Love story movie
-
వాలెంటైన్ డే స్పెషల్.. ఈ ప్రేమకథ చిత్రాలు మీ కోసమే!
ప్రతి మనిషికి ప్రాణం ఉన్నట్లే .... ప్రతి మనసుకు ఓ ప్రేమకథ ఉంటుంది. ఒకరి ప్రేమ సఫలం... మరొకరిది విఫలం... ఇంకొకరిది త్యాగం... ఇలా ఒక్కో ప్రేమకథది ఒక్కో ముగింపు. మరి.. రానున్న ప్రేమకథా చిత్రాల్లో ఏ కథ ముగింపు ఎలా ఉంటుందో వెండితెర పైనే చూడాలి. ‘పడ్డారండి ప్రేమలో మరి..’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం కొందరు హీరోలు–హీరోయిన్లు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. సైనికుడి ప్రేమకథ... ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘సలార్’... ఇలా యాక్షన్ చిత్రాలే కాదు.. ప్రభాస్ కెరీర్లో ‘వర్షం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2022లో ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్ ప్రేమకథను ఇచ్చిన హను రాఘవపూడి మరో ప్రేమకథను రెడీ చేశారు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారని టాక్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తారనీ టాక్. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఫ్యాంటసీ హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ మంచి లవ్‌ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉందట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లు. మరో లవ్‌స్టోరీ... ‘లవ్‌స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరో ప్రేమకథా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్’ వంటి లవబుల్ సినిమా తీసిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలకు చెందిన మత్స్యకారులు 2018లో గుజరాత్‌కు వలస వెళ్లి, సముద్రంలో చేపల వేటను కొనసాగిస్తుంటారు. ఓ 24 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. వీరిలో ఓ మత్స్యకారుడి వివాహం జరిగి ఏడాది మాత్రమే అవుతుంది. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆ మత్స్యకారుడు పాకిస్తాన్లో బందీ కాబడతాడు. ఈ వ్యక్తి జీవితం ఆధారంగా ‘తండేల్’ను ప్రేమకథప్రాధాన్యంగా తీస్తున్నారు మేకర్స్. ప్రేమికులే శత్రువులయితే... విడిపోయిన ప్రేమికులు శత్రువులుగా ఎదురుపడితే అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న లవ్‌స్టోరీ మూవీ ‘డెకాయిట్’. ‘ఒక ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. అడివి శేష్, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో కెమెరామేన్ షానీ డియోల్ దర్శకుడిగా మారారు. రెండు ప్రేమకథల్లో... గత ఏడాది ‘బేబీ’ అనే లవ్‌స్టోరీ మూవీతో హిట్ అందుకున్నారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య (విరాజ్ మరో లీడ్ రోల్ చేశారు). ఈ ‘బేబీ’ జోడీ రిపీట్ అవుతోంది. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాకు కథ అందించగా, రవి నంబూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే మరో లవ్‌స్టోరీ ‘డ్యూయెట్’ కూడా చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో రితికా సింగ్ కథానాయిక. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం వహిసున్నారు. ఇలా ఒకేసారి రెండు ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్నారు ఆనంద్ దేవరకొండ. డబుల్ లవ్... డీజే టిల్లు ఓ డిఫరెంట్ లవర్. పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో తేడా వస్తే ప్రేయసినైనా జైలుకు పంపిస్తాడు. అలాంటి డీజే టిల్లు మళ్లీ లవ్‌లో మునిగాడు. మరి.. ఈసారి అతని లవ్‌స్టోరీ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలంటే మార్చి 29వరకు ఆగాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు ‘తెలుసు కదా’ అనే లవ్‌స్టోరీ కూడా చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. లైలా లవ్వు... ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి.. దేవుడా!’, ‘పాగల్’ వంటి లవ్‌స్టోరీ చిత్రాల్లో నటించారు విశ్వక్ సేన్. ఈ యంగ్ హీరో రీసెంట్గా మరో లవ్‌స్టోరీకి పచ్చజెండా ఊపారు. ఆ సినిమా పేరు ‘లైల’. ఈ సినిమాలో తానే టైటిల్ రోల్ చేస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తానని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు విశ్వక్. దిల్ రుబా... కెరీర్లో తొలి సినిమానే ‘రాజావారు రాణిగారు’ వంటి లవ్‌స్టోరీ చేశారు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాల్లో మంచి లవ్‌ట్రాక్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓ కంప్లీట్ లవ్‌స్టోరీ సినిమా చేస్తున్నారు. విశ్వ కరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ అని తెలిసింది. ఈ సినిమాకు ‘దిల్ రుబా’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా లవ్‌స్టోరీస్ ఎక్కువగా అబ్బాయిల దృష్టి కోణంలో నుంచి వస్తుంటాయి. ఓ అమ్మాయి తన ప్రేమకథను చెబితే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా వస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. ‘చి.ల.సౌ’ వంటి సినిమా తీసిన నటుడు– దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కొత్త లవ్‌స్టోరీకి దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ∙అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వంలో అర్షద్ తన్వీర్, ప్రకాశ్ ధర్మపురి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ‘నువ్వంటే ఇష్టం’ అనే పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. యస్. కె భాజీ ఈ సినిమాకు స్వరకర్త. ఇంద్ర , కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ, ఇమ్రాన్, షీతల్ భట్ లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘నా కల..’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ విడుదల చేశారు. లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్ర ఎస్. చంద్ర, డా. విజయ రమేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ ప్రేమికల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా ఇప్పటికే విడుదలైన కొన్ని ప్రేమకథా చిత్రాలు మళ్లీ రిలీజ్ కానున్నాయి. ఆ వివరాలు... ►సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ‘ఓయ్!’ (2009), దుల్కర్ సల్మాన్– మృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ (2022), గత ఏడాది విడుదలైన ‘బేబీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సూర్య ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ (2008) తెలుగు అనువాదం సైతం రీ రిలీజ్ అవుతోంది. ఇలా మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
అందమైన ప్రేమకథతో రానున్న ప్రభాస్..!
-
పెద్ద హీరోలను మినహాయించి నన్నే ఎందుకు..? చైతూ
-
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి(సెప్టెంబర్ 24) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ నాగచైతన్య ఓ ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి స్పెషల్ చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్‌కి, బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం నాకెన్నో విషయాలను నేర్పించింది. ‘లవ్‌స్టోరీ’ సినిమా జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’అని చైతన్య ట్వీట్ చేశాడు. (చదవండి: సలార్’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కి ప్రభాస్ హాజరు) కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి 2021లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. Thank you so much to the entire team and audience for making this one special ! A film that taught me in so many ways .. memories I will always cherish https://t.co/gGWbzmZbT0 — chaitanya akkineni (@chay_akkineni) September 24, 2022 -
ఈ ఏడాది మారుమోగిన టాప్ 5 సాంగ్స్ ఇవే
2021 చార్ట్ బస్టర్స్ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినిమాల సంఖ్య తగ్గినా ప్రతి చిత్రంలోనూ ఒక పాట యూట్యూబ్ రికార్డ్స్ ను టార్గెట్ చేసింది. ఏడాది అంతా రిపీట్ మోడ్ లో పెట్టుకుని విన్నారు ఆడియెన్స్. ఆ సాంగ్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి ‘సారంగ దరియా’ యూట్యూబ్ లో సాయి పల్లవి సాంగ్స్ అంటే రికార్డ్స్ కు కేరాఫ్ అడ్రస్ అనే మాట స్థిరపడిపోయింది. ఈ ఏడాది సారంగ దరియాతో అలాంటి సెన్సేషన్ సృష్టించింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్టర్ చేసిన లవ్ స్టోరీలోని ఈ సాంగ్ యూట్యూబ్ లో 4.5 కోట్లకు పైగా వ్యూస్ అందుకుంది. అదరగొట్టిన ‘బుల్లెట్ బండి’ సినిమా సాంగ్స్ కు తెలంగాణ ఫోక్ సాంగ్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. వ్యూస్ విషయంలో స్టార్ హీరోస్ సాంగ్స్ ను మించిపోతున్నాయి. బుల్లెట్ బండి అలాంటి రేర్ రికార్డ్ నెలకొల్పింది. మ్యారేజ్ ఈవెంట్ లో తప్పక వినిపించే పాటగా మారింది. మోహనా భోగరాజు సింగింగ్ సెన్సేషన్ గా మారింది. లవర్స్ ఫేవరేట్ సాంగ్‌గా ‘ఒకే ఒక లోకం నువ్వే’ శ్రీనివాస నాయుడు డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా శశి. మార్చిలో థియేటర్స్ లో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపకపోయినా యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఏకంగా 150 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిడ్ శ్రీరామ్ పాడాడు. మనసు దోచిన ‘శ్రీవల్లీ’ పుష్ప తెలుగు వర్షన్ సాంగ్స్ లో శ్రీవల్లీ ఎక్కువగా వ్యూస్ అందుకుంది. ఈ పాట 100 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుని మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అలాగే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా’కూడా యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ‘లాహే లాహే’ చిరు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య. ఈ మూవీ నుంచి ఇప్పటికీ రెండు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వాటిల్లో లాహే లాహే రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంది. 2021లో యూట్యూబ్ ను షేక్ చేసింది.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించాడు. హారిక నారాయన్, సాహితీ చాగంటి కలసి పాడారు. యూట్యూబ్ లెక్కల ప్రకారం ఈ సాంగ్ వ్యూస్ 100 మిలియన్ దాటాయి. -
మహేశ్ బాబును లాభాల బాట పట్టించిన ‘లవ్‌స్టోరీ’
సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్‌స్టోరీ’ మూవీ రికార్డ్ స్టాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలై దాదాపు నెల రోజులు అవుతున్నా ఈ మూవీ ఇప్పటికె థియేటర్లో ఆడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24 విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. కరోనా కాలంలో కూడా ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించిన చిత్రం లవ్‌స్టోరీ రికార్డు సృష్టించింది. ఇక తొలి రోజు అయితే ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. దీంతో అందరూ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికే థియేటర్లో ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో లవ్‌స్టోరీ దర్శక-నిర్మాతలకే కాదు థియేటర్ల యాజమాన్యాలకు సైతం లాభాలు తెచ్చిపెడుతోంది. త్వరలో ఈ మూవీ ఆహాలో విడుదలవుతున్నప్పటికీ ఈ మూవీని థియేటర్లో చూసేందుకు ఇప్పటికీ కూడా పలువురు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారట. చదవండి: నాగబాబుపై తీవ్ర విమర్శ వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు ఈ క్రమంలో ‘లవ్‌స్టోరీ’ ఓ థియేటర్‌కు అయితే ఏకంగా కోటీ రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకి ఆ థియేటర్ ఎదో తెలుసా? అదే మన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ(AMB) సినిమాస్ మల్టీప్లెక్స్. సెకండ్ వేవ్ తర్వాత ఈ మల్టీప్రెక్స్లో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా లవ్‌స్టోరీ నిలిచిందట. ఇప్పటివరకు ఏఎమ్‌బీ థియేటర్లో 251 షోలు నిర్వహించగా.. 48,233 మంది వీక్షించారట. ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో కోటి రూపాయల వసూళ్లు సాధించిన చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే కలెక్షన్లను సాయి పల్లవి-నాగ చైతన్యల ‘లవ్‌స్టోరీ’ చిత్రం రాబట్టడం విశేషం. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! -
మలయాళంలోకి 'లవ్ స్టోరీ'.. టైటిల్ ఏంటో తెలుసా?
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంట శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లకు పెద్ద సంఖ్యలో జనాలను రప్పించిన సినిమా ఇది. సెప్టెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఎంతోమంది మనసులను దోచుకుంది. కథా కథనాలే కాకుండా పాటలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంత మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే మలయాళీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ ‘ప్రేమ తీరం’ని ఈ నెల 29వ తేదీన అక్కడ విడుదల చేయనున్నారు. కాగా కేరళలోనూ ‘ప్రేమమ్’ సినిమాతో సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అక్కడ సైతం ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి: ‘లవ్‌స్టోరి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ట్రైలర్ అదిరిందిగా.. -
ఈవారం ఓటీటీ, థియేటర్లలో అలరించబోయే చిత్రాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కి, ఇంకొన్ని ఇటీవలే థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్ వేయండి. ‘అసలేం జరిగింది’ యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అసలేం జరిగింది’. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమని, 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది. ‘నాట్యం’ ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 22న థియేటర్లో విడుదల కానుంది. భరతనాట్యం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మేనన్‌లు తదితరులు నటించారు. మధుర వైన్స్.. కొత్త నటీనటులు సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మధురవైన్స్’. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయకిషోర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 22న ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడిగా సన్నీ నవీన్, అసలు మద్యం అన్న, అది తాగే వాళ్లన్నా అసహ్య పడే ఓ యువతిగా సీమా చౌదరి నటించారు. అలాంటి వీళ్లద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది.. మద్యం కారణంగా వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్రం కథ. నాగచైతన్య-సాయి పల్లవిల ‘లవ్‌స్టోరీ’ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయి పల్లవి తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య నటన సాయిపల్లవి డ్యాన్స్ ప్రేక్షకుల తెగ ఆకట్టుకుంది. ఇక హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి వారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబరు 22న సాయంత్రం 6గంటల నుంచి ‘లవ్‌స్టోరీ’ అందుబాటులో ఉంటుందని ‘ఆహా’ ఇటీవల వెల్లడించింది. ‘హెడ్స్ అండ్ టేల్స్’ సునీల్, సుహాస్ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిచిన చిత్రం ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేదే ఈ చిత్రం కాథాంశం. -
ఓటీటీలో ‘లవ్‌స్టోరి’.. విడుదల ఎప్పుడంటే
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌స్టోరి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో(సెప్టెంబర్ 24) విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ సరికొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. -
90 రోజులు 20 కొత్త సినిమాలు, ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు
ఒరిజినల్ తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ఉండే ఆహా ఇప్పుడు దసరాను టార్గెట్ చేసి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఆహా వీడియో దసరా పండగ సందర్భంగా ఇప్పుడు నాన్ స్టాప్ వినోదాల పండుగకి సిద్దం అయ్యింది. మొత్తం 12 వారాలు, 90 రోజులు, 20 కొత్త సినిమాలు.. షోలతో.. ఆహా ప్రేక్షకులను చూపు తిప్పుకోనికుండా చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంది. చదవండి: కుటుంబంతో మాల్దీవుల్లో వాలిపోయిన అల్లు అర్జున్, వీడియో వైరల్ దసరా నుండి సంక్రాంతి పండుగ వరకూ అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండుగ మీ ఆహాలో సిద్దం అంటూ ముందుకొస్తోంది. మొత్తం 90 రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త సినిమాలు, కొత్త షోలు, వెబ్ సీరిస్‌ల ఫుల్ షెడ్యుల్‌తో ఆహా రెడీ అవుతోంది. ఇంకా విడుదల కానీ సినిమాలతో పాటు ఈ మూడు నెలల్లో వచ్చే కొత్త సినిమాలు కూడా ఈ షెడ్యూల్లో ఉండటం విశేషం. ముఖ్యంగా ఇందులో అఖిల్ అక్కినేని-పూజ హెగ్డేల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీ, నాగ శౌర్య లక్ష్య, రాజ్ తరుణ్ అనుభవించు రాజా, వరుణ్ తేజ్ గని చిత్రాలతో పాటు ఇంకేన్నో తాజా తాజా సీరిస్‌లు, షోలు కూడా ఉన్నాయి. దీంతో బుల్లితెర ప్రేక్షకులు సినిమా జాతర కోసం సిద్దమవుతున్నారు. చదవండి: దసరా పండగకు థియేటర్లో, ఓటీటీలో సందడి చెయబోతున్న చిత్రాలు 12 వారాలు... 90 రోజులు... 20 కొత్త సినిమాలు, షోలు! 🎥 ఈ దసరా నుండి సంక్రాంతి వరకు అదిరిపోయే నాన్ స్టాప్ 100% తెలుగు వినోదాల పండగ, మీ అహలో!🧡 సిద్ధమా!!!https://t.co/whilkXuvEA#CelebrateWithAHA🥳 pic.twitter.com/TTbmVrS3OG — ahavideoIN (@ahavideoIN) October 10, 2021 -
ChaySam Divorce: బాధ కలిగించింది.. చైతు చాలా కూల్: రాజీవ్ కనకాల
Rajeev Kanakala About Chaysam Divorce: టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసిన నాగ చైతన్య-సమంతల విడాకుల గురించే టాక్ నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. టాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా గుర్తింపు పొందారు. ఎలాంటి వివాదాలు లేకుండా నాలుగేళ్లుగా కలిసి ఉన్న ఈ ప్రేమ.. ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో చై-సామ్‌ల అభిమానులు షాక్‌కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. కొంతమంది సమంతకు మద్దతుగా మాట్లాడితే.. మరికొంతమంది చైతూకి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా నాగ చైతన్య- సమంత విడాకులపై నటుడు రాజీవ్ కనకాల కూడా స్పందించారు. (చదవండి: అందుకే సమంత దూరం జరిగింది : మాధవీలత) నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీలో రాజీవ్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్, ఆ సినిమా షూటింగ్ తాలూకు విశేషాలను ఓ యూట్యూబ్ చానల్‌కు పంచుకున్న రాజీవ్ కనకాల.. చై-సామ్ విడాకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం అని, దాని గురించి ఏం మాట్లాడలేం అని చెప్పాడు. అయితే వారిద్దరు విడిపోవడం తనను బాధ కలిగించిందని చెప్పాడు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం సరికాదన్నాడు. రియల్ లైఫ్‌లో మాత్రం నాగ చైతన్య చాలా కూల్ పర్సన్ అని, ఆయన ఎక్కడా విసుగు చెందే మనస్తత్వం కాదని తెలిపాడు. సెట్లో అందరితో సరదాగా ఉంటూ తన పని తాను చెసుకొని వెళ్లేవాడని చెప్పుకొచ్చాడు. -
‘లవ్‌స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
Anchor Suma Comments Husband Rajeev Kanakala Over Love Story Movie: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్‌స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ చూసిన అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ తన భర్త రాజీవ్ కనకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక ‘లవ్‌స్టోరీ’ మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సుమ ట్వీట్ చేస్తూ.. ‘కొందరూ నటులు పాత్రలో లీనమై నటిస్తారు. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందా! అన్నట్లు నటిస్తారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కూడా అలాంటి అద్భుతమైన నటులలో ఒకరు. అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన రాజీవ్‌కు శుభాకాంక్షలు. ఈ రోల్ చేయడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. కానీ ఈ పాత్ర ద్వారా నువ్వు ఎంతో మంది జీవితాలను ఇంపాక్ట్ చేశావు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే అలాగే ‘లవ్‌స్టోరీ చిత్రంలో ఇలాంటి సెన్సిబుల్ లైన్ తీసుకుని సెన్సీటీవ్గా చూపించిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవిలు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తూ నా కళ్లు తిప్పుకోలేక పోయాను, రెప్పలు కొట్టకుండా అలానే చూస్తుండిపోయాను. దీంతో నా కళ్లు అలసిపోయాయి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించింది. అలాగే మూవీ టీం మొత్తానికి సుమ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. కాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల తన సొంత అన్న కూతురిని చిన్నప్పుడు లైంగికంగా వేధించిన పాత్రలో నటించాడు. సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను నమ్మి ఆయన ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్‌స్టోరీ సక్సెస్ మీట్లో రాజీవ్ క్యారెక్టర్‌పై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ ఒప్పుకున్నాడంటే ముందు ఆయన భార్య సుమ కనకాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మా మూవీకి ఇంతటి ఆదరణ లభించిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. There are a very few actors who can make us so deeply involved with their performance and my dearest hubby Rajeev Kanakala @RajeevCo is one among them. Congratulations to you for such a wonderful role, I know you felt bad doing the character but you have impacted many lives (1/3) pic.twitter.com/ucL5mI3t90 — Suma Kanakala (@ItsSumaKanakala) September 30, 2021 -
నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల
Sekhar Kammula: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. అసలు లవ్‌స్టోరీ సినిమా కథ ఎలా మొదలైంది? ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లోనే షూటింగ్ చేయడానికి కారణం ఏంటి? బాలీవుడ్లో సినిమా ఎప్పుడు ఉండబోతుంది?లవ్‌స్టోరీ రిలీజ్ అనంతరం శేఖర్ కమ్ముల అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను సత్తితో 'గరం గరం ముచ్చట్లు'లో చూసేయండి.. -
శేఖర్ కమ్ములతో గరం సత్తి ముచ్చట్లు
-
ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించారు: నాగ చైతన్య
Naga Chaitanya Love Story Movie: అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 24న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారత్‌లోనే కాకుండా అమెరికా థియేటర్లలో కూడా ‘లవ్‌స్టోరీ’ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో మూవీ టీం లవ్‌స్టోరీ సక్సెస్ మీట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు మిగతా సినిమా క్రూడ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ‘లవ్‌స్టోరీ’ టీంకు కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: ‘లవ్‌స్టోరీ’: ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు కాగా ఈ సినిమాలో నాగ చైతన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన దళిత యువకుడి పాత్రలో కనిపించాడు. తన స్వయం శక్తితో ఎదిగి జుంబా మాస్టర్‌గా చై నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అగ్ర వర్గానికి చెందిన యువతిగా సాయి పల్లవి నటించింది. ఇందులో ఆమె ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న అమ్మాయిగా కనిపించింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబులు సైతం ఫిదా అయి సాయి పల్లవిని ప్రశంసించారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య Team #lovestory !! Thank you so much .. you guys have given me memories for a lifetime .. pic.twitter.com/oMbfgwJk0M — chaitanya akkineni (@chay_akkineni) September 30, 2021 -
‘లవ్‌స్టోరీ’: ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. మహమ్మారి కాలంలో కూడా అధిక శాతం ప్రేక్షకులను థియేటర్లోకి రప్పించిన చిత్రంగా లవ్‌స్టోరీ మార్క్ తెచ్చుకుంది. శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన ఈ చిత్రం భారత్‌లోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ వరుసగా సక్సెస్, మ్యాజికల్ సక్సెస్ మీట్ వేడుకులను కూడా జరుపుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో హీరోహీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా మారారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి లవ్‌స్టోరీ విశేషాలను పంచుకుంది. అయితే ఈ సినిమాలో ఓ చోట సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య లిప్‌లాక్ సీన్ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్.. హీరోకు ముద్దు పెట్టి పరుగెత్తుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఈ ముద్దు సీన్‌పై సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఆ సన్నివేశంలో నాగచైతన్యను నేను నిజంగా ముద్దు పెట్టుకోలేదు. కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్ పెట్టి సెట్ చేశారు. ఎందుకంటే ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్లలో నటించనని డైరెక్టర్లకు ముందే స్పష్టం చేస్తాను. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్లో నటించమని డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. పాత్ర బాగుంటే పర్ఫార్మెన్స్ దానికదే ఉత్తమంగా వచ్చేసిస్తుందనేది నా అభిప్రాయం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
చైతూ, శేఖర్‌పై ప్రశంసలు కురిపించిన నాగార్జున
‘‘దేశంలో కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. భారత ప్రభుత్వం కానీ, ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారు మంచి నిర్ణయాలు తీసుకుని కరోనా నివారణకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీపై కరోనా ప్రభావం కాస్త ఎక్కువ ఉంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో థియేటర్లు తెరవలేదు. తెలంగాణలో 100 శాతం, ఆంధ్రాలో అక్కడి పరిస్థితులను బట్టి 50 శాతం థియేటర్లు తెరిశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపే చూశాయి’’ అన్నారు నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మ్యాజికల్ సక్సెస్ మీట్ ఆఫ్ లవ్ స్టోరీ’లో నాగార్జున మాట్లాడుతూ –‘‘కొన్ని వారాల క్రితం విడుదలైన ఓ హిందీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్లు షేర్ వస్తే.. ‘లవ్‌స్టోరీ’కి ఏడు కోట్లు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కోటి నమస్కారాలు. శేఖర్ సెన్సిటివ్ డైరెక్టర్.. కానీ అదొక్కటే సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బ్యాలెన్స్ చేసి తీయాలి.. శేఖర్ అది నేర్చుకున్నాడు. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్.. ఇవి రెండూ డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్‌గా తయారు చేశాడు శేఖర్. చైతూ.. బాగా నటించావ్. ఈ సినిమా చూసి నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్. ‘ప్రేమనగర్’ రిలీజ్ టైమ్‌లో తుఫాన్, సైక్లోన్ అన్నీ ఉన్నా నాన్నగారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు తుఫాన్, కోవిడ్, సైక్లోన్‌తో పోరాడి ‘లవ్‌స్టోరీ’ గొప్ప విజయాన్ని సాధించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ కావడం టాలీవుడ్‌కు శుభపరిణామం’’ అన్నారు నారాయణ్‌దాస్ నారంగ్. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్‌కి థ్యాంక్స్. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్ వచ్చింది’’ అన్నారు శేఖర్ కమ్ముల. నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్ వస్తారా? రారా? అనే టైమ్‌లో వారు థియేటర్స్‌కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్గారి కంటెంట్ పవర్ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది. సినిమా స్టార్ట్ చేశాక శేఖర్‌గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్‌ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) థ్యాంక్స్. ‘లవ్‌స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్‌కి వెళ్లా. వారి రియాక్షన్ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్ బాబు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కర భట్ల, పవన్ సీహెచ్, మంగ్లీ, రోల్ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. -
లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్‌కి అతిథిగా సుకుమార్?
కరోనా సెకండ్ వేవ్ అనంతరం విడుదలై మంచి విజయం సాధించింది ‘లవ్‌స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో సైతం రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. ఇందులో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 28న) మ్యాజికల్ సక్సెస్ మీట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో జరిగే ఈ కార్య్రమానికి హీరో నాగార్జునతోపాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఎంతో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. కాగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ రూ. 50 కోట్ల మార్క్ దగ్గర ఉన్నట్లు సమాచారం. కాగా సుకుమార్, నాగచైతన్య కలిసి ‘100% లవ్’ మూవీ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చదవండి: చైతూకి గేమ్ చేంజర్..ఆమెకు ఎముకలు ఉన్నాయా'? -
మహేశ్ కామెంట్స్‌పై స్పందించిన సాయి పల్లవి
Sai Pallavi Respond On Mahesh Babu Tweet: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన ఈ మూవీ ఇండియాలోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు విశేష స్పందన వస్తోంది. దీంతో టాలీవుడ్లో ఎక్కడ చూసినా లవ్‌స్టోరీ మూవీ గురించే చర్చించుకుంటారు. అంతేగాక లవ్‌స్టోరీపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీపై తన రివ్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘లవ్‌స్టోరీ’ రికార్డు కలెక్షన్స్ ఈ సందర్భంగా ఆయన సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు. తన ట్వీట్లో సాయి పల్లవి గురించి బెబుతూ.. ‘ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆమెకు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం ఇంతవరకు చూడలేదు’ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన సాయి పల్లవి, మహేశ్ కామెంట్స్‌పై స్పందించింది. మహేశ్ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ.. ‘మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్‌ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివించింది సార్’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరు కూడా ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి: A R Rahman: 'అవును మహేశ్.. మేమందరం గర్వపడుతున్నాం' Woah🙈 It’s going to take me a while to come back to my senses!!! I’m humbled by your generous words ☺️ Thank you so much Sir 🙈 P.S. The fan girl in me has already read your tweet a million times 🙈 — Sai Pallavi (@Sai_Pallavi92) September 26, 2021 లవ్‌స్టోరీ సినిమా చూసిన మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్‌పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్‌స్టోరీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఆయన ట్వీట్‌కు ఎఆర్ రెహమాన్ కూడా స్పందిస్తూ ధన్యవాదలు తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: 'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ -
యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘లవ్‌స్టోరీ’ రికార్డు కలెక్షన్స్
సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్‌స్టోరి’ మూవీ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. తాజాగా ఈ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెరికాలో లవ్‌స్టోరీ విడుదలైన 3 రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల (రూ.7 కోట్ల 37 లక్షలు) వసూళ్లు రాబట్టింది. ఆదివారం రాత్రి వరకు 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా లవ్‌స్టోరీ నిలిచింది. చదవండి: Pushpa: ‘పుష్ప’ షూటింగ్ జరిగిన లొకేషన్ని షేర్ చేసిన మేకర్స్ ఓ తెలుగు సినిమా మూడు రోజుల్లో యూఎస్‌లో 1 మిలియన్ల డాలర్లోకి వెళ్లడమంటే సాధారణ విషయం కాదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రికార్డుల స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా లవ్‌స్టోరీ నిలిచింది. మూడు రోజుల్లో యూఎస్‌లో 1 మిలియన్ల డాలర్ల క్లబ్‌లోకి లవ్‌స్టోరీ చేరటం విశేషం. దీంతో లవ్‌స్టోరీ 2 మిలియన్ల డాలర్ల మైల్స్టోన్ దిశగా వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజు లవ్‌స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ఒక యూఎస్‌లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా లవ్‌స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల మాట. చదవండి: మహేశ్ బాబు ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన ఏ.ఆర్.రెహమాన్ -
గరం గరం వార్తలు 27 September 2021
-
'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ
Mahesh Babu Comments On Love Story Movie: టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు 'లవ్ స్టోరీ' మూవీ టాపిక్కే వినిపిస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు లవ్‌స్టోరీపై రివ్యూ ఇచ్చారు. చదవండి : డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున 'శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్‌పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్‌స్టోరీ టీంపై మహేశ్ ప్రశంసలు కురిపించాడు. చదవండి : Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ @Sai_Pallavi92 sensational as always... does the lady have any bones??? Haven't seen anyone dance like this ever on screen!!! Moves like a dream 🤩🤩🤩 — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 @pawanch19.. you'll be hearing a lot more of him... what a music score... Just sensational! Heard he's a disciple of @arrahman.. Rahman sir, you'll be proud of him. — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 -
డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్లను వసూళ్లు చేసినట్లు సమచారం. దీంతో లవ్‌స్టోరీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమీర్ ఖాన్‌కు అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. చదవండి: Ali Home Tour: కమెడియన్ అలీ 'హోమ్ టూర్' చూశారా? నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మరికొందరు ఈ పార్టీలో పాల్గొన్నారు. అందరూ కలిసి కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అమీర్‌ఖాన్‌తో నాగార్జున ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇక లవ్‌స్టోరీ సినిమా విడుదలైన సెప్టెంబర్ 24నే 50 సంవత్సరాల క్రితం ఏఎన్నార్ నటించిన ‘ప్రేమ్‌నగర్’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లవ్‌స్టోరీ మూవీ సైతం సక్సెస్ సాధించడంతో నాగార్జున ఒకింత ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య ఆ సినిమాలో బాలరాజు అనే తెలుగు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా గతంలో ఏఎన్నార్ కూడా బాలరాజు పేరుతో తీసిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని నాగార్జున భావేద్వేగానికి లోనయ్యారు. చదవండి : Love Story Box Office: రికార్డు స్థాయిలో ‘లవ్‌స్టోరి’ కలెక్షన్స్ Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ -
బాక్సాఫీస్ వద్ద ‘లవ్‌స్టోరి’ప్రభంజనం.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
Love Story Movie First Day Collections: సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్‌స్టోరి’మూవీ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. (చదవండి: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ) ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజు లవ్‌స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ఒక యూఎస్‌లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా లవ్‌స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ.6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల మాట. ఒక్క నైజాం నుంచే 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చిందట. సీడెడ్ నుంచి కోటికి పైగా షేర్ వచ్చింది. వెస్ట్, గుంటూరు ఏరియాల్లో, ఒక్కో సెగ్మెంట్ నుంచి అరకోటికి పైగా షేర్లు వచ్చినట్లు తెలుస్తోంది. లవ్‌స్టోరి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 32.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని టాక్. నైజాం ఏరియాలో 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.36 కోట్ల దాకా లాభాలను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్‌ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి. -
Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్‌స్టోరి నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు దర్శకత్వం: శేఖర్ కమ్ముల సంగీతం : పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ : విజయ్.సి.కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్‌స్టోరి సినిమా చేశాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు( సెప్టెంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘లవ్‌స్టోరి’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. ‘లవ్‌స్టోరీ’కథేంటంటే? అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్లో పార్ట్నర్గా జాయిన్ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మధ్యలో కులం అడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? కులాల అడ్డంకి దాటుకొని చివరకు మౌనిక, రేవంత్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ. ఎలా చేశారంటే.. ? రేవంత్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప చైతూ, సాయి పల్లవిలు అస్సలు కనిపించరు. హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ తనది. హీరోయిన్ తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ చాలా మంది సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సున్నితమైన పాయింట్‌ని తీసుకొని, తెరపై అతి సున్నితంగా చూపించాడు శేఖర్ కమ్ముల. పాత్రల నేపథ్యం చాలా నేచురల్‌గా ఉంటుంది. సినిమాల్లో కొన్ని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసినా.. స్లోగా సాగే సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది, సెకండాఫ్ వచ్చేసరికి కథలో ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం పవన్ సీహెచ్ సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. విజయ్.సి.కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లెటూరి విజువల్స్‌ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బ్యానర్ స్థాయికి తగినట్లుగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే ‘లవ్‌స్టోరి’ ఓ మంచి సందేశాత్మక చిత్రం. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్