china government
-
అప్పుల ఊబిలో అతిపెద్ద బ్యాంక్.. లక్షల కోట్లు..
ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు సైతం గత కొన్ని రోజులుగుఫా ఆర్ధిక అనిశ్చితుల కారణంగా పతనమవుతున్నాయి, దివాలా తీసే స్థితికి చేరుకుంటున్నాయి. ఈ జాబితాలో 'చైనాలోని అతిపెద్ద ప్రైవేట్ ఫైనాన్షియల్ బ్యాంక్ 'ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' కూడా చేరింది. దివాలా తీయడానికి కారణాలు ఏంటి? నిర్వహణ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 139 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 11 లక్షల కోట్లు) నిర్వహణ కలిగిన 'ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' సంస్థల్లో పలు నేరాలు జరిగినట్లు అనుమానిస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడిస్తూ.. పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సంస్థ మొత్తం సుమారు 12 అసెట్, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలను నిర్వహిస్తూ.. లోన్లు మాత్రమే కాకుండా, బ్రోకరేజ్ వంటి సేవలను అందిస్తూ అక్కడ అతి పెద్ద బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. 2021లో ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ 'షీ ఝికూన్' మరణించిన తరువాత.. మేనేజ్మెంట్లోని కీలక వ్యక్తులు కూడా సంస్థను వీడటం వల్ల దాని నిర్వహణలో లోపాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత సంస్థ అప్పుల ఊబిలో కోరుకున్నట్లు తెలిసింది. ఈ సంస్థ అప్పులు 64 బిలియన్ డాలర్స్ వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. చైనాలో బ్యాంక్ తరహా ఆర్థిక సేవలందించే అతిపెద్ద షాడో బ్యాంకుల్లో ఒకటైన ఝంగ్‌ఝీ గ్రూప్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టారనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. అయితే చైనాలో ఈ బ్యాంక్ పతనావస్థకు చేరుకోవడం వల్ల ఈ రంగం మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రారంభంలో వేగంగా అభివృద్ధి చెందిన షాడో బ్యాంకింగ్ రంగం ఇప్పుడు పతనం కావడం జీర్ణించుకోలేని అంశం అనే చెప్పాలి. -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
నిమిషాల్లోనే... రూ. 2 లక్షల కోట్లు హుష్
న్యూఢిల్లీ: ‘మా అరెస్టయ్యారు’ అంటూ వచ్చిన ఒక వార్త మంగళవారం అలీబాబా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఉదయం సెషన్లో నిమిషాల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మేర (రూ.2 లక్షల కోట్లు/ మార్కెట్ విలువలో 10%) తుడిచిపెట్టుకుపోయింది. మా అరెస్ట్‌కు సంబంధించి ఆ తర్వాత స్పష్టత రావడంతో పడిన షేరు కోలుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. మా అంటే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అని పొరపడ్డారు ఇన్వెస్టర్లు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన జాక్‌మా గ్రూపు కంపెనీలపై చైనా సర్కారు 2020 నుంచి ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ఒక వ్యక్తి శక్తిగా మారకూడదన్న విధానాన్ని అక్కడి కమ్యూనిస్ట్ సర్కారు పాటిస్తోంది. దీంతో నాటి నుంచి జాక్‌మా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలో మా అరెస్ట్ అంటూ వార్త రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది వార్తా కథనం.. చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం (మే 3) ఒక వార్తను ప్రచురించింది. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ మా అనే వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. జాక్‌మా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ప్రధాన కేంద్రం కూడా అదే పట్టణంలో ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు పొరపడడానికి ఇది కూడా ఒక అంశమే. ‘‘విదేశీ శక్తులతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్టు అనుమానాలపై ఇంటి పేరు ‘మా’ కలిగిన వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో స్టేట్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది’’అంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో నిమిషాల్లోనే అలీబాబా షేరు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 9.4% పడిపోయింది. అదే రోజు గ్లోబల్ టైమ్స్ అదే అంశానికి సంబంధించి మరో కథనాన్ని ప్రచురించింది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరులో 3 అక్షరాలు ఉన్నట్టు పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు, 1985లో జన్మించినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షేరు రికవరీ అయింది. కాకపోతే పడినప్పుడు కంగారుతో అమ్ముకున్నవారే నిండా నష్టపోయారు. అలీబాబా గ్రూపు అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన జాక్‌మా 2020 నవంబర్ నుంచి కనిపించింది లేదు. చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేశాక సర్కారు ఆయన్ను నిర్బంధించిందన్న వార్తలూ వచ్చాయి. -
ఏడాది తర్వాత ప్రత్యక్షమైన మల్టీబిలియనీర్
Billionaire Jack Ma reappears in Hong Kong: చైనా ప్రభుత్వం అక్కడి అపర కుబేరులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది చైనా ఆర్థిక నియంత్రణ చట్టాలను ఏకిపడేయడంతో.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఏడాది తర్వాత మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. హాంకాంగ్‌లో గత కొన్నిరోజులుగా వ్యాపార సంబంధిత సదస్సుల్లో ప్రసంగిస్తున్న ఆయన.. బయట మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. కిందటి ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్ డాలర్ల ఐపీవోకు(ఆసియాలోనే అతిపెద్ద ఐపీవో!) బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి చాలాకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. అడపాదడపా కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బయటికి కనిపించింది మాత్రం లేదు. ఈ తరుణంలో మంగళవారం హాంకాంగ్‌లోని ఓ బిజినెస్ వేదిక వద్ద జాక్ మా కనిపించడంతో మీడియా ఆయన ముందు మైక్ ఉంచింది. అయితే వ్యాపార సంబంధ వ్యవహారాల వల్ల తానేం మాట్లాడబోనని సున్నితంగా తిరస్కరించారు. ఇక చివరిసారిగా అక్టోబర్‌లో ఏషియన్ ఫైనాన్షియల్ హబ్ ఈవెంట్లో పాల్గొన్న జాక్ మా.. బహిరంగంగా కనిపించింది లేదు. చైనా ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక కామెంట్లు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చైనా ప్రభుత్వ ప్రతీకారంతో ఆర్థికంగా జాక్ మాకు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పురోగతికి 15.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వానికి ఆఫర్ చేశాడు. డ్రాగన్ ప్రభుత్వ మద్దతుతో ఈమధ్యే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. దీంతో అలీబాబా షేర్స్ కొంతలో కొంత పుంజుకుంటున్నాయి. యాభై ఏడేళ్ల జాక్ మా మొత్తం ఆస్తుల విలువ 51.5 బిలియన్ డాలర్లు. చైనాలో మూడో ధనికుడిగా ఉన్న జాక్ మా.. గతంలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేశాడు. తూర్పు చైనా నగరం హాంగ్జౌ(పుట్టింది ఇక్కడే) కేంద్రంగా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అలీబాబా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హాంకాంగ్‌తో పాటు న్యూయార్క్‌లోనూ అలీబాబా కార్యకలాపాలకు గుర్తింపు ఉంది. చదవండి: బిట్‌కాయిన్.. చైనా బ్యాన్ ఎఫెక్ట్ నిల్! -
5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి
బీజింగ్: బీజింగ్ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500 పడకలుగల ఆస్పత్రిని శనివారానికి నిర్మించిందని జిన్హువా న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. హెబెయ్ ప్రావిన్సుల్లో మొత్తం ఆరు ఆస్పత్రులను నిర్మించేందుకు సిద్ధం కాగా అందులో ఇది మొదటిది. మొత్తం 6,500 పడకలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 130 కొత్త కేసులు రాగా, వాటిలో 90 కేసులు హెబెయ్ ప్రావిన్సులోనే వచ్చాయి. గత శుక్రవారం నాటికి షిజాఝంనంగ్ నగరంలో కోటి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. -
జాక్ మా ఎక్కడ?
న్యూఢిల్లీ: చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. చైనా ప్రభుత్వంతో వివాదం నేపథ్యంలో ఆయన అదృశ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా తన సొంత టాలెంట్ షో ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ కార్యక్రమం తుది ఎపిసోడ్లో ఆయన న్యాయనిర్ణేతగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం సందేహాలు రేకెత్తిస్తోంది. కార్యక్రమానికి మా హాజరు కాకపోవడం, షో వెబ్సైట్ నుంచి ఆయన ఫొటోలను కూడా తొలగించడం వంటి అంశాలన్నీ చూస్తే దీని వెనుక చైనా ప్రభుత్వం హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో వివాదం.. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీవో (37 బిలియన్ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది. -
వూహాన్లో అత్యవసర వ్యాక్సినేషన్
బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు స్థానమైన వూహాన్లో చైనా ప్రభుత్వం ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ మొదలు పెట్టింది. కోటి మందికిపైగా జనాభా ఉన్న ఈ నగరంలోని 15 జిల్లాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచే ఈ కార్యక్రమం మొదలైనట్లు సమాచారం. నగరంలో 48 కేంద్రాలను ఏర్పాటు చేసి 18–59 మధ్య వయస్సు వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు టీకా డోసులు ఇస్తున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ హి ఝెన్యు తెలిపారని అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. -
చైనా లింకులున్న ట్విటర్ అకౌంట్లు నిలిపివేత
లండన్: చైనా ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్న, చైనాతో సంబంధమున్న ట్విటర్ ఖాతాలను ఆ సంస్థ నిలిపివేసింది. ఆయా ట్వీట్లలో చైనా ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు ఉంటుండడంతో, ట్విటర్ సంస్థ చైనా ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే, అవి తమవి కాదని వారు తెలపడంతో దాదాపు 23,750 ఖాతాలను నిలిపివేసినట్లు ట్విటర్ ప్రకటించింది. ఈ ఖాతాలు చేస్తున్న ట్వీట్లను రీట్వీట్ చేస్తున్న మరో 1,50,000 అకౌం ట్లను సైతం నిలిపివేసింది. చైనాలో ట్విటర్ సహా, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సర్వీసులపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. -
కరోనా ఎఫెక్ట్: నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి
బీజింగ్: కరోనా వైరస్ ప్రస్తుతం చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో అయితే డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చైనాలో కరోనా బాధితులకు సేవలు చేస్తున్న తియాన్ ఫాంగ్ ఫాంగ్ అనే నర్సు ఓ కోరిక కోరింది. తనకు ఓ భాయ్ ఫ్రెండ్‌ను చూసి పెట్టమని ఏకంగా అక్కడి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసింది. అంతేగాక చివర్లో తన కోరిక ఇప్పుడు కాకపోయినా కరోనా మహమ్మారి అంతమయ్యాక అయినా తీర్చాలంటూ ఓ చిన్న సడలింపు కూడా ఇచ్చింది. చదవండి: కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ ఈ మేరకు మెసేజ్‌తో కూడిన ఓ లెటర్ చూపిస్తూ.. హ్యాజ్మ్యాట్ సూట్లో, కళ్లకు గాగుల్స్ పెట్టుకొని ఆమె ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 'నేను బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కునే పనిలో పడ్డాను. అప్పుడే కరోనా మహమ్మారి నా అన్వేషణకు అడ్డుకట్టవేసింది. అయినా నేను నా వ్యక్తిగత పనులు మాని నా విధులను అంకితభావంతో నిర్వర్తిస్తున్నాను. ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక బాయ్‌ఫ్రెండ్‌ను వెతికిపెట్టాలి. కరోనా గండం తప్పుతుంది. మంచి రోజులు వస్తాయనే నమ్మకాన్ని ప్రజల్లో వ్యాపింపజేయటానికి ఆజానుభావుడైన బాయ్‌ఫ్రెండ్‌ను వెదకాలని' ప్రభుత్వాన్ని కోరినట్లు తియాన్ చెప్తోంది. చదవండి: ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు! -
కరోనా వైరస్ మృతుల సంఖ్య వేలల్లోనా!
వుహాన్ : నేడు ప్రపంచ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో ఎంత మంది మరణించారనే విషయమై ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అందుకు కారణం ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తున్న అతి పెద్ద చైనా కంపెనీ ‘టెన్సెంట్ (చైనాలోనే రెండో పెద్ద కంపెనీ)’ తన వెబ్సైట్లో ఇప్పటి వరకు కరోనావైరస్ వల్ల 24,589 మంది మరణించారని, 1,54,000 మంది వ్యాధికి గురయ్యారని పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకన్నా 80 రెట్లు ఎక్కువ మంది మరణించగా, పది రెట్లు ఎక్కువ మందికి వ్యాధి సోకింది. చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం మృతులకు సంబంధించిన వాస్తవాలను దాచి పెడుతోందంటూ ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో టెన్సెంట్ కంపెనీ ఈ సంఖ్యను వెబ్సైట్లో పేర్కొనడం ఒక్కసారిగా ప్రజల్లో అలజడి రేపింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 304 మంది మరణించారని, 14,446 మందికి వ్యాధి సోకిందంటూ ప్రభుత్వ లెక్కలనే పేర్కొంది. ప్రభుత్వ లెక్కలకు, వైద్య వర్గాలు వెల్లడిస్తున్నలెక్కలకు కూడా తేడా ఉండడంతో ప్రజల్లో ఎక్కువగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనావైరస్ మృతుల సంఖ్య 73 నుంచి 563కు పెరిగిందని, బాధితుల సంఖ్య 3,694 నుంచి 28,018కి పెరిగిందని, మృతులు, బాధితులు వుహాన్ నగరానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని వైద్య వర్గాలు మంగళవారం ప్రకటించాయి. మృతులు, బాధితుల సంఖ్యను బాగా తగ్గించి చెప్పాల్సిందిగా చైనా ప్రభుత్వం నుంచి వైద్యాధికారులపై ఎక్కువగా ఒత్తిడి వస్తోందని ‘తైవాన్ న్యూస్’ వెల్లడించింది. కరోనా విశ్వరూపం కరోనా వైరస్‌పై తమిళనాడు స్పందన -
కరోనాపై పోరాటానికి 103 కోట్లు విరాళం
బీజింగ్ : చైనాలోని వుహన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ చైనీయుల ప్రాణాలను కబలిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు బాధితులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తూనే.. మరోవైపు కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు సైతం తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్‌కు పోరాటానికి తన వంతు సాయంగా ఈ విరాళం అందజేశారు. దీంతో పాటు టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) విలువైన వస్తువులతో పాటు మ్యాపింగ్, డేటా సర్వీసులను అందిస్తున్నారు. దీదీ చుక్సింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ తమ వాహనాల ద్వారా మెడికల్ వర్కర్స్, పేషెంట్లకు ఉచిత రవాణా సాయం చేస్తోంది. ఇక డైడు, టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వంటి కంపెనీలు సైతం తమకు తోచిన సాయం అందిస్తున్నాయి. కాగా, చైనాలో కరోనావైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 213 మంది మృతి చెందగా, 7వేల మందికి పైగా కరోనా బారీన పడి చికిత్స తీసుకుంటున్నారు. -
సిమ్ కావాలంటే ముఖం స్కాన్ చేయాల్సిందే
బీజింగ్: సాధారణంగా కొత్త సిమ్ కొనాలంటే సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించి బయోమెట్రిక్ స్కాన్, తగిన రుసుం చెల్లిస్తే చాలు. కానీ చైనాలో అలా కాదు. ధ్రువీకరణ పత్రాలతో పాటుగా ముఖాన్ని స్కాన్ చేయించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ముఖాన్ని చుట్టూ స్కాన్ చేయడంతో పాటు.. కళ్లు మూయడం, తెరవడం వంటివి కూడా పూర్తయ్యాకే సిమ్ దక్కుతుంది. ఈ మేరకు నిబంధనలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తూ చైనా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ వాడే వారు తమ ఫోన్ల రిజిస్ట్రేషన్‌లో అసలు పేరునే వినియోగించాలంటూ గత సెప్టెంబర్‌లో నిబంధనలు తెచ్చింది. ఈ చర్యలన్నీ ఆన్లైన్ ప్రపంచంలో ప్రజల హక్కులను కాపాడటం కోసమేనని ప్రభుత్వం అంటోంది. -
4వేల పోర్న్ సైట్లను మూసేసిన చైనా
బీజింగ్: గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం దాదాపు 4,000 పోర్న్ వెబ్సైట్లను, ఖాతాలను మూసివేసింది. మేలో ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఆగస్టుచివరినాటికి 120 ఉల్లంఘనలను గుర్తించింది. తప్పు సరిదిద్దుకోవాలంటూ 230 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. హానికరంగా ఉన్నట్లు భావించిన 1.47 లక్షల అంశాలను తొలగించినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. కాపీరైట్ ఉల్లంఘనలు, విలువలను దిగజార్చే, అశ్లీలం, అసభ్యత ఉన్న ఆన్లైన్ నవలలపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో 22వేల పోర్న్ సైట్ల మూసివేతతోపాటు దాదాపు 11 లక్షల హానికర అంశాలను నెట్ నుంచి తొలగించామని ప్రభుత్వం పేర్కొంది. -
చైనాకు అమెరికా టెక్ దిగ్గజం సాయం
బీజింగ్ : ఓ వైపు అమెరికాకు, చైనాకు మధ్య ట్రేడ్ వార్ పరిస్థితులు ఉద్రిక్తమవుతే, మరోవైపు అమెరికా టెక్ దిగ్గజాలు చైనాకు సాయం చేస్తున్నాయి. తాజాగా ఆపిల్, చైనాలో 300 మిలియన్ డాలర్ల(రూ.2,054 కోట్ల) క్లీన్ ఎనర్జీ ఫండ్‌ను లాంచ్చేసింది. ఆ దేశంలో 10 లక్షల గృహాలకు విద్యుత్ అందించే లక్ష్యంతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఆపిల్ ప్రకటించింది. చైనా ప్రభుత్వం ప్రస్తుతం కాలుష్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్య పొగను తగ్గించాలని, దేశం జలమార్గాలను, కలుషిత మట్టిని శుభ్రం చేయాలని స్థానిక, అంతర్జాతీయ కంపెనీలను చైనా ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో కంపెనీలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. పెగాట్రోన్ కార్ప్, విస్ట్రోన్ కార్ప్ వంటి 10 మంది సప్లయిర్స్‌తో కలిసి, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో ఈ మొత్తాన్ని ఐఫోన్ తయారీదారి పెట్టుబడిగా పెడుతోంది. కాగ, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్, బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై దెబ్బకు దెబ్బ మాదిరి టారిఫ్‌ల మోత ప్రపంచంలో ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు ప్రతికూలంగా మారాయి. ఇరు దేశాలు ప్రశాంతంగా ఉండాలని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ పిలుపు కూడా ఇచ్చారు. ఆపిల్ సంస్థ తన ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం చైనాకే సరఫరా చేస్తుంది. ఆపిల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్లలో చైనా కూడా ఒకటి. అయితే ఇటీవల స్థానిక స్మార్ట్‌ఫోన్ ప్రత్యర్థుల నుంచి ఆపిల్‌కు పెద్ద ఎత్తున్నే సవాళ్లు ఎదురవుతున్నాయి. -
వ్యతిరేకత న్యాయమే
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై చైనా అధికార పత్రిక - పాశ్చాత్య దేశాలు భారత్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాయి - అమెరికా అండ ఉంటే.. ప్రపంచం వెనకున్నట్లు కాదు - సమస్యలకు పరస్పర అంగీకారంతో పరిష్కారం: చైనా సర్కారు బీజింగ్: అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం నైతికంగా న్యాయమేనని చైనా స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయంలో భారత్ అనుసరిస్తున్న తీరుతోపాటు.. పశ్చిమ దేశాలు భారత్‌ను తప్పుదోవ పట్టిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ‘చైనా ఒక్కటే భారత అవకాశాలను అడ్డుకుంటోందన్న విమర్శలు సరికాదు. మరో పది దేశాలు కూడా ఇవే ప్రశ్నలను లేవనెత్తాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకాలు చేయకుండా ఎన్ఎస్జీలో ఎలా సభ్యత్వం ఇస్తారని ప్రశ్నించామంతే’ అని పేర్కొంది. జూన్ 24న సియోల్‌లో జరిగిన ఎన్ఎస్జీ భేటీకి ముందు.. ‘చైనా తప్ప మిగిలిన 47 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి’ అంటూ భారత మీడియాలో వచ్చిన వార్తలపై చైనా తీవ్రంగా మండిపడింది. ‘ఢిల్లీ ఎన్ఎస్జీ ప్రయత్నానికి నియమాలే అడ్డంకి. బీజింగ్ కాదు’ అని వెల్లడించింది. పాశ్చాత్య దేశాలకు భారత్ ‘బంగారు బాబు’గా దొరికిందని విమర్శించింది. ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలు భారత్‌కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ చైనాను మాత్రం విస్మరిస్తున్నాయని ఆరోపించింది. చైనా జీడీపీలో కేవలం 20 శాతం మాత్రమే ఉన్న భారతదేశం.. చైనా కన్నా మంచి మార్కెట్ అని పాశ్చాత్యదేశాలు ప్రశంసిస్తున్నాయని విమర్శించింది. ఇది భారత్‌ను చెడగొట్టడమేనని పేర్కొంది. ‘భారత్‌లో కొందరు ఎన్ఎస్జీ విషయంలో చాలా నీచంగా మాట్లాడినా.. భారత ప్రభుత్వం మాత్రం చాలా హుందాగా వ్యవహరించింది. ప్రతి విషయాన్ని చైనాతో చర్చించింది. భారత జాతీయవాదులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. చైనాతో గొడవకు దిగటం సమస్యకు పరిష్కారం కాదు. వారు భారత్ సూపర్ పవర్ కావాలనుకుంటున్నారు. సూపర్ పవర్ కావాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలో వారు తెలుసుకోవాలి’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అమెరికా మద్దతు తెలిపినంత మాత్రాన ప్రపంచమంతా భారత్ వెనకాలే ఉందనుకోవటం పొరపాటని, ఈ వాస్తవాన్ని భారత్ విస్మరించిందనివిమర్శించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చైనా ప్రవర్తిస్తుందని, కానీ భారత్ మాత్రం తమ లాభం గురించే ఆలోచిస్తుందని ఆరోపించింది. క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్) లో భారత్‌కు సభ్యత్వం, చైనాకు మొండిచేయి చూపటంపై స్పందిస్తూ.. ‘చైనీయుల మానసిక పరిపక్వత చాలా ఎక్కువ. ఇలాంటి అంతర్జాతీయ సంబంధాల విషయంలో అనవసరంగా స్పందించర’ని పేర్కొంది. కూర్చుని పరిష్కరించుకుందాం చైనాతో ఒకటి కాదు చాలా సమస్యలున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం స్పందించింది. భారత్‌తో ఉన్న సమస్యలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని ప్రకటించింది. వివాదాస్పద అంశాల్లో పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలు జరగనున్నట్లు తెలిపింది. ‘మోదీ ఇంటర్వ్యూపై రిపోర్టు మాకందింది. భారత్-చైనా సంబంధాలు బాగానే ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా అన్ని సమస్యల పరిష్కారానికి మేం పనిచేస్తున్నాం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ తెలిపారు. -
చైనాతో పెరిగిన భారత వాణిజ్య లోటు
బీజింగ్: చైనాతో భారత వాణిజ్య లోటు గత ఏడాది 4,487 కోట్ల డాలర్లకు పెరిగిందని చైనా ప్రభుత్వం తెలిపింది. ఎగుమతులు 1,338 కోట్ల డాలర్లకు తగ్గాయని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం స్వల్పంగా పెరిగి 7,164 కట్ల డాలర్లకు చేరిందని, 10,000 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని చేరలేకపోయిందని వివరించింది. చైనా ఎగుమతులు 5,825 కోట్ల డాలర్లకు పెరిగాయని తెలిపింది. 2014లో 1,640 కోట్ల డాలర్లుగా ఉన్న చైనాకు భారత్ ఎగుమతులు గత ఏడాది 1,338 కోట్ల డాలర్లకు తగ్గాయని వివరించింది. -
చైనాలో దుబారా చేస్తే అంతే..
ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యయ నియంత్రణ పాటించకుండా, దుబారా ఖర్చులు చేస్తూ జాతి సంపదను హరించి వేస్తున్న సర్కారు ఉద్యోగులపై చైనా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 22 వేల మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మితిమీరిన ఉద్యోగస్వామ్యాన్ని అదుపు చేయాలని నిబంధనలను రూపొందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇందుకోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కానీ, లక్షల మంది ఉద్యోగులు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో 2012 నుంచి ఇప్పటి వరకు నిబంధనలను ఉల్లంఘించిన 1.20 లక్షల మంది ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలోని కిందిస్థాయి సిబ్బందితో పాటు అత్యున్నత స్థాయి అధికారులు కూడా క్రమశిక్షణ చర్యలకు గురైన వారిలో ఉన్నారు. 16,761 కేసుల్లో ప్రమేయం ఉన్న వీరందరిపై చర్యలు చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన కేంద్ర క్రమశిక్షణ, విచారణ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, 2014లో ఇలా క్రమశిక్షణ చర్యలకు గురైన అధికారులు 71 వేల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత పనులకు వాడటం, అనర్హులకు సబ్సిడీలు ఇవ్వడం, విందులు, వినోదాలకు విపరీతంగా ఖర్చులు చేయడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. -
చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్
- రెండు నెలల్లో షేర్లపై 147 బిలియన్ డాలర్ల వెచ్చింపు - స్టాక్స్ ధరల పతనాన్ని నిలువరించేందుకే... షాంఘై: స్టాక్ మార్కెట్ల పతనాన్ని నిలువరించే దిశగా షేర్ల ధరలకు ఊతమిచ్చేందుకు చైనా ప్రభుత్వం గత రెండు నెలల్లో ఏకంగా 900 బిలియన్ యువాన్లు (147 బిలియన్ డాలర్లు, దాదాపు రూ. 9 లక్షల కోట్లు) వెచ్చించింది. మార్కెట్లకు సహాయక ప్యాకేజీ కింద.. స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ చైనా సెక్యూరిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (సీఎస్ఎఫ్) తదితర సంస్థలకు నిధులందించింది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు గోల్డ్‌మన్ శాక్స్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. జూన్ మధ్యలో గరిష్ట స్థాయికి చేరిన షాంఘై మార్కెట్ ఆ తర్వాత మూడు వారాల్లోనే 30 శాతం పైగా క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో పతనానికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం 2 లక్షల కోట్ల యువాన్లను పక్కన ఉంచినట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. -
పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..
-
చైనాతో 11 ఒప్పందాలు ఖరారు
ఏపీలో సమ్మెలుండవని, శాంతిభద్రతలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు సాక్షి,హైదరాబాద్: చైనా ప్రభుత్వంతోపాటు అక్కడి పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య మంగళవారం చైనా రాజధాని బీజింగ్‌లో 11 ఒప్పందాలు కుదిరాయి. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మంగళవారం ఈ ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ప్రభుత్వ వ్యాపార విభాగంలో 6, బిజినెస్ టు బిజినెస్ విభాగంలో 5 ఒప్పందాలు ఉన్నాయి. ఏపీ పరిశ్రమల శాఖతో చైనా ఎస్ఎంఈ చైర్మన్, కేమెల్ గ్రూప్, చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, సినోమా, ఎస్హెచ్ఎల్ లిమిటెడ్‌లు ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి, సీసీపీఐటీ కన్స్ట్రక్షన్ వింగ్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. బిజినెస్ టు బిజినెస్ విభాగంలో సీసీసీటీ ఆఫ్ చైనా, బ్రాండెక్స్ ఆఫ్ ఇండియా, సీసీఐటీ టెక్స్టైల్ విభాగం కార్యదర్శి - బ్రాండెక్స్, చైనీస్ అసోసియేషన్ ఆఫ్ నిట్టింగ్ ఇండస్రీ ్ట- బ్రాండిక్స్, ట్రాన్స్‌స్ట్రాయ్ ఆఫ్ ఇండియా-న్యూ ఎరా గ్రూప్ ఆఫ్ చైనా మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. చైనా అతిపెద్ద భాగస్వామి: చంద్రబాబు అంతకుముందు బీజింగ్‌లో వివిధ కంపెనీలు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో భారత్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా అని చెప్పారు. చైనా నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌కు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో సమ్మెలుండవని, శాంతిభద్రతలుంటాయని ఆయన అన్నారు. త్వరలో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక విధానం తెస్తామని చంద్రబాబు చెప్పారు. పారిశ్రామిక పార్కులు, టౌన్షిప్లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలన్నారు. ఏపీలో వర్తక వాణిజ్యాభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, ఇతర దేశాలకన్నా భారత్‌లో ఎక్కువ లాభాలు పొందొచ్చని చెప్పారు. చైనా హార్బర్ ఇంజనీరింగ్‌తో ఒప్పందం చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ, సోమా కంపెనీల మధ్య బిజినెస్ టు బిజినెస్ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ పెట్టుబడుల విభాగం జీఎం మైకేల్ బెర్న్, మార్కెటింగ్ విభాగం డిప్యూటీ జీఎం బింగ్ వెస్, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. డెంగ్ జియావో పింగ్‌పై తనకెంతో గౌరవమని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. సాంస్కృతిక సారూప్యత దృష్ట్యా ఏపీ కొత్త రాజధాని అమరావతిని రెండో సొంతింటిలా చైనీయులు భావించాలని ఆయన కోరారు. పలువురితో బాబు భేటీ.. చంద్రబాబు మంగళవారం బీజింగ్‌లో ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(ఐడీసీపీసీ) మినిస్టర్ వాంగ్ జైరుయితో సమావేశమయ్యారు. అంతకుముందు చంద్రబాబు బృందం గ్విజు ప్రావిన్సుకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. చైనా మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్టు కార్పొరేషన్ ప్రతినిధులతోనూ బాబు భేటీ అయ్యారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలసి పనిచేస్తామని ఆ సంస్థ ఎండీ డియో సెమింగ్ తెలిపారు. బ్యాటరీల తయారీలో అనుభవమున్న కేమెల్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఐదొందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తా: చంద్రబాబు సాక్షి,హైదరాబాద్: ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలనేదే అంబేడ్కర్ ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇచ్చిన సందేశాన్ని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. -
విమానం కోసం ఉపగ్రహ వేట!
-
నీటి కింది నగరం..
నీటిలో నగరం అద్భుతంగా ఉంది కదూ.. ఒకప్పుడు చైనాలోని జెజియాంగ్‌లో ఆర్థిక, రాజకీయ కేంద్రంగా ఉండేది ఈ లయన్ సిటీ. అయితే, 1959లో చైనా ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో మానవనిర్మిత సరస్సును నిర్మించింది. ఆ సమయంలోనే ఇది ఆ సరస్సు గర్భంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోకున్నా.. ఇటీవల ట్రావెల్ కంపెనీల దృష్టి దీనిపై పడింది. ఇన్నాళ్లూ 130 అడుగుల లోతులో అలా నీటిలోనే ఉన్నా.. ఎక్కడా చెక్కుచెదరకుండా ఉండటంతో త్వరలో దీన్నో పర్యాటక స్థలంగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.