లండన్: చైనా ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్న, చైనాతో సంబంధమున్న ట్విటర్ ఖాతాలను ఆ సంస్థ నిలిపివేసింది. ఆయా ట్వీట్లలో చైనా ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు ఉంటుండడంతో, ట్విటర్ సంస్థ చైనా ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే, అవి తమవి కాదని వారు తెలపడంతో దాదాపు 23,750 ఖాతాలను నిలిపివేసినట్లు ట్విటర్ ప్రకటించింది. ఈ ఖాతాలు చేస్తున్న ట్వీట్లను రీట్వీట్ చేస్తున్న మరో 1,50,000 అకౌం ట్లను సైతం నిలిపివేసింది. చైనాలో ట్విటర్ సహా, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సర్వీసులపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment