![బకాయి @19 కోట్లు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51440630229_625x300.jpg.webp?itok=aBMAeWJr)
బకాయి @19 కోట్లు
- నామమాత్రంగా వాహన పన్ను వసూళ్లు
- మొక్కుబడిగా దాడులు.. దృష్టి పెట్టని రవాణాశాఖ
ఖమ్మం క్రైం: వాహన పన్ను చెల్లించని యజమానులపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని కూడా సూచించింది. కానీ జిల్లా ఆర్టీఏ అధికారులకు మాత్రం ఇదేది పట్టడం లేదు. ఇప్పటి వరకు సరైన దృష్టి పెట్టడం లేదు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం పన్ను చెల్లించాల్సిన వాహన యూజమానులు 11వేల మంది ఉండగా రూ.19 కోట్ల ఆదాయం వసూలు కావాల్సి ఉంది.
వీటిలో నిరుపయోగంగా ఉన్న వాహనాలు ఎన్ని, కండీషన్‌లో వున్న వాహనాలు ఎన్ని తమకు ఓ నివేదికను అందజేయాలని కూడా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు జిల్లా రవాణాశాఖ సిబ్బంది దీనిపై ఎటువంటి నివేదికనూ తయూరు చేయలే దు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రోడ్డు రవాణశాఖ జారుుంట్ కమిషనర్ పాండురంగారావు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ట్యాక్స్ పేమెంట్‌పై గురువారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.
మొక్కుబడిగా..
ఇటీవల జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఆర్టీవో ఆధ్వర్యంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పన్నులు వసూలు కాని ప్రాంతాల్లో అదనపు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ సిబ్బంది సహకారం కూడా తీసుకోవాలని నిర్ణరుుంచారు. కనీసం వాహన యజమానులకు నోటీసులు సైతం జారీ చేయకపోవడంతో పన్నులు చెల్లింపునకు ఎవరూ ముందుకు రావడం లేదు. సెప్టెంబర్ 30 నాటికి వాహన పన్ను స్వచ్ఛందంగా చెల్లిస్తే జరిమానా నుంచి బయటపడవచ్చని రాష్ట్ర రవాణశాఖ సూచించింది.
ఒకవేళ పన్ను చెల్లించకుండా తనిఖీ సమయంలో పట్టుబడితే 200 శాతం అదనపు జరిమానా విధించాలని కూడా నిర్ణరుుంచింది. జిల్లా వ్యాప్తంగా పన్ను చెల్లించాల్సిన 11వేల వాహనాలను గుర్తించగా వాటిలో ఈనెల 17 నుంచి ఇప్పటి వరకు 510 మంది వాహన యజమానులు మాత్రమే పన్ను చెల్లించారు. అయినా ఆర్టీవో సిబ్బంది మేల్కోవడం లేదు.
స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం
సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా పన్నుల వసూళ్లపై స్పెషల్‌డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. పన్ను చెల్లించని వాహ నాలు 11వేలు ఉన్నట్లు గుర్తించాం. వాటిలో ఎన్ని వాహనాలు కండీషన్లో ఉన్నాయో తెలియడం లేదు. దీని మీద నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. కండీషన్ లేని వాహనాల యజమానులు ఆర్టీవో కార్యాలయానికి తెలియజేయూలి.
- మోమిన్, ఆర్టీవో