owners
-
ఉచిత ఇసుక విధానానికి తూట్లు.. చంద్రబాబుపై టిప్పర్ ఓనర్లు ఆగ్రహం
-
కొంప మునిగింది
బిజినెస్ బహానాపసిగట్టలేకపోయిన భార్యబావమరిది నిఘా‘నిన్ననే వచ్చారు.. మళ్లీ ఇవ్వాళ ప్రయాణమవుతున్నారు. ఒక్కపూట కోసం ఇంటి దాకా రావడం ఎందుకు? ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర్లోనే ఓ రూమ్ చూసుకోండి’ నిష్ఠూరమాడింది.‘బిజినెస్ పనులు అలాంటివి మరి.. అర్థం చేసుకోకపోతే ఎలా? ఈ కష్టమంతా మీ కోసమే కదా..!’ షూస్ వేసుకుంటూ అన్నాడు. ‘ఆ..ఆ.. ఈ మాటతోనే నోరు మూయిస్తారు’ తను సర్దిన బ్యాగ్‌ను అతని దగ్గర పెడుతూ అంది. పర్స్‌లోంచి చేతికి అందినంత డబ్బు తీసి ఆమెకిస్తూ ‘జాగ్రత్త.. పిల్లలు ఏదడిగినా కొనిపెట్టు. పిసినారితనం చూపించకు’ అన్నాడు.ఆ డబ్బును అక్కడే సోఫాలో పెడుతూ ‘మీరిలా నెలకు ఇరవై రోజులు బిజినెస్ పనంటూ ఊళ్లు తిరిగితే పిల్లలు మీరు కొనిపెట్టే వస్తువులనే గుర్తుంచుకుంటారు.. మిమ్మల్ని కాదు’ చురకంటించింది. ‘అబ్బా.. ఈసారి నుంచి పార్టనర్స్కే అప్పజెప్తాలే.. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా వెళ్లనీ!’ కాస్త విసుక్కున్నాడు. ‘హూ.. తిరిగి ఎప్పుడు రాక?’ అడిగింది నిష్ఠూరంగానే!‘నా చేతుల్లో ఉంటుందా చెప్పు పని? ఇల్లు వదిలేసి ఊళ్లు తిరగడం నాకు మాత్రం సరదానా? ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వచ్చేస్తాలే’ అంటూ లేచాడు బ్యాగ్ పట్టుకుని. ‘త్వరగా అయిపోగొట్టుకుని రండి’ అతని వెనుకే నడిచింది గుమ్మం దాకా!∙∙ ‘ఏ ఊరికి వెళ్లాడు?’‘ఇంట్లో బాంబే అని చెప్పాడు. అతను వాళ్లింటి నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేదు. రైల్వేస్టేషన్‌కీ వెళ్లలేదు. సిటీ ఔట్స్కట్స్లో తన కారులోంచి దిగిపోయి, మరో కారులోకి మారాడు’ చెప్పాడు.‘ఓకే..’ అంటూ అవతల ఫోన్ డిస్కనెక్ట్ చేశారు. ఇవతల వ్యక్తీ రిసీవర్ క్రెడిల్ చేసి.. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి బయటకు వచ్చాడు. రెండు రోజులకు..ఆ సిటీ పాష్ లొకాలిటీలోని ఓ డూప్లెక్స్ ఇల్లు.. వాచ్‌మన్ చేత గేట్ తెరిపించుకుని ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఉంది ఐటీ టీమ్. కాలింగ్ బెల్ నొక్కాడు ఆఫీసర్. వాళ్ల వెనుకే కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన వాచ్మన్ని.. ఆ టీమ్‌లోని ఓ వ్యక్తి ఆపి, ఏదో సర్ది చెబుతూ తీసుకెళ్లి మళ్లీ గేట్ దగ్గరే కూర్చోబెట్టాడు. ఈలోపు ద్వారం తెరుచుకుంది. టీమ్ లోపలికి వెళ్లింది. ‘మేడం.. ఎవరో వచ్చారు’ తలుపు తీసిన పనమ్మాయి యజమానికి చెప్పింది. ‘ఎవరూ..?’ అంటూ యజమాని హాల్లోకి వచ్చింది.‘ఫ్రమ్ ఇన్కమ్ టాక్స్..’ అంటూ తన ఐడీ చూపిస్తూ, తన టీమ్‌కి సైగ చేశాడు సోదా చేయమని!‘మా ఆయన లేనప్పుడు ఎలా వస్తారు? ఆయన ఊర్లో లేరు’ చెప్పింది ఆమె గాభరాగా. ‘తెలుసు.. మీవారు ఎక్కడున్నారో అక్కడికీ వెళ్లింది మా టీమ్!’ అంటూ పై అంతస్తుకు మెట్లెక్కసాగాడు. మూడు బెడ్రూమ్లు, దేవుడి గది, వంటిల్లు అన్నీ సోదా చేశారు. ఎక్కడా ఏమీ దొరకలేదు. ఆ టీమ్‌లోని ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చి.. మళ్లీ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్లింది. వార్డ్రోబ్స్కి ఎక్స్‌టెన్షన్‌గా ఉన్న ప్లేస్‌ను పరిశీలనగా చూడసాగింది. ఆమెనే అనుసరించిన యజమాని ‘అది బాత్రూమ్ డోర్’ అంది. దానికి అపోజిట్ వైపు చూపిస్తూ ‘అది కదా బాత్రూమ్?’ అడిగింది ఉద్యోగిని. ‘అంటే... దీనికి రెండు బాత్రూమ్స్ ఉన్నాయి’ చెప్పింది కాస్త తత్తరపడుతూ. ‘చూద్దాం..’ అంటూ ఆమెను పక్కకు తప్పిస్తూ ఆ ఎక్స్‌టెన్షన్‌ను తట్టింది ఉద్యోగిని. తలుపు తెరుచుకుంది. అది బాత్రూమ్ కాదు. వాక్ ఇన్ వార్డ్రోబ్. మిగిలిన టీమ్ కూడా వచ్చింది. వెదికారు. కిలో వరకు బంగారం, మూడు కిలోల వరకు వెండి, క్యాష్, డాక్యుమెంట్స్ అన్నీ అక్కడే దొరికాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగా.. ఆ ఇంటి ల్యాండ్‌లైన్ మోగింది. యజమాని రిసీవర్ తీయబోతుండగా.. ఆగమని సైగ చేస్తూ ఐటీ ఆఫీసర్ రిసీవర్ తీశాడు. ‘హలో.. ’ అవతలి నుంచి. ‘యెస్.. ’ ఐటీ ఆఫీసర్. ఆ గొంతును పోల్చుకున్నట్టున్నారు అవతలి వాళ్లు సంభాషణ కొనసాగింది. ‘సర్.. అతను ఇక్కడ హోటల్లో ఉన్నాడు. ఫ్యామిలీతో వచ్చినట్టున్నాడు’ చెప్పాడు అవతలి వ్యక్తి. ‘ఫ్యామిలీతోనా?’ ఐటీ ఆఫీసర్ ఆ మాట అంటూండగా యజమాని భృకుటి ముడిపడింది.‘అవును సర్.. అతనితోపాటు అతని వైఫ్ కూడా ఉంది’ చెప్పాడు అవతలి వ్యక్తి. ‘వైఫా? మరి ఇక్కడ ఎవరూ?’ అంటూ ఆ ఇంటి యజమాని వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అర్థమైనట్టుంది ఆమెకు.. వెంటనే రిసీవర్ లాక్కుని ‘హలో.. ఆయనకు ఫోన్ ఇస్తారా ఒకసారి?’ అడిగింది ఆవేశం ఎగసిపడుతుండగా!ఆయన లైన్లోకి వచ్చాడు ‘హలో..’ అంటూ!‘ఇదా మీ బిజినెస్ పని? ఎవరు ఆ ఫ్యామిలీ?’‘హలో.. వాళ్లేదో అనుమానపడుతున్నారు.. నే..ను..’ అని అతను అంటూండగానే ఇవతల ఫోన్ డిస్కనెక్ట్ అయింది. అవమానం, బాధ ఆమె కళ్లల్లో నిండాయి నీళ్లుగా! ఫార్మాలిటీస్ కూడా పూర్తవడంతో ఐటీ టీమ్ అక్కడ నుంచి నిష్క్రమించింది. ముంబై పేరు బొంబాయిగా ఉన్నప్పుడు జరిగిన రెయిడ్ ఇది. ఆ బిజినెస్‌మన్ పన్ను ఎగ్గొట్టిన సంపద గురించి ఐటీ వాళ్లకు సమాచారమిచ్చింది స్వయాన అతని బావమరిదే. వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆ బావమరిదీ అందులో భాగస్వామే. కానీ బావగారు మిగతావాళ్లతో చేరి బావమరిదిని బయటకు పంపించేశాడు. అది మనసులో పెట్టుకుని ఐటీ వాళ్లకు టిప్ అందించాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడింది అతని బావమరిదే! అయితే అతనికీ తెలీదు తన సోదరిని కూడా ఆ బావగారు మోసం చేస్తున్నట్టు! మాటిమాటికీ బిజినెస్ టూర్లకు వెళ్తున్నాడు అంటే అక్కడ కూడా లెక్కాపత్రాల్లేని డబ్బో, స్థిరాస్తులో ఉంటాయనుకుని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వసాగాడు. -
కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్‌బోర్డులు ఉండాల్సిందే..
లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో అన్ని హోటళ్లు తమ యజమానుల పేర్లను తప్పక ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.. ప్రతి హోటళ్లు.. అది రెస్టారెంట్ అయినా, రోడ్‌సైడ్ దాబా అయినా, లేదా ఫుడ్ కార్ట్ అయినా యజమాని పేరును ప్రదర్శించాల్సిందేనని పేర్కొన్నారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది.ఇదిలా ఉండగా ఇటీవల ముజఫర్‌నగర్ పోలీసులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లకు యజమానుల పేర్లు, మొబైల్ నెంబర్, క్యూ ఆర్ కోడ్‌ను.. బోర్డుపై ఉంచాలని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు వివాదస్పదంగా మారాయి. వీటిపై ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది. ఈ ఉత్తర్వు పూర్తి వివక్షపూరితమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. యూపీలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడమే దీని ఉద్దేశమని ఆరోపించారు. సామాజిక నేరంలాంటి ఈ ఉత్తర్వుపై కోర్టులు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ డిమాండ్ చేశారు.అయితే విపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ యూపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కన్వర్ యాత్రకు వెళ్తున్నవారు ఫక్తు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు చెబుతోంది. హిందూ పేర్లతో ముస్లింలు మాంసాహారాన్ని యాత్రికులకు విక్రయిస్తున్నారని మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ ఆరోపించారు. వైష్ణో ధాబా భండార్, శాకుంభరీ దేవి భోజనాలయ, శుద్ధ్ భోజనాలయ వంటి పేర్లను రాసి మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.కాగా జులై 22 నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
హైదరాబాద్ పబ్‌ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొంతమంది పబ్ యజమానులు.. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్‌లో కొత్త మోసానికి తెరతీశారు. పబ్ యజమానులు, అమ్మాయిలు.. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.ఒక వ్యాపారవేత్తకు రితికా అనే యువతి పరిచయం కాగా, పరిచయం అయిన మరుసటి రోజే కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రమ్మంది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. వ్యాపారవేత్తను పబ్‌లోకి తీసుకెళ్లి తియ్యని మాటలు చెప్పి గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది. రూ. 40,505 రూపాయిలు బిల్‌ను చేతిలో పెట్టి రితిక జారుకుంది. బిల్లును చూసి ఆ వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 45 వేల రూపాయల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో విస్మయం చెందిన వ్యాపార వేత్త.. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నాడు.పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇలాగే ఆ యువతి, పబ్ యాజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు తేలింది. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసంపైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు. -
కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్మకాలు.. చంద్రబాబుకు మరో వర్గం దూరం..
-
విశాఖలో దక్షిణ భారత హోటల్ యజమానుల సదస్సు
-
TSRTC: రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్న ఆయన.. వారు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్‌కు ఐదు సమస్యలను విన్నవించామన్నారు. ఎండీ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 10 వ తేదీ లోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని వారు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ పరామర్శ -
పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..?
కొన్ని వస్తువులు పోతే మళ్లీ మనకు చేరడం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్లు సదరు యజమానికి అందేలా చేయాలనకుంటే గానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగే ఇచ్చివాళ్లు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలుకా కుటుంబసభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ల ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికో గానీ జరగదు. అసలు ఆ వాలెట్ ఎలా పోయింది?. ఎవరు ఆ వాలెట్‌ని యజమాని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారంటే.. అట్లాంటాలోని పురాతన ప్లాజా థియోటర్ ఒకటి ఉంది. దాన్ని మరమత్తు చేస్తుండగా ఆ థియోటర్ వెనుకవైపున ఉన్న బాత్రూం గోడ కూలిపోయింది. దీంతో వాలెట్ బయటపడింది. దానిలో కొన్ని మాగ్నటిక్ స్ట్రిప్లేని క్రెడిట్లు, సినిమా టిక్కెట్, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ ధియోటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైన అందేలా చేయాలనుకున్నాడు. అయితే 1959లో చేవ్రోలెట్ సినిమా చూడటాని వచ్చి పోగొట్టుకున్నట్లు వాలెట్లో ఉన్న టికెట్‌ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వాలెట్ యజమాని లేదా అతడి కుటుంబ సభ్యులకు అయినా దీన్ని అందేలా చేయాలన అనుకుంటాడు క్రిస్. అయితే ఆ కుటుంబం మునుపు ఈ పరిసరాల్లోనే ఉండొచ్చేమో గానీ ఇప్పుడూ చాల ఏళ్లు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటుందనేది కనిపెట్టడం అసాధ్యంగా అనిపించింది క్రిస్ ఎస్కోబార్‌కి. దీంతో ఆ వ్యాలెట్‌లో ఉన్న లైసెన్స్ కార్డుల ఆధారంగా వ్యాలెట్ పోగొట్టుకున్న వ్యక్తి స్త్రీని అని కనుగొంటారు. ఆమె పేరు ఫ్లాయ్ కల్బ్రేత్గా గుర్తించారు. అయితే ఆ కాలంలో స్త్రీలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దీంతో ఆమె అడ్రస్ కనుగొనడం మరింత కష్టంగా మారింది. దీంతో క్రిస్ తన భార్య సాయం తీసుకుంటాడు. ఆమె ఇంటర్నెట్లో సోధించగా కల్‌బ్రెత్ మరణించినట్లు గుర్తిస్తుంది. దీన్ని బట్టి ఫ్లాయ్ ఆమె పేరు అని అర్థం చేసుకుంటారు ఆ దంపతులు. అంతేగాదు కల్‌బ్రెత్ పేరు మీద కల్‌బ్రెత్ కప్ అనే గోల్ఫ్ టోర్నమెంట్ వెబ్‌సైట్‌ను కనుగొంటారు. అతడి కుటుంబ చిన్నపిల్లలకు వచ్చే మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy) అనే ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా ఫ్లాయ్ కుమార్తె థియా చాంబర్‌లైన్‌ను కనుగొంటారు. ఆమెకు ఈ వ్యాలెట్‌ని అందజేస్తాడు క్రిస్. దీంతో ఆమె ఒక్కసారిగా ఆ వ్యాలెట్‌ని తీసుకుంటూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం గలదంటూ ఉద్వేగం చెందుతుంది. ఆమె వ్యాలెట్‌లో భీమా కార్డులు, డాక్టర్ అపాయింట్మెంట్ నోట్లు కనుగొంటుంది. ట్విస్ట్ ఏంటంటే థియా చాంబర్‌లైన్‌కు ఇప్పుడు 71 ఏళ్లు. ఈ వ్యాలెట్ పోయినప్పుడు ఆమెకు ఆరేళ్లు. ఈ మేరకు ఆ థియోటర్ యజమాని క్రిస్ మాట్లాడుతూ..తమకు మనవళ్లు, మునివళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ కల్బ్రేత్కు కూడా అలానే ఉంటారు కదా. ఈ వ్యాలెట్ కలెబ్రెత్ జ్ఞాపకాలను ఆ కుటంబంలోని తరతరాలకు తెలియజేస్తుంది కదా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు క్రిస్. (చదవండి: మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!) -
గతంలో షాపులో పనిచేసే నేను ఈరోజు ఒక షాపుకు యజమానురాలు అయ్యానంటే కారణం జగనన్న అందించిన తోడ్పాటే..!
-
వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు
గాంధీనగర్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం ఉదయం ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. రైలు పట్టాలపై గేదెల మంద అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. రైలు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన అత్యాధునిక రైలు ఆరు రోజులకే ప్రమాదానికి గురికావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై గుజరాత్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసింది. గేదెల యజమానులపై అభియోగాలు మోపింది. వారి నిర్లక్ష్యం కారణంగానే గేదెలు పట్టాలపైకి వచ్చాయని, యజమానుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు వారిని ఇంకా గుర్తించలేకపోయినట్లు చెప్పారు. వందే భారత్ హైస్పీడు రైలును ప్రధాని మోదీ సెప్టెంబర్ 30న ప్రారంభించారు. ఇది గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గురువారం గేదెలను ఢీకొట్టినప్పుడు ఈ రైలు గంటకు 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఘటనలో రైలు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణం ఆలస్యం కాలేదు. గాంధీ నగర్‌కు అనుకున్న సమయానికే చేరింది. తిరిగి ముంబైకి కూడా సకాలంతో వెళ్లింది. అనంతరం రైలు ముందుభాగానికి అధికారులు మరమ్మతులు నిర్వహించారు. చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే.. -
షావుకార్ల కక్కుర్తి!
బీఎండబ్ల్యూ, టయోటా, ఫార్చునర్, ఫోర్డ్స్, ఫోక్స్‌వ్యాగన్ తదితర విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న కుటుంబాల వద్ద అంత్యోదయ, బీపీఎల్ రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలు అనేక ఏళ్లుగా ప్రతినెల నిరుపేదలకు అందించే ఉచిత బియ్యం, రాగులు, జొన్నలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన కార్లు కలిగి నిబంధనలకు విరుద్ధంగా బీపీఎల్, అంత్యోదయ కార్డులతో బియ్యం తీసుకుంటున్న 12 వేల కుటుంబాలతో పాటు మరో 3.30 లక్షల కుటుంబాల రేషన్‌కార్డులను ఆహార పౌరసరçఫరాల శాఖ రదు చేసింది. బనశంకరి: రాష్ట్రంలో రేషన్‌కార్డులు పొందిన వేలాదికుటుంబాలు వైట్‌బోర్డు కారు ఉన్నట్లు ఆహార పౌరసరఫరాలశాఖకు సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖను ఆశ్రయించిన పౌరసరఫరాల శాఖ... రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు కారు కొనుగోలు చేసి రిస్ట్రేషన్ చేయించిన వారి సమాచారం అందించాలని కోరింది. రవాణాశాఖ అందించిన సమాచారంతో రేషన్‌కార్డులకు అనుసంధానమైన ఆధార్‌కార్డును పరిశీలించగా 12,584 కుటుంబాలు కార్లు కలిగి ఉన్నప్పటికీ బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నట్లు వెలుగుచూసింది. అందులో కలబుర్గిలో ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ, బెంగళూరు గ్రామాంతర, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, కలబుర్గిలో టయోటా, ఫార్చునర్, చామరాజనగరలో ఫోర్డు, మండ్యలో ఎంజీ మోటార్, హాసనలో ఫోక్స్‌వ్యాగన్, చిక్కమగళూరులో మహింద్రజీప్ కలిగిన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకున్నామని ఆహార పౌరసరఫరాలశాఖ తెలిపింది. కార్లు కలిగిన కార్డుదారుల సంఖ్య కార్లు కలిగిన కుటుంబాలు బీపీఎల్, అంత్యోదయ రేషన్‌కార్డులు తీసుకున్న వారి సమాచారం జిల్లాల వారిగా సేకరించారు. కలబుర్గిలో 2114, చిక్కమంగళూరులో 1912, బెంగళూరు1312, రామనగర 922, ఉత్తరకన్నడ 553, యాదగిరి 517,శివమొగ్గ 522, బీదర్ 554, బెంగళూరుగ్రామాంతర 547,బెంగళూరు పశి్చమ 485, తుమకూరు 307,చిక్కబళ్లాపుర 296,హావేరి 220, బాగల్కోటె 216,విజయపుర 214,బెంగళూరు ఉత్తర 201, మండ్య 137,దక్షిణకన్నడ 130, బళ్లారి 67, బెంగళూరు తూర్పు 89, చిత్రదుర్గ 43, దావణగెరె 62, ధారవాడ 15, గదగ 15, హాసన 86, కొడగు 21, కోలారు 65, కొప్పళ 29, మైసూరు 123, రాయచూరు 39, ఉడుపి 42 మంది నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రేషన్ కార్డులు: మానవవనరుల శాఖ నిర్వహణ వ్యవస్థ(హెచ్ఆర్ఎంఎస్) ఆయా శాఖల నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ మండలి, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల సమాచారం సేకరించింది. వారి ఆధార్‌కార్డులను పరిశీలించగా 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి రేషన్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. వీరికి నోటీస్ జారీచేసి జరిమానా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. జిల్లాల వారీగా రద్దైన కార్డులు నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థ్దికంగా నిరుపేదలమని తీసుకున్న 3,30,024 రేషన్‌కార్డులను పౌరసరఫరాలశాఖ రద్దు చేసింది. వీటిలో అంత్యోదయ 21,679, బీపీఎల్ 3,08,345 బీపీఎల్‌కార్డులు ఉన్నాయి. కొన్ని కార్డులను ఏపీఎల్ గా మార్చారు. అత్యధిక రేషన్‌కార్డులు రద్దుకాబడిన జిల్లాల సమాచారం ఆధారంగా బెంగళూరు 34,705, విజయపుర 28,735, కలబుర్గి 16,945,బెళగావి 16,765, రాయచూరు 16,693, చిత్రదుర్గ 16,537 రేషన్‌కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలశాఖ తెలిపింది. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
ఇల్లంతా దోచేసి.. ఇంటి యాజమానికి ప్రేమలేఖ..
Robbery in Goa: ఇటీవల దొంగలు చేస్తున్న పనులు చాలా కామెడీగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక దొంగ ఒక కిరాణాషాపుకి వచ్చి దొచుకెళ్దాం అనుకుంటే అక్కడ ఏమిలేక పోయేసరికి ఆవేదనతో ఆ షాపు ఓనర్‌కి ఒక లెటర్ రాసి వెళ్లిపోయాడు. మరో రాష్ట్రంలో ఏకంగా ఇరిగేషన్ అధికారులమని చెప్పి మరీ ఏకంగా బ్రిడ్జ్‌నే ఎత్తుకుపోయారు. అలానే ఇక్కడొక దొంగ ఇల్లంతా దోచేసి చివర్లో యజమానికి ప్రేమలేఖ రాశాడు. వివరాల్లోకెళ్తే... గోవాకి చెందిన ఒక కుటుంబం రెండు రోజుల పాటు విహారయాత్రకు వెళ్లి ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చింది. తీరా ఇంటికి వచ్చేటప్పటికీ కాస్త అనుమానస్సదంగా అనిపించింది. అయినా అదేం పట్టించుకోకుండా వాళ్లు ఇంట్లోకి వెళ్లిపోయారు. అంతే ఇంట్లోకి ఎంటరవ్వగానే టీవీ స్క్రీన్‌పై ఐ లవ్ యూ అనే సందేశం కనిపించింది. దీంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి ఇలా ఉందని వెంటనే అనుమానంతో గదులన్ని తనీఖీ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు గానీ వాళ్లకు అసలు విషయం అవగతమవ్వలేదు. ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులన్నీ ఎత్తుకుపోయారని, ఇందంతా వారి పనేనని గుర్తించారు. దీంతో ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ దొంగలు బాత్రూం కిటికీ గ్రిల్స్ పగలు గొట్టి ఇంట్లోకి చొరబడి సుమారు రూ.21 లక్షల విలువ చేసే నగలు, కొంత నగదు తీసుకుని పారిపోయారని పోలీసులు వెల్లడించారు. -
కరగని ‘గుండె’
సిరిసిల్ల: కొందరి కష్టాలు చూస్తే పగవారికైనా రావద్దనిపిస్తుంది. సొంత ఇల్లు లేదు.. భార్య ఏనాడో కన్నుమూసింది. కొడుకుతో కలసి సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ నేత కార్మికుడి గుండె ఆగిపోయింది. అయితే ఇంటి యజమాని శవాన్ని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఊరి బయట టెంట్ వేసుకుని శవాన్ని ఉంచాల్సి వచ్చింది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌లో నివసించే దీకొండ దేవదాస్ (66) నేతకార్మికుడు. దేవదాస్ భార్య కళావతి చాలా రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు అరుణ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా, దేవదాస్ అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో శవాన్ని ఇంటికి తేవద్దని యజమాని చెప్పాడు. దీంతో కొడుకు అరుణ్‌కు ఎటు పోవాలో తెలియక శుక్రవారం రాజీవ్‌నగర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో టెంట్ వేసి తండ్రి శవాన్ని ఉంచాడు. ఓ కూతురు భివండిలో ఉండడంతో ఆమె వచ్చేంత వరకు కుటుంబ సభ్యులు అక్కడే నిరీక్షించారు. అరుణ్ చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బంధువులు ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. పేదవాడైన అరుణ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అభం శుభం తెలియని చిన్నారి పైకి కుక్కను ఉసిగొల్పారు!...ఐతే చివరికి...
మన చుట్టుపక్కల వాళ్లు లేదా పక్కింటివాళ్లతో ఏదో చిన్న చిన్న విషయాలకే మాట మాట పెరిగి పెద్ద పెద్ద గోడవలకు దారితీసిన ఘటనలు మనం చూశాం. అయితే అవి అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆ గొడవలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత తారాస్థాయికి చేరితేనే అందరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా సదోపూర్ గ్రామంలో పిట్ బుల్ కుక్క యజమానులు చూస్తుండగానే ఓ చిన్నారిపై దాడి చేసింది. అయితే ఆ మైనర్ బాలుడి కుటుంబంతో ఆ కుక్క యజమానులకు చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో కుక్క యజమానులైన రవీందర్, సౌరభ్‌లు వారి పెంపుడు కుక్క బుల్‌ని మైనర్ బాలుడి పైకి ఉసుగొల్పారు. అయితే స్థానికులు ఆ కుక్క బెదరగొట్టడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఆ కుక్క యజమానులు మాత్రం జోక్యం చేసుకోకుండా అత్యంత పాశవికంగా నుంచుని చూశారు. పాపం ఆ కుక్క దాడిలో ఆ చిన్నారికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ... రవీందర్ , సౌరభ్‌లను అరెస్టు చేశాం." అని తెలిపారు. (చదవండి: ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్) -
'తాలిబన్ల తల తిక్క నిర్ణయం'
తాలిబన్ల తల తిక్క నిర్ణయాలు అక్కడి ప్రజలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే తాలిబన్ల అరచకాలకు బయపడి ప్రజలు దినదిన గండం నూరేళ్లే ఆయుష్షు అన్న చందంగా మారింది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ వారు తీసుకునే నిర్ణయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం స్థానికంగా బట్టల షాపుల్లో ఉన్న ప్లాస్టిక్ మహిళల బొమ్మల తలల్ని తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆగస్ట్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాలిబాన్లు ప్రజల స్వేచ్ఛని హరించి వేస్తున్నారు. మహిళలు, బాలికల స్వేచ్ఛకు భంగం కలిగేలా పరిపాలిస్తున్నారు. తాజాగా మహిళల ప్లాస్టిక్ బొమ్మలు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న బట్టల షాపు యజమానులకు షాపుల్లో ఉండే మహిళ బొమ్మల తలలను నరికేయాలని ఆదేశించారు. ఇది (ఇస్లామిక్) షరియా చట్టానికి విరుద్ధం. కాబట్టి మహిళల ప్లాస్టిక్ బొమ్మల తలల్ని కత్తిరించాలని షాపుయజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ అధిపతి అజీజ్ రెహ్మాన్ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెప్పారు. The level of backwardness & barberism of #TalibanTerrorists is astonishing. If massacring of our people for past 25 years was not enough, Taliban 2.0 are now also beheading mannequins because they "offend #Islam." #DoNotRecogniseTalibanpic.twitter.com/4y2nCy5T6D@natiqmalikzada — 🇦🇫Afghanistan Fact Checks🔎 (@AfgFactChecks) January 3, 2022 తాలిబన్లు తెచ్చిన కొత్త చట్టం అమల్లోకి రావడంతో కొంతమంది బట్టల షాపుల యజమానులు ప్లాస్టిక్ బొమ్మల తలల్ని కత్తిరించకుండా..స్కార్ఫ్‌లతో దాచే ప్రయత్నం చేశారు. దీనిపై అజీజ్ రెహ్మాన్ స్పందించారు."వారు (షాపుయ జమానులు) కేవలం బొమ్మల తలల్ని కవర్ చేయడమో, లేదంటే ఆ బొమ్మల్ని దాచిపెట్టడమో చేస్తే అల్లా వారి షాపుల్లోకి లేదా ఇళ్లలోకి వెళ్లి వారిని ఆశీర్వదించడు." అని వ్యాఖ్యానించారు. 1990లలో తాలిబన్లు తొలిసారి అధికారంలో ఉండగా రెండు పురాతన బుద్ధ విగ్రహాలను పేల్చిసి ప్రపంచ దేశాల ప్రతినిధుల ఎదుట ఆగ్రహానికి గురయ్యారు. మళ్లీ ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి అనేక ప్రావిన్సులలోని మాధ్యమిక పాఠశాలల నుండి బాలికలను నిషేధించారు. మహిళలు ఎక్కువగా ప్రభుత్వ రంగంలో పని చేయకుండా నిరోధించారు. ప్రభుత్వ పదవుల నుండి మినహాయించారు. గత వారం కాబూల్‌లోని అధికారులు ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మహిళలకు కాకుండా వారి కుటుంబ సభ్యులైన పురుషులకు మాత్రమే ట్రాన్స్ పోర్ట్ అందించాలని ఆదేశించారు. కాగా, ఇలా ప్రతి అంశంలో తాలిబాన్లు తమ మార్క్ పరిపాలన చేస్తుండగా..ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యింది. అమెరికా నుంచి రావాల్సిన బిలియన్ల డాలర్ల సంపద ఆగిపోయింది. మరి భవిష్యత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలనలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు -
‘నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితంలో పిరికివాడు’
సాక్షి, హైదరాబాద్: నాని నటించిన టక్ జగదీష్ ప్రాజెక్ట్‌ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల యజమానులు మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ సినిమా విడుదల అవుతున్న రోజే నాని టక్ జగదీష్ ఓటీటీలో రావడం వల్ల అందరం నష్టపోతామని అన్నారు. రేపు కూడా ఇలానే చేస్తే భవిషత్తులో నిర్మాతలకు తాము డబ్బులు కట్టమని అన్నారు. చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్ పండుగల సమయంలో కొత్త సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని, థియేటర్లో లవ్ స్టోరీ విడుదలకు తెలంగాణ ఎగ్జిబిటర్లుమద్దతు పలికారు. టక్ జగదీశ్ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు, హీరో నానికి భవిషత్తు మేము ఏంటో చూపిస్తామన్నారు, తిమ్మరుసు ఆడియో వేడుకలో హీరో మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఓటీటీ వాళ్ళు రూ. 4 కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు, ‘సినిమా లేకుండా మనం లేమని, సినిమా మన సంస్కృతిలో భాగం నాని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఓటీటీ లో సినిమా చేస్తున్నాడు. హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు’ అని పేర్కొన్నారు. చదవండి: ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్ ఇదిలా ఉండగా నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలతో టాలీవుడ్లో ఓటీటీ, థియేటర్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. -
సమస్యలను పరిష్కరిస్తేనే థియేటర్లను తెరుస్తామంటున్న యజమానులు
-
277 ఫోన్లు: వారి ముఖాల్లో చిరునవ్వులు
సాక్షి, చిత్తూరు : పోగొట్టుకున్న, దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్లను కనుక్కోవటమే కాకుండా తిరిగి వాటిని యజమానులకు అందించి చిత్తూరు పోలీసులు వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. చిత్తూరు పోలీస్ టెక్నికల్ అనాలిసిస్ వింగ్ దాదాపు 277 ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకుంది. దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే ఆ ఫోన్లను సోమవారం యజమానులకు ఇచ్చేసింది. దీనిపై సెల్ఫోన్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు పోలీసుల కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తమ ట్విటర్ ఖాతా వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. A thankful phone owner commends the work done by the police team in retrieving his mobile phone which his father bought for his studies during the pandemic.@NTVJustIn @htTweets @TimesNow @TheHansIndiaWeb @aajtak @PTI_News @newsmint18 @NewsX @MirrorNow @IndiaNews24x7 @BTVI @dna pic.twitter.com/UwtyqxZBa0 — Andhra Pradesh Police (@APPOLICE100) November 30, 2020 -
కిరాణా.. క్యాష్‌లెస్‌కే ఆదరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్న కిరాణా దుకాణాలు.. డిజిటల్ చెల్లింపుల బాటపట్టాయి. వినియోగదారుల కోసం నగదు రహిత (క్యాష్‌లెస్) చెల్లింపులను అందుబాటులో ఉంచుతున్నాయి. దేశ వ్యాప్తంగా కిరాణాల్లో లాక్‌డౌన్‌కు ముందు 35 శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు రెండింతలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వంద మంది ప్రజానీకానికి ఒక దుకాణం అందుబాటులో ఉంది. లాక్డౌన్ సమయంలో దూరపు ప్రయాణాలపై ఆంక్షలు, భౌతిక దూరం వంటి నిబంధనలతో సమీపంలోని చిన్న కిరాణాలపైనే కొనుగోలుదారులు అధికంగా ఆధారపడ్డారు. సూపర్ మార్కెట్లు, మార్ట్‌లకు వెళ్లేందుకు జంకడం, పెద్ద పెద్ద వరుసల్లో నిలుచొని సరుకుల కొనుగోళ్లకు ఆసక్తి చూపక దగ్గర్లోని కిరాణాలవైపే మొగ్గు చూపారు. అయితే అన్ లాక్ ప్రక్రియ తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు కిరాణా దుకాణాల బాటే పట్టారు. మెట్రో పట్టణాల్లో 50 శాతం, చిన్న పట్టణాల్లో 75 శాతం మంది పెద్దపెద్ద మార్కెట్లను కాదని కిరాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వాట్సాప్‌లో ఆర్డర్లు... ఇంటికే సరుకులు... అయితే కొనుగోలుదారుల తాకిడి ఎక్కువ కావడంతో కిరాణా దుకాణ యజమానులకు వైరస్ సోకిన ఉదంతాలు అనేకం. దీన్ని ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానంవైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను గణనీయంగా పెంచారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం, క్యూర్ కోడ్ల ద్వారా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ తరహా చెల్లింపులు కిరాణాల్లో గతంతో 35 శాతం ఉంటే ఇప్పుడు 75 శాతానికి పెరిగాయని బెంగళూర్‌కు చెందిన ఓ సర్వే సంస్థ వెల్లడించింది. కొన్ని నగరాల్లో కిరాణా దుకాణదారులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో నిత్యావసర సరుకుల ఆర్డర్లను మెసేజ్‌లు, వాట్సాప్‌ల ద్వారా తీసుకొని ఇంటికే పంపిణీ చేస్తున్నారు. చిన్నచిన్న పట్టణాల్లో సైతం కాంటాక్ట్‌లెస్ డెలివరీలను అందించేందుకు వీలుగా వాట్సాప్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాయి. మా కిరాణా దుకాణానికి ప్రతిరోజూ 100 మంది కస్టమర్లు వస్తారు. లాక్‌డౌన్‌కు ముందు కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఫోన్ పేలో చెల్లించేవారు. ఇప్పుడు డెబిట్ కార్డు, గూగుల్‌పే, క్యూడర్ కోడ్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. కనీసం 80 మంది ఈ తరహా చెల్లింపులే చేస్తున్నారు. – మధుసూదన్, కిరాణాదారు, మెదక్ పరిశుభ్ర వాతావరణం, ఇంటి పక్కనే ఉండటం, డిజిటల్ లావాదేవీలు చేస్తుండటం, ఎమ్మార్పీ ధరలకే విక్రయాలతో కిరాణా దుకాణాల్లోనే వస్తువులు కొనుగోలు చేస్తున్నా. సూపర్ మార్కెట్ల వైపు చూడటమే మరిచిపోయా. – రామ్మూర్తి, సంగారెడ్డి -
ఆర్టీసీలో అద్దె బస్సు ఓనర్ల గోస
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల వ్యవహారం గందరగోళంగా మారింది. వాటి ఉనికే ప్రశ్నార్థకంలో పడటంతో అవి కొనసాగుతాయా లేదా అన్న అయోమయం నెలకొంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ వసతి కల్పించటంతో పాటు, సొంత బస్సుల రూపంలో ఆర్టీసీపై పడే భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బస్సులు ఇప్పుడు యజమానుల ఇళ్ల ముందు అలంకారప్రాయంగా మారాయి. ఫిబ్రవరి నుంచి వాటికి సంస్థ చార్జీలు నిలిపేయటంతో, వాటి యజమానులు డ్రైవర్లకు జీతాలిచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇక అవి ఆర్టీసీతో కటీఫ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమ్మె తర్వాత ఉత్సాహం.. లాక్‌డౌన్‌తో విలాపం గతేడాది చివర ఆర్టీసీలో సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. అప్పటికే 2 వేల బస్సులుండగా, కొత్తగా మరో 1,300 బస్సులు తీసుకుంది. లాక్‌డౌన్‌కు కొంతకాలం ముందే అవి ఆర్టీసీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈలోపు లాక్డౌన్ ముంచుకొచ్చింది. గతేడాది సమ్మె వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినటంతో ఫిబ్రవరి నెల నుంచి అద్దె బస్సులకు చార్జీలు చెల్లించటాన్ని సంస్థ ఆపేసింది. ఆ నెలలో కేవలం సగం రోజులకే ఇచ్చింది. మిగతా సగాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇక మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రారంభమయ్యే వరకు బస్సులు తిరిగినా నయా పైసా ఇవ్వలేదు. ఇక లాక్‌డౌన్‌తో బస్సులే తిరగకపోవటంతో చెల్లింపులూ లేకుండా పోయాయి. కానీ వాటికి సంబంధించిన డ్రైవర్లకు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ఇటు సంస్థ బకాయిలు చెల్లించకపోవటం, ఆదాయం నయా పైసా లేకున్నా డ్రైవర్లకు జీతాలు చెల్లించాల్సి రావటంతో యజమానులు అయోమయంలో పడ్డారు. దీనిపై చర్చించేందుకు ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు సమయం ఇవ్వటం లేదని తెలుస్తోంది. దీంతో ఇటు ఆర్టీసీ ఎండీ కార్యాలయం, అటు బస్‌భవన్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావటం లేదు. కొత్త బస్సులది మరింత గందరగోళం సమ్మె కాలంలో 1,300 కొత్త బస్సులతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. కానీ అందులో కొన్ని బస్సులు మాత్రమే సంస్థలో చేరగా, మిగతావి లాక్‌డౌన్‌తో నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ బస్సులన్నీ నిరుపయోగంగా యజమానుల ఇళ్ల ముందు మూలుగుతున్నాయి. ఇక నగరంలోనే దాదాపు 480 అద్దె బస్సులున్నాయి. లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి ఇప్పటివరకు అవి తిరగటం లేదు. దీంతో వాటి యజమానులు మరింత నష్టపోయారు. ఇన్ని నెలల కాలానికి సంబంధించి వాటి డ్రైవర్లకు జీతాలు చెల్లించే పరిస్థితిలో లేమని వారు చేతులెత్తేస్తున్నారు. కొందరు బస్సులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బకాయిలే కాదు.. డ్రైవర్లనూ ఆదుకోవాలి.. ‘ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం మా బస్సులు తీసుకున్నారు. సంతోషించే విషయమది. కానీ ఇప్పుడు తీవ్ర నష్టాలొస్తే మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు. సమ్మె కాలంలో ఒక్కో బస్సుపై రూ.80 వేలకు పైగా నష్టపోయాం. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి చార్జీలు ఇవ్వలేదు. ఇప్పటికైనా సంస్థ ఆ బకాయిలు చెల్లించడంతో పాటు లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయి ఉన్నందున మా డ్రైవర్లకు చెల్లించే డబ్బుల్లో కొంత సాయం చేయాలని కోరుతున్నాం. మా గోడు వినేందుకు అధికారులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం ఆవేదన కలిగిస్తోంది..’ – జగదీశ్‌రెడ్డి, అద్దె బస్సుల సంఘం ప్రతినిధి -
యజమానికి ఆకలి తెలుస్తుంది
పెట్ డాగ్‌ను పెంచుకోవాలనే కోరిక ఇటీవల బాగా పెరుగుతోంది. అయితే పెట్‌కి ఎంత ఆహారం పెట్టాలనే కొండంత సందేహం పెట్పేరెంట్ని (పెట్ యజమాని) వెంటాడుతూనే ఉంటుంది. దానికి సమాధానం ఒక్కటే... దాని ఆకలిని బట్టి అది తినగలిగినంత పెట్టడమే. శునకాన్ని పెంచుకోవాలనుకునే వాళ్లు ముఖ్యంగా దానిని ఏ వయసులో పెంపకానికి తెచ్చుకోవాలనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండు నెలల లోపు కుక్కపిల్లను పెంపకానికి తెచ్చుకోకూడదు. అప్పటి వరకు అది తల్లిపాలు తాగాల్సిందే. ఆ తర్వాత పెంపకానికి తెచ్చుకుని మామూలు ఆహారం పెట్టవచ్చు. పెరిగే దశ రెండు నెలల నుంచి ఏడాది లోపు కాలాన్ని పెట్ గ్రోత్ పీరియడ్. ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో పెట్‌కి ఆకలి, అల్లరి రెండూ ఎక్కువే. రెండు నెలలు నిండిన పప్పీకి రోజుకు ఆరుసార్లు ఆహారం ఇవ్వాలి. ఆరు నెలల వయసుకు వచ్చేటప్పటికి మూడుసార్లు పెడితే సరిపోతుంది. ఎనిమిది నెలలు నిండేటప్పటికి రోజుకు రెండుసార్లు తినేటట్లు అలవాటు చేయవచ్చు. ఇది ప్రధానంగా అనుసరించే ఆహారపు వేళలు. అయితే పిల్లలు ఎలాగైతే అందరూ ఒకేలాగ ఉండరు, ఒకేలాగ తినరో... అలాగే పెట్లో కూడా ఒకదానికీ మరొకదానికీ కొద్దిపాటి మార్పులు ఉంటాయి. కుక్కపిల్లను పెంచుకునేటప్పుడు దానికి– యజమానికి మధ్య అనుబంధం పెరుగుతుంది. దాంతో దానికి ఆకలి అయ్యే సమయం, దాని పొట్ట ఎంత పడుతుంది... వంటివన్నీ ‘పెంపుడు’ తల్లిదండ్రులకు అర్థమవుతాయి. -
‘సోషల్’ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తాం
లండన్: సామాజిక మాధ్యమాల్లో ప్రమాదకరమైన సమాచారం వస్తే ఆయా సంస్థల యాజమాన్యాన్ని ఇందుకు బాధ్యులుగా చేస్తామని బ్రిటన్ హెచ్చరించింది. విద్వేష నేరాలు, దూషణలకు సంబంధించి ఫేస్బుక్ సహా పలు సోషల్‌మీడియా సంస్థల అధినేతలతో చర్చించిన అనంతరం కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను ప్రకటించింది. ఈ తరహా యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించడం ప్రపంచంలో ఇదే తొలిసారని బ్రిటన్ సాంస్కృతిక, మీడియా మంత్రి జెరిమీ రైట్ తెలిపారు. ఇందులో భాగంగా విద్వేష సమాచారం, ప్రమాదకరమైన వీడియోలను కంపెనీలు బాధ్యతగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన సోషల్‌మీడియా సంస్థలకు తొలుత హెచ్చరికలు జారీచేస్తామన్నారు. ఆ తర్వాత ఆయా సంస్థల్లోని సీనియర్ మేనేజర్లకు జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదుచేస్తామన్నారు. చివరగా సంబంధిత ప్లాట్‌ఫామ్‌ను దేశంలో నిషేధిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఓ స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైట్ అన్నారు. -
కార్డుల్లేవ్!
షాద్‌నగర్‌టౌన్: వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న తర్వాత స్మార్ట్ ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డును వాహనదారులకు జారీ చేసే ప్రక్రియ పలుచోట్ల నిలిచిపోయింది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు అందడం లేదు. లైసెన్స్‌లు పొందినా కార్డులు లేకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండా వాహనాలను నడిపేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ ప్రాంతాలకు సంబంధించిన సుమారు 50 వేల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు పెండింగ్‌లో ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా స్మార్టు కార్డుల ముద్రణ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్మార్టు కార్డులు అందుబాటులో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయాల్లో కార్టుల ప్రింటింగ్ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. షాద్‌నగర్‌లో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయంలో కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, కడ్తాల్, ఆమనగల్లు మండలాలకు చెందిన వారు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. ఈ కార్యాలయంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరైనా వాటికి సంబంధించిన కార్డులు మాత్రం ఆరు నెలల నుంచి జారీ కావడం లేదు. దీంతో 2,804 ఆర్సీ కార్డులు, 1,225 డ్రైవింగ్ లైసెన్సుకార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్సీ కార్డులోనే వివరాలు వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్సీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. ఆర్సీ కార్డులు లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. కొందరైతే నెలల తరబడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మరి కొందరు సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాల్లో వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో వాహనం కొనుగోలు చేసినా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసినా కార్డులు లేకపోవడంతో వాటిని తిప్పలేకపోతున్నామంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వాహనాలను తీసుకెళ్లినప్పుడు అక్కడి పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని, లేదంటే.. వాహనాన్ని వదిలి పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రింటర్లు పనిచేయకపోవడంతోనే.. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీచేసేందుకు రవాణా శాఖ వద్ద ప్రత్యేకమైన ప్రింటర్లు ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తున్నాడు. వాహనదారుడి వివరాలను కార్డుపై ముద్రించి ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సును పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో పాటు రూ.250 సేవా రుసుము ముందే చెల్లిస్తారు. అయితే, షాద్‌నగర్ రవాణా శాఖ కార్యాలయంలో కార్డుల ప్రింటింగ్‌కు సంబంధించిన యంత్రం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అత్తాపూర్‌లో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో షాద్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన కార్డులను ప్రింటింగ్ చేయాల్సి వస్తుంది. అత్తాపూర్ కార్యాలయంలో ఉన్న ప్రింటింగ్ కూడా సరిగా పని చేయకపోవడంతో అత్తాపూర్ పరిధిలోకి వచ్చే మండలాలకు సంబంధించిన కార్డుల జారీ ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా నిలిచిపోయాయి కార్టులు జారీ ప్రక్రియ నిలిచిపోయి సుమారు ఆరు నెలలు కావస్తోంది. వాహనదారులు తమ సమస్యలను ఆర్టీఏ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పోలీసు అధికారుల తనిఖీల్లో వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ చూస్తున్నారని, అయితే కార్డులు లేకపోవడంతో వారు జరిమానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఎం వాలెట్ పద్ధతి ద్వారా స్మార్ట్ ఫోన్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు చూసుకునే అవకాశం ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది స్మార్టు ఫోన్లు లేకపోవడం, ఎం వాలెట్ విధానం గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వెంటనే కార్డులు జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వెంటనే జారీ చేయాలి డ్రైవింగ్ లైసెన్సు కోసం సుమారు మూడు నెలల కింద దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు డ్రైవింగ్ లైసెన్సు కార్డు పోస్టు ద్వారా వస్తుందని చెప్పారు. కానీ నేటి వరకు రాలేదు. వాహనాన్ని బయటికి తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారని భయమేస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు కార్డు ఉంటే ఇబ్బందులు ఎదురుకావు. కార్డులను జారీ చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. – సాయికుమార్, విఠ్యాల, ఫరూఖ్‌నగర్ -
ఉబెర్, ఓలాకు డ్రైవర్ ఓనర్ల గుడ్‌బై!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాక్సీ అగ్రిగేటర్లు ఉబెర్, ఓలాకు డ్రైవర్ ఓనర్లు గుడ్‌బై చెబుతున్నారు. బుకింగ్‌లు తగ్గడం, రాబడి విషయంలో కంపెనీ హామీ ఇచ్చిన మొత్తం రాకపోవడంతో ట్యాక్సీ సేవల నుంచి వీరు తప్పుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఐటీ కంపెనీలకు కారును లీజుకిచ్చేవారు, రెంటల్స్‌కు నడుపుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్య గణనీయంగా పెరిగింది కూడా. బుకింగ్‌ల విషయంలో తాను లీజుకిచ్చిన వాహనాలకు ఓలా అధిక ప్రాధాన్యమిస్తూ డ్రైవర్ ఓనర్లకు బుకింగ్‌లు పెద్దగా ఇవ్వటం లేదని, ఇక ఇన్సెంటివ్‌లు దాదాపు కనుమరుగయ్యాయని... అందుకే తాము తప్పుకోవాల్సి వస్తోందని వీరు చెబుతున్నారు. ట్రిప్పులు లేక ఇన్సెంటివ్‌లు జీరో... తొలినాళ్లలో కస్టమర్ ఇచ్చే మొత్తం కాకుండా ఇన్సెంటివ్ రూపంలో డ్రైవర్ ఓనర్లకు 10 ట్రిప్పులకు గాను ఓలా రూ.5,000 నగదును చెల్లించింది. ఉబెర్ ఒక ట్రిప్పుకు రూ.250 అందించింది. ఈ స్థాయి ప్రోత్సాహకాలను చూసి వేల మంది కార్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రోత్సాహకాల కింద ఇచ్చే నగదు భారీగా తగ్గడంతోపాటు, అవి అందుకోవడానికి చేయాల్సిన ట్రిప్పులు పెరిగి తలకు మించిన భారమయ్యాయి. దీంతో అదనపు ఆదాయం దాదాపు లేనట్టేనని శ్రీనివాస్ అనే డ్రైవర్ ఓనర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఏడాదిన్నర కిందట డ్రైవర్ జీతం రూ.15 వేలుంటే, ఇప్పుడు రూ.18 వేలకు చేరింది. డీజిల్ లీటరుకు రూ.10 పెరిగింది. ట్యాక్సీలు ఎక్కువై డిమాండ్ పడిపోయింది. ట్రాఫిక్ రోజు రోజుకూ అధికం కావడం కూడా మా సమస్యను పెంచింది’ అని చెప్పారాయన. రుణాలు చెల్లించలేక.. ఒకానొక దశలో హైదరాబాద్‌లో ఉబెర్, ఓలా వద్ద దాదాపు 75,000 వాహనాలు తిరిగాయని తెలంగాణ క్యాబ్స్, బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిజాముద్దీన్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రస్తుతం సగం మంది బయటకు వచ్చారని తెలిపారు. ‘అప్పులు చేసి మరీ చాలామంది కార్లను కొనుక్కున్నారు. ఆదాయాలు లేక డ్రైవర్ ఓనర్లు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించలేకపోతున్నారు. వేల వాహనాలను బ్యాంకులు తీసుకెళ్లిపోయాయి. ఇపుడు ఉబెర్, ఓలాకు ట్యాక్సీ నడపాలనుకుంటున్న అభ్యర్థులకు బ్యాంకులు రుణాలివ్వటం లేదు. దీంతో చాలా మంది కార్లను అమ్మేసి డ్రైవర్లుగా మారారు’’ అని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా సమ్మె! ఈ ఆదివారం (మార్చి 18) అర్థరాత్రి నుంచి ఉబెర్, ఓలా డ్రైవర్ ఓనర్లు సమ్మెకు దిగుతున్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఈ రెండు కంపెనీలు సర్వీసులందిస్తున్న నగరాల్లో సమ్మె ఉంటుందని సమాచారం. తమ డిమాండ్లకు యాజమాన్యాలు దిగిరాకపోతే సమ్మెను కొనసాగించాలని యూనియన్లు భావిస్తున్నాయి. కంపెనీల నుంచి నగదు ప్రోత్సాహకాలు తగ్గడమే సమ్మెకు ప్రధాన కారణం. వాహనాలను ఇబ్బడిముబ్బడిగా నమోదు చేస్తుండడంతో ట్రిప్పులు లేక ఆదాయాలు పడిపోతున్నాయని డ్రైవర్ ఓనర్లు చెబుతున్నారు. -
వృత్తి పన్ను ఎగనామం
సాక్షి, అమరావతి బ్యూరో: వాణిజ్య సముదాయాలకు చెందిన యజమానులు పలువురు వృత్తి పన్ను ఎగ వేస్తున్నారు. భవనాలు, ఖాళీ స్థలాలను కొంతమంది యజమానులు వాణిజ్య అవసరాల కోసం అద్దెకు ఇస్తారు. అయితే డాక్యుమెంట్ భవన యజమానుల పేరుతో ఉంటాయి. కనుక కేటగిరీ–2 కింద వీరి పేరుతోనే విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. ఈ లెక్కన జిల్లాలో 1.80 లక్షల మంది వాణిజ్య కనెక్షన్లు తీసుకొన్నారు. వాణిజ్య సముదాయం కలిగిన భవన యజమాని ఏపీ ప్రొఫెషనల్ టాక్స్(ఏపీటీటీ) యాక్టు ప్రకారం ఏడాదికి రూ. 2500 వృత్తి పన్ను చెల్లించాలి. దీని ఆధారంగా విజిలెన్స్ శాఖ వృత్తి పన్ను చెల్లింపులపై ఆరా తీసింది విజిలెన్స్ విచారణ.. దీనిపై సమగ్ర విచారణ జరిగింది. రూ.91 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి నేతృత్వంలో విచారణ జరిపి నివేదిక పంపినట్లు సమాచారం. నోటీసులు పంపి పన్ను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. లెక్క ఇదిగో.. ♦ జిల్లాలో వాణిజ్య అవసరాల కోసం విద్యుత్తు కనెక్షన్లు తీసుకొన్న యజమానులు 1.50 లక్షల మంది. ఇందులో ప్రభుత్వ భవనాలు,దేవాలయాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల సంఖ్య 15,000. ♦ సొంతంగా లైసెన్సు తీసుకొని వ్యాపారం చేసే వారి సంఖ్య15,000. ♦ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించకుండా ఆగినవి, డబుల్ ఎంట్రీలు కలిపి ఉన్న కనెక్షన్లు 40 వేలు ♦ మిగిలిన వాణిజ్య సముదాయ కనెక్షన్లు 80 వేలు. ♦ వృత్తి పన్ను ఎగవేసినట్లు గుర్తించినది రూ.91 కోట్లు. -
రెంట్‌కు ఆశపడితే వారెంటే..
♦ అధిక అద్దెలు భద్రతకు ముప్పు ♦ అధిక అద్దెలకు ఆశపడితే దగా తప్పదు ♦ చిరుద్యోగులే నిజాయితీ పరులు, నమ్మకస్తులు ♦ యజమానులూ జాగ్రత్త సుమా! తిరుపతి ఎమ్మార్పల్లెలో ఉంటున్న పురుషోత్తం ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 2005లో తన జీతానికి తగినట్లుగా సింగిల్ బెడ్రూం ఇంటిలో భార్యతో కలిసి అద్దెకు దిగారు. అప్పట్లో నెలకు రూ.2000 చొప్పున అద్దె చెల్లించేవారు. ప్రతి నెలా 6వ తేదీన అద్దె చెల్లిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లతోనూ ఎలాంటి గొడవలూ లేవు. 13 ఏళ్లుగా అదే ఇంటిలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన చెల్లిస్తున్న అద్దె నెలకు రూ.3500. ఇప్పుడు ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇల్లు ఇరుకుగా ఉన్నప్పటికీ సర్దుకుని పోతాం కానీ.. వేరే ఇంటికి వెళ్లే ఉద్దేశం మాత్రం లేదంటున్నారు. ఆ యజమాని కూడా అద్దె తక్కువైనా వారి వల్ల మాకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. అసలు ఆ ఇంటి గురించి ఆలోచించే అవసరమే రాలేదంటున్నారు. రాజీవ్ గాంధీ కాలనీలో ఓ భవన యజమాని సుబ్రమణ్యం తన డబుల్ బెడ్రూం ఇంటిని 2015 వరకు రూ.6 వేలకు అద్దెకు ఇచ్చాడు. మార్చి 2015లో అద్దెను రూ.10 వేలు చేశాడు. ఒకాయన వచ్చి ఇంటిని చూసిన వెంటనే అడ్వాన్సు ఇచ్చి వెళ్లాడు. నెల నెలా రూ.10వేలు అద్దె వస్తుండడంతో, మరుసటి ఏడాది 12 వేలు చేశాడు. అయినా అద్దె నెల నెలా వచ్చేస్తోంది. ఇక వచ్చే ఏడాది 15 వేలు చేద్దామని అనుకున్నాడు. అంతలోనే ఒక రోజు తెల్లవారుజామున అద్దెకు ఇచ్చిన ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అప్పటివరకు నెల నెలా అద్దె ఇచ్చిన వ్యక్తి మాయమయ్యాడు. పోలీసులు యజమానిని అదుపులోకితీసుకున్నారు. తిరుపతి క్రైం : జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్ల యజమానులు అధిక అద్దెలకు ఆశపడి మోసపోతున్నారు. అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఆ సొమ్మును అద్దె రూపంలో తొందరగా వసూలు చేసుకోవాలనుకుంటారు. మరికొందరు ఆ ప్రాంతాన్ని బట్టి అద్దెను పెంచుతుంటారు. మరి కొందరు యజమానులు వారి అవసరాలను బేరీజు వేసుకుని అద్దె వసూలు చేస్తుంటారు. ఇలా అద్దె వసూలుపై దృష్టి పెట్టే యజమానులు ఇంటిలో చేరిన వాళ్లపై పెట్టడం లేదు. ఫలితంగా ఆ ఇళ్లలో హత్యలు, వ్యభిచారం, ఆత్మహత్యలు వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి సంఘటనల తరువాత యజమానులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగిన ఇళ్లల్లో ఎవరూ చేరడానికి ముందుకు రారు. ఒక వేళ విషయం తెలియకుండా చేరినా చుట్టుపక్కల వాళ్లు చెప్పిన తరువాత ఆ ఇంటిలో ఉండడానికి ఇష్టపడరు. అప్పుడు యజమానులు సంవత్సరాలపాటు అద్దెను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే యజమానులు అధిక అద్దెలకు ఆశపడకుండా ఇళ్లల్లో చేరే వ్యక్తులు ఎలాంటివాళ్లో తెలుసుకోవాలి. వీలైతే వారి గత చరిత్రను కూడా తెలుసుకోవాలి. అద్దె కోసం కక్కుర్తి వద్దు ⇔ అద్దెకు దిగేవాళ్లు అద్దె కాస్త తగ్గించమని అభ్యర్థిస్తున్నారంటే వారు మధ్య తరగతికి చెందినవారుగా పరిగణించవచ్చు. ⇔ వారు అదే ప్రాంతంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేస్తుంటే ఆ ఇంట్లో ఎక్కువ కాలం వారు అద్దెకు ఉంటారని భావించవచ్చు. ⇔ ఆ ఇంటి చుట్టుపక్కలున్న విద్యా సంస్థల్లో వారి పిల్లలు చదువుతుంటే అలాంటి వాళ్లకు నిర్భయంగా అద్దెకు ఇవ్వవచ్చు. ఎందుకంటే వారి అసలు వివరాలు ఆ స్కూలు రికార్డుల్లో ఉంటాయి. ⇔ అద్దె చెప్పగానే ఎంతైనా ఓకే అంటూ అడ్వాన్సు ఇస్తున్నారంటే, వాళ్ల గురించి మరో సారి ఆలోచించాలి. అద్దె ఎక్కువ వస్తుందనుకుంటే కష్టాలు తప్పవు. ⇔ వారు ఉపయోగించే వాహనాల నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు వంటివి సేకరించాలి. ⇔ కొంత మంది ధనవంతుల ఇళ్లను గమనించి ఖాళీ అయిన సమయంలో అద్దెకు దిగుతారు. ఇంటి యజమానితో ఆప్యాయంగా ఉన్నట్లుగా నటించి, ఎవరూ లేని సమయంలో వారిని చంపో, బెదిరించో వారి నగదును దోచుకుని పరారవుతారు. ⇔ హైటెక్ మోసగాళ్లు ఉన్నందున యజమానులు మరింత అప్రమత్తంగా ఉం డాలి. అద్దెకు దిగేవారు గుర్తుంచుకోండి ⇔ తరచూ ఒక ఇంటికి టులెట్ బోర్డు వేలాడుతోందంటే.. ఆ ఇంటిలో ఏదో లోపం ఉందని గుర్తించండి. ⇔ ఎక్కువ కాలం ఆ ఇల్లు ఖాళీగా ఉందంటే ఏదో సమస్య ఉంటుందని భావించాలి. చుట్టుపక్కల వారిని విచారిస్తే తెలిసే అవకాశం ఉంటుంది. ⇔ చాలా ఇళ్లలో యజమానులు సవాలక్ష షరతులను విధిస్తుంటారు. అలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. ⇔ ప్రధానంగా నీటి సమస్య ఏదైనా ఉందేమో తెలుసుకోవాలి. ⇔ అది లోతట్టు ప్రాంతమైతే వర్షా కాలంలో ఇబ్బందులు తప్పవని గ్రహించాలి. ⇔ ఆ వీధిలో కానీ, ఆ ప్రాంతంలో కానీ తరచూ గొడవలు లాంటివి ఏవైనా జరుగుతున్నాయా? ఏ నేపథ్యంలో జరుగుతున్నాయో కూడా తెలుసుకోవడం మంచిది. ⇔ ఆ ప్రాంతంలో చోరీలు జరుగుతున్నాయా, రాత్రుల్లో రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుందా లేదా వంటివి ముందే తెలుసుకోవడం మంచిది. ⇔ సాధారణంగా ప్రధాన రోడ్ల పక్కన ఉండే ఇళ్లకు అద్దె ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి అలాంటి ఇళ్లలో ఉండే వారు రణగొన ధ్వనులతోపాటు, సమ్మెలు, బంద్‌లు వంటి సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ⇔ కాస్త లోపలకు ఉన్న ఇళ్లయితే అద్దె తక్కువతోపాటు కాస్త ప్రశాంతతకు అవకాశం ఉంటుంది. ⇔ అన్నీ ముందే తెలుసుకుని తరువాతే ఇంట్లో దిగడం మంచిది. తరచూ ఇళ్లు మారాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. యజమానులదే బాధ్యత అధిక అద్దెలకు ఆశపడి మోసగాళ్లకు ఇళ్లు ఇచ్చి వారు పరారైపోతే యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తుంటే యజమానులు గుర్తించాలి. అందుకే అద్దెకు వచ్చినవారి గురించి తెలిసిన వారితో వాకబు చేసి వీలైనంత వరకు వారి వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవాలి. ముఖ్యం గా గుర్తింపుకార్డు జిరాక్స్ తీసుకోవాలి. వారి ఆధార్ జిరాక్స్ ఉంటే చాలు. వారి వివరాలు తెలిసినట్లే. వారు ఉపయోగించే కార్లు, ద్విచక్ర వాహనాల నంబర్లు వేరుగా రాసుకుని ఉంచుకోండి. వారి కదలికను గమనించండి. ఏమాత్రం తేడా వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. – మునిరామయ్య, ఈస్ట్ సబ్ డివిజినల్ డీఎస్పీ -
డిగ్రీ పరీక్షలు బాయ్‌కాట్..
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. అమలు మాత్రం జరగలేదని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 నుంచి అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలను బాయ్‌కాట్ చేస్తున్నాన్నట్లు ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పటివరకు బకాయిలు తమకు అందలేదని డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం వెల్లడించింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
లారీలు అనుమతించాలంటూ ధర్నా
దామరచర్ల(నల్గొండ జిల్లా): ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక లారీలను తెలంగాణలోకి అనుమతించనందుకు నిరసనగా రెండు రాష్ట్రాల సరిహద్దులోని వాడపల్లి కృష్ణా వంతెనపై ఇసుక లారీల యజమానులు, కార్మికులు బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ లారీలను తెలంగాణలోకి అనుమతించకపోవడం దారుణమని వారు చెబుతున్నారు. -
బస్సుల అద్దెలు సకాలంలో చెల్లించాలి
ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ హన్మకొండ: ఆర్టీసీ అద్దె బస్సులకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్కం ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో నెలకు రెండు సార్లు చెల్లించే అద్దె బిల్లులను ఆర్టీసీ డిపోల్లో డీజిల్ పోసుకుంటున్న నాటి నుంచి నెలకోసారే చెల్లిస్తున్నారన్నారు. ప్రతి నెల 6లోగా అద్దెను చెల్లించాలన్నారు. బీఎస్–4 ఇంజిన్ బస్సులనే నడపాలనే నిబంధన అద్దె బస్సు యజమానులకు భారంగా మారిందన్నారు. కాలం చెల్లిన 507 బస్సుల స్థానంలో పాత వారికే మళ్లీ బస్సులు పెట్టుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జగన్, ఎం.అశోక్‌రెడ్డి, మారపల్లి రాంరెడ్డి, మధుకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, హాబీబుద్దీన్, ఎ.సమ్మిరెడ్డి పాల్గొన్నారు. -
కాలేజీ యజమానుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు
వినుకొండ రూరల్/వినుకొండ టౌన్ : ఎస్ఎస్సీ ప్రవేశాల్లో అక్రమాలకు పాల్పడుతున్న బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌కు మధ్యవర్తిత్వం వహిస్తూ ఏసీబీకి పట్టుబడిన వివేకానంద విద్యాసంస్థల అధినేత సయ్యద్ రఫీ కళాశాల, నివాస గృహాల్లో ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం తనీఖీలు చేపట్టారు. ఈనెల 2న ఏసీబీ అధికారులు సోదాల నిమిత్తం వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. హైదరాబాద్ నుంచి రఫీ కుమారుడు రసూల్ నివాసానికి వచ్చారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు గురువారం తిరిగి తనిఖీలు చేపట్టారు. సయ్యద్ రఫీ నివాస గృహం, ఎస్ఆర్ బీఈడీ కళాశాలలో గుంటూరు ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా, వినుకొండ బీఈడీ∙కళాశాల డైరెక్టర్ చీతిరాల రామారావు నివాసంలో హైదరాబాద్ ఏసీబీ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. రామారావు ఇంట్లో ఏవిధమైన ఆధారాలు లభించకపోవడంతో అధికారులు సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. రఫీ నిర్మించుకున్న విలాసవంతమైన నివాసం చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఫస్ట్ఫోర్్లలో గదుల మొత్తాన్ని తనిఖీ చేశారు. గదుల్లోని సూట్‌కేసులను స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసుల్లో భారీఎత్తున నగదును ఉంటుందని అధికారులు భావించి సిబ్బందితో రెండో ఫ్లోర్‌కు తరలించి తెరచి చూడగా ఖాళీ సూట్‌కేసులు దర్శనమిచ్చాయి. రెండో ఫ్లోర్‌లోని రఫీ బెడ్రూమ్ను క్షుణ్ణంగా పరిశీలించినా ఏ ఆధారాలు లభించలేదు. ఎస్ఆర్ బీఈడీ కళాశాలలోని రఫీ సొంత కార్యాలయం తాళాలు తీయించి నిశితంగా పరిశీలించగా విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఎక్కడెక్కడ ఏ కళాశాలలు స్థాపించింది వాటిలో పొందుపరచినట్టు సమాచారం. ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌కు సంబంధించిన ఆధారాలు కూడా ఎస్ఆర్ బీయిడీ కళాశాలలో లభించడంతో వీరి మధ్య తతంగం ఎప్పటి నుంచి సాగుతుందోనని అధికారులు కూపీ లాగేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. రాత్రి 7గంటల వరకు తనిఖీలు కొనసాగగా... మొత్తం పూర్తయిన అనంతరం వివరాలు మీడియాకు అందజేస్తామని ఏసీబీ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. ఇవేం తనిఖీలు... సాధారణంగా ఏసీబీ అధికారులు గుట్టుగా రావడం, సోదాలు చేయడం జరుగుతుంది. కానీ, రెండురోజులు సమయమిచ్చి మరీ సోదాలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఈ నెల 2వ తేదీన వివేకానంద బీఈడీ ఎడ్యుకేషనల్ సోసైటీలో సోదాలు నిర్వహించటానికి ఏసీబీ అధికారులు వచ్చారు. అయితే కుటుంబసభ్యులు అందుబాటులో లేరు, తదితర కారణాలతో ఆవరణలోనే ఉన్న రఫీ ఇంటికి, కార్యాలయానికి, రఫీ పర్సనల్ గదికి తహశీల్దార్ నాగూల్ సింగ్ సమక్షంలో పంచనామా నిర్వహించి సీల్ వేశారు. ఇదంతా మీడియా సాక్షిగా నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత ఏమైందో ఏమో గాని అందరి సమక్షంలో వేసిన సీళ్లను తొలగించి సిబ్బంది వచ్చినప్పుడు కబురు చేస్తే మేము వచ్చి సోదాలు నిర్వహిస్తామని ఉదారత వ్యక్తం చేయటం విమర్శలకు దారితీసింది. తీరిగ్గా కళాశాల యజమానులు వచ్చాకా, గురువారం ఏసీబీ అధికారులు కళాశాల వద్ద, ఇదే కేసులో మరొక నిందితుడిగా ఉన్న చీతిరాల రామారావుల ఇళ్లను సోదాలు చేశారు. ఈ వైనాలు చర్చకు దారితీశాయి. అవినీతిని వెలికి తీయాలి... మూడు దశాబ్దాల క్రితం నాలుగు అద్దెగదుల్లో ఏర్పాటు చేసిన స్కూల్ యజమాని నేడు రూ. 150 కోట్లకు పడగలెత్తటం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రం మొత్తం మీద 23 బీఈడీ, రెండు ఫార్మసీ కాలేజీలకు యజమానిగా రఫీ మారటం వెనక జరిగిన అవినీతిని వెలుగుతీయాలని పలువురు కోరుతున్నారు. కొందరు విద్యాశాఖాధికారులకూ రఫీ అక్రమాలలో వాటాలున్నాయనే ఆరోపణలూ వస్తున్నాయి. -
ఎక్సైజ్ వర్సెస్ వైన్స్‌షాప్ యజమానులు
జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ ప్రభుత్వానికి రూ. 4 కోట్ల నష్టం రెండుగా చీలిపోయిన ఎక్సైజ్ సిబ్బంది ఖమ్మంక్రైం : ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుందో ఏమోగానీ...వారి తీరును నిరసిస్తూ ఒక్కసారిగా శుక్రవారం జిల్లావాప్యంగా వైన్స్‌షాప్ యజమానులు మద్యం దుకాణాలు బంద్ చేశారు. పనిలోపనిగా ఎక్సైజ్ సిబ్బంది కూడా రెండుగా చీలిపోయింది. మూడునెలలుగా ఎక్సైజ్ అధికారులు... వైన్స్ యజమానుల మధ్య ప్రచ్ఛన్నయుద్దం నడుస్తోంది. జిల్లాలో 147 మద్యం దుకాణాలకు పది నెలల క్రితం టెండర్లు ఆహ్వానించారు. ఆ ప్రక్రియ అంతా ముగిశాక వైన్‌షాపులను కేటాయించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర డైరెక్టర్‌గా అకున్‌సబర్వాల్ ఆ సమయంలో బాధ్యతలు స్వీకరించారు. వచ్చిరాగానే రాష్ట్రవ్యాప్తంగా ఎంఆర్పీ కంటే వైన్‌షాపుల్లో మద్యం ఎక్కువ ధరకు విక్రయించినా, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కేసులు నమోదు చేయమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది ఆ శాఖలో కొందరికి మింగుడుపడలేదు. మూడునెలల క్రితం అకున్ సబర్వాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ అయ్యారు. అయినా చాలాచోట్ల ఎంఆర్పీకే మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే ఇటీవలికాలంలో ఎక్సైజ్ సిబ్బంది మద్యం దుకాణాలపై తరచుగా కేసులు చేయడం మెుదలుపెట్టింది. సాంకేతికపరమైన కేసులు అంటే... రిజిస్టర్లో సరుకు రాయకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సమయం వైన్‌షాపులను తెరచి ఉంచడం వంటి కేసులను పెట్టడం ప్రారంభించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణందారులంతా ఒక్కటై పలుమార్లు సమావేశమయ్యారు. రెండుగా చీలిన ఎక్సైజ్ సిబ్బంది.. జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది రెండువర్గాలుగా చీలినట్లు సమాచారం. ఓSవర్గం వైన్‌షాపుల వైపు ఉండగా.. మరోవర్గం ఓ ఉన్నతాధికారి వైపు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ, కొంతమంది వైన్‌షాపుల యజమానులకు మద్దతు తెలపడంతోపాటు మీ పట్ల ఓ ఉన్నతాధికారి వర్గం కేసులు పెడుతున్నారు.. దీనిని ఎలాగైనా ఎదుర్కోవాలంటే వైన్‌షాపులు మూసివేయాలని సలహాలు సైతం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మద్యం వ్యాపారులంతా ఏకమయ్యారు. రూ.4 కోట్ల ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం.. ఎక్సైజ్ శాఖ సిబ్బంది తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ శుక్రవారం మద్యం వ్యాపారులు జిల్లావ్యాప్తంగా దుకాణాలు బంద్ చేయడంతో రూ.4కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఇదేవిధంగా కొనసాగితే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి గండిపడే అవకాశం ఉంది. ఎక్సైజ్‌మంత్రి దృష్టికి పంచాయితీ . జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది, వైన్‌షాపు వ్యాపారుల మధ్య జరుగుతున్న వ్యవహారం ఆ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ దృష్టికి చేరింది. ఓ ఉన్నతాధికారి తమను అన్యాయంగా వేధిస్తూ.. తమ దుకాణాలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని.. దీనిని పరిష్కరించకపోతే తాము నిరవధికంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తామని జిల్లా వైన్స్ వ్యాపారులు మంత్రిని కలిసి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ముందుముందు ఇది ఎంతవరకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందేనని కొంతమంది ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు అంటున్నారు. -
పెట్రోల్ బంక్ యజమానుల సమ్మె విరమణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకు యజమానులు బంద్ విరమించుకున్నారు. దీంతో గురువారం రాత్రి నుంచి బంక్ లు తిరిగి పనిచేయనున్నాయి. వ్యాట్ తొలగింపు పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వారికి హామీ ఇచ్చారు. పెట్రోల్ బంకు యజమానుల సంఘం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. -
అంతా భ్రమే.. మీపై అస్సలు ఆధారపడవట
లండన్: సాధారణంగా పెంపుడు జంతువులను పెంచుకునేవారు తాము లేకుంటే అవి అస్సలు ఉండలేవని అనుకుంటుంటారు. తాముంటే చాలా రక్షణగా ఉంటుందని భావిస్తాయని ఫీలవుతారు. అయితే, అలా అనుకోవడం భ్రమే అవుతుందని, వాస్తవానికి పెంపుడు జంతువులకీ యజమానులపై ఆధారపడే ఉండాలన్న ఆలోచన ఉండదని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ ప్రవర్తన పరిశీలన శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా కొందరు ఇంట్లో పెద్దవారుంటే భద్రతగా ఉంటుందని, స్నేహితులు ఉంటే భద్రతగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ, ఇలాంటి అంశాలు పెంపుడు జంతువులతో పోల్చినప్పుడుమాత్రం పూర్తి వైవిధ్యం ఉంటుందని చెప్పారు. పిల్లులుగానీ, కుక్కలుగానీ ఎప్పటికప్పుడు స్వయంగా మనగలిగే శక్తిని కలిగిఉంటాయని వారు వివరించారు. ఒకరిపై ఆధారపడి ఉండాలనే ఆలోచనవాటికి ఏమాత్రం ఉండదట. -
బకాయి @19 కోట్లు
- నామమాత్రంగా వాహన పన్ను వసూళ్లు - మొక్కుబడిగా దాడులు.. దృష్టి పెట్టని రవాణాశాఖ ఖమ్మం క్రైం: వాహన పన్ను చెల్లించని యజమానులపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని కూడా సూచించింది. కానీ జిల్లా ఆర్టీఏ అధికారులకు మాత్రం ఇదేది పట్టడం లేదు. ఇప్పటి వరకు సరైన దృష్టి పెట్టడం లేదు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం పన్ను చెల్లించాల్సిన వాహన యూజమానులు 11వేల మంది ఉండగా రూ.19 కోట్ల ఆదాయం వసూలు కావాల్సి ఉంది. వీటిలో నిరుపయోగంగా ఉన్న వాహనాలు ఎన్ని, కండీషన్లో వున్న వాహనాలు ఎన్ని తమకు ఓ నివేదికను అందజేయాలని కూడా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు జిల్లా రవాణాశాఖ సిబ్బంది దీనిపై ఎటువంటి నివేదికనూ తయూరు చేయలే దు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రోడ్డు రవాణశాఖ జారుుంట్ కమిషనర్ పాండురంగారావు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ట్యాక్స్ పేమెంట్‌పై గురువారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. మొక్కుబడిగా.. ఇటీవల జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఆర్టీవో ఆధ్వర్యంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పన్నులు వసూలు కాని ప్రాంతాల్లో అదనపు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ సిబ్బంది సహకారం కూడా తీసుకోవాలని నిర్ణరుుంచారు. కనీసం వాహన యజమానులకు నోటీసులు సైతం జారీ చేయకపోవడంతో పన్నులు చెల్లింపునకు ఎవరూ ముందుకు రావడం లేదు. సెప్టెంబర్ 30 నాటికి వాహన పన్ను స్వచ్ఛందంగా చెల్లిస్తే జరిమానా నుంచి బయటపడవచ్చని రాష్ట్ర రవాణశాఖ సూచించింది. ఒకవేళ పన్ను చెల్లించకుండా తనిఖీ సమయంలో పట్టుబడితే 200 శాతం అదనపు జరిమానా విధించాలని కూడా నిర్ణరుుంచింది. జిల్లా వ్యాప్తంగా పన్ను చెల్లించాల్సిన 11వేల వాహనాలను గుర్తించగా వాటిలో ఈనెల 17 నుంచి ఇప్పటి వరకు 510 మంది వాహన యజమానులు మాత్రమే పన్ను చెల్లించారు. అయినా ఆర్టీవో సిబ్బంది మేల్కోవడం లేదు. స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా పన్నుల వసూళ్లపై స్పెషల్‌డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. పన్ను చెల్లించని వాహ నాలు 11వేలు ఉన్నట్లు గుర్తించాం. వాటిలో ఎన్ని వాహనాలు కండీషన్లో ఉన్నాయో తెలియడం లేదు. దీని మీద నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. కండీషన్ లేని వాహనాల యజమానులు ఆర్టీవో కార్యాలయానికి తెలియజేయూలి. - మోమిన్, ఆర్టీవో -
బ్రాందీ కోసం గాంధీ మాయం..!
సాక్షి, గుంటూరు: బ్రాందీ షాపు ముందు గాంధీ విగ్రహం ఉండడంపై విమర్శలు రావడంతో గాంధీ విగ్రహాన్నే అక్కడ లేకుండా చేసేశారు. బార్ షాపు యజమానులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో తమ చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే గాంధీని మాయం చేయగలిగారు. జాతిపిత విగ్ర హం అని తెలిసినా అధికారులు ఏమాత్రం ఆలోచించలేదు. గాంధీ విగ్రహాన్ని తీసుకువెళ్లి ఆయన పేరుతోనే ఏర్పాటు చేసిన గాంధీ పార్కులో ఉంచారు. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని పట్టాభిపురం జూట్‌మిల్లు పక్కనే ఉన్న ఓ బార్ షాపు ఎదురుగా అనేక ఏళ్లుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. విగ్రహం ఎదురుగా బార్‌షాపు ఎలా అనుమతిస్తారంటూ అనేకసార్లు స్థానికులు ఆందోళనకు సైతం దిగారు. అయితే రాజకీయ అండదండలు ఉన్న సదరు బార్‌షాపు యాజమాన్యం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు తీశారో ఏమో తెలియదుగానీ గాంధీ విగ్రహాన్ని తొలగించేశారు. రెండు మూడు రోజులుగా గాంధీ విగ్రహం మాయమవడంపై స్థానికులు గందరగోళానికి గురై ఆరా తీయగా నగరపాలక సంస్థ అధికారులే దాన్ని తొలగించినట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. అదేమని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు ఆదే శాలను అనుసరించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే గాంధీ విగ్రహాన్ని తొలగించామని చెబుతుండడం గమనార్హం. మార్చి నెల 24వ తేదీన గాంధీ విగ్రహంతో పాటు నగరంలో మరో 20 విగ్రహాల వరకూ తొలగించామని వారు చెబుతున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా మారిందనే నెపంతో బార్ షాపు యజమానులతో కుమ్మక్కై ఎవ్వరికీ చెప్పకుండా తొలగించడంపై స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. గాంధీ విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం స్పందించి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ విషయంపై నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. -
కృష్ణా తీరంలో ఇసుక తుపాను
ప్రభుత్వ విధానాల ఫలితం మూడో రోజుకు చేరిన లారీ ఓనర్ల సమ్మె నిలిచిపోయిన ఇసుక తవ్వకాలు నేడు మళ్లీ అధికారులతో చర్చలు విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానంతో కృష్ణాతీరంలో తుఫాన్ చెలరేగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇసుక రవాణా సమస్య తలెత్తడంతో లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. ఇసుక అమ్మకాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విది విధానాలపై లారీ యజమానుల్లో తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతోంది. ఇసుక క్వారీలను డ్వాక్రా సంఘాలకు, మీసేవల ద్వారా ఇసుక కొనుగోళ్లు చేసే విధంగా కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీంతో మీసేవలో చెల్లింపులు తీవ్ర ఆలస్యమవుతున్నాయని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ట్రాన్స్పోర్టర్లు మూడు రోజులుగా నిరవధిక సమ్మెకు దిగిన విషయం విదితమే. దీంతో రెండు జిల్లాల్లో దాదాపు 10 క్వారీల్లో ఇసుక రవాణా స్తంభించిపోయింది. కృష్ణా జిల్లా, జాయింట్ కలెక్టర్ బుధవారం రెండు జిల్లాల లారీ యజమానులతో చర్చలు జరిపారు. గురువారం గుంటూరు జాయింట్ కలెక్టర్ చలు జరిపారు. శుక్రవారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో కృష్ణా జిల్లా యంత్రాంగం మరో ధపా చర్చలు జరపనుంది. 10కిలో మీటర్ల దూరానికి లారీకి రూ. 800 చొప్పున కిరాయి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లారీ యజమానులు రూ.1500 కిరాయి డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుని నుంచి నేరుగా తాము కిరాయి తీసుకునే వెసులుబాటు కల్పించాలని లారీ యజమానులు కోరుతున్నారు. అలా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో ఫెర్రి, సూరాయిపాలెం, గుంటుపల్లిలో, గుంటూరు జిల్లాలో తెనాలి, పొన్నూరులో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నడుపుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు రెండు వేల లారీలు ఐదు లారీ అసోసియేషన్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నాయి. నెల రోజులుగా ఇసుక అమ్మకాలు సాగుతుండగా తోలిన కిరాయి డబ్బులు రాకపోవడం తదితర సమస్యలను లారీ యజమానులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాల్లో లారీ యజమానులు సంఘటితమై పోరాటం చేస్తున్నారు. కాగా లారీ యజమానుల సమస్య కొలిక్కి వచ్చేటట్లు కనపడడం లేదు. ప్రభుత్వ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇసుక కొరత ... కాగా లారీ యజమానుల సమ్మెతో జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక దొరకడం లేదని బిల్డర్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో ఇసుక లేక పనులు నిలిచిపోయాయి. రాజ మండ్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఇసుకను అధిక రేటుకు విక్రయిస్తున్నారు. 10టైర్ల లారీకి రూ. 27వేలు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా లారీలు నిలిచిపోవడంతో కృష్ణానది ప్రాంతంలో రాత్రిపూట దొంగతనంగా ట్రాక్టర్లతో ఇసుకను దళారులు తోడేస్తున్నారు. కొందరు సంచుల్లో తరలించి అధిక రేట్లు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
ఖాళీ చేయండి!
ప్రైవేట్ బిల్డింగ్‌లలోని ప్రభుత్వ కార్యాలయాలకు యజమానుల నోటీసులు ఎక్కువ అద్దెలు చెల్లిస్తున్న ప్రైవేట్ సంస్థలు దిక్కుతోచని స్థితిలో అధికారులు విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌కు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన ప్రభుత్వం ఒకవైపు అన్ని శాఖల కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇక్కడ ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించే పనిలో యజమానులు నిమగ్నమయ్యారు. ఉన్నవాటినే ఎక్కడ పెట్టాలో తెలియడం లేదని, ఇక కొత్త కార్యాలయాల సంగతి సరేసరి అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా రాజధాని ఉంటుందని దాదాపు ఖరారు కావడంతో ఎక్కువ అద్దెలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలకు తమ భవనాలను లీజుకు ఇచ్చేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ అద్దెలు చెల్లించే ప్రభుత్వ కార్యాలయాలను ఆరు నెలల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో విజయవాడతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. విభజన తర్వాత డిమాండ్ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో అద్దెలకు ఇచ్చే ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో సగటున అద్దెకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు అడుగుల చొప్పున అద్దెలు చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు విజయవాడలో చదరపు అడుగుకు రూ.7 అద్దె చెల్లిస్తున్నారు. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో రూ.5 నుంచి రూ.7 వరకు చెల్లిస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలు మాత్రం రూ.30 నుంచి రూ.50 వరకు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల అద్దెను కూడా చదరపు అడుగుకు రూ.30కి పెంచాలని భవన యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.7కు మించి చెల్లించే పరిస్థితి లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని పలు కార్యాలయాలకు నోటీసులు కూడా అందాయి. గురునానక్ కాలనీలో ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కార్యాలయం, డీఆర్ కార్యాలయాలకు ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. అద్దె భవనాల్లోనే 52 శాఖల కార్యాలయాలు! నగరంలో 52 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 నుంచి 600 వరకు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సబ్-రిజిస్ట్రార్, వాణిజ్య పన్నుల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, దేవాదాయ శాఖ కార్యాలయాలు, రెవెన్యూ, ఇరిగేషన్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖలకు సంబంధించిన కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కొన్ని కార్యాలయాలకు రూ.3లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ-1, 2వ డివిజన్ల కార్యాలయాలకు రూ.3లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ బెంజిసర్కిల్, సీతారామపురం, కృష్ణలంక, భవానీపురం కార్యాలయాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె ఇస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాలు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, నందిగామలలో కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనాలు రాజకీయ నాయకులవే కావడంతో ఖాళీ చేయించేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అద్దె భవనాల కోసం తిరుగుతున్న అధికారులు తమ కార్యాలయాలకు భవనాల కోసం విజయవాడతోపాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో అధికారులు వెదుకులాట ప్రారంభించారు. హాస్టళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాస్త పెద్ద ఇళ్లు, భవనాలు కనిపిస్తే అద్దెకు ఇస్తారా.. అంటూ ఆరా తీస్తున్నారు. అయితే యజమానులు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చేందుకు ముందుకురావటం లేదు. -
కిరాయిదారులకు సర్వే కష్టాలు
వివరాలు ఇవ్వొదంటూ అడ్డుకున్న యజమానులు పలు చోట్ల ఇళ్లను ఖాళీ చేయించిన వైనం సాక్షి,సిటీబ్యూరో: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కుటుంబ సర్వే చుక్కలు చూపించింది. తమ ఇంటి చిరునామా పైన వివరాలు ఇవ్వరాదంటూ కొందరు ఇంటి యజమానులు అడ్డుకొన్నారు. మరి కొన్ని చోట్ల సర్వే అయిపోయే వరకు ఇళ్లల్లో ఉండొద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో మంగళవారం చేట్టిన సమగ్ర సర్వేలో సొంత ఇళ్లు లేని కుటుంబాలుగా గుర్తింపు పొందాలనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. నగరంలోని రసూల్‌పురా, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. బన్సీలాల్‌పేట్ చాచా నెహ్రూనగర్‌లో ఒక ఇంటి యజమాని తన ఇంట్లో కిరాయికి ఉండే నాలుగు కుటుంబాలకు ఇలాగే బయటకు పంపినట్లు సమాచారం. సర్వేలో తమకు ఎక్కువ ఆస్తి ఉన్నట్లుగా నమోదు కావద్దనే ఉద్దేశంతో కి రాయికి ఉన్నవాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరి కొన్ని చోట్ల సర్వే సందర్భంగా ఇంటి నెంబర్, కరెంట్ మీటర్ నెంబర్లు సర్వేలో చెప్పొద్దంటూ అడ్డుకున్నారు. చందానగర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ఇంటి యజమానులు, కిరాయిదారుల మధ్య వాగ్వాదం నెలకొంది. సర్వేలో తాము ఆయా నివాసాల్లో లేమని తేలితే తమ ఇంటిపై హక్కును కోల్పోతామని ఆందోళన చెందారు. ఇంటిని కిరాయికి ఇచ్చిన వారినిపేర్లు చెప్పొద్దని తమ పేర్లే రాయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 2,3 వార్డుల్లో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కాగా, 2వవార్డులో కొంత మంది ఇంటి యజమానులు తమ ఇళ్లల్లో కిరాయికి ఉంటున్న వారి వివరాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. మరికొందరు ఎన్యుమరేటర్లు ఇళ్లలోకి రాకుండా బయటినుంచే పంపించేశారు. కొన్ని బస్తీల్లో అనుబంధ ఎన్యుమరేటర్లు తమకు పది ఇళ్లను మాత్రమే కేటాయించారని.. మరికొందరు స్టిక్కరింగ్ చేయని ఇళ్లను సర్వే చేసేది లేదని తేల్చేశారు. 2వ వార్డు పరిధిలోని కృష్ణనగర్, ఇందిరమ్మ నగర్, అర్జున్ నగర్ బస్తీల్లోని కొందరు ఇంటి యజమానులుతమ ఇళ్లల్లో కిరాయిదారుల వివరాలు ఇవ్వరాదని, తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. -
సమైక్య సెగతో నిలిచిన లారీలు
చీరాల రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన తథ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే చీరాలలోని లారీల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కారంచేడు రోడ్డులోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద లారీలను పది రోజుల నుంచి స్తంభింపజేశారు. దీంతో లారీల యజమానులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు తిరగకపోవడంతో వాటి యజమానులు డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు చెల్లించలేక, ఫైనాన్స్ సంస్థలకు కిస్తీలు కట్టలేకపోతున్నారు. చీరాలలో 400 పైగా లారీలున్నాయి. దాదాపు 1500 మంది కార్మికులు వీటిపై ఆధారపడి ఉన్నారు. తగ్గిపోనున్న రాష్ట్ర పరిధి... రాష్ర్ట విభజన తథ్యమైతే రాష్ట్రం సరిహద్దులు తగ్గిపోతాయి. గతంలో రాష్ట్ర సరిహద్దులు దాటాలంటే ఒక్కో లారీ చీరాల నుంచి 700 నుంచి 800 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ విభజిస్తే 100 కిలోమీటర్ల లోపులోనే రాష్ట్రం సరిహ ద్దులుగా నిర్ణయిస్తారు. దీంతో లారీ యజమానులపై పన్నులు, ఇన్సూరెన్స్ కిస్తీలు మూడు రెట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం చీరాల నుంచి లారీలు రాష్ట్ర సరిహ ద్దులు దాటితే ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 5,700 ప్రభుత్వానికి పన్నులు చెల్లిం చాల్సి ఉంటుంది. కానీ విభజన జరిగితే మాత్రం 100 కిలోమీటర్లు దాటితే ఆ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాక గతంలో ఇన్సూరెన్స్‌ల రూపంలో ఏడాదికి ప్రభుత్వానికి రూ. 7 వేలు చెల్లిస్తుండగా ప్రస్తుతం ఇన్సూరెన్స్ రుసుం రూ.17 వేలపైగా చెల్లిస్తున్నారు. దీంతో లారీల యజమానులు ఎప్పుడేం జరుగుతుందేమోన ని వణికిపోతున్నారు. కొందరు కిస్తీలు కట్టలేక, నిర్వహణ భారమై లారీలను అమ్మేస్తున్నారు. లారీలను తిప్పడం కష్టమే ఎన్. శ్రీనివాసరావు, లారీ యజమాని రాష్ర్ట విభజన జరిగితే లారీలను తిప్పడం కష్టమవుతుంది. గతంలో 800 కిలోమీటర్లు దాటి తే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాము. విభజన జరిగితే మాత్రం 100 కిలోమీటర్లు పరిధిలోనే అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పెరిగిన డీజిల్ ధరలతో అల్లాడిపోతుంటే విభజనచిచ్చు పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని విరమించుకోవాలి. ఉపాధి కోల్పోయాం సయ్యద్ నాగూర్, లారీ డ్రైవర్. లారీలు పదిరోజులుగా తిరగకపోవడంతో ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఇదే విధంగా మరో పదిరోజులు లారీలు తిరగక పోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. 12వ తేదీ నుంచి సమైక్య ఉద్యమాన్ని లారీల యజమానులు తీవ్రతరం చేయనున్నారు.