భూసేకరణ చట్టం ద్వారానే సేకరించండి | Gather by the Land Acquisition Act | Sakshi
Sakshi News home page

భూసేకరణ చట్టం ద్వారానే సేకరించండి

Published Mon, Aug 29 2016 8:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Gather by the Land Acquisition Act

 -ఏపీ సర్కారుకు లోకాయుక్త ఆదేశం
సాక్షి, హైదరాబాద్

రాజధాని నిర్మాణం కోసం అవసరమయ్యే భూమిని బలవంతంగా సేకరించరాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే సేకరించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారుకు ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణం కోసం సారవంతమైన భూములను రైతులను బెదిరించి బలవంతంగా సేకరిస్తున్నారంటూ హైకోర్టు న్యాయవాది రాజ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సోమవారం మరోసారి విచారించారు. మా పొట్టకొట్టి కట్టేది ప్రజా రాజధాని అవుతుందా’’ అంటూ రైతుల అభిప్రాయాలతో గతంలో సాక్షి ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన లోకాయుక్త దృష్టికి తెచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద స్వచ్ఛందంగా ఇచ్చే రైతుల నుంచి మాత్రమే భూములను సేకరిస్తున్నామని, ఇందుకు సిద్దంగాలేని రైతుల నుంచి భూసేకరణచట్టం ప్రకారం భూమిని సేకరిస్తామని అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న లోకాయుక్త...ఈ పిటిషన్‌పై విచారణను ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement