TikTok
-
‘ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?’
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష, టిక్‌టాక్ అంశంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సీన్ హన్నిటీ అధ్యక్షుడు ట్రంప్‌ను పలు ఆసక్తికర అంశాలపై ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఆయన స్పందించారు.టిక్ టాక్ బ్యాన్పై.. చైనాలో ఆ యాప్ తయారైందని మీరు అంటున్నారు. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా తయారవుతున్నాయి. మరి ఇక్కడ వాటి ప్రస్తావన ఎందుకు రావడం లేదు. కేవలం అమెరికా యువతపై నిఘా పెట్టడమే చైనా పనా?. యువత కేవలం సరదా కాలక్షేపం కోసం మాత్రమే ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌పై తాజాగా అమెరికా నిషేధం విధించగా.. దానిని ఎత్తివేసే ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది👉కాపిటల్ భవనంపై దాడి కేసులో.. చాలా మంది అమాయకులు. అర్థమైందా?. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్(Capitol Hill) భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1,600 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.👉జో బైడెన్(Joe Biden) పోతూపోతూ..విశిష్ట అధికారాలను ఉపయోగించి స్వీయ క్షమాభిక్ష పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా తనకు కావాల్సిన వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో.. నన్ను అలా చేయమని నా చుట్టూ ఉన్న అధికారులు సూచించారు. చివరకు.. నాకు నేనుగా క్షమాభిక్ష విధించుకునే ఆప్షన్‌ను కూడా నా ముందు ఉంచారు. కానీ, నేనెవరికీ క్షమాభిక్ష ప్రసాదించే ఉద్దేశం లేదని చెప్పా. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు క్షమాభిక్ష ఎందుకు?. మా వాళ్లంతా దేశభక్తులే అని అన్నారాయన.👉ఓవల్ ఆఫీస్(అమెరికా అధ్యక్ష కార్యాలయం)కు తిరిగి రావడంపై.. స్పందిస్తూ.. ఇక్కడ బోలెడంత పని ఉంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు.. ఇలా ఎన్నో సంక్షోభాలు నడుస్తున్నాయి. అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఉండాల్సింది కాదు(నవ్వుతూ..). 👉లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై.. ఇది ముమ్మాటికీ ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ చేతకానితనమే. ఉత్తరాది నుంచి వచ్చే నీటిని అతను విడుదల చేయాల్సి ఉంది. తద్వారా మంటలను కట్టడి చేసే అవకాశం ఉండేది.👉అక్రమ వలసదారుల్లో(Illegal Immigrants) నేరస్తుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చారు!. బైడెన్ పాలనతో ప్రపంచంలోని జైళ్లన్నీ ఖాళీగా మగ్గుతున్నాయి(సెటైరిక్‌గా). వలసదారుల చట్టం అమలు కోసం శాంక్చురీ సిటీలకు కేటాయించే ఫెడరల్ ఫండ్స్‌కు కోత విధించాల్సిన అవసరం ఉంది. నేను చేయగలిగిన పని అదొక్కటే అనిపిస్తోంది. 👉దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ల లెక్కలు తేల్చాల్సి ఉంది. -
అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత.. నిషేధానికి ముందే చైనా కంపెనీ నిర్ణయం
-
టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..!
అమెరికాలో టిక్‌టాక్ తన సేవలను పునరుద్ధరించిందని, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇందుకు కారణమని పేర్కొంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ తాత్కాలికంగా నిలిచిపోతుందని అందరూ భావించారు. ఇది మిలియన్ల మంది అమెరికన్ వినియోగదారులపై ప్రభావం చూపుతుందని అనుకున్నారు. అయితే, ట్రంప్ జోక్యంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించడంతో యూజర్లకు ఊరట లభించింది.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. మిలియన్ల మంది అమెరికన్లు ఈ యాప్‌పై ఆధారపడ్డారని ఆయన నొక్కిచెప్పారు. ఈ యాప్ యూఎస్‌లో కొనసాగేలా, ఇది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మధ్యవర్తిత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన స్పష్టతను అందించింది. దాంతోపాటు టిక్‌టాక్ జరిమానాలు ఎదుర్కోకుండా తాత్కాలికంగా కాపాడినట్లయింది.అసలు వివాదం ఏమిటి?చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది.భద్రతపై ఆందోళనలుఅమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో గత అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. యూజర్ లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు టిక్‌టాక్ తన సేవలను పునరుద్ధరించినట్లు ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకంభవిష్యత్తుపై ప్రశ్నలుటిక్టాక్కు తక్షణ సంక్షోభం తప్పినప్పటికీ, అమెరికాలో కంపెనీ భవిష్యత్తుపై ప్రశ్నలు వస్తున్నాయి. అమెరికాలో తన కార్యకలాపాలు సాగించాలంటే మాత్రం ఏదైనా యూఎస్ కంపెనీతో చైనీస్ మాతృసంస్థ బైట్ డాన్స్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ట్రంప్ సూచించారు. అందులో అమెరికన్ ఇన్వెస్టర్లు కనీసం 50 శాతం వాటా కలిగి ఉండాలి. అమెరికాలో ఈ యాప్ కార్యకలాపాలు కొనసాగేలా చూస్తూనే జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడం సవాలుగా మారనుంది. -
టిక్ నో టాక్
స్వల్పనిడివి వీడియో మెసెంజింగ్ యాప్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి స్మార్ట్ఫోన్లలో స్థానం సంపాదించిన టిక్‌టాక్ యాప్ ఇప్పుడు అమెరికాలో అదృశ్యం కానుంది. ఆదివారం (జనవరి 19వ తేదీ) నుంచి అమెరికాలో యాప్ సేవలు దాదాపు ఆగిపోయినట్లేనని టిక్‌టాక్ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ యూజర్ల డేటా దాని మాతృ సంస్థ అయిన ‘బైట్‌డ్యాన్స్’ద్వారా చైనా వామపక్ష ప్రభుత్వానికి చేరుతోందని అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాతో బంధం తెంచుకుని, టిక్‌టాక్‌ను ఆదివారంకల్లా అమెరికా కేంద్రంగా పనిచేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా దేశ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసినప్పటికీ బైట్‌డ్యాన్స్ ఈ దిశగా అడుగులువేయలేదు. దీంతో అమెరికాలో టిక్‌టాక్ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. వినోదం పంచిన యాప్ తర్వాత దేశభద్రత అంశంతో ముడిపడి చివరకు అగ్రరాజ్యాన్నే వదిలేస్తున్న వైనం ఆద్యంతం ఆసక్తిదాయకం. అగ్రస్థానం నుంచి అదృశ్యం దాకా.. చైనా వ్యాపారి ఝాంగ్ యిమిన్ 2012లో బైట్‌డ్యాన్స్ అనే సంస్థను స్థాపించారు. తర్వాత రెండేళ్లకు అలెక్స్ ఝూ అనే వ్యాపారి Musical.ly అనే స్టార్టప్‌ను రూపొందించాడు. వీడియోలకు తగ్గట్లు పెదాలు కదిలిస్తూ వీడియో తీసి అప్లోడ్ చేసే యాప్‌గా దీనిని అందుబాటులోకి తెచ్చాడు. ఇది 2015 జూలైకల్లా ఆపిల్ యాప్‌స్టోర్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ Musical.ly ను బైట్‌డ్యాన్స్ ఒక బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసి సొంత ‘డౌయిన్’యాప్‌లో విలీనంచేసి విదేశీ యూజర్ల కోసం కొత్తగా టిక్‌టాక్ యాప్‌ను తెచ్చింది. ర్యాపర్ లిల్ నాస్ ‘ఓల్డ్ టౌన్ రోడ్’పాటకు చేసిన డ్యాన్స్ వీడియో టిక్‌టాక్‌లో పాపులర్ అవడంతో అందరూ టిక్‌టాక్ బాట పట్టారు. పాపులర్ డ్యాన్స్ స్టెప్పులు, వంటల విశేషాలు, బ్యూటీ టిప్స్, పాటలకు తగ్గ పార్ఫార్మెన్స్ ఛాలెంజ్‌లను ప్రోత్సహిస్తూ సాగే వీడియోలతో టిక్‌టాక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ షార్ట్‌వీడియో మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. చైనా వ్యతిరేకత అస్సలు కనపడదు ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం ఒక పాటగానో, డ్యాన్స్గానో టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైనా చైనా వ్యతిరేక వీడియోలు మాత్రం అస్సలు కనబడవు. 1989 తియాన్మెన్స్కే్వర్ ఉద్యమం, నాటి ఊచకోత, టిబెటన్ల స్వాతంత్య్రపోరాటం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమంపైనా అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు కనిపించినా టిక్‌టాక్‌లో మాత్రం అలాంటివేమీ దర్శనమివ్వలేదు. కానీ ట్రంప్‌కు మద్దతు పలుకుతూ పెట్టిన #trump2020 హ్యాష్‌ట్యాగ్‌తో వచ్చిన పోస్టులు మాత్రం కోట్లాదిగా షేర్ అయ్యాయి. 2019లో అమెరికాలో తొలి ఆందోళన సెన్సార్టవర్ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. టిక్‌టాక్‌కు ప్రస్తుతం అమెరికాలో 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే అమెరికా సైన్యానికి చెందిన సమాచారాన్ని టిక్‌టాక్ తన మాతృసంస్థకు చేరవేస్తోందని 2019లో తొలిసారిగా ఆందోళన వ్యక్తమైంది. దీంత అన్ని స్మార్ట్ఫోన్లలో టిక్‌టాక్ యాప్ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. అయినాసరే విపరీతంగా యాప్‌కు బానిసలుగా మార్చేసి అమెరికా చిన్నారుల పరిరక్షణా చట్టాలను టిక్‌టాక్ ఉల్లంఘిస్తోందని 2020 లో ప్రైవసీ సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో తాము అమెరికన్లకు దగ్గరి వాళ్లమని మభ్యపెట్టేందుకు డిస్నీ ఉన్నతాధికారి కెవిన్ మేయర్‌కు టిక్‌టాక్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. భారత్‌లో బ్యాన్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత జాతీయభద్రత ప్రమాదంలో పడిందని పేర్కొంటూ భారత్ టిక్‌టాక్‌ను 2020 జూలైలో నిషేధించింది. కోవిడ్ సంక్షోభంలో వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించని చైనాకు బుద్ధిచెప్పేందుకైనా టిక్‌టాక్‌ను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ సైతం నిషేధాన్ని సమరి్థంచారు. 90 రోజుల్లోపు అమెరికా నుంచి వైదొలిగితే మంచిదని 2020 ఆగస్ట్‌లో ట్రంప్ ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీచేశారు. తర్వాత టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్‌మార్ట్ ప్రయతి్నంచినా అది కార్యరూపం దాల్చలేదు. బైడెన్ వచ్చాక.. 2021 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడు బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధానికి ట్రంప్ ఇచి్చన ఉత్తర్వులు అమలుకాకుండా మూలనపడేశారు. అయితే బక్కచిక్కిపోయేలా అతి ఆహార నియమాల వంటి తప్పుడు సూచనలు ఇచ్చే వీడియోల వరద టిక్‌టాక్‌లో ఎక్కువైందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక నివేదిక ఇవ్వడంతో టిక్‌టాక్‌పై బైడెన్ మళ్లీ దృష్టిసారించారు. అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటూనే ఇన్‌స్టా గ్రామ్ను వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్లు జరిగిన యాప్‌గా టిక్‌టాక్ చరిత్ర సృష్టించింది. వంద కోట్ల మంది నెలకు తమ యాప్ వాడుతున్నారని ప్రకటించింది. మరోవైపు అమెరికా యూజర్ల డేటా భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో నష్టపరిహార చర్యలకు టిక్‌టాక్ దిగింది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ పర్యవేక్షణలో ఉండే సర్వర్లకు డేటాను బదిలీచేస్తున్నట్లు ప్రకటించింది. రంగంలోకి ఎఫ్‌బీఐ జాతీయ భద్రత కీలకాంశం కావడంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అమెరికన్లను ప్రభావితం చేసేలా యాప్ అల్గారిథమ్‌ను చైనా మాతృసంస్థ మార్చేస్తోందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే 2022 డిసెంబర్లో ఆరోపించారు. 30 రోజుల్లోపు అన్ని ప్రభుత్వం జారీచేసిన స్మార్ట్ఫోన్ల నుంచి యాప్‌ను తీసేయాలని శ్వేతసౌధం 2023 ఫిబ్రవరిలో ఆదేశాలిచి్చంది. యాప్ నిబద్ధతపై టిక్‌టాక్ సీఈవో షూఝీ ఛెవ్ను మార్చిలో అమెరికా పార్లమెంటరీ కమిటీ గంటలతరబడి ప్రశ్నించింది. నిషేధానికి తొలి అడుగు అమెరికన్ సంస్థకు టిక్‌టాక్‌ను అమ్మాలని లేదంటే నిషేధిస్తామని 2024 మార్చిలో అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుపై 2024 ఏప్రిల్‌లో అధ్యక్షుడు బైడెన్ సంతకంచేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై బైట్‌డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. మిగతా యాప్‌లను వదిలేసి మా సంస్థపైనే ప్రభుత్వం కక్షగట్టిందని వాదించింది. అయితే నిషేధాన్ని సమరి్థస్తూ ఫెడరల్ అప్పీళ్ల కోర్టు 2024 డిసెంబర్ ఆరున తీర్పు చెప్పింది. మాట మార్చిన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిషేధిస్తానని ప్రతిజ్ఞచేసిన ట్రంప్ ఆ తర్వాత పదవి నుంచి దిగిపో యాక మాటమార్చారు. 2024 జూన్‌లో మళ్లీ టిక్‌టాక్ ఖాతా తెరచి ఈ యాప్‌కు మద్దతు పలికారు. టిక్‌టాక్‌ను నిషేధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని ట్రంప్ వింత వాదన చేశారు. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది. పొలోమంటూ రెడ్‌నోట్ డౌన్లోడ్ టిక్‌టాక్ కనుమరుగు దాదాపు ఖాయంకావడంతో ఇప్పటికే ఇలాంటి వీడియోలకు బానిసలైన అమెరికన్లు వెంటనే రెడ్‌నోట్ యాప్‌కు జై కొట్టారు. దీంతో అమెరికాలో అత్యంత ఎక్కువ డౌన్లోడ్లు ఉన్న యాప్‌గా రెడ్‌నోట్ రికార్డు సృష్టించింది. అయితే రెడ్‌నోట్ కూడా చైనా యాప్ కావడం విశేషం. లైఫ్‌స్టైల్ సోషల్‌మీడియా యాప్ అయిన రెడ్నోట్లోనూ చిన్నపాటి వీడియోలు చేయొచ్చు. ఫొటోలు, సందేశాలు పంపొచ్చు. లైవ్ స్ట్రీమింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. గ్జియోహోంన్షు యాప్‌నే సులభంగా రెడ్నోట్గా పిలుచుకుంటారు. దీనిని ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. బద్ధశత్రువుల దేశాలకు చెందిన పౌరులు ఒకే ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించడం వింతే. ఇన్‌స్టా గ్రామ్, ‘ఎక్స్’యాప్‌లను చైనీయులు వాడలేరు. చైనా ఇంటర్నెట్లో వీటిని అక్కడి ఫైర్‌వాల్స్ అడ్డుకుంటాయి. మరోవైపు చైనా యూజర్లు టిక్‌టాక్‌ను వాడలేరు. వీళ్లనూ బుట్టలో వేసుకునేందుకు వాళ్ల కోసం చైనాలోనే డౌయిన్ అనే యాప్‌ను బైట్‌డ్యాన్స్ అందుబాటులో ఉంచింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టిక్‌టాక్‌పై నిషేధం సబబే
వాషింగ్టన్: చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీకోర్టు శుక్రవారం సమర్థించింది. ఈ నిషేధం ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. చైనాలోని టిక్‌టాక్ మాతృ సంస్థ టిక్‌టాక్‌ను ఇతరులకు విక్రయించకపోతే నిషేధాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఇతరులకు విక్రయించిన పక్షంలో నిషేధం అవసరం లేదని వెల్లడించింది. టిక్‌టాక్‌తో చైనాకు సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగితే అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని, అందుకు తాము అనుమతించలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. అమెరికాలో టిక్‌టాక్ యాప్‌ను 17 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌పై నిషేధం విధించి వారి భావప్రకటనా స్వేచ్ఛను హరించవద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, భావప్రకటనా స్వేచ్ఛ కంటే దేశ భద్రతే ముఖ్యమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ జో బైడెన్ ప్రభుత్వం చట్టం తీసుకొచి్చంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. యాప్‌పై ఆంక్షలను 90 రోజులపాటు నిలిపివేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ అధికారాన్ని ట్రంప్ వాడుకొనే అవకాశం కనిపిస్తోంది. -
ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్‌మస్క్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
టిక్‌టాక్‌పై నిషేధం ఆపండి: ట్రంప్
వాషింగ్టన్:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్‌టాక్(TikTok) యాప్ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్‌టాక్‌పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టు(Supreme Court)ను కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు. కాగా,యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్‌టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్‌టాక్ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్‌టాక్ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్‌టాక్ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను నిషేధించబోనని స్పష్టం చేశారు. -
అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకం
అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలుఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ ఇటీవల దానిపై అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించాలని నిర్ణయించుకుంది. దాంతో జనవరి 19 కంటే ముందే అంటే 10వ తేదీనే తన వాదనలు వినిపించనుంది. -
చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!
చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్‌డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.చైనా కంటే భారత్‌లో పెరుగుదలచైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్‌లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు డౌయిన్, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది. -
మనిషిగా, మంచిగా బతకలేను..అందుకే వెళ్లిపోతున్నా: టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్
"వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్" అంటూ తనను తాను పెళ్లి చేసుకున్న టిక్‌టాక్ స్టార్ కుబ్రా అయ్కుట్ (Kubra Aykut) అనూహ్యంగా ప్రాణాలు విడిచింది. టర్కీలోని తన అపార్ట్మెంట్ భవనంలోని ఐదో అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్‌మీడియ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 26 ఏళ్ల ‘సోలోగామి’ ఫేమ్ ఇన్ఫ్లుయెన్సర్ అయుకుట్ 2023లో విలాసవంతమైన వివాహ వేడుక, వీడియో ఫోటోలతో ఇంటర్నెట్లోఅనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇపుడు తన ఆకస్మిక మరణంతో కూడా అనేక ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది .స్థానిక మీడియా నివేదికల ప్రకారం సెప్టెంబర్ 23న ఆమె చనిపోయింది. టిక్‌టాక్ వీడియోలో, ఆమె ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు, కుబ్రా తన ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించడంతో ఈ ఘటన ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే చర్చకు దారి తీసింది. అయితే సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.టిక్‌టాక్‌లో 10 లక్షలకుపైగా ఫాలోవర్లు,ఇన్స్టాగ్రామ్లోరెండు లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు. సూసైడ్ నోట్"నేను నా ఇష్టపూర్వంకంగానే దూకాను. ఎందుకంటే నాకు ఇక జీవించాలని లేదు. ఫిస్టిక్ని బాగా చూసుకోండి. నేను నా జీవితంలో అందరికీ మంచిదాన్నే, ఇక మంచిగా ఉండలేను. మంచిగా బతకడం వల్లన నాకేమీ ఒరగలేదు. స్వార్థం ఉంటేనే, సంతోషంగా ఉంటారు చాలా రోజులుగా కష్టపడుతున్నా ఎవరూ గమనించలేదు.. నన్ను నేను ప్రేమించానుకుంటూ వెళ్లిపోతున్నాను. ఒక్క సారి నన్ను క్షమించండి’’ (హరివరాసనం : చిన్నారి విష్ణుప్రియ నృత్యాభినయం, వీడియో వైరల్) అనూహ్యంగా బరువు తగ్గడంపై ఆమె బాగా ఆందోళనలో పడిన్నట్టు తెలుస్తోంది. మరణానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియా ఇలా పోస్ట్ చేసింది "నేను నా శక్తిని సేకరించాను, కానీ నేను బరువు పెరగడం లేదు. ఈ రోజు నేను 44 కిలోగ్రాములకు పడిపోయాను, నేను ప్రతిరోజూ ఒక కిలోగ్రాము తగ్గుతాను. నేను ఏమి చేయాలో నాకు తెలియదు; నేను అత్యవసరంగా బరువు పెరగాలి”. గత కొన్నిరోజులుగా వస్తున్న ఇలాంటి పోస్ట్‌లపై అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారి భయాలను నిజం చేస్తూ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసింది.ఇదీ చదవండి: చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో -
గెలిపిస్తే టిక్‌టాక్‌ను కాపాడుతా: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్‌టాక్‌కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్‌టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్‌టాక్‌ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆరోపణలు గుప్పించారు. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం గమనార్హం. -
హేట్ టు లవ్.. నాలుక మడతేసిన ట్రంప్
-
తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!
ప్రముఖ సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్‌పై యూఎస్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. పదమూడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల సమాచార గోప్యతను పాటించడంలో కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపించింది. పిల్లల తల్లిదండ్రుల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సమాచారాన్ని సేకరించిందని చెప్పింది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం టిక్‌టాక్, దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌పై కోర్టులో దావా వేసింది.యూఎస్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..చైనా ఆధారిత సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ యూఎస్‌లో 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని పొందాల్సి ఉంటుంది. కానీ కంపెనీ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. పిల్లల ఆన్లైన్ గోప్యతా రక్షణ చట్టాన్ని టిక్‌టాక్ ఉల్లంఘించింది. ఇది భవిష్యత్తులో అమెరికన్ల సమాచార భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉంది.ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీలోని డెమొక్రాట్ ప్రతినిధి ఫ్రాంక్ పల్లోన్ మాట్లాడుతూ..‘చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలోని టిక్‌టాక్‌ను ఉపసంహరించుకోవాలి. పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండానే కుంటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరించడం సరికాదు. అమెరికన్ల సమాచార గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది’ అన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి డేటా సేకరించినందుకుగాను టిక్‌టాక్‌పై రోజూ ఒక్కో ఉల్లంఘనకు 51,744 డాలర్లు(రూ.43 లక్షలు) జరిమానా విధించాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) ప్రతిపాదించింది. ఇదే జరిగితే కంపెనీ కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదుఈమేరకు టిక్‌టాక్ స్పందిస్తూ..యూఎస్ ప్రభుత్వం కోర్టులో వేసిన దావాను తీవ్రంగా ఖండించింది. అందులోని వివరాలు పూర్తిగా అబద్ధమని చెప్పింది. కొన్ని సంఘటనలు గతంలో జరిగినా అవి చాలాకాలం కిందటే పరిష్కరించామని పేర్కొంది. పిల్లల భద్రతకు కంపెనీ యాజమాన్యం పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్‌ను మరింత మెరుగుపరిచేందుకు చేస్తున్న సన్నాహాలు ఆపమని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా, చైనీస్ యాజమాన్యంలోని టిక్‌టాక్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను యూఎస్‌లో దాదాపు 170 మిలియన్ల(17 కోట్లు) మంది వినియోగిస్తున్నారు. పిల్లల డేటా నిర్వహణకు సంబంధించి సరైన నిబంధనలు పాటించకపోవడంతో సంస్థపై గతేడాది యూరోపియన్ యూనియన్, యూకే ప్రభుత్యాలు జరిమానా విధించాయి. -
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్‌తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.టిక్‌టాక్‌తో పోటీపడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదికయువత యాప్‌ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్‌లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్‌టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్‌ప్లేస్, గ్రూప్‌లు, స్మాల్ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్‌ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు. -
అమెరికాలో టిక్ టాక్.. ‘ఇక డబ్బులు సంపాదించడం చాలా ఈజీ’
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో కంటెంట్ క్రియేటర్లు లబ్ధి చేకూరేలా డబ్బులు సంపాదించుకునే (మానిటైజేషన్) మార్గాన్ని మరింత సులభతరం చేసింది. అందుకు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌పై అమెరికా ఒత్తిడే కారణమని తెలుస్తోంది. టిక్ టాక్‌లో కంటెంట్ క్రియేటర్లు ఏదైనా అంశం మీద వీడియోలు చేస్తుంటారు. ఫలితంగా 5వే ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ ఛానెల్ క్రియేటర్.. తన ఛానెల్ ద్వారా ఏదైనా వస్తువును సేల్ చేసి అఫిలేట్ మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. తాజాగా, ఆ ఫాలోవర్ల సంఖ్యని 1000కి తగ్గించింది.అఫిలేట్ మార్కెటింగ్ అంటే?అమెజాన్, ఇతర అఫిలేట్ నెట్ వర్క్ వెబ్సైట్లలో యూజర్లకు ఏదైనా నచ్చిన ప్రొడక్ట్‌ను వివిధ మార్గాల్లో అంటే ఫేస్బుక్, వెబ్సైట్లు, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రమోషన్ చేసి వాటిని అమ్మాల్సి ఉంటుంది. అలా అమ్మితే అమెజాన్ అందుకు ప్రొడక్ట్‌ను బట్టి 10 నుంచి 20 శాతం వరకు కమిషన్‌ను అందిస్తుంది. న్యాయ పరమైన ఇబ్బందుల్లో టిక్ టాక్ చైనాకు చెందిన టిక్ టాక్ అమెరికాలో న్యాయ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అగ్రరాజ్యం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. పలు సందర్భాలలో టిక్ టాక్‌పై బ్యాన్ విధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే బ్యాన్ తర్వాత ఎదురయ్యే ఆర్ధికపరమైన పర్యవసానాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గింది. టిక్‌టాక్‌పై వరుస పిటిషన్లు నిషేధ చట్టం న్యాయ విభాగం టిక్‌టాక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. 170 మిలియన్ల యూజర్ల డేటాను ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అనుమానం వ్యక్తం చేసిన అమెరికన్ టిక్ టాక్ యూజర్లు కోర్టులో వరుస పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.అమ్ముతారా? లేదంటే బ్యాన్ చేయమంటారా?ఈ సందర్భంగా టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని, లేదంటే నిషేధం విధిస్తామని తెలుపుతూ హౌస్ బిల్లుపై జో బైడెన్ సంతకం చేశారు. అందుకు 270 రోజులు గడువు ఇచ్చింది. అదీ సాధ్యం కాకపోతే మరో 90 రోజుల పొడిగింపుతో టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని లేదంటే దేశంలో నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదేశించింది.మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గించిదీంతో బైట్ డాన్స్ పై ఒత్తిడి ఎక్కువయింది. ఈ క్రమంలో మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గిస్తూ టిక్ టాక్ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బైట్ డ్యాన్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ఇండియాలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ
ఇండియాలో టిక్‌టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్‌లోనే వీటిని పరిచయం చేసింది. భారత్‌లో రీల్స్‌కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి -
USA: అమెరికాలో ‘టిక్‌టాక్’ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో టిక్‌టాక్ షార్ట్ వీడియో యాప్‌పై చర్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో టిక్‌టాక్‌పై అమెరికా ప్రతినిధుల సభ పాస్ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్‌టాక్ లేకపోతే యువత నొచ్చుకుంటుందని అంతేగాక మెటాకు చెందిన ఫేస్బుక్ బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో నిజాయితీ లేదని, టిక్‌టాక్ నిషేదం వల్ల ఫేస్బుక్ లాభపడటం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్‌ను ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని, వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందన్నారు. టిక్‌టాక్‌లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్టులను ఫేస్‌బుక్‌తో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్లంతా ఫేస్‌బుక్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల తర్వాత ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో నష్టాలు చవిచూశాయి. అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు వి చాట్‌ను నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న వేళ ట్రంప్ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క యువతను ఆకట్టుకోవడంతో పాటు మరోపక్క తనకు ఇష్టంలేని ఫేస్బుక్ చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్‌టాక్‌ను వాడుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం(మార్చ్ 13)న టిక్‌టాక్‌పై దాదాపు నిషేధం విధించినంత పనిచేసే ఓ కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ టిక్‌టాక్‌ను అమ్మేయాల్సి అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్లు టిక్‌టాక్‌కు వెబ్ హోస్టింగ్ సేవలు నిలిపివేస్తాయి. ఈ బిల్లు గనుక ఏకగ్రీవంగా పాసైతే దీనిపై తాను సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క తాము అమెరికన్ల డేటాను చైనాకు గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదని, ఇక ముందు కూడా షేర్ చేయబోమని టిక్‌టాక్ యాప్ యాజమాని బైట్‌డ్యాన్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యాప్‌పై నిషేధం అమెరికా ప్రజల రాజ్యాంగ హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడింది. ఇదీ చదవండి.. భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. కారణమిదే -
ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్! ఒక్కో ఇన్‌స్టా పోస్టే లక్ష..!
ఇటీవల యువతరం సంపాదన ఇలా కూడా ఆర్జించొచ్చు అని చూపిస్తోంది. కొందరూ టిక్‌టాక్ స్టార్లుగా వచ్చి ఇన్స్టాగ్రాం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఓ రేంజ్లో ఫాలోవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సంపాదన కూడా కళ్లు చెరిరేలా ఐదెంకెల్లో ఆర్జిస్తుండటం విశేషం. అలాంటి కోవకు చెందిందే ఈ బ్యూటీఖాన్.. బ్యూటీ ఖాన్ అసలు పేరు మముదా ఖాతున్. సొంతూరు కోల్‌కతా. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే యమ లవ్వు. డ్రీమ్డ్ అబౌట్ డాన్సర్ కావాలని. టిక్ టాక్ (మన దగ్గర నడిచినప్పుడు) స్టార్ .. ఇన్‌స్టా సెలబ్రిటీ అయింది. ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, యాక్ట్రెస్ కూడా. షార్ట్ వీడియో కంటెంట్‌కి ఫేమస్. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్‌కి 12.4 మిలియన్స్‌కి పైనే ఫాలోవర్స్ ఉన్నారు. అకార్డింగ్ టు సమ్ వెబ్‌సైట్స్.. ఆమె ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కి 50 నుంచి 1 ల్యాక్ ’ చార్జ్ చేస్తుందట. ఆమె ఆమ్దనీ నెలకు అప్రాక్సిమేట్గా రెండు లక్షల వరకు ఉండొచ్చని ఆ వెబ్‌సైట్స్ అంచనా. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, మోడలింగ్, యాక్టింగ్ .. ఆమె మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. సోషల్ మీడియానా మజాకా! (చదవండి: వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!) -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే టిక్‌టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్‌టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
21 ఏళ్ల తర్వాత.. లాడెన్ లేఖ వైరల్
లండన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తీవ్రరూపం దాలి్చన వేళ.. ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మరోసారి జనం స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. 2001లో అమెరికాపై అనూహ్య రీతిలో ఉగ్రదాడులు జరిపి ప్రపంచ దేశాలకు షాకిచి్చన బిన్ లాడెన్.. ఆ తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి రాసిన రెండు పేజీల లేఖ టిక్–టాక్‌లో వైరల్‌గా మారడం గమనార్హం. ఒసామా లేఖకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. పాలస్తీనాను ఆక్రమించి అణచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కూడా 9/11 దాడులకు ఓ కారణమని అందులో లాడెన్ సమరి్థంచుకున్నాడు. ‘‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. అమెరికా అధ్యక్షులెవరూ పట్టించుకోలేదు. పాలస్తీనా ఎప్పటికీ ఆక్రమణలోనే ఉండిపోదు. సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయతి్నస్తాం. అమెరికా అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదు’అని లాడెన్ హెచ్చరించాడు. -
ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..
మనదేశంలో టిక్‌టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే యురోపియన్ యూనియన్‌లో మాత్రం సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. సెప్టెంబరులో యూరప్‌లో 40లక్షల వీడియోలను తొలగించినట్లు కంపెనీ అక్టోబరు 25న తెలిపింది. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌కు వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. యురోపియన్ యూనియన్‌లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సేవల చట్టం(డీఎస్ఏ) ప్రకారం..ప్రధాన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకత నివేదికను అందించాలి. అందులో భాగంగా టిక్‌టాక్ ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఆగస్టులో అమలులోకి వచ్చిన ఈచట్టం ద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజిన్లకు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపెనీలకు కలిపి దాదాపు వాటి ప్రపంచ టర్నోవర్‌లో ఆరు శాతం వరకు జరిమానా వేసినట్లు తెలుస్తుంది. టిక్‌టాక్‌తోపాటు మరో 18 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలు యూరప్‌లో వాటి నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నాయి. -
అడవుల్లో బతికేస్తున్న పాపులర్ టిక్‌టాకర్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్‌టాక్’లో షేర్ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్. ‘టిక్‌టాక్’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Überleben® (@uberleben.co) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) -
పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..
టొరంటో: టిక్ టాక్ ఛాలెంజ్ పేరుతో కెనడాకు చెందిన ఒకమ్మాయి రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంది. 12 రోజుల పాటు ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ లీటర్లు తగ్గటంతో చివరి రోజున ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించి డాక్టరును సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి శరీరంలో సోడియం స్థాయిలు బాగాతగ్గిపోయాయని తెలిపారు. మరి కొంచెముంటే ప్రాణాపాయమేనని తెలిపారు. అదోరకం వెర్రి.. సొషల్ మీడియాలో క్రేజ్ కోసం జనం ఎంతగా వెంపర్లాడుతూ ఉంటారంటే తొందరగా స్టార్లు అయిపోయి చేతికందినంత సంపాదించుకోవాలి. ఎక్కడికెళ్లినా కూడా జనం వారిని గుర్తించాలి. ఇదొక్కటే వారికున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా కెనడాలో వైరల్ గా మారిన ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకమ్మాయిని దాదాపుగా చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది. 75 హార్డ్ ఛాలెంజ్.. కెనాడకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే టిక్‌టాక్ స్టార్ ఆండీ ఫ్రైసెల్లా అనే ఓ యూట్యూబర్ 2019లో ప్రారంభించిన 75హార్డ్ అనే ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కనీసం 45 నిముషాల పాటు రోజుకు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇవన్నీ చేస్తునట్టుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. అయినా బుద్ధి మారలేదు.. పాపం ఫెయిర్‌బర్న్ ఈ ఛాలెంజ్ చివరి రోజు వరకు బాగానే చేసింది. 12వ రోజున మాత్రం కొంత అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే డాక్టరును సంప్రదించింది. డాక్టర్ రోజుకు కేవలం అరలీటరు నీళ్లు మాత్రమే తాగాలని సూచంచారట. ఈ విషయాన్ని స్వయంగా ఫెయిర్‌బర్న్ చెబుతూ.. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను. మొదటిసారి కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూత ఎక్కువగా మూత్రానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అరలీటరు నెల మాత్రమేతాగా మంటున్నారు కష్టమే కానీ ప్రయత్నిస్తానంది. ఇది కూడా చదవండి: ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు.. -
పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది
దుబాయ్: అమెరికా టిక్ టాకర్ ఎరక్కపోయి దుబాయ్ లో ఇరుక్కుపోయింది. తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. తర్వాత అనవసరంగా అద్దె కార్ షోరూం యజమానిపై నోరు జారి న్యూసెన్స్ చేసి జైలు పాలయ్యింది. అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్(29) యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు. టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు అద్దెకు కారు తీసుకున్నప్పుడు షోరూంలో ఇద్దరూ తమ గుర్తింపు కార్డులు అక్కడ వారికిచ్చారు. మరుసటి రోజున అమెరికా తిరిగి ప్రయాణమవ్వనున్న నేపథ్యంలో అలెన్ కారు షోరూంకి వెళ్లి తన ఐడెంటిటీ కార్డులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ కార్ షోరూం యజమాని కేసు తేలేంత వరకు అవి ఇవ్వడం కుదరదని చెప్పడంతో టిక్ టాకర్ రెచ్చిపోయింది. షోరూం యజమానిపై చిర్రుబుర్రులాడి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Tierra Young Allen, Truck Driver TikTok Star, Is Detained in #Dubai! She is accused of ‘Screaming’ at a rental car agent. Will she get the #BrittneyGriner treatment and get her home sooner than later? 🤔 pic.twitter.com/GOIca0H58J — WOKEVIDEO (@wokevideo) July 16, 2023 ఇది కూడా చదవండి: ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.. -
ఎంటెక్ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి..
అతను ఎంటెక్ చదివాడు. ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగమే వచ్చేది. కానీ అందరూ నడిచే దారిలో వెళ్లాలనుకోలేదు. తనకంటూ ప్రత్యేక ‘మార్గం’ ఉండాలని భావించాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. ఎంచుకున్న రంగం ఏదైనా పట్టుదల, చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ..అందులో తానే నటిస్తూ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగాడు. అతనే ప్రశాంత్ అలియాస్ ప్రసూబేబీ. సాక్షి, అనంతపురం డెస్క్ : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనలో సత్తా చాటుతూ.. అనతికాలంలోనే సోషల్ మీడియా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిలుగా కని్పంచే ప్రశాంత్ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. ‘ప్రసూబేబీ’ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రసూబేబీ ( (prashu_baby)) పేరిట ప్రశాంత్ ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌కు ఏకంగా 8.24 మిలియన్ల సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. సంస్థలను మినహాయిస్తే వ్యక్తిగత విభాగానికి సంబంధించి రాష్ట్రంలో హర్షసాయి తర్వాత అత్యధిక సబ్‌స్రై్కబర్లు ఉన్నది ఈ చానల్‌కే. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు వీడియోలను రెగ్యులర్‌గా రూపొందించి ఇందులో అప్లోడ్ చేస్తున్నా . వీడియో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ అకౌంటుకు కూడా 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు, కువైట్, అమెరికా,సౌదీ తదితర దేశాల ప్రజలు సైతం ప్రశాంత్ వీడియోలను వీక్షిస్తున్నారు. ధరణి, శిశిర, ప్రసూ కాంబినేషన్లో వచ్చిన వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంటెక్ చదివేందుకు అనంతపురం వచ్చిన ప్రశాంత్ ఇక్కడి నుంచే సీరియస్ ‘యాక్టింగ్’ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 30 మందికి పైగా తనతో కలసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లు ఏర్పాటు చేయించి..వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశాంత్ పాపులారిటీని గుర్తించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్ చేశాడు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి. పెద్దసంస్థలతో కలసి ఇతర భాషల్లో సోషల్ మీడియా వేదికగా వినోదాత్మక వీడియోలు రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఎంటెక్ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి.. ప్రశాంత్ సొంతూరు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా..ప్రశాంత్ చిన్నోడు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. జేఎన్టీయూ (అనంతపురం)లో ఎంటెక్ చేశాడు. ఇంజినీరింగ్ చదువుతుండగానే నటనపై ఆసక్తితో చిన్నచిన్న వీడియోలు సొంతంగా రూపొందించి ‘టిక్‌టాక్’లో పెట్టేవాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబం ఇతివృత్తంగా వీడియోలు రూపొందించేవాడు. అవి బాగా ట్రెండింగ్కావడంతో లక్షల్లో సబ్‌స్రై్కబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్‌పై మళ్లించాడు. ఇష్టపడి పనిచేయడం వల్లే ఈ స్థాయికి.. ఏ పనైనా ఇష్టపడి చేయాలని నేను భావిస్తా. నేను ఇలా వీడియోలు చేయడాన్ని మొదట్లో స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తప్పుబట్టారు. కానీ సక్సెస్ సాధించి వారితోనే అభినందనలు అందుకున్నా. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నా. – ప్రశాంత్