచి ఉండేవనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలకు ఎరుకే. ఆ సంబంధాల నేపథ్యంలోనే మలేసియాకు చెందిన ఐజేఎం సంస్థకు హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలం కేటాయించి ఐజేఎం– మలేషియా టౌన్‌షిప్‌ను నిర్మించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే వీజీటీఎం– ఉడా నుంచి లింగమనేనికి ధారాదత్తం చేసిన 115.91 ఎకరాల్లోనే ఐజేఎం–రెయిన్ ట్రీపార్కు అపార్టుమెంట్ల సముదాయం రూపుదిద్దుకుంది. అపార్ట్మెంట్లను విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకోవడంతో పాటు తాజాగా తమ వారికి చెందిన ప్లాట్లను ఎక్కువ అద్దె చెల్లిస్తూ అధికారులకు నివాసాలుగా చంద్రబాబు సర్కార్ కేటాయించింది. ‘లింగమనేనే’ రాజధాని సరిహద్దు.. రాష్ట్ర విభజన తరువాత నూతన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో లింగమనేని భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. రాజధానికి లింగమనేని రియల్ ఎస్టేట్ భూములే సరిహద్దు. ఆ భూములకు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు వెళుతోంది. తన పరోక్ష భాగస్వామి, బినామీ అయిన లింగమనేనికి ఆర్థిక సహకారం అందించడం, తద్వారా తాను లబ్ధి పొందడంలో భాగంగా పెద్ద సంస్థల చేత భూములను కొనుగోలు చేయిస్తున్నారు. ఏసీసీ సిమెంట్స్ భూములతో పాటు సన్న, చిన్నకారు రైతుల నుంచి వందలాది ఎకరాలను నామమాత్రపు ధరకు తీసుకున్న లింగమనేని నుంచి ఒక ప్రముఖ విద్యాసంస్థ, మిల్క్‌డెయిరీ అధినేత, వైద్యవిద్యను అందిస్తున్న మరో సంస్థతో పదుల ఎకరాలను చంద్రబాబు కొనుగోలు చేయించారని సమాచారం. ముఖ్యమంత్రి ఆశీస్సులతో భారీ కాంట్రాక్టులను దక్కించుకుంటున్న ప్రముఖ సంస్థ కొన్నాళ్ల కిందట లింగమనేని నుంచి 150 ఎకరాల వరకు కొనుగోలు చేసిందని తెలిసింది. ఈ ని«ధులన్నీ చంద్రబాబు జేబులోకే వెళ్లినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎయిర్ కోస్టాకు సహకారం.. లింగమనేని నేతృత్వంలోని ఎయిర్కోస్టా విమానయాన సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నది సీఎం చంద్రబాబే అని పారిశ్రామిక వర్గాలకు తెలిసిన విషయమే. ఓ ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ద్వారా రూ. వందల కోట్లను అందులో పెట్టుబడిగా పెట్టించింది కూడా చంద్రబాబేనని చెపుతుంటారు. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌కోస్టాకు అశోక్‌గజపతిరాజు విమానయానశాఖ మంత్రిగా ఉండగా జాతీయస్థాయి పర్మిట్ ముఖ్యమంత్రి ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబును పట్టుకుంటే ఎంతటి పనైనా అయిపోతుందని ఎయిర్ ఏషియా సంస్థ సీఈవోల మధ్య జరిగిన ఆడియో సంభాషణల్లో వెల్లడైన విషయం తెలిసిందే. దీన్నిబట్టి ఎయిర్‌కోస్టాకు పర్మిట్ దక్కడంలో ఆశ్చర్యమేముందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, ఎయిర్‌కోస్టాకు సంబంధించి మరో కోణంలోనూ చంద్రబాబు, లింగమనేని ఆర్థిక ప్రయోజనం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాలు ప్రకటించిన కొద్దికాలానికే నష్టాలంటూ ఎయిర్‌కోస్టాను మూసేసి ఆర్థిక ప్రయోజనాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి ఎయిర్‌కోస్టాను సాధనంగా వాడుకున్నట్లు అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో వార్తాకథనాలు కూడా ప్రచురితమయ్యాయి. పోలీస్ బెటాలియన్ తరలింపులో లోగుట్టు ఇదేనా? మంగళగిరి వద్ద వందలాది ఎకరాల్లో ఉన్న పోలీస్ బెటాలియన్‌ను అక్కడి నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ మేరకు ప్రతిపాదనలు ఇదివరకే చేశారు. ఇందుకు కారణం లింగమనేనికి సహకారం అందించడానికే అనేది స్పష్టమవుతోంది. బెటాలియన్ సమీపంలోనే లింగమనేని సంస్థ భారీస్థాయిలో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. అదే ప్రాంతంలో ఇంకా స్థలాలు ఉన్నాయి. లింగమనేని ఆస్తులకు విలువను పెంచడానికేనని పోలీస్ బెటాలియన్‌ను తరలిస్తున్నారని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పోలీసు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. -
పునరావాసం తర్వాతే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ వల్ల నష్టపోయే రైతు కూలీలు, చేతివృత్తులవారికి నూతన భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఉపాధి, పునరావా సం కల్పించాకే సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కృష్ణాపూర్, వేములఘాట్‌ల్లో భూసేకరణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 123 ప్రకారం మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అయితే వాటిపై ఆధారపడినవారికి పునరావాసం కల్పించలేదని గతంలో దాఖలైన రెండు వేర్వేరు వ్యాజ్యాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్‌రావు బుధవారం మధ్యంతర ఆదేశాలిచ్చారు. ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామ రైతు కూలీలు 93 మంది, వేములఘాట్ గ్రామంలోని 20 మంది రైతు కూలీలు వేసిన వ్యాజ్యాల్లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఇక భూములు లాక్కోవడమే!
సాక్షి, అమరావతి : భూ యజమానుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకునేందుకు మార్గం క్లియరైంది. విలువైన భూములను చౌకగా, బలవంతంగా లాక్కుని అస్మదీయులకు కట్టబెట్టి వాటాలు పంచుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు రూపొందించిన ఏపీ భూసేకరణ చట్ట సవరణ–2017కు ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఈ సవరణ వల్ల ఏపీలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, కొత్త రాష్ట్రమైన ఏపీకి ఇది ఏమాత్రం ఉపయుక్తం కానందున దీనిని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పంపిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. కేంద్ర ప్రభుత్వం పంపిన మార్గదర్శకాలను కాలరాస్తూ మళ్లీ అవే సవరణలతో గత ఏడాది నవంబరులో అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం మళ్లీ కేంద్రానికి పంపింది. ఈ చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జరిగే నష్టాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారులను పంపించి.. రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్నామని, అందువల్ల ఈ భూసేకరణ చట్ట సవరణవల్ల ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదంటూ పదేపదే వివరించడం, పలుమార్లు లేఖలు రాయడం ద్వారా రాష్ట్రపతికి అనుకూల నివేదిక పంపించేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. 2013 కేంద్ర చట్టానికి తూట్లు ఇదిలా ఉంటే.. ఏపీ భూసేకరణ చట్టం–2017 సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ( భూసేకరణ చట్టం)–2013కు తూట్లు పొడించినట్లయింది. ఇప్పటివరకూ ఏ ప్రాంతంలోనైనా పారిశ్రామికీకరణ ఇతర అవసరాల కోసం భూమిని సేకరించాలంటే ఆ ప్రాంతంలో 80 శాతం మంది ప్రజల ఆమోదం తప్పనిసరని కేంద్ర భూసేకరణ చట్టం–2013 స్పష్టంగా పేర్కొంది. ఆమోదం లభించని పక్షంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టడానికి వీల్లేదు. దీనినే సామాజిక ప్రభావ అంచనా సర్వే తప్పనిసరి అని అంటారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ కింద భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటూ కోర్టుకెళ్లిన వారి గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తే 70 శాతం మందికి పైగా వ్యతిరేకిస్తారు. అందువల్ల ఇక్కడ భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యంకాదు. బహుళ పంటలు పండే ఈ భూములను ఎలాగైనా రాజధాని పేరుతో లాక్కోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి కేంద్ర భూసేకరణ చట్టం–2013కు సవరణలు తీసుకువచ్చింది. సవరణలతో వచ్చే నష్టాలివీ.. ఏపీ భూసేకరణ చట్టం–2017వల్ల భూయజమానులకు వివిధ రకాలుగా నష్టం జరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టే ప్రాజెక్టులు, రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలకు ఇకపై సామాజిక ప్రభావ మదింపు అంచనా అవసరంలేదు. నచ్చిన పారిశ్రామికవేత్తలకు విలువైన భూములను సేకరించి ఇవ్వొచ్చు. - ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే భూ యజమానులు ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వస్తుంది. - కలెక్టరు, ఇతర అధికారులు సంప్రదింపుల ద్వారా నిర్ణయించిన ధరే ఇక ఫైనల్. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశంలేదు. ఉదాహరణకు.. రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వడానికి తిరస్కరించిన గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఎకరా అధికారిక ధర రూ.కోటి వరకు (మార్కెట్ ధర రూ.రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా) ఉందనుకుందాం. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెండున్నర రెట్లకు పైగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సవరించిన చట్ట ప్రకారమైతే సంప్రదింపుల్లో నిర్ణయించిన ధరను రైతులు తప్పకుండా అంగీకరించాల్సిందే. తక్కువ ధరకే భూములు ఇచ్చేందుకు అంగీకరించినట్లు రైతుల నుంచి బలవంతంగా సంతకాలు సేకరించి భూములు తీసుకోవచ్చు. -
‘లూలూ’కు దాసోహం
సాక్షి, విశాఖపట్నం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన లూలూ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సాగిలాపడుతోంది. ఆ సంస్థ అడిగిందే తడవుగా విశాఖపట్నంలో రూ.వేల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేస్తోంది. ఇప్పటికే 13.83 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టిన ప్రభుత్వం తాజాగా మరో 2.22 ఎకరాలను అప్పగించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం బుధవారం భూసేకరణ నోటీసు జారీ చేసింది. విశాఖపట్నం సాగర తీరంలో ఏపీఐఐసీ గ్రౌండ్‌గా పేరొందిన 9.12 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. నిబంధనలకు పాతరేస్తూ.. యూఏఈకి చెందిన లూలూ గ్రూప్‌నకు ప్రభుత్వం ఈ టెండర్‌ను ఖరారు చేసింది. ఏపీఐఐసీ గ్రౌండ్‌కు, బీచ్ రోడ్డుకు మధ్యలో 3.40 ఎకరాల విస్తీర్ణంలో సీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది. తాము ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలంటే సీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన భూములు కూడా కావాలని లూలూ గ్రూప్ షరతు పెట్టింది. దీంతో సీఎంఆర్ గ్రూప్‌తో ప్రభుత్వం బేరసారాలు సాగించింది. సీఎంఆర్ గ్రూప్‌నకు 1:1.5 నిష్పత్తిలో ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని సర్కారు ప్రతిపాదించింది. ఆ మేరకు నగర పరిధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 4.85 ఎకరాలను సీఎంఆర్ గ్రూప్‌నకు కట్టబెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆ విధంగా సీఎంఆర్ గ్రూప్ నుంచి సేకరించిన 3.40 ఎకరాలను లూలూ సంస్థ పరం చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎకరా విలువ రూ.72.35 కోట్ల చొప్పున మొత్తం 12.52 ఎకరాల భూమి విలువ రూ.905.82 కోట్లుగా నిర్ధారించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. మార్కెట్ రేట్ ప్రకారం ఇక్కడ గజం రూ.లక్షకు పైగా పలుకుతోంది. లూలూ సంస్థకు కేటాయించిన భూముల విలువ అక్షరాలా రూ.3,000 కోట్ల పైమాటే. కానీ, ప్రభుత్వం మాత్రం ఏడాదికి కేవలం రూ.6.27 కోట్ల లీజుతో 12.52 ఎకరాలను లూలూ కు 33 ఏళ్లకు కట్టబెట్టడం గమనార్హం. అదనంగా కేటాయించిన భూమి(1.31ఎకరాలు) కూడా ఇదే ధరకు కేటాయించారు. 2.22 ఎకరాలు రూ.200 కోట్ల పైమాటే ఇప్పటికే కేటాయించిన 13.83 ఎకరాలు కూడా సరిపోవని, మరికొన్ని భూములు కావాలని లూలూ సంస్థ ప్రతిపాదించింది. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఏపీఐఐసీ, సీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన భూములకు ఆనుకొని ఉన్న మరో 2.22 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకు బుధవారం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. సర్వే నంబర్ 1011/1ఎ, 1ఎ3, ఎ1లలోని 73 సెంట్లు, 46 సెంట్లు, సర్వే నంబర్ 1011/1ఎ/1ఎ, 3ఎ1లోని 27 సెంట్లు, 53 సెంట్లు, 23 సెంట్లు కలిపి మొత్తం 2.22 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. భూసేకరణ చట్టం–2013 కింద ఈ భూములు సేకరించేందుకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 2.22 ఎకరాల భూమి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. లూలూ సంస్థకు విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారాయని అప్పట్లో విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు రూ.500 కోట్లు ముట్టాయని ఆరోపించాయి. ఈ నేపథ్యంలోహైకోర్టులో కేసు వేయడానికి వీల్లేకుండా లూలూ సంస్థ తరపున ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఇన్‌క్యాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా కేవియెట్ కూడా పొందారు. -
మా చట్టమే అనుసరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ రెండు చట్టాల ప్రకారం జరగబోతోంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) రోడ్లకు రాష్ట్ర భూసేకరణ చట్టం.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్ల నిర్మాణంలో కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించనున్నారు. రాష్ట్ర చట్టం ప్రకారం భూ సేకరణకు ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి ఉండటంతో కేంద్ర చట్టాన్నే అనుసరించాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఎన్హెచ్ఏఐ చేపడుతున్న రోడ్లకు భారీగా భూములు సేకరించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎన్‌హెచ్ రోడ్లకు రాష్ట్ర చట్టం ప్రకారమే భూమిని సేకరించనున్నారు. 3,500 హెక్టార్లు అవసరం.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టా న్ని గతేడాది సవరించింది. దీంతో సంప్రదింపులతో పరిహారం పెంచుకునేందుకు భూముల యజమానులకు అవకాశం కలిగింది. సాగు ప్రాజెక్టులకు వర్తింపజేస్తున్న ఈ చట్టాన్నే జాతీయ రహదారులకూ అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రం రూ.8 వేలకోట్ల వ్యయంతో కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసింది. వీటిని ఎన్హెచ్ఏఐ ద్వారా చేపడుతున్నారు. ఎన్హెచ్ఏఐ రోడ్ల విషయంలో అవసరమైన చోట్ల రోడ్ల ను 6 లేన్లకు విస్తరించాల్సి ఉండటంతో సేకరణ ఎక్కువగా ఉంటోంది. ఎన్‌హెచ్ రోడ్లకు 200 హెక్టార్ల సేకరణ సరిపోనుండగా ఎన్హెచ్ఏఐకి 3,500 హె క్టార్లు కావాల్సి వస్తోంది. రాష్ట్ర చట్టం ప్రకారం సేకరిస్తే రిజిస్ట్రేషన్ ధరకు మూడున్నర రెట్లు చెల్లించటంతోపాటు మరింత పెంచుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఎన్హెచ్ఏఐ రోడ్లకు కేంద్ర చట్టాన్నే అనుసరించాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు కొన్ని రోడ్లకు ఏది వీలుంటే అది అన్నట్లు రెండు చట్టాలు అనుసరిస్తుండటంతో కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఏదో ఒక చట్టాన్ని అనుసరించాలని కోర్టు పేర్కొంది. వె రసి ఎన్‌హెచ్ రోడ్లకు రాష్ట్ర చట్టం, ఎన్హెచ్ఏఐ రోడ్లకు కేంద్ర చట్టం అనుసరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రతి అడుగు రైతు కోసమే
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు అన్నదాతల సంక్షేమం కోసమేనని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో కంది కొను గోలు కేంద్రం ప్రారంభించారు. దాతల సహకారంతో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్లో విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ, రైతు పండించిన ప్రతీ గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.1,031 కోట్లతో 21 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశామని చెప్పారు. ఈసారి కందుల ఉత్పత్తి మరింత పెరిగిందనే ఆలోచనతో 106 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాదికన్నా క్వింటాకు రూ.400 అధికంగా పెట్టి అంటే రూ.5,450 మద్దతు ధరతో కొంటున్నామన్నారు. రైతులు 12 శాతం కన్నా తక్కువ తేమతో తేవా లని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. లాభసాటి వ్యవసాయం కోసం ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హరియాణా రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న ముభావంతు పథకం అమలు కోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ–నామ్ లైసెన్స్ విధానంతో లైసెన్స్ పొందిన కమీషన్ వ్యాపారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉత్పత్తులు కొనవచ్చన్నారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరుగుతోందని, ఫలితంగా రైతులకు లాభం కలుగుతుందన్నారు. కాలేజీలను కాపాడిన కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వ విద్యావిధానంపై ప్రజలకు నమ్మకం పోయే దశకు చేరుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు జీవం పోసి కాపాడింది కాంట్రాక్టు లెక్చరర్లేనని హరీశ్‌రావు కొనియాడారు. ఎన్నికల హామీలో భాగంగా వారిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు కొందరు కుట్ర పన్ని కోర్టుల్లో కేసులు వేశారన్నారు. అయినా ముఖ్యమంత్రి కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పేతో వేతనాలు అందచేసేలా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం.. ఇల్లంతకుంట(మానకొండూర్): ‘నిర్వాసితులెవ రూ అధైర్యపడొద్దు.. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటాం.. అన్నివిధాలా న్యాయం చేస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు అభయమిచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. మంత్రిని అనంతగిరివాసులు కలసి తమ సమస్యలు విన్నవించారు. అనం తరం హరీశ్‌రావు గ్రామస్తులతో మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లిస్తున్నామని, రిజర్వాయర్ నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు. 18 ఏళ్లు నిం డిన యువతకు ఇంటిస్థలం కేటాయిస్తామని, కుటుంబ ప్యాకేజీ రూ.12.50 లక్షలు చెల్లించి పునరావాసం కల్పిస్తామన్నారు. రిజర్వాయర్ లో చేపలు పట్టుకునేందుకు హక్కులు కల్పిస్తా మని చెప్పారు. ఇళ్ల కొలతలకు సహకరించాలని కోరారు. వీటన్నింటికీ అంగీకరిస్తే కలెక్టర్ పరి శీలించాక పక్షంరోజుల్లో పూర్తిస్థాయి పరిహారం చెలిస్తామన్నారు. నిర్వాసితులు కోరుకున్న చోటే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని వివరించారు. సిరిసిల్ల, అనంతగిరి, ఇల్లంతకుంటలో పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు నిర్వాసితు లు సంసిద్ధతను వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్‌తో అన్ని విషయాలపై చర్చిస్తామని నిర్వాసితులు మంత్రితో చెప్పారు. -
ఆ పరిహారంపై విచారణ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ సమయంలో రైతుల అభ్యంత రాల్ని తెలుసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూమి ని సేకరించే ముందు రైతులు, భూసేకరణ వల్ల ప్రభావితుల అభ్యంతరాల్ని తెలుసుకు న్న తర్వాతే పరిహారంపై విచారణ జరపాల ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను ఉల్లంఘించి పరిహార చెల్లింపు విచారణ చేయడం చెల్లదంటూ వేముల ఎల్లవ్వ మరో 22 మంది రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి శుక్రవారం విచారించారు. ‘‘భూసేకరణ చట్టంలోని 19(1) ప్రకారం రైతుల అభ్యంతరాలు తెలుసుకోకుండా పరిహార చెల్లింపు విచారణ చెల్లదు. రైతులతోపాటు భూసే కరణ వల్ల ప్రభావితమయ్యే వారి అభ్యంతరాల్ని కూడా స్వీకరించాలి’’ అని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయమూర్తి తేల్చి చెప్పారు. పిటిషనర్ల భూములే కాకుండా 600 మంది అభ్యంతరాల్ని అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ జరుపుతున్నారని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొండం, ముంచిప్ప చెరువులను కలుపుతున్న పనుల్లో ఆచితూచి వ్యవహరించాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి అధికారులకు మరో కేసులో ఆదేశాలు జారీ చేశారు. చెరువుల్ని కలపడం వల్ల రైతుల భూములతోపాటు అటవీ ప్రాంతం కూడా ముంపునకు గురవుతుందంటూ ముగుపాల్ మండలం ముంచిప్ప గ్రామస్తులు బానోతు ఈశ్వర్ సింగ్, మరో 60 మంది హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ 18కి వాయిదా పడింది. -
సీఆర్డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో బుధవారం సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు భూ సేకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. మూడు పంటలు పండే జరీ భూములను మెట్ట భూములుగా చూపించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రైతులు అడిగిన ప్రశ్నలకు సీఆర్డీఏ అధికారులు నోరు మెదపలేదు. దీంతో అధికారులు తీరుపై రైతులు మండిపడుతున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మీటింగులు పెట్టొద్దంటూ రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. -
భూ సేకరణ బిల్లుకు ఆమోదం
-
ప్రాణాలైనా ఇస్తాం..భూములివ్వం
తాళ్లపూడి: గోదావరి నదిపై నిర్మించనున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సర్వే పనులను రైతులు అడ్డుకోవడంతో తాళ్లపూడి మండలంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వే పనులను రైతులు అడ్డుకుంటారని ముందే ఊహించిన రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తుతో వచ్చారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. అధికారులు నేరుగా పోచవరం, రాగోలపల్లి, తాడిపూడి గ్రామాలకు చెందిన భూములను సర్వే చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు సర్వే పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మూడు గంటలపాటు రైతులకు పోలీసులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఎట్టకేలకు పోలీసులు సర్వే పనులను అడ్డుకుంటున్న రైతులను ఈడ్చుకుంటూ వెళ్లి జీపుల్లో పడేశారు. ఈ సందర్భంగా ఒకరిద్దరు రైతులు పురుగు మందు తాగుతామని డబ్బాలను చేతపట్టుకోవడంతో వెంటనే పోలీసులు వాటిని లాగేశారు. ప్రాణాలైనా ఇస్తాం కాని, భూములు మాత్రం ఇచ్చేదిలేదని రైతులు నినాదాలు చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా పైప్‌లైన్ నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం పోచవరం పంచాయతీలో 25 ఎకరాలు, తాడిపూడి పంచాయతీలో 29 ఎకరాలు సర్వే చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అయితే దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సబ్ డివిజన్ పరిధిలోని ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 100 మంది వరకు ఏఎస్సైలు, కానిస్టేబుళ్ల బందోబస్తుతో రెవెన్యూ అధికారులు, సర్వే బృందం పంట పొలాల్లోకి చేరుకుని సర్వే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న భూములు కోల్పోతున్న రైతులు సర్వే ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా రైతులు కాకర్ల వెంకటేశ్వరరావు, కాకర్ల మురళి,, బుల్లి సత్తులు, సతీష్, దుగ్గిరాల సత్యనారాయణ, గుల్లపూడి శివ, అనపర్తి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడుతూ పోచవరం గ్రామంలో ఉన్న తాము చిన్న, సన్నకారు రైతులమని, గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి భూములు కోల్పోయి ఉన్నామని, మరలా ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో మిగిలి ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం రైతుల అభిప్రాయాలను తెలుసుకోకుండా, పరిహారం విషయం అసలు తేల్చకుండా భూములు లాక్కోవడం పట్ల మండి పడ్డారు. చేలల్లో వరి, చెరకు తోటలు ఉన్నాయన్నారు. వరి చేలు కోత దశకు చేరుకున్నాయని తెలిపారు. భూములు ఇవ్వమని తేల్చిచెప్పారు. రైతులు ఎంతగా చెపుతున్నా పోలీసులు వినకుండా 23 మంది రైతులను (వీరిలో 8 మంది మహిళా రైతులు) అరెస్టు చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో భూముల సర్వే కొనసాగించారు. ఈ సందర్భంగా కొవ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ భూముల సర్వే నిమిత్తం ఆర్డీఓ పోలీసుల రక్షణ కల్పించాలని కోరారన్నారు. ఇన్చార్జి తహసీల్దార్ నాగలక్ష్మమ్మ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్ కె జాన్‌ప్రభాకర్, సర్వేయర్ జె కోటేశ్వరరావు సర్వే బృందంతో కలిసి భూములు సర్వే చేసి రాళ్లు వేశారు. రైతులకు మద్దతుగా తరలి వచ్చిన నాయకులు... చింతపూడి ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వబోమని అంటున్న రైతులకు మద్దతుగా మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కుంటముక్కల కేశవ నారాయణ, మండల యువజన విభాగం అధ్యక్షుడు వంబోలు పోసిబాబు, ఇతర నాయకులు అక్కడకు చేరుకుని తమ సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులతో పోలీసులు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రైతులకు ఎక్కడైనా అన్యాయం, అవమానం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకువెళతానన్నారు. -
‘సీఆర్డీఏ’లో భూసేకరణ తుది డిక్లరేషన్లు రద్దు
రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు సాక్షి, హైదరాబాద్: సీఆర్డీఏ పరిధిలోని 10 గ్రామాల్లో భూ సేకరణ నిమిత్తం కొత్త భూసేకరణ చట్టం కింద జారీ చేసిన తుది డిక్లరేషన్లను హైకోర్టు రద్దు చేసింది. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామ లింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ పరిధిలోని బోరుపాళెం, నేలపాడు, శాఖమూరు, లింగాయపాళెం, కృష్ణాయపాళెం గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు వేర్వేరుగా 15 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. తమ గ్రామాల్లోని వేల ఎకరాల భూములను ప్రభుత్వం సేకరిస్తోందని పిటిషనర్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఈ భూములను వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సంబంధిత అధికారుల ముందు ఈ అభ్యంతరాలను లేవనెత్తేందుకు పిటిషనర్లకు వెలుసుబాటు కల్పించారు. అభ్యంతరాలు విన్న తరువాత వాటిని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే రైతులు వాటిని కోర్టులో సవాలు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. -
న్యాయం కావాలి
♦ పోలవరం నిర్వాసితుల వేడుకోలు ♦ మూడేళ్ల స్థానికత నిబంధనతో అవస్థలు ♦ వివాహిత మహిళల పేర్లు ప్యాకేజీ జాబితా నుంచి తొలగింపు ♦ అక్రమాలు జరిగాయని యువతుల ఆవేదన కొత్త భూసేకరణచట్టంలో ఉన్న మూడేళ్ల స్థానికత నిబంధన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో వివాహమైన యువతుల పాలిట శాపంగా మారింది. పుట్టినప్పటి నుంచి గ్రామంలో ఉన్నా, 2006 సర్వేలో పేర్లు నమోదు అయినా,వివాహమైన యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింప చేయటం లేదు. పోలవరం : ఇటీవల రెవెన్యూ అధికారులు ముంపు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆర్అండ్ఆర్ అబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. జాబితాలో లేని వారి పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ గ్రామసభల సమయానికి జాబితాలో నమోదు చేసి ఉన్న వివాహిత యువతుల పేర్లు మాత్రం జాబితాల నుంచి తొలగించారు. వీరంతా ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. గ్రామసభల నాటికి మూడేళ్ల ముందు నుంచి గ్రామంలో ఉండాలనేది నిబంధన అని, వివాహమైనందున వారు గ్రామంలో ఉండరు కాబట్టి, వారి పేర్లు తొలగించామని అధికారులు చెబుతున్నారు. 2006 నుంచి ప్యాకేజీ కోసం ఎదురు చూశామని, ఇటీవలే వివాహం చేశామని, తీరా వివాహమైనందున ఆర్అండ్ఆర్ జాబితా నుంచి తమ పిల్లల పేర్లు తొలగించారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1200 మంది 18యేళ్లు పైబడిన యువతులు ఉండగా, వీరిలో దాదాపు 200 మంది యువతులకు గత రెండు లేదా మూడేళ్లలోపు వివాహాలయ్యాయి. వీరంతా ఈ నిబంధన కారణంగా ప్యాకేజ్ నష్టపోతున్నారు. గ్రామ సభల సమయంలో తమకు ప్యాకేజ్ వస్తుందని అధికారులు చెప్పారని, ఇపుడు పేర్లు తొలగించారని వివాహిత యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహమైనప్పటికీ కొందరి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. కొందరి పేర్లు ఎలా వచ్చాయి నాకు వివాహమైంది. గ్రామసభల్లో ప్యాకేజ్ జాబితాలో నాపేరు చదివి విని పించారు. ఆ తరువాత అధికారులు నాపేరు జాబితా నుంచి తొలగించారు.వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. వివాహమైన కొందరి పేర్లు ప్యాకేజ్ జాబితాలో ఎలా వచ్చాయి. – మూలెం రాజకుమారి, మాదాపురం, పోలవరం మండలం నాపేరు తొలగించారు... మాది పైడాకులమామిడి గ్రామం. నాకు వివాహమైంది. గ్రామసభల్లో నాపేరు చదివి వినిపించారు. ఆ తరువాత జాబితా నుంచి నాపేరు తొలగించారు. వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. ఇది అన్యాయం. ఇక్కడ పుట్టి, పెరి గిన వారికి ప్యాకేజ్ లేకుండా చేస్తున్నారు. – కొవ్వాసు బుచ్చమ్మ, పైడాకులమామిడి, పోలవరం మండలం -
‘కాళేశ్వరం’పై భిన్నాభిప్రాయాలు!
- ప్రాజెక్టులోని పలు రిజర్వాయర్లపై ప్రజాభిప్రాయ సేకరణ - కరీంనగర్లో సానుకూలం.. యాదాద్రి, నిజామాబాద్‌లో మాత్రం అభ్యంతరాలు సాక్షి, నిజామాబాద్, కరీంనగర్, యాదాద్రి: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ల పర్యావరణ అనుమతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ వర్గాల వారు సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయగా.. 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహారం ఇవ్వాలని, తొలుత నిర్వాసితుల సంగతి తేల్చాకే పనులపై ముందుకెళ్లాలని మరికొందరు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులోని గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో, కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా 93 మంది ప్రజాప్రతినిధులు, ముంపు బాధితులు, రైతులు, వివిధ వర్గాల వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇస్తున్న ప్యాకేజీని ఇక్కడి నిర్వాసితులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ప్రజాభిప్రాయ సేకరణను గంధమల్ల గ్రామస్తులు బహిష్కరించారు. అధికారులు తమ గ్రామానికే వచ్చి ఎటువంటి పరిహారం అందిస్తారో తెలియజేయాలన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కొండపోచమ్మ నిర్వాసితులకు ఇచ్చిన మాదిరిగానే తమకు కూడా పరిహారం చెల్లించాల ని మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని, సర్వం కోల్పోతున్న తమకు పూర్తిగా న్యాయం చేశాకే.. ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లాలని కోరారు. ఇక కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రేకుర్తిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా కాళేశ్వరానికి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
గెజిట్ నోటిఫికేషన్లను కోర్టు ముందుంచండి
భూసేకరణ చట్టం సవరణలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టం 2013కు సవరణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర భూసేకరణ నిబంధనలను తీసుకొచ్చే ముందు గెజిట్‌లో ముసాయిదా నిబంధనలను ప్రచురించారో లేదో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ విషయంలో స్పష్టత కోసం గెజిట్ నోటిఫికేషన్లను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర భూసేకరణ చట్ట నిబంధనల తుది నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధా న కార్యదర్శి ఆర్.వెంకటరాములు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అభ్యంతరాలు స్వీకరించలేదు... పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ముందు ముసాయిదా నిబంధనలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వారి అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాతనే తుదిరూపు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ అభ్యంతరాలు స్వీకరించకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... భూ సేకరణపై అభ్యంతరాలు పెం డింగ్‌లో ఉండగా జిల్లా కలెక్టర్ ఆయా భూముల యజమానులతో సేకరణ కు ఒప్పందం కుదుర్చుకోవచ్చా.. లేదా.. అన్న విషయంపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించతలపెట్టిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కోసం సిద్దిపేట జిల్లా తానేదార్పల్లి, తానేదార్పల్లి తాండా, మామిడ్యాల, భైలాంపూర్ గ్రామాల్లో రైతుల అభ్యంతరాలను పట్టించుకో కుండా భూసేకరణ చేయడంపై మామిడ్యాలకి చెందిన టి.శ్రీనివాస్ మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మన వూరి మెట్రో ఎంతెంత దూరం!
ఆస్తుల సేకరణలో తొలగని చిక్కులు పరిహారం చెల్లింపులో జాప్యం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పనులకు ఆస్తుల సేకరణ చిక్కులు తొలగడంలేదు. మియాపూర్–ఎల్బీనగర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం కారిడార్లలో ఇప్పటికీ 168 ఆస్తుల సేకరణ ప్రక్రియ జఠి లంగా మారడంతో పనులు మందగమనంలో సాగుతున్నాయి. నూతన భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలి సింది. మరికొన్ని చోట్ల న్యాయ వివాదాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. సోమవారం సచివాలయంలో మెట్రో పనులపై ఏర్పాటుచేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ఆస్తులను తక్ష ణం సేకరించి మెట్రో పనులకు మార్గం సుగమం చేయాలని చీఫ్‌సెక్రటరీ ఎస్పీసింగ్ హెచ్ఎంఆర్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో మున్సి పల్ పరిపాలన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి, హెచ్ఎం ఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తదితరులున్నారు. ఆస్తులు సేకరించాల్సిన ప్రాంతాలు.. ► బడీచౌడీ, సుల్తాన్‌బజార్, పుత్లీబౌలిలో 149 ఆస్తులను సేకరించాల్సి ఉంది. ఇందులో 6 ఆస్తులను అడ్డుతొలగించారు. మరో 19 ఆస్తుల సేకరణపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. మిగతా ఆస్తులను సేకరించాల్సి ఉంది. ► దుర్గం చెరువు వద్ద మెట్రో రైలు స్టేషన్ నిర్మాణానికి ఢిల్లీ వాలా స్వీట్స్ సహా మరో 6 ఆస్తులను అడ్డుతొలగించాల్సి ఉంది. ► జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్ మెట్రో రైల్‌స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల వద్ద 8 ఆస్తులను సేకరించాల్సి ఉంది. ► కృష్ణానగర్ వద్ద 5, చిక్కడపల్లి వద్ద 2 యూఎల్సీ స్థలాలను సేకరించాల్సి ఉంది. ► బేగంపేట్ మెట్రో రైలు స్టేషన్ నిర్మాణానికి వీలుగా కుందన్‌భాగ్ వద్ద ఆర్అండ్ బీకి చెందిన క్వార్టర్ నం.1 ఆస్తిని సేకరించాలి. పరిహారం చెల్లింపులో జాప్యం..? ఈ ఏడాది చివరికి నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గాలను మెట్రోపనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ జాప్యంగా మారడానికి బాధితులకు సకాలంలో పరిహారం అందజేయడంలో జాప్యం అవుతున్నట్లు తెలిసింది. సుల్తాన్ బజార్, బడీచౌడీ, కృష్ణానగర్‌లో ఆస్తుల సేకరణ కీలకంగా మారింది. ఆయా ఆస్తులను సేకరించనిదే మెట్రో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మార్గంలోని మెట్రో పనుల్లో ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి. -
‘రైతులకు అండగా జేఏసీ ఉంటుంది’
హైదరాబాద్: స్వచ్చంద భూసేకరణ ద్వారా రైతులు ఒప్పుకుంటే భూములు తీసుకోవచ్చు.. కానీ ఇష్టం లేకపోతే ఇబ్బంది పెట్టకూడదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. రైతు ఆమోదం లేకుండా బలవంతపు భూసేకరణ చేయరాదని, సామజిక వర్గాల వారికే అసైన్డ్ భూములు ఉన్నాయని, కానీ ప్రభుత్వం దీనికి విరుద్దంగా వాటిని లాక్కోవాలని చూస్తుందన్నారు. కొత్త చట్టం వస్తుందని భయపడనవసరం లేదని మీకు అండగా జేఏసీ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే అడ్వకేట్లు కూడా అండగా ఉంటారని అన్నారు. భూసేకరణ చట్టం- 2016 రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత రైతులు ఒప్పుకుంటే ఇస్తున్నారు.. ఇవ్వకపోతే కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా రైతులను బెదిరించి భూములను తీసుకుంటున్నారని అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి వారికి ఇష్టం ఉంటేనే భూములను తీసుకోవాలని సూచించారు. బలవంతపు భూసేకరణపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా చిన్న రైతులు.. రెండు మూడు ఎకరాలు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లాలలో 10 లక్షల ఎకరాల భూమి బలవంతగా లాక్కుంటున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మియాపూర్ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిలో రిజిస్టర్ పైఅధికారుల హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. -
ఆ సవరణ చట్టాన్ని ఆమోదించకండి
- ఆ సవరణ చట్టాన్ని ఆమోదించకండి - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏపీసీసీ నేతల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: నిర్వాసితుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా కేంద్ర భూసేకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఏపీసీసీ నేతలు కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, టి.సుబ్బిరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం బుధవారమిక్కడ రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. యూపీఏ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టంలో.. భూమి పోగొట్టుకొనే రైతులకే కాకుండా దాని మీద ఆధారపడ్డవారి ప్రయోజనాలు కాపాడేలా నిబంధనలు రూపొందించారని పేర్కొన్నారు. ఏపీ ప్రతిపాదించిన సవరణలు నిర్వాసితుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నందున సవరణ చట్టాన్ని ఆమోదించవద్దని రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. -
అమల్లోకి కొత్త భూసేకరణ చట్టం
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ► ఇక భూసేకరణ వేగవంతం ► 36 ప్రాజెక్టుల పరిధిలో 96 వేల ఎకరాల సేకరణకు మార్గం సుగమం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ పునరావాసం పునఃపరిష్కారంలో న్యాయమైన పరిహారం, పారదర్శకమైన హక్కు (తెలంగాణ సవరణ)–2016 బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం బుధవారమే ప్రభుత్వానికి అందింది. దీంతో వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణలో జాప్యాన్ని నివారించి బాధితులకు తక్షణ పరిహారం అందించేందుకు ప్రభుత్వం బిల్లును రూపొందించింది. గత ఏడాది డిసెంబర్ 28న బిల్లును అసెంబ్లీ, మండలి ఆమోదించాయి. అయితే బిల్లుకు సవరణలు సూచిస్తూ కేంద్రం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపింది. కేంద్రం చెప్పిన స్వల్ప సవరణలు చేసేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. గతనెల 30న ప్రత్యేకంగా ఉభయ సభలను సమావేశపరిచి సవరణలను ఆమోదించింది. అనంతరం కేంద్రం కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి గత శనివారం రాజముద్ర వేసి రాష్ట్రానికి పంపారు. దీంతో బిల్లు చట్టంగా మారింది. దీని ద్వారా ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల కోసం జరిపే భూసేకరణ ఇక సులభతరం కానుంది. బాధితులకు సకాలంలో న్యాయమైన పారదర్శకమైన పరిహారం లభిస్తుంది. ఈ చట్టంతో 36 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సి 96 వేల ఎకరాల భూసేకరణకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చట్టంలోని ముఖ్యాంశాలివీ.. ► కేంద్ర భూసేకరణ చట్టం–2013తో పాటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 123 జీవోలోని అంశాలే ఎక్కువగా ఈ కొత్త చట్టంలో ఉన్నాయి ► 2014 జనవరి 1 నుంచి ఈ చట్టం ప్రకారం భూసేకరణ అమల్లోకి వస్తుంది ► 2013 చట్టంలోని సామాజిక ప్రభావం, ప్రజా ప్రయోజన నిర్ధారణకు చేపట్టే ప్రాథమిక విచారణ అధ్యాయాన్ని తొలగించారు. దీంతో సామాజిక ప్రభావ మదింపు, పరిశోధన లేకుండానే భూసేకరణ చేపట్టే అధికారం రాష్ట్రం సొంతమవుతుంది ► ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే భూసేకరణకు ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్.. భూ యజమానితో సంప్రదింపులు జరిపి అమ్మకం ధర ఖరారు చేసుకుంటారు. దాని ప్రకారం గెజిట్ జారీ చేస్తారు. దాంతో నిర్వాసిత భూ యజమానుల హక్కులు ప్రభుత్వానికి ధారాదత్తమవుతాయి ► ఆ భూములు ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ అవుతాయి ► ఖరారు చేసుకున్న ధర ప్రకారం సహాయ పునరావాస, పరిహార మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి ► నిర్వాసితులకు అక్రమంగా డబ్బు చెల్లించినట్లు గుర్తిస్తే భూమి శిస్తు తరహాలో తిరిగి వసూలు చేసుకుంటారు ► ప్రభావిత కుటుంబాల జాబితాలో ఉన్న వ్యవసాయాధారిత కూలీలకు తగిన పరిహారం చెల్లిస్తారు. -
ఇది చీకటి రోజు
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్ట సవ రణ బిల్లును కేవలం మూడున్నర నిమిషా ల్లోనే ఆమోదింప చేసుకున్నారని, అంత తొందరపాటు ఎం దుకో అర్థం కావడం లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. కీలకమైన బిల్లుపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 2013 చట్టాన్నే అమలు చేసి రైతులు, నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటిరోజు అని విమర్శించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు టెర్రరిస్ట్ పాలనలా ఉం దని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ప్రాజె క్టులు పూర్తి చేయాలని లేదని, అవి ఆలస్యమైతే ఆ నెపాన్ని కాంగ్రెస్‌పైకి నెట్టేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రత్యేక సమావేశంలో పాల్గొనకుండా కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిని ఖమ్మంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సీఎంకు అన్నదాత ఆత్మహత్యలు కనిపించడం లేదా అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సంఖ్యా బలంతో అధికార పార్టీ దౌర్జన్యంగా బిల్లు పాస్ చేసుకుందని, రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. -
రచ్చ కోసమే వచ్చారు: హరీశ్
⇔ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై మంత్రి ధ్వజం ⇔ వారికి రైతు లబ్ధికంటే రాజకీయ లబ్ధి కావాలని విమర్శ ⇔ భూ సేకరణ చట్ట సవరణ బిల్లు పాస్ కావొద్దన్నదే వారి అభిమతం ⇔ కోర్టుల్లో ఇప్పటికే 38 కేసులు వేశారని మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘‘చర్చలో పాల్గొనాలి, భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడాలని కాంగ్రెస్‌కు ఏ కోశానా ఇష్టం లేదు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడాలని స్పీకర్ మూడుసార్లు అవకాశమిచ్చినా మాట్లాడలేదు. సభలోకి వచ్చుడు వచ్చుడే పోడియంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. మేం వచ్చింది చర్చ చేయడం కోసం కాదు, రచ్చ చేయడం కోస మని కాంగ్రెస్ నిరూపించుకుంది...’’ అని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. భూసేకరణ చట్టం అమల్లోకి వస్తే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతాయని, అదివారికి ఇబ్బందని కాం గ్రెస్ భావిస్తోందన్నారు. ఆదివారం మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నారదాసులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ సంఘాలు ప్రాజెక్టులపై ఇప్పటికే 38 కేసులు వేశాయని, హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి పనులు అడ్డుకుంటున్నాయని హరీశ్ మండిపడ్డారు. రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే బిల్లు పాస్ కాకుండా అడ్డుకోరన్నారు. చట్టం అమలయితే కాంగ్రెస్ వేసిన కేసులను కొట్టేస్తారని, వాటికి విలువ ఉండదని, వారి ఆటలు సాగవని ఆ పార్టీ రైతు వ్యతిరేకిగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. బిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నారు 2013 భూ సేకరణ చట్టంకంటే ఎక్కువ పరిహారమిస్తామని బిల్లులో చెప్పామని.. వేగవంతమైన భూ సేకరణ ప్రక్రియ కోసమే చట్టం తెస్తున్నామని హరీశ్ చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే ఈ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని లేకుంటే 2013 చట్ట ప్రకారమే పరిహారమిస్తామని ప్రకటించినా కాంగ్రెస్ నేతలుబిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నారని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను ఒక్కటీ పూర్తిచేయలేదని, ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదన్నారు. కానీ రెండున్నరేళ్ల తమ పాలనలో కొత్తగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న తపన తమదని, వ్యక్తుల కోసం కాంగ్రెస్ భూ సేకరణ చేస్తే తమ ప్రభుత్వం రైతులు, ప్రాజెక్టులు, సమాజం కోసం భూ సేకరణ చేస్తోందని హరీశ్ వివరించారు. టీడీపీ హయాంలో 11,604 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 23,406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వ్యవసాయానికి 40 శాతం బడ్జెట్ రైతును రాజును చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో 40 శాతం నిధులు కేటాయించిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్ర మేనని హరీశ్ వివరించారు. రుణమాఫీ, మిషన్ కాకతీయ, గోదాముల నిర్మాణం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, కొరత లేకుండా విత్తనాలు, ఎరువుల పంపిణీ, వచ్చే ఏడాది నుంచి ఆర్థిక సాయం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏటా రూ. 25 వేల బడ్జెట్ వంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నామన్నారు. ఎక్కువ ధరలే చెల్లిస్తున్నం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని హరీశ్ విమర్శించారు. ఉల్లి ధర పడిపోతే తాము 2.30 లక్షల క్వింటాళ్లను రైతుల పొలాల దగ్గరే కొన్నామన్నారు. కందుల సేకరణలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని, 21 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశామని, మొక్క జొన్న, వేరుశనగ, పత్తి, వరి పంటలకు ఎంఎస్పీ కంటే ఎక్కువే చెల్లించి కొనుగోలు చేశామన్నారు. తాలు రకం మిర్చికి రూ. 1,900 నుంచి రూ. 2,300 చెల్లించారని, గుంటూరులో దాని ధర రూ. 1,700 నుంచి రూ. 1,900 మాత్రమేనన్నారు. ఏపీ, కర్ణాటకలో పండిన మిర్చి కూడా వరంగల్, ఖమ్మం మార్కెట్లకు వస్తోందని, రైతును ఆదుకునేందుకు ప్రయత్ని స్తున్నామని, ఈ ఒక్క అంశాన్ని పట్టుకుని రాజకీయం చేస్తే కాంగ్రెస్‌ను నమ్మరన్నారు. రాజకీయం చేస్తామంటే ఎట్లా? ‘‘భూ సేకరణ బిల్లుకు సవరణలు చేయాలనుకున్నాం. ఈ సమావేశం పెట్టిందే దాని కోసం కదా. అది మాట్లాడకుండా ఇతర విషయాలు మాట్లాడతాం.. రాజకీయం చేస్తాం అంటే ఎట్లా ..’’ అని కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశం ముగిశాక లాబీల్లో ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఒక వ్యూహం ఉంటే తమకూ ఓ వ్యూహం ఉంటుందన్నారు. కేంద్రం సూచించిన సవరణలు చేయడానికే సభ అయినప్పుడు ప్రత్యేకంగా సవరణలపై మాట్లాడేది ఏముంటుందని ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినా బయటకు వెళ్లి పోవాలనుకుంటే ఏం చేస్తామన్నారు. కేవలం పది నిమిషాల్లోనే సమావేశం ముగియడంపై స్పందిస్తూ అతిఎక్కువ సమయం సభ నడిపిన ఘనత, అతితక్కువ సమయం నడిపిన రికార్డూ తమదేనన్నారు. -
భూసేకరణ చట్ట సవరణలివే..
మొత్తం ఐదింటికి ఆమోదం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సూచిం చిన మూడు సవరణలతో భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదించింది. అభివృద్ధి పనుల భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయో జనం కలిగించేందుకు ఈ బిల్లును తీసుకొ చ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదిస్తూ కొన్ని సవరణలను సూచిం చింది. ప్రాజెక్టులు, ఇతర ప్రజోపయోగమైన అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సామాజిక ప్రభావ అంచనా(సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) పేరిట కాలయాపన లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఇందుకు చట్టంలోని కొన్ని సాంకేతిక అంశాలను.. అది కూడా పదాల కూర్పులో కొన్ని మార్పులను సూచించింది. బిల్లులో పేర్కొన్న ముఖ్యమైన అంశాలపై కేంద్రం సానుకూలంగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం సూచించిన మేరకు మూడు సవరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటికి భూసేకరణ చట్టంలో చోటు కల్పించేందుకు సాంకేతిక కారణాలతో మరో రెండు చిన్న సవరణలను జోడించింది. మొదటి సవరణ ఇది టైటిల్లో పదాల మార్పునకు ఉద్దేశించి నది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకు విఘా తం కలగకుండా చట్టం అమలు చేసేందుకు టైటిల్లో పదాల మార్పు చేసింది. రెండో సవరణ ఎప్పట్నుంచి చట్టం అమలవుతుందనే విషయంలో స్పష్టతనిచ్చేందుకు ఈ సవరణ చేశారు. ఈ చట్టం 2014 జనవరి 1 నుంచి గానీ, నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నాటి నుంచి కానీ అమలవుతుందని పాత బిల్లులో పేర్కొన్నారు. 2014 జనవరి 1 నుంచి ఈ చట్టం ప్రకారం భూ సేకరణ జరపాలని నిర్ణయించింది. మూడో సవరణ చట్టంలోని క్లాజ్ 6ను తొలిగించింది. 2013 చట్టం ప్రకారం.. కలెక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చే ముందు భూమి ధరను రివైజ్ చేసుకోవాలి. 2016 చట్టంలోని 6వ క్లాజ్ ప్రకారం.. భూమి ధర తెలుసుకుని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. చట్టంలో ఈ క్లాజ్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందుకు అనుగుణంగా సవరణ చేశారు. నాలుగో సవరణ క్లాజ్ 7, క్లాజ్ 8లో మార్పులు. 2013 చట్టంతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం లేకుండానే పునరావాసం కోసం పరి హారం ఇవ్వాలి. ప్రభావిత కుటుం బాల జాబితాలో వ్యవసాయాధారిత కూలీలు కూడా ఉంటారు. వారికి కూడా తగిన పరిహారం చెల్లించాలని తాజాగా చేర్చారు. అయిదో సవరణ క్లాజ్ 10 తొలగింపు. 2013 చట్టం ప్రకారం.. అత్యవసరం అనుకునే పనుల కోసం కలెక్టర్లు అవార్డు పాస్ చేసి భూ సేకరణ జరపవచ్చు. దానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వ అనుమతి ఉంటే చాలు. 2016 చట్టం ప్రకారం.. 2013 చట్టంలో కల్పించిన వెసులుబాటునే రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచినా.. కేంద్రం ఈ క్లాజ్ అవసరం లేదని చెప్పింది. దీంతో ఈ క్లాజ్ తొలగించారు. -
‘చర్చకు రాలేదు రచ్చకు వచ్చారు’
-
‘చర్చకు రాలేదు..రచ్చకు వచ్చారు’
- శాసనసభలో కాంగ్రెస్ తీరుపై హరీష్ రావు మండిపాటు - బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి - కర్నాటకలో ఆరు గంటలే మేం తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తున్నాం హైదరాబాద్‌సిటీ: శాసనసభలో కాంగ్రెస్ తీరుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. "మేం చర్చకు రాలేదు రచ్చకు వచ్చాం" అన్నట్టుగా కాంగ్రెస్ సభలో ప్రవర్తించిందని మంత్రి విమర్శించారు. మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ గా చేసిన మల్లు భట్టి విక్రమార్కకు అసెంబ్లీ నిబంధనలు తెలియవా? అని ప్రశ్నించారు. స్పీకర్ మైక్ ఇస్తామన్న తీసుకోకుండా వారు తమ ఉద్దేశం ఏమిటో చాటారని అన్నారు. ఇప్పటికే సాగు నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ 38 కేసులు వేసిందని వివరించారు. ఈ రోజు అసెంబ్లీ మండలి ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ కేసులు రద్దయితాయని కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు తొందరగా పూర్తి కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. తాజా చట్టంతో భూములు కోల్పోయిన వారికి మంచి పరిహారం వస్తుందన్నారు. పోలెపల్లి సెజ్‌లో ఎకరానికి ఇచ్చిన పరిహారం 60 వేలు మాత్రమేనని గుర్తు చేశారు. బీజేపీ నేతలు ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని కేంద్రంతో పోట్లాడి తెలంగాణాకు న్యాయం చేయాలని సూచించారు. దత్తాత్రేయ గురించి మాట్లాడుతూ నువ్వు మాట్లాడాల్సింది నిజామాబాద్‌లో కాదు ...ఢిల్లీలో మాట్లాడాలని కోరారు. ముదిగొండలో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పాలన కాదా ? అని ప్రశ్నించారు. మీరు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పలేదా ? సూటిగా అడిగారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఆరు గంటల కరెంట్ ఇస్తున్న మాట నిజం కాదా ? అని ప్రశ్నించారు. ఏం చేసినా కాంగ్రెస్‌ను రైతులు నమ్మే పరిస్థితి లేదని, పారిశుధ్య కార్మికుడి నుంచి పారిశ్రామిక వేత్త దాకా అందరి బాగోగులు పట్టించుకుంటున్న ప్రభుత్వం మాది చెప్పుకొచ్చారు. -
గవర్నర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌తో ఆదివారం సమావేశమయ్యారు. శాషనసభలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడంపై గవర్నర్‌కు ఫిర్యదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ స్పీకర్ మధుసూధనాచారితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కేవలం ఏడు నిమిషాల్లోనే బిల్లును ఆమెదించారని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ భూసేకరణ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతుల జీవితాల్ని నిర్ణయించే భూసేకరణ బిల్లును ఏడు నిమిశాల్లో ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సంప్రదాయాలను తీసుకొస్తోందని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. -
‘భూసేకరణ ద్వారానే తీసుకుంటాం’
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న స్టార్టప్ ఏరియా నిర్మాణానికి అవసరమైన భూముల్ని భూసేకరణ ద్వారానే తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రైతుల భూముల్ని ల్యాండ్‌పూలింగ్ ద్వారా గానీ లేదా భూసేకరణ చట్టం కింద గానీ తీసుకోకుండా టెండర్ నోటిఫికేషన్లో చేర్చడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇక సర్కారీ భూకబ్జా!
-
ఇక సర్కారీ భూకబ్జా!
► కేంద్ర భూ సేకరణ చట్టం–2013కు రాష్ట్ర సర్కారు తూట్లు ► అసెంబ్లీలో పెట్టకుండానే ఆర్డినెన్స్ వైపు అడుగులు ► అసెంబ్లీలో చర్చకు పెడితే ప్రతిపక్షం నిలదీస్తుందని దొడ్డిదారి యత్నాలు ► సామాజిక ప్రభావ అంచనాకు స్వస్తి ► 70 శాతం రైతుల ఆమోదం నిబంధన తొలగింపు ► రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపిన వైనం ► ప్రభుత్వ తీరుపై అధికార వర్గాలు, మేధావుల్లో ఆందోళన సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల ముసుగులో రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల రైతుల భూములను లాక్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర ఆర్డినెన్స్ తీసుకు రావడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఏకంగా కేంద్ర భూసేకరణ చట్టం – 2013కు సవరణలు చేయాలని నిర్ణయించింది. భూ సేకరణకు చట్టం ఉండగా, అర్డినెన్స్ తీసుకు రావడం అనేది విరుద్ధమని తెలిసినా.. ఈ చట్ట స్ఫూర్తిని దెబ్బ తీస్తూ.. ప్రాజెక్టులు, రహదారుల సాకుతో చట్ట సవరణకు పూనుకుంది. అసెంబ్లీ ఆమోదంతో చట్ట సవరణ చేస్తే ఇందులో లోగుట్టు రట్టు అవుతుందని, ప్రభుత్వ పెద్దల నిర్వాకాన్ని ప్రతిపక్షం నిగ్గదీస్తుందనే భయంతో తెరచాటున చట్ట సవరణకు ఆగమేఘాలపై అడుగులు వేస్తోంది. నేరుగా గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని న్యాయ శాఖ సలహా కోరింది. ఇది కేంద్ర చట్టం అయినందున సవరణ ఆర్డినెన్స్ జారీ చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని తెలియడంతో రాష్ట్రపతికి పంపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఢిల్లీలో ఈ పని త్వరగా అయ్యేలా మంత్రాంగం నెరుపుతోంది. భూ యజమానులైన రైతులకు రక్షణ కవచంలా, సామాజిక.. పర్యావరణ సమతుల్యానికి అండగా ఉన్న ఈ చట్టానికి తూట్లు పొడిచి అయిన వారికి భూపందేరం చేయడానికి ఎదురే లేకుండా చేసుకుంటుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. న్యాయబద్ధమైన నష్టపరిహారంతోపాటు పునరావాస, పునర్నిర్మాణ రక్షణ హక్కులను చట్టం పరిధిలోంచి తొలగించడం విపరీత పరిణామాలకు దారితీస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టంలోని అతి ముఖ్యమైన సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని తొలగిస్తూ.. ప్రభుత్వ పెద్దల అనుకూల అంశాలను చేరుస్తూ కేంద్ర భూసేకరణ చట్టం –2013కు సవరణలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయం వెలువడగానే చకచకా ఫైలు సిద్ధం అయి ఢిల్లీ వెళ్లింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖల ద్వారా త్వరగా ఆమోదముద్ర వేయించి రాష్ట్రపతి కార్యాలయానికి చేరవేసే బాధ్యతను రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రికి ప్రభుత్వ అధినేత అప్పగించారు. దీనిని బట్టి ఈ ఆర్డినెన్స్‌ను అతి త్వరగా జారీ చేయాలని ప్రభుత్వ పెద్దలు తహతహలాడుతున్నట్లు తేటతెల్లమవుతోంది. ఎందుకంత తొందరంటే.. వచ్చేనెల ఆరో తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కాలంలో ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీలుకాదు. అసలు ఆర్డినెన్సు అంటే.. అసెంబ్లీ సమావేశాలు లేనందున అత్యవసర అంశాలపై గవర్నర్ ఆమోదంతో జారీ చేసే ఉత్తర్వు. అసెంబ్లీ సమావేళాలు ఉన్న సమయంలో బిల్లు ప్రవేశపెట్టి సభ ఆమోదంతో చట్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర భూసేకరణ సవరణ చట్టం – 2013 సభలో ప్రతిపాదిస్తే రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టే ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దేశంలోనే రైతులకు అత్యంత ఉపయుక్తమైన, న్యాయబద్ధమైన పరిహారం ఇచ్చే చట్టాన్ని సవరించాలనే ప్రతిపాదనలోని లోగుట్టును ఎత్తిచూపుతుంది. దీనివల్ల ప్రజలకు, రైతులకు సర్కారు కుట్ర తెలిసిపోతుంది. ఇది ఇష్టం లేకే దొడ్డిదారిన ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం పెద్దలు ప్రయత్నాలు సాగిస్తోంది. త్వరగా ఆర్డినెన్స్ తెచ్చి రైతుల మెడపై కత్తి పెట్టి రాష్ట్రంలో ఏడు లక్షల ఎకరాలను లాక్కోవాలన్నదే సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక అవసరాలు సాకుగా రాష్ట్రంలో పది లక్షల ఎకరాలతొ ల్యాండ్ బ్యాంక్ (భూ నిధి) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూములను సేకరించింది. మిగిలిన ఏడు లక్షల ఎకరాలు రైతుల నుంచి లాక్కుని తమకు కావాల్సిన పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా, కారు చౌకగా కట్టబెట్టాలన్నదే ప్రభుత్వ పెద్దల ఆలోచన. తిరుపతిలో ఒక ప్రాజెక్టు, అమరావతిలో ‘సాగరమాల’ అనే మరో ప్రాజెక్టుకు అత్యంత విలువైన భూములను రోడ్డు నిర్మాణాలు సాకుగా అవసరాలకు మించి కొట్టేయాలని నేతలు నిర్ణయించుకోవడం దీని వెనుక అసలు రహస్యమని అధికారులు అంటున్నారు. ఆర్డినెన్స్ సరికాదు ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. దీనిని సవరించాలంటనే రాష్ట్ర చట్టసభలు మొదట ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలి. రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఈ చట్టం అమలు చేయడానికి వీలవుతుంది. ఇంతటి కీలకమైన చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా హడావుడిగా ఆర్డినెన్సు తేవాలని సర్కారు ప్రయత్నించడం దారుణమని పలువురు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘అసలు ఆర్డినెన్స్ అనే పదం ఉచ్ఛరించాలంటేనే ఇబ్బందిగా ఉంది.. దీనిని రాష్ట్రపతి ఆమోదిస్తారనే నమ్మకం నాకైతే లేదు. కచ్చితంగా రాష్ట్రపతి దీనిని తిప్పి పంపుతారు’ అని రెవెన్యూ వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన ఉన్న రిటైర్డు ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రైతుల భూములతో వ్యాపారమే లక్ష్యం కేంద్ర భూసేకరణ చట్టం – 2013కు సవరణ వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం ఉందని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉన్న ప్రాంతాల్లో రహదారులు, రైల్వే మార్గాల ఇరువైపులా కిలోమీటరు పరిధిలో భూములను సేకరించాలనే ప్రతిపాదన ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు అనంతపురం – అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భారీగా భూములు సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రోడ్డు నిర్మాణానికి సరిపడా కాకుండా అధికంగా సేకరించి రోడ్డు అందుబాటులోకి వచ్చి విలువ పెరిగిన తర్వాత దానిని కొట్టేయాలని నేతలు భావిస్తున్నారు. పోర్టులను, పారిశ్రామిక కారిడార్‌ను కలుపుతూ నిర్మించ ప్రతిపాదించిన ‘సాగరమాల’ ప్రాజెక్టుకు కూడా అవసరాలకు మించి రెట్టింపు భూసేకరణ చేయాలని ప్రయాళికలు రూపొందిస్తున్నారు. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత సామాజిక ప్రభావ మదింపు ఉండదు. సంప్రదింపుల పేరుతో రైతులను బెదిరించి ఒప్పించడం ద్వారా ఎంతో కొంత చెల్లించి భూములు లాక్కోవాలని సర్కారు పెద్దలు యోచిస్తున్నారు. రైతులతో సంప్రదింపుల ద్వారా మార్కెట్ ధర చెల్లించి ఆయా జిల్లా కలెక్టర్లు భూములను తీసుకోవచ్చుననే నిబంధనను తాజా సవరణలో పేర్కొన్నారు. రైతుల రక్షణ కవచానికే ఎసరు భూ యజమానులకు కేంద్ర భూసేకరణ చట్టం – 2013లో రక్షణ కవచాల్లా ఉన్న నిబంధనలను తొలగించడమే రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ప్రధానోద్దేశం. ఏదైనా ప్రాంతంలో ప్రైవేట్ సంస్థల కోసం భూమి సేకరించాలంటే భూ యజమానుల్లో కనీసం 80 శాతం మంది, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ప్రాజెక్టులకైతే 70 శాతం మంది భూ యజమానుల ఆమోదం తప్పనిసరి అని కేంద్ర చట్టంలో ఉంది. భూసేకరణ వల్ల పర్యావరణ పరంగా, ఉపాధి పరంగా భూ యజమానులు, కూలీలపై పడే ప్రభావాన్ని మొదట అంచనా వేయాల్సి ఉంటుంది. తదుపరి ముందస్తు నోటిఫికేషన్ జారీ చేసి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, పైన పేర్కొన్న మేరకు కనీస యజమానుల అనుమతి ఉంటేనే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని, లేనిపక్షంలో విరమించుకోవాలని కేంద్ర చట్టం చెబుతోంది. దీని ప్రకారం అయితే రాజధాని ప్రాంతాల్లో భూసమీకరణ కింద భూములు ఇవ్వని పెనుమాక, ఉండవల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో రైతుల నుంచి 5700 ఎకరాలను తీసుకోవడం సర్కారుకు సాధ్యం కాదు. ఎందుకంటే ఈ గ్రామాల్లో అత్యధిక శాతం రైతులు భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూసేకరణ సర్కారు పెద్దల కలగా మారింది. రహదారులు, ఇతర ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ/ సమీకరణకు కూడా ఈ నిబంధన పెద్ద అడ్డుగా మారింది. అందువల్ల ఈ నిబంధనను ఎలాగైనా తొలగించి వెంటనే బలవంతంగా భూములు లాక్కోవాలనే లక్ష్యంతో ఆర్డినెన్స్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రక్షణ సంస్థలకు సంబంధించిన భూసేకరణకు మాత్రమే సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు ఉంది. అయితే ప్రజా అవసరాల పేరుతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు, కాలువలు, విద్యా సంస్థలు, గృహాల నిర్మాణాలకు సేకరించే భూములకు సామాజిక ప్రభావ అంచనాను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందాలని రాష్ట్ర సర్కారు కేంద్రానికి ప్రతిపాదన పంపింది. రాష్ట్రపతి అనుమతించిన వెంటనే గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. కాగా, ప్రస్తుతానికి ఇలాంటి వాటికి మినహాయింపులు కోరినా భవిష్యత్తులో అన్నింటికీ ఇదే తరహాలో చేసే ప్రమాదం ఉందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇప్పటికైనా ఆలోచిస్తారా?
సామాన్యులకు రంగుల ప్రపంచాన్ని వాగ్దానం చేసి, ఆశల్ని కల్పించి అందల మెక్కుతున్నవారు క్రియకొచ్చేసరికి వారిని దగా చేస్తున్న దాఖలాలు దేశంలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకొచ్చి ఆర్నెల్లు దాటకుండానే 2013 నాటి భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది మురిగిపోయిన ప్రతిసారీ ప్రాణప్రతిష్ట చేస్తూ మూడుసార్లు సరికొత్త ఆర్డినెన్స్‌లు పుట్టించింది. చివరకు బిహార్ ఎన్నికలు ముంగిట్లోకొచ్చాక, ప్రజానీకంనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యాక అయిష్టంగానే ఆ వ్యవహారానికి స్వస్తి చెప్పింది. ఆ చట్టం సరిగా లేదనుకుంటే రాష్ట్రాలే మార్పులు చేసుకోవచ్చు నంటూ 2015 జూలైలో జరిగిన నీతిఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పాక చాలా రాష్ట్రాలు ఆ పనిలోబడ్డాయి. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు అందరి కన్నా ముందున్నాయి. ఉమ్మడి హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలుపుదల చేసిన జీవో 123 అలా పుట్టుకొచ్చిందే. తెలంగాణ సర్కారు 2015 జూలైలో తీసుకొచ్చిన ఈ జీవో అయినా... ఈమధ్యే శాసనసభ ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర భూసేకరణ (సవరణ) బిల్లు–2016 అయినా మురిగిపోయిన కేంద్ర ఆర్డినెన్స్‌కు దగ్గరవే. ఇలాంటి బిల్లునే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని మొన్న ఆగస్టులో చట్టంగా మార్చుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ సర్కారు మాయ చేయడంలో అందరినీ మించిపోయింది. భూసమీ కరణ పేరుతో రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నట్టు ప్రచారం చేసుకుని ఇప్పటికే 34,000 ఎకరాలు తన ఖాతాలో వేసుకుంది. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో పది లక్షల ఎకరాల భూమిని ఒడిసి పట్టి ‘ల్యాండ్ బ్యాంక్’ను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ తంతు ఎలా సాగబోతున్నదో అమరావతి ప్రాంత రైతుల దీనావస్థను చూసినా... తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ సంస్థ కోసం 500 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు జారీ చేసిన జీవోను గమనించినా, పశ్చిమగోదావరిలో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరే కిస్తున్న పల్లెలపై అమలవుతున్న నిర్బంధాన్ని చూసినా అర్ధమవుతుంది. ప్రజా ప్రయోజనం పేరిట ఈ దేశ పౌరులపై దాదాపు ఏడు దశాబ్దాలుగా స్వారీ చేసిన 1894 నాటి భూసేకరణ చట్టం కోట్లాదిమందిని నిర్వాసితులుగా మార్చింది. ఒకసారి ప్రభుత్వం దేనికైనా ‘ప్రజా ప్రయోజనం’ ముద్రేస్తే ఆ ముసు గులో విలువైన పంట భూముల్ని, జనపదాల్ని, అరణ్యాలను, కొండప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఆ చట్టం లైసెన్స్నిచ్చేది. పర్యవసానంగా ఆయా ప్రాంతాల వనరులను వినియోగించుకునే, వాటి ఆధారంగా ఉపాధి పొందే లక్ష లాదిమంది జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. ఇందులో అధిక శాతంమంది ఆది వాసీలు, దళితులు, నిరుపేద గ్రామీణులు, బక్క రైతులే. తమ చర్యల కారణంగా సర్వస్వం కోల్పోతున్నవారిని ఆదుకోవాలన్న స్పృహ కూడా ప్రభుత్వాలకు లేక పోయింది. ఒక అంచనా ప్రకారం స్వాతంత్య్రానంతరం ఆ చట్టం వల్ల నిర్వాసి తులైనవారి సంఖ్య 6 కోట్లపైమాటే! వారిలో కనీసం 20 శాతంమందికి కూడా ఇప్పటివరకూ పునరావాసం దక్కలేదు. అంతక్రితం మాటేమోగానీ నర్మదా బచావో, పోస్కో ఉద్యమాలు ఈ నిలువుదోపిడీని నిలదీశాయి. నేలతల్లితో తమ పేగుబంధాన్ని తెంచుతున్న దుష్ట పోకడలపై సింగూరు, నందిగ్రామ్, భట్టాపర్సాల్ వంటి చోట్ల బడుగు జీవులు, బక్క రైతులు తిరగబడ్డారు. తమ ప్రాణాలొడ్డి ప్రతిఘ టించారు. ఈ పరిణామాలన్నిటి తర్వాత ఆ చట్టం మార్చాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయినా ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత 2013లోగానీ కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి రాలేదు. ఈ చరిత్రంతా గమనిస్తే 2013 చట్టం పాలకుల భిక్ష కాదని, అది అసహా యులైన ప్రజానీకం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న హక్కని అర్ధమవుతుంది. నిజానికి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టంపై మొదట్లో తానిచ్చిన హామీల నుంచి వెనక్కు తగ్గింది. బిల్లు రూపకల్పన దశలో ఉన్న కొన్ని మంచి అంశాలు పార్లమెం టులో ప్రతిపాదించేనాటికి మాయమయ్యాయి. మరికొన్ని నీరుగారాయి. పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతంమంది ఆమోదిస్తేనే భూసేకరణ ఉంటుందన్న నిబంధన కాస్తా భూమిని కోల్పోయేవారిలో 80 శాతంమంది ఆమోదం సరిపోతుందని మారింది. ఒక పరిశ్రమ ఏర్పాటైనప్పుడు నేరుగా నష్టపో యేది భూ యజమానులే అయినా ఆ ప్రాంతంలో నివసించేవారు, అక్కడ జీవించే వారి పరిస్థితేమిటన్నది 2013 చట్టం పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం 5 కేటగిరీల కింద, ‘ఇతర ప్రజా ప్రయోజనాల’కింద స్వాధీనం చేసుకుంటే ఇవేమీ వర్తించవు. ఆ చట్టమే పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదనుకుంటుంటే...దాని స్థానంలో వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలైనా, బిల్లులైనా అందులోని మంచి అంశాలను సైతం మింగేస్తున్నాయి. సామాజిక ప్రభావ మదింపు (ఎస్ఐఏ), రెండు లేదా అంతకుమించి పంటలు పండే భూముల సేకరణపై ఉన్న ఆంక్షలను బేఖాతరు చేస్తున్నాయి. గుజరాత్ చట్టం చూసినా, తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బిల్లు చూసినా వాటి మూలాలు ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో కనబడ తాయి. గుజరాత్ తెచ్చిందని, కర్ణాటక తీసుకురాబోతున్నదని వాదిస్తూ తమ చర్యకు సహేతుకత కోసం సాగునీటి మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలా చెప్పి ఆయా పార్టీల వారిని నోరుమూయించ వచ్చునే మోగానీ జనం నోళ్లెలా మూయిస్తారు? అలా వాదించడానికి ముందు ఈ మాదిరి అంశాలే ఉన్న కేంద్ర ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమ య్యాయో, చివరికది చట్టంగా ఎందుకు రూపుదిద్దుకోలేదో తెలుసుకుంటే మంచిది. ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలను గమనించాకైనా తెలంగాణ ప్రభుత్వం తన చర్యలను పునఃసమీక్షించుకోవాలి. రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజానీకం చేస్తున్న ఆందోళనలను సానుభూతితో అర్ధం చేసుకోవాలి. -
కేంద్రానికి భూ సేకరణ చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూ సేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గవర్నర్ ఆమోదం అనంతరం చట్టాన్ని కేంద్ర హోం శాఖకు పంపినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కేంద్ర హోం, న్యాయ శాఖల పరిశీలన తర్వాత రాష్ట్రపతి అమోదానికి వెళ్తుందని గురువారం అసెంబ్లీలో పేర్కొ న్నారు. గుజరాత్ తన అవసరాల మేరకు చట్టం తెచ్చుకుందని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ అవసరాల మేరకు మార్పుచేర్పులతో చట్టం తెచ్చామన్నారు. ‘గుజరాత్‌ను పోలిన చట్టమే కనుక తెలంగాణ భూ సేకరణ చట్టానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని భావిస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలోనూ ఇక్కడి తరహా ప్రయోగం చేయబోతున్నారు’’ అన్నారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నేతలు మా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. ‘ప్రాజెక్టులు, భూ సేకరణలపై కోర్టుల్లో మొత్తం 32 కేసులు పడితే వాటిలో కాంగ్రెసే 12 కేసులు వేసింది. మిగ తా 20 కేసులను వెనకుండి వేయించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కేసులు వేయించేందుకు కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సంతకాలు చేయించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలే కేసులు వేశారు. వారెవరిదీ సెంటు భూమి కూడా ముంపులో పోవట్లేదు’ అన్నారు. ఈ కొత్త చట్టం ప్రజోపయోగకరమైన ప్రాజెక్టులన్నింటికీ వర్తింస్తుందన్నారు. పొంగులేటి వర్సెస్ హరీశ్ హరీశ్ మీడియాతో మాట్లాడుతుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అటుగా రావడంతో భూ సేకరణపై వారి మధ్య సంభాషణ జరిగింది. కాంగ్రెస్ నేతలకు చెందిన సెంటు భూమి కూడా ఎక్కడా ముంపులో పోకున్నా కేసులెందుకు వేస్తున్నారని హరీశ్ ప్రశ్నించారు. ‘విపక్షాల పనే అది కదా? లేదంటే అధికార పక్షం వేటిని ప్రశ్నించాలని చెబితే వాటినే ప్రశ్నించాలా?’ అంటూ ఆయన బదులిచ్చారు. -
ఇష్టారీతిన చట్టాలు చేయడం మానుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చట్టం పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టాలని, ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేయడం, నిర్ణయాలు మార్చుకోవడాన్ని మాను కోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి సూచించారు. అసెంబ్లీ, కౌన్సిల్లో రాజ్యాంగానికి వ్యతి రేకంగా భూసేకరణ చట్టానికి సవరణ చేశారని విమర్శిం చారు. ఎంతో కసరత్తు చేసి యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తే, దాని లక్ష్యాలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా జీవో 123ని తీసుకొచ్చిందన్నారు. ఈ జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు. -
భూసేకరణ చట్టానికి తూట్లు..
► సామాజిక ప్రభావ అంచనాకు మంగళం ► ప్రజాప్రయోజనాల సాకు.. ► 80 శాతం రైతుల ఆమోదం నిబంధన తొలగింపు ► మళ్లీ తెరపైకి రైతులతో సంప్రదింపుల అంశం.. ► రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచి పారిశ్రామికవే త్తలకు లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతులకు ప్రయోజనకరంగా ఉన్న 2013 భూసేకరణ చట్టంలోని సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని తొలగించి కొత్త భూసేకరణ చట్టం తెరపైకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు తేవాలని రాష్ట్ర మంత్రివర్గం శనివారం తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. కేబినెట్ ఆమోదించినందున ఇక ఈ చట్ట సవరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఆమోదం అనంతరం చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఇది అమలవుతుంది. భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు ప్రభుత్వం చాపకింద నీరులా ఏర్పాట్లు చేస్తోందంటూ 2016 జూన్ 6న, సెప్టెంబర్ 21 సాక్షి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. తాజాగా కేబినెట్ నిర్ణయంతో సాక్షి కథనాలు అక్షర సత్యాలని తేలిపోయింది. అతి ముఖ్యమైనది తొలగింపు భూసేకరణవల్ల భూములు కోల్పోయే కుటుంబాలపై పడే సామాజిక ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయాలనేది 2013 భూసేకరణ చట్టంలో అతి ముఖ్యమైనది. 80 శాతం మంది రైతులు ఆమోదిస్తేనే భూసేకరణ అమలుచేయాలనే నిబంధన కూడా ఇందులో ఉంది. అయితే ప్రజాప్రయోజనాలు సాకుగా చూపించి ఈ సామాజిక ప్రభావ మదింపునకు మంగళం పలకాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం రక్షణ సంస్థలకు భూసేకరణకు మాత్రమే సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు ఉంది. అయితే ప్రజా అవసరాల పేరుతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు, కాలువలు, విద్యా సంస్థలు, గృహాల నిర్మాణాలకు సేకరించే భూములకు సామాజిక ప్రభావ అంచనాను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2013 భూసేకరణ చట్టానికి సవరణ ప్రతిపాదనల సమర్పణ బాధ్యతలను నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఇది సమర్పించిన నివేదికను రెవెన్యూ శాఖ న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని కేబినెట్‌కు సమర్పించింది. దీనిని కేబినెట్ శనివారం ఆమోదించింది. రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టి... రైతుల హక్కులను ఫణంగా పెట్టి పారిశ్రామిక సంస్థలకు మేలు చేకూర్చేలా ఈ సవరణలు ఉన్నాయి. గతంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సవరణలే చేసి రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకుంది. ఇదే తరహాలో గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకుని రైతుల పొట్టగొట్టేలా సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. దీని ప్రకారం పారిశ్రామిక కారిడార్లు ఉన్న ప్రాంతాల్లో రహదారులు, రైల్వే మార్గాల ఇరువైపులా కిలోమీటరు పరిధిలో భూములను సేకరిస్తారు. భూములకు విలువ వచ్చినప్పుడు ఆ సంస్థలు ఆ భూములను వినియోగించుకుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌తో పాటు మౌలిక సదుపాయాలకు అవసరమైన భూముల సేకరణకు సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణకు కూడా సామాజిక ప్రభావ అంచనాను మినహాయింపు ఉంటుంది. మరోవైపు ఏ అవసరానికైనా భూములను సేకరించాలంటే ఆ భూములకు చెందిన రైతులు 80 శాతం అంగీకరించాలనే నిబంధన 2013 భూసేకరణ చట్టంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ నిబంధనను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రైతులతో సంప్రదింపుల ద్వారా మార్కెట్ ధరను చెల్లించి ఆయా జిల్లా కలెక్టర్లు భూములను తీసుకోవచ్చుననే నిబంధనను తాజా సవరణలో పేర్కొన్నారు. దీనిని కేబినెట్ ఆమోదించినందున త్వరలో అసెంబ్లీలో ప్రతిపాదిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
కోదండ దీక్షాస్త్రం
► సర్కారు నిర్బంధంపై టీజేఏసీ చైర్మన్ మండిపాటు ► నిర్వాసితుల హక్కులను హరించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలి ► 2013 భూసేకరణ చట్టం ప్రకారమే వారికి పునరావాసం కల్పించాలి ► మాది బలప్రదర్శన కాదు.. నిర్వాసితుల గోడు వినిపించేందుకే ధర్నా ► అసెంబ్లీలో అన్యాయంగా ఆమోదించుకున్న బిల్లు నిలవదు ► పోరు ఆగదు.. నిర్వాసితులకు అండగా నిలుస్తామని వెల్లడి ► తన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష ► కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ న్యూడెమొక్రసీల మద్దతు ► ఈ నియంతృత్వం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా?: ఉత్తమ్ ► గొంతెత్తేవారిని అణచేయాలని ప్రభుత్వం చూస్తోంది: జానారెడ్డి ► నిరసనలను అడ్డుకోవడం మంచిది కాదు: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : చట్టం ప్రకారం భూనిర్వాసితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తలపెట్టిన దీక్షకు అనుమతిని నిరాకరించి, జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసినందుకు నిరసనగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం దీక్షకు దిగారు. గురువారం ఉదయమే కోదండరాం నివాసంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశ మైంది. భేటీ అనంతరం తన నివాసంలోనే దీక్షకు దిగుతున్నట్టుగా కోదండరాం ప్రకటించారు. నిర్వాసితుల హక్కులను హరించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, భూసేకరణ చట్టం–2013 ప్రకారం వారికి పునరావాసం కల్పించాలని, అక్రమంగా అరెస్టు చేసిన జేఏసీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగుతున్నట్టుగా తెలిపారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమొక్రసీ, వివిధ ప్రజాసంఘాలు కోదండరాం దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించాయి. ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం నివాసంలోనే ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష జరిగింది. వివిధ పార్టీలు, జేఏసీ స్టీరింగ్ కమిటీ సూచన మేరకు దీక్షను విరమిస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య చేతుల మీదుగా పండ్లరసాన్ని స్వీకరించి సాయంత్రం ఆయన దీక్షను విరమించారు. బల ప్రదర్శనకు కాదు.. బాధ చెప్పుకోవడానికే.. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ వేదికపైకి పోలేదని, భూనిర్వాసితుల కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కోదండరాం తెలిపారు. ‘‘భూసేకరణపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని, భూసేకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రభుత్వానికి నివేదించినం. ప్రభుత్వం వినకుంటే ధర్నాకు పిలుపునిచ్చినం. జేఏసీ బలం చూపించాలని కాదు.. భూనిర్వాసితుల గోడును, గొంతును హైదరాబాద్‌కు వినిపించడానికే. ధర్నాకు అనుమతిని ఇవ్వకున్నా జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీక్షకు అనుమతి ఇవ్వనప్పుడు, తిరస్కరించనప్పుడు జేఏసీ నేతలను ఎందుకు అరెస్టు చేశారు? నేను దీక్షకు దిగిన తర్వాతనే జేఏసీ నేతలను విడిచిపెట్టారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్న తీరు బాధాకరం. శాసనసభలో అందరికీ న్యాయం జరగాలి. అన్యాయంగా ఆమోదించుకున్న బిల్లు నిలువదు. భూసేకరణకు మేం వ్యతిరేకం కాదు. మల్లన్నసాగర్లో పదిరోజులు నిరసనలు జరిగినా వెళ్లలేదు. పది రోజుల తర్వాత ఇంజనీర్లు, న్యాయవాదులతో కలిసి వెళ్లిన తర్వాతనే పోరాటానికి దిగినం. మల్లన్నసాగర్ డీపీఆర్ ఎక్కడ, దానికి ఎంత భూసేకరణ అవసరం, భూమిని కోల్పోయినవారికి ఏమి ఇస్తారు అని అడిగితే నేరమా? భూసేకరణ చట్టం అమలు చేయకుండా భూమిని గుంజుకోవడానికే వ్యతిరేకం. ప్రాజెక్టులకు, అభివృద్ధికి మేం అడ్డం కాదు. మా ఐక్యతను తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. అన్ని సమస్యలపై ఐక్య కార్యాచరణ ఉంటుంది’’అని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం నిర్బంధానికి దిగుతున్నదంటే.. తనకు తానే నిర్బంధం చేసుకుంటున్నట్టని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల, నిరసనల గొంతు నొక్కడం సాధ్యం కాదని వాళ్లు అర్థం చేసుకోవాలన్నారు. ‘‘దీక్షను విరమిస్తున్నా నిర్వాసితుల పక్షాన పోరాటం ఆగదు, వారికి జేఏసీ అండగా ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాలు, ఆదేశాలతో మేం పనిచేయం. స్టీరింగ్ కమిటీ నిర్ణయంతోనే దీక్షకు దిగిన, విరమించుకుంటున్నా’’అని వెల్లడించారు. ఇందుకే తెలంగాణ తెచ్చుకున్నామా?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ప్రజాస్వామిక ధర్నాలకు, నిరసనలకు అనుమతిని ఇవ్వకుండా అరెస్టులు చేయడం దారుణం. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన తెలంగాణవాదులు కోరుకున్న తెలంగాణ ఇదేనా? ప్రభుత్వ నిర్భంధాన్ని సహించేది లేదు. భూసేకరణ చట్టంపై లోతుగా చర్చ, అధ్యయనం జరగాలి. సీఎం కేసీఆర్ అబద్ధాలకోరు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటాలకు అండగా ఉంటాం. ప్రజల కోసం కోదండరాం ఉద్యమించడం ఆయన హక్కు, బాధ్యత. కేసీఆర్ చెప్పేదాకా కోదండరాం కులం తెలియదు: జానారెడ్డి, సీఎల్పీ నేత సీఎం కేసీఆర్ చెప్పేదాకా కోదండరాం సార్ రెడ్డి అని తెలియదు. కేసీఆర్ చెప్తేనే రెడ్డి అని తెలిసింది. ఒక సామాజిక ఉద్యమకారునిగానే కోదండరాం తెలుసు. అలాంటి కోదండరాంకు కులాన్ని ఆపాదించడం సరికాదు. తెలంగాణలో పాటలు పాడుతున్నవారిని, మాట్లాడుతున్నవారిని అణిచేయాలని ప్రభుత్వ చూస్తున్నది. కాంగ్రెస్ ఆగలేదు, తగ్గలేదు. ప్రజల్లో, మీలో చైతన్యం కోసం చూస్తున్నాం. భూనిర్వాసితులకోసం కోదండరాం చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి. వెంటనే కోదండరాంతో ప్రభుత్వం చర్చించాలి. బంగారంలాంటి ముఖాన్ని చూడటానికి భయం: రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత కోదండరాం సార్ ముఖం బంగారంలా ఉంటదని ఉద్యమకాలంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వంగివంగి దండాలు పెట్టిండు. ఇప్పుడేమో కోదండరాం సార్ ముఖాన్ని చూడాలంటే ఎందుకు భయపడుతున్నడు? తప్పు చేసిన వాళ్లే కేసీఆర్‌లా భయపడ్తరు. తెలంగాణను బొందలగడ్డగా మారుస్తున్న కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదు. ప్రభుత్వానికి భయం: కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత భూసేకరణ చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రభుత్వం ఎందుకో భయపడుతున్నది. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలను అడ్డుకోవడం మంచిదికాదు. పేదల కోసం ఎందాకైనా..: చాడ వెంకటరెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి, కె.గోవర్ధన్ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని, చట్టం ప్రకారం వ్యవహరించాలని అడగడమే నేరమా? ప్రజలకోసం ఉద్యమాలే తప్పన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. నిరసన చెప్పేది ప్రజలే. ప్రజాస్వామిక నిరసనలపై, ఉద్యమాలపై సీఎం కేసీఆర్ తీరు సరికాదు. కోదండరాం పోరాటాలకు, పేదల కోసం జరుగుతున్న ఉద్యమాలకు ఎంతదాకా అయినా అండగా ఉంటాం. ప్రజలను వ్యతిరేకించడమే : చుక్కా రామయ్య, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ నిరసనలు ప్రజలకు ప్రజాస్వామిక హక్కు, నిరసనలను అడ్డుకోవడమంటే ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఇది కోదండరాం వ్యక్తిగతం కాదు. ఇంకా ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజా చైతన్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉద్యమించాలి. సంఘీభావం ప్రకటించిన వారెందరో... కోదండరాం దీక్షకు టీఆర్ఎస్, మజ్లిస్ మినహా అన్ని పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతీరెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య, అమర్‌నాథ్‌బాబు, ఎం.శ్రీనివాస్ సారంగపాణి మద్దతు తెలిపారు. ప్రజాసంఘాల నేతలు సంధ్య(పీవోడబ్ల్యూ), చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. శాంతిభద్రతల కోణంలోనే అనుమతి నిరాకరణ: డీజీపీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గురువారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన దీక్షకు శాంతి భద్రతల కారణంతోనే అనుమతిని నిరాకరించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఇతర సమస్యలు ఉన్నప్పుడు అన్నింటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న కారణంతోనే అనుమతి నిరాకరించామన్నారు. -
'రాష్ట్ర భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం'
సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టం 2013కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఖండించారు. ఈ బిల్లును అమలు చేస్తే ప్రజల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని హెచ్చరించారు. బిల్లు సవరణపై రైతులు, వ్యవసాయ కార్మికులు వెంటనే నిరసనలకు దిగాలని పిలుపునిచ్చారు. కేంద్ర చట్టానికి మెరుగైన సవరణలు తెస్తామని చెప్పి... అందుకు భిన్నంగా జీవో 123, 214లను పరోక్షంగా అమలు చేసేందుకు పూనుకోవడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర చట్టానికీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకూ ఏమాత్రం పొంతన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిర్వాసిత ప్రజలకు వన్‌టైం సెటిల్మెంట్ కింద పునరావాస సౌకర్యాలు లేకుండా వారి బతుకులను బజారుపాలు చేయడం.. వారి గొంతు నొక్కడమే అవుతుందని ఆరోపించారు. -
భూములు గుంజుకునేందుకే..
► భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై విపక్షాల ధ్వజం ► మందబలంతో సవరణలు చేస్తోందని మండిపాటు ► చట్టంలోని సెక్షన్ 2, 3 ఎందుకు తొలగించారు: జానా ► బిల్లుపై సభలో అంతా గందరగోళం ► ముందుగా 107 సెక్షన్ కింద సవరణ తెస్తున్నామని వెల్లడి ► ఆ తర్వాత ఆర్టికల్ 254(2) ప్రకారం సవరిస్తున్నామని వివరణ సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్ట సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రం తెచ్చిన భూ సేకరణ చట్టానికి సవరణ చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ముఖ్యమంత్రి ప్రయ త్నాలన్నీ కోర్టుల్లో అభాసుపాలుకాక తప్పవని పేర్కొంది. భూ నిర్వాసితులకు రక్షణగా ఉన్న చట్టాన్ని సవరణ పేరుతో మార్చి యథేచ్ఛగా భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోం దని మండిపడింది. ‘‘మల్లన్నసాగర్ విషయం లో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. రైతులను బెదిరించి, పోలీసులతో భయపెట్టి బలవంతంగా భూములు తీసుకుంది. ఇప్పుడు మిగతా చోట్ల కూడా అదే పంథాను అవలంబిం చేందుకే కేంద్ర చట్టానికి సవరణ ప్రతిపాదిం చింది’’ అని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో వారు మాట్లా డారు. మందబలం ఉందని ప్రభుత్వం విప క్షాల మాటలను పరిగణనలోకి తీసుకోకుండా సవరణలు చేస్తోందని ఆరోపించారు. చట్ట సవరణ సబబా, కాదా అన్న విషయంపై తాము మాట్లాడుతుంటే మల్లన్నసాగర్ కేసు లను తమకు అంటగట్టి మాట్లాడ్డం సరికాదని జానారెడ్డి హితవు పలికారు. కేంద్ర చట్టం మెరుగ్గా లేకుంటే, దాన్ని ఎలా మెరుగు పరుస్తారో, సవరణ ద్వారా వచ్చే ప్రయోజనా లేంటో చెప్పమంటే అవి చెప్పకుండా అనవ సరంగా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయటం సరికాదని పేర్కొన్నారు. ‘‘మెరుగైన చట్టం తెస్తే మేమూ ఆహ్వానిస్తాం, కానీ నిర్వాసితులకు రక్ష ణగా ఉన్న 2, 3 సెక్షన్లను ఎందుకు తొలగిం చారో చెప్పాలి’’ అని జానారెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డి అసాంఘిక వ్యక్తా: జీవన్‌రెడ్డి మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రతిప క్షాల నిరసనలపై సీఎం మాట్లాడిన తీరును జీవన్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘నిరసనల్లో పాల్గొన్న వారిని అసాంఘిక శక్తులంటున్నారు. అంటే సీఎల్పీ నేత జానారెడ్డి అసాంఘిక వ్యక్తా’’ అని సీఎంను ప్రశ్నించారు. భూ నిర్వా సితులకు అన్యాయం జరుగుతుంటే అండగా నిలవటం తప్పా అని పేర్కొన్నారు. చట్ట సవ రణతో మెరుగైన పరిహారం ఇస్తామని ప్రభు త్వం చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనం కనిపి స్తోందని, అక్కడి భుముల రిజిస్ట్రేషన్ విలు వను అప్డేట్ చేయకుండా దానిపై కొన్ని రెట్ల పరిహారం ఇస్తామంటే ఒరిగేదేంటని ప్రశ్నిం చారు. ముందుగా ఆ ధరలను అప్డేట్ చేయా లని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కాం గ్రెస్ సభ్యుల మైక్‌లు తరచూ కట్ చేయటం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ ఎదుట నిరసన తెలిపారు. ‘సవరణ’పై గందరగోళం భూసేకరణ చట్ట సవరణ బిల్లు విషయంలో అంతా గందరగోళం నెలకొంది. చట్ట సవర ణకు రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని అధి కార పక్షం వాదించగా.. అది సాధ్యం కాదని, కోర్టుల్లో నిలవదని విపక్షాలు పేర్కొన్నాయి. ముందుగా సభ ముందుంచిన పత్రాలకు సవరణలు జోడించటంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో గందరగోళంలో ఉందని విపక్షాలు ఆరోపించాయి. 2013 భూసేకరణ చట్ట సవరణకు ఉద్దేశించిన బిల్లుగా ప్రభుత్వం దీన్ని పేర్కొంది. ఆ మేరకు పత్రాలను సభలో సభ్యులకు అందజేశారు. చట్టంలోని సెక్షన్ 107 కింద ఈ చట్టానికి సవరణ చేసే వెసులుబాటు ఉందని, దాని ఆధారంగానే చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. కానీ.. దాన్ని జానారెడ్డి తప్పుపట్టారు. ఆ సెక్షన్ దీనికి వర్తించదని కుండబద్దలు కొట్టారు. అప్పటి వరకు సీఎం సభలో లేరు. కాసేపటికి వచ్చిన ఆయన..సెక్షన్ 107 ఉటంకించకుండా రాజ్యాం గం కల్పించిన ఆర్టికల్ 254(2) ఆధారంగా చట్ట సవరణ చేయనున్నట్టు వెల్లడించారు. దీం తో గందరగోళం మరింత పెరిగింది. ‘‘కొత్తగా తెలంగాణ ఒక్కటే చేస్తున్న సవరణ కాదు. ఇప్పటికే రాజస్తాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలు సవరించుకు న్నాయి. ఇక్కడి ప్రాజెక్టుల గురించి నేను ఢిల్లీ వెళ్లి స్వయంగా ప్రధానితో చర్చించినప్పుడు ఆయనే చట్ట సవరణ సూచన చేశారు. ఆయన సూచన మేరకు ఇప్పుడు సవరణ బిల్లు పెట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో చట్ట సవరణ తామేదో గాలికి ఆలోచించి బిల్లు పెట్టలేదని, న్యాయ నిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ బిల్లు రూపొందించి దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడి అధికారులకు చూపించి అంతా సవ్యం గానే ఉందని తేల్చుకున్న తర్వాతే సభలో బిల్లు ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఈ బిల్లుకు ఆమో దం పొందిన తర్వాత అది చట్టంగా మారాలంటే కచ్చితగా రాష్ట్రపతి ఆమోదం అవసరమని పేర్కొన్నారు. గతంలో చాలా రాష్ట్రాలు అలాగే చేశాయని, ఇప్పుడు తాము కూడా అలాగే చేయబోతున్నామని తెలిపారు. సభ అనంతరం దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పష్టత ఇచ్చారు. ఇది చట్ట సవరణ బిల్లేనని, ఆర్టికల్ 254 (2) కల్పించిన వెసులుబాటు ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. అప్పటికప్పుడు సభ ముందు సవరణ నోట్... చట్ట సవరణకు సంబంధించి సభ్యులకు అందించిన నోట్‌ను సవరించి మంత్రి హరీశ్ రావు కొత్త నోట్‌ను అందించారు. సెక్షన్ 107 కింద చట్ట సవరణ చేస్తున్నట్టు ఉన్న భాగాన్ని తొలగించి సీఎం విశదీకరించిన ఆర్టికల్ 254 ఆధారంగా సవరణ చేస్తున్న విషయాన్ని జోడిం చారు. దీని ఆధారంగానే సవరణ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. -
రాష్ట్రం పుట్టకముందే చట్టం పుట్టిందా?
ప్రభుత్వం తెచ్చినది భూకబ్జా చట్టం: రేవంత్ సాక్షి, హైదరాబాద్: జనవరి 2014 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, ఆ తేదీ నుంచి చట్టం అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూసేకరణ చట్టాన్ని తీసుకురావడం ఎలా సాధ్యమని టీడీఎల్పీనేత ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రం పుట్టకముందే చట్టం పుట్టిందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల నుంచి భూమిని బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకుని, భూమిని కోల్పోయిన నిర్వాసితుల బాధ్యతలను పట్టించు కోకుండా ఉండటానికి జీఓ 123, జీఓ 254, జీఓ 190, జీఓ 192లను తెచ్చిందన్నారు. నిర్వాసితులను మోసం చేసేవిధంగా ఉన్న ఈ జీఓలను హైకోర్టు కొట్టివేసిందని రేవంత్‌రెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2013కు తూట్లుపొడిచే విధంగా, అడ్డదారిలో కొత్తచట్టం తీసుకువచ్చేందుకు ఎత్తులు వేశారని విమర్శించారు. ప్రాజెక్టులకు సంబం ధించిన డీపీఆర్ లేకుండా, రైతులతో సంప్రదించకుండా, గ్రామసభను పట్టించుకో కుండా, కలెక్టర్లు అనుకున్న ధరకు, ఇష్టారాజ్యంగా రెండు పంటలు పండే భూముల ను కూడా రైతుల నుంచి ఈ చట్టం ద్వారా తీసుకుంటారని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం భూకబ్జా చట్టం అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
భూసేకరణ బిల్లుకు సవరణను ఆపండి
• రాష్ట్రపతికి సీపీఎం వినతిపత్రం • రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక భూసేకరణ చట్టం–2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం మండిపడింది. ఆ చట్టానికి సవరణలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది. ఈ అంశంపై జోక్యం చేసుకుని భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఉపసంహరిం చుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలంటూ.. పార్టీ నాయకులు సీహెచ్ సీతారాములు, సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, డీజీ నర్సింహారావు, నంద్యాల నర్సింహారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి తదితరులు మంగళవారం రాష్ట్రపతిప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎంబీ భవన్లో సారంపల్లి మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతులు, నిర్వాసితులు, వృత్తి దారులు, పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం–2013ని తీసుకువచ్చిం దని ఆయన చెప్పారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కి.. గుజరాత్ తరహాలో భూసేకరణ చట్టం రూపొందించి, అసెంబ్లీలో ప్రతిపాదించడం శోచనీయమన్నారు. కేసీఆర్‌కు తమ్మినేని లేఖ భూసేకరణ చట్టం–2013ని య«థా విధిగా అమలు చేయాలని, సవరణలు చేయ వద్దని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ లేఖ రాశారు. గుజరాత్ తరహా భూసేకరణ చట్టం తీసుకొస్తే నిర్వాసి తులకు తీవ్ర నష్టం కలుగజేస్తుంద న్నారు. ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణకు చట్టం అడ్డం కిగా ఉందని సవరణ చేయాలనుకోవడం ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని విమర్శించారు. -
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపండి
హైకోర్టులో పిటిషన్.. సాక్షి, హైదరాబాద్: కొత్త భూసేకరణ చట్టం కింద మొత్తం భూసేకరణ పూర్తయ్యే వరకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఎస్) కింద ఎలాంటి పనులను కొనసా గించకుండా మెగా ఇంజనీరింగ్, స్వప్న ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, ఆ రెండు కంపెనీలను ఆదేశించింది. నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్ఎల్ఎస్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ డివిజన్, కోడేరు మండల పరిధిలోని సర్వే నంబర్లు 93,94,95ల్లోని భూములను మెగా ఇంజనీరింగ్, స్వప్న ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లు ఆక్రమించు కున్నా యని, ఆ భూములను తక్షణమే ఖాళీ చేసి, వాటిని వాటి యజమానులకు అప్పగించేలా కూడా ఆ రెండు కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కె.కృష్ణారెడ్డి, కె.రామచంద్రారెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. -
డెల్టా గుండెల్లో గునపం!
70వేల గ్యాస్ బావులు తవ్వేందుకు కార్పొరేట్ సంస్థల పథకం - ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో కేజీ బేసిన్లో గ్యాస్, చమురు వెలికితీత - పశ్చిమగోదావరి, కృష్ణాలో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం ఏడు లక్షల ఎకరాలు సాగుకు దూరం - ఇంకా లక్షలాది ఎకరాలపై తీవ్ర ప్రభావం వాయు, జల, భూకాలుష్యం తీవ్రమయ్యే ప్రమాదం - జనజీవనంపై విషమ ప్రభావం అంటున్న పరిశోధనలు అమెరికా, పలు దేశాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం - ఇక్కడ అదే ముద్దంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు చేపట్టే గ్రామాలకు కనీస సమాచారం లేదు - భీమవరంలో రేపు ప్రజాభిప్రాయ సేకరణ (ఆలమూరు రామ్‌గోపాల్‌రెడ్డి) దేశానికి ధాన్యాగారంగా భాసిల్లుతోన్న గోదావరి, కృష్ణా డెల్టాల్లో వరి సాగు కనుమరుగు కానుందా..? నలుగురికి అన్నం పెట్టిన రైతన్న ఇక ఉపాధి వెతుక్కుంటూ వలసపోవాల్సిన దుస్థితి దాపురించనున్నదా? అన్నపూర్ణగా విరాజిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం ప్రజలు అలమటించాల్సిన పరిస్థితులు పొంచి ఉన్నాయా..? పచ్చని పైర్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కనిపించే డెల్టాలు ఇక జన జీవనానికి పనికి రాకుండా పోతాయా..? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. గ్యాస్, చమురు ఉత్పత్తిలో కార్పొరేట్ సంస్థలకు సహజవనరులను దోచిపెడుతోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరో అడుగు ముందుకేసి సాంప్రదాయేతర ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ పద్ధతిలో షేల్ గ్యాస్, చమురును వెలికితీయడానికి ఆమోదముద్ర వేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ(ఆరుుల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్)ని ముందుపెట్టి పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలం కాళ్ల, భీమవరం మండలం వీరవాసరం, కృష్ణా జిల్లాలో మండవల్లిలో తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాళ్ల, వీరవాసరం, మండవల్లి ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ప్రాజెక్టు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చట్టాలు చెబుతున్నా ఆ గ్రామాలను వదిలేసి భీమవరంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు. మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా 17 బావుల ద్వారా హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్కి ఓఎన్జీసీ తెరతీసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి డెల్టాల్లో 70 వేల బావులను తవ్వి ద్వారా గ్యాస్, చమురు ఉత్పత్తి చేయడానికి కేంద్రం టెండర్లు పిలవనుంది. భూమిని, నీటిని అధికంగా వినియోగించుకునే ఈ విధానం వల్ల ఎన్నో ఉపద్రవాలు పొంచి ఉన్నారుు. అనేక దేశాలు ఈ విధానానికి గుడ్‌బై చెప్పాయి. ఎక్కడా వద్దన్నది ఇక్కడ ముద్దు.. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో తవ్వకాల వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఈ విధానంపై అనేక దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఫ్రాన్స, బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే ఆ విధానాన్ని నిషేధించారు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం అంశాన్ని ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ఇరు పక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ను నిషేధించారు. కానీ.. మన దేశంలో మాత్రం ఆ విధానాన్ని అమలుచేయడానికి శ్రీకారం చుట్టడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఉపద్రవాలు.. భయానక వాస్తవాలు.. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► ఒక్కో బావికి కనీసం పది ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ లెక్కన. 70 వేల బావులకు ఏడు లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుంది. బావులకు సమాంతరంగా భూగర్భంలో సొరంగాలు తవ్వడం వల్ల లక్షలాది ఎకరాల భూమిపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల పచ్చని పంట పొలాలు మాయం కావడం ఖాయం. దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం అలమటించాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్తోభూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కో బావికి సగటున ఆరు కోట్ల లీటర్ల నీళ్లు అవసరం అవుతారుు. 70 వేల బావులకు అవసరమైన నీటిని పరిగణనలోకి తీసుకుంటే.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భం ఒట్టిపోవడం ఖాయం. ► అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ), నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అంచనాల ప్రకారం గ్యాస్, చమురు ఉత్పత్తి సమయంలో మిథేన్ లీకవుతూనే ఉంటుంది. సెకనుకు 0.6 గ్రాముల కార్బన్ లీకవుతుంది. దీని భూతాపాన్ని తీవ్రం చేస్తుంది. ఇది పంటల దిగుబడిని 80 శాతం మేర తగ్గించి వేస్తుంది. ► భూగర్భంలో అత్యధిక పీడనంతో అవశేష శిలలను ఛిద్రం చేయడం, భూగర్భ జలాలను లాగేయడం వల్ల భూకంపాలు వస్తాయని ఈపీఏ తేల్చింది. అమెరికాలోని టెక్సాస్‌లో రిక్టర్ స్కేలుపై 5.1, ఓక్లహోమాలో 3.0 తీవ్రత కలిగిన భూకంపాలు నమోదయ్యారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల అమెరికాలో 2013లో 109, 2014లో 585, 2015లో 907, 2016లో 611(అక్టోబరు వరకూ) భూకంపాలు నమోదవడం గమనార్హం. ► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురును వెలికితీయడం వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూకాలుష్యం పెరిగిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక లక్షణాలున్న రాడాన్ వాయువు వెలువడుతుంది. గర్భస్థ శిశువులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతారుు. ► అమెరికాలో 2012లో బంబెర్గర్, ఆస్వాల్డ్‌లు నిర్వహించిన పరిశోధనల్లో ఒళ్లుగగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన బావులకు కిలోమీటరు వ్యాసార్థంలో ఆవులు, దూడలు మరణించినట్లు తేలింది. గర్భస్రావాలు అధికమైనట్లు వెల్లడైంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగినట్లు తేలింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిర్వహించిన రక్తపరీక్షల్లో అత్యంత ప్రమాదకరమైన ఆర్శనిక్, బెంజీన్ అవశేషం ఫినాల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇది జనజీవనాన్ని ఛిద్రం చేసింది. అమెరికాలో ఉద్యమాలు రావడంతో టెక్సాస్, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని నిషేధించారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే.. కేజీ బేసిన్లో ఇప్పటికే డీ-6 గ్యాస్ క్షేత్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్న రిలయన్స సంస్థ అక్రమంగా గ్యాస్‌ను తరలించి రూ.12,136 కోట్ల మేర కొల్లగొట్టినట్లు జస్టిస్ ఏపీ షా కమిషన్ తేల్చింది. ఆ మేరకు రిలయన్స నుంచి ఆ నిధులను వసూలు చేయాలని షా కమిషన్ చేసిన సూచనను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అమెరికాలో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురు ఉత్పత్తిలో ప్రధాన వాటా రిలయన్సదే. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం విధించడం.. రానున్న రోజుల్లో పూర్తి స్థారుులో నిషేధం విధించనున్న నేపథ్యంలో రిలయన్‌సకు భారీ దెబ్బ తగలనుంది. దాన్ని పూడ్చుకునేందుకే కేజీ బేసిన్‌పై కన్నేసిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ..? ప్రాజెక్టులు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాలని భూసేకరణ చట్టం-2013 స్పష్టీకరిస్తోంది. ఎన్జీటీ తీర్పులు ఇదే అంశాన్ని తేల్చిచెబుతున్నారుు. కానీ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను బుట్టదాఖలు చేస్తున్నారుు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల, వీరవాసరం, కృష్ణా జిల్లా మండవల్లిల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై మంగళవారం భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నియంత్రణ మండలి ఓ ప్రకటన జారీ చేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి.. దీనిపై అభిప్రాయ సేకరణ చేయాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటమా? హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో గ్యాస్, చము రు తవ్వకాలు జరపడమంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడటమే. దేశానికి అన్నం పెడుతోన్న కృష్ణా, గోదావరి డెల్టాలు నాశనమౌతారుు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భజలాలను తోడేస్తే సముద్రం నుంచి ఉప్పునీళ్లు ఎగదన్నడం ఖాయం. ప్రపంచంలో జర్మనీ, స్కాట్లాండ్, రుమేనియా, బల్గేరియా, ఫ్రాన్స వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని నిషేధించారు. - కలపాల బాబూరావు, పర్యావరణవేత్త విధ్వంసం చేయడం అభివృద్ధా? జన జీవనాన్ని విధ్వంసం చేయడం అభివృద్ధా? మానవ జీవనాన్ని ప్రశ్నార్థకం చేసే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అవసరమా? కార్పొరేట్ శక్తులకు సహజ వనరులను దోచిపెట్టేందుకే ఈ విధానం అమలుకు పూనుకోవడం అన్యాయం. - రామకృష్ణంరాజు, కో-ఆర్డినేటర్, నేషనల్ అలయన్సఆఫ్పీపుల్స్ మూవ్మెంట్స్(ఎన్ఏపీఎం) కేజీ బేసిన్లో భారీ గ్యాస్, చమురు నిల్వలు.. భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నట్లు ఓఎన్జీసీ గుర్తించింది. దేశంలో గ్యాస్హెడ్రేట్ సామర్థ్యాలను అన్వేషించటానికి, ప్రయోగాత్మకంగా ఉత్పత్తి పరీక్షల కోసం 2014లో అమెరికాకు చెందిన యూఎన్‌జీఎస్, జపాన్‌కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఓఎన్జీసీ, యూఎన్‌జీఎస్, జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో గోదావరి-కృష్ణా బేసిన్లో 982, డీ-3, డీ-6, డీ-9 బ్లాకుల్లో 4320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో అత్యంత సాంద్రత గల ఇసుక రిజర్వాయర్లలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్, ఆరుుల్ నిక్షిప్తమైనట్లు తేలింది. దీని విలువ రూ.33 లక్షల కోట్లుగా ఓఎన్జీసీ అంచనా వేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటే.. భూ ఉపరితలానికి సుమారు నాలుగు వేల మీటర్ల లోతులో కఠినమైన అవశేష శిలావరణం కింద ఏర్పడిన ఇసుక రిజర్వాయర్లలో షేల్, గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఉండే గ్యాస్, చమురును బోరు బావులు తవ్వడం వంటి సాంప్రదాయ పద్ధతుల్లో వెలికితీయడం సాధ్యం కాదు.. ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ విధానంలో ఏం చేస్తారంటే.. కఠినమైన అవశేష శిలలు ఉండే వరకూ అంటే కనీసం నాలుగు వేల మీటర్ల లోతుకు భారీ బోరు బావి తవ్వుతారు. అవశేష శిల పొరకు సమాంతరంగా సొరంగం తవ్వుతారు. ఆ సొరంగంలో రంధ్రాలున్న గొట్టాలను అమర్చుతారు. ఈ గొట్టాల ద్వారా నీళ్లు, ఇసుక, 700 రకాల రసాయనాల మిశ్రమాన్ని 550 అట్మాస్పియర్లకుపైగా పీడనంతో పంపి.. అవశేష శిల పొరను ధ్వంసం చేస్తారు. తద్వారా శిల పొరల్లో ఏర్పడే చీలికల నుంచి గ్యాస్, చమురును వెలికితీస్తారు. -
‘మెట్రో రైల్’కు తొలగిన అడ్డంకులు
- భూసేకరణ కేసుల్లో స్టేలు ఎత్తేస్తూ హైకోర్టు తీర్పు - 2013 భూసేకరణ చట్టం కిందే పరిహారం చెల్లింపునకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ భూసేకరణ కున్న అడ్డంకులన్నీ తొలగిపోయారుు. భూసే కరణ విషయంలో ఇప్పటివరకు ఉన్న స్టేలన్నింటినీ కూడా ఉమ్మడి హైకోర్టు ఎత్తేసింది. మెట్రోరైల్ నిర్మాణం కోసం నాంపల్లి ప్రాంతంలో సేకరించిన భూములకు 2013 భూ సేకరణ చట్టం కిందే పరిహారం చెల్లించాలని మెట్రో యజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరిం చింది. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన తరు వాత పాత తేదీలతో పరిహారం ఉత్తర్వులు జారీ చేశారన్న సింగిల్ జడ్జి అభిప్రాయాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. మెట్రో రైల్ నిర్మాణం కోసం నాంపల్లి ప్రాంతంలో 20 ఆస్తుల సేకరణకు అధికారులు నిర్ణరుుంచి ఆ మేర నోటిఫికేషన్ జారీ చేశారు. సేకరిస్తున్న ఆస్తులకు సంబంధించిన పరిహారాన్ని 2013లో నిర్ణరుుంచారు. 2014లో అందుకు సంబంధించిన ఉత్తర్వులను బాధితులకు తెలియచేశారు. అరుుతే అప్పటికి 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిందని, అందువల్ల తమకు ఆ చట్టం కింద పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పలువురు భూ యజమానులు హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ వ్యాజ్యాలపై ఇరువురు సింగిల్ జడ్జీలు రెండు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీనిపై మెట్రో వర్గాలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారుు. వీటిపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. పరిహారం చెల్లింపునకు దాన్ని నిర్ణరుుంచిన తేదీనే ప్రామాణికమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరుుతే భూ యజమానుల్లో అత్యధికులకు ఇప్పటివరకు పరిహారం చెల్లించనందున వారికి 2013 భూసేకరణ చట్టం కిందే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక పాత తేదీలతో పరిహార ఉత్తర్వులు జారీ చేశారన్న ఓ సింగిల్ జడ్జి అభిప్రాయంతో ధర్మాసనం విబేధించింది. -
భూముల కొనుగోలు మా అధికారం
మల్లన్నసాగర్ కేసులో హైకోర్టుకు సర్కార్ నివేదన సాక్షి, హైదరాబాద్: భూములను అమ్మేందుకు ముందుకొచ్చిన వారికి డబ్బులిచ్చి కొనుగోలు చేసే విషయంలో తమపై ఎలాంటి నిషేధమూ లేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ‘‘ప్రజోపయోగ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ చట్టవిరుద్ధం కాదు. ఆ అధికారం ప్రభుత్వానికుంది. 299వ అధికరణ ప్రకారం ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవచ్చని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భూయజమానులకు ఇబ్బంది, నష్టం లేకుండా వారి భూములను సేకరించవచ్చు. మల్లన్నసాగర్ కోసం భూములమ్మేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారి నుంచి ఇందుకు అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నాం. వారికి 2013 భూ సేకరణ చట్టం కింద కంటే అధిక పరి హారం చెల్లిస్తున్నాం. భూములమ్మేందుకు ముందుకు రానివారి నుంచి భూసేకరణ చట్టం కింద తగిన పరిహారం చెల్లించి తీసుకుంటాం’’ అని పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూముల కొనుగోలును సవాలు చేస్తూ భూ యజమానులు, వాటిపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు వేసిన వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధా న కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. పిటిషనర్ల ఆరోపణ లు నిరాధారమని పేర్కొన్నారు. ‘‘భూములమ్మేందుకు ముందుకొచ్చిన వారి నుంచి, వారికి సంతృప్తికరమైన మొత్తాలు చెల్లించే కొనుగోలు చేస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టుకు భూములను సేకరించే ఉద్దేశంతోనే జీవో 123 జారీ చేశాం. జీవో 123 ప్రకారం భూములు తీసుకోవడం ద్వారా ప్రభావితులయ్యే వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం జీవోలు 190, 191 జారీ చేశాం’’ అని వివరించారు. 123 జీవో తప్పొప్పులు ఇప్పుడే చెప్పలేం: ధర్మాసనం మల్లన్నసాగర్ భూముల కొనుగోలుకు జారీ చేసిన జీవో 123 చట్టబద్ధతను తేల్చకుండా దీనిపై ఓ అభిప్రాయానికి రావడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా ఆ జీవో జారీ తప్పని గానీ, ఒప్పని గానీ ప్రస్తుతానికి ఎటువంటి సర్టిఫికెటూ ఇవ్వడం లేదంది. ‘‘హైకోర్టును ఆశ్రయించిన వారి నుంచి భూములు కొనుగోలు చేయబోమని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చినందున పిటిషనర్లకు వచ్చిన నష్టమేమీ లేదు. భూముల కొనుగోలుపై అభ్యంతరాలున్న వారిని కోర్టుకు రాకుండా ఎవరూ అడ్డుకోవడం లేదు’’ అని తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తామేం చేసినా చెల్లుతుందనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన బి.రచనారెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి కాగితాలపై సంతకాలు తీసుకుంటోందంటూ ఆవేశంగా చెప్పగా, ‘‘ఇది ప్రసంగాలు చేసేందుకు వేదిక కాదు. ఎవరేం చెప్పాలనుకున్నా అఫిడవిట్ రూపంలో మా ముందుంచండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ఏజీ అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. 144 సెక్షన్‌పై వివరణ ఇవ్వండి... మెదక్ జిల్లా వేములఘాట్‌లో 35 రోజులుగా 144 సెక్షన్ విధించడంపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందుంచాలంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. -
భూసేకరణ చట్టం ద్వారానే సేకరించండి
-ఏపీ సర్కారుకు లోకాయుక్త ఆదేశం సాక్షి, హైదరాబాద్ రాజధాని నిర్మాణం కోసం అవసరమయ్యే భూమిని బలవంతంగా సేకరించరాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే సేకరించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారుకు ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణం కోసం సారవంతమైన భూములను రైతులను బెదిరించి బలవంతంగా సేకరిస్తున్నారంటూ హైకోర్టు న్యాయవాది రాజ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సోమవారం మరోసారి విచారించారు. మా పొట్టకొట్టి కట్టేది ప్రజా రాజధాని అవుతుందా’’ అంటూ రైతుల అభిప్రాయాలతో గతంలో సాక్షి ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన లోకాయుక్త దృష్టికి తెచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద స్వచ్ఛందంగా ఇచ్చే రైతుల నుంచి మాత్రమే భూములను సేకరిస్తున్నామని, ఇందుకు సిద్దంగాలేని రైతుల నుంచి భూసేకరణచట్టం ప్రకారం భూమిని సేకరిస్తామని అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న లోకాయుక్త...ఈ పిటిషన్‌పై విచారణను ముగించారు. -
తలసాని, తుమ్మల తెలంగాణ భక్తులా : జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భక్తుడా అని కాంగ్రెస్ నేత జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర్రావు, మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి వారిని మంత్రివర్గంలో చేర్చుకున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసలైన తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రా కాంట్రాక్టర్లకు భారీ కాంట్రాక్టులు ఇస్తూ, తెలంగాణలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. మల్లన్నసాగర్లో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేయాలని కోరితే పట్టించుకోకుండా నిర్బంధించాల్సిన అవసరం ఏముదందని ప్రశ్నించారు. -
ఆమరణ దీక్ష భగ్నం.. జగ్గారెడ్డి అరెస్ట్
సంగారెడ్డి మున్సిపాలిటీ: 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం దీక్ష తలపెట్టిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డిని దీక్షా శిబిరానికి వెళ్తుండగానే అరెస్టు చేయడంతో ఆ ప్రాంతంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా రామ మందిర్ నుంచి ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా తమ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించడమే కాకుండా.. మూడేళ్లపాటు వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన 123, 214 జీవోల ద్వారా రైతులు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని, కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టాన్ని పక్కనపెట్టిందని జగ్గారెడ్డి అన్నారు. దీక్ష భగ్నం అప్రజాస్వామికం: ఉత్తమ్ సంగారెడ్డి రూరల్: మల్లన్నసాగర్ భూ బాధితుల కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందన్నారు. -
జీవో 123 ఔట్
► రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ ► భూ సేకరణ చట్టం-2013కు ఈ జీవో విరుద్ధం ► బాధితుల హక్కులు, ప్రయోజనాలను హరిస్తోంది ► వ్యవసాయ కార్మికులకు చిల్లిగవ్వ కూడా దక్కడం లేదు.. ► మెరుగైన పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ► భూసేకరణ చట్టానికి విరుద్ధంగా నిబంధనలు తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు తదితరాల నిర్మాణం కోసం రైతుల నుంచి భూమి కొనుగోలు చేసేందుకు గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123ని కోర్టు కొట్టేసింది. బాధితులకు కొత్త భూసేకరణ చట్టం కల్పిస్తున్న హక్కులు, ప్రయోజనాలను ఈ జీవో హరిస్తోందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ బుధవారం తీర్పు వెలువరించారు. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయ్, చీలపల్లి, బర్దీపూర్ గ్రామాల పరిధిలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (ఎన్ఐఎంజెడ్) ఏర్పాటుకు అవసరమైన భూములను 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా జీవో 123 ప్రకారం సేకరిస్తుండటాన్ని సవాలు చేస్తూ బర్దీపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికులు అల్గి తుక్కమ్మ, మరో 22 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ విచారించారు. వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఎన్ఐఎంజెడ్ కోసం ప్రభుత్వం జీవో 123 ద్వారా వేల ఎకరాల భూమిని సేకరిస్తోందన్నారు. వ్యవసాయ కార్మికులైన పిటిషనర్లు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జీవో 123 ద్వారా ఆ భూములను సేకరిస్తే వారు తమ జీవనోపాధిని కోల్పోతారని వివరించారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 3(సీ) ప్రకారం వ్యవసాయ కార్మికులు కూడా ‘ప్రభావిత కుటుంబం’ నిర్వచన పరిధిలోకి వస్తారని చెప్పారు. ఈ చట్టం ప్రకారం పిటిషనర్లకు దక్కాల్సిన పునరావాస ప్రయోజనాలను దక్కకుండా చేస్తూ ప్రభుత్వం జీవో 214 జారీ చేసిందన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కాదని ప్రభుత్వం జీవో 123 జారీ చేసిందని, దీనివల్ల బాధితులకు ఏమీ దక్కే పరిస్థితి లేదని వివరించారు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యతల నుంచి జీవో 123 ద్వారా ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. నష్టపోయిన రైతు ఒక్కరూ లేరు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... జీవో 123 ద్వారా రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోవడం లేదన్నారు. భూ సేకరణ చట్టం కింద రైతులకు దక్కుతున్న ప్రయోజనం కంటే జీవో 123 ద్వారానే అధిక ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. స్థానికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ముందుకొచ్చిన రైతుల నుంచే భూములను కొనుగోలు చేస్తున్నామన్నారు. జీవో 123 వల్ల తమకు నష్టం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా చెప్పలేదన్నారు. అసలు పిటిషనర్ల భూములను ప్రభుత్వం సేకరించలేదని, వారికి జీవో 123 వల్ల ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, అందువల్ల వారు ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ కైత్ ప్రభుత్వ వాదనలతో విబేధించారు. ప్రైవేటు ఆస్తుల డీలర్ కాదు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ అన్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను సేకరించే డీలర్ కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భూ సేకరణ చట్టం-2103లో వ్యవసాయ కార్మికులు ‘ప్రభావిత కుటుంబం’ నిర్వచనం పరిధిలోకి వస్తారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభావిత కుటుంబం పరిధిలోకి వచ్చే వారికి కొత్త భూ సేకరణ చట్టం అనేక రకాల ప్రయోజనాలను కల్పిస్తోందన్నారు. బాధితులకు జీవో 123 ద్వారా మొదట పునరావాస ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం.. ఆ తర్వాత వాటిని జీవో 214 ద్వారా హరించిందని తేల్చి చెప్పారు. జీవో 123 ద్వారా భూములు సేకరిస్తుండటంతో వ్యవసాయ కార్మికులకు చిల్లి గవ్వ కూడా దక్కడం లేదన్నారు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేశారు. ఒకవైపు కొత్త భూ సేకరణ చట్టాన్ని ఆమోదించి, మరోవైపు దాన్ని అమలు చేయకపోవడం ఎంత మాత్రం సరికాదన్నారు. భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా నిబంధనలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జీవో 123 కొట్టేస్తున్నట్లు తన తీర్పులో ప్రకటించారు. -
రాహుల్ గాంధీని పిలుద్దామా?
భూ నిర్వాసితులపై పీసీసీ భేటీలో చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసేకరణ చట్టాన్ని అమలుచేయకుండా, రైతులపై దాడులకు దిగుతున్న ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలనే ప్ర తిపాదనపై పీసీసీ చర్చించింది. భూసేకరణ అంశం, అటవీ భూముల చట్టంపై పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీలు గురువారం గాంధీభవన్‌లో సమావేశమయ్యాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు డి.కె.అరుణ,సునీతాలక్ష్మారెడ్డి, ముఖ్యనేతలు శ్రవణ్, పొన్నం ప్రభాకర్, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తది తరులు పాల్గొన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్న జీఓ 123 వంటివాటిపై దేశ వ్యాప్తంగా చర్చ లేవనెత్తడానికి రాహుల్‌గాంధీ పర్యటన ఉపయోగపడుతుందని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.ఈ ప్రతిపాదన రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకుపోయి, తరువాత నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు. అప్పటిదాకా కేవలం మల్లన్నసాగర్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల కింద మునిగిపోతున్న భూములు, అక్కడి నిర్వాసితుల తరుపున పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు. -
ప్రాజెక్టులు ఆపాలని బంద్ చేయడమా?
ఇలాంటి విపక్షాలు ఉండడం సిగ్గుచేటు: తుమ్మల నాగర్‌కర్నూల్: ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాల ని బంద్‌లు, ధర్నాలు చేస్తారని, కానీ ప్రాజెక్టులు ఆపాలని ప్రతిపక్షాలు బంద్‌లు చేయ డం ఏమిటని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు తెలంగాణలో ఉండ టం సిగ్గుచేటన్నారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని, అయినా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయన్నారు. గత పాలకుల అసమర్థతతోనే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తి చేసి నీరందిస్తున్నా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయన్నా రు. ప్రతిపక్షాలు చిల్లరరాజకీయాలను మా నుకోవాలని మంత్రి హితవు పలికారు. లెక్కలు చెప్పేందుకు సిద్ధమే: జూపల్లి తెలంగాణలో ఎవరెవరి హయాంలో ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత నిధులు కేటాయిం చారో లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరి నా ఎవరూ ముందుకు రావడంలేదని జూపల్లి అన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించే వరకు పట్టువదలమని నాగం, రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాగంను ఓయూలో ఓ పట్టుపట్టాకే తెలంగాణ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. -
భూసేకరణ చట్టం ద్వారానే సేకరించండి
ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణపై లోకాయుక్త ఆదేశం సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూమిని... 2013 భూసేకరణ చట్టం ద్వారా మాత్రమే సేకరించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సెప్టెంబరు 13లోగా నివేదిక సమర్పించాలని ఇటీవల వీరికి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రైతుల నుంచి రెవెన్యూ అధికారులు జీవో 123 కింద బలవంతంగా భూములను సేకరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ దాఖలు చేసిన పిటిషన్లను లోకాయుక్త ఇటీవల విచారించారు. ఇష్టపూర్వకంగా ఇచ్చే రైతుల నుంచే తాము భూములు కొనుగోలు చేస్తామంటూ జీవో 123 తెచ్చారని, అయితే ఈ జీవోను అడ్డుపెట్టుకొని రెవెన్యూ అధికారులు బలవంతంగా, రైతులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి భూమిని కొనుగోలు చేస్తున్నారని పద్మ తెలిపారు. ఖాళీ బాండ్ పేపర్లపై రైతుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారని.. 2013 చట్టం కన్నా తామే ఎక్కువ పరిహారం ఇస్తున్నామని, భూములు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ చేసే ముందు ప్రత్యేకంగా మార్కెట్ విలువను పెంచాలని చట్టం చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు స్పందించిన లోకాయుక్త... భూమిని విక్రయించాలంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని, 2013 భూసేకరణ చట్టం ద్వారా మాత్రమే భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు. -
అసలు మంత్రులకు అవగాహన ఉందా?
2013 భూ సేకరణ చట్టంపై కాంగ్రెస్ నేత భట్టి ప్రశ్న సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ సేకరణ చట్టం 2013పై రాష్ట్ర మంత్రులలో అనేక మందికి కనీస అవగాహన కూడా లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చట్టానికి కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూసేకరణ చట్టానికి- భూకొనుగోలుకు రూపొందించిన ఉత్తర్వుకు మధ్య వ్యత్యాసం ఏమిటో ముందు మంత్రులు తెలుసుకోవాలన్నారు. గురువారం ఇక్కడ మాజీ మంత్రులు డీకే అరుణ, చిత్తరంజన్‌దాస్, ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ముందుకొచ్చిన వారివే కొంటున్నాం..
- రాని వారి నుంచి బలవంతంగా తీసుకోవడం లేదు - అవసరమైన భూములను భూ సేకరణ చట్టం కింద తీసుకుంటాం - ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది - హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ - ఏజీ వాదనలను రికార్డ్ చేసిన హైకోర్టు - మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధిత రైతుల పిటిషన్ పరిష్కారం సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకొస్తే వాటినే కొనుగోలు చేస్తున్నాం తప్ప, ఎవ్వరినీ కూడా భూముల కోసం బలవంతం చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. విక్రయించడానికి సిద్ధంగా లేని వారి భూములు ఈ ప్రాజెక్టు కోసం అవసరమైతే వాటిని భూ సేకరణ చట్టం కింద సేకరిస్తామని తెలిపింది. దీనిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు, జీవో 123 ఆధారంగా భూములు ఇవ్వాలని ఎవ్వరినీ బలవంతం చేయవద్దని సూచించింది. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ జీవో 123పై అభ్యంతరాలుంటే దానిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. భూములను చట్ట ప్రకారమే సేకరిస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను ప్రభుత్వం 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద కాకుండా జీవో 123 కింద బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మెదక్ జిల్లా, తోగుట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు అడియాల రంగారెడ్డి, మరో 14 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది శివకుమార్ వాదనలు వినిపిస్తూ, భూముల కోసం అధికారులు రైతులను బెదిరిస్తున్నారన్నారు. స్వచ్ఛందంగా ఇవ్వకుంటే బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని వివరించారు. 2013 భూ సేకరణ చట్టం కింద భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భూముల విలువ పెరిగిందని, ప్రస్తుతం తమ ప్రాంతంలో ఎకరా రూ.10 లక్షలు ఉందన్నారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏ ఒక్క రైతు భూమినీ బలవంతంగా తీసుకోవడం లేదని తెలిపారు. అమ్మాలనుకునేవారి వద్దకు ఓ కొనుగోలుదారులా ప్రభుత్వం వెళ్లి చర్చలు జరిపి ఆ తరువాతనే భూమిని కొనుగోలు చేస్తోందన్నారు. ఒకవేళ భూమిని అమ్మేందుకు ఇష్టం లేకపోతే రిజిస్ట్రేషన్‌కు నిరాకరించే హక్కు అమ్మకపుదారులకు ఉందన్నారు. తమ భూమికి ఎంత ధరైనా చెప్పే హక్కు అమ్మకపుదార్లకు ఉందని, ఎకరా రూ.10 కోట్లు కూడా చెప్పొచ్చునని, ప్రభుత్వానికి ఇష్టం ఉంటేనే కొనుగోలు చేస్తుందన్నారు. భూముల కొనుగోలు ఎలా ఉండాలో ఓ విధానాన్ని రూపొందించి, ఆ మేరకు జీవో 123 జారీ చేశామని కోర్టుకు నివేదించారు. అమ్మేందుకు నిరాకరించిన వారి భూములు ప్రాజెక్టుల కోసం అవసరమని భావిస్తే వాటిని భూ సేకరణ చట్టం కింద చట్ట ప్రకారం సేకరిస్తామన్నారు.ఈ అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఇదే అంశంపై కోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపారు. ఎన్ని వ్యాజ్యాలు దాఖలైనా వాటిన్నింటిలో కూడా చట్టం ప్రకారం వ్యవహరించాలని ఉత్తర్వులు జారీ చేయవచ్చునని, అందుకు తమకు అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. భూములను చట్ట ప్రకారమే సేకరిస్తామని ఏజీ చెప్పడాన్ని రికార్డ్ చేసిన న్యాయమూర్తి, ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. -
'రకరకాల జీవోలతో ప్రభుత్వం మోసం చేస్తోంది'
హైదరాబాద్: మల్లన్న సాగర్‌తో పాటూ అన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జీవో 123తో ఎక్కువ పరిహారం వస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రకరకాల జీవోలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు. -
2013 భూ సేకరణ చట్టం అమలుకు సిద్ధం
- ‘మల్లన్న’ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం - మంత్రి హరీశ్‌రావు ప్రకటన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రైతులు కోరితే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై నోటిఫికేషన్ ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గతంలో భూ నిర్వాసితులు కాళ్లకు చెప్పులు అరిగేటట్టు తిరిగే వారని, తండ్రి చనిపోతే కొడుకులు డబ్బుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, అలాంటి ఇబ్బం దులు రావొద్దనే జీవో నెంబర్ 123 తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. జీవో 123 ప్రకారం 2013 భూ సేకరణ చట్టం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముంపు బాధితులను కాపాడుకోవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ కూడా ముంపు బాధితుడే అని, గూడు చెదిరిన పక్షులగోడు ఎలా ఉంటుందో స్వయంగా సీఎం అనుభవించారని చెప్పారు. ముంపు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ఇస్తున్న ప్యాకేజీ దేశంలోనే నెంబర్ వన్ ప్యాకేజి అని హరీశ్ చెప్పారు. ఎకరానికి యావరేజ్‌గా రూ. 6 నుంచి 7.5 లక్షల చొప్పున నష్టపరిహారం వస్తుందని వివరిం చారు. సమస్యను జటిలం చేసి ప్రాజెక్టులు పూర్తి కాకుండా కాంగ్రెస్, టీడీపీలు ప్రయత్నం చేస్తున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. పోలవరం కట్టడానికి చంద్రబాబు ఏకంగా ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుకుంటే అక్కడ ఎందుకు దీక్షలు చేయలేదని పరోక్షంగా టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. -
నిర్వాసితులకు బాసట: ఉత్తమ్
నేడు మల్లన్నసాగర్‌కు టీపీసీసీ బృందం సాక్షి, హైదరాబాద్: భూనిర్వాసితులకు న్యాయం జరిగే దాకా పోరాడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో ఉల్లంఘనలపై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కడానికి, రైతుల నుంచి అన్యాయంగా భూమిని తీసుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 తెచ్చిందని దుయ్యబట్టారు. ఈ సమావేశం వివరాలను పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి మీడియాకు వివరించారు. తాము ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వారికి న్యాయం జరిగేదాకా పార్టీ అండగా ఉంటూ పోరాటం చేస్తుందన్నారు. మల్లన్నసాగర్లో భూమి కోల్పోతున్నవారితో మాట్లాడటానికి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంగళవారం టీపీసీసీ సబ్‌కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ నేతృత్వంలో కమిటీ పర్యటిస్తుందని వెల్లడించారు. సబ్‌కమిటీ సమావేశంలో పార్టీ నేతలు దామోదరతోపాటు డీకే అరుణ, ఎం.కోదండరెడ్డి, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉత్తమ్‌కు గవర్నర్ శుభాకాంక్షలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో వేడుకలు జరిగాయి. పార్టీ నేతలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలను తెలియజేశారు. గవర్నర్ నరసింహన్ కూడా ఉత్తమ్‌కు ఫోన్లో శుభాకాంక్షలను తెలిపారు. -
రైతుల వినతులపై నిర్ణయం తీసుకోండి
‘పాలమూరు’ భూసేకరణపై కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు సేకరించాలనుకుంటే తమకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం కరుకొండ గ్రామానికి చెందిన రైతులు పెట్టుకున్న వినతిపత్రాలను పరిశీలించాలని హైకోర్టు గురువారం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అప్పటివరకు పిటిషనర్ల భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం జీఓ 123 కింద చర్యలు చేపట్టిందని, అధికారులు తమ భూ ములను బలవంతంగా తీసుకుంటున్నారని, దీనిని అడ్డుకోవాలని కారుకొండ గ్రామానికి చెందిన బి.స్వామిరావు, మరో 23 మందిరైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, జీవో 123ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. భూ ముల అమ్మడానికి ఆసక్తి కనబరిచే రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు విధి విధానాలను రూపొ ందిస్తూ జారీ చేసిన ఈ జీవో 123 వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని తెలిపారు. అంతేకాక భూ సమీకరణ సమయంలో బాధితులకు పునరావాసం కల్పిస్తామని పేర్కొన్న ప్రభుత్వం, తరువాత ఈ క్లాజును తొలగిస్తూ మరో జీఓ జారీ చేసిందని వివరించారు. రైతుల నుంచి అధికారులు బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది (భూ సేకరణ) జువ్వాది శ్రీదేవి జోక్యం చేసుకుంటూ ఈ వాదనలను తోసిపుచ్చారు. పిటిషనర్లవి కేవలం ఆరోపణలేనన్నారు. తాము ఏ ఒక్క రైతు నుంచి బలవంతంగా సెం టు భూమిని కూడా తీసుకోవడం లేదని వివరించారు. నిబంధనల మేరకే భూ సేకరణ చేపడుతున్నామని చెప్పారు. తరువాత రచనారెడ్డి వాదనలను కొనసాగిస్తూ.. పిటిషనర్లు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించేలా చూడాలంటూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల వినతిపత్రాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అప్పటి వరకు పిటిషనర్ల భూముల జోలికి వెళ్లొద్దని అధికారులకు తేల్చి చెబుతూ ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించారు. -
‘మల్లన్న’ సమస్య పరిష్కరిద్దాం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న మలన్న సాగర్(తడ్కపల్లి) రిజర్వాయర్ పరిధిలో నెలకొన్న భూసేకరణ, పరిహారం సమస్యను కొలిక్కి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి నిర్వాసితులు కోరినట్లుగా పరిహారం చెల్లించాలని భావిస్తోంది. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే పరిహారం చెల్లించాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వపరంగా బుధవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాళేశ్వరం నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం గత ఏడాది జనవరిలో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, పాములపర్తి రిజర్వాయర్‌ను 1 నుంచి 7 టీఎంసీలకు పెంచేందుకు సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా రిజర్వాయర్ల పరిధిలో ముంపు, వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం, అవసరమైన భూసేకరణ తదితరాలపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కువ భారం మల్లన్న సాగర్‌పైనే కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. దీంతో పాటు ఇక్కడ్నుంచి ఒకవైపున నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌కు లింకేజీ ఉంది. మరోవైపు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్లకు మల్లన్నసాగర్ నుంచే నీటిని తరలించేలా ప్రణాళికలు రచించారు. సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు కూడా మల్లన్నసాగర్ నుంచి నీటిని సరఫరా చే యాలని నిర్ణయించారు. మొత్తంగా ఎక్కువ లింకేజీలు ఇక్కడే ఉన్నాయి. దీంతో ఇక్కడ సామర్థ్యం తగ్గించడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఈ రిజర్వాయర్ వ్యయం రూ.1,954 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ.12,903 కోట్లకు చేరింది. దీనికి ఇటీవలే కేబినెట్ ఓకే చెప్పింది. రిజర్వాయర్ సామర్థ్యం పెరగడంతో ఇక్కడ 23 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. సుమారు 11 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారు. ఎక్కువగా భూములు కోల్పోవాల్సి రావడంతో నిర్వాసితులు గత 20 రోజులుగా ఆందోళన తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజా సంఘాలు సైతం నిర్వాసితుల పరిహారంపై ఆందోళనలు చేపట్టాయి. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 123 ప్రకారం.. ఎకరాకు రూ.6.50 లక్షల వరకు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ పరిహారం తమకు ఏమాత్రం సరిపోదని నిర్వాసితులు అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ముంపు గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఎకరా భూమి రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పెరిగాయి. కొన్ని గ్రామాల్లో ఏకంగా గుంట భూమిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు తక్కువకు అమ్మరాదని గ్రామ కమిటీలు తీర్మానం చేశాయి. ఇది నిర్వాసితులకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో వారు పొరుగు ప్రాంతాలకు వెళ్లి ఏమాత్రం బతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం అయితే మార్కెట్ ధరలకు నాలుగింతల పరిహారం, భూములపై ఆధారపడ్డ కూలీలకు రూ.5 లక్షల వరకు పరిహారం లేక 20 ఏళ్ల పాటు రూ.2 వేల జీవన భృతి, రవాణా చార్జీలకు రూ.50 వేల వరకు అదనపు పరిహారం వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చేందుకు 6 నుంచి 8 నెలల గడువు పడుతుండటం, కోర్టుల్లో కేసులు నమోదైతే పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం జీవో 123 ప్రకారం చెల్లింపులు చేస్తామని చెబుతోంది. అయితే నిర్వాసితులంతా 2013నాటి చట్టం ప్రకారం పరిహారం కోరుతుండటంతో దాని వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 2013 చట్టం ప్రకారం పరిహారం: మంత్రి హరీశ్‌రావు మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం విషయంలో రైతుకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరితేనే జీవో 123ని వర్తింపజేస్తున్నాం. గతంలో కన్నా ఈ పరిహారం చాలా మెరుగ్గా ఉంది. అయితే జీవో-123 ఫైనల్ అని ఎక్కడా లేదు. నిర్వాసితులు కోరితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై ప్రభుత్వపరంగా అధికారిక ప్రకటన చేస్తాం. -
'పోలవరం నిర్వాసితులు ఆశ్రయిస్తే పరిశీలన'
న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా, పోలవరం నిర్వాసితులు ఎవరైనా తమను ఆశ్రయిస్తే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
పోలవరం నిర్వాసితుల సమస్యలపై నివేదిక
జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం వెల్లడి పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుబారిన పడే రామయ్యపేట గ్రామంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సోమవారం పర్యటించింది. కమిషన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లా) ఇంద్రజిత్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ రజబీర్‌సింగ్‌లతో కూడిన బృందం గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లి నిర్వాసితుల సమస్యలను నమోదు చేసుకుంది. అనంతరం బృంద సభ్యులు పైడిపాక, చేగొండపల్లి, శింగనపల్లి, మామిడిగొంది, దేవరగొంది నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గ్రామం ఖాళీ చేయమంటున్నారని రామయ్యపేట, పైడిపాక గ్రామాలకు చెందిన పలువురు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. అద్దె ఇళ్లల్లోకి వెళ్ళమంటున్నారని, తమ భూములకు 2006, 2007 సంవత్సరాలలో తక్కువ నష్టపరిహారం చెల్లించారని చెప్పారు. 2013 కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని కోరారు. నిర్వాసితులంతా గ్రామాలు ఖాళీ చేసినట్టు, పునరావాస కార్యక్రమాలు పూర్తిగా అమలు చేసినట్టు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక పంపారని ఆర్థిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. నిర్వాసితులు ఇంకా గ్రామాల్లోనే ఉన్నారని చెప్పారు. వారికి కొత్త భూసేకరణ చట్టం వర్తింప చేయాలని కోరారు. ఈసందర్భంగా బృంద సభ్యుల్లో ఒకరైన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంద్రజిత్ కుమార్ మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రాయితీలు అన్నీ అందుతాయన్నారు. బృందం వెంట భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఆర్డీవో ఎస్.లవన్న ఉన్నారు. -
అలా చేస్తే పోలవరం పడుకుంటుంది!
- కేంద్రానికి అప్పగిస్తే పోలవరం ప్రాజెక్టు పడకేసినట్లేనన్న చంద్రబాబు - 2018 కల్లా పూర్తిచేస్తామంటే ఈ క్షణమే అప్పగిస్తానని వ్యాఖ్య - ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కుదరదని తేల్చిచెప్పిన సీఎం సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పడుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం చెబితే దీన్ని ఈ క్షణమే అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఆవేశంగా ప్రకటించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరు తూ బుధవారం అసెంబ్లీలో ప్రతిపాదించిన తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ సీఎం ఈ మాటలు చెప్పారు. ‘పోలవరం జాతీయ ప్రాజె క్టని కేంద్రానికిచ్చి ఇంట్లో పడుకుంటే ప్రాజెక్టు కూడా అలాగే పడుకుంటుంది. 2018కల్లా ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలి. ఇందుకు మేం డబ్బు ఖర్చుపెడతాం. కేంద్రానికి చెప్పే పనులు చేస్తున్నాం. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించి, ముందుకెళ్లి పూర్తి చేసి కరువు ప్రాంతాలకు నీరివ్వాలన్నదే లక్ష్యం’ అని చంద్రబాబు అన్నారు. సీఎం వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న అధికార వర్గాలు ఇదిలా ఉండగా పోలవరంపై సీఎం వ్యాఖ్యల్ని రాజకీయ నేతలే కాకుండా అధికారవర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ‘‘2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పగలిగితే కేంద్రానికి ప్రాజెక్టు పనులను అప్పగించేందుకు సిద్ధమని సీఎం అనరాదు. అసలు ఈయనే తనవారికి పనులు అప్పగించి కమీషన్లు తీసుకునేందుకు లాబీయింగ్ చేసి మేమే పోలవరం పనులు చేసి బిల్లులు సమర్పిస్తాం. మీరు రీయింబర్స్ చేయండి అని కోరారు. ఇప్పుడు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు’’ అంటూ అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కుదరదు: చంద్రబాబు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు కుదరదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు శాసనసభలో చట్టం చేయలేమని స్పష్టం చేశారు. సీపీఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నేత జల్లి విల్సన్, బీసీ ఉద్యమ నేత కె.రామాంజనేయులు నాయకత్వంలో పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులు బుధవారమిక్కడ సీఎం చంద్రబాబును కలసి చేసిన డిమాండ్ కు ఆయన ఈవిధంగా స్పందించారు. బీసీ, మైనారిటీ సంక్షేమం, అభివృద్ధికి సబ్ ప్లాన్ చట్టం చేయాలని వారు కోరగా సాధ్యం కాదని సీఎం బదులిచ్చారు. అయితే ఇందుకు కారణాలను వెల్లడించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు నిరుపయోగంగా మారుతున్నాయని, ప్రభుత్వ రంగం 15 శాతానికి తగ్గి ప్రైవేటు రంగం 85 శాతానికి చేరిన నేపథ్యంలో రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
‘ఎన్‌హెచ్’కు భూములిచ్చిన రైతులకు అధిక పరిహారం
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ప్రాజెక్టుల్లో భూమిని కోల్పోయిన రైతులకు శుభవార్త. కొత్త భూసేకరణ చట్టం(రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ యాక్ట్, 2013) ప్రకారం వారికి అధిక పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత భూసేకరణ చట్టం(ఎన్‌హెచ్ యాక్ట్ 1956) కింద భూములు కోల్పోయి పరిహారం అందని వారికి పెంపు వర్తిస్తుంది. ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఐడీసీఎల్ తదితర సంస్థలకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆ శాఖ అధికారి తెలిపారు. జనవరి 1, 2015లోపు పరిహార మొత్తం విషయంలో నిర్ణయం జరిగి, పరిహార మొత్తం చెల్లించని, లేదా భూసేకరణ జరగని(భూమి స్వాధీనం కాని) కేసులకు సంబంధించిన రైతులకూ ఈ పెంపు వర్తిస్తుందన్నారు. -
ముంపు రైతులకు న్యాయం చేయాలి
గోపాల్పేట : వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట పెట్టుబడికి పెట్టిన అప్పులు తీర్చే మార్గంలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అభయమివ్వాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో ముంపు భూములతో రైతులను మరింత ఆందోళనకు గురిచేయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈర్ల నర్సింహ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తమ పార్టీ వ్యతిరేక కాదన్నారు. కానీ ముంపు రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి బండరావిపాకులలో దీక్షలు చేస్తున్న ముంపు భూముల రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఏదుల, కొంకలపల్లి గ్రామాలను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం గోపాల్‌పేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూములు తీసుకునే ముందు రైతుల ఆంగీకారం కచ్చితంగా తీసుకోవాలని భూసేకరణ చట్టం చెబుతుందన్నారు. ఇప్పుడున్న మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు జోడించి బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. భూమి కోల్పోయిన రైతుకు మరోచోట భూమి చూపించడం, లేదా పరిహారాన్ని పెంచి ఇవ్వడం, ఇండ్లు కోల్పోతున్న వారికి అనువైన చోట పున రావాసం కల్పించడం, 98 జీవో ప్రకారం కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు చేసి పూర్తి చేయగలిగితే 8లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కలెక్టర్, అధికారులు భూములు ఇవ్వకుంటే లాక్కుంటామని రైతులను బెదిరించడం మంచిపద్ధతి కాదన్నారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర బృందం బండరావిపాకులను సందర్శించి ముంపు రైతులతో మాట్లాడుతారని తెలిపారు. సమావేశంలో డి.చంద్రయ్య, జె. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన ఉద్యమం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని మచిలీపట్నం : మండలంలోని 17 గ్రామాలు, పెడన మండలంలోని రెండు గ్రామాల్లో 30 వేల ఎకరాల భూమి సేకరించేందుకు ప్రయత్నిచండం ప్రభుత్వ భూ దాహానికి అద్దం పడుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. ఆయన ఆదివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఆ విషయాన్ని పక్కనపెట్టి, భూసేకరణ చట్టం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండటంతో హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులెవ్వరూ భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేరని, వారికి అండగా వైఎస్సార్ సీపీ నిలబడుతుందని ప్రకటించారు. పోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌కు అయ్యే ఖర్చులు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకా, ముందు ఆలోచిస్తుంటే కలెక్టర్ బతిమలాడుకుని రూ.5 కోట్లు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. 30 వేల ఎకరాలుసేకరణ చేస్తే రైతులకు నష్టపరి హారం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద నగదు ఉందా, ఉంటే ఎప్పటిలోగా అందజేస్తారు, రైతులు భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో, లేదో తెలుసుకోకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ వరకు వెళ్లడం అన్యాయమన్నారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు తమ ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పడానికి పాలకులు ఈ కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. అనంతరం రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పినా ఆశ్చర్యం లేదని పేర్ని నాని పేర్కొన్నారు. -
అసమానతలకు కాంగ్రెస్సే కారణం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజల మధ్య అసమానతలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, కాంగ్రెస్ ఎంపీల నిజస్వరూపాన్ని ప్రజలకు వివరిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్దీభాయ్ చౌదరి అన్నారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించిన తీరు, అప్రజాస్వామిక పోకడలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. దేశంలో సమతుల్యమైన అభివృద్ధికోసం దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అభివృద్ధిలో అంతరాల వల్లే నక్సలిజం మొదలైందన్నారు. నక్సలిజాన్ని అరికట్టడానికి ద్విముఖ వ్యూహంతో పనిచేస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్‌తో చర్చల్లో ఉగ్రవాదమే ప్రధానమైన అజెండా అని పేర్కొన్నారు. పాక్‌ను కట్టడి చేసే వ్యూహంతోనే చర్చలు జరుగుతాయన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఈ నెల 25 న, నాగర్‌కర్నూలులో 26 న పర్యటించనున్నట్లుగా చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా, టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తామని చెబుతున్న సీఎం ఆచరణలో చూపించడం లేదన్నారు. మహిళలే పోలీసుస్టేషన్లలో హత్యకు గురౌతుంటే కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తూ ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను, నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు దినేశ్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి, బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజధానా? వ్యాపారమా?
సాక్షి, గుంటూరు: పాలకులు రాజధాని కడుతున్నారా? లేక రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? అంటూ జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ఎదుట రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం, అధికారులు మారిపోతే తమకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టం కింద నోటిఫికేషన్ ఇవ్వడంతో పవన్‌కల్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాక గ్రామంలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, బేతపూడి, నవులూరు, నిడమర్రు, కురగల్లు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ కింద రాజధానికి భూములు ఇచ్చేందుకు మీకున్న అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు తీసుకున్నారని రైతులు చెప్పారు. ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఇవ్వలేదని తెలిపారు. 29 గ్రామాల్లో ఓపెన్‌బ్యాలెట్ పెడితే అసలు విషయం బయటపడుతుందన్నారు. పవన్‌కల్యాణ్ రాక కోసం ఉదయం నుంచి ఎదురుచూసిన అభిమానులు ఆయన మాట్లాడుతున్న సమయంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఇదే సమయంలో విలేకరులపై రాళ్లు రువ్వారు. ఒక రాయి పవన్ పక్కనే పడింది. దీంతో పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీచార్జి చేశారు. -
భూముల జోలికి పోకండి!
-
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
-
ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...
-
ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...
హైదరాబాద్ : భూ సేకరణ చట్టం అమలుపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దంటున్న పవన్ కల్యాణ్ .... ఏం చేయాలో కూడా చెబితే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పరిహారం కోరాలి కానీ ...భూ సేకరణ వద్దంటే ఎలా అని యనమల ప్రశ్నించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, బేతపూడి గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని పవన్ సూచించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజధాని ప్రాంతంలో ఈ నెల 20 నుంచి భూసేకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బలవంతంగా భూసేకరణ చట్టాన్ని అమలు చేయరాదని, రైతుల నుంచి భూములు లాక్కోవద్దని పవన్ ...ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
హైదరాబాద్ : భూ సేకరణపై సిననటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్ చేశారు. రాజధాని పరిధిలోని గ్రామాల భూములను భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవద్దని ఆయన ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ట్విట్ చేశారు. ఏడాదికి మూడు పంటలు పండే పెనుమాక, ఉండవల్లి, బేతపూడితోపాటు ఇతర గ్రామాల భూముల విషయంలో భూ సేకరణ చట్టాన్ని వినియోగించవద్దని ఆయన సూచించారు. తక్కువ నష్టంతో ఎక్కువ అభివృద్ధి జరగాలని, పాలకులు వివేకంతో ఆలోచించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్నికోరుతూ పవన్ గతంలోనూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. on Fertile Multi cropped Lands of Undavalli,Penumaka,Bethapudi..& other River front villages. — Pawan Kalyan (@PawanKalyan) August 19, 2015 I urge Hon'ble CM of AP ..Sri CBN garu not to Use 'Land acquisition act' — Pawan Kalyan (@PawanKalyan) August 19, 2015 -
20 తర్వాత భూ సేకరణ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని కోసం భూములను ఈ నెల 20 తర్వాత నుంచి భూ సేకరణ చట్టం ద్వారా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అప్పటి వరకూ సమీకరణ విధానంలోనే భూములు తీసుకోవాలని తీర్మానించారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాజధాని సలహా కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానికి ఇంకా 2,200 ఎకరాలు అవసరం ఉందని, రైతులు భూ సమీకరణకు అంగీకరించకపోతే చట్టం ప్రకారం సేకరించాలని నిర్ణయించారు. రాజ దాని నిర్మాణం పనులు అక్టోబర్ 22 తరువాత చేపట్టాలని, ఉపాధి, ఆర్థిక ప్రగతి అంశాలకు అమరావతి రాజధానిలో ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు తగిన స్థలం కేటాయించాలని, నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం సూచించారు. సమర్థవంతమైన రవాణా వ్యవస్థ రూపొందించేందుకు అత్యుత్తమ కన్సల్టెంట్స్ను సంప్రదించాలన్నారు. ప్రతి శుక్రవారం సమీక్ష..: రాజధాని సలహా కమిటీ సభ్యులు ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీలుగా ఇక నుంచి ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రాజధాని అంశాలపై సమీక్షిస్తామని సీఎం చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలో 22వేల మంది కూలీలకు ఉపాధికి క్లీన్ అండ్ గ్రీన్ పనులు అప్పగించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని, ప్రత్తిపాటి, నారాయణ, అధికారులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం నుంచి గోదావరి జిల్లాల్లో విలీనమైన మండలాల్లోని 333 టీచర్ పోస్టులను 30 రోజుల్లో భర్తీ చేస్తామని సీఎం చెప్పారు. -
భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్
-
భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్
హైదరాబాద్: 'భూసేకరణ సమస్యని సామరస్య వాతావరణంలో పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను' అని జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా' అంటూ పవన్ ట్విట్ చేశారు. I request TDP govt not to use 'Land acquisition act' to procure the remaining land for AP capital. — Pawan Kalyan (@PawanKalyan) August 13, 2015 Bhoo sekarana samasyani samarasya vatavarnamlo parishkarinchi munduku velltharani nenu asisthunnanu. — Pawan Kalyan (@PawanKalyan) August 13, 2015