UK minister
-
రిషి సునాక్‌పై సుయెల్లా బ్రేవర్మన్ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం
మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత, భారత్ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ స్పందించారు. ప్రధాని సునాక్‌కు ఎవరూ మద్దతుగా లేని సమయంలో తాను ఎంతో అండగా నిలిచానని, వాగ్దానాలన్నింటినీ పక్కన బెట్టి, పాలనలో విఫలమై, ఇపుడు తనపై వేటు వేశారంటూ ఘాటు విమర్శలతో ఒక లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం నుండి వైదొలగమని కోరినందుకు ధన్యవాదాలు. ఇది బాధ కలిగించింది కానీ, బ్రిటీష్ ప్రజలు కోరికమేరకు హోం సెక్రటరీగా పని చేయడం తన అదృష్టమనీ, ఈ సందర్బంగా పౌరసేవకులు, పోలీసులు, బోర్డర్ ఫోర్స్ అధికారులు , భద్రతా నిపుణులందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. కొన్ని షరతులపై 2022లో అక్టోబ్లో హోం సెక్రటరీగా సేవ చేయడానికి ఆఫర్‌ని అంగీకరించాను అంటూ తన లేఖను మొదలు పెట్టారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?) రిషి సునాక్ ప్రధాని కావడానికి తాను ఎంతో తోడ్పాడ్డానని ఆమె పేర్కొన్నారు. కీలకమైన పాలసీలపై తనకిచ్చిన దృఢమైన హామీల మేరకు ఆయనకు మద్దతిచ్చాననీ, అయితే ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి, కీలకమైన విధానాల అమల్లో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే దేశానికి మేలు చేస్తానని బ్రిటన్ ప్రజలకిచ్చిన హామీలను రిషి విస్మరించాంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాదు ప్రధానిగా కొన సాగేందుకు రిషి సునాక్ అనర్హుడంటూ మండిపడ్డారు. అక్రమ వలసలను తగ్గించడం, ఇంగ్లీషు ఛానల్నుదాటకుండా వలస పడవలను ఆపడం, బయోలాజికల్ సెక్స్‌ను రక్షించేలా పాఠశాలలకు చట్టబద్ధమైన మార్గదర్శకత్వం జారీ చేయడం, ఉత్తర ఐర్లాండ్ ప్రోటోకాల్‌పై లాంటి వాగ్దానాల్ని ఆమె ప్రస్తావించారు. ఇది తమ పరస్పర ఒప్పందానికి ద్రోహం మాత్రమే కాదు, దేశానికి చేసి ద్రోహం కూడా అంటూ మూడు పేజీల లేఖలో బ్రేవర్మన్ ధ్వజమెత్తారు. ఎవరైనా నిజాయితీగా ఉండాలి అసలు మీ ప్లాన్లేవీ పని చేయడం లేదు, రికార్డు స్థాయిలో ఎన్నికల పరాజయాల్ని చూశాం. సమయం మించి పోతోందంటూ ఆమె ఒక రేంజ్లో ప్రధానిపై విరుచుకుపడ్డారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?) ఇది ఇలా ఉంటే రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రిషి క్యాబినెట్‌లోని సీనియర్, సుయెల్లా బ్రేవర్మన్ను హోంమంత్రిగా తొలగించడాన్ని వారు తప్పు పడుతున్నారు. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ లండన్ వీధుల్లో పాలస్తీనా మద్దతుదారులు మార్చ్, పోలీసుల తీరుపై గత వారం చేసిన వ్యాఖ్యల తర్వాత సుయెల్లాను తొలగించిన విషయం తెలిసిందే. -
టిక్‌టాక్‌పై యూకే నిషేధం
లండన్: ప్రభుత్వ ఫోన్లలో టిక్‌టాక్ యాప్ వినియోగంపై బ్రిటన్ నిషేధం విధించింది. చైనా మూలాలున్న ఈ సామాజిక మాధ్యమ యాప్‌ను భద్రతాపరమైన కారణాలతో నిషేధిస్తున్నట్లు తెలిపింది. యూకే మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం పార్లమెంట్లో ఈ విషయం ప్రకటించారు. ప్రభుత్వ డేటా, సమాచారాన్ని టిక్‌టాక్ వాడుకోవడం ప్రమాదకరమని ఆయన అన్నారు. టిక్‌టాక్‌పై ఇప్పటికే భారత్, అమెరికా, కెనడా, ఈయూ దేశాలు పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. యాప్ వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకున్నట్లు వస్తున్న ఆరోపణలను టిక్‌టాక్ ఖండిస్తోంది. -
ముచ్చటగా మూడోసారి మంత్రి పదవికి రాజీనామా
లండన్: బ్రిటన్‌లో ప్రధాని రిషి సునాక్ కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. తాజా కన్జర్వేటివ్ పార్టీ మాజీ చీఫ్ విప్ విండీ మోర్టాన్ను ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి. మాజీ మహిళా ప్రధాని లిజ్ ట్రస్‌కు సాయపడలేదని, బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తనను ఆహ్వానించలేదని తిడుతూ విండీకి విలియమ్సన్ చేసిన మెసేజ్‌లు ఇటీవల మీడియాలో బహిర్గతమవడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తగా.. ప్రధాని అండ కారణంగానే ఆయన్ని తప్పించడం లేదంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ తరుణంలో.. మంగళవారం విలియమ్సన్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. విలియమ్సన్‌ను గతంలోనూ రెండుసార్లు పదవి నుంచి తప్పించారు. మూడేళ్లక్రితం రక్షణమంత్రిగా ఉన్న కాలంలో నేషనల్ సెక్యూరిటీ అంశంతో పాటు ఉద్యోగులను నాలుక చీలుస్తానని, కోపంతో కిటికీ నుంచి బయటకు విసిరేస్తానని అరిచేవారని వార్తలొచ్చాయి. ఆపై గతేడాది విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనపై విమర్శలు వచ్చాయి. కరోనా పరిస్థితులను హ్యాండిల్ చేయకపోవడం, స్కూళ్ల నిర్వహణ అంశాల ఆధారంగా వివాదంలో చిక్కుకుని పదవి నుంచి దిగిపోయారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తోటి సభ్యులపై దురుసుతనం ప్రదర్శించి పదవి నుంచి దిగిపోయారు. ఇదిలా ఉంటే తన రాజీనామా లేఖలో ఆరోపణల కారణంగా తప్పుకుంటున్నట్లు విలియమ్సన్ పేర్కొనగా.. రిషి సునాక్ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు వివాదాల్లో చిక్కుకున్న వాళ్లను కేబినెట్లోకి తీసుకోవడం ప్రతిపక్ష లేబర్ పార్టీ, ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు గుప్పిస్తోంది. రిషి సునాక్ నిర్ణయంపై పోస్ట్‌మార్టం జరుగుతోంది అక్కడ. వివాదాలకు కేరాఫ్ అయిన వాళ్లకు కేబినెట్ పదవులు.. కట్టబెట్టడాన్ని ప్రతిపక్షం ఆయుధంగా చేసుకుంటోంది. ఇప్పటికే బ్రేవర్మన్ విషయంలో సునాక్‌పై విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు రిషి సునాక్ తీరుపై సొంతపార్టీలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. -
సెల్ఫ్ ఐసోలేషన్‌లో లేను: మూర్తి అల్లుడు
లండన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ధాటికి బ్రిటీషు పాలకులు విలవిల్లాడుతున్నారు. కోవిడ్-19 ఎప్పుడు ఎవరిని సోకుతుందోనని భయాందోళన చెందుతున్నారు. యువరాజు చార్లెస్‌తో పాటు ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్ ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ప్రపంచ నాయకుల్లో కరోనా సోకిన మొదటి నేతగా బోరిస్ జాన్సన్ నిలిచారు. బోరిస్ జాన్సన్ కేబినెట్లోని మంత్రులకు కరోనా వ్యాపించే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొద్దిరోజులుగా తన మంత్రివర్గ సహచరులతో కలిసి వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారికి కరోనా ముప్పు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బందిని అభినందిస్తూ గురువారం రాత్రి చప్పట్లు కొడుతున్న రిషి, జాన్సన్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త రిషి సునక్ కూడా బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి లక్షణాలేవి ఆయనలో కనబడలేదని బీబీసీ రిపోర్ట్ చేసింది. తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని, ‘రెండు మీటర్ల సామాజిక దూరం’ నియమాన్ని పాటిస్తున్నట్టు రిషి సునక్ వెల్లడించారు. నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బందిని అభినందిస్తూ గురువారం రాత్రి ప్రధాని జాన్సన్‌తో కలిసి ఆయన చప్పట్లు కొట్టారు. అయితే అప్పుడు ప్రధానికి ఆయన రెండు మీటర్ల దూరంలో నిలుచున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంలో రిషి సునక్ కీలక భూమిక పోషిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు, అనేక వర్గాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహయం ప్రకటించడంలోనూ ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. క్వీన్‌ను ప్రధాని కలవలేదు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాణి ఎలిజిబెత్‌ను గత కొన్ని వారాలుగా ప్రధాని బోరిస్ జాన్సన్ కలవలేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారి ప్రతినిధి ధ్రువీకరించారు. మార్చి 11న చివరిసారిగా భేటీ జరిగిందని వెల్లడించారు. కోవిడ్ భయంతో తర్వాత నుంచి ఫోన్లోనే రాణితో ప్రధాని సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. సాధారణంగా ప్రతివారం క్వీన్ ఎలిజిబెత్‌ను ప్రధాని కలిసేవారు. కాగా, తన అధికారిక నివాసం నుంచే సాంకేతికత సాయంతో పరిపాలనను పర్యవేక్షిస్తానని స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్ శుక్రవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఒకవేళ ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించకుంటే విదేశాంగ మంత్రి డొమినిక్ రామ్ తాత్కాలికంగా ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. (బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు) ఒక్కరోజే 2,885 కరోనా పాజిటివ్ కేసులు తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు బ్రిటన్‌లో 14,543 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 163 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 2,885 కేసులు వెలుగులోకి వచ్చాయి. 759 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వారిలో 135 మంది కోలుకున్నారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం) -
‘నా భార్య జపనీస్.. కాదు, కాదు చైనీస్’
బీజింగ్ : బ్రిటన్ నూతన విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ తాజాగా చైనాలో చేపట్టిన తన తొలి పర్యటనలోనే తడబడ్డారు. తన భార్య చైనీయురాలిని గుర్తుచేసి.. చైనీయుల మనసు గెలుచుకుందామని ఆయన అనుకున్నారు. కానీ, ఆ విషయాన్ని చెప్పడంలో తడబడ్డారు. తన భార్య జపనీస్ అంటూ చెప్పేశారు. వెంటనే నాలుక కర్చుకున్న ఆయన.. కాదు.. కాదు చైనీస్ అంటూ సర్దిచెప్పారు. చైనా-జపాన్ దేశాలు శతాబ్దాలుగా సంప్రదాయ ప్రత్యర్థులు కావడంతో ఆయన చేసిన పొరపాటుతో ఒకింత ఇబ్బందిపడాల్సి వచ్చింది. చైనా-జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడినప్పటికీ 1930-40లో చైనా భూభాగాలను జపాన్ ఆక్రమించిన విషయం తెలిసిందే. పొరపాటున వెంటనే గుర్తించిన హంగ్ తేరుకుని వివరణ కూడా ఇచ్చాడు. ‘నా భార్య చైనీస్, మా పిల్లలకు చైనా మూలాలున్నాయి. చైనాలోని జియాన్ ప్రావిన్స్‌లో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు’ అని అన్నారని చెప్తూ.. చైనీయులు మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. బ్రిటన్ మంత్రి అయిన హంట్.. చైనీ మూలాలున్న లూసియా గుయోను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత ఏడాది బ్రెగ్జిట్ ద్వారా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ నిష్కమించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈయూతో బ్రిటన్ పూర్తిగా వాణిజ్య సంబంధాలను తెంచుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ నూతన విదేశాంగ మంత్రిగా నియమితులైన హంట్ చైనాతో దౌత్యపరమైన, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సోమవారం బీజింగ్‌లో పర్యటించారు. వర్తకం, అభివృద్ధి, భద్రత వంటి అంశాల్లో బ్రిటన్-చైనా కలిసి పనిచేస్తాయని హంగ్ తెలిపారు. -
మనకంటే ముందే అమెరికాకు ఎలా?
మాంచెస్టర్ బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం లండన్ పోలీసులు మీడియాకు చెప్పడానికి ముందే అమెరికా మీడియాలో ఆ విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. వాళ్లకు ఈ సమాచారం లీక్ కావడం బ్రిటిష్ హోం మంత్రికి బాగా చికాకు తెప్పించింది. పేలుడుకు సంబంధించి బయటకు వెళ్లే సమాచారం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించి, తమ దర్యాప్తునకు విఘాగం కలగకుండా చూసుకోవడంలో బ్రిటిష్ పోలీసులకు అన్ని రకాలుగా స్పష్టమైన సూచనలు ఇచ్చామని, కానీ అదేమీ లేకుండా అమెరికన్ మీడియా మాత్రం ఇష్టారాజ్యంగా ఏవి పడితే అవి ప్రచురించిందని హోం మంత్రి అంబర్ రడ్ బీబీసీ రేడియోతో చెప్పారు. ఇది చాలా ఇరిటేటింగ్‌గా ఉందని, అధికార వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నుంచి సమాచారం లీక్ అవ్వడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని తన మిత్రులకు (అధికారులకు) మళ్లీ మళ్లీ చెబుతున్నానని ఆమె అన్నారు. దర్యాప్తు సక్రమంగా సాగకుండా అమెరికన్ అధికారులు ఏమైనా అడ్డుపడుతున్నారా అని ప్రశ్నించగా, తాను అంత దూరం వెళ్లబోనన్నారు. ఇక్కడి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని, ఇలాంటిది ఇంకోసారి జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అమెరికన్ పాప్ స్టార్ అరియానా గ్రేండ్ కచేరీ సాగుతుండగా సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే. సల్మాన్ అబేది అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతడి పేరు ముందుగా అమెరికన్ మీడియాలోనే వచ్చింది. అందుకే అక్కడి హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేను లెస్బియన్: మహిళా మంత్రి
లండన్: బ్రిటన్ సీనియర్ మంత్రి జస్టిన్ గ్రీనింగ్స్ సంచలన ప్రకటన చేశారు. తాను స్వలింగ సంపర్కురాలినని వెల్లడించారు. కన్జర్వేటివ్ కేబినెట్ లో బహిరంగంగా 'లెస్బియన్' ప్రకటన చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. బ్రిటన్ ఐరోపా సమాఖ్యలోనే కొనసాగాలని ప్రచారం చేసిన ఆమె ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. లండన్ తో పాటు బ్రిటన్ వ్యాప్తంగా జరిగిన స్వలింగపర్కుల ర్యాలీలకు మద్దతు పలికారు. 'ఈరోజు ఎంతో మంచిరోజు. నేను స్వలింగ సంపర్కురాలినని చెప్పడానికి సంతోషిస్తున్నా. సంపర్కుల తరపున ప్రచారం చేస్తా. వారికి నా మద్దతు ఉంటుంద'ని పేర్కొన్నారు. జస్టిన్ గ్రీనింగ్స్ చేసిన ప్రకటనను ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్, యూకే ఛాన్సలర్ జార్జి అసబోర్నె తదితరులు అభినందనలు తెలిపారు. తాము స్వలింగ సంపర్కులమని బహిరంగంగా ప్రకటించిన హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో 47 ఏళ్ల గ్రీనింగ్స్ 33వ వారు కావడం విశేషం. ప్రప్రంచ దేశాల్లో ఏ చట్టసభల్లోనూ ఇంతమంది 'గే'ల మని ప్రకటించుకోలేదు. -
గే వివాహం చేసుకోబోతున్న మంత్రి
లండన్: బ్రిటన్ పాఠశాల విద్యా శాఖ మంత్రి నిక్ గిబ్ గే వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. గిబ్.. పాపులస్ పోలింగ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ సిమండ్స్‌ను పెళ్లాడనున్నట్టు చెప్పారు. 29 ఏళ్లుగా వీరిద్దరూ రహస్యంగా సహజీవనం చేస్తున్నారు. తామిద్దరం అందమైన జీవితాన్ని ఆస్వాదించామని గిబ్ చెప్పారు. సిమండ్స్, తాను ప్రేమలో పడ్డామని, ఇద్దరూ కలసిమెలసి జీవించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసి తన తల్లి తొలుత షాకయ్యారని, తర్వాత అర్థం చేసుకుని ఆశీర్వదించారని చెప్పారు. తమ పెళ్లికి 79 ఏళ్ల తల్లిని, మరికొంతమంది బందువులను ఆహ్వానించినట్టు గిబ్ తెలిపారు.