అమెరికా సుప్రీంకోర్టు
వాషింగ్టన్: చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీకోర్టు శుక్రవారం సమర్థించింది. ఈ నిషేధం ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. చైనాలోని టిక్‌టాక్ మాతృ సంస్థ టిక్‌టాక్‌ను ఇతరులకు విక్రయించకపోతే నిషేధాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఒకవేళ ఇతరులకు విక్రయించిన పక్షంలో నిషేధం అవసరం లేదని వెల్లడించింది. టిక్‌టాక్‌తో చైనాకు సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగితే అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని, అందుకు తాము అనుమతించలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. అమెరికాలో టిక్‌టాక్ యాప్‌ను 17 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌పై నిషేధం విధించి వారి భావప్రకటనా స్వేచ్ఛను హరించవద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అయితే, భావప్రకటనా స్వేచ్ఛ కంటే దేశ భద్రతే ముఖ్యమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ జో బైడెన్ ప్రభుత్వం చట్టం తీసుకొచి్చంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. యాప్‌పై ఆంక్షలను 90 రోజులపాటు నిలిపివేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ అధికారాన్ని ట్రంప్ వాడుకొనే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment