సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్‌ని ప్రపంచానికి చూపిస్తున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లు పెట్టి టాలెంట్‌ని ఉన్నవారిని ఎంకరేజ్ చేయడంతో పాటు సెలబ్రిటీని చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా టిక్‌టాక్ యాప్ ద్వారా చాలా మంది తమలో దాగిఉన్న నటనను, డాన్స్‌ను ప్రపంచానికి తెలియజేశారు. భారత్‌లో ఈ యాప్ బ్యాన్ కావడంతో యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్ వైపుకు మళ్లీ.. తమ ప్రతిభతో అభిమానుల మన్ననలు పొందుతున్నారు. అయితే టాలెంట్‌ని ఎంకరేజ్ చేసే ఈ అభిమానులే.. తేడా వస్తే ట్రోల్స్‌తో విరుచుకుపడతారు. ఈ విషయం సినీప్రముఖులకు బాగా తెలుసు. అందుకే కొంచెం పేరున్న సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉంటారు.
తాజాగా ఓ టిక్‌టాక్ స్టార్‌కు కూడా ఇదే ఎదురైంది. తన డాన్స్‌తో లక్షలాధి అభిమానులను సంపాదించుకున్న దీపికా పిల్లి అనే టిక్‌టాక్ స్టార్.. అదే డాన్స్ వల్ల తాజాగా ట్రోలింగ్‌కి గురైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ సినిమా నుంచి సారంగదారియా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. చాలామంది ఈ పాటకు తమదైన స్లైల్లో స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీపికా పిల్లి కూడా ఇలా డ్యాన్స్ చేసి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఆ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసినప్పటికీ.. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దానికి కారణం ఆమె డాన్స్ చేసింది గుడిలో.ఇలాంటి పాటకు గుడిలో డ్యాన్స్ చేయడం ఏంటని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే చాలామంది నెటిజన్లు మాత్రం దీపికా డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. సాయిపల్లవి కంటే అద్భుతంగా చేసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ డ్యాన్సింగ్ అంటు కామెంట్లు పెడుతున్నారు.దీపికా ప్రస్తుతం ఓ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment