సాక్షి, హైదరాబాద్: నాని నటించిన టక్ జగదీష్ ప్రాజెక్ట్‌ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల యజమానులు మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ సినిమా విడుదల అవుతున్న రోజే నాని టక్ జగదీష్ ఓటీటీలో రావడం వల్ల అందరం నష్టపోతామని అన్నారు. రేపు కూడా ఇలానే చేస్తే భవిషత్తులో నిర్మాతలకు తాము డబ్బులు కట్టమని అన్నారు.
చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్
పండుగల సమయంలో కొత్త సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని, థియేటర్‌లో లవ్ స్టోరీ విడుదలకు తెలంగాణ ఎగ్జిబిటర్లుమద్దతు పలికారు. టక్ జగదీశ్ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు, హీరో నానికి భవిషత్తు మేము ఏంటో చూపిస్తామన్నారు, తిమ్మరుసు ఆడియో వేడుకలో హీరో మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఓటీటీ వాళ్ళు రూ. 4 కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు, ‘సినిమా లేకుండా మనం లేమని, సినిమా మన సంస్కృతిలో భాగం నాని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఓటీటీ లో సినిమా చేస్తున్నాడు. హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు’ అని పేర్కొన్నారు.
చదవండి: ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్
ఇదిలా ఉండగా నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలతో టాలీవుడ్‌లో ఓటీటీ, థియేటర్‌ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment