
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్స్లో ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తన అందమైన నటనకు ఆకర్షించబడని ప్రేక్షకులుండరు. భానుమతిగా ఫిదాతో పరిచయం అయిన సాయి పల్లవి తన సినిమాలలో తన ప్రత్యేకతను చాటుకుంటూ కెరియర్ ని లీడ్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నాగచైనత్య ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాట పర్వం’ సినిమాలో టిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు.. ఈ సందర్భాన్ని పురస‍్కరించుకొని ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. (చదవండి : మే 9.. సినీ అభిమానులకు పండగ రోజు)
నక్సలైట్‌గా సాయిపల్లవి..!
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి హీరో హిరోయిన్లుగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీ ఇది. ఇందులో రానా పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా టీం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్‌గా లేదా ఓ పాత్రికేయురాలి పాత్రలో నటించినట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే ఆమె విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు .. లగేజ్ తో అమరవీరుల స్థూపం దగ్గర ఎదురు చూస్తూ కూర్చుంది. ‘అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి?ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి?ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే’అని డైరెక్టర్ వేణు విశ్లేశించిన తీరు ఆకట్టుకుంటుంది. (చదవండి: ‘ఆకాశవాణి’ నుంచి జక్కన్న తనయుడు ఔట్?)
వర్షంలో ఆడుతున్న సాయిపల్లవి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేసేందుకు లవ్ స్టోరీ తో సిద్దం అవుతుంది సాయిపల్లవి. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ క్రేజ్ లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. లవ్ స్టోరీ కి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. లాక్ డౌన్ తర్వాత అప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని షూటింగ్ ప్లాన్ చేస్తుంది యూనిట్. శేఖర్ కమ్ముల సినిమాలలో కథానాయికలు ఎంత హుందాగా ఉంటారో అందరికీ తెలిసిందే.. భావోద్వేగాలతో నిండుకున్న ప్రేమకథలతో సెల్యులాయిడ్ పై శేఖర్ చేసే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ అయ్యేటట్టు కనిపిస్తోంది.హీరోయిన్ సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా టీం విడుదల చేసిన పోస్టర్ లో సాయి పల్లవి మరింత అందంగా కనిపించింది. వర్షంలో ఆడుతున్న సాయి పల్లవి స్టిల్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తుంది.‘‘లవ్ స్టోరీ’’ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment