లండన్: ప్రభుత్వ ఫోన్లలో టిక్‌టాక్ యాప్ వినియోగంపై బ్రిటన్ నిషేధం విధించింది. చైనా మూలాలున్న ఈ సామాజిక మాధ్యమ యాప్‌ను భద్రతాపరమైన కారణాలతో నిషేధిస్తున్నట్లు తెలిపింది. యూకే మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం పార్లమెంట్‌లో ఈ విషయం ప్రకటించారు.
ప్రభుత్వ డేటా, సమాచారాన్ని టిక్‌టాక్ వాడుకోవడం ప్రమాదకరమని ఆయన అన్నారు. టిక్‌టాక్‌పై ఇప్పటికే భారత్, అమెరికా, కెనడా, ఈయూ దేశాలు పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. యాప్ వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకున్నట్లు వస్తున్న ఆరోపణలను టిక్‌టాక్ ఖండిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment