బీజింగ్: గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం దాదాపు 4,000 పోర్న్ వెబ్‌సైట్లను, ఖాతాలను మూసివేసింది. మేలో ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఆగస్టుచివరినాటికి 120 ఉల్లంఘనలను గుర్తించింది. తప్పు సరిదిద్దుకోవాలంటూ 230 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. హానికరంగా ఉన్నట్లు భావించిన 1.47 లక్షల అంశాలను తొలగించినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. కాపీరైట్ ఉల్లంఘనలు, విలువలను దిగజార్చే, అశ్లీలం, అసభ్యత ఉన్న ఆన్‌లైన్ నవలలపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో 22వేల పోర్న్ సైట్ల మూసివేతతోపాటు దాదాపు 11 లక్షల హానికర అంశాలను నెట్ నుంచి తొలగించామని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment