Notices issued
-
Supreme Court: బిల్లులు ఎందుకు ఆపేశారో చెప్పండి
న్యూఢిల్లీ: కేరళ, పశి్చమ బెంగాల్ శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అంగీకారం తెలియజేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గవర్నర్ల వైఖరిని సవాలు చేస్తూ కేరళ, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేంద్ర హోం శాఖకు, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, బెంగాల్ గవర్నర్ ఆనందబోసు కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. బిల్లులను ఎందుకు పెండింగ్‌లో కొనసాగిస్తున్నారో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పిటిషన్లో కేంద్ర హోంశాఖను సైతం ఒక పార్టీగా చేర్చాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. తమ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ అంగీకారం తెలియజేయడం లేదంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
NEET-UG 2024: ‘నీట్’పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి నోటీసులు జారీ చేసింది. హతేన్‌సింగ్ కాశ్యప్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్తాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు చేయొద్దని హితవు పలికింది. -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్!
విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఆక్రమణలో ఉన్న మిగులు భూమిని 0.3530 చదరపు మీటర్లుగా తేలుస్తూ 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి జాయింట్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలతో 22ఏ జాబితాను విడుదల చేశారు. మిగులు భూమిగా తేల్చిన మొత్తాన్ని 22 ఏ 1(డీ) జాబితాలో టీడీపీ ప్రభుత్వమే చేర్చింది. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వేలో భాగంగా మళ్లీ పక్కాగా సర్వే చేసి గాదిరాజు ప్యాలెస్‌లో వాస్తవ మిగులు భూమి కేవలం 0.1141 చదరపు మీటర్లుగా తేల్చింది. అంతేకాకుండా దీన్ని క్రమబద్ధీకరించుకోవాలని గత మే నెలలోనే జాయింట్ కలెక్టర్.. స్థానిక తహసీల్దార్ ద్వారా నోటీసులు జారీ చేశారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పక్కాగా యాజమాన్య హక్కులను పొందేందుకు గాదిరాజు రామకృష్ణరాజుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉండగా... దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అయ్యన్నపాత్రుడు అసత్య ఆరోపణలు చేశారు. వీటిపై స్పష్టత తీసుకునేందుకు శుక్రవారమంతా మీడియా ప్రయత్నించినా ఆయన ముఖం చాటేశారు. దీన్ని బట్టి కావాలనే ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/విశాఖ సిటీ ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గాదిరాజు ప్యాలెస్ ఉన్న ప్రాంతంలో యూఎల్సీ భూమి ఉన్నట్టు తేల్చిన విస్తీర్ణం కేవలం 0.1141 చదరపు మీటర్లు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా తేల్చిన సర్వే ప్రకారం మిగులు భూమి సుమారు 6 సెంట్ల మేర తగ్గింది. అంటే ప్రస్తుత ప్రభుత్వం పక్కాగా సర్వే చేసి వాస్తవ లెక్కలను తేల్చింది. దీన్నిబట్టి గత టీడీపీ ప్రభుత్వమే ఎక్కువ లెక్కలను చూపి గాదిరాజు యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేసిందని అర్థమవుతోంది. అయితే, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం కుటుంబంపై దుష్ప్రచారమే చేయడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలకు దిగారు. గాదిరాజు ప్యాలెస్ కావాలని దాని యజమానిని ముఖ్యమంత్రి సతీమణి కోరారని అభూత కల్పనలను సృష్టించేశారు. ఇందుకు గాదిరాజు ప్యాలెస్ యజమాని రామకృష్ణరాజు ఒప్పుకోకపోవడంతో ఆ ప్యాలెస్‌ను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారంటూ అసత్య ఆరోపణలు చేశారు. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి ఎంపీ టికెట్, తనకు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే చంద్రబాబు మెప్పు పొందొచ్చని దిగజారుడు రాజకీయానికి దిగారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రక్షణ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్సిటీ మొదలుకుని అనేక మంది టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేశారు. అందినకాడికి బినామీ పేర్లతో కబ్జా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరుల నుంచి రక్షించింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల్లో బోర్డులను పాతడంతో పాటు చుట్టూ అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్యాలెస్ అడిగారనేది పూర్తిగా అవాస్తవం.. గాదిరాజు ప్యాలెస్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తన అనుచరులను పంపించి అడిగించారన్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌పై కూడా అభాండాలు వేయడం బాధ కలిగించింది. ప్యాలెస్ ఇవ్వడానికి నేను ఒప్పుకోకపోవడంతో ప్యాలెస్ స్థలాన్ని 22ఏలో పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు ఇప్పించారని ఒక పత్రికలో వార్త రాయడం అన్యాయం. ఇంత దారుణమైన, అసలు సంబంధంలేని వార్తను నేనెప్పుడూ చూడలేదు. నేను అయ్యన్నపాత్రుడిని కలిసినట్లు చెప్పడం సమంజసం కాదు. ఇప్పటివరకు కనీసం నేరుగా కూడా ఆయనను చూడలేదు. వాస్తవానికి ఇదేం పెద్ద ప్యాలెస్ కాదు.. వేరే ప్రాంతంలో ఉన్న మోడల్‌ను చూసి నచ్చి ఇక్కడ నిర్మించుకున్నాను. పెద్దవారికి ఇది చాలా చిన్న విషయం.. ఇటువంటి బిల్డింగ్‌ను ఎవరైనా కట్టొచ్చు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నా.. ఇప్పటికీ కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరూ, ఎక్కడా కలవలేదు. రాజకీయాలతో ఏ సంబంధంలేని నన్ను, జిల్లా కలెక్టర్‌ను ఇందులో ఎందుకు లాగారో అర్థం కావడం లేదు. గాదిరాజు ప్యాలెస్ స్థలాన్ని 1997లో కొనుగోలు చేశా.. అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టా. ఈ భూమిలో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని.. ఏడాదిన్నర క్రితమే నోటీసు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బందిలో కొందరికి పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని చూపించారు. వాస్తవానికి గతంలోనే నిబంధనల ప్రకారం అన్నీ చెల్లించి ప్రతి గజాన్ని రిజిస్టర్ చేయించుకున్నా. అది యూఎల్సీ స్థలమని ఎవరైనా నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా. –గాదిరాజు రామకృష్ణరాజు, గాదిరాజు ప్యాలెస్ యజమాని వాస్తవాలు తెలుసుకోకుండా రాస్తే చర్యలు.. ప్యాలెస్‌కు సంబంధించిన భూమి చినవాల్తేరు గ్రామంలో సర్వే నెంబర్ 10/4ఏ2ఏ, 10/4ఏ2బీ/2ఏ, 10/5ఏ2లో 0.2937 చదరపు మీటర్ల విస్తీర్ణం మిగులు భూమిగా ఉన్నందున 2018లోనే ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఏ (1)(డీ) రిజిస్టర్లో నమోదైంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 84 ప్రకారం.. సదరు మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవాలని గాదిరాజు ప్యాలెస్ యజమానిని కోరుతూ ఈ ఏడాది మే 23న సీతమ్మధార తహసీల్దార్ నోటీసు జారీ చేశారు. ఒక పత్రికలో పేర్కొన్న విధంగా ప్యాలెస్ యజమాని ఎప్పుడూ కలెక్టర్‌ను ఈ విషయంపై సంప్రదించలేదు. ఈ విషయంలో ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ అధికారి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురిస్తే పరువునష్టం దావా వేసి న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్, విశాఖపట్నం బాబు మెప్పు కోసమే అయ్యన్న అసత్యప్రచారం డెప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆగ్రహం తిరుపతి కల్చరల్: కేవలం చంద్రబాబు మెప్పు కోసమే వైఎస్ కుటుంబంపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని డెప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడంతోపాటు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం జగన్ చేసే ప్రయత్నాలు గిట్టని టీడీపీ నేతలు నిత్యం అడ్డగోలు అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగానే 2018లో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించిన 3వేల చదరపు గజాల భూమిని 22ఏ 1డీ సీలింగ్‌లో పెట్టిందని చెప్పారు. ఆ భూమిని రెగ్యులరైజ్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఐదు నెలల కిందట ప్యాలెస్ యజమానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనకు, తన కుమారుడికి టికెట్ల కోసమే వైఎస్ జగన్ కుటుంబంపై అయ్యన్నపాత్రుడు బురదజల్లుతూ మతి భ్రమించి ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ కుట్ర రాజకీయాలకు కాలం చెల్లిందని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. అధికార దాహంతో అయ్యన్న చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (55)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన కొద్ది గంటలకే ఈ పరిణామం చెటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరును ఈడీ ఇప్పటికే పలుసార్లు పేర్కొనడం తెలిసిందే. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్యం విధానం 2021–22 తయారీ, అమలుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు అందులో చెప్పుకొచ్చింది. నవంబర్ 2న కేజ్రీవాల్ స్టేట్మెంట్ను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్ 16న కూడా 9 గంటలపాటు ప్రశ్నించింది. మండిపడ్డ ఆప్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లపై ఆప్ మండిపడింది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులో తమ అధినేతను ఎలాగైనా ఇరికించేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోందని ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో సిసోడియా అవినీతికి సంబంధించి చాలినన్ని రుజువులున్నాయని సుప్రీం బెయిల్ నిరాకరణతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. కనుక నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో అవినీతి జరిగినట్టు ఎలాంటి రుజువులూ లేవని కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలంతా ఇప్పటిదాకా చెప్తూ వచి్చందంతా పచ్చి అబద్ధమని రుజువైందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ అన్నారు. ఆది నుంచీ వివాదాలే ఢిల్లీ మద్యం విధానాన్ని 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మద్యం లైసెన్సుదారులకు నిబంధనలకు విరుద్ధంగా అనేక విధాలుగా కేజ్రీవాల్ సర్కారు లబ్ధి చేకూర్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. మద్యం విధానం తప్పుల తడక అని, ఎక్సైజ్ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు కనీసం భారీ నష్టం జరిగిందని, ఆప్ నేతలు తదితరులు లైసెన్సుదారుల నుంచి పలు మార్గాల్లో లబ్ధి పొందారని సీఎస్ నివేదించారు. ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో చివరికి 2022 జూలై 31న నూతన మద్యం విధానాన్ని కేజ్రీవాల్ సర్కారు రద్దు చేసింది. ఇందులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది. -
కౌంటర్ దాఖలు చేయండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అక్రమం అని, హనుమకొండ కోర్టు ఇచ్చిన డాకెట్ ఆర్డర్‌ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు గురువారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. అక్కడ బెయిల్ రాకుంటే హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు హనుమకొండ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచిన విషయం తెలిసిందే. విచారణ తర్వాత బండికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సంజయ్ గురువారం లంచ్‌మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. సంజయ్‌కు వ్యతిరేకంగా ఆధారాల్లేవు.. ‘సుప్రీంకోర్టు, హైకోర్టు పలు ఉత్తర్వుల్లో చెప్పినా.. పోలీసులు 41ఏ నోటీసులు ఇవ్వకుండానే సంజయ్‌ను రాత్రి 12 గంటల సమయంలో అరెస్టు చేశారు. కరీంనగర్లో అరెస్టు చేసి నేరుగా హనుమకొండకు తరలించకుండా, బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల పేరిట బొమ్మలరామారం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ హనుమకొండకు తీసుకొచ్చారు. వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే దాదాపు 300 కిలోమీటర్లు ఆయన్ను తిప్పారు. ఎక్కడి తీసుకెళుతున్నారు? ఎందుకు తిప్పుతున్నారో కూడా బండికి చెప్పలేదు. మరోవైపు పేపర్ లీకేజీపై పోలీసులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్టులో సంజయ్ నేరం చేసినట్లు పేర్కొనలేదు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం రాత్రి అరెస్టు చేస్తే.. బుధవారం సాయంత్రం వరకు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీ బండి హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హనుమకొండ మేజిస్ట్రేట్ ఇచ్చిన డాకెట్ ఆర్డర్ కొట్టివేయాలి. తక్షణమే సంజయ్‌ను విడుదల చేయాలి..’అని రామచందర్ రావు వాదించారు. మొబైల్ ఫోన్ ఇస్తే మరిన్ని వివరాలు ‘బండి మొబైల్ ఫోన్ నుంచి ఇతర నిందితుల ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్‌ల బదిలీ జరిగింది. పేపర్ లీకేజీ జరిగేలా ఆయన ప్రోత్సహించారన్న సమాచారం ఉంది. మొబైల్ ఫోన్ ఇస్తే వివరాలన్నీ తెలుస్తాయి. ఆధారాలు లభ్యమవుతాయి. పేపర్ లీక్ అయి ఆయనకు వచ్చిన మెసేజ్‌ను ఎంపీ పలువురికి పంపించారు’అని ఏజీ పేర్కొన్నారు. ‘ఒకసారి ప్రజా బహుళ్యంలోకి వివరాలు వచ్చాక అవి ఎవరు ఎవరికైనా పంపొచ్చు కదా..?’అని సీజే ప్రశ్నించారు. అయితే ఎంపీగా ఉన్న సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలే గానీ, ఇతరులకు పంపడం సరికాదని ఏజీ నివేదించారు. ‘హెబియస్ కార్పస్’లోనూ నోటీసులు.. బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ భాగ్యనగర్ అధ్యక్షుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌కు నోటీసులు జారీచేసింది.నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
బాబోయ్.. నల్లధనంపై రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్!
న్యూఢిల్లీ: నల్లధనం చట్టం కింద వెల్లడించని విదేశీ ఆదాయానికి సంబంధించి 368 కేసుల్లో (అసెస్మెంట్ పూర్తయిన తర్వాత) రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్ నోటీసుల జారీ అయినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నల్లధనంపై పన్ను వసూళ్లకు సంబంధించి 2022 మే 31వ తేదీ వరకూ డేటాపై లోక్‌సభలో ఆమె ఒక లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. హెచ్ఎస్బీసీలో రిపోర్టు (పేర్కొనని) చేయని విదేశీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లకు సంబంధించిన కేసుల్లో రూ.8,468 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చిందని తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,294 కోట్లకు పైగా జరిమానా విధించడం జరిగిందని వివరించారు. 30 సెప్టెంబర్ 2015తో ముగిసిన బ్లాక్ మనీ (బహిర్గతం కాని విదేశీ ఆదాయం, ఆస్తులు) ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్, 2015 కింద ఒన్ టైమ్ సెటిల్మెంట్గా (మూడు నెలల పరిమితితో) 648 కేసులకు సంబంధించి రూ.4,164 కోట్ల విలువైన వెల్లడించని ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో రూ.2,476 కోట్లకుపైగా మొత్తాన్ని పన్నులు, పెనాలిటీ రూపంలో వసూలయినట్లు ఆమె తెలిపారు. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అడిగిన ప్రశ్నలకు సీతారామన్ సమాధానం చెబుతూ, ‘‘భారత పౌరులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అధికారిక అంచనా లేదు’’ అని ఆర్థికమంత్రి అన్నారు. భారతదేశ నివాసితులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న డిపాజిట్లను విశ్లేషించడానికి స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) వార్షిక బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ సోర్స్‌ను ఉపయోగించరాదని స్విస్ అధికారులు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. స్విట్జర్లాండ్‌లో ఉన్న భారతీయ నివాసితుల డిపాజిట్లను విశ్లేషించడానికి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్‌కు సెటిల్మెంట్ (బీఐఎస్)కు చెందిన ‘‘లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్’’ అని పిలిచే మరొక డేటా సోర్స్‌ను వినియోగించుకోవచ్చని కూడా వారు వెల్లడించినట్లు తెలిపారు. లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2021లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లలో 8.3 శాతం క్షీణత నమోదయినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వెల్లడించని విదేశీ ఆస్తులు, ఆదాయాలపై పన్ను విధించేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో చేపట్టిన పలు చర్యలను కూడా ఆమె ఈ సందర్భంగా సభకు వివరించారు. -
నెల్లూరు ఆనందయ్యకు నోటీసులు జారీ
-
వచ్చేవారం పోలవరంపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చను కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత శుక్రవారం ఈమేరకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం తాము ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా చర్చకు పట్టుపట్టుతూ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. వివిధ పక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వెంటవెంటనే వాయిదాపడ్డాయి. ఆయా అంశాలపై వచ్చేవారం చర్చకు అనుమతిస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని సభ అనంతరం మీడియా సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. రాజ్యసభలో.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యంపై చర్చకు అనుమతించాలంటూ రూల్ 267 కింద వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2022 ఖరీఫ్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను జలశక్తిశాఖ సాంకేతిక కమిటీ ఆమోదించినా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1,917 కోట్లు ఇంకా రీయింబర్స్ చేయకపోవడం, ఇతరత్రా అంశాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోంది’ అని పేర్కొంటూ శుక్రవారం సభ కార్యకలాపాలు రద్దుచేసి ఈ అంశంపై చర్చ చేపట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసులో పేర్కొన్నారు. ‘ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలి. ఎవరైనా చట్ట సభ్యుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. ఏ గుర్తుపై పోటీచేసి గెలిచారో ఆ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కడం వంటిదే. సదరు సభ్యుడు ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య సూత్రాలను దుర్వినియోగం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సభాపతి లేదా చైర్మన్‌కు సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయాలని మెమొరాండం, పిటిషన్ ఇచ్చి కోరితే దానిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్చించాలి’ అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాను ఇచ్చిన నోటీసులో కోరారు. లోక్‌సభలో.. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై రూల్ 193 కింద స్వల్పకాలిక చర్చ కోరుతూ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. అయితే శుక్రవారం ఉభయసభలు వివిధ పక్షాల ఆందోళనతో పలుమార్లు వాయిదాపడ్డాయి. కేంద్రప్రభుత్వం వ్యాపారసంస్థలా వ్యవహరించరాదు వైఎస్సార్సీపీ ఎంపీలు బోస్, గీత, సురేశ్, అనూరాధ, సత్యవతి, మాధవి పార్లమెంటు ఉభయసభల్లోను వచ్చే వారంలో పోలవరంపై చర్చ జరగనుందని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని చెప్పారు. న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, నందిగం సురేశ్, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గొడ్డేటి మాధవి మీడియాతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం కేంద్రం మరిచినట్టు ఉందన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదల్లో జరుగుతున్న జాప్యంపై ఇటు రాజ్యసభలోను, అటు లోక్సభలోను చర్చకు అనుమతి కోరుతూ నోటీసులు ఇచ్చాం. పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కూడా అంగీకరించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయస్థాయి హోదా ఉన్న ప్రాజెక్టు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోతున్నట్టు ఉంది. పోలవరానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పెండింగ్‌లో పెట్టడం చాలా దురదృష్టకరమైన అంశం. తక్షణమే ప్రాజెక్టుకు సవరించిన అంచనా నిధులు విడుదల చేయాలి. సవరించిన అంచనా ప్రకారం రూ.55,656.87 కోట్లు విడుదల చేసే అంశం, రెండేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం, ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి అడుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కేంద్రం దృష్టికి నిధుల సమస్యను తీసుకెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. లోక్‌సభలో పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పలుసార్లు సంబంధిత మంత్రులను కలిసి వివరించినప్పటికీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించమని, టెక్నికల్ కమిటీ, సీడబ్ల్యూసీ, పీపీఏ ఆమోదం తెలిపి సంవత్సరాలు గడుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ పోలవరంపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా నిధులను కూడా కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరానికి, విశాఖపట్నం పరిసర గ్రామాలకు మంచినీరు సరఫరాకు సంబంధించిన పనులకు దాదాపు రూ.4 వేల కోట్ల నిధులు ఇవ్వం, కేవలం సాగునీటికే ఇస్తాం అని కేంద్రం అనడం తప్పు. ఈ విషయాన్ని పలుసార్లు ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ప్రభుత్వాలు అనేవి లాభాలతో నడిచే సంస్థలు కాదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి సహాయ, సహకారం చేసే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఏదో వ్యాపారసంస్థల్లా చేయడం మంచిది కాదు. పోలవరం ప్రాజెక్టులో అతి ప్రధానమైనవి ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ. ఇవన్నీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే రోజుకి కేంద్రం క్లియర్ చెయ్యాలి. అప్పుడే పోలవరం ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఖరీఫ్ 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతుల ప్రయోజనార్థం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌లో నీళ్లు ఇస్తామని మాట కూడా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడ్మినిస్టేటివ్ ఆఫీసు పోలవరం ప్రాజెక్టుకు ఎక్కడో దూరంగా హైదరాబాద్‌లో ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో పెట్టాలని కేంద్రాన్ని కోరాం’ అని పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. పోలవరం నిర్వాసితులకు తక్షణం పునరావాసం కల్పించాలి ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరానికి జీవం పోసి ఓ రూపాన్ని ఇచ్చారని చెప్పారు. విభజన చట్టంలో భాగంగా> పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 15–17 సార్లు కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేసినా పోలవరం నిధుల విడుదలపై జాప్యం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలని ఆమె డిమాండు చేశారు. తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోదీ ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇంతవరకు నెరవేరలేదని, పార్లమెంట్లో ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికే విలువ లేనట్లని పేర్కొన్నారు. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, రైతుల తరఫున రోజూ పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. -
మీరు రద్దు చేస్తారా? మేము చేయాలా?
న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కావడ్ యాత్రపై పునరాలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సోమవారం వరకు గడువు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మతపరమైన కార్యక్రమాలు ముఖ్యం కాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బిఆర్ గవాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మనందరం భారత పౌరులం. ఆర్టికల్ 21 జీవించే హక్కు అందరికీ వర్తిస్తుంది. యూపీ సర్కార్ ఇలాంటి యాత్రలని 100శాతం నిర్వహించకూడదు’’అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మనోభావాలు ఎక్కువ కాదని స్పష్టం చేసింది. ‘‘మీకు మరో అవకాశం ఇస్తున్నాం. యాత్రని ఆపేస్తారా, లేదంటే ఆపేయాలనే మేమే ఆదేశాలివ్వాలా?’’అని సూటిగా ప్రశ్నించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి గంగా జలాలను తమ ఊళ్లకి తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసే ఈ కావడ్ యాత్రకు కోట్లాదిగా భక్తులు హాజరవుతారు. కరోనా నేపథ్యంలో ఉత్తరాఖండ్ దీనిని రద్దు చేసినా, యూపీ సర్కార్ ఆంక్షల మధ్య అనుమతులిచ్చింది. దీంతో దీనిని సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రం, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
అది బెదిరింపు చర్య
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లోని తమ కార్యాలయాలకు వచ్చి నోటీసులు జారీ చేయడంపై ట్విట్టర్ స్పందించింది. అది ఒకరకంగా తమను బెదిరించే చర్య అని భావిస్తున్నట్లు పేర్కొంది. తమ ఉద్యోగుల గురించి, భావ వ్యక్తీకరణకు ఎదురయ్యే ముప్పు గురించి ఆందోళన చెందుతున్నామంది. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ విపక్షం సర్క్యులేట్ చేసినట్లు భావిస్తున్న డాక్యుమెంట్‌ను విమర్శిస్తూ.. అధికార బీజేపీ నేతలు చేసిన ట్వీట్లకు ట్విట్టర్ ఇటీవల ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ ట్యాగ్‌ను తగిలించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కార్యాలయాలకు వెళ్లి సంస్థ బారత విభాగం ఎండీకి నోటీసులు జారీ చేశారు. దీనిపై గురువారం ట్విట్టర్ అధికారికంగా స్పందించింది. పారదర్శకతతో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్ తమకు అత్యంత ప్రధానమైన మార్కెట్ అని, భారత్‌లో అమల్లో ఉన్న చట్టాలను గౌరవిస్తామని పేర్కొంది. అయితే, స్వేచ్చాయుత ప్రజాభిప్రాయానికి భంగం కలిగించే నిబంధనలను మార్చాలని కోరుతామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనల్లోని కీలకమైన మౌలిక అంశాలపై, సంస్థ ఉద్యోగుల కార్యకలాపాలను అడ్డుకునే పోలీసుల బెదిరింపు చర్యలపై తమతో పాటు, భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొంది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతాయని ట్విట్టర్ పేర్కొంది. ప్రజాప్రయోజన పరిరక్షణ కోసం ప్రజా ప్రతినిధులు, పరిశ్రమ వర్గాలు, పౌరసమాజం కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందని సూచించింది. అభ్యంతరకర పోస్ట్‌లకు తమ కంప్లయన్స్ ఆఫీసర్‌ను బాధ్యుడిని చేసి, క్రిమినల్ చర్యలకు అవకాశం కల్పించడాన్ని ట్విట్టర్ తప్పుబట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ, వినియోగదారుల సమాచారాన్ని గంపగుత్తగా కోరడం కూడా తమకు ఆమోదనీయం కాదని పేర్కొంది. ఇవి స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపింది. నిరాధార ఆరోపణలు పోలీసులు తమ కార్యాలయాలకు రావడం బెదిరింపు చర్య అన్న ట్విట్టర్ ఆరోపణలను కేంద్రం ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. అవి భారత్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించింది. ట్విట్టర్ లేదా, మరే ఇతర సోషల్‌మీడియాకు చెందిన ప్రతినిధులకు కానీ భారత్ సురక్షిత దేశమని స్పష్టం చేసింది. వారి భద్రతకు, వ్యక్తిగత రక్షణకు ఎలాంటి ప్రమాదం కలగబోదని కేంద్ర ఐటీ శాఖ గురువారం తెలిపింది. చర్యలు, ఉద్దేశపూర్వక సమర్ధనలతో భారత చట్ట వ్యవస్థను తక్కువ చేయాలని ట్విట్టర్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. -
టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, దర్యాప్తు ప్రక్రియను నిలువరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)పై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా ప్రతివాదులైన టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలన మేరకు ఏర్పాటైన సిట్ దర్యాప్తును నిలిపివేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. రాష్ట ప్రభుత్వం తరçఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, శేఖర్ నాఫడే, న్యాయవాది మెహ్‌ఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపివేస్తూ అసాధారణమైన ఉత్తర్వులు జారీచేసింది. అవకతవకలు జరిగితే వాటిపై దర్యాప్తు జరపొద్దా’.. అని ప్రశ్నించారు. ఈ సమయంలో జస్టిస్ అశోక్ భూషణ్ జోక్యం చేసుకుంటూ.. ‘ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై విచారణ జరపాలనుకుంటుందా?’ అని ప్రశ్నించారు. దీనికి దవే లేదని సమాధానమిచ్చారు. ఇలాంటి సందర్భాల్లో దర్యాప్తు కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు గత ఉత్తర్వులను దవే ప్రస్తావించి ప్రతివాదులకు నోటీసులివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో.. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ ధర్మాసనం ప్రతివాదులైన టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల తర్వాత తుది విచారణ చేపడతామని పేర్కొంది. -
నిర్భయ దోషులకు ‘సుప్రీం’ నోటీసులు
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు నిర్భయ దోషులకు నోటీసులు జారీచేసింది. అలాగే దోషులకు కొత్తగా డెత్ వారెంట్ జారీచేసేందుకు ట్రయల్ కోర్టుకి వెళ్ళేందుకు పూర్తి అధికారాలను ఇచ్చింది. నిర్భయ దోషుల మరణశిక్ష అమలుకు తేదీలు ఖరారు చేస్తూ ట్రయల్ కోర్టు కొత్తగా డెత్‌వారెంట్ జారీచేయడానికి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అడ్డంకి కాదని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులకు ఉరిశిక్ష అమలు చేయడం ‘సంతోషం’ కోసం కాదనీ, అధికారులు కేవలం చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారనీ అన్నారు. ఈ కేసులో వినయ్ శర్మ అనే దోషి రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అమలుకు ఇబ్బందులు.. 2017లో దోషుల అప్పీళ్ళను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ ఇంకా అధికారులు ఇప్పటికింకా వాటిని అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై ప్రజలు ఉత్సవంలా జరుపుకున్నారని తుషార్ అన్నారు. తొలుత దోషులకు నోటీసులు జారీచేయడం వల్ల శిక్ష అమలులో జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం కోరడంతో నోటీసులు జారీచేసింది. -
‘ఆధార్’ చట్ట బద్ధతపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్ నంబర్‌ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఆధార్ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీం శుక్రవారం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది. కొన్ని మినహాయింపులతో ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమేనని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జూలైలో ఆధార్ సవరణ చట్టం సుప్రీం తీర్పుతో కేంద్రం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను అందించడంలో స్వచ్ఛందంగా 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు చేసింది. ఈ బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్ ఆధార్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిల్ దాఖలు వేశారు. దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
-
ఏ క్షణమైనా నోటీసులు జారీచేసే అవకాశం
-
అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నోటీసులను సిద్ధం చేసింది. ఏ క్షణమైనా అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఆర్డీఏ నిర్ధారించింది. చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కరకట్ట లోపల నిర్మించిన మిగిలిన అన్ని భవనాల యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. దీనికి కొనసాగింపుగా అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఆర్డీఏ నడుం బిగించింది. అక్రమ నిర్మాణానికి ప్రజల సొమ్ముతో హంగులు కృష్ణా నదీ తీరంలో లింగమనేని రమేష్ కొన్నేళ్ల క్రితం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అతిథిగృహం నిర్మించగా, 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని లీజుకు తీసుకుని అందులో నివసిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో నివాసం ఉండడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించినా చంద్రబాబు లెక్కచేయలేదు. పైగా ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ కట్టడాలను ప్రోత్సహించడంతో కరకట్ట లోపల చాలామంది అక్రమ నిర్మాణాలు చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సామాన్యుడికి ఒక నిబంధన, పెద్దలకు ఒక నిబంధన ఉండదని, అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసంలో అన్నీ అతిక్రమణలే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథి గృహంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్–2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్–2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254, 272, 274, 790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేని ఈ నిర్మాణాలను గుర్తించారు. తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందజేయనున్నారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దెదారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనలకు అనుగుణంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఎన్నికలా.. ప్రత్యేకాధికారులా?
సాక్షి, హైదరాబాద్: గడువులోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా? అనే విషయంపై వారంలోగా సమా ధానమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. విచారణ ను వారం రోజులకు వాయిదా వేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు జూలై 2తో ముగుస్తుందని, వాటికి వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ప్రక్రియ చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాల్ని మంగళవారం హైకోర్టు విచారించింది. సమయం కావాలి.. ప్రభుత్వ వైఖరిని తెలిపేందుకు సమయం కావాలని కోర్టును అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్ర రావు కోరారు. ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవాల్సి ఉందని, వారం గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఉన్న మున్సిపాలిటీల్లో సమీపంలోని గ్రామాల విలీనం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని, ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల ఓటర్ల జాబితాల తయారీకి సమయం పడుతుందన్నారు. వారం రోజుల గడువు ఇస్తే మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి చెప్పారు. వాద నలు విన్న న్యాయమూర్తి.. వార్డు విభజన, రిజర్వేషన్ల ఖరారు, ప్రత్యేకాధికారుల నియామకం, గడువులోగా (జూలై 2లోగా) ఎన్నికలు నిర్వహిస్తారా? వంటి అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ మార్చి 14, మే 4 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో ఎస్ఈసీ గతంలోనే వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన చోట్ల వార్డు ల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై 2 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ వేసిన కేసులో హైకోర్టు గతంలో ఆదేశించింది. -
జెట్ ఎయిర్వేస్కు హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : రుణ సంక్షోభంలో పడిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకుంది. కాన్సిల్ చేసిన విమాన టికెట్ల డబ్బులను తిరిగి వినియోగదారులకు చెల్లించే అంశంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై జెట్ ఎయిర్వేస్ స్పందించాలని కోరింది. అలాగే ఈ అంశంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)ను ఆదేశించింది. ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేసి, ప్రయాణికులను సంక్షోభంలోకి నెట్టి వేసిందనంటూ సామాజిక కార్యకర్త బిజోన్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.బి. భంభాని ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ బుధవారం ఈ నోటీసులిచ్చింది. ఈ వేసవి సెలవుల తర్వాత దీనిపై వాదనలను వింటామని చెప్పిన కోర్టు తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. కాగా జెట్ ఎయిర్వేస్ రుణ సమీకరణ అంశం ఒక కొలిక్కి రాకపోవడంతో సర్వీసులను ఆకస్మికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ చెల్లించాల్సిన రీఫండ్ మొత్తం సుమారు 360 కోట్ల రూపాయలకు పై మాటే. -
‘పాలమూరు’పై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశించింది. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు లో దాఖలు చేయగా హైకోర్టు దాన్ని తోసిపుచ్చడంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును నాగం ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వం లోని ధర్మాసనం వద్దకు సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 1, 5, 8, 16 పనుల అంచనా వ్యయాన్ని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూ.5,960.79 కోట్లుగా మదించగా.. తెలంగాణ ప్రభుత్వం బీహెచ్ఈఎల్, మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థలతో కుమ్మక్కై అంచనాలను రూ.8,386 కోట్లకు పెంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,426 కోట్లు నష్టం వాటిల్లింది. మోటారు పంపుసెట్లకు అధిక రేటు చూపి, యంత్రాలు డిజైన్ చేసి సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ కంటే అదనంగా మెఘా ఇంజనీరింగ్ సంస్థకు చెల్లించారు. ప్యాకేజీ–5లో ఒక పంపు సెట్‌కు రూ.92 కోట్లు, ఒక మోటారుకు రూ.87 కోట్లుగా లెక్కించి 9 మోటారు పంపుసెట్లకు రూ.179 కోట్ల చొప్పున రూ.1,611 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెల్లింపుల బ్రేకప్‌లో మాత్రం బీహెచ్ఈఎల్కు రూ.803 కోట్లు చెల్లించి, మిగిలిన రూ.808 కోట్లను మెఘా సంస్థకు చూపారు. వాస్తవానికి ఇక్కడ అయిన ఖర్చు రూ.803 కోట్లు మాత్రమే. ఇక సివిల్ పనులకు మరో రూ.1,459 కోట్లు ఖర్చుగా చూపారు. అంటే యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు అదనంగా వెచ్చించారు. ఇక్కడ సివిల్ పనులు చూడాల్సిన మెఘా సంస్థ ఈ రూ.1,459 కోట్లు పొందడమే కాకుండా.. ప్యాకేజీ–5 మొత్తం ఈసీవీ విలువైన రూ.4,018 కోట్లలో మిగిలిన రూ.2,558 కోట్ల నుంచి కూడా తీసుకుంది. వీటిలో బీహెచ్ఈల్కు రూ.803 కోట్లు చెల్లించింది. ఇదే తరహాలో ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలకు ఎక్కువ వ్యయా న్ని చూపడం ద్వారా నవయుగ సంస్థకు కూడా లబ్ధి చేకూర్చారు. ప్యాకేజీ 1, 16లలో బీహెచ్ఈఎల్–మెఘా సంస్థ 145 మెగావాట్ల మోటారుకు రూ.38 కోట్లు కోట్ చేసింది. నవయుగ సంస్థ రూ.40 కోట్లకు కోట్ చేసింది. కానీ ప్రభుత్వం 145 మెగావాట్ల మోటారుకు రెండు సంస్థలకు రూ.87 కోట్లు ఆమోదించింది. అంటే దాదాపు రూ.50 కోట్లు పెంచింది. వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా హైకోర్టు వీటిని విస్మరించింది’ అని వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని పేర్కొంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు.. పాలమూరు అంశంపై పిటిషనర్ 4 పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు రెండింటిని కొట్టేసిందని, మరో రెండు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి నివేదించారు. యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు ఎక్కువ వ్యయం కావడంలో ఆశ్చర్యం లేదని, ఆ ప్రాజెక్టు స్వరూపమే ఎత్తిపోతల ప్రాజెక్టు అని వివరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఆరోపణలను తోసిపుచ్చిందని వివరించారు. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘మీ వాదనలు కూడా వింటాం. అంకెలు చూస్తుంటే అసాధారణ రీతిలో ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి. మీరు కరెక్టే కావచ్చు. కానీ ఈ కేసును మేం విచారిస్తాం’ అని పేర్కొన్నారు. దీనికి ముకుల్ రోహత్గీ బదులిస్తూ ‘హైకోర్టు ఈ అంశాలను కొట్టివేసింది’ అని నివేదించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందించారు. ‘హైకోర్టు కొట్టివేసి ఉండొచ్చు. కానీ అంకెలు అసాధారణ రీతిలో ఉండటాన్ని హైకోర్టు ప్రస్తావించలేదు’ అని జస్టిస్ పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. ‘ఒకవేళ బీహెచ్ఈఎల్ సంస్థ తాను సరఫరా చేసిన పంపుసెట్లు, మోటారు సెట్లు అమర్చడంతో పాటు సివిల్ పనులు చేపట్టి ఉంటే ఎంత వసూలు చేసేది..’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ఖర్చు మదింపు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యం లో కేసును ఏప్రిల్ 26కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
ఈసీతో టచ్‌లో ఉండండి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అవసరమైనప్పుడు వెంటనే స్పందించాలని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను పార్లమెంటరీ కమిటీ కోరింది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జోక్యాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను తమకు వివరించాలంటూ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత్‌లో త్వరలో జరిగే ఎన్నికల్లో అంతర్జాతీయంగా ఎటువంటి జోక్యం ఉండకుండా చూసుకుంటామని ట్విట్టర్ ప్రతినిధులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కమిటీ సంధించిన పలు ప్రశ్నలకు పది రోజుల్లో రాత పూర్వకంగా సమాధానం అందజేసేందుకు అంగీకరించారు. సానుకూలంగా స్పందించిన ఫేస్బుక్ ఫేస్‌బుక్‌తోపాటు అనుబంధ సంస్థలైన వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల తరఫున ఫేస్బుక్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ జోయెల్ కప్లాన్ హాజరుకానున్నట్లు సమాచారం. ఈయనతోపాటు ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ హాజరవుతారని భావిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ ఎదుట మార్చి 6వ తేదీన వీరు హాజరుకానున్నారు. వినియోగదారుల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
స్టార్టప్‌లకు ఉపశమనం!
న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్ ఫండ్స్ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్ పన్ను మినహాయింపులను కోరేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్ ఫండ్స్ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు చెల్లించాలంటూ ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి తమకు నోటీసులందటంపై స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 56 (2) కింద స్టార్టప్ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్టార్టప్‌కు పన్ను మినహాయింపు నిబంధనల విషయంలో తాజా మార్పుల నోటిఫికేషన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం స్టార్టప్స్ గనుక ఏంజెల్ ఫండ్స్‌పై పన్ను మినహాయింపులను కోరాలంటే ముందుగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత స్టార్టప్ దరఖాస్తును తగిన ధ్రువపత్రాలతో కలిపి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగానికి (సీబీడీటీ) డీఐపీపీయే పంపుతుంది. దరఖాస్తును అందుకున్న 45 రోజుల్లోగా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలపడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడంపై సీబీడీటీ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో నోటిఫికేషన్... గతంలో స్టార్టప్‌లు సమర్పించే పన్ను మినహాయింపు దరఖాస్తును అంతర్ మంత్రిత్వ శాఖల విభాగం ధ్రువీకరణ కోసం పంపేవారు. దీనివల్ల జాప్యం అయ్యేంది. ఇప్పుడు డీఐపీపీ ద్వారా నేరుగా సీబీడీటీకి పంపేలా ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు వివరించాయి. అదేవిధంగా స్టార్టప్‌లు విక్రయించిన షేర్లకు మార్కెట్ విలువ ఎంతనేది నిర్ధారిస్తూ మర్చెంట్ బ్యాంకర్ నుంచి నివేదికను తీసుకొని సమర్పించాలన్న గత నిబంధనను కూడా తాజాగా తొలగించారు. డీఐపీపీ గుర్తింపు ఉన్న స్టార్టప్‌లన్నీ కొన్ని షరతులకు లోబడి ఈ పన్ను మినహాయింపు పొందే వీలుంది. ప్రధానంగా ఖాతాల వివరాలతోపాటు గడిచిన మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా తమ నెట్‌వర్త్, పెట్టుబడిపై ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, ఏంజెల్ ఫండ్స్ ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రూ.10 కోట్లకు మించి జరిపిన నిధుల సమీకరణపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం స్టార్టప్స్ తమకున్న మార్కెట్ విలువకు మించి జరిపే నిధుల సమీకరణపై 30 శాతం పన్ను విధించేందుకు వీలుంది. దీని ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కాగా, పన్ను మినహాయింపు నిబంధనల్లో తాజా మార్పులన్నీ నోటిఫికేషన్ జారీ అయినతర్వాత అమల్లోకి వస్తాయని.. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని ఆయా వర్గాలు తెలిపాయి. ఏటా 300– 400 స్టార్టప్‌లకు ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు అందుతుండగా... 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు స్టార్టప్స్‌కు మాత్రమే పన్ను మినహాయింపు లభించడం గమనార్హం. ఈ అంశాన్ని కూడా మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయండి ప్రధానిని కోరిన ఐస్పిర్ట్ న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు శాపంగా మారిన ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని స్టార్టప్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐస్పిర్ట్... ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ఈ సంస్థ ఒక లేఖ రాసింది. స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అని పేర్కొంది. ఏంజెల్ ఇన్వెస్టర్లు ఎంతో రిస్క్ తీసుకొని ఈ పెట్టుబడుల పెడతారని, విదేశాల్లో ఇలాంటి పెట్టుబడులకు నజరానాలిస్తుండగా, ఇక్కడ మాత్రం పన్నులు వేసి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తుండటంతో పలు స్టార్టప్‌లు బెంబేలెత్తుతున్నాయని, కొన్ని మూతపడుతున్నాయని పేర్కొంది. ఈ ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని, అలా కుదరని పక్షంలో కనీసం నిబంధనలను సరళీకరించాలని కోరింది. స్టార్టప్‌లలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు ఇన్నోవాక్సర్లో తొలి పెట్టుబడి బెంగళూరు: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కార్పొరేట్ వెంచర్ ఫండ్, ఎమ్12 (గతంలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఫండ్‌గా వ్యవహరించేవారు) భారత స్టార్టప్‌లలో ఒక్కో కంపెనీలో 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల రేంజ్లో పెట్టుబడులు పెట్టబోతోంది. దీన్లో భాగంగా తొలి పెట్టుబడి పెట్టడానికి హెల్త్ టెక్ స్టార్టప్, ఇన్నోవాక్సర్‌ను ఎంచుకున్నామని ఎమ్12 పార్ట్నర్ రష్మి గోపీనాధ్ చెప్పారు. బీ2బీ స్టార్టప్‌లలో ఏ నుంచి సి రౌండ్ సిరీస్‌లలో నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. బిగ్ డేటా, అనలిటిక్స్, బిజినెస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు నిధులందిస్తామని ఆమె పేర్కొన్నారు. -
ఏపీ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర భూసేకరణ చట్టానికి రాష్ట్రాలు సవరణలు చేస్తూ అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్ర దేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో నిర్వాసితులకు ప్రయోజనకారిగా ఉన్న అనేక నిబంధనలను తొలగిస్తూ ఆ చట్టానికి ఏపీ, తెలంగాణ, గుజ రాత్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలు సవరణ లు చేసి అమలు చేయడాన్ని సామాజికవేత్త మేథా పాట్కర్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. నిర్వాసితుల అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలు చేశారని, ఉపాధి, భద్రత కల్పించకుండా నిర్వాసితులను ఆందోళనలోకి నెట్టేశారని వాదించారు. సామాజిక ప్రభావ మదింపు అంచనా లేకుండానే భూసేకరణ జరపడం 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధమని నివేదించారు. నిర్వాసితుల ప్రాథమిక హక్కుల కు భంగం కలిగేలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని సవరించాయన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాస నం ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఐదు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. -
4వేల పోర్న్ సైట్లను మూసేసిన చైనా
బీజింగ్: గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం దాదాపు 4,000 పోర్న్ వెబ్సైట్లను, ఖాతాలను మూసివేసింది. మేలో ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఆగస్టుచివరినాటికి 120 ఉల్లంఘనలను గుర్తించింది. తప్పు సరిదిద్దుకోవాలంటూ 230 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. హానికరంగా ఉన్నట్లు భావించిన 1.47 లక్షల అంశాలను తొలగించినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. కాపీరైట్ ఉల్లంఘనలు, విలువలను దిగజార్చే, అశ్లీలం, అసభ్యత ఉన్న ఆన్లైన్ నవలలపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో 22వేల పోర్న్ సైట్ల మూసివేతతోపాటు దాదాపు 11 లక్షల హానికర అంశాలను నెట్ నుంచి తొలగించామని ప్రభుత్వం పేర్కొంది. -
వాట్సాప్‌కు సుప్రీం షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో గ్రీవెన్స్ అధికారిని ఎందుకు నియమించలేదో వెల్లడించాలని కోరుతూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై సవివర సమాధానం కోరుతూ ఐటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నోటీసులపై స్పందించాలని కోర్టు ఆదేశించింది. తన ప్లాట్‌ఫాంపై మెసేజ్‌లు ఎక్కడి నుంచి జనరేట్ అయ్యాయనే సమాచారాన్ని ట్రాక్ చేసే వ్యవస్థ నెలకొల్పాలని భారత్ చేసిన డిమాండ్‌ను వాట్సాప్ ఇటీవల తోసిపుచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో యూజర్ల గోప్యత కాపాడటం దెబ్బతింటుందనే కారణంతో భారత్ ప్రతిపాదనను తిరస్కరించింది. అన్ని రకాల సంభాషణలకు ప్రజలు వాట్సాప్ వేదికగా వాడుతున్నారని, అయితే తప్పుడు సమాచారంపై ప్రజలను అప్రమత్తం చేయడంపై తాము ప్రస్తుతం దృష్టిసారించామని వాట్సాప్ పేర్కొంది. ఫేక్ న్యూస్, మూక హత్యల వంటి తీవ్ర నేరాలకు అడ్డుకట్ట వేయడంలో మెసేజ్‌ల మూలాలను పసిగట్టేందుకు సాంకేతిక పరిష్కారం ఏర్పాటు చేయాలని వాట్సాప్‌పై భారత్ ఒత్తిడి తెస్తోంది. భారత్‌లో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, పటిష్ట సాంకేతిక వ్యవస్థను నెలకొల్పాలని, గ్రీవెన్స్ అధికారిని నియమించాలని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల వాట్సాప్ ఇండియా హెడ్ క్రిస్ డేనియల్స్‌తో భేటీ సందర్భంగా కోరారు.