సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర భూసేకరణ చట్టానికి రాష్ట్రాలు సవరణలు చేస్తూ అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్ర దేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో నిర్వాసితులకు ప్రయోజనకారిగా ఉన్న అనేక నిబంధనలను తొలగిస్తూ ఆ చట్టానికి ఏపీ, తెలంగాణ, గుజ రాత్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలు సవరణ లు చేసి అమలు చేయడాన్ని సామాజికవేత్త మేథా పాట్కర్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. నిర్వాసితుల అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలు చేశారని, ఉపాధి, భద్రత కల్పించకుండా నిర్వాసితులను ఆందోళనలోకి నెట్టేశారని వాదించారు. సామాజిక ప్రభావ మదింపు అంచనా లేకుండానే భూసేకరణ జరపడం 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధమని నివేదించారు. నిర్వాసితుల ప్రాథమిక హక్కుల కు భంగం కలిగేలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని సవరించాయన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాస నం ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఐదు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment